
సీతమ్మధార(విశాఖ ఉత్తర): ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సీతమ్మధార, ఏఎస్‌నగర్ సమీపంలో ఆదర్శనగర్‌కు చెందిన జోషెఫ్ లివింగ్‌స్టన్ (26) ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్టారెంట్ స్టోర్ రూంలో ఫ్యాన్‌కు వైర్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ముందుగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో తీసి తన స్నేహితురాలు లక్ష్మి అనే యువతికి పంపించాడు. అది చూసిన ఆ అమ్మాయి వీడియోని రెస్టారెంట్‌లో పని చేస్తున్న యువకుడికి పంపించింది.
అతను విషయాన్ని జోషెఫ్ సోదరుడు జాన్‌సన్‌కు తెలియజేయడంతో వారంతా రెస్టారెంట్ వెనుకవైపు వెళ్లి చూశారు. ఫ్యాన్‌కు వేలాడుతూ జోషెఫ్ కనిపించడంతో తలుపులు పగలకొట్టి కిందకు దించారు. అప్పటికే మృతి చెందడంతో అతని సోదరుడు జాన్‌సన్ ద్వారకా పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment