man die
-
మిస్టరీగా మారిన 'కాంగో జాతీయుడి లాకప్ డెత్!' ఆరోజు ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్–నాబ్), హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్, రాచకొండలకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్‌లతో (ఎస్ఓటీ) పాటు స్థానిక పోలీసులకు చిక్కిన ప్రతి నాలుగు డ్రగ్ ముఠాల్లో మూడింటి లింకులు బెంగళూరులో ఉంటున్నాయి. ఆ నగరం డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్లకు అడ్డాగా మారడానికి దాదాపు రెండున్నరేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఓ లాకప్ డెత్ కారణమైంది. దీనిని గమనించిన రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. ఒకప్పుడు గోవా.. ఇప్పుడు బెంగళూరు.. నగరంలో ఎక్కువగా లభించే మాదకద్రవ్యాల్లో గంజాయి సంబంధితమైన వాటి తర్వాతి స్థానంలో సింథటిక్ డ్రగ్స్ ఉంటున్నాయి. గంజాయి, చెరస్, హష్ ఆయిల్ తదితరాలు ఏజెన్సీ ప్రాంతాల నుంచి సిటీకి వస్తున్నాయి. కోకై న్, బ్రౌన్‌షుగర్, హెరాయిన్ తదితర సింథటిక్ డ్రగ్స్ మూలాలు మాత్రం విదేశాల్లో ఉంటున్నప్పటికీ ఇక్కడకు సరఫరా మాత్రం ఉత్తరాదితో పాటు బెంగళూరు నుంచి జరుగుతోంది. ఒకప్పుడు ఈ డ్రగ్ డాన్స్ అంతా గోవా కేంద్రంగా కథ నడిపే వారు. హైదరాబాద్ పోలీసులు వరుస దాడులు చేసి ఎడ్విన్, స్టీవ్ సహా బడా డ్రగ్ డాన్స్‌కు చెక్ చెప్పారు. దీంతో ఇక్కడి వారికి గోవా నుంచి డ్రగ్స్ సరఫరా దాదాపు ఆగిపోయింది. దీంతో బెంగళూరు కేంద్రంగా సరఫరా మొదలైంది. ఆ నగరమూ విదేశీయుల అడ్డా.. బెంగళూరుతో పాటు ఉత్తరాదిలోని అనేక నగరాల్లో తిష్ట వేసి, డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిలో నల్లజాతీయులే ఎక్కువగా ఉంటున్నారు. స్టడీ, బిజినెస్, విజిట్ సహా వివిధ రకాలైన వీసాలపై వస్తున్న నైజీరియా, సూడాన్, సోమాలియా, కాంగో జాతీయులు డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్స్‌గా మారుతున్నారు. ఇలాంటి వాళ్లు ఇతర నగరాలతో పాటు బెంగళూరులోనూ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. 2021 ప్రథమార్ధం వరకు ఆ నగరంలో నేరాలు చేస్తున్న, అక్రమంగా నివసిస్తున్న ఇలాంటి వారిపై ఉక్కుపాదం మొపేవారు. వీళ్ళు సాధారణంగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో నివసిస్తుంటారు. బెంగళూరులోని అలాంటి ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేసే అక్కడి పోలీసులు అక్రమంగా నివసిస్తున్న, దందాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఒక్క ఉదంతంలో అడ్డం తిరిగిన కథ.. ఆ నగరంలో 2021 ఆగస్టులో చోటు చేసుకున్న ఓ ఉదంతంతో కథ అడ్డం తిరిగింది. కాంగోకు చెందిన జోయల్ షిండానీ ములు (27) స్టడీ వీసాపై బెంగళూరుకు వచ్చాడు. డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా ముప్పతిప్పలు పెట్టిన ఇతడిని 2021 ఆగస్టులో జేసీ నగర్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో ఠాణాలోనే అతడు చనిపోయాడు. కార్డియాక్ అరెస్టు వల్ల మరణం సంభవించిందని పోలీసులు చెప్పగా, పోలీసులే కొట్టి చంపారని నల్లజాతీయులు ఆరోపించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆ ఠాణా వద్దకు చేరుకున్న నల్లజాతీయులు రాళ్లు రువ్వడంతో పాటు నిరసన చేపట్టారు. దాదాపు రెండు రోజుల పాటు ఈ ఘర్షణలు అక్కడి పోలీసులు ఉలిక్కిపడేలా చేశాయి. ఈ పరిణామం తర్వాత ఆ నగర అధికారులు నల్లజాతీయుల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు చేయి దాటుతుండటంతో.. దీనిని అలుసుగా చేసుకున్న అనేక మంది డ్రగ్ పెడ్లర్స్, సప్లయర్స్ బెంగళూరును అడ్డాగా మార్చుకున్నారు. ఇతర మెట్రోల్లో నివసించే నల్లజాతీయులు సైతం ఆ నగరానికి వచ్చివెళ్తూ డ్రగ్స్ దందా చేస్తున్నారు. కొన్ని రకాలైన డ్రగ్స్ విదేశాల నుంచి నేరుగా కర్ణాటకలోని వివిధ నగరాలకు వచ్చి బెంగళూరు చేరుతున్నాయి. అక్కడ నుంచే హైదరాబాద్ సహా వివిధ నగరాలకు సరఫరా అవుతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన కేసులను అధ్యయనం చేసిన అధికారులు ఈ విషయం గుర్తించారు. దీంతో అక్కడ ఉన్న డ్రగ్ పెడ్లర్స్‌కు చెక్ చెప్పడానికి, మాదకద్రవ్యాల దందాను కట్టడి చేయడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. అవసరమైతే దీనిపై కేంద్ర ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి సూత్రధారులను పట్టుకోవడానికి వెళ్లినా సరైన సహకారం లభించకపోవడాన్నీ ప్రస్తావించనున్నారు. ఇవి కూడా చదవండి: అగ్నిసాక్షిగా ఏడడుగులు.. అంతలోనే అంతర్వేది బీచ్‌లో విషాదం! -
పంది గుండె అమర్చిన మరో వ్యక్తి మృతి
పంది గుండెను అమర్చిన మరో వ్యక్తి మరణించాడు. లారెన్స్ ఫాసెట్(58) అనే వ్యక్తికి సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. దాదాపు 40 రోజుల తర్వాత గుండె వైఫల్యం చెందడంతో లారెన్స్ మృతి చెందారని మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ వైద్యులు తెలిపారు. గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన నెలరోజుల వరకు చక్కగా పనిచేసిందని వెల్లడించాడు. ఆ తర్వాత గుండె పనితీరు క్షీణించడం మొదలయ్యిందని పేర్కొన్నారు. 'గుండె మార్పిడి చేసిన తర్వాత లారెన్స్ ఆరోగ్యంగా గడిపారు. ఫిజికల్ థెరపీలో కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేశారు. భార్య యాన్‌తో కార్డ్స్ కూడా ఆడేవారు. కానీ ఇటీవల గుండె పనితీరులో వైఫల్యం కనిపించింది. మానవ అవయవాల మార్పిడి విధానంలో ఇది అతి క్లిష్టమైన పద్దతి. ఆరు వారాలపాటు ఆరోగ్యంగా గడిపారు. కానీ సోమవారం ప్రాణాలు కోల్పోయారు.' అని మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. లారెన్స్ నావీలో పనిచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో టెక్నీషియన్‌గా రిటైర్ట్ అయ్యారు. గుండె సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో హర్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. ఎట్టకేలకు గుండె మార్పిడి చేయగా ఇన్నాళ్లు బతికారని లారెన్స్ భార్య యాన్ తెలిపారు. జంతువుల అవయవాలను మానవులకు మార్పిడి చేసే పద్దతిని జెనోట్రాన్స్ప్లాంటేషన్ అని పిలుస్తారు. ఇది మానవ అవయవ దాతల కొరత సమస్యను తగ్గిస్తుంది. ఈ ప్రక్రియ సవాలుగా మారింది. రోగి రోగనిరోధక వ్యవస్థ మార్పిడి అవయవం పనితీరుకు సరిపోలడం క్లిష్టతరమైంది. పంది భాగాలను జన్యుపరంగా మార్పు చేయడం వల్ల మానవ అవయవాలలాగా పనిచేస్తాయని వైద్యులు భావించారు. ఇదీ చదవండి: హోటల్‌కు వచ్చిన మహిళకు చేదు అనుభవం -
అది ‘వితంతువుల గ్రామం’.. పురుషుల అకాల మృతికి కారణమిదే..!
మన దేశంలోని రాజస్థాన్‌లోగల ఒక గ్రామం ‘వితంతువుల గ్రామం’గా పేరొందింది. ఈ గ్రామానికి చెందిన మగవారు అకాలంగా మృత్యువాత పడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి వితంతువులు కుటుంబాన్ని పోషించేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. రోజుకు 10 గంటల పాటు బండరాళ్లను పగులగొట్టే పనులు చేస్తూ ఎంతోకొంత సంపాదిస్తుంటారు. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో.. రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలోని బుధ్‌పూర్ గ్రామంలో వితంతువులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ గ్రామంలో పురుషులు త్వరగా మృతి చెందడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రాంతంలోని గనులలో పనిచేస్తున్న పురుషులు సిలికోసిస్ అనే అత్యంత ప్రమాదకర వ్యాధి బారిన పడుతున్నారు. సరైన సమయంలో వారికి తగిన చికిత్స అందకపోవడంతో అకాల మరణానికి గురవుతున్నారు. చిన్నారుల బాల్యం బుగ్గిపాలు ఇంటికి పెద్దదిక్కు మరణించడంతో ఆ ఇంటిలోని మహిళలపై కుటుంబ పోషణభారం పడుతుంది. బాధిత కుటుంబాల్లోని పిల్లలు కూడా తల్లికి చేదోడువాదోడుగా ఉంటారు. ఫలితంగా వారి బాల్యం బుగ్గిపాలవుతున్నదనే వాదనలు వినిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో వ్యాధి బారినపడిన పురుషులకు ఆ విషయం 50 శాతం వ్యాధి ముదిరాక తెలుస్తోంది. దీంతో చికిత్స పూర్తిస్థాయిలో అందేలోగానే వారు కన్నుమూస్తున్నారు. ఇక్కడి గనుల్లో పనిచేసే కూలీలకు ఆయా గనుల యజమానులు తగిన రక్షణ పరికరాలు కూడా అందించడం లేదనే వాదన వినిపిస్తుంటుంది. కార్మికుడు ఎవరైనా చనిపోయినా బాధిత కుటుంబాన్ని యజమానులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: పిల్లల ఫేమస్ కోసం తల్లి తాపత్రయం.. ఊహకందని చేదు అనుభవం ఎదురయ్యేసరికి.. -
రూ.90 వేల కోసం సొంత మామనే హతమార్చి.. ఆ తర్వాత..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. రూ.90 వేల అప్పు తీర్చమని అడిగినందుకు సొంత మేనమామనే కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. స్థానికంగా జిల్లాలో వివేక్ శర్మ(45) వ్యాపారిగా స్థిరపడ్డాడు. ఈ క్రమంలో తన మేనల్లుడు మోహిత్‌కు అప్పుగా రూ.90 వేలను ఇచ్చాడు. డబ్బు చెల్లించమని అడిగినా ప్రయోజనం లేకపోవడంతో వివేక్ శర్మ నేరుగా మోహిత్ ఇంటికే వెళ్లాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని మోహిత్.. వివేక్‌ను హత్య చేయాలని పథకం పన్నాడు. టీలో మత్తు మందు ఇచ్చి, అపస్మారక స్థితికి వెళ్లాక.. వివేక్ శర్మ దేహాన్ని ముక్కలుగా కోశాడు. ఆనంతరం సంచుల్లో వేసి సమీపంలో ఉన్న ఓ ఆనకట్ట వద్ద పూడ్చి పెట్టాడు. వివేక్ శర్మ తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తాను హత్య చేయలేదని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు. శరీరభాగాలు పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. మృత దేహాన్ని వెలికితీశారు. శరీర భాగాలలోని చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా అది వివేక్దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం మృతుని శరీర భాగాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఇదీ చదవండి: టోల్ గేట్ ఉద్యోగినిపై దాడి.. జుట్టు పట్టి లాగి.. -
యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్
ఒక్కోసారి చిన్నచిన్న సరదాలే ప్రాణాలమీదకు తీసుకొస్తుంటాయి. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో స్నేహితులు చేసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. స్నేహితులు పెట్టిన షరతులకు మించి మూమూస్ తినడంతో ఆ యువకుడు అనారోగ్యం పాలయ్యాడని, అనంతరం ఊపిరి తీసుకోలేక ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుని తండ్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ తన కుమారునికి విషం ఇచ్చి చంపేశారని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోపాల్‌గంజ్‌లో కొందరు స్నేహితులు ఎంజాయ్ చేస్తూ, వారిలోవారు మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. దీనిలో పాల్గొన్న బిపిన్ కుమార్(25) ఛాలెంజ్‌కు మించి అధికంగా మూమూస్ తిన్నాడు. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. బిపిన్ పరిస్థితిని గమనించిన అతని స్నేహితులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బిపిన్ ఒక మొబైల్ రిపేరింగ్ దుకాణంలో పనిచేస్తుంటాడు. కుమారుని మృతి నేపధ్యంలో అతని తండ్రి మాట్లాడుతూ తన కుమారుని చేత విషం తినిపించారని, తన కుమారుడిని అతని స్నేహితులే హత్య చేశారని ఆరోపించారు. వారంతా ఉద్దేశపూర్వకంగానే ఈ ఛాలెంజ్ చేసి, తన కుమారుడని హత్యచేశారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే -
‘మోసం చేసింది.. నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..
హనుమకొండ జిల్లా: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో యువకుడు సాయి ఆత్మహత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సెల్పీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు మానసికంగా హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. యువతికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఆమె బర్త్ డే రోజున చనిపోతున్నానని సూసైడ్‌కు ముందు వీడియోలో తెలిపాడు. యువతి, ఆమె స్నేహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సెల్ఫీ వీడియో కలకలం సృష్టించడంతో తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్.. గుట్టుచప్పుడు కాకుండా.. -
Hyderabad: ప్రాణం తీసిన ‘రీల్స్’ పిచ్చి.. రైల్వే ట్రాక్‌పైకి వచ్చి..
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా సరదా యువకుడి ప్రాణం తీసింది. సనత్‌నగర్‌లో రైల్వే ట్రాక్‌పై ఇన్‌స్టా రీల్స్ రికార్డ్ చేస్తుండగా యువకుడిని వెనుక నుంచి ట్రైన్ ఢీకొట్టింది. మృతుడు మహ్మద్ సర్ఫరాజ్.. రహ్మత్ నగర్ శ్రీరామ్‌నగర్ చెందినవాడిగా గుర్తించారు. మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. సనత్ నగర్ రైల్వే లైన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్నిగాంధీ ఆసుపత్రి మార్చురీ తరలించారు. మృతుడి ఫోన్‌ను స్పాట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్నేహితులు సనత్ నగర్ రైల్వే ట్రాక్‌లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వెళ్లారు. రీల్స్ చేస్తుండగా వేగంగా వచ్చి రైలు ఢీకొనడంతో సర్ఫరాజ్ అనే విద్యార్థి మృతిచెందగా, మరో ఇరువురు విద్యార్థులు రైలు రాకను గమనించి అప్రమత్తంగా వ్యవహరించడంతో సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: 3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో.. -
షాకింగ్ ఘటన.. స్నేహితుడి భార్యను కాపాడబోయి..
నిడదవోలు రూరల్(తూర్పుగోదావరి జిల్లా): క్షణికావేశంలో కాలువలోకి దూకిన స్నేహితుడి భార్యను కాపాడబోయి ప్రమాదవశాత్తూ యువకుడు మృతిచెందినట్లు పట్టణ ఎస్సై పి.నాగరాజు గురువారం తెలిపారు. నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కాపకాయల నరేంద్రకుమార్ (31) గతంలో ఒక ప్రైవేట్ సెల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ప్రస్తుతం వ్యవసాయ పనులు చేస్తున్నాడు. నరేంద్రకుమార్ స్నేహితుడు కొవ్వూరుకు చెందిన జావిద్ బాషా(చోటు)కు అతని భార్య దేవికి మనస్పర్థలు వచ్చాయి. దీంతో నరేంద్రకుమార్ భార్యాభర్తలను ఈ నెల 14వ తేదీన శెట్టిపేట తీసుకువచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా గొడవలు పెరగడంతో భార్య దేవి.. శెట్టిపేట పవర్‌ప్లాంట్ వద్ద బుధవారం తెల్లవారుజామున వంతెనపై నుంచి కాలువలోకి దూకేసింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో కాలువలోకి దిగిన నరేంద్రకుమార్ ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా నరేంద్రకుమార్ మృతదేహం లభ్యమైంది. మృతుడి తల్లి నాగతులసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: వివాహితతో సహజీవనం.. అసలు విషయం తెలిసి షాకయిన మహిళ -
రెండురోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగింది?
రాజమహేంద్రవరం రూరల్(తూర్పుగోదావరి): రెండురోజుల్లో పెళ్లి... మూడుముళ్ల బంధంతో ఒక్కటై.. సంతోషంగా గడపాల్సిన సమయం..ఇంతలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బొమ్మూరులోని బాలాజీపేట రోడ్లో శ్రీ అపార్టుమెంటులో గురువారం ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథ«నం ప్రకారం శ్రీ అపార్ట్మెంటులో ఉంటున్న బొరుసు మంగాదేవికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలకు వివాహాలయ్యాయి. నాలుగో సంతానం రాజీవ్‌బాబు(32).దానవాయిపేట యాక్సెస్ బ్యాంక్‌లో ఐటి విభాగం మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతితో ఈనెల 4వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10గంటలకు మంగాదేవి, కుమార్తెలు కలసి షాపింగుకు వెళ్లారు. రాజీవ్‌ను రమ్మని కోరారు. ఇంటిలో టీవీ రిపేరు చేయించి వస్తానని అతడు సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో వారు తిరిగి ఇంటికి చేరుకున్నారు. మెయిన్ డోర్ తెరిచి ఉంది. బెడ్రూమ్ డోర్ వేసి ఉంది. రాజీవ్ పడుకుని ఉన్నాడని భావించారు. తమ పనిలో పడిపోయారు. కాస్సేపటి తర్వాత రాజీవ్‌ను నిద్రలేపుదామని కిటికీలో నుంచి చూశారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. శోకసముద్రంలో మునిగిపోయారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై శివాజీ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజీవ్ నిశ్చితార్ధమైనప్పటి నుంచి కాబోయే భార్యతో సరదాగా మాట్లాడేవాడు. పరస్పరం గిఫ్ట్‌లు ఇచ్చుకునేవారిని కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మహత్యాయత్నం.. 15 నిమిషాల్లోనే -
కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం
-
బతికుండగానే కారులో వ్యక్తి సజీవ దహనం.. ఏం జరిగింది?
సాక్షి, మెదక్ జిల్లా: అప్పటి వరకు బంధువులతో మాట్లాడిన వ్యక్తి.. అంతలోనే మృత్యుఒడికి చేరుకున్నాడు. అక్కా వస్తున్నా అని చెప్పిన తమ్ముడి రాక కోసం రాత్రంతా ఎదురుచూసి తెల్ల వారగానే అతని మరణ వార్త తెలియడంతో ఆమె తల్లడిల్లిపోయింది. తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ధర్మా అనే వ్యక్తి సజీవదహనం కావడంతో టేక్మాల్ మండలం భీమ్లా తండాలో విషాదం నెలకొంది. టెక్మాల్ మండలం వెంకటాపురం గ్రామ శివారులో కారులో వ్యక్తి సజీవదహనం కావడం సంచలనంగా మారింది. కారు డోర్ వద్ద మృతుడి కాలు బయటకు రావడంతో ఇది ప్రమాదమా? లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధర్మాకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ధర్మా మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. గత అర్థరాత్రి వ్యక్తిని కారులో వేసి ప్రెటోల్ పోసి నిప్పు పెట్టినట్లు ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. కారు నంబర్‌ను దుండగులు పూర్తిగా దహనం చేశారు. కారు వద్ద బ్యాగుతో పాటు చెట్ల పొదల్లో పెట్రోల్ డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కేక్ కట్ చేసి ఎంత పని చేశాడంటే.. ఊహించని ట్విస్ట్
మైసూరు(కర్ణాటక): పుట్టిన రోజు నాడు ఆ ఇంట విషాదం తాండవించింది. అన్న తమ్ముడు గొడవ పడి అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు నగరంలోని మండి మొహల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడు దర్శన్ (21). ఫ్లెక్సీ బ్యానర్ల సెంటర్లో పనిచేసే దర్శన్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి ఇంటి వద్ద గొడవ చేస్తుంటాడు. ఇంట్లోనివారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినేవాడు కాదు. శనివారం పుట్టినరోజు కావడంతో ఫుల్లుగా తాగి వచ్చి ఇంట్లో రగడ పడగా అతని తమ్ముడు మందలించాడు. నాకే బుద్ధిమాటలు చెబుతావా? అని అతనితో పోట్లాట పడ్డాడు. ఆ ఆగ్రహంలో దర్శన్ కేక్ తీసుకొని వచ్చి కట్ చేసి, తరువాత గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: భార్య వేధిస్తోంది.. భర్త ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాకే..? -
గ్యాస్ట్రబుల్ అని వెళ్తే.. షాక్ ఇచ్చిన డాక్టర్.. ఎంత పనిచేశాడంటే?
కర్నూలు(హాస్పిటల్): తనకు గ్యాస్ట్రబుల్ ఉందని, కడుపు ఉబ్బరంగా అనిపిస్తోందని వైద్యుని వద్దకు వెళితే స్కానింగ్ చేసి అపెండిక్స్ ఉందని ఆపరేషన్ చేశాడు ఓ డాక్టర్. తీరా సదరు రోగి కోలుకోకపోగా ఆపరేషన్ వికటించి తనువు చాలించాడు. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కర్నూలులోని కొల్లాపూర్‌కు చెందిన సుమంత్(28) బంగారు నగలు చేసే పనిలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లావణ్య, ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. కొంత కాలంగా అతనికి కడుపు ఉబ్బరం, కడుపులో మంటగా ఉండటంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీని కలిశాడు. అతని సలహాతో కర్నూలులోని ఎన్ఆర్ పేటలో ఉన్న మెడికేర్ హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడి ఓ సర్జన్ అతన్ని పరీక్షించి స్కానింగ్ తీయించాడు. స్కానింగ్‌లో నీకు అపెండిక్స్ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకపోతే కడుపులోనే అపెండిక్ పగిలి అపాయం కలుగుతుందని చెప్పడంతో సుమంత్ ఆపరేషన్‌కు ఒప్పుకున్నాడు. దీంతో బుధవారం అతనికి సదరు ఆసుపత్రిలోనే ఆపరేషన్ చేశారు. అయితే రాత్రి అతనికి విపరీతమైన కడుపునొప్పి, ఆయాసం రావడంతో వైద్యులు వచ్చి చికిత్స చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా డాక్టర్లు ఎవ్వరూ రాలేదని, గురువారం ఉదయం 7 గంటలకు భర్త మృతి చెందినట్లు భార్య లావణ్య చెప్పారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సుమంత్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి ఆందోళన చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో పాటు ఆసుపత్రి యాజమాన్యాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి ఇరువర్గాలతో రాజీ చేసినట్లు సమాచారం. కాగా సదరు ఆసుపత్రికి వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇప్పటి వరకు లభించలేదు. తాత్కాలిక అనుమతి కూడా ఆసుపత్రికి లేదని, ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రామగిడ్డయ్య తెలిపారు. చదవండి: ప్రియుడి మైకంలో దారుణానికి ఒడిగట్టిన తల్లి.. -
భార్యకు దూరంగా భర్త.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. లాడ్జిలో షాకింగ్ ఘటన..
చిత్తూరు అర్బన్: వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం బలిగొన్న సంఘటన చిత్తూరు నగరంలో గురువారం వెలుగుచూసింది. వన్‌టౌన్ సీఐ నరసింహరాజు కథనం మేరకు, పుంగనూరుకు చెందిన ఈశ్వర్‌రెడ్డి (50) భార్యకు దూరంగా ఉంటున్నాడు. రెండేళ్లుగా చిత్తూరులో ఈయన కూరగాయలు, తినుబండారాలు విక్రయిస్తూ నివశిస్తున్నాడు. ఈయనకు యాదమరికి చెందిన లలితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. చదవండి: కనిపెంచిన తండ్రి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దేవుడా ఎంత శిక్ష వేసావయ్యా ఈ క్రమంలో బుధవారం వీరిద్దరూ సుందరయ్యవీధిలోని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కొద్దిసేపు తరువాత డబ్బులు విషయమై వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఈశ్వర్‌రెడ్డిని నెట్టేయడంతో తలకు తీవ్రగాయమై అక్కడే మృతి చెందాడు. దీంతో గురువారం ఉదయం లలిత గది తాళాలు వేసి రిసెప్షన్లో ఇచ్చి వెళ్లిపోయింది. మధ్యాహ్నం లాడ్జిని శుభ్రం చేయడానికి సిబ్బంది గది తెరచిచూడగా ఈశ్వర్‌రెడ్డి మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఈశ్వర్‌రెడ్డి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే లాడ్జి గదిని లలిత పేరుమీద బుక్ చేయడంతో పోలీసుల పని సులభతరమైంది. ఆమె ఇచ్చిన చిరునామా, ఫోన్ నంబర్ ఆధారంగా నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన
జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ, పట్టాలు దాటబోయి రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వేపోలీసుల వివరాల ప్రకారం.. బాదేపల్లిలోని బక్కరావు కాంపౌండ్‌లో ఉండే వడ్డె వినయ్‌కుమార్ (19) ఐటీఐ చదువుతున్నాడు. ఉదయం జిమ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో పాటలు వింటూ రైల్వేస్టేషన్ గేటు దగ్గర పట్టాలు దాటబోయాడు. ఆ సమయంలో అటుగా మహబూబ్‌నగర్ వైపు గూడ్స్ రైలు వెళ్తోంది. వినయ్ గమనించకుండా పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తల్లి కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెచ్‌సీ కృష్ణ తెలిపారు. చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య -
మహిళతో వెటర్నరీ అటెండర్ సన్నిహిత సంబంధం.. చివరికి ట్విస్ట్
నెల్లూరు(క్రైమ్): స్నేహితురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం అంబవరానికి చెందిన శ్రీనివాసులు (40) వెటర్నరీ ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. అదే మండలానికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా శెట్టిగుంటరోడ్డులోని వైటీనాయుడి వీధి సమీపంలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. చదవండి: సివిల్స్ కోచింగ్ కోసం వచ్చి.. జల్సాల మత్తులో ‘లక్ష్యం చెదిరింది’ ఆమెతో శ్రీనివాసులు సన్నిహితంగా ఉంటూ ఇటీవల ఇంటికొచ్చారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై సదరు మహిళను పోలీసులు విచారించగా.. తాను పనిపై బయటకెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దీంతో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకీ తరలించారు. కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. సదరు మహిళను పోలీసులు విచారిస్తున్నారు. -
గంటా సన్నిహితుడి మిత్రుడు అదృశ్యం
దొండపర్తి (విశాఖ దక్షిణ), కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి వద్ద శుక్రవారం ఓ వ్యక్తి అదృశ్యం కావడం కలకలం రేపింది. విశాఖ కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతానికి చెందిన కాట్రగడ్డ చంద్రశేఖర్ (60) గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అక్కడున్న క్రేటా కారు (ఏపీ 39 ఈక్యూ 9999) వద్ద ఓ లేఖ లభ్యమైంది. చదవండి: అత్తపై కోడలు భారీ స్కెచ్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు బట్టబయలు ఆయన గోదావరిలో దూకి చనిపోయాడా? లేక ఎక్కడికైనా వెళ్లిపోయాడా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఉదయం అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ కారు ఆగి ఉండటాన్ని గుర్తించి స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిసర ప్రాంతాలు, గోదావరిలో గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. రూ.12 కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయి.. విశాఖ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిర్లంపూడి లేఅవుట్ ‘ది పామ్స్’ అపార్ట్మెంట్లో చంద్రశేఖర్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు, ఇటీవల చనిపోయిన నలంద కిషోర్‌కు ఆయన స్నేహితుడని తెలుస్తోంది. చంద్రశేఖర్ సుమారు రూ.12 కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఇందులో రూ.6 కోట్లు మధ్యవర్తిగా ఇతరులకు ఇప్పించి ఇరుక్కుపోయినట్లు చెబుతున్నారు. బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. చంద్రశేఖర్ అదృశ్యంపై ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఆయన నివాసంలో ప్రస్తుతం ఎవరూ లేరని తెలుస్తోంది. -
ఆసుపత్రిలో దారుణం.. అనస్తీషియా అధిక డోస్ ఇవ్వడంతో..
లింగోజిగూడ(హైదరాబాద్): భుజం నొప్పితో ఆసుపత్రిలో చేరిన యువకుడు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్లో గురువారం జరిగింది. వైద్యులు అనస్తీషియా అధిక డోస్ ఇవ్వడం వల్లే అతను చనిపోయాడని ఆసుపత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురానికి చెందిన శ్రీపియల్ వెంకటేశ్వరరావు కుటుంబంతో సహా హయత్‌నగర్ సుబ్రహ్మణ్యనగర్‌లో నివాసం ఉంటూ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. చదవండి: మహిళతో ఒప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా ఇతని కుమారుడు మణిచంద్ర (28) కూడా తండ్రితో పాటు కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం క్రికెట్ ఆడుతుండగా కుడి చెయ్యి నొప్పి వచ్చింది. పలు ఆసుపత్రుల్లో చూపించినా నొప్పి తక్కువగా కాలేదు. పలువురి సూచన మేరకు ఎల్బీనగర్లోని శ్రీకార ఆసుపత్రిలో చూపించారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో గురువారం శస్త్ర చికిత్స చేయడానికి మణిచంద్రను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిన వైద్యులు కొద్ది సేపటి తర్వాత అతను మృతి చెందినట్టు కుటుంబసభ్యులకు తెలిపారు. అనస్తీషియా (మత్తుమందు) అధిక మోతాదులో ఇవ్వడం వల్లే మణిచంద్ర చనిపోయాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితులను శాంతిపజేశారు. మృతి చెందిన మణిచంద్ర కుటుంబానికి నష్ట పరిహారం చెల్లిస్తామని ఆసుపత్రి యజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. -
మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక..
అక్కిరెడ్డిపాలెం(గాజువాక) విశాఖపట్నం: జీవీఎంసీ 69వ వార్డు షీలానగర్‌లో సోమవారం అర్ధరాత్రి ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వాడకు చెందిన నామాల సురేష్ కుమార్ (38) కొన్నాళ్ల కిందట రష్మిక అనే మహిళను పెళ్లి చేసుకుని అదే ప్రాంతంలో నివసించేవాడు. అనంతర కాలంలో కంచరపాలెం ప్రాంతానికి చెందిన అఖిల్ అనే వ్యక్తితో రష్మికకు ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లు గడిచాక అఖిల్ వేధింపులు ఎక్కువ కావడంతో రష్మిక దువ్వాడ పోలీస్ స్టేషన్లో పలుమార్లు అఖిల్‌పై ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో దువ్వాడ నుంచి సురేష్‌కుమార్, రష్మిక షీలానగర్‌కు మకాం మార్చారు. చదవండి: మిస్టరీగా చిన్నారి మృతి.. ఆటోడ్రైవర్ ఫోన్ కాల్ కీలకం! అక్కడ ఓ అద్దె ఇంట్లో ఉంటూ సమీప బంధువు వద్ద క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో అఖిల్ సోమవారం అర్ధరాత్రి సమయంలో వీరి ఇంటికి చేరుకొని సురేష్ కుమార్‌పై దాడికి పాల్పడ్డాడు. తనతో తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో సురేష్ తలపై పలుమార్లు మోదడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. దాడి అనంతరం అఖిల్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన గాజువాక పోలీసులు నిందితుడు అఖిల్‌తోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మృతుని భార్య రష్మికను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే అఖిల్ వేధింపుల నుంచి తప్పించుకుని తలదాచుకునేందుకు దువ్వాడ నుంచి షీలానగర్ వచ్చి నివసిస్తున్న సురేష్‌కుమార్ దంపతుల ఇంటి అడ్రస్ అఖిల్‌కు ఎవరి ద్వారా తెలిసిందో అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తంగా ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. -
ఏం జరిగిందో.. స్నేహితుడి గదికి వెళ్లి.. తెల్లారే సరికి..
గుత్తి(అనంతపురం జిల్లా): స్నేహితుడి గదిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్ఎస్ పాత పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో నివాసముంటున్న షేక్ బాషా (23) శుక్రవారం రాత్రి సుందరయ్య కాలనీలోని స్నేహితుడు సురేష్ గదికి వెళ్లాడు. తెల్లారే సరికి అతను మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న సీఐ శ్యామారావు, ఎస్ఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్ ఆఫర్ -
పెళ్లైన మహిళతో యువకుడి సహజీవనం.. చివరికి..
పెనుకొండ(అనంతపురం జిల్లా): రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ సమీపంలోని షీఫారం వద్ద గురువారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ బాలాజి తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం పావగడ సమీపంలోని రొప్పంకు చెందిన కురుబ రాఘవేంద్ర (26) ఏటిగడ్డ తిమ్మాపురానికి చెందిన ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళను పెళ్లి చేసుకుంటానని కొన్ని రోజుల క్రితం ఇంట్లో పెద్దలకు చెప్పగా, వారు ఒప్పుకోలేదు. చదవండి: ట్రావెల్ బస్సుల్లో కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ సీన్.. దీంతో అప్పటి నుంచి మనోవేదనతో ఉన్నాడు. ఈ క్రమంలోనే బైకులో బుధవారం రాత్రి షీఫారం వద్దకు వచ్చిన యువకుడు జీవితంపై విరక్తితో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద దొరికిన ఆధార్‌కార్డు ఆధారంగా పోలీసులు బంధువులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పుట్టింటికి వెళ్లిన భార్య.. బాధతో భర్త.. చివరికి విషాదం..
పెనమలూరు(కృష్ణా జిల్లా): భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన పోలగాని నాగరాజు(25)కు అదే గ్రామానికి చెందిన బంకా కృపతో వివాహమైంది. శుక్రవారం వడ్లు కాటా వేసే పనికి వెళ్లిన నాగరాజు రాత్రి ఇంటికి చేరాక భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. విషయం తెలిసిన నాగరాజు తండ్రి రాంబాబు కొడుకు ఇంటికి వచ్చి చూడగా నాగరాజు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. చదవండి: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం -
కన్నయ్యా..నీవెంటే..నేనుంటా..కొడుకు సమాధి వద్దే ఉరేసుకొని తండ్రి ఆత్మహత్య
సత్తుపల్లి: అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనతో ఆదివారం కొడుకు సమాధి వద్దే చెట్టుకు ఉరివేసుకుని ఊపిరి తీసుకున్నాడు. హృదయవిదారకమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటుచేసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో కొడుకు, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణంలోని వేంసూరు రోడ్‌కు చెందిన చల్లా రాంబాబు(45), కృష్ణవేణి దంపతుల కు భానుప్రకాష్ (16), కుసుమ సంతానం. పిల్లలను చదివించేందుకు ఖమ్మంలోని ఓ నర్సరీలో పనిచేస్తూ అక్కడే పదేళ్లుగా ఉంటున్నారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం మేరకు.. భానుప్రకాష్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 14న భానుప్రకాష్ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆ సందర్భంగా ఓ స్నేహితురాలితో చనువుగా ప్రవర్తించాడని తెలిసి పాఠశాల ప్రిన్సిపాల్ మందలించారు. అదేరోజు పరీక్షకు హాజరైన భానుప్రకాష్ పరీక్ష పత్రాలు లాగేసుకొని, వారంపాటు పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. మీ నాన్న ఫీజు కూడా సరిగా కట్టడంటూ స్నేహితుల ముందే టీచర్ కొట్టిందని తల్లి కృష్ణవేణి కన్నీరుమున్నీరైంది. మనస్తాపానికి గురైన భానుప్రకాష్ ఈ నెల 15న ఇంట్లో ఉన్న పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ 17న మృతి చెందాడు. మృతదేహాన్ని సత్తుపల్లి శ్మశానవాటికలో ఖననం చేశారు. కొడుకు సమాధి వద్దే..: కొడుకు మృతిని జీర్ణించుకోలేని రాంబాబు కలత చెందాడు. కొడుకు అంత్యక్రియల తర్వాత తానూ చనిపోతానని భోరున విలపించాడు. రాంబాబును సత్తుపల్లిలో ఉంటున్న అతని సోదరుడు ఇంటికి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి 12.30 సమయంలో రాంబాబు ఎంత వారించినా వినకుండా ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు గాలించగా, ఆదివారం తెల్లవారుజామున కొడుకు సమాధి వద్ద ఉన్న చెట్టుకు వెంటతెచ్చుకున్న దుప్పటితో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ సుబ్బారావు తెలిపారు. -
అయ్! బాబోయ్!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా!
మన స్నేహితులు లేక మన బంధువులో మనల్ని భయపెట్టేలే చేసే పనులు ఒక్కోసారి మనల్ని చాలా భయభ్రాంతులకు గురిచేస్తాయి. పైగా ఆ సంఘటన నుంచి మనకు తేరుకోవడానికి కూడా చాలా టైమ్ పడుతుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన స్నేహితుడినిఅచ్చం బొమ్మలా ప్రాంక్ చేసి భయాందోళనకు గురిచేశాడు. (చదవండి: జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...) అసలు విషయంలోకెళ్లితే...పాల్కీన్ అనే వ్యక్తి తన స్నేహితుడు పాల్ వుడ్‌ని ఆటపట్టించాలనే ఉద్దేశంతో బొమ్మ మాదిరిగా దుస్తులు ధరించి ఒక గదిలో మూలన ఉన్న బొమ్మల మధ్య దాక్కొని ఉంటాడు. ఆ తర్వాత కాసేపటికి అతని స్నేహితుడు పాల్వుడ్ ఆ గదిలోకి వచ్చి మూలన పడి ఉన్న బొమ్మను తరలించే నిమిత్తం ఒక్కో బొమ్మను ఎత్తకుంటాడు. అంతే పాల్వుడ్ క్లీన్‌ని తాకిన వెంటనే వుడ్‌ని భయపెట్టేలా క్లీన్ లేచి నుంచుంటాడు. దీంతో వుడ్ ఒక్కసారిగా భయపడి కింద పడిపోతాడు. పైగా తాను చాలాసేపు ఇలా పడుకుని ఉన్నానంటూ క్లీన్ చెప్పుకొస్తాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో గత ఏప్రిల్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ తాజాగా ఆ వీడియో మళ్లీ నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీంతో నెటిజన్లు ‘ఆ వ్యక్తికి గుండె ఆగినంత పనైంది కదరా! తమాషాలకు కూడా అద్దూ అదుపు ఉండాలి. నీ ప్రాంక్ తగలెయ్య’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో దోస్తాన్లో ఇవన్నీ కామన్ అని కొట్టిపడేస్తున్నారు. వీడియో చూసి ఎంజాయ్ చేశామని అంటున్నారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) View this post on Instagram A post shared by YouTube (@youtube) -
తప్పించుకునే ప్రయత్నంలో అలా చేశాడు..అంతే చివరికి!!
ముంబై: పోలీసుల నంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆత్మహత్యలకు పాల్పడటం లేదా భవనాల మీద నుంచి దూకడం వంటివి చేస్తుంటారు. అంతేకాదు మరికొంతమంది పోలీసులపైనే దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. కానీ ఇక్కోడొక ముంబై వాసి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్) అసలు విషయంలోకెళ్లితే.. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరానికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్రలోని ముంబైలోని ఒక భవనంపై నుండి పడి మరణించాడు. అయితే ఆ వ్యక్తి ఢిల్లీ పోలీసుల బృందం నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు మృతుడు ముంబైలోని మలాడ్‌లోని ఎవర్‌షైన్ నగర్ నివాసి డేవి రాయ్‌గా గుర్తించారు. అయితే అతనిపై 2017లో ఢిల్లీలో డ్రగ్స్ కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు బృందం స్థానిక పోలీసులను సంప్రదించి రాయ్‌ను పట్టుకోవడానికి ముమ్మరంగా గాలించే చర్యలు చేపట్టారు. అయితే ఈ బృందం రాయ్ రెసిడెన్షియల్ సొసైటీకి చేరుకుని అక్కడి సొసైటీ వాచ్‌మెన్‌తో కలిసి రాయ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తలుపు తట్టిన ఎటువంటి సమాధానం లేకుండా పోయింది. పైగా నిందుతుడు రాయ్ ఆసుపత్రిలో తాను చనిపోయినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో తప్పుడు రిపోర్ట్‌ని కూడా ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు రాయ్ తమ నుంచి తప్పించుకునే క్రమంలోనే భవనంపై నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రమదవశాత్తు కిందపడి మృతి చెందాడని చెప్పారు. (చదవండి: ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!) -
శ్రీకాళహస్తిలో దారుణం.. సీసీ కెమెరాలో దృశ్యాలు..
సాక్షి, చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తిలో దారుణం చోటుచేసుకుంది. ఇనుపరాడ్లతో యువకుడిని దుండగులు దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని ఇమ్రాన్ (27)గా పోలీసులు గుర్తించారు. గతంలో అనేకమందితో ఇమ్రాన్ గొడవలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిన ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హతమార్చిందెవరనే దానిపై సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: శునకం నోటిలో పసికందు తల టిఫిన్ హోటల్‌కు రూ.21 కోట్ల కరెంటు బిల్లు -
వ్యాపారిని హతమార్చి.. శరీరాన్ని రెండు భాగాలు చేసి..
సాక్షి, వెలువోలు(చల్లపల్లి) : తండ్రీ కొడుకులు కలిసి ఒక వ్యక్తిని కసి తీరా నరికి చంపిన ఘటన కృష్ణా జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. హతుడి శరీరాన్ని రెండు భాగాలు చేసి మూట గట్టి కాలువలో తొక్కేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పమిడిముక్కల మండలం అగినిపర్రుకి చెందిన మటన్ వ్యాపారి గరికే ఏడుకొండలు తన కుమారుడితో కలిసి..సహచర మటన్ వ్యాపారి దేవరకొండ నాంచారయ్యను శనివారం చంపి కాలువలో పడేశానని ఆదివారం కూచిపూడి పోలీసులకు లొంగిపోవడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిందితుడు ఇచి్చన సమాచారంతో సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు. కరకట్ట వెంబడి కేఈబీ కెనాల్లో వీరంకి వద్ద నుంచి శ్రీకాకుళం, వెలువోలు వరకూ గాలించారు. చల్లపల్లి మండలం వెలువోలు వద్ద రెండు ముక్కలుగా ఉన్న నాంచారయ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తల నుంచి పొట్ట వరకూ భాగాన్ని మూటగట్టి కాలువలో తొక్కేశారు. కింది భాగాన్ని కాలువ గట్టుపై పడేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి అన్న కుమారుడుగోపీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చల్లపల్లి ఎస్ఐ డి.సందీప్ చెప్పారు. హత్యకు గల కారణాలను, పూర్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తులో నిగ్గుతేల్చుతామని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. అయితే వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు స్థానికులు చెప్పుకొంటున్నారు. -
పాము కాటేసిందన్న కోపంతో.. కస కస కొరికాడు.. ఆ తర్వాత..
పట్నా: బిహర్లో ఓ వృద్ధుడు మద్యం మత్తులో వింతగా ప్రవర్తించాడు. తనను కాటువేసిందన్న కోపంతో ఆ పాము పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. దాన్ని పట్టుకుని విచక్షణ రహితంగా కొరికాడు. అంతటితో ఆగకుండా పాముని అక్కడే ఉన్న చెట్టుపై వేలాడ దీశాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. నలంద జిల్లాలోని మాధోపూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామా మహతోని ఆదివారం అర్ధరాత్రి పాము కాటువేసింది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. వెంటపడి మరీ పామును పట్టుకుని కసితిరా కొరికి చంపాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. పాముపట్ల వింతగా ప్రవర్తించిన వృద్ధుని తీరు చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే, మహతో ఎవరిమాట పట్టించుకోలేదు. పాముని చంపేశాను...నాకేం కాదు అని మొండిగా ప్రవర్తించాడు. కాగా, రాత్రి మహతో భోజనం చేసి పడుకున్నాడు. ఆ తర్వాత మహతో నిద్రలోనే స్పృహ తప్పిపడిపోయాడు. ఎంత పిలిచిన లేవకపోయేసరికి.. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, మహతోను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భర్త చేసిన పనికి భార్య పుస్తెల తాడు తీసిచ్చింది.. చివరకు..
సాక్షి, నిజామాబాద్: రుణ దాత అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయగా భార్య మెడలోంచి పుస్తెల తాడు తీసిచ్చింది. అవమానం భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన నవతే నాగరాజు గంజ్‌లో గుమాస్తాగా పనిస్తాడు. వ్యాపారం నిమిత్తం శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర రూ. లక్ష 20 వేలు అప్పుగా తీసుకున్నాడు. లాక్డౌన్ కారణంగా వ్యాపారం సరిగా నడవకపోవడంతో నష్టాల పాలయ్యాడు. అప్పు ఇచ్చిన శ్రీనివాస్ డబ్బులు చెల్లించాలంటూ నాగరాజ్‌ను ఒత్తిడికి గురిచేస్తూ.. పలుసార్లు ఇంటికి వెళ్లి నిలదీశాడు. నాగరాజు బైక్‌ను కూడా లాక్కొని వెళ్లాడు. బుధవారం శ్రీనివాస్ మరొకరితో కలిసి డబ్బులు చెల్లించాలని నాగరాజును ఇంటి వద్ద నిలదీశాడు. దీంతో నాగరాజు భార్య అఖిల తన భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన మెడలోని బంగారు గొలుసు పుస్తెల తాడును తీసి శ్రీనివాస్‌కు ఇచ్చింది. అతను పూస్తెలతాడును తీసుకెళ్లాడు. దీంతో నాగరాజు తీవ్ర మనస్తాపం చెంది బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో భార్య అఖిల ఇంటి యజమానిని తీసుకువచ్చి తలుపులు పగులగొట్టించింది. నాగరాజు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. ఆగ్రహం చెందిన మృతుని బంధువులు అప్పుల పేరిట వేధించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట కొద్దిసేపు బైఠాయించారు. ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు. -
ఇంట్లో ప్రియుడితో భార్య.. భర్త ఆగ్రహంతో చివరికి..
వేలూరు(తమిళనాడు): వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆంబూరు సమీపంలోని బాలూరు గ్రామానికి చెందిన గోవిందస్వామి(55) అగ్గెపెట్టెల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఢిల్లీబాబు. ఇతని భార్య లక్ష్మి. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఢిల్లీబాబు దోబీ దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈక్రమంలో గోవిందస్వామికి, లక్ష్మీకి వివాహేతరసంబంధం ఏర్పడింది. మంగళవారం రాత్రి 10 గంటలకు ఢిల్లీబాబు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా గోవిందస్వామి, లక్ష్మి గదిలో చనువుగా ఉన్నారు. ఆగ్రహించిన ఢిల్లీబాబు కత్తితో గోవిందస్వామిపై దాడి చేశాడు. దాడిలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆంబూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని నిందితుడు ఢిల్లీబాబు కోసం గాలిస్తున్నారు. -
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం
సాక్షి, తూర్పుగోదావరి: రాజోలు మండలం చింతలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తిని యువకుడు కర్రతో కొట్టి చంపాడు. తన కుమార్తె పట్ల భాస్కర్ అనే యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అతని తల్లిదండ్రులకు తండ్రి మార్లపూడి సురేష్ ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడనే కోపంతో సురేష్‌పై ఆ యువకుడు కర్రతో దాడి చేశాడు. దీంతో సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ భార్యను చూసేందుకు వచ్చి...
కెలమంగలం(కర్ణాటక): మాజీ భార్యను చూసేందుకు వెళ్లిన భర్తపై ఆమె తరఫు బంధువులు దాడికి పాల్పడగా తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ ఘటన కెలమంగలం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. బెంగళూరు మంగళమ్మపాళ్యంకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్(32)కు కెలమంగలం సమీపంలోని దొడ్డబేళూరుకు చెందిన రుక్కు అనే మహిళతో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆరు నెలలకే విడిపోయారు. అయితే భార్యను చూసేందుకు ఇమ్రాన్ మంగళవారం వెళ్లగా ఆమె తరఫు బంధువులు అతన్ని కారులో కెలమంగలంవైపు తీసుకెళ్లి చిన్నట్టి వద్ద దాడి చేసి ఉడాయించారు. అతన్ని స్థానికులు క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులుగా భావిస్తున్న కెలమంగలం గణేష్‌కాలనీకి చెందిన సిద్దిక్, మాలిక్, రహమ్మాన్, దొడ్డబేళూరుకు చెందిన సాధిక్, జమీర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
సికింద్రాబాద్‌లో విషాదం.. రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి
సాక్షి, సికింద్రాబాద్: రేతిఫైల్ బస్టాప్ వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయిన దుర్గాప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. రెండు బస్సుల మధ్య ప్రమాదశాత్తూ ఇరుక్కుపోయిన దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, అతనికి సాయం చేసేందుకు ప్రయాణికులెవరూ దగ్గరకు కూడా వెళ్లలేదు. తీవ్ర గాయాలతో కాపాడండీ అంటూ ఆ యువకుడు అరగంట పాటు ఆర్తనాదాలు చేసిన ఎవరూ కాపాడే ప్రయత్నం చేయలేదు. చివరికి ఆర్టీసీ సిబ్బంది ‘108’కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోపు ఆ యవకుడు ప్రాణాలు విడిచాడు. చదవండి: మాజీ ఎంపీ ఇంట్లో విషాదం.. మావోయిస్టుల ఇళ్లకు రాచకొండ పోలీసులు -
దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి..
రాజమహేంద్రవరం రూరల్: లాలాచెరువు రూపానగర్ అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తికి హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హతుడిని రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ మూడు సింహాలు ప్రాంతానికి చెందిన అడ్డూరి అప్పన్న(52)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అప్పన్న టైల్స్ మే్రస్తిగా పని చేస్తుంటాడు. ఈ నెల ఎనిమితో తేదీన ఇంటి నుంచి పనికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. ఎప్పుడైనా పనికి వెళ్తే అతడు మూడు నాలుగు రోజులకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అప్పన్న కోసం ఎదురు చూస్తున్నారు. అప్పన్న స్కూటర్ రూపానగర్ – శ్రీరాంపురం వెళ్లే రోడ్డులో ఉందని అతడితో పనిచేసే వ్యక్తులు శనివారం గమనించి, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అతడి కుమారుడు సుబ్రహ్మణ్యం ఆ పరిసరాల్లో పరిశీలించగా ఫారెస్టు గుంతలో అప్పన్న మృతదేహం కనిపించింది. దీనిపై ఫిర్యాదు చేయడంతో బొమ్మూరు ఇన్స్పెక్టర్ లక్ష్మణరెడ్డి, ఎస్సై లు జగన్మోహన్రావు, శివాజీ, శుభశేఖర్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై రాయితో మోది, మృతదేహాన్ని ఫారెస్టు గుంతలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని అర్బన్ జిల్లా ఏఎస్పీ లతామాధురి, తూర్పు మండలం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ కూడా పరిశీలించారు. ఈ హత్యకు గల కారణాలపై పూర్తి దర్యాప్తు చేపట్టాలని ఇన్స్పెక్టర్ లక్ష్మణరెడ్డి, ఎస్సైలను ఆదేశించారు. అప్పన్న కుమారుడు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు ఎస్సై జగన్మోహన్రావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుమానాలెన్నో.. అప్పన్న హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలిసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు. అప్పన్నకు మద్యం తాగే అలవాటు ఉంది. అయినప్పటికీ బయటి వ్యక్తులతో ఎటువంటి గొడవలూ పెట్టుకోడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తెలిసిన వ్యక్తితో కలిసి మద్యం తాగేందుకు తన స్కూటర్‌పై వెళ్లి ఉండవచ్చని, రూపానగర్ ప్రాంతంలో మద్యం తాగి ఉంటారని భావిస్తున్నారు. ఆ సమయంలో వారి మధ్య ఏమైనా గొడవలు రావడంతో ఈ హత్య జరిగి ఉంటుందేమోననే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వివాహేతర సంబంధం కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. అప్పన్న సెల్‌ఫోన్‌కు వచ్చిన చివరి కాల్స్ ఎవరి నుంచి వచ్చాయి, అతడు చివరి ఫోన్ ఎవరికి చేశాడనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి పనికి వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తాడనుకుని ఎదురు చూస్తున్నామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని అప్పన్న భార్య, కుమారుడు, కుమార్తె రోదిస్తున్నారు. ఎవరితోనూ ఎటువంటి విభేదాలూ లేని వ్యక్తిని ఎవరు మట్టుపెట్టారోనంటూ బోరున విలపిస్తున్నారు. తమ కుటుంబానికి దిక్కెవరంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. చదవండి: మేనమామ చేతిలో చిన్నారి దారుణ హత్య చనిపోయినా వీడి పోలేక.. -
చికెన్, మటన్ గొడవ..! నిండు ప్రాణం బలి
పిఠాపురం(తూర్పుగోదావరి): క్షణికావేశం ఎంత దారుణ పరిస్థితులకు దారి తీస్తుందో ఈ ఘటనే ఉదాహరణ. 30 ఏళ్లకు పైగా దాంపత్య జీవితం గడిపిన ఆ భర్త కేవలం తాను తెచ్చిన కూర వండనందుకు భార్యపై కోపంతో మనస్తాపానికి గురై తన జీవితాన్నే అంతం చేసుకున్నాడు. ఏకంగా ప్రాణాలే తీసుకోవడం ఆ కుటుంబం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసింది. శనివారం రాత్రి ఈ ఘటన గొల్లప్రోలు మండలం కొడవలిలో చోటు చేసుకుంది. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. కొడవలికి చెందిన సీహెచ్ త్రిమూర్తులు (50) రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం మార్కెట్‌కు వెళ్లి చికెన్, మటన్ తీసుకొచ్చాడు. రెండు కూరలూ వండాలని భార్యకు చెప్పాడు. ఇప్పుడు ఒకటి.. మరొకటి రేపు ఆదివారం కాబట్టి వండుతానని భార్య చెప్పగా కోపోద్రిక్తుడయ్యాడు. తన మాట వినలేదంటూ వివాదానికి దిగి బయటకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే అతనిని ప్రత్తిపాడు పీహెచ్‌సీకి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ఆదివారం ఉదయం మృతి చెందినట్లు గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచి.. ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’ -
పెళ్లిరోజు.. అంతలోనే ఊహించని విషాదం
చంద్రగిరి: అన్యోన్య దాంపత్యానికి దిష్టి తగిలింది. ఆదర్శజంటను రోడ్డు ప్రమాదం విడదీసింది. పెళ్లిరోజునే పెనిమిటిని మృత్యువు కబళించింది. సాఫీగా సాగుతున్న జీవితం తలకిందులైంది. వివరాలు.. చంద్రగిరి మండలం మఠంపల్లెకు చెందిన శివ(30) తిరుపతిలో డిజైనర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పవిత్రను గత ఏడాది ఏప్రిల్ 16వ తేదీన ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో నెల క్రితం వారికి ఓ అబ్బాయి పుట్టాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని తిరుపతి నుంచి స్వగ్రామానికి శివ బైక్‌పై బయలుదేరాడు. తొండవాడ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన శివను 108లో తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పెళ్లిరోజునే మరణించావా అంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో మఠంపల్లె విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఈ ఆవు దూడ ఎంత లక్కీ అంటే.. ‘మా అన్నయ్య టెకీ, వదిన డాక్టర్.. తనపై ఆ ముద్ర సరికాదు’ -
ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడని చంపేశారు..
కోసిగి(కర్నూలు జిల్లా): పొలాల్లో ఆరబోసిన ఉల్లి గడ్డలను అపహరించేందుకు వచ్చాడనే అనుమానంతో రైతులు ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందాడు. కోసిగి సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ ధనుంజయ తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం కపటి నాగాలపురం గ్రామానికి చెందిన ఢణాపురం నసరన్న(55) శనివారం సాయంత్రం కోసిగిలో జరిగిన సిద్ధరూఢ స్వామి జాతరకు వెళ్లాడు. రాత్రి కావడంతో ఆశ్రమంలోనే నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున సజ్జలగుడ్డం గ్రామానికి వెళ్లే రోడ్డులో కాల్వలో సాన్నం చేసేందుకు అడ్డదారిలో పొలాల్లో వెళ్తుండగా.. ఆరబెట్టిన ఉల్లి పంటకు కాపలా ఉన్న రైతులు చీకటిలో అతడిని దొంగగా అనుమానించి చితక బాదారు. తీవ్రంగా గాయ పడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో 108లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వ్యక్తి మృతికి కారణమైన రైతులు కిందిగేరి ఈరన్న, కపటి ఈరన్న, కోసిగయ్య, తాయన్నతో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు. చదవండి: చూస్తుండగానే రైతును నీళ్లల్లోకి లాక్కెళ్లిన మొసలి రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా -
ఏనుగు పాదానికి గాయమైందని వెళితే.. విసిరికొట్టింది!
మాడ్రిడ్: ఓ ఏనుగు తన తొండంతో గట్టిగా కొట్టి, ఎన్‌క్లోజర్ నుంచి జూ కీపర్‌ను బయటకు విసిరేసింది. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తర స్పెయిన్‌లోని కాంటాబ్రియాలోని కాబార్సెనో నాచురల్ పార్క్‌లో జూ కీపర్ జోక్విన్ గుటిరెజ్ ఆర్నైజ్(44)పై ఆడ ఆఫ్రికన్ ఏనుగు తన తొండంతో దాడి చేసింది. దీంతో జూ కీపర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై స్పెయిన్ పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఏనుగు పాదానికి ఇన్ఫెక్షన్ అయినట్లు తెలుస్తోంది. ఆ గాయం స్థితిని తెలుసుకోవడానికి జూకీపర్ దాని వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఏనుగుకు దగ్గు రావటంతో అది ఒక్కసారిగా తన తొండాన్ని బలంగా ముందుకు విసిరింది. దీంతో దాని పాదాల వద్ద ఉన్న జూ కీపర్ ఎన్‌క్లోజర్ అవతలపడ్డాడని తెలిపారు. ఆ ఏనుగు తొండానికి చాల బలం ఉంటుందని, అది మనుషులకు తగిలితే బతకటం కష్టమని పేర్కొన్నాడు. ఈ ఘటన చోటు చేసుకోవటం బాధాకరం, 30 ఏళ్ల జూ చరిత్ర ఇటువంటి ప్రమాదం ఇదే మొదటిసారి జరిగిందని ఆయన తెలిపాడు. చదవండి: తమ్ముడి ఆత్మహత్య.. ఆవేదనతో అన్న కూడా మాట్లాడుకుందామని పిలిచి మోడల్‌పై ఆత్యాచారం -
యువకుడిని తొక్కి చంపిన ఏనుగుల గుంపు
సాక్షి, ఛత్తీస్‌గఢ్: దంతరి జిల్లాలో దారుణం జరిగింది. విశ్రామ్‌పూర్ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు దాడిలో యువకుడు మృతిచెందాడు. విండోటోలా అటవీ ప్రాంతంలో కూలి పనులు చేసేందుకు వెళ్లిన యువకుడిపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల కాళ్ల మధ్యలో నలిగిపోయిన యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చదవండి: ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి -
అత్త వివాహేతర సంబంధం.. అల్లుడు ఆత్మహత్య
మీర్‌పేట: అత్త వివాహేతర సంబంధం పెట్టుకో వడంతో అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తూటిపేట తండాకు చెందిన అంగోతు బాబు (25) 8నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ నందనవనం కాలనీలో భార్య నిర్మలతో ఉంటున్నాడు. కొంతకాలంగా భార్య తల్లి విజయ(40) శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి రోజు తన ఇంటికి రావడం గమనించాడు. అనుమానంతో నిలదీయగా అసలు విషయం తెలిసింది. దీంతో బాబు పది మందిలో పంచాయితీ పెట్టడంతో ఓర్చుకోలేని అత్త విజయ, శ్రీనులు బాబుకు ఫోన్ చేసి తిట్టి బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పెట్టుబడి పెడితే లాభాలు పొందొచ్చని.. -
లోన్ యాప్ వేధింపులు: మరో వ్యక్తి బలి
సాక్షి, మేడ్చల్: ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగడం లేదు. రుణాల పేరుతో ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక తెలంగాణలో మరో వ్యక్తి బలైయ్యాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని తన నివాసంలో చంద్రమోహన్ అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. (చదవండి: సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య) లోన్ కట్టాలంటూ యాప్ నిర్వాహకులు బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో.. తన ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న నంబర్లకూ మెసేజ్‌లు పంపడంతో మనస్థాపం చెందిన చంద్రమోహన్.. తన నివాసంలోనే ఉరేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సాక్షి స్టింగ్ ఆపరేషన్: కరోనా టెస్టులే లేకుండా సర్టిఫికేట్లు) -
కుర్రాళ్ల బైక్ విన్యాసం: నిండుప్రాణం బలి
అనంతపురం క్రైం: కుర్రాళ్ల బైక్ విన్యాసం ఒక నిండుప్రాణాన్ని బలితీసుకుంది. అత్యంత రద్దీ కలిగిన ప్రదేశంలో మితిమీరిన వేగంతో వెళ్తూ నిల్చున్న వ్యక్తిని ఢీకొనడంతో అతడు గాలిలో ఎగిరి రోడ్డుపై పడి ప్రాణం విడిచాడు. వివరాల్లోకెళ్తే... అనంతపురంలోని వినాయకనగర్‌కు చెందిన పి.వెంకటరమణ (50) జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సప్తగిరి సర్కిల్ సమీపంలో ద్విచక్రవాహనం ఆపి అటువైపు వెళ్లేందుకు అనకొండ షోరూం వద్ద నిల్చుని ఉన్నాడు. ఇంతలో టవర్‌క్లాక్ వైపు నుంచి మున్నానగర్‌కు చెందిన ఇలియాజ్ మరో యువకుడు కలిసి స్పోర్ట్స్ బైక్‌పై విన్యాసాలు చేసుకుంటూ పెద్ద పెద్ద శబ్దంతో హారన్ కొడుతూ దూసుకొచ్చారు. వేగాన్ని అదుపుచేసుకోలేక వెంకటరమణను ఢీకొనడంతో అతను ఎగిరి రోడ్డుపై పడ్డాడు. రోడ్డుకు బలంగా తగలడంతో తల, ముక్కు, చెవుల్లోంచి రక్తస్రావమైంది. అదుపుతప్పిన యువకులు అలాగే ముందుకెళ్లి ఒక ఆటోను ఢీకొని కిందపడ్డారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వెంకటరమణను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. వెంకటరమణకు భార్య లక్షి్మ, నలుగురు పిల్లలు ఉన్నారు. నిందితుడికి దేహశుద్ధి మితిమీరిన వేగంతో ఢీకొని నిండుప్రాణాన్ని బలిగొన్న మున్నానగర్‌కు చెందిన ఇలియాజ్, మరో యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చేలోపు ఓ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్వల్పంగా గాయపడిన ఇలియాజ్‌ను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..
సాక్షి, నిజామాబాద్: నగరంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. నాగారం ప్రాంతంలో నివాసం ఉంటున్న సాల్మన్ రాజు అనే వ్యక్తి గత ఏడాది కాలంగా ఆర్యనగర్‌లోని అపార్ట్మెంట్లో ప్లంబర్ వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ పక్కన నివాసం ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అర్ధరాత్రి తన ఇంటికి వచ్చిన ఆ మహిళ భర్త ఉమాకాంత్ వీళ్లిద్దరూ కలిసి ఉండడం చూసి కోపంతో రగిలిపోయాడు. ఇంట్లో ఉన్న రాడ్‌తో సల్మాన్ రాజ్ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు ఉమాకాంత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ సత్యనారాయణ తెలిపారు. -
కానిస్టేబుల్ నిర్వాకం.. నిండు ప్రాణం బలి
పిడుగురాళ్ల(గుంటూరు) : పోలీసుల స్వార్థానికి ఓ నిండు ప్రాణం బలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు కలసి చేతి వృత్తులు చేసుకుని జీవనం సాగించే నలుగురు వ్యక్తులను తమ వెంట ఓ ఆటోలో తెలంగాణ రాష్ట్రంలోని దామరచర్లకు తీసుకెళ్లారు. అక్కడ ఫూటుగా మద్యం తాగి, వస్తూ వస్తూ ఆంధ్రాలో విక్రయించుకునేందుకు ఆటోలో కొంత మద్యం బాటిళ్లను తీసుకుని వస్తుండగా మార్గం మధ్యలో దామరచర్ల వాడపల్లి మధ్యలో పెట్రోలు బంకు సమీపంలో ఆటోను వెనుక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మెకానిక్ షేక్ బాబావలి అలియాస్ మున్నా(24) తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన నైతిక బాధ్యత కలిగిన పోలీసులే అక్కడి నుంచి పారిపోవడంతో పలు అనుమానాలకు దారితీసింది. ఈ సంఘటన ఈ నెల 14వ తేదీన జరిగింది. గాయాలపాలైన మున్నాను అతని స్నేహితులైన ఇస్మాయిల్, పి.జీవన్, ఆటో డ్రైవర్ మస్తాన్‌తో పాటు ముగ్గురు పోలీసుల్లో ఒక కానిస్టేబుల్ మాత్రమే హుటాహుటిన దామరచర్లలోని ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం మిర్యాలగూడెం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని పిడుగురాళ్ల పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇంత జరిగినా క్షతగాత్రుడైన మున్నా తల్లిదండ్రులకు పోలీసులు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. పిడుగురాళ్లలో ప్రైవేటు వైద్యశాలలో చేర్పించిన తర్వాత మున్నా తల్లిదండ్రులైన గండు మస్తాన్‌వలి, తల్లి కరిమున్లకు ద్విచక్రవాహనం మీద వస్తుంటే ప్రమాదం జరిగిందని తప్పుడు సమాచారం ఇచ్చారు. విషయం తెలియక తల్లిదండ్రులు తమ కొడుకును రక్షించుకునేందుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మున్నా ఈ నెల 23న మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు కాకపోవడంతో మృతుడి తల్లిదండ్రులు ప్రమాదం జరిగిన దామరచర్ల పోలీస్‌స్టేషన్‌లో 25వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో దామరచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. కంచె చేను మేసిన చందంగా.. తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చే సమయంలో తెలంగాణ–ఆంధ్ర రాష్ట్రం సరిహద్దులో వాడపల్లి బ్రిడ్జి వద్ద పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఈ నలుగురు వ్యక్తులను ఓ కేసు నిమిత్తం దామరచర్లకు తీసుకెళ్లి మళ్లీ పిడుగురాళ్లకు తీసుకువస్తున్నామని చెప్పేందుకు ఓ పథకం రచించారు. ఆటోలో మద్యం సీసాలను తీసుకుని కానిస్టేబుల్ చందు ఆటోను నడుపుతూ వస్తున్నారు. వెనుక నుంచి వస్తున్న కారు పలుమార్లు హారన్ కొట్టినా నిర్లక్ష్యంగా ఎడమ వైపు పక్కకు రావాల్సిన ఆటో కుడివైపునకు తిప్పడంతో అటుగా వస్తున్న కారు వారి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం కేవలం ఆటో నడిపే కానిస్టేబుల్ వల్లే జరిగిందని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జానపాడు గ్రామానికి చెందిన మృతుడు మున్నాకు ఏడాదిన్నర వయసున్న కుమారుడు మదార్‌వలి ఉన్నాడు. భార్య సియాబేగం ఎనిమిది నెలల గర్భిణి. పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలోని దామరచర్లకు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుతో పాటు నలుగురు వ్యక్తులు కలిసి ఆటోలో వెళ్లిన మాట వాస్తవమే. వారందరూ అక్కడకు వెళ్లి మద్యం తాగి తిరిగి వస్తుండగా మున్నా అనే వ్యక్తి ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. విధి నిర్వహణలో క్రమశిక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. –ప్రభాకర్‌రావు, సీఐ, పిడుగురాళ్ల -
మద్యానికి బానిసై.. శానిటైజర్ తాగి..
ఉదయగిరి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న కంభంపాటి రమణయ్య(40) శానిటైజర్ తాగడంతో అది వికటించి శనివారం రాత్రి మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు..ఉదయగిరిలోని చాలక వీధికి చెందిన రమణయ్య గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. కరోనా నేపథ్యంలో ఉదయగిరిలో లాక్డౌన్ అమలు చేస్తూ వైన్‌షాపులు మూసివేయడంతో శనివారం రాత్రి శానిటైజర్ తాగి నిద్రకు ఉపక్రమించాడు. కొద్దిసేపటి తర్వాత కడుపులో నొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అటెండర్ రమణయ్య మృతిపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో ఘోరం.. బండ రాయి పడి..
సాక్షి, కలకడ: రాతి బండ కింద పడి కూలీ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడగా, మరో నలుగురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిత్తూరు జిల్లా కలకడ మండలం నడిమిచెర్ల సమీపంలోని మొటుకు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు చిత్తూరు జిల్లా యాదమరి కి చెందిన రెహమాన్ గా పోలీసులు గుర్తించారు. గాయపడిన అక్బర్, ముబారక్ లను గుర్రంకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బండ రాయి కింద మృతి చెందిన వ్యక్తిని బయటకు తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.కలకడ ఎస్ ఐ రవి ప్రకాష్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి పీటలు ఎక్కకుండానే...
పాయకరావుపేట: త్వరలో పెళ్లి పీటలు ఎక్కవలసిన ఓ యువకుడు ఆత్మహత్యచేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎస్ఐ విభీషణరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడివాడ మండలం పెద్ద పట్నాల లంక గ్రామానికి చెందిన వంటెద్దు రాజు (26) అనే యువకుడు పాయకరావుపేటలో అద్దె ఇంట్లో ఉంటూ ఆరు సంవత్సరాలుగా నక్కపల్లి మండలం రాజియ్యపేట వద్ద గల హెటిరో కంపెనీలో డాక్యుమెంటరీ డిపార్టుమెంట్లో పని చేస్తున్నాడు. పది రోజుల కిందట ఇతనికి కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదుగాని ఆదివారం రాత్రి తాను నివాసముంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, సమాచారం తెలుసుకున్న మృతుడి తండ్రి సత్యనారాయణ, కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు. కుమారుడి మృతదేహం చూసి భోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విభీషణరావు తెలిపారు. -
వీడియో తీసుకుని... ఉరి వేసుకుని...
సీతమ్మధార(విశాఖ ఉత్తర): ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సీతమ్మధార, ఏఎస్‌నగర్ సమీపంలో ఆదర్శనగర్‌కు చెందిన జోషెఫ్ లివింగ్స్టన్ (26) ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్టారెంట్ స్టోర్ రూంలో ఫ్యాన్‌కు వైర్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ముందుగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో తీసి తన స్నేహితురాలు లక్ష్మి అనే యువతికి పంపించాడు. అది చూసిన ఆ అమ్మాయి వీడియోని రెస్టారెంట్లో పని చేస్తున్న యువకుడికి పంపించింది. అతను విషయాన్ని జోషెఫ్ సోదరుడు జాన్సన్‌కు తెలియజేయడంతో వారంతా రెస్టారెంట్ వెనుకవైపు వెళ్లి చూశారు. ఫ్యాన్‌కు వేలాడుతూ జోషెఫ్ కనిపించడంతో తలుపులు పగలకొట్టి కిందకు దించారు. అప్పటికే మృతి చెందడంతో అతని సోదరుడు జాన్సన్ ద్వారకా పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఎస్ఐ స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
తమిళనాడులో బస్సు ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కంచి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల యాత్రకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మందికి గాయాలయ్యాయి. శబరిమల నుండి కంచి వస్తుండగా.. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడిని పాచిపెంట మండల పాంచాలి గ్రామానికి చెందిన గౌరీశ్వరరావు(25)గా గుర్తించారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఈత సరదా ప్రాణం తీసంది. ఉడా పార్క్ బీచ్‌లో స్నానానికి దిగిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. మూడో పట్టణ పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ పనులు చేసుకునే ఎస్.కోటకు చెందిన ఎల్లపు ఎర్రినాయుడు, జగదీశ్వరి దంపతులకు ఎల్లపు రోహిత్ (19), హర్షిత్ ఇద్దరు కుమారులు. వీరిలో రోహిత్ గిడిజాల వద్ద ఉన్న సాయి గణపతి కళాశాలలో పాలిటెక్నికల్ ఈసీఈ పూర్తి చేశాడు. రెండో కుమారుడు హర్షిత్ గాజువాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములకు చదువుపై ఉన్న ఇష్టంతో అక్కిరెడ్డిపాలెంలోని పెద్దమ్మ, పెదనాన్నలైన కాండ్రేగుల రత్నం, నర్సింగరావుల వద్ద ఉండి చదువుకుంటున్నారు. రోహిత్ ఉన్నత చదువులు కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంటిలో చెప్పకుండా రోహిత్ బయటకు వెళ్లాడు. అక్కడి నుంచి పంతులు గారి మేడ ప్రాంతానికి చెందిన జి.సంతోష్(22), అనకాపల్లికి చెందిన జి.స్వామి(21)తో కలిసి మధ్యాహ్నం నగరంలోని ఉడా పార్క్‌కు వెళ్లారు. వీరిలో ఎవరికీ ఈత రాకపోయినప్పటికీ రోహిత్ మాత్రం స్నానానికి దిగాడు. మిగిలిన ఇద్దరు స్నేహితులు ఒడ్డునే ఉన్నారు. స్నేహితులిద్దరూ చూస్తుండగానే బలమైన కెరటాల తాకిడికి రోహిత్ గల్లంతయ్యాడు. కొద్ది సమయానికి రోహిత్ మృతదేహం ఒడ్డుకు చేరింది. రోహిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోహిత్ మధ్యాహ్నం భోజనానికి రాకపోవడంతో అతని సోదరుడు హర్షిత్ ఫోన్ చేయగా... రోహిత్ ఉడా పార్కు వెనుక ఉన్న సముద్రంలో గల్లంతయ్యాడన్న విషయం తెలిసింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు, బంధువులు తీరానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. చేతికందొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. త్రీటౌన్ ఎస్ఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చేతబడి చేశారని.. సజీవ దహనం
శాస్త్రసాంకేతిక విప్లవం కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా చాలామందిలో మార్పురావడం లేదు. చేతబడి అనుమానంతో దాడులకు పూనుకుంటున్నారు. అకారణంగా ప్రాణాలను తీస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ శివారులో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని సజీవ దహనం చేసిన సంఘటన సంచలమైంది. ఈ దారుణాన్ని జనం మరువకముందే విశాఖ మన్యంలో ఇలాంటి ఘోరమే చోటుచేసుకుంది. డుంబ్రిగుడ మండలం కురిడి పంచాయతీ పుట్టబంద గ్రామానికి చెందిన గిరిజనుడు కిల్లో జయరాం(55) చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అతనిపై కొంతమంది దాడికి దిగారు. కర్రలతో కొట్టి..కాళ్లు చేతులుకట్టేసి.. ఒంటిపై పెట్రోల్‌పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఇంత జరిగినా స్థానికులెవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ విషయం తెలిసి జిల్లా ప్రజలు నివ్వెరపోయారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, డుంబ్రిగుడ: పుట్టబంద గ్రామానికి చెందిన కిల్లో జయరాం వ్యవసాయ పనులు చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతనికి భార్య చెల్లిమ్మ, నలుగురు పిల్లలున్నారు. జయరాం చేతబడి చేస్తుంటాడనే అనుమానం స్థానికల్లో చాలారోజులుగా ఉంది. ఎవరికి ఒంట్లో బాగోకపోయినా అతన్నే కారకుడిగా భావించేవారు. చేతబడి చేయడంతోనే తమ వారికి బాగోలేదంటూ తిడుతుండేవారు. తరచూ జయరాంతో గొడవ పడేవారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం పంచాయతీ నిర్వహిస్తున్నామని.. రావాలని కొంతమంది జయరాం ఇంటికి వచ్చి తీసుకొని వెళ్లారని అతని భార్య చెల్లిమ్మ చెబుతుంది. అయితే పెద్దలెవ్వరూ అక్కడలేకపోవడంతో కొంతమంది తన భర్త జయరాంపై దాడికి దిగి.. కాళ్లు..చేతులను తాళ్లతో కట్టి.. కర్రలతో కొట్టి గ్రామ సమీపంలోని నడిరోడ్డుపైనే ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారని, అడ్డుకున్న తమను కూడా చంపేస్తామని నాటు తుపాకీతో బెదిరించారని చెల్లిమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరికి అనారోగ్యంగా ఉన్నా దానికి తన భర్తనే కారణంగా చూపేవారని ఆవేదన వ్యక్తం చేసింది. రంగంలోకి పోలీసులు జయరాం సజీవ దహనం ఘటనపై అతని భార్య చెల్లిమ్మ బుధవారం ఉదయం డుంబ్రిగుడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అరకు సీఐ పైడయ్య, డుంబ్రిగుడ ఎస్సై గోపాలరావులు గ్రామానికి వెళ్లారు. సంఘటన స్థలాన్ని..పంచాయతీ ఏర్పాటు చేయాలని భావించిన ప్రదేశాలను పరిశీలించారు. జయరాం సజీవ దహనం అనంతరం మిగిలిన బూడిదను సేకరించారు. జరిగిన ఘోరంపై కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.గ్రామానికి చెందిన కె.పరుశురాం, నందో, మోహన్, ముకుంద్ అనే వ్యక్తులతో పాటు వారి భార్యలు జయరాంను చిత్రహింసలు పెట్టి, పెట్రోల్ పోసి కర్రల్లో పడేసి నిప్పంటించి సజీవ దాహనం చేశారని మృతుని భార్య చెల్లిమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇంత ఘోరం జరిగినా గ్రామస్తులు ఎవరూ కనీసం పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం అరకు సీఐ పైడయ్య విలేకరులతో మాట్లాడారు. జయరాం సజీవ దహనం ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. బాధ్యులు ఎవరు? ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారో వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. మృతురాలి భార్య చేసిన ఫిర్యాదు మేరకు కొంతమందిపై కేసు నమోదు చేశామన్నారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్నవారు పరారీలో ఉన్నారని..వారి కోసం గాలిస్తున్నామన్నారు. -
ప్రాణం తీసిన అతివేగం
సాక్షి, వీరఘట్టం/పాలకొండ రూరల్: ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తొమ్మిది మంది మత్స్యకారులను క్షతగాత్రులుగా చేసింది. కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలైన వీరి రోదనతో వీరఘట్టం సమీప వెంకమ్మ చెరువు ప్రాంగణం ఒక్కసారిగా భయకంపితంగా మారింది. ఈ చెరువులో చేప పిల్లలను వదిలేసి రోడ్డుపైన చేప పిల్లల వ్యాన్‌లో తిరిగి వెళ్లి పోదామనుకున్న తరుణంలో అతివేగంతో వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు వెనుక నుంచి బలంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మత్స్యకారుడు గంటా లక్ష్మణరావు(46) బస్సు వెనుక చక్రం కింద పడి నుజ్జునుజ్జయి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం ఈ ఘోర రోడ్డు ప్రమాదాన్ని చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఇలా ప్రమాదం... సీతంపేట ఐటీడీఏ గిరిజన మత్స్యకారులకు సబ్సిడీపై చేప పిల్లలను అందజేస్తోంది. ఇందులో భాగంగా వీరఘట్టం సమీపంలో వెంకమ్మ చెరువుకు చేప పిల్లలను బూర్జ మండలం మదనాపురం తీసుకువచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో వచ్చిన చేపల వ్యాన్‌లో చేప పిల్లలను వీరఘట్టం, నీలానగరం మత్స్యకారులందరూ చెరువులో విడిచిపెట్టారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు వ్యాన్ సమీపంలో చేప పిల్లల లెక్కలను సరిచూసుకుంటున్నారు. ఇంతలో వెనుక నుంచి అతి వేగంతో వచ్చిన బస్సు వ్యాన్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో విలవిల.. వీరఘట్టానికి చెందిర మారుబిల్లి జగన్ తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. నీలానగరానికి చెందిన ఎస్ సింహాచలం, అల్లు కనకారావు తీవ్రంగా గాయపడటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వీరఘట్టం కొండవీధికి చెందిన గురిబిల్లి పోలిరాజు కుడిచేయి విరిగిపోయి, తలకు తీవ్ర గాయమైంది. గుండా దాసుకు, చేపల పంపిణీ చేసిన బీ అప్పన్నదొర, సవర గంగాధర్, వ్యాన్ డ్రైవర్ సవర దుర్గారావుతోపాటు సీతంపేటకు చెందిన ఫిషర్మెన్ బెవర సత్యనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో వీరంతా గాయాలతో విలవిల్లాడారు. ప్రస్తుతం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నీలానగరంలో విషాదం... చెరువులో చేప పిల్లలను వదిలేసి మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వచ్చేస్తానని చెప్పిన భర్త లక్ష్మణరావు మృతి చెందాడని తెలియడంతో భార్య లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. మృతుడి స్వగ్రామం నీలానగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాలకొండ ఏరియా ఆస్పత్రిలో లక్ష్మణరావు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై వీరఘట్టం ఎస్ఐ ఎం మధుసూదనరావు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. -
అసభ్యకరంగా మాట్లాడాడని..
సాక్షి, బుచ్చెయ్యపేట(చోడవరం): తమ కుమార్తెతో అసభ్యకరంగా మాట్లాడాడని ఆగ్రహించిన మండలంలో రాజాం గ్రామంలో బాలిక కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తన పొలంలో వరి పంటకు తెగుళ్లు సోకడంతో పురుగుమందు స్ప్రేయర్ కోసం రాజాం గ్రామానికి చెందిన ఏడువాక సన్యాసినాయుడు(40) అదే గ్రామానికి చెందిన మరిసా రాజులమ్మ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో రాజులమ్మ ఇం టి వద్ద లేకపోగా ఆమె 13 సంవత్సరాల కుమార్తెను స్ప్రేయర్ ఇవ్వమని సన్యాసినాయుడు అడిగాడు. ఇంటివద్ద మా కుటుంబ సభ్యులు లేర ని, తరవాత రమ్మని రాజులమ్మ కుమార్తె తెలి పింది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాజులమ్మకు తనతో సన్యాసినాయుడు అసభ్య పదజాలంతో మాట్లాడినట్టు బాలిక తెలిపింది. సన్యాసినాయుడుతో బాలిక తల్లి,కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి గొడవ పడి, అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో సన్యాసినాయుడు రోడ్డుపై పడడంతో తలకి గాయమై అక్కడకక్కడే మృతి చెందాడు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే అనకాపల్లి డీఎస్పీ శ్రావణి,చోడవరం సీఐ కె.ఈశ్వరరావు, బుచ్చెయ్యపేట పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి, మృత దేహాన్ని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతుడి భార్య కన్నమ్మ ఆమె కుటుంబ సభ్యులు సోమవారం గ్రామంలో ఆందోళనకు దిగారు. చిన్న విషయానికే ప్రాణాలు తీసేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన భర్త చావుకు కారణమైన బాలిక తల్లి రాజులమ్మ,బాబాయి శ్రీను,నానమ్మ అప్పలకొండ కుటుంబ సభ్యులు సత్యవతి,సన్యాసినాయుడులపై చర్యలు తీసికోవాలని కన్నమ్మ ఫిర్యాదు చేయడంతో ఆ ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సన్యాసినాయుడు మృత దేహానికి పంచనామా నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
దుష్టశక్తులు పీడిస్తున్నాయంటూ.. చంపేసింది
జైపూర్: ఓ వ్యక్తి మూఢనమ్మకాలతో ప్రాణాలు తీసుకున్నాడు. దుష్టశక్తులు పీడిస్తున్నాయంటూ ఓ మహిళ (మంత్రగత్తె) ఇనుపకడ్డీతో కాల్చడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. రాజస్థాన్‌లో ఈ దారుణం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కిషన్ లాల్ (50) అనే వ్యక్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం రాత్రి ఆయన్ను చికిత్స కోసం లక్ష్మిదేవి అనే మహిళ దగ్గరకు తీసుకెళ్లారు. కిషన్ లాల్‌ను దుష్టశక్తులు పీడిస్తున్నాయని ఆమె చెప్పింది. విరుగుడు పేరుతో కాల్చిన ఇనుప కడ్డీతో వాతలు పెట్టింది. తీవ్రంగా గాయపడిన కిషన్ లాల్ పరిస్థితి విషమించింది. ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో ఆమెను ఇంకా అరెస్ట్ చేయలేదు. -
అధికారుల వేధింపులకు వ్యక్తి మృతి
తుర్కపల్లి (నల్లగొండ జిల్లా) : అధికారుల వేధింపులతో భయాందోళనలకు గురైన ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...మాదాపూర్ గ్రామానికి చెందిన కీల లింగం(46) అనే వ్యక్తి గ్రామంలోని ఇసుక ఫిల్టర్ల వద్ద కూలీగా పని చేస్తున్నాడు. అయితే గ్రామ వీఆర్ఏ ఇసుక ఫిల్టర్లను సందర్శించి వాటిని నిలిపివేయాలని కోరాడు. ఈ క్రమంలోనే వీఆర్ఏ.. లింగం తనను తిట్టాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు లింగంను ఆదివారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అంతేకాకుండా తిరిగి సోమవారం కూడా విచారణకు హాజరుకావాలని కబురు పంపారు.ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన లింగంకు గుండెపోటు వచ్చింది. విషయం తెలిసిన బంధువులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. లింగం మరణంతో ఆగ్రహించిన గ్రామస్తులు వీఆర్వో, వీఆర్ఏలపై ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కనకదుర్గ వారధిపై ప్రమాదం: వ్యక్తి మృతి
గుంటూరు : విజయవాడలోని కృష్ణానదిపై ఉన్న కనకదుర్గ వారధిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడిని విజయవాడకు చెందిన బంగారునాయుడుగా పోలీసులు గుర్తించారు. ఆటోలో దినపత్రికలను తీసుకుని తాడేపల్లి నుంచి విజయవాడకు వస్తుండగా... వారధిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో బంగారునాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారధిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. (తాడేపల్లి) -
వేటగాళ్ళ ఉచ్చుకు యువకుడి బలి
ఏలూరు: అడవి జంతువుల కోసం వేటగాళ్ళు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు బలయ్యాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెంలో మంగళవారం రాత్రి జరిగింది. కంచనగూడెం సమీపంలో ఉన్న పొలాల్లో వేటగాళ్ళు అడవి పందులు, దుప్పుల కోసం విద్యుత్ తీగలు అమర్చారు. గ్రామానికి చెందిన నున్న అరుణకుమార్ (29) పశువులకు మేత వేసి వస్తానని చెప్పి పొలంలోకి వెళ్తుండగా ఆ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వేటగాళ్ళు అరుణకుమార్ మృత దేహాన్ని సుమారు అర పర్లాంగ్ దూరం ఈడ్చుకు వెళ్ళి మరో రైతు పొలంలో పడేసి పరారయ్యారు. బుధవారం ఉదయం పొలంలో మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్నిపరిశీలించి కేసు నమోదు చేశారు.