ప్రతీకాత్మక చిత్రం
మైసూరు(కర్ణాటక): పుట్టిన రోజు నాడు ఆ ఇంట విషాదం తాండవించింది. అన్న తమ్ముడు గొడవ పడి అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు నగరంలోని మండి మొహల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడు దర్శన్ (21). ఫ్లెక్సీ బ్యానర్ల సెంటర్‌లో పనిచేసే దర్శన్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి ఇంటి వద్ద గొడవ చేస్తుంటాడు.
ఇంట్లోనివారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినేవాడు కాదు. శనివారం పుట్టినరోజు కావడంతో ఫుల్లుగా తాగి వచ్చి ఇంట్లో రగడ పడగా అతని తమ్ముడు మందలించాడు. నాకే బుద్ధిమాటలు చెబుతావా? అని అతనితో పోట్లాట పడ్డాడు. ఆ ఆగ్రహంలో దర్శన్ కేక్ తీసుకొని వచ్చి కట్ చేసి, తరువాత గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
చదవండి: భార్య వేధిస్తోంది.. భర్త ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాకే..?
Comments
Please login to add a commentAdd a comment