60 ఏళ్ల వృద్ధుడితో యువతి వివాహేతర సంబంధం..చివరికి..! | Woman Extra Marital Affair in 60 year Old Man | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల వృద్ధుడితో యువతి వివాహేతర సంబంధం..చివరికి..!

Published Tue, Nov 26 2024 1:11 PM | Last Updated on Wed, Nov 27 2024 6:53 AM

Woman Extra Marital Affair in 60 year Old Man

అన్నానగర్‌: వేలచ్చేరిలోని ఓ హాస్టల్‌లో వృద్ధుడితో కలిసి ఉన్న యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాలు.. చెన్నైలోని వేలాచ్చేరి  తరమణి 100 అడుగుల రోడ్డులోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో 60 ఏళ్ల వృద్ధుడితో కలిసి ఉంటున్న 27 ఏళ్ల యువతి ఛాతీ నొప్పితో మృతి చెందినట్లు వేలచ్చేరి పోలీసులకు సోమవారం  సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మహిళ మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాయ పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

విచారణలో వృద్ధుడు చిందాద్రిపేటకు చెందిన జ్యోతి (60) అని తేలింది. ఇతడికి విల్లివాకానికి చెందిన శశికళ(50)తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం ఆమె చనిపోయింది. శశికళ రెండో కూతురు రమ్య(27). భర్త నుంచి విడిపోయి తల్లి ఇంట్లో ఉంటోంది. ఈమెకు జ్యోతితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం ఇద్దరూ హోటల్‌కి వచ్చి రూమ్‌ తీసుకున్నారు. రమ్యకు మద్యం సేవించే అలవాటు ఉందని తెలుస్తోంది. హోటల్‌ కు చేరుకోగానే 6 సీసాల బీరు కొన్నారు. రమ్య రాత్రి 4 బీర్లు తాగింది. అనంతరం ఇద్దరూ నిద్రపోయారు.

సోమవారం ఉదయం మళ్లీ రమ్య 2 సీసాల బీరు తాగిన తర్వాత ఛాతీ నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా రమ్య మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న వేలాచ్చేరి పోలీసులు రమ్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత హత్య చేశారా? లేక అధిక మోతాదులో మద్యం తాగడం వల్ల చనిపోయిందా? మరేదైనా కారణమా? అనేది తేలుతుందని పోలీసులు తెలిపారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement