
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. వేగంగా దూసుకొచ్చిన 22 చక్రాల భారీ కంటైనర్ ట్రక్.. కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే కారును మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో ట్రక్ మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన మీరట్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ప్రమాద ఘటనను కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కారును ట్రక్ ముందు భాగంతో ఈడ్చుకెళ్లిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే అదృష్టం బాగుండి కారులో కూర్చున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో ఎవరికి కూడా తీవ్రమైన గాయాలేవి అవ్వలేదు. కారును టక్కు లాక్కెళ్తుండటం చూసి రోడ్డుమీదున్న జనాలు, వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వాహనం ఆపమని ఆరిచినా పట్టించుకోకుండా ట్రక్ డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు.
దీంతో స్థానికులు వెంటనే సమాచారంనిచ్చారు. పోలీసులకు రంగంలోకి దిగిన పోలీసులు ట్రక్‌ను వెంబడించి అడ్డగించే వరకు కంటైనర్‌ను ఆపలేదు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారులో ఉన్నవారికి, ట్రక్కు డ్రైవర్‌కు మధ్య జరిగిన ఓ వాగ్వాదంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చదవండి: ఈ పెళ్లికొడుకు చాలా రిచ్.. బంధువుల కోసం విమానం బుక్ చేశాడు..
That's #Meerut neighbour of #Ghaziabad.
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) February 13, 2023
Real life action in #UttarPradeshpic.twitter.com/xxazsrOREV