![Mahabubnagar: Woman Assassinated Son With Help Of Lover - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/3/crime.gif.webp?itok=k7AdqQHk)
సాక్షి, మహబూబ్‌నగర్: తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి ఓ తల్లి కన్న కొడుకును హత్య చేసింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో జరిగింది. హన్వాడ ఎస్‌ఐ రవి కథనం ప్రకారం.. టంకర గ్రామానికి చెందిన వెంకటే‹Ù(26) బుడగ జంగం వృత్తి చేస్తూ ఉండేవాడు. అతని తండ్రి పాపయ్య ఆరేళ్ల కిందట మృతి చెందాడు. వెంకటేష్ తల్లి దాయమ్మ అదే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో శ్రీను పలుమార్లు ఇంటికి వచ్చేవాడు.
‘మా ఇంటికి ఎందుకు వస్తున్నావ’ని శ్రీనుతో వెంకటేష్ గొడవపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున శ్రీను, అతని అన్న అల్లుడు నర్సింహతో కలిసి దాయమ్మ కోసం వాళ్ల ఇంటికి వచ్చారు. మరోసారి వెంకటేష్ వారితో గొడవపడ్డాడు. దీంతో శ్రీను, నర్సింహ, దాయమ్మలు కలిసి వెంకటేష్‌ను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో పడేశారు. ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
చదవండి: భర్త అల్లిన కట్టుకథ.. మహిళ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment