Goats Theft From Running Train In Maharashtra: Viral Video - Sakshi
Sakshi News home page

Viral Video: నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్.. ధూమ్ సినిమాను తలపించిన దొంగతనం

Published Tue, May 2 2023 3:42 PM | Last Updated on Tue, May 2 2023 4:10 PM

Goats Theft From Running Train Maharashtra Viral Video - Sakshi

ముంబై: మహారాష్ట్రలో సినీ ఫక్కిలో చోరీ జరిగింది. ధూమ్ సినిమాను తలపించేలా ఓ దొంగ నడుస్తున్న ట్రక్కు నుంచి మేకలను దొంగిలించాడు. స్పీడుగా వెళ్తున్న లోడు నుంచి చాలా మేకలను రోడ్డుపై పడేస్తూ వెళ్లాడు. ఆ తర్వాత ఓ కారు వచ్చింది. ట్రక్కు వెనకాలే దాని వేగంతో మ్యాచ్ అవుతూ ముందుకు సాగింది. దీంతో ట్రక్కుపై నుంచి దొంగ ఎంచక్కా కారుపైకి దిగాడు. ఆ తర్వాత బిందాస్‌గా ఎస్కేప్ అయ్యాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మొదట  ఈ చోరీ ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో జరిగిందని ప్రచారం జరిగింది. దీంతో ఉన్నావ్ పోలీసులు వీడియో పరిశీలించారు. అయితే  ఘటన జరిగిన ప్రదేశం ఉన్నావ్ కాదని, మహారాష్ట్రలోని ఇగత్‌పురి-ఘోతి హైవే అని వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ వీడియోను చూసిన పులువురు నెటిజన్లు దొంగ సాహసాన్ని చూసి షాక్ అయ్యారు. అచ్చం సినిమాలో చూసినట్లుగా చోరీ ఉందని, నడుస్తున్న ట్రక్కునుంచి కారుపైకి ఎలా దిగాడని అంటున్నారు. బహుశా ధూమ్‌ సినిమాను చూసి ఇన్‌స్పైర్ అయి ఉంటాడని జోకులు పేల్చారు.
చదవండి: బైక్‌ల చోరీకి పాల్పడుతున్న యువకుల అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement