అయ్‌! బాబోయ్‌!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా! | Viral Video Man Pretending To Mannequin To Scare His Friend In A Hilarious Prank | Sakshi
Sakshi News home page

Mannequin Prank Viral Video: అయ్‌! బాబోయ్‌!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా!

Published Tue, Nov 16 2021 1:52 PM | Last Updated on Tue, Nov 16 2021 3:07 PM

Viral Video Man Pretending To Mannequin To Scare His Friend In A Hilarious Prank - Sakshi

ఆ వ్యక్తికి గుండె ఆగినంత పనైంది కదరా! తమాషాలకు కూడా అద్దూ అదుపు ఉండాలి. నీ ప్రాంక్‌ తగలెయ్య

మన స్నేహితులు లేక మన బంధువులో మనల్ని భయపెట్టేలే చేసే పనులు ఒక్కోసారి మనల్ని చాలా భయభ్రాంతులకు గురిచేస్తాయి. పైగా ఆ సంఘటన నుంచి మనకు తేరుకోవడానికి కూడా చాలా టైమ్‌​ పడుతుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన స్నేహితుడినిఅచ్చం బొమ్మలా ప్రాంక్‌ చేసి భయాందోళనకు గురిచేశాడు.

(చదవండి: జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...)

అసలు విషయంలోకెళ్లితే...పాల్‌కీన్‌ అనే వ్యక్తి తన స్నేహితుడు పాల్‌ వుడ్‌ని ఆటపట్టించాలనే ఉద్దేశంతో బొమ్మ మాదిరిగా దుస్తులు ధరించి ఒక గదిలో మూలన ఉన్న బొమ్మల మధ్య దాక్కొని ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి అతని స్నేహితుడు పాల్‌వుడ్‌ ఆ గదిలోకి వచ్చి మూలన పడి ఉన్న బొమ్మను తరలించే నిమిత్తం ఒక్కో బొమ్మను ఎత్తకుంటాడు. అంతే పాల్‌వుడ్‌ క్లీన్‌ని తాకిన వెంటనే వుడ్‌ని భయపెట్టేలా క్లీన్‌ లేచి నుంచుంటాడు.

దీంతో వుడ్‌ ఒక్కసారిగా భయపడి కింద పడిపోతాడు. పైగా తాను చాలాసేపు ఇలా పడుకుని ఉన్నానంటూ క్లీన్‌ చెప్పుకొస్తాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో గత ఏప్రిల్‌లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినప్పటికీ తాజాగా ఆ వీడియో మళ్లీ నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీంతో నెటిజన్లు ‘ఆ వ్యక్తికి గుండె ఆగినంత పనైంది కదరా! తమాషాలకు కూడా అద్దూ అదుపు ఉండాలి. నీ ప్రాంక్‌ తగలెయ్య’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో దోస్తాన్‌లో ఇవన్నీ కామన్‌ అని కొట్టిపడేస్తున్నారు. వీడియో చూసి ఎంజాయ్‌ చేశామని అంటున్నారు.

(చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement