
ప్రతిమ (ఫైల్)
విడవలూరు(బుచ్చిరెడ్డిపాళెం)/నెల్లూరు జిల్లా: ఉరేసుకుని అరగల ప్రతిమ (21) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలోని హరివిల్లు లేఅవుట్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై వీరప్రతాప్ కథనం మేరకు.. అల్లూరు మండలం, గోగులపల్లికి చెందిన అరగల శ్రీనివాసులు, గ్రేసమ్మ దంపతులు రోజువారీ కూలీలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె ప్రతిమ డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.
చదవండి: షాకింగ్ ఘటన.. స్నేహితురాలితో కలిసి స్కూటీపై వెళ్తుండగా..
వీరంతా రెండు సంవత్సరాల క్రితం బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ప్రతిమ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. తల్లి గ్రేసమ్మ ఇంట్లోకి వచ్చే సరికి కుమార్తె ఉరి వేసుకుని మృతిచెంది ఉండటంతో బోరున విలపించింది. సంఘటనా స్థలంలో ‘అక్కా.. అమ్మ నాన్నను బాగా చూసుకో, సారీ మీ మాట విననందుకు’ అని గోడమీద రాసి ఉంది. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment