Suresh
-
ఆ హీరోయిన్ తో ప్రేమ.. అసలు విషయం బయటపెట్టిన సురేశ్!
-
ఆ హీరోయిన్‌తో ప్రేమ.. అసలు విషయం బయటపెట్టిన సురేశ్!
టాలీవుడ్ సీనియర్ నటుడు సురేశ్(Suresh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో ఒక నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్లో దాదాపు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు.ఒకప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు సురేశ్. మొదట్లో హీరోగా, తర్వాత విలన్‌గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. గతంలో.. నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి పలువురు స్టార్లకు తన గొంతు అరువిచ్చాడు కూడా. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సురేశ్ ఆయన తమిళంలో కూడా సత్తా చాటారు. అటు బుల్లితెరపై సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేశ్ తన కెరీర్లో జరిగిన సంఘటనలపై మాట్లాడారు. ముఖ్యంగా మరో నటి, అత్తారింటికి దారేది చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నదియా(Nadiya) గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో హీరోయిన్గా ఉన్న నదియాతో సురేశ్ లవ్‌లో ఉన్నారని వినిపించాయి కదా? దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నంచిగా ఆయన క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: వేరే పెళ్లి చేసుకున్నా అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లోనే ఉంటా!)ఈ విషయంపై సురేశ్ మాట్లాడుతూ..'అలాంటిదేం లేదు. నదియా నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెతోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరు కూడా దాదాపుగా నా పేరు లాగే ఉండేది. నదియా బాయ్‌ఫ్రెండ్ పేరు శిరీశ్. తను షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం శిరీశ్తోనే ఫోన్ మాట్లాడేది. అది చూసి అందరూ నాతోనే మాట్లాడేవారని అనుకునేవారు. కానీ తర్వాత నదియా అతన్ని పెళ్లి చేసుకుంది. నదియా నాకు సిస్టర్‌తో సమానం. తాను సినిమాలో సాఫ్ఠ్గా ఉన్నప్పటికీ.. నాతో మాత్రం కాస్తా గట్టిగానే మాట్లాడుతుంది. తను జీవితంపై ఫుల్ క్లారిటీతో ఉండేది. సినిమాల్లో నటిస్తూనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చెప్పేది. ఆ తర్వాత కూడా మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పింది' అని అన్నారు.తామిద్దరం ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నామని సురేశ్ అన్నారు. మా 1980 నటీనటులకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని ఆయన అన్నారు. ఆ వాట్సాప్ గ్రూప్‌లో రజనీకాంత్ సర్ కూడా ఉన్నారని సురేశ్ వెల్లడించారు.సురేశ్ సినీప్రస్థానం..ఏపీలోని శ్రీకాళహస్తిలో జన్మించిన సురేశ్ తమిళ చిత్రంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1981లో పన్నీర్ పుష్పంగల్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో రామదండు అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన కెరీర్లో పలు చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. తెలుగులో జిన్నా, స్పై చిత్రాల్లో కనిపించిన సురేశ్.. చివరిసారిగా రివైండ్ అనే మూవీలో నటించారు. కాగా.. హరితా రెడ్డిని పెళ్లాడిన సురేశ్.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత సురేశ్ రెండో పెళ్లి చేసుకున్నారు. దర్శక రచయిత్రి రాశిని ఆయన పెళ్లాడారు. -
జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్యలో విస్తుగొలిపే విషయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిన విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కక్షగట్టి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్‌ను చంపేసిన ఉదంతంలో విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. పోస్ట్‌మార్టమ్ నివేదికలో విస్మయకర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముకేశ్‌ను చిత్రవధ చేసి అంతంచేశారని, చంపేశాక మృతదేహంపైనా తమ పట్టరాని ఆవేశాన్ని చూపించారని పోస్ట్‌మార్టమ్ నివేదిక పేర్కొంది. ముకేశ్ మృతదేహాన్ని బీజాపూర్ జిల్లా కేంద్రంలోని చఠాన్పారా బస్తీ ప్రాంతంలోని ప్రధాన నిందితుడికి చెందిన ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో కనుగొన్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం హంతకులు మృతదేహం నుంచి గుండెను వేరేచేసి, కాలేయాన్ని నాలుగు ముక్కలుచేశారు. తలలో 15 చోట్ల విరిగిన గుర్తులున్నాయి. మెడ విరిగిపోయింది. ఐదు పక్కటెముకలు, మెడ ఎముకలు విరిగిపోయాయి. చేయి విరిచేశారు. తల, ఛాతి, వీపు, పొట్టపై తీవ్రమైన గాయాలున్నాయి. ఇనుప రాడ్డు వంటి బలమైన ఆయుధంతో కొట్టిన గుర్తులున్నాయి. చేతిపై ఉన్న ఒకే ఒక్క పచ్చబొట్టు సాయంతో మృతదేహం ముకేశ్‌దే అని గుర్తించగలిగారు. తమ 12 ఏళ్ల పోస్ట్‌మార్టమ్ కెరీర్లో ఇంతటి దారుణమైన హత్యను చూడలేదని వైద్యులు తెలిపారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది కలిసి హత్య చేసి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులు రితేశ్ చంద్రకర్, దినేశ్ చంద్రకర్, మహేంద్రలను అరెస్ట్‌చేశారు. ప్రధాన నిందితుడు సురేశ్ సైతం మృతుడికి దూరపు బంధువుకావడం గమనార్హం. బీజాపూర్ రోడ్డు పనులపై నోరు మెదపకుండా ఉండేందుకు మాట్లాడాలంటూ సురేశ్ సోదరుడు రితేశ్ ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యాక ముకేశ్ కనిపించకుండా పోయాడని, అతని మొబైల్ స్విచ్చాఫ్ వస్తోందని ముకేశ్ అన్న యుకేశ్ డిసెంబర్ 25న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేయగా హత్య విషయం బయటికొచ్చింది.ప్రధాన నిందితుడు హైదరాబాద్‌లో అరెస్ట్వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అయిన సురేశ్ చంద్రకర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్‌చేసింది. హత్య జరిగిన జనవరి ఒకటో తేదీ నుంచి తప్పించుకు తిరుగుతున్న సురేశ్‌ను అతని డ్రైవర్‌కు చెందిన ఇంట్లో ఎట్టకేలకు అరెస్ట్చేశామని సిట్ ఇన్చార్జ్ పోలీసు అధికారి మయాంక్ గుర్జార్ సోమవారం వెల్లడించారు. సురేశ్‌ను బీజాపూర్‌కు తీసుకొచ్చామని, విచారణ కొనసాగుతోందని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ చెప్పారు. నిందితులు రితేశ్, దినేశ్‌లు హతుడు ముకేశ్‌కు వరసకు సోదరులుకాగా మహేంద్ర రామ్‌టెకె సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. రాత్రి భోజనం చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా గొడవపడి ఈ ముగ్గురూ చంపేశారని తెలుస్తోంది. తర్వాత మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి సిమెంట్‌తో కప్పేశారు.సొంత యూట్యూబ్ చానల్బీజాపూర్లో దాదాపు రూ.120 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులో భారీ అవకతవకలు జరిగాయని ఎన్డీటీవీ టీవీఛానెల్ తరఫున ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా చేసే 33 ఏళ్ల ముకేశ్ సొంతంగా ‘బస్తర్ జంక్షన్’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను విజయవంతంగా నడుపుతున్నాడు. 2021లో బీజాపూర్‌లో తకల్గూడలో భద్రతాబలగాలపైకి మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. సీఆర్పీఎఫ్ జవాను, కోబ్రా కమాండర్ అయిన రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను బంధించి మావోలు తీసుకెళ్లగా చర్చలు జరిపే ఏప్రిల్‌లో విడిపించడంలో ముకేశ్ కీలకపాత్ర పోషించారు. ముకేశ్ మరణవార్త తెల్సి మహర్ వర్గీయులు సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నివాళులర్పించారు. నిందితులకు కఠిన శిక్ష అమలుచేయాలని డిమాండ్‌చేశారు. రాయ్‌పూర్ ప్రెస్‌క్లబ్‌లో వందలాది పాత్రికేయులు ధర్నాచేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. కేసు వివరాలను నివేదిక ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని పీసీఐ ఛైర్పర్సన్ జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ ఆదేశించారు. ది ప్రెస్ అసోసియేషన్ అండ్ ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సైతం పారదర్శక దర్యాప్తునకు డిమాండ్‌చేశాయి. -
రాజకీయ కక్షతోనే YSRCP కార్పొరేటర్ సురేష్ పై రౌడీషీట్
-
అందరూ చూస్తుండగానే ప్రాణాలు తీశాడు..
తడ : వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. అందరూ చూస్తుండగానే సహోద్యోగిని కత్తెరతో విచక్షణ రహితంగా పొడిచేశాడు. తిరుపతి జిల్లా తడ మండల పరిధిలోని మాంబట్టు ప్రభుత్వ పారిశ్రామిక వాడలోని అపాచీ బూట్ల పరిశ్రమల్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు.. చిట్టమూరు మండలం కుమ్మరిపాళేనికి చెందిన వెంకటాద్రి.. అదే గ్రామానికి చెందిన ఎర్రబోతు వనజ(28)ను ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా, బురదగాలి గ్రామానికి చెందిన మీజూరు సురేష్(23) కుమ్మరిపాళేనికి వచ్చి స్థిరపడ్డాడు. అక్కడి నుంచే అపాచీలో పనికి వెళ్తున్నాడు. కొంత కాలంగా వనజను వేధించడం మొదలెట్టాడు. ఈ విషయంపై 2019, 2021లో చిట్టుమూరు పోలీస్ట్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇంకా కేసు నడుస్తోంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనానికి వెళ్లిన వనజను అక్కడ మళ్లీ వేధించాడు. దీంతో ఆమె సురేష్‌ను తీవ్రంగా మందలించింది. ఆవేశానికి గురైన సురేష్ అక్కడే ఉన్న కత్తెర తీసుకుని వనజ మెడ, శరీరంపై పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వనజ అక్కడే కుప్పకూలిపోగా.. తోటి కార్మికులు సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ కొండపనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మానవత్వమా.. కళ్లు మూసుకో!
నూజివీడు: టీడీపీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికార జులుంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన అచ్చి నాగరాజు సోమవారం మద్యం తాగి అదే గ్రామ టీడీపీ అధ్యక్షుడు అన్నే సురేష్‌కు ఫోన్ చేసి దూషించాడు. దీంతో సురేష్.. మరో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు పోలవరపు శివరామకృష్ణ, కారుమంచి రాజు, కారుమంచి కిరణ్‌లతో కలిసి నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా నాగరాజును తాళ్లతో బంధించి.. తీవ్రంగా దుర్భాషలాడుతూ ఈడ్చుకెళుతూ కారులో వేసుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే నాగరాజును తాళ్లతో నిర్బంధించి ఈడ్చూకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాపశివకిషోర్ దృష్టికెళ్లింది. అమానవీయంగా ప్రవర్తించిన నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు రూరల్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్బాబులు నలుగురినీ అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. -
రేపు నందిగం సురేష్ ను పరామర్శించనున్న YS జగన్
-
సురేశ్ జోడీ సంచలనం
నార్త్ కరోలినా: విన్స్టన్–సాలెమ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ విభాగంలో భారత టెన్నిస్ ప్లేయర్ దక్షిణేశ్వర్ సురేశ్ సంచలనం సృష్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో సురేశ్ (భారత్)–లుకా పౌ (బ్రిటన్) ద్వయం 6–4, 5–7, 10–8తో ఆరో సీడ్ బెహర్ (ఉరుగ్వే)–మొల్టెని (అర్జెంటీనా) జోడీని బోల్తా కొట్టించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో సురేశ్ జోడీ తొమ్మిది ఏస్‌లు సంధించింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. ‘సూపర్ టైబ్రేక్’లో సురేశ్–లుకా పౌ ద్వయం కీలకదశలో పాయింట్లు గెలిచిసంచలన విజయాన్ని ఖరారు చేసుకుంది. -
జాతీయ విద్యా విధానానికి అనుకూలమా..? వ్యతిరేకమా..?
-
ప్రేమోన్మాది ఆత్మహత్య
రాంబిల్లి (అచ్యుతాపురం): తన ప్రేమను నిరాకరించి, జైలుకు పంపిందనే పగతో 14 ఏళ్ల బాలికను ఐదురోజుల క్రితం హతమార్చిన ప్రేమోన్మాది చివరకు శవమై కనిపించాడు. అతని మృతదేహం బాలిక ఇంటి సమీపంలోని గడ్డిదుబ్బుల్లో లభ్యమైంది. అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, కొప్పుగొండుపాలెంలో బద్ది దర్శిని(14) అనే బాలికను ఈనెల 6వ తేదీ రాత్రి కశింకోట మండలానికి చెందిన సురేశ్ గొంతు కోసి హతమార్చాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్న అతనిపై దర్శిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. బాలికను రాంబిల్లి మండలంలో అమ్మమ్మ ఇంట చదివిస్తున్నారు. బెయిల్‌పై వచ్చిన సురేశ్, తనను జైలుకు పంపిందన్న కక్షతో దర్శినిని హతమార్చాడు. ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన లేఖలో ‘ఇద్దరం కలిసి ఉండాలి.. లేదా ఇద్దరం చనిపోవాలి’ అని పేర్కొన్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలానికి జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో గురువారం బాలిక ఇంటికి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో కొండలాంటి ప్రాంతంలో గడ్డిదుబ్బుల మాటున సురేశ్ శవమై కనిపించాడు. బుధవారం సాయంత్రం అక్కడికి సమీపంలోని రైతులకు దుర్వాసన వచ్చింది. అప్పటికే చీకటి పడటంతో మరుసటిరోజు ఉదయం పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు నేతృత్వంలోని బృందం శవాన్ని పరిశీలించి లభించిన ఆధారం మేరకు సురేశ్‌గా నిర్థారించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. సురేశ్ జేబులో కొంత నగదు, రాసిన లేఖ జిరాక్స్ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తున్న సమయంలో ఆ వాహనాన్ని దర్శిని కుటుంబీకులు అడ్డుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే... బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించి, బాలిక కుటుంబాన్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుడు మళ్లీ బాలిక వెంట పడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు రాంబిల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని, దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఘటన జరిగిన మర్నాడు అనకాపల్లిలో హోంమంత్రి అనితను విలేకరులు ప్రశ్నించగా, అలాంటిది జరిగినట్టు తన దృష్టికి రాలేదని, అదే నిజమైతే సంబంధిత పోలీస్ సిబ్బందిపై చర్యలు చేపడతామని చెప్పారు. చివరకు రాంబిల్లి ఎస్ఐ ముకుందరావును బుధవారం వీఆర్‌పై పంపారు. ఇంత జరిగినా బాలిక కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్పీకర్ పదవికి పోటీ.. ఓం బిర్లా x సురేష్
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్ పదవికి అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా పోటీ అనివార్యమైంది. కీలక నేతలను పాత పదవుల్లో కొనసాగిస్తున్న మోదీ 3.0 సర్కారు దానికి అనుగుణంగానే ఎన్డీఏ అభ్యర్ధిగా ఓం బిర్లాను మంగళవారం స్పీకర్ బరిలో నిలిపింది. ఓం బిర్లా 17వ లోక్‌సభలో ఐదేళ్లు స్పీకర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. విపక్ష ఇండియా కూటమి ఆఖరి నిమిషంలో.. కాంగ్రెస్ ఎంపీ కొడైకున్నిల్ సురేశ్‌ను రంగంలోకి దింపింది. పార్లమెంటరీ సంప్రదాయాలను అనుసరించి విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తే.. ఓం బిర్లాకు మద్దతు ఇస్తామని ఇండియా కూటమి షరతు పెట్టింది. అయితే బీజేపీ సీనియర్ నేతలు దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఉంటుందని, ఆ సందర్భం వచ్చినపుడు చూద్దామని బీజేపీ పేర్కొంది. దీనికి ఇండియా కూటమి నేతలు సమ్మతించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి కేటాయిస్తామని హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా పేరు ఖరారయ్యాక కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. చొరవ తీసుకొని విపక్షాలను సంప్రదించారు. రాజ్‌నాథ్ ఆఫీసులో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత టి.ఆర్.బాలు మంగళవారం సమావేశమయ్యారు. ఇరుపక్షాలు తమ తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. కొద్దిసేపట్లోనే ఈ భేటీ ముగిసింది. వేణుగోపాల్, బాలు అర్ధాంతరంగా సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. మూడుసార్లు ఎంపీ అయిన ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓం బిర్లా తరఫున 10కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో పాటు, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ (ఆర్) పార్టీలు ఓం బిర్లా తరఫున నామినేషన్లు దాఖలు చేశాయి. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత ఎంపీ కే.సురేష్ ఎనిమిదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. సురేష్ తరఫున మూడుసెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సంప్రదాయాన్ని పాటించడం లేదు: వేణుగోపాల్ విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించడం లేదని వేణుగోపాల్ ఆరోపించారు. ఓం బిర్లాపై తమ అభ్యర్ధిని పోటీకి నిలుపుతామని ప్రకటించారు. విపక్షం ఒత్తిడి రాజకీయాలకు దిగుతోందని, షరతులు పెడుతోందని కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, లలన్ సింగ్ (జేడీయూ)లు అన్నారు. డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే సమయం వచ్చినపుడు విపక్షాల డిమాండ్‌ను పరిశీలిస్తామని సీనియర్ మంత్రులు హామీ ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యం షరతులపై నడవదని పీయూష్ గోయల్ అన్నారు. ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు పోటీకి అంత సుముఖంగా లేనప్పటికీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మూడోసారి పోటీ స్పీకర్ ఎన్నిక బుధవారం జరుగుతుంది. ఒకవేళ పోటీ అనివార్యమైతే.. లోక్‌సభ చరిత్రలో స్పీకర్ పదవికి పోటీ జరగడం ఇది మూడోసారి అవుతుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1952, 1967, 1976లలో మాత్రమే స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. 1952లో కాంగ్రెస్ అభ్యర్థి జి.వి.మౌలాంకర్ 394 ఓట్లు సాధించి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి శాంతారాం మోరేకు కేవలం 55 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డితో తెన్నేటి విశ్వనాథం పోటీపడ్డారు. సంజీవరెడ్డికి 278 ఓట్లు రాగా, విశ్వనాథంకు 207 ఓట్లు పడ్డాయి. 1976లో జరిగిన ఎన్నిక పూర్తిస్థాయి స్పీకర్ పదవికి కాదు. 1975లో ఇందిగాంధీ దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. ఐదో లోక్‌సభ ఐదో సెషన్‌ను ఏడాది పాటు పొడిగించారు. అప్పటి స్పీకర్ జి.ఎస్.ధిల్లాన్ రాజీనామా చేయడంతో.. జనవరి 5, 1976న పొడిగించిన ఏడాది కాలానికి స్పీకర్ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నాయకుడు బలిరామ్ భగత్‌ను స్పీకర్ పదవికి ఇందిరా గాంధీ ప్రతిపాదించారు. జనసంఘ్ నాయకుడు జగన్నాథరావు జోషి బరిలో నిలువడంతో ఎన్నిక జరిగింది. బలిరామ్ భగత్‌కు 344 ఓట్లు రాగా, జోషికి 58 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులు ఉండగా, ఇండియా కూటమికి 233 (రాహుల్ గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో విపక్షాల బలం ఒకటి తగ్గింది) ఎంపీలున్నారు. అంతేకాకుండా ఇండియా కూటమికి ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుంది. సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నిక కావడం లాంఛనమే. బుధవారం ఓటింగ్ జరిగితే.. పేపర్ స్లిప్పులనే వాడనున్నారు. నూతన సభ్యులు ఎవరెక్కడ కూర్చోవాలో నిర్ణయించే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కాబట్టి ఎల్రక్టానిక్ ఓటింగ్ వ్యవస్థ సిద్ధంగా లేదు. ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికైతే.. రెండు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేసిన ఐదోవ్యక్తి అవుతారు. కాకపోతే గతంలో కాంగ్రెస్ నేత బలరాం జాఖడ్ ఒక్కరు మాత్రమే రెండుసార్లు (ఏడు, ఎనిమిదో లోక్‌సభల్లో) స్పీకర్‌గా పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేశారు. అది మా హక్కు: సురేష్ ‘గెలుస్తామా, ఓడుతామా అన్నది ముఖ్యం కాదు. అధికారపక్షం నుంచి స్పీకర్ ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలనేది సంప్రదాయం. గత రెండు లోక్‌సభల్లో మాకు పత్రిపక్ష హోదా లేదని డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు మేము గుర్తింపు పొందిన ప్రతిపక్షం. డిప్యూటీ స్పీకర్ పదవి మా హక్కు. కానీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. మంగళవారం 11:50 గంటల దాకా ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూశాం. ఎలాంటి సమాధానం రాలేదు’అని కే.సురేష్ అన్నారు. -
కానిస్టేబుల్ సురేష్‌కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్‌ను ప్రశంసించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కు వెళ్తున్న ఓ యువతిని కరెక్ట్ సమయంలో పరీక్షా కేంద్రానికి తరలించినందుకు సీఎం రేవంత్.. సురేష్‌ను అభినందించారు.కాగా, సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా.. ‘వాహనాల నియంత్రణ మాత్రమే…తన డ్యూటీ అనుకోకుండా… సాటి మనిషికి సాయం చేయడం…తన బాధ్యత అని భావించిన…ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు…నా అభినందనలు.సురేష్ సహకారంతో…సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి…యూపీఎస్సీ పరీక్షలో…విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ది బెస్ట్’ అంటూ కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Crime Control News (@crimecontrolnews)జరిగింది ఇది.. యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ యువతికి ఆలస్యం కావడంతో బైకుపై పరీక్షా సెంటర్ వద్ద దిగబెట్టాడు. మహవీర్ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష కేంద్రం ఉన్న ఓ యువతి.. ఆర్టీసీ బస్సులో మైలార్దేవుపల్లి పల్లెచెరువు బస్టాప్ వద్ద దిగారు. అక్కడి నుంచి పరీక్ష కేంద్రం చాలా దూరంలో ఉండటంతో సమయం మించిపోతుండటంతో ఆమె కంగారు పడ్డారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ఆమె ఆందోళనను గుర్తించి ఆమె వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. అనంతరం పోలీసు బైక్‌పై ఆమెను పరీక్షా కేంద్రం వద్ద దిగబెట్టారు. -
ఒడిశా సీఎంగా సురేశ్ పూజారి?
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 24 ఏళ్లకు బీజేపీ గెలుపు సొంతం చేసుకోవడం తెల్సిందే. ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించేదెవరన్న విషయంలో మాత్రం సందిగ్ధం కొనసాగుతోంది. అయితే, సీనియర్ నేత, తాజాగా ఎమ్మెల్యే సురేశ్ పూజారిని పార్టీ హైకమాండ్ ఢిల్లీకి రావాలంటూ కబురు పంపించింది. దీంతో, సీఎం పదవి ఆయనకే దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. శాసనసభా పక్ష నేత ఎవరనేది అధిష్టానమే చూసుకుంటుందని రాష్ట్ర వర్గాలు అంటున్నాయి. ఇలా ఉండగా, ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్ దృష్ట్యా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 10కి బదులుగా 12న చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. -
నాడు నాలుగు రూపాయల జీతం.. నేడు 22 రెస్టారెంట్లకు యజమాని!
ఎవరైనా సరే జీవితంలో ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా పనిలోకి దిగితే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరని అంటుంటారు. అటువంటి వారిని ఆర్ధిక ఇబ్బందులు కూడా ఏమీ చేయలేవని చెబుతుంటారు. కర్ణాటకలోని ఓ కుగ్రామానికి చెందిన సురేష్ పూజారి తాను ఏదో ఒకరోజు 22 రెస్టారెంట్లకు యజమానిని అవుతానని ఎన్నడూ అనుకోలేదు. సురేష్‌ను బాల్యంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. చదువు కొనసాగించేందుకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. అవి 1950 నాటి రోజులు.. పదేళ్ల వయసులోనే సురేష్ పూజారి కూలీగా మారాడు. ఊరిలో పెద్దగా పనులు దొరకకపోవడంతో ముంబైకి తరలివచ్చాడు. అప్పట్లో సురేష్‌కు ముంబై గురించి ఏమీ తెలియదు. ఎలాగోలా ఓ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చిన్న దాబాలో ఉద్యోగం సంపాదించాడు. రోజంతా అక్కడ పనిచేసినందుకు సురేష్‌కు నెలకు నాలుగు రూపాయలు అందేది.. అక్కడ రెండేళ్లు పనిచేశాడు. తర్వాత అతనికి తెలిసిన వ్యక్తి జ్యూస్ షాపులో ఉద్యోగం ఇప్పించాడు. జీతం పెద్దగా పెరగలేదు. కానీ అక్కడ పనిలో నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే సురేష్‌కు ఓ క్యాంటీన్లో ఉద్యోగం వచ్చింది. జీతం ఆరు రూపాయలకు పెరిగింది. చదువు లేకుండా ముందుకు సాగడం కష్టమని అర్థం చేసుకున్నాడు. దీంతో రాత్రిపూట పాఠశాలకు వెళుతూ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తన దగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో గిర్గామ్ చౌపటీ సమీపంలో సురేష్ ఒక చిన్న పావ్ భాజీ దుకాణాన్ని తెరిచాడు. నాటి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఒకసారి తన సురేష్ దుకాణంలో పావ్ భాజీ రుచి చూశారు. ఆ రుచి అతనికి బాగా నచ్చడంతో మళ్లీ మళ్లీ అక్కడికి రావడం మొదలుపెట్టారు. జార్జ్ ఫెర్నాండెజ్, సురేష్ పూజారి స్నేహితులు అయ్యారు. తదనంతర కాలంలో సురేష్ తయారు చేసే పావ్ భాజీకి జనం నుంచి అమితమైన ఆదరణ లభించింది. దీంతో ఆయన క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. కొద్ది కాలంలోనే అతని దుకాణాలు దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. నేడు సురేష్ పూజారి నెలకొల్పిన ‘సుఖ్ సాగర్’ రెస్టారెంట్ల గురించి తెలియనివారుండరు. దేశంలో 22కు మించిన సుఖ్ సాగర్ రెస్టారెంట్ బ్రాంచీలు ఉన్నాయి. సుఖ్ సాగర్ రెస్టారెంట్ దక్షిణ భారత ఆహారాలకు తోడు పావ్ భాజీ, పంజాబీ ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. ఐస్‌క్రీమ్ పార్లర్, షాపింగ్ మాల్, త్రీస్టార్ హోటల్ యజమానిగా సురేష్ పూజారి మారారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ సహా పలువురు స్టార్స్ సుఖ్ సాగర్ రెస్టారెంట్ రుచులను మెచ్చుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుంటూ, వ్యాపారంలో విజయం సాధించిన సురేష్ పూజారి యువతకు స్ఫూర్తిదాయకుడనడంలో ఏమాత్రం సందేహం లేదు. -
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 10) ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్‌గా పనిచేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇదీ చదవండి.. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు రిమాండ్ పొడిగింపు -
హతమార్చి వేములవాడ దర్శనానికి నిందితుడు! చివరికి..
కరీంనగర్: తన భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే నాగెల్లి భూమేశ్.. సురేశ్ అనే యువకుడిని హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం జరిగిన హత్య నేరానికి సంబంధించిన వివరాలను సోమవారం రాయికల్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన నాగెల్లి సురేశ్, నాగెల్లి భూమేశ్ వరుసకు అన్నదమ్ముల్లు. భూమేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో సురేశ్ భూమేశ్ భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా సురేశ్ పట్టించుకోలేదు. 2023 అక్టోబర్‌లో దుబాయ్ నుంచి ఇంటికి వస్తూనే సురేశ్‌ను చంపాలనే ఉద్దేశంతో వెంట కత్తి తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని గమనించాడు. దీంతో సురేశ్‌పై పగ పెంచుకుని, ఎలాగైనా చంపాలని అనుకుని ఈనెల 7న ఉదయం పొలం వద్దకు నీరు పెట్టడం కోసం సురేశ్ వెళ్లడాన్ని గమనించాడు. ప్లాన్ ప్రకారం కత్తిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లాడు. పొలానికి కొద్దిదూరంలో ఉన్న చెరువు కట్టపై ద్విచక్ర వాహనాన్ని పెట్టాడు. తన పొలానికి నీరు పెట్టేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్న సురేశ్‌ను ఆపి తాను పొలానికి వస్తున్నానని చెప్పాడు. పొలం గట్టుదగ్గర ద్విచక్ర వాహనాన్ని ఆపగానే భూమేశ్ వెంట తెచ్చుకుని కత్తితో సురేశ్ తల, మెడపై విచక్షణరహితంగా నరికాడు. కిందపడిన సురేశ్ ప్రాణభయంతో బావి వైపు పరుగెత్తుతుండగా మరోసారి నుదుటిపై, తలపై కత్తితో నరికాడు. దీంతో తీవ్రంగా గాయాలైన సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సురేశ్ మృతదేహాన్ని అదేబావిలోకి తోసేశాడు. కత్తిని కూడా అదే బావిలో పడేశాడు. రక్తం మరకలు శుభ్రం చేసుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికొచ్చి స్నానం చేసి అనంతరం వేములవాడ రాజన్న (శివరాత్రి జాతర) దర్శనానికి వెళ్లాడు. సురేశ్ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే సురేశ్ బావిలో శవమై కనిపించాడు. హత్య విషయాన్ని తెలుసుకున్న రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్, ఎస్సై అజయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సురేశ్ తల్లి నాగేల్లి లక్ష్మి భూమేశ్‌పై అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భూమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిచ్చిన సమాచారం మేరకు బావిలో పడేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య సమయంలో వినియోగించిన రెండు మొబైల్స్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకున్న సీఐ, రాయికల్ ఎస్సైలను డీఎస్పీ అభినందించారు. ఇవి చదవండి: పెళ్లి పేరుతో సీరియల్ నటి మోసం -
నేడు బీజేపీలోకి కాంగ్రెస్ దిగ్గజ నేత!
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి, కమలదళంలో చేరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ పచౌరీ కూడా కాంగ్రెస్‌ను వీడారు. సురేష్ పచౌరీ నేడు (శనివారం) భోపాల్‌లో జరగనున్న ఒక కార్యక్రమంలో బీజేపీలో చేరబోతున్నారు. 1972లో ఆయన ఇండియన్ యూత్ కాంగ్రెస్‌లో చేరి, తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1981లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1983 వరకు ఈ పదవిలో కొనసాగారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ పచౌరీ 1984లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై, ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ నేత సురేష్ పచౌరీ 1984,1990, 1996, 2002లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగానూ పనిచేశారు. -
చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి
కరీంనగర్: చేపల వేట కు వెళ్లి ఓ యువకుడు కాలువలోపడి మృతి చెందాడు. రామగుండం కార్పొరేషన్‌లోని ఐదో డివిజన్ మల్కాపూర్ గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన పిట్టల సురేశ్(30) ఆదివారం సమీపంలోని ఎన్టీపీసీ వరద కాలువలో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవాశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి తల్లి పిట్టల బాయమ్మ తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు గాలింపు చేపట్టి సురేశ్ కాలువలో పడిమృతి చెందాడని గుర్తించారు. ఈమేరకు బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి తీవ్ర విషాదం! -
కాకర్ల ఎలా గెలుస్తారో నేను చూస్తా..
ఉదయగిరి: టీడీపీ ఉదయగిరి టికెట్ కాకర్ల సరేష్‌కు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి బొల్లినేని రామారావు అధిష్టానంపై ఫైర్ అయ్యారు. ‘కాకర్ల ఎలా గెలుస్తారో నేను చూస్తా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నా సత్తా ఏంటో చూపిస్తా.. పన్నెండేళ్లుగా పార్టీ కోసం సర్వం అర్పించా.. ఉదయగిరిలో పార్టీకి దిక్కు లేని సమయంలో పార్టీని, క్యాడర్‌ను కాపాడుకున్నా.. ఆర్థికంగా ఎంతో నష్టపోయా.. ఇప్పుడు డబ్బు సంచులకు అమ్ముడుపోయి, కనీసం రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఉదయగిరి టికెట్ ఇచ్చి నా గొంతు కోశారు..’ అంటూ తన ఆంతరంగికుల వద్ద బొల్లినేని రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరిలో బొల్లినేని శుక్రవారం టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు తనను మోసం చేయరు అని చెప్పి 12 గంటలు గడవక ముందే నియోజకవర్గ అభ్యర్థిగా కాకర్ల సురేష్ పేరు ప్రకటించడంతో బొల్లినేని షాక్‌కు గురయ్యారు. నమ్మిన వారిని నట్టేట ముంచే గుణం ఉన్న చంద్రబాబు బొల్లినేని విషయంలో అలాగే చేశారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఉదయగిరి నుంచి మా నాయకుడు బొల్లినేని బరిలో ఉంటారు.. ఇక్కడ చంద్రబాబు ఆటలు సాగవు.. కాకర్ల సురేష్ పేరును వెంటనే విత్‌డ్రా చేసుకుని బొల్లినేనిని అభ్యర్థిగా ప్రకటించాలి.. లేకపోతే మా సత్తా ఏంటో ఎన్నికల్లో చూపిస్తాం..’ అంటూ బొల్లినేని అనుచర వర్గం తీవ్ర ఆగ్రవేశాలతో రగిలిపోతున్నారు. ఉదయగిరిలో ఎన్ని ఊర్లు ఉన్నాయో, ఏ పంచాయతీలో టీడీపీ నాయకుడు ఎవరో కూడా తెలియని వ్యక్తికి టికెట్ ఎలా ప్రకటిస్తారంటూ టీడీపీ అధిష్టానంపై విరుచుకుపడుతున్నారు. ‘లోకేశ్ డబ్బులు తీసుకొని టికెట్ అమ్ముకున్నారు.. కాకర్లను ఎలా గెలిపిస్తారో చూస్తాం.. మీరేమీ అధైర్యపడొద్దు’ అంటూ బొల్లినేనికి ఆయన అనుచరులు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై ఫైర్ టీడీపీ జాబితా మరో గంటలో ప్రకటించే ముందు చంద్రబాబు బొల్లినేనికి ఫోన్ చేసి.. ‘కాకర్ల సురేష్‌కు ఉదయగిరి టికెట్ ఇస్తున్నాం.. మీకు రాజ్యసభ సీటు ఇస్తాం’ అని చెప్పబోతుండగా బొల్లినేని తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఇన్నేళ్లుగా తనను వాడుకొని, ఇప్పుడు కరివేపాకులా తీసిపడేయడం ఏంటని గట్టిగా అధినేతపై ఫైర్ అయినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు వారించేందుకు ప్రయత్నించగా.. ఉదయగిరిలో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ బొల్లినేని ఫోన్ కట్ చేసినట్లు సమాచారం. వెంటనే తన అనుచరులతో మాట్లాడుతూ ‘కాకర్లను ఓడించి తీరాలి.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి మన సత్తా చూపిద్దాం..’ అని బొల్లినేని అన్నట్లు తెలిసింది. త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అనుచరులతో అన్నట్లు సమాచారం. చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని జీర్ణించుకోలేని బొల్లినేని వైఎస్సార్పీపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. రాజీనామా బాటలో బొల్లినేని అనుచరులు టీడీపీ ఉదయగిరి టికెట్ కాకర్ల సురేష్‌కు ప్రకటించడంతో తీవ్రంగా రగిలిపోతున్న బొల్లినేని అనుచరుల్లో కొంతమంది ఆ పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. టీడీపీ దుత్తలూరు మండల కేంద్రం ఇన్చార్జి కండగుంట్ల వెంకటరెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరి కొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. పలు మండలాల్లో ఆదివారం సమావేశాలు నిర్వహించి పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్లు అసమ్మతి నేతలు చెబుతున్నారు. మొత్తమ్మీద ఉదయగిరి టీడీపీ టికెట్ ప్రకటన కాకర్ల వర్గీయుల్లో ఆనందాన్ని నింపితే.. బొల్లినేని వర్గీయులను నిరుత్సాహానికి గురిచేసింది. ఈ పరిణామం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
Maithili: 'ఎకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్' గా.. వేగాన్ లెదర్!
"ఒక చదరపు మీటరు లెదర్ తయారయ్యే ప్రక్రియలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ఎంతో ఊహించగలరా? అక్షరాలా 17 కిలోలు. లెదర్ బ్యాగ్‌లు, షూస్, బెల్టులు, పర్సులు, వాచ్‌ల మీద మనకున్న మక్కువ తక్కువేమీ కాదు. కానీ పర్యావరణానికి ఇంత చేటు చేస్తుందని తెలిసిన తర్వాత వాటి వాడకాన్ని ప్రోత్సహించలేం, మమకారాన్ని చంపుకోలేం. అన్నింటికీ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నాం కదా! దీనికి కూడా ఓ మార్గం కనిపించకపోతుందా! సరిగ్గా ఇలాగే ఆలోచించిన మైథిలి పోకచెట్టు బెరడుతో ఓ ప్రత్యామ్నాయాన్ని మన ముందుకు తెచ్చారు. అదే వేగాన్ లెదర్. వేగాన్ లెదర్‌ని ఎకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్గా పరిచయం చేస్తున్నారు మైథిలి." తిరిగి ఇచ్చేద్దాం! మైథిలిది కర్నాటకలోని శృంగేరి. ఆమె భర్త సురేశ్‌తో కలిసి ‘భూమి ఆగ్రో వెంచర్స్’ పేరుతో వేగాన్ లెదర్ తయారీ పరిశ్రమను స్థాపించారు. ఈ ప్రయత్నం కేవలం పర్యావరణహితం కోసం, మనుషులను పర్యావరణ హిత జీవనశైలి దిశగా నడిపించడమేనన్నారామె. కంప్యూటర్స్‌తో మొదలు పెట్టిన కెరీర్ వేగాన్ లెదర్ పరిశ్రమ వైపు మలుపు తీసుకోవడాన్ని వివరించారామె. మాది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలో లక్షలాది ఎకరాల్లో పోక చెట్లను పెంచుతారు. మేము చదువు పూర్తయిన తర్వాత శివమొగ్గలో కంప్యూటర్ సేల్స్, సర్వీసెస్ వ్యాపారం మొదలుపెట్టాం. పాతికేళ్లపాటు విజయవంతంగా నిర్వహించాం. ఇక మా వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందనే అభి్రపాయానికి వచ్చాం. అలాంటి సమయంలో ఓ సారి మా సొంతూరికి వచ్చినప్పుడు పోకచెట్టు బెరళ్లను చూసినప్పుడు ఈ ఆలోచన వచ్చింది. కప్పులే కాదు చెప్పులు కూడా! పర్యావరణ ప్రేమికులు కొందరు పోకచెట్టు బెరడుతో ఫంక్షన్లలో భోజనం వడ్డించే ప్లేట్లు, పాయసం వడ్డించే కప్పుల వంటి వాటిని చేస్తున్నారు. పేపర్ ప్లేట్‌కు బదులు అరెక్కా (పోకచెట్టు) ప్లేట్ వాడడం వల్ల పేపర్ తయారీ సమయంలో జరిగే నీటికాలుష్యాన్ని నివారించిన వారమవుతాం. అయితే పోకచెట్టును ఇంకా విస్తృతంగా వినియోగంలోకి తీసుకు రాగలిగితే పర్యావరణానికి హానికారకంగా మారుతున్న అనేక పరిశ్రమలకు ఇది చక్కటి ప్రత్యామ్నాయం అవుతుందని ఆలోచించాం. అప్పుడు మాకు మొదటగా తోళ్ల పరిశ్రమ గుర్తువచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన త్జీర్డ్ వీన్హోవెన్ కూడా తోళ్లకు ప్రత్యామ్నాయం కోసం మొక్కలపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిసింది. మా పోకచెట్టు బెరడు ఆలోచన వీన్హోవెన్కు కూడా నచ్చింది. ప్రయోగాలు చేయగా చేయగా మా ప్రయత్నం విజయవంతం అయింది. ఇది జంతువులకు ప్రాణహానిని నివారించే లెదర్ కాబట్టి వేగాన్ లెదర్, పామ్ లెదర్ అంటున్నాం. రసాయన రహిత, భూమిలో కలిసిపోయే మెటీరియల్ ఇది. తేలికగా ఉంటుంది కూడా. ఇప్పుడు పెద్ద ఎత్తున వేగాన్ లెదర్‌ను ఎగుమతి చేస్తున్నాం. వీటితో పెన్హోల్డర్లు, చెప్పులు, పుస్తకాల అట్టలు, వ్యానిటీ బ్యాగ్ తదితరాలు తయారవుతున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు ఇందులో చక్కటి సేవందిస్తున్నారు. గత ఏడాది మే–జూన్ నెలల్లో జీ 20 సదస్సుల సందర్భంగా స్టాల్ నిర్వహించాం. యానిమల్ లెదర్ తయారీలో కార్బన్ డయాక్సైడ్‌తోపాటు నీటి కాలుష్యం కూడా ఎక్కువే. యానిమల్ లెదర్ కోసం పాతిక వేల లీటర్ల నీరు అవసరమయ్యే చోట పామ్ లెదర్ తయారీకి నీటి వాడకం ఆరు వందల లీటర్లకు మించదు. పైగా పామ్ లెదర్ తయారీలో వాడిన నీటిని తిరిగి పంటలకు వినియోగించుకోవచ్చు కూడా. మేము సమాజానికి తిరిగి ఇవ్వాలనే ప్రయత్నంతో చేసిన ఆలోచన నుంచి పర్యావరణానికి మా వంతుగా సేవలందించే అవకాశం వచ్చింది. సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు’’ అన్నారు మైథిలి. ఇవి చదవండి: ‘మనకెందుకమ్మా వ్యాపారం.. పెద్ద రిస్క్’ అని అనుకుంటే..!? ఇప్పుడిలా.. -
వేరే పెళ్లి చేసుకున్నా అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లోనే ఉంటా!
సురేశ్.. ఒకప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు. మొదట్లో హీరోగా, తర్వాత విలన్‌గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఇతడు ఈ మధ్య మాత్రం చిత్రాల సంఖ్యను బాగా తగ్గించేశాడు. అరకొర సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నాడు. గతంలో.. నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి పలువురు స్టార్లకు గొంతు అరువిచ్చాడు కూడా! నాతో విడాకులయ్యాక కూడా అదే పేరు.. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'నా మొదటి భార్య పేరు హరితా రెడ్డి. తను మొదట్లో ఇండస్ట్రీలోనే ఉండేది. కానీ చదువుకోవాలన్న కోరికతో కెమెరా ముందు నటించడం మానేసింది. నన్ను పెళ్లి చేసుకున్నాక తన పేరును అనితా సురేశ్ అని మార్చుకుంది. మాకు ఓ బాబు కూడా పుట్టాడు. నాతో విడాకులై రెండో పెళ్లి చేసుకున్నాక కూడా అదే పేరు కొనసాగిస్తోంది. ఒకప్పుడు నా భార్య స్థానంలో ఉంది, ఇప్పుడు నా స్నేహితురాలి స్థానంలో ఉంది. వరుస మారిందే కానీ మా మధ్య ఆప్యాయత మారలేదు. చెరి సగం పంచుకున్నాం.. విడిపోవడానికి మా మధ్య ఎటువంటి గొడవలు జరగలేవు. కాకపోతే నాకు 21, ఆమెకు 18 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేశారు. తనకు పెద్ద చదువులు చదవాలని కోరిక! అమెరికాలో సెటిలవ్వాలని ఉండేది. నేను సినిమాల్లో బిజీ అవడంతో తనతో పాటు రానని చెప్పేశాను. అందుకని విడిపోయాం. ఎవరు ఎక్కువ సంపాదించారు? అన్నదాన్ని పక్కనపెట్టి ఉన్న ఆస్తిని ఇద్దరం చెరి సమానంగా పంచుకున్నాం. వాళ్లింట్లోనే ఉంటా.. తను అమెరికా వెళ్లిపోయి అక్కడే చదువుకుంది. రెండో పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైంది. ఆమె భర్త చాలామంచివాడు. నా కొడుకును కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నేను కూడా ఇక్కడ రెండో పెళ్లి చేసుకున్నాను. దర్శకరచయిత్రి రాశిని పెళ్లాడాను. ఇకపోతే నేను అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లో ఉంటాను. వాళ్లు ఇండియా వస్తే నా ఇంట్లో ఉంటారు. మేమంతా కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటాము' అని చెప్పుకొచ్చాడు. చదవండి: అప్పట్లో రిలేషన్స్.. ఇప్పుడు వాళ్లంతా ఫ్రెండ్స్.. -
స్లిమ్‌గా మారిన నటుడు సురేష్! డాక్టర్లే అదేం డైట్ అన్నారు? చివరికి..
టాలీవుడ్ సీనియర్ నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే? ఆయన నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో మెప్పించిన వ్యక్తి. అదీగాక నటుడిగా సుమారు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలను తెరకెక్కించారు కూడా. కొంతకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత విలన్ పాత్రలు, తండ్రి పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే సీరియల్స్‌లోనూ పలు కీలక పాత్రలు చేస్తున్నారు. మొన్నటి వరకు మనం సురేషని పెద్ద తరహాలో లావుగా చూశాం. ఇప్పుడూ కుర్రాడిలా స్లిమ్‌గా హీరో లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంతలా మారిపోయిన సురేష్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మేరకు ఓ టీవీ ఇంటర్వ్యూలో తాను ఫాలో అయ్యిన డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఏకంగా 15 గంటల వరకు నో ఫుడ్.. ఒకప్పుడు సినిమాల్లో మంచి స్లిమ్‌గా హీరోలా కనిపించే సురేష్ గత కొద్దికాలం క్రితం బాగా లావయ్యారు. సుమారు 120 కిలోల బరువు ఉండేవారు. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి సీరియల్స్‌లో నటించడంతో అంతా బరువుగా ఉండటం వల్లే సినిమాలు చేయడం లేదని అనుకున్నారు. ఆ మాటాలు సురేష్ చెవిన పడటంతో ఎలాగైనా బరువు తగ్గాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినట్లుతెలిపారు నటుడు సురేష్. అందుకోసం గత ఐదు నెలలుగా చాలా కఠినమైన డైట్ ఫాలో అయినట్లు చెప్పారు. అందువల్లే ఇంతలా బరువు తగ్గానని అన్నారు. ఈ నేపథ్యంలో తాను ఫాలో అయిన డైట్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను నిద్ర లేచిన గంట వరకు ఎలాంటి ఫుడ్స్ తీసుకోనని, కేవలం నీళ్లు, గ్రీన్ టీ వంటివే తీసుకుంటానని అన్నారు. ఆ తర్వాత ఒక గంటకి అరటి పండు లేదంటే ఆపిల్ తీసుకోవడం జరుగుతుందన్నారు. అదీ కాదంటే టమాట తింటానన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఎగ్‌లోని తెల్ల సొన తింటానన్నారు. ఇక బ్రేక్ ఫాస్ట్‌గా ఓట్స్ తింటానని, ఎక్కువగా ఉడికించిన కాయగూరలే తీసుకుంటానని చెప్పుకొచ్చారు. లంచ్‌లో పుల్కాలు కొద్దిగా రైస్ తీసుకుంటానని చెప్పారు. ఆదివారం వస్తే బిర్యానీ రైస్, గ్రిల్ చికెన్, గ్రిల్ ఫిష్, తప్పనసరిగా ఉండాల్సిందే అన్నారు. మధ్యాహ్నం కడుపునిండా ఫుడ్ తీసుకున్నా 15 గంటల వరకు ఏం తిననని చెప్పారు సురేష్. అంటే మధ్యాహ్నాం ఒంటి గంటకు తింటే మరుసటి రోజు ఉదయం వరకు ఏం తినేది ఉండదు. మరీ తట్టుకోలేనంటే ..కొద్దిగా నీళ్లు లేదా మజ్జిగలో కాస్త నిమ్మరసం పిండుకుని తాగడం వంటివి చేస్తానని చెప్పారు. ఆ డైట్ చూసి.. డాక్టర్లే షాకయ్యారు.. తన డైట్ గురించి విని డాక్టర్లు షాకయ్యారని సురేష్ చెప్పారు. గత ఐదు నెలలుగా ఈ డైటే ఫాలో అవుతున్నట్లు తెలిపారు. అలా 21 కేజీల వరకు బరువు తగ్గినట్లు చెప్పారు. ప్రస్తుతం తాను 88 కేజీల బరువు ఉన్నట్లు చెప్పారు. ఐతే ఇలా 15 గంటలకు వరకు ఏం తీసుకోకపోవడం వల్ల శరీరంలో కొలస్ట్రాల్ పెరిగే అవకాశమే ఉండదన్నారు. ఎందుకంటే కాస్త తినడానికి విరామం ఇవ్వడం వల్ల బరువు ఆటోమెటిక్‌గా తగ్గిపోతాం అని వివరించారు సురేష్. అయితే ఈ డైట్ మొదలు పెట్టే ముందు తాను ఎన్ని రోజుల వరకు తినకుండా ఉండగలనో చెక్ చేసుకున్నట్లు తెలిపారు. తాను మూడు రోజుల కేవలం నిమ్మకాయ నీళ్లతో ఏం తీసుకోకుండా ఉండగలిగానని, అప్పుడే ఏకంగా ఆరు కేజీలు వరకు తగ్గానని అన్నారు. ఈ విషయమే వైద్యులకు చెప్పగా..వాళ్లు కోప్పడి అదేం డైట్? చచ్చిపోతావ్! అని ఫైర్ అయ్యారని అన్నారు. సరైన విధంగా డైట్ ఫాలో అవ్వు అని హెచ్చరించడంతో ఇలా డైట్లో పలు మార్పులు చేసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. తాను మొదట్లో ఐదు నిమిషాలే వాకింగ్ చేసేవాడినని, ఇప్పుడూ ఏకంగా 18 కిలోమీటర్లు వరకు వాకింగ్ చేస్తున్నట్లు చెప్పారు నటుడు సురేష్. (చదవండి: మిథున్ చక్రవర్తికి వచ్చిన ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే..? ఎందువల్ల వస్తుంది?) -
కోరిక తీర్చాలంటూ వివాహితకు వేధింపులు
ముత్తారం (మంథని): పరుష పదజాలంతో దూషించడంతోపాటు అసభ్య సైగలు చేస్తూ ఓ కామాంధుడు తన కామవాంఛ తీర్చాలని వివాహితను వేధించాడు.. అడ్డుకోబోయిన మరో మహిళపై సైతం దాడిచేశాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదంబండ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆదివారం మధ్యాహ్నం తన బాబును ఇంటి ఎదుట ఆడిస్తోంది. అదే గ్రామానికి చెందిన ఎర్రం సురేశ్ అక్కడకు చేరుకుని ఆమెను బూతులు తిడుతూ, అసభ్య సైగలతో కామవాంఛ తీర్చాలని వేధించాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. వారిని చూసిన సురేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. తిరిగి రాత్రి సమయంలో తన సహచరుడు రేగల గట్టయ్యతో కలిసి సురేశ్ కారులో మళ్లీ యువతి ఇంటికి చేరుకున్నాడు. సురేశ్, గట్టయ్య కలిసి ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. అడ్డువచ్చిన స్థానికుడు బియ్యని కృష్ణస్వామిపై దాడికి దిగారు. తన భర్తను ఎందుకు కొడుతున్నావని కృష్ణస్వామి భార్య నవలోక దుండగులను ప్రశ్నించింది. దీంతో ఆగ్రహించిన సురేశ్ గట్టయ్య సాయంతో కారు డోర్లో నవలోక చెయ్యి ఇరికించి సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు బైక్‌లతో వెంబడించినా నిందితుల ఆచూకీ లభించలేదు. తీవ్రంగా గాయపడ్డ నవలోకను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వివాహిత, బాధిత మహిళ కుటుంబ సభ్యులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కారు దగ్ధం.. స్థానికులు వెంబడించడంతో నిందితులు తమ కారులో మైదంబండ నుంచి మచ్చుపేట, లక్కారం మీదుగా సర్వారం వెళ్లే రోడ్డు మీదుగా పరారయ్యారు. చివరికి సర్వారంలోని ఓ డ్రైనేజీలో కారు దిగబడి ఆగిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు తప్పించుకుని పారిపోయారు. అయితే, తెల్లవారేసరికి కారు కాలిపోయింది. ప్రమాదవశాత్తు కాలిపోయిందా, లేదా ఎవరైనా కాల్చివేశారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘దొంగ’ నాటకం!
సాక్షి, అమరావతి: ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడంతో విపక్షం దొంగ నాటకానికి తెర పడింది! వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెగబడుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో లక్షల సంఖ్యలో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో లక్షలాది మంది అధికార పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి సమర్పించడం గమనార్హం. మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు మూడింతలు అధికంగా నకిలీ దరఖాస్తులు అందాయి. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన జిల్లా కలెక్టర్లు వీటిల్లో 80 నుంచి 90 శాతం వరకు బోగస్ దరఖాస్తులేనని ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కోనేరు సురేష్ పై ఐపీసీ సెక్షన్ 182, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. నాడు సేవామిత్ర.. నేడు మైపార్టీ డ్యాష్ బోర్డ్ గతంలో సేవామిత్ర యాప్ తరహాలోనే తాజాగా మైపార్టీ డ్యాష్ బోర్డ్ డాట్‌కామ్ వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరించిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులను గంపగుత్తగా సమర్పించింది. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్న వారిని బతికున్నా చనిపోయినట్లుగా చిత్రీకరించడంతోపాటు అర్హులైన ఓటర్లను నకిలీలుగా, స్థానికంగా నివాసం ఉంటున్నా శాశ్వతంగా వలస వెళ్లినట్లు పేర్కొంటూ వీటిని దాఖలు చేసింది. మరికొందరిని రెండు ప్రదేశాల్లో రెండు ఓట్లు ఉన్నట్లు తప్పుడు సమాచారం సమర్పించి జాబితా నుంచి తొలగించే వ్యూహం రచించింది. కుప్పలు తెప్పలుగా అందిన ఫారం 7 దరఖాస్తుల్లో 70 నుంచి 80 శాతం తప్పుడువేనని తేల్చుతూ ఎన్నికల సంఘానికి కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాల పరిధిలో శాసనసభ, లోక్‌సభ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అక్కడ కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాలపై ప్రత్యేకంగా గురి పెట్టి అధికార పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ బోగస్ దరఖాస్తులను సమర్పిస్తోంది. నెల్లూరులో సింహభాగం నకిలీ ♦ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 11,291 ఓట్లు తొలగించాలంటూ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోనేరు సురే‹Ùతో కలిసి ఫారం 7 దరఖాస్తులు సమర్పించారు. వాటిలో 85 శాతానికి పైగా బోగస్ అని అధికారుల విచారణలో వెల్లడైంది. జిల్లాలోని మిగతా ఆరు నియోజకవర్గాల్లోనూ ఇదే కథ. విజయనగరం 4 నియోజకవర్గాల్లో ♦విజయనగరం జిల్లాలో రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన 19,407 మంది ఓట్లు తొలగించాలని కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7లను ఎన్నికల సంఘానికి సమర్పించాడు. ♦ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన విజయనగరం జిల్లా కలెక్టర్ 8,318 ఫారం 7లు తప్పుడువని తేల్చుతూ నివేదిక ఇచ్చారు. కర్నూలులో 88 శాతం బోగస్ ♦కర్నూలు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజక వర్గాల్లో 67,370 ఓట్లు తొలగించాలంటూ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేశాడు. వీటిలో అత్యధికంగా కోడుమూరులో 17,576, ఆదోనిలో 13,968, ఆలూరులో 11,581 బోగస్ దరఖాస్తులున్నాయి. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీటిపై బీఎల్వోలు, డిప్యూటీ తహసిల్దార్లు, తహసిల్దార్లతో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించగా 59,054 ఫారం 7లు బోగస్ అని తేలింది. అంటే 88 శాతం తప్పుడు ఫారం 7లు సమర్పించినట్లు స్పష్టమవుతోంది. 11,935 మంది బతికే ఉన్నా వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి వారి ఓటు హక్కును కాలరాసేందుకు టీడీపీ కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. అన్నమయ్య.. అక్రమ మార్గంలో ♦ అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన 40,358 మంది ఓట్లు తొలగించాలంటూ కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి అందచేశాడు. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ 25,097 దరఖాస్తులు నకిలీవని నిర్థారించారు. అక్కడ ఆరు నియోజకవర్గాల్లో 8,355 మంది బతికే ఉన్నా చనిపోయినట్లుగా చిత్రీకరించి టీడీపీ తప్పుడు దరఖాస్తులు సమర్పించినట్లు బహిర్గతమైంది. -
కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా..
గాంధారి(ఎల్లారెడ్డి): కుటుంబ కలహాలతో తండ్రీకొడుకులు కన్నుమూశారు. తండ్రి కత్తితో పొడవడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వెంటనే తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. తండాకు చెందిన బాదావత్ వసంత్‌రావు (48) కుమారుడు బాదావత్ సురేశ్ (27) హైదరాబాద్‌లో ప్రైవే టు ఉద్యోగి. రెండ్రోజుల క్రితం తండాకు వ చ్చాడు. బుధవారం రాత్రి డబ్బుల విషయంలో తండ్రీ కొడుకులు గొడవ పడి పరస్పరం దాడి చేసుకున్నారు. ఆగ్రహం చెందిన తండ్రి ఇంట్లోని కత్తితో కొడుకు సురేశ్ ఎడమ వైపు ఛాతీపై పొడవగా తీవ్రంగా గాయపడ్డాడు. కు టుంబ సభ్యులు, తండావాసులు చికిత్స ని మిత్తం గాంధారి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సురేశ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, ఇంటి వద్ద ఉన్న తండ్రి వసంత్ రావు పురుగు మందు తాగా డు. బంధువులు అతడిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. తండ్రీ కొడుకును హత్య చేశాడని ఆగ్రహించిన బంధువులు వసంత్‌రావు ఇంటిని ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రేమ్‌దీప్ తెలిపారు. ఇవి కూడా చదవండి: కారు వేగం ధాటికి.. ఇద్దరు యువకుల విషాదం!