pretending
-
ఉత్తుత్తి ఉద్యోగాలు.. ఇప్పుడిదే నయా ట్రెండ్!
‘‘ఉద్యోగాలిప్పిస్తామని యువతకు కుచ్చుటోపీ.. ఉద్యోగాల పేరిట టోకరా..!’’ ఈ తరహా కథనాలు చూసి చూసి బోర్ కొడుతోందా? అయితే జస్ట్ ఫర్ ఏ ఛేంజ్.. ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి సొంతవాళ్లను, బంధువులను, చివరకు తనను తానే మోసం చేసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా?. కానీ, ఇప్పుడది నయా ట్రెండ్‌గా అక్కడ ఓ ఊపు ఊపేస్తోంది.సాధారణంగా.. ఎక్కడో సిటీలోనో, టౌన్లోనో ఉంటూ ఉద్యోగాల వేట పేరిట తల్లిదండ్రుల నుంచి డబ్బులు పిండుకునే జాతిరత్నాల గురించి వినే ఉంటారు. అయితే.. నిజంగానే ఉద్యోగాల వేటలో అలసిపోయిన నిరుద్యోగుల కోసం పుట్టుకొచ్చిందే ఈ Pretend To Work ట్రెండ్. అంటే.. పని చేస్తున్నట్లు నటించడమన్నమాట. ఈ జాబ్‌తో జేబులు గుళ్ల కావడం తప్పించి ఎలాంటి ప్రయోజనం ఉండదు!!.ఈ జాబ్ కావాలంటే చేయాల్సిందల్లా.. రోజుకు ఫలానా డబ్బును మీ ఆ సర్వీస్ వాళ్లకు అందించాలి. అప్పుడు వాళ్లు మీకు ఆఫీస్ స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి అందులో మీకు కుర్చీ, టేబుల్, కంప్యూటర్ లాంటివివేసి ఉద్యోగి అనే గుర్తింపు ఇస్తారు. అంతేకాదు.. ఆ పనివేళలో మధ్యలో భోజనం, కాఫీ టిఫిన్లు, స్నాక్స్, జ్యూస్‌ల వగైరా లాంటివి కూడా అందిస్తారు. మీరు చెల్లించే డబ్బును బట్టి మీ పొజిషన్, ఇతర సేవలు అందిస్తారు. ఒకవేళ ఎక్కువ చెల్లిస్తే ఏకంగా ఆ కంపెనీకి బాస్(Boss) పొజిషన్లోనే కూర్చోబెడతారు. అలాగని మీకు అక్కడ పని అప్పజెప్తారనుకుంటే పొరపాటే!. ఇవి కేవలం ఉత్తుత్తి ఉద్యోగాలు మాత్రమే!!. కేవలం మీలోని నిరుద్యోగి(Jobless)ని అనే భావనను దూరం చేయడానికి మాత్రమే వాళ్లు ఈ సేవల్ని అందిస్తోంది. అంటే.. మీరు మీ మీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఎప్పటిలాగే మునిగిపోవచ్చన్నమాట. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుందో.. అప్పుడు అక్కడికి వెళ్లి వాళ్లు అడిగినంత చెల్లిస్తే సరిపోతుంది. ఆశ్చర్యం కలిగించినా ఇది ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్. చైనా(China)లో ఈ తరహా సేవల గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. పైగా ఈ సర్వీసును అందించేందుకు పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి కూడా!.‘‘మా ఆఫీస్‌కు విచ్చేయండి. మీరూ ఉద్యోగిగా మారిపోండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఇక్కడే గడపండి. మీకు భోజన, ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తాం. రోజూవారీగా.. అతితక్కువ ధరకే మీకు ఈ సేవల్ని అందిస్తాం’’ అనే ప్రకటనలు హెబెయి ప్రావిన్స్‌లో ఎటు చూసినా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు, యువత ఈ తరహా సేవల కోసం ఎగబడిపోతున్నారు. ఈ తరహా సేవలు కొనసాగుతున్న మాట వాస్తవమేనంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కూడా ఓ కథనంలో పేర్కొంది.చైనాలో ఈ తరహా సర్వీసుల ప్రారంభ ధర 30 యువాన్లు(4 డాలర్లు.. మన కరెన్సీలో రూ.353)గా ఉంది. వాళ్లు అందించే సౌకర్యాలను బట్టి ఆ రేటు పెరుగుతూ పోతోందన్నమాట.ఈ క్రేజ్ గుర్తించిన కాఫీ షాపులు, లైబ్రరీలు కూడా ఈ తరహా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు సైతం వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించుకుంటూ పోతున్నాయి. దీంతో.. చిన్న కంపెనీలు కొత్త రిక్రూట్లకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో నిరుద్యోగుల శాతం పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఊడిపోవడం.. జాబ్‌లెస్‌గా ఉండిపోవడంతో తీవ్ర ఒత్తిడి, మానసికంగా కుంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. కాస్త డబ్బు ఉన్న వాళ్లకు ఊరట కలిగించేందుకే ఈ సేవలు పుట్టుకొచ్చాయి. అయితే..ఈ Pretend To Workపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. దీనివల్ల మోసాలు పెరిగిపోవచ్చని పలువురు అంటున్నారు. అయితే ఖాళీగా రోడ్ల వెంట తిరగడం, ఉద్యోగాల కోసం తిరిగి అలసిపోవడం, ఉద్యోగం దొరక్క ఇంటికి ఆలస్యంగా వెళ్లడం.. ఇలాంటి వాటికంటే ఈ ఉత్తుత్తి ఉద్యోగాలు చేసుకోవడం నయం అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సేవల ఉద్దేశం ఏదైనా.. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది అక్కడ.ఇదీ చదవండి: అత్యంత అరుదు.. అందుకే రూ.5కోట్లు పలికింది!! -
అరే ఏం యాక్ట్ చేశాయి మేకలు...అందర్నీ బకరాలు చేశాయిగా!
ఇంతవరకు ఎన్నో వైరల్ వీడియోలు చూసి ఉంటాం. కానీ ఈ వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉండే వైరల్ వీడియో. అందరికీ మేకలు ఎలా ఉంటాయో తెలుసు. ఐతే ఈ వీడియోలో కొన్ని మేకలు చాల మాత్రం భలే చేశాయి. అవన్న ఒక చోట గడ్డి మేస్తు ఉన్నాయి. ఇంతలో అటుగా ఒక పార్సిల్ ట్రక్కు వస్తుంది. ఆ తర్వాత ఉన్నటుండి మేకలన్ని కింద పడిపోతాయి. వాస్తవానికి ఆ ట్రక్కు వాటి పక్క నుంచి వెళ్తుందే తప్ప వాటిని ఢీ కొట్టలేదు. ఈ మేకలు మాత్రం ఆ ట్రక్కు రావడమే తరువాయి ఒకేసారి అన్ని మేకలు చనిపోయినట్టుగా కింద పడిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. నెటిజన్లు ఆ మేకలు చూసి ఫిదా అవుతూ... పొట్ట చెక్కలయ్యేలా నవ్వే సన్నివేశం అంటూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. Fainting Goats Meet UPS Truck 😆🐐🚚#viralhog #faintinggoats #pets #humor pic.twitter.com/cxqLWZZKjx — ViralHog (@ViralHog) October 19, 2022 (చదవండి: బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా.. ) -
అయ్! బాబోయ్!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా!
మన స్నేహితులు లేక మన బంధువులో మనల్ని భయపెట్టేలే చేసే పనులు ఒక్కోసారి మనల్ని చాలా భయభ్రాంతులకు గురిచేస్తాయి. పైగా ఆ సంఘటన నుంచి మనకు తేరుకోవడానికి కూడా చాలా టైమ్ పడుతుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన స్నేహితుడినిఅచ్చం బొమ్మలా ప్రాంక్ చేసి భయాందోళనకు గురిచేశాడు. (చదవండి: జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...) అసలు విషయంలోకెళ్లితే...పాల్కీన్ అనే వ్యక్తి తన స్నేహితుడు పాల్ వుడ్‌ని ఆటపట్టించాలనే ఉద్దేశంతో బొమ్మ మాదిరిగా దుస్తులు ధరించి ఒక గదిలో మూలన ఉన్న బొమ్మల మధ్య దాక్కొని ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి అతని స్నేహితుడు పాల్వుడ్ ఆ గదిలోకి వచ్చి మూలన పడి ఉన్న బొమ్మను తరలించే నిమిత్తం ఒక్కో బొమ్మను ఎత్తకుంటాడు. అంతే పాల్వుడ్ క్లీన్‌ని తాకిన వెంటనే వుడ్‌ని భయపెట్టేలా క్లీన్ లేచి నుంచుంటాడు. దీంతో వుడ్ ఒక్కసారిగా భయపడి కింద పడిపోతాడు. పైగా తాను చాలాసేపు ఇలా పడుకుని ఉన్నానంటూ క్లీన్ చెప్పుకొస్తాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో గత ఏప్రిల్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ తాజాగా ఆ వీడియో మళ్లీ నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీంతో నెటిజన్లు ‘ఆ వ్యక్తికి గుండె ఆగినంత పనైంది కదరా! తమాషాలకు కూడా అద్దూ అదుపు ఉండాలి. నీ ప్రాంక్ తగలెయ్య’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో దోస్తాన్లో ఇవన్నీ కామన్ అని కొట్టిపడేస్తున్నారు. వీడియో చూసి ఎంజాయ్ చేశామని అంటున్నారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) View this post on Instagram A post shared by YouTube (@youtube) -
పోలీసుల అదుపులో ‘మెరుగు’ దొంగలు
చండ్రుగొండ/జూలూరుపాడు, న్యూస్‌లైన్: బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ము ఠాలో ఇద్దరు యువకులను సోమవారం చండ్రుగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జి ల్లాలో ఇటీవల కాలంలో ఈ తరహా చోరీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు యువకుల ను పోలీసులకు చిక్కారు. విశ్వసనీయ సమాచా రం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూలూరుపా డు మండలం గాంధీనగర్‌కు చెందిన దారావత్ లక్ష్మి ఇంటికి సోమవారం ఇద్దరు యువకులు వచ్చారు. బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామని వారు చెప్పడంతో ఆమె తన కాళ్లకు ఉన్న వెండి పట్టీలు ఇచ్చింది. మెరుగు పెట్టిన తర్వాత పట్టీలు తళతళా మెరుస్తుండడంతో ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును ఇ చ్చింది. అనంతరం లక్ష్మి కుమార్తెను అక్కడ ఉంచి బట్టలు ఉతికేందుకు వెళ్లింది. దీంతో ఆ యువకులు ఇంట్లోకి వెళ్లి ఒక పాత్ర తీసుకురావాలని లక్ష్మి కుమార్తెకు తెలిపారు. ఆమె ఇంట్లోకి వెళ్లిన క్రమంలో ఆ యువకులు గొలుసును మాయం చే శారు. అనంతరం ఒక చిన్న బాక్స్‌ను లక్ష్మి కుమా ర్తె చేతికి ఇచ్చిన వారు కొద్ది సేపటి తర్వాత మూత తీయాలని సూచించి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆ బాక్స్‌ను తెరిచి చూడగా అందులో గొలుసు లేదు. దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన లక్ష్మి లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇస్లావత్ వీరన్న స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై దేవేందర్‌రావు సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా మరింత సమాచారం లభించినట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారం మేరకు జిల్లాలో సంచరిస్తూ మెరుగు పేరిట బంగారం ఆభరణాలు దొంగలిస్తున్న ముఠా సభ్యుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి రాని తెలుగులో మాట్లాడుతున్నట్లు తెలిసింది. హిందీ భాషలో మాట్లాడుతున్న వారు ఇతర రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది.