![Extra Marital Affair: Woman Commit Suicide In Warangal - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/30/marital.jpg.webp?itok=MlfD8Huo)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, భీమదేవరపల్లి(వరంగల్): ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపం చెందిన యువతి క్రిమిసంహరక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ముల్కనూర్‌లో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ముల్కనూర్ ఎస్సై సురేష్ చెప్పిన వివరాల ప్రకారం .. ముల్కనూర్ బుడ్గజంగాల కాలనీకి చెందిన పస్తం సుజాత(28)కు వివాహం కాగా భర్త నుంచి విడాకులు తీసుకుని మంచిర్యాలలో నివాసముంటోంది.
అక్కడే మహ్మద్ షకీర్ అనే వ్యక్తితో సుజాతకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని మహ్మద్ షకీర్ చెప్పడంతో ఇద్దరూ ఏడాది కాలంగా సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల సుజాత పెళ్లి చేసుకోవాలని కోరడంతో అతను నిరాకరించాడు.
దీంతో మానసిక వేదనకు గురైన ఆమె ఈ నెల 28న ముల్కనూర్‌కు వచ్చి, అదే రోజు సాయంత్రం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు 108 ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చదవండి: వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్..
Comments
Please login to add a commentAdd a comment