![Young Woman Silent Fighting In Husband House](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/6555.jpg.webp?itok=1h2cJ8Cp)
ప్రేమించి పెళ్లాడి ముఖం చాటేశాడని భర్తపై ఆరోపణ
అత్తవారింటి వద్ద ధర్నా
కె.కోటపాడు: ప్రేమించి పెళ్లి(Love marriage) చేసుకున్న తరువాత తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న నెపంతో ముఖం చాటేసిన భర్త గుదే సురేష్ వైఖరికి నిరసనగా స్వాతి(Swathi) అత్తవారింటి వద్ద మౌన పోరాటానికి దిగింది. పదేళ్ల ప్రేమకు ఫలితం ఇదేనా అని ఆమె భర్తను ఆవేదనగా ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ.. మధురవాడ ప్రాంతానికి చెందిన తాను, రొంగలినాయుడుపాలెం గ్రామానికి చెందిన సురేష్ విశాఖపట్నం కృష్ణా కళాశాలలో కలిసి చదువుకున్నామని, 2013 నుంచి తమకు పరిచయం ఉందని తెలిపింది.
తనను ప్రేమిస్తున్నట్లు సురేష్ తెలపడంతో ఇద్దరం ఇష్టపడినట్లు పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 9న మధురవాడలో రిజిస్టర్డ్ పెళ్లి చేసుకున్నామని, అదే ప్రాంతంలో అద్దె ఇంటిలో కాపురం సాగించామని ఆమె తెలిపింది. తన తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేదంటూ సురేష్ తమ ఇంటికి గత ఏడాది డిసెంబర్ నుంచి రావడం లేదని ఆమె పేర్కొంది.
దీంతో కె.కోటపాడు మండలం రొంగలినాయుడుపాలెంలో గ్రామ పెద్దలకు సురేష్‌తో జరిగిన వివాహం గురించి తెలిపి ఇద్దరినీ ఒక్కటి చేయాలని కోరినట్టు స్వాతి తెలిపింది. భర్త నుంచి తనను వేరు చేసి తన జీవితాన్ని అన్యాయం చేయవద్దని ఆమె కోరింది. బాధితురాలికి న్యాయం జ రిగేంత వరకూ పోరాటం చేయనున్నట్లు విశాఖపట్నం, కె.కోటపాడు సీఐటీయూ నాయకులు పి.రాజ్‌కుమా ర్, ఎర్రా దేముడు, గండి నాయుడుబాబు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment