అరే ఏం యాక్ట్‌ చేశాయి మేకలు...అందర్నీ బకరాలు చేశాయిగా! | Viral Video: Goats See Truck Arriving And Passing By Them All Fall Over | Sakshi
Sakshi News home page

Viral Video: అరే ఏం యాక్ట్‌ చేశాయి మేకలు....అందర్నీ బకరాలు చేశాయిగా!

Published Mon, Oct 24 2022 5:55 PM | Last Updated on Mon, Oct 24 2022 6:30 PM

Viral Video: Goats See Truck Arriving And Passing By Them All Fall Over - Sakshi

ఇంతవరకు ఎన్నో వైరల్‌ వీడియోలు చూసి ఉంటాం. కానీ ఈ వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉండే వైరల్‌ వీడియో. అందరికీ మేకలు ఎలా ఉంటాయో తెలుసు. ఐతే ఈ వీడియోలో కొన్ని మేకలు చాల మాత్రం భలే చేశాయి. అవన్న ఒక చోట గడ్డి మేస్తు ఉన్నాయి. ఇంతలో అటుగా ఒక పార్సిల్‌ ట్రక్కు వస్తుంది. ఆ తర్వాత ఉన్నటుండి మేకలన్ని కింద పడిపోతాయి.

వాస్తవానికి ఆ ట్రక్కు వాటి పక్క నుంచి వెళ్తుందే తప్ప వాటిని ఢీ కొట్టలేదు. ఈ మేకలు మాత్రం ఆ ట్రక్కు రావడమే తరువాయి ఒకేసారి అన్ని మేకలు చనిపోయినట్టుగా కింద పడిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లు ఆ మేకలు చూసి ఫిదా అవుతూ... పొట్ట చెక్కలయ్యేలా నవ్వే సన్నివేశం అంటూ కామెంట్‌ చేస్తూ ట్వీట్‌ చేస్తున్నారు.

(చదవండి: బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా.. )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement