నరసన్న (ఫైల్)
కోసిగి(కర్నూలు జిల్లా): పొలాల్లో ఆరబోసిన ఉల్లి గడ్డలను అపహరించేందుకు వచ్చాడనే అనుమానంతో రైతులు ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయడంతో మృతి చెందాడు. కోసిగి సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ ధనుంజయ తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం కపటి నాగాలపురం గ్రామానికి చెందిన ఢణాపురం నసరన్న(55) శనివారం సాయంత్రం కోసిగిలో జరిగిన సిద్ధరూఢ స్వామి జాతరకు వెళ్లాడు. రాత్రి కావడంతో ఆశ్రమంలోనే నిద్రపోయాడు.
ఆదివారం తెల్లవారుజామున సజ్జలగుడ్డం గ్రామానికి వెళ్లే రోడ్డులో కాల్వలో సాన్నం చేసేందుకు అడ్డదారిలో పొలాల్లో వెళ్తుండగా.. ఆరబెట్టిన ఉల్లి పంటకు కాపలా ఉన్న రైతులు చీకటిలో అతడిని దొంగగా అనుమానించి చితక బాదారు. తీవ్రంగా గాయ పడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో 108లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వ్యక్తి మృతికి కారణమైన రైతులు కిందిగేరి ఈరన్న, కపటి ఈరన్న, కోసిగయ్య, తాయన్నతో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు.
చదవండి:
చూస్తుండగానే రైతును నీళ్లల్లోకి లాక్కెళ్లిన మొసలి
రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా
Comments
Please login to add a commentAdd a comment