మహిళతో వెటర్నరీ అటెండర్‌ సన్నిహిత సంబంధం.. చివరికి ట్విస్ట్‌ | Man Commits Suicide At Friend House In Nellore | Sakshi
Sakshi News home page

మహిళతో వెటర్నరీ అటెండర్‌ సన్నిహిత సంబంధం.. చివరికి ట్విస్ట్‌

Published Sat, Aug 13 2022 11:12 AM | Last Updated on Sat, Aug 13 2022 11:35 AM

Man Commits Suicide At Friend House In Nellore - Sakshi

ఆమెతో శ్రీనివాసులు సన్నిహితంగా ఉంటూ ఇటీవల ఇంటికొచ్చారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

నెల్లూరు(క్రైమ్‌): స్నేహితురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం అంబవరానికి చెందిన శ్రీనివాసులు (40) వెటర్నరీ ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. అదే మండలానికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా శెట్టిగుంటరోడ్డులోని వైటీనాయుడి వీధి సమీపంలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు.
చదవండి: సివిల్స్‌ కోచింగ్‌ కోసం వచ్చి.. జల్సాల మత్తులో ‘లక్ష్యం చెదిరింది’

ఆమెతో శ్రీనివాసులు సన్నిహితంగా ఉంటూ ఇటీవల ఇంటికొచ్చారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై సదరు మహిళను పోలీసులు విచారించగా.. తాను పనిపై బయటకెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దీంతో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకీ తరలించారు. కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.  సదరు మహిళను పోలీసులు విచారిస్తున్నారు.

    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement