![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/7/crime%20news.jpg.webp?itok=q1IOjhs3)
నిజామాబాద్: ఇందల్వాయి గ్రామానికి చెందిన గుండాల అశ్మిత(18) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. అశ్మిత ఇంటర్ చదువుతోంది.
ఆమెకు ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. ఇంట్లో వారు గమనించి చికిత్స నిమిత్తం నిజామాబాద్ తరలించగా ఆస్పత్రిలో మృతి చెందింది. కాగా అశ్మిత తండ్రి కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment