
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ భార్య లత ఈ హత్యా ఉదంతంపై స్పందించారు. తన భర్త సురేష్ అమాయకుడని తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మార్వో హత్య చేసేంత దారుణానికి ఒడిగడుతాడని తాను భావించటం లేదని చెప్పారు. దీనివెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేసింది. ఎమ్మార్వో విజయారెడ్డి హత్యలో తన భర్తను పావుగా వాడుకున్నారని ఆరోపించారు.
ఈ సంఘటన జరిగిన అనంతరం తన భర్త సురేష్‌తో ఇప్పటివరకు మాట్లాడలేదన్నారు. హత్య జరిగిన రోజు తనతో భూవివాదం, ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళుతున్నట్లు వంటి ఎలాంటి విషయాలు తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఈ దారుణం వెనక ఉన్న వాళ్లని కూడా బయటికి తీయాలని సురేష్ భార్య లత పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment