నవీన్ (ఫైల్)
చిక్కబళ్లాపురం(కర్ణాటక): పెళ్లయి పిల్లలు ఉన్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మరో వివాహిత వెంటపడి ఆమె నిరాకరించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలు...నగరంలోని కోటె ప్రాంతంలో నివాసం ఉంటున్న నవీన్ (27) వివాహితుడు. కార్పెంటర్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. జీవితం సజావుగా సాగుతుండగా దుర్బద్ది పుట్టింది. తన ఇంటి సమీపంలోని ఓ వివాహితురాలిని ప్రేమించాలని వేధించేవాడు. ఏకంగా సదరు మహిళ ఇంటికి వచ్చి భర్త ఎదుటే తనను ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి.
ప్రేమను అంగీకరించపోతే చనిపోతా:
ఇటీవల నవీన్ సదరు వివాహిత ఇంటికి వచ్చి తనను ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించాడు. ఆమె ఎదుటే బాటిల్‌తో తలపై కొట్టుకున్నాడు, ఆమె పేరును కూడా చెక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే నవీన్ తల్లి కాశీ యాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి ఇంటిలో ఉరి వేసుకున్నాడు. నగర పోలీసులు అనుమానాస్పద మృతి కేసును నమెదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: ఏఎస్‌ఐ కుమార్తె ఆత్మహత్య.. కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment