Tahsildar
-
మదనపల్లె తహసీల్దార్ ఆఫీసులో మాజీ సైనికుడి ఆత్మహత్యాయత్నం
-
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు!.. ఇదో వృద్ధ దంపతుల గా(వ్య)థ
సంస్థాన్ నారాయణపురం(నల్గొండ): తాము కొంత భూమి అమ్ముకుంటే.. ఆ భూమిని కొనుగోలు చేసిన వారికి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వృద్ధ దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన జక్కడి బాల్రెడ్డికి 40ఎకరాల భూమి ఉంది. తన కుమారుడు జక్కడి శ్రీనివాస్‌రెడ్డికి 36 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయగా ఇంకా బాల్‌రెడ్డి పేరు మీద 4ఎకరాల 10గుంటల భూమి ఉంది. కుమారుడు తమ బాగోగులు పట్టించుకోకపోడవంతో బాల్‌రెడ్డి తన పేరు మీద ఉన్న భూమిని ఇతరులకు విక్రయించాడు. భూమి కొనుగొలుదారు రిజిస్ట్రేషన్ కోసం బుధవారం స్లాట్ బుక్ చేసుకున్నాడు. గురువారం 12గంటలకు రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ అయ్యింది. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయకపోవడంతో బాల్‌రెడ్డి అధికారులను ప్రశ్నించాడు. రిజిస్ట్రేషన్ చేయవద్దని బాల్‌రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశాడని, దీంతో రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నానని తహసీల్దార్ తెలిపారు. తమ భూమి అమ్ముకుంటే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరంటూ తహసీల్దార్‌తో బాల్‌రెడ్డి వాదించాడు. వృద్ధ దంపతులు సుమారు మూడు గంటలకు పైగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. చివరకు రిజిస్ట్రేషన్ చేయడంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ విషయమై తహసీల్దార్ కృష్ణను వివరణ కోరగా.. బాల్రెడ్డికి కుంటుంబ సభ్యులతో మాట్లాడుకోమని కొంత సమయం ఇచ్చామని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రకియ పూర్తిచేసినట్లు తెలిపారు. -
రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం.. తహసీల్దార్ అరెస్ట్
సూర్యాపేట, సాక్షి: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లేని భూమిని ఉన్నట్లు చూపించి పాస్ పుస్తకాలు ఎమ్మార్వో జయశ్రీ సృష్టించారు. ఈ కుంభకోణానికి ధరణి ఆపరేటర్ జగదీష్ సహకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తహసీల్దారు జయశ్రీ, ధరణీ ఆపరేటర్ జగదీష్‌ను అరెస్ట్ చేశారు. గోప్యంగా 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. కనీసం అరెస్ట్ వివరాలు కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన వైనం. గతంలో హుజూర్నగర్ తహసీల్దార్‌గా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హుజూర్ నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులును స్వాహా చేశారు. రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు తహసీల్దార్, ధరణి ఆపరేటర్ పక్కదారి పట్టించారు. ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు తహసీల్దార్ జయశ్రీ జారీ చేశారు. తహసీల్దార్, ధరణి ఆపరేటర్ జగదీష్ చెరిసగం చొప్పున రైతుబంధు నదులు పంచుకున్నారు. తహసీల్దార్ పై 420, 406, 409, 120(b), 468, 467 IPC సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేవారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్‌గా జయశ్రీ పనిచేస్తున్నారు. గోప్యంగా రిమాండ్‌కు తరలించడమేంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
మేం చచ్చిపోతాం.. ఎలా బతకాలి సార్
-
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్..
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి అడ్డంగా పట్టుబడ్డారు. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ 30,000 డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. నేడు రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమలాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి.అయితే సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ చేపడితే అనేక అంశాలు బయట పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. తహసిల్దా్ర్‌ను ఏసీపీ పట్టుకోవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న పనికి తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పైసలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ. 7 వేలు లంచం తీసుకుంటూ చాయితీరాజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇదిలా ఉండగా ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్‌ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
కడప తహసీల్దార్ అక్రమాస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, తిరుపతి/కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప మండల తహసీల్దార్ సిద్దల శివప్రసాద్ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో 9చోట్ల సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు తిరుపతి, పీలేరు, రేణిగుంట, కడపతో పాటు మొత్తం తొమ్మిది చోట్ల దాడులు చేశారు.కడపలోని ఆయన ఇంట్లో రూ.36 లక్షలను స్వా«దీనం చేసుకున్నారు. కాగా, ఎన్నికల ఖర్చుకోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్ఓ) కడప ఆర్డీఓ మధుసూదన్ నిధులను విడుదల చేసినట్లు తహసీల్దార్ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఏసీబీ అధికారులు ఆర్డీఓను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆయన కుటుంబం నివాసముంటున్న తిరుపతి వైకుంఠపురంలోని ఇంట్లో విలువైన ల్యాండ్ డాక్యుమెంట్లు, ఆభరణాలు స్వా«దీనం చేసుకున్నారు. తిరుపతి వైకుంఠపురంలో 266.66స్క్వయర్ యార్డుల విస్తీర్ణం కలిగిన జీప్లస్1 భవంతి, మాతృత్వ ఆస్పత్రి ప్రాంగణం, పీలేరులో 158.89స్క్వయర్ యార్డుల విస్తీర్ణంలో నిర్మాణ దశలో ఉన్న జీప్లస్2 భవనం, తిరుపతి, రేణిగుంటలో 5 ఇంటిస్థలాలు, తిరుపతి దామినేడు పరిధిలో 33 సెంట్ల స్థలం, తిరుపతి చెర్లోపల్లిలో 1,685 అడుగుల స్థలం, తిరుపతి వైకుంఠపురంలోని అలంకృతి మాల్ తదితర స్థిరాస్తులను గుర్తించారు. అలాగే టొయోటా ఇన్నోవా, మహింద్రా థార్ కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.2.31లక్షలు, 390 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. వారి అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు వివరించారు. సోదాలు కొనసాగుతున్నాయని, ఇంకా పెద్ద సంఖ్యలో అక్రమాస్తులు, లాకర్లలో దాచిన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలను కూడా గుర్తించినట్లు వివరించారు. రేణిగుంట మండలం తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో విలువైన ప్రభుత్వ భూములను రియల్టర్లకు ధారాదత్తం చేసి పెద్దమొత్తంలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. -
అధికారులపై టీడీపీ నేత కొల్లు దౌర్జన్యం
సాక్షి, మచిలీపట్నం: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కొట్లు రవీంద్ర గురువారం రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సమయం లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి కూడా పనిచేస్తున్నారు. వారు పేదల ఇళ్ల పట్టాల తయారీలో నిమగ్నమై ఉండగా రాత్రి 9:30 గంటల సమయంలో కొల్లు రవీంద్ర తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. కార్యాలయంలోకి చొరబడ్డారు. రాత్రి వేళ రెవెన్యూ కార్యాలయంలో ఏదో చేస్తున్నారంటూ తహశీల్దార్, ఇతర అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు. ఏం చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. వారు చేస్తున్న పనిని ఫొటోలు, వీడియోలు తీయాలంటూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. నకిలీ పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు తయారు చేస్తున్నారంటూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. వారి చేతుల్లోని ఫైళ్లు లాక్కొని పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో నినాదాలు చేశారు. కలెక్టర్ దృష్టికి కొల్లు దౌర్జన్యం తహసీల్దార్ కార్యాలయంలోకి కొల్లు రవీంద్ర, ఆయన అనుచరుల చొరబాటు, అధికారుల విధులకు ఆటంకం కల్పించడంపై తహసీల్దార్ పి. సతీష్ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుకు ఫిర్యాదు చేశౠరు. దీనిపై ఆయన స్పందించి జాయింట్ కలెక్టర్‌ను విచారణకు ఆదేశించారు. దీనిపై జాయిట్ కలెక్టర్ విచారించి.. విధుల నిర్వహణ సక్రమంగానే ఉందని, సమయం తక్కువ ఉండటంవల్లే అధికారులు రాత్రి వరకు విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంపై గురువారం రాత్రి తహశీల్దార్ పి. సతీష్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కార్యాలయ సిబ్బంది కొత్తగా వచ్చిన కన్వెయన్స్ డీడ్లు సచివాలయాలు, గ్రామాల వారీగా వేరు చేస్తుండగా కొల్లు రవీంద్ర 30 మందితో కార్యాలయంలోకి వచ్చారని, ఫోటోలు, వీడియోలు తీసి తన వివరణ కోరారని తెలిపారు. మచిలీపట్టణం మండలంలోని అర్బన్, రూరల్‌లో 18,119 నివాస స్థలాల ఎన్పీఐ కన్వెయన్స్ డీడ్లు ప్రింట్ చేశామని, ఇంకా 2,829 డీడ్లను పరిశీలన చేస్తున్నట్లు వివరించామని పేర్కొన్నారు. -
ACB raids: తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ తనిఖీలు..
జమ్మికుంట/వరంగల్‌క్రైం: రెండు అంతస్తుల ఇల్లు.. 21 ఇంటి స్థలాలు.. ఏడు ఎకరాల భూమి.. కిలోన్నర బంగారం.. ఇతరత్రా కలిపి మార్కెట్ వి లువ ప్రకారం రూ.12 కోట్ల ఆస్తులు. ఇవన్నీ జమ్మికుంట తహసీల్దార్ మర్కల రజనికి చెందిన హనుమకొండలోని ఇంటితోపాటు మరో ఐదు చోట్ల ఏకకాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడుల్లో వెలుగుచూశాయి. ఉదయం నుంచి హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీ, ధర్మసాగర్, మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ రజని ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం అమె బంధువులు, సన్నిహితుల ఇళ్లను టార్గెట్ చేసుకుని తనిఖీలు చేశారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఒక్కో చోట ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. ఆమె గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. రూ.12కోట్ల అక్రమాస్తులు.. తహసీల్దార్ మర్కల రజనిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయని డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలో ఆరు చోట్ల దాడులు నిర్వహించామన్నారు. రజనికి హనుమకొండలో కేఎల్ఎన్రెడ్డి కాలనీలో రెండు అంతస్తుల ఇల్లు, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకులో రూ.25లక్షలు, లాకర్లు, ఇంట్లో కిలోన్నర బంగారం, ఇంట్లో రూ.1.50 లక్షల నగదు లభించినట్లు తెలిపారు. దీని విలువ (ప్రభుత్వ విలువ ప్రకారం) రూ.3.25 కోట్లు. ఇందులో సుమారు రూ.3కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటి విలువ మార్కెట్ ప్రకారం సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుందని డీఎస్పీ రమణామూర్తి పేర్కొన్నారు. తహసీల్దార్ రజనిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. -
జమ్మికుంట తహశీల్దార్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు!
సాక్షి, కరీంనగర్: జమ్మికుంట తహశీల్దార్ రజినీ ఆస్తులను ఏసీబీ ప్రకటించింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.20 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 22 ఓపెన్ ఫ్లాట్స్, 7 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు పేర్కొంది. కిలోలకొద్దీ బంగారం, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బినామీ పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తుల కొనేందుకు తహశీల్దార్ రజినీ అడ్వాన్స్ చెల్లించినట్లు తెలిపింది. జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇంట్లో ఇవాళ ఏసీబీ సోదాలు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేశారు. హన్మకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహశీల్దార్ రజని బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. -
తహసీల్దార్లకు మినహాయింపు..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల బదిలీల నుంచి తహసీల్దార్లను మినహాయించనున్నారు. ఈ బదిలీల విషయంలో స్పష్టత ఇస్తూ కేంద్రఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో కేవలం ఆర్డీఓ స్థాయి వరకే బదిలీలు జరుగుతాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న, లేదా సొంత జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని (తహసీల్దార్ స్థాయి వరకు) బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు పెద్దఎత్తున తహసీల్దార్ల బదిలీలు ఈ నెలలోనే జరిగాయి. అయితే, సొంత జిల్లా కాకుండా, సొంత లోక్‌సభ సెగ్మెంట్‌ను పరిగణనలోకి తీసుకొని.. ఆ సెగ్మెంట్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఇటీవల మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ దాదాపు కసరత్తు పూర్తి చేసింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధి ప్రకారం చూస్తే.. రాష్ట్రంలోని దాదాపు 600 మంది తహసీల్దార్లను మళ్లీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా, తాజాగా ఈసీ జారీ చేసిన ఆదేశాలతో తహసీల్దార్ల బదిలీలకు రెండోసారి జరిపిన కసరత్తు నిలిచిపోయే అవకాశాలున్నాయని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్ఓ) స్థాయి వరకే బదిలీలు చేయాల్సి ఉంటుందని, లోక్‌సభ ఎన్నికలకు ఆర్‌ఓలుగా జిల్లా కలెక్టర్లు, ఏఆర్ఓలుగా రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓ) వ్యవహరిస్తారని, ఆ స్థాయి వరకే బదిలీలుంటాయని అంటున్నాయి. దీంతో తహసీల్దార్ల బదిలీలు నిలిచిపోతాయని, ప్రస్తుతం జరిగిన బదిలీల మేరకు తహసీల్దార్లు సర్దుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈసీకి సీఎస్ లేఖ కాగా, సొంత లోక్‌సభ సెగ్మెంట్లోని రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, లేదంటే తమను ఈ బదిలీల నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈసీకి లేఖ రాసినట్టు సమాచారం. లోక్‌సభ నియోజకవర్గ నిబంధన ప్రకారం రెవెన్యూశాఖలోని 60 శాతం మంది సిబ్బందికి బదిలీలు చేయాల్సి వస్తోందని ఆ లేఖలో ఆమె వెల్లడించినట్టు తెలిసింది. తాజాగా ఈసీ జారీ చేసిన వివరణ నేపథ్యంలో తహసీల్దార్ల మలి బదిలీల ప్రక్రియ నిలిచిపోనుండగా, దాదాపు 40 మంది ఆర్డీఓలకు స్థానచలనం కలుగుతుందని, ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడుతాయని రెవెన్యూవర్గాల ద్వారా తెలిసింది. -
‘ధరణి’లో నమోదుకు రూ.40 లక్షలు
శామీర్‌పేట్: ధరణి పోర్టల్‌లో భూ వివరాల నమోదుకు రూ. 40 లక్షలు డిమాండ్ చేసిన ఓ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం..సిటీకి చెందిన రామశేషగిరిరావు శామీర్‌పేట మండల పరిధిలోని లాల్‌గడీ మలక్‌పేట్‌లో 2006లో భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి సంవత్సరం క్రితం తహసీల్దార్ సత్యనారాయణను సంప్రదించగా, రూ.40 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే గతంలో రామశేషగిరిరావు రూ.10లక్షలు ఇచ్చి, మరో 20లక్షల చెక్కు ఇచ్చాడు. తాజాగా మిగతా సొమ్ము రూ.10లక్షలు మంగళవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సత్యనారాయణ డ్రైవర్ బద్రికి ఇస్తుండగా, అధికారులు వల పన్ని పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తాము దాడులు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. తహసీల్దార్ సత్యనారాయణ నివాసముంటున్న తూంకుంటలోనూ ఏసీబీ అధికారులు మరిన్ని సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున్, పురంధర్భట్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోనూ సోదాలు కరీంనగర్‌క్రైం: ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కరీంనగర్ విద్యానగర్‌లోని తోడేటి సత్యనారాయణ నివాసంలో సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పూడూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో సత్యనారాయణ భార్య రేణుక టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెను కూడా ఏసీబీ పోలీసులు విచారించి పలు డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఏడాది నుంచి తిరుగుతున్నా... ధరణి పోర్టల్‌లో భూవివరాల నమోదుకు ఏడాది నుంచి తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్నా ఆయన పనిచేయలేదని బాధితుడు రామశేషగిరిరావు తెలిపారు. లాల్‌గడీ మలక్‌పేట్‌లో 2006 సంవత్సరంలో తాను 29 ఎకరాల భూమి కొనుగోలు చేశానని, ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి రూ.40 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు. తాను ఇంతకుముందు రూ.10 లక్షలు నగదు రూపంలో, 20 లక్షలు చెక్కురూపంలో చెల్లించానని చెప్పారు. 30 లక్షలు ఇచ్చినా తన పని కాకపోవడంతో విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించానని చెప్పారు. -
వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య
విశాఖ సిటీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. వ్యక్తిగత లావాదేవీలు, భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావును సోమవారం అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ తెలిపారు. తహసీల్దార్ సనపల రమణయ్యను గత శుక్రవారం రాత్రి హత్య చేసిన మురారి సుబ్రహ్మణ్యం గంగారావు శనివారం ఉదయం వరకు విశాఖలోనే ఉన్నాడు. తరువాత విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమాన సమయం అయినప్పటికీ.. ఉదయం 9.30 గంటలకే విమానాశ్రయం లోపలకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇదిలా ఉంటే గంగారావే తహసీల్దార్‌ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు అతని మొబైల్ ఆధారంగా చెన్నైకు టికెట్ బుక్ చేసుకున్నట్లు ముందుగానే గుర్తించారు. దాని ప్రకారం మధ్యాహ్నం ఎయిర్‌పోర్ట్‌లో సుబ్రహ్మణ్యం పేరుతో విచారించారు. ఆ పేరుతో ప్రయాణికులు ఎవరూ లేరని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పడంతో పోలీసులు వెనక్కు వచ్చేశారు. అప్పటికి విమానాశ్రయం సీసీ కెమెరాలను పరిశీలించలేదు. పెద్ద పేరు ఉండడంతో పోలీసులు గానీ, ఎయిర్పోర్ట్ అధికారులు గానీ పూర్తిస్థాయిలో నిందితుడి పేరును గుర్తించలేకపోయారు. దీంతో హంతకుడు విమానం ఎక్కి బెంగళూరు వెళ్లాడు. అయితే అప్పటికే ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఉండడంతో బెంగళూరులో ఎయిర్‌హోస్టెస్ మురారీ సుబ్రహ్మణ్యం గంగారావు పేరును అనౌన్స్ చేయడంతో.. అనుమానించిన అతడు బెంగళూరు విమానాశ్రయంలోనే దిగిపోయాడు. బస్సులో చెన్నైకు.. బెంగళూరు నుంచి గంగారావు బస్సులో చెన్నైకు బయలు దేరాడు. హంతకుడిని పట్టుకునేందుకు చెన్నైకు వెళ్లిన ప్రత్యేక బృందం మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నై పోలీసుల సహకారంతో గంగారావును చెంగల్పుట్టు వద్ద అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ట్రాన్సిట్ ద్వారా విశాఖకు తీసుకొచ్చారు. కాగా, హత్య జరగడానికి గల కారణాలపై డీసీపీ– 1 మణికంఠ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీపీ రవిశంకర్ తెలిపారు. కన్వెయన్స్ డీడ్స్ విషయంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు గంగరావు చెప్పినట్లు తెలిపారు. గంగారావు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, అతడిపై హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లోనూ చీటింగ్ కేసులున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. -
మర్రిగూడ తహసీల్దార్ ఇంట్లో రూ.2 కోట్ల నగదు
హస్తినాపురం/మర్రిగూడ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని అందిన సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. హస్తినాపురం షిరిడీ సాయినగర్ కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో శనివారం ఉదయం 9 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఏసీబీ డీఎస్పీ మజీద్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మహేందర్‌రెడ్డి ఇంటితోపాటు బంధువుల ఇళ్లు, మర్రిగూడ మండల రెవెన్యూ కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇంట్లోని ఒక ఇనుప పెట్టెలో రెండు కోట్ల ఏడు లక్షల నగదు, కిలో బంగారు నగలు, విలువైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు పట్టుబడ్డాయి. మొత్తం వీటి విలువ రూ.నాలుగున్నర కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మహేందర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంప్నం మండలం వెలిమినేడుకు చెందిన మంచిరెడ్డి అంజిరెడ్డి కుమారుడు. అంజిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కారుణ్య నియామకం కింద మహేందర్‌రెడ్డి మహేశ్వరం మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. అనంతరం కందుకూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డీటీవోగా పనిచేశాడు. తర్వాత ప్రమోషన్‌పై మహేశ్వరం తహసీల్దారుగా బదిలీపై వెళ్లారు. కందుకూరు తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మహేందర్‌రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివాదాల్లో అక్రమంగా డబ్బులు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. 45 రోజుల క్రితం మర్రిగూడ తహశీల్దారుగా బదిలీపై వెళ్లారు. చదవండి: ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు -
రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ
సాక్షి, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ అదికారులు అడ్డగోలుగా వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. అదివారం సెలవు దినం కూడా వదిలిపెట్టడం లేదు. పట్టాపాసు పుస్తకంలో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన జిల్లాలోని మావల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అదిలాబాద్‌కు చెందిన యతీంద్రనాథ్ అనే రైతు మావల సమీపంలోని 14 ఎకరాల భూమికి సంబంధించి నాలుగు పాసు పుస్తకాల్లో మార్పుల కోసం మావల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు. ఇందుకు ఎమ్మార్వో అరీఫా సుల్తానా, ఆర్ఐ హన్మంతరావు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్లాప్లాన్‌తో తహసిల్దార్ ఆరిఫాసుల్తానా, ఆర్ఐ హనుమంతరావుకు మావల తాహసీల్దార్ కార్యాలయంలో రెండు లక్షలు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘వారంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా’ -
హెల్మెట్ పెట్టుకొని ఆఫీస్ కు వచ్చిన ఉద్యోగులు
-
భర్త పేరు మీద ఉన్న భూమి భార్యకు రిజిస్ట్రేషన్
దుగ్గొండి: భర్త పేరుమీద ఉన్న భూమిని భార్య తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంది. అయితే పట్టాదారు పాస్‌పుస్తకం లేకుండా జిరాక్స్ కాపీ ఆధారంగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని కుమారుడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన దుగ్గొండిలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన అంబరగొండ రవీందర్ 2021, మే నెలలో కరోనాతో చనిపోయాడు. ఆయన పేరున 135 సర్వేనంబర్‌లో 1.34 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అతని పేరుమీద ప్రభుత్వం జారీ చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకం (ఖీ22040160118) రవీందర్ మరణానంతరం కుమారుడు మధు దగ్గర ఉంచుకున్నాడు. మధు గీసుగొండ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే క్రమంలో తహసీల్దార్ సంపత్.. ఆ భూమిని రవీందర్ భార్య అరుణకు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతి ఆధారంగా ఈ నెల 13న రిజిస్ట్రేషన్ చేశాడు. మ్యుటేషన్ చేయించుకునేందుకు వెళ్లిన మధు అంబరగొండ మధు తన తండ్రి రవీందర్ పేరున ఉన్న భూమిని వారసత్వం కింద మ్యుటేషన్ చేయించుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం పట్టుకుని మీసేవా కేంద్రానికి వవెళ్లాడు. ధరణి పోర్టల్‌లో తన తండ్రి పేరు కనిపించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. సమాధానం సరిగా రాకపోవడంతో బుధవారం మధు, భార్య మాధవి ఇద్దరు కూతుళ్లను వెంట బెట్టుకుని పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆందోళనకు దిగాడు. 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు. అరుణ చీటింగ్ చేసింది : తహసీల్దార్ సంపత్‌కుమార్ తన భర్త రవీందర్ కరోనాతో మృతిచెందాడని, పట్టాదారు పాస్ పుస్తకం పోయిందని, భర్త పేరున ఉన్న భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని అరుణ పలుమార్లు కార్యాలయానికి వచ్చింది. కదరదని చెప్పి తిరిగి పంపించా. మూడోసారి కుటుంబంలో ఎలాంటి తగాదాలూ లేవని, పాస్ పుస్తకం పోయింది వాస్తవమని ప్రాధేయపడింది. దీంతో అరుణ పేరున రిజిస్ట్రేషన్ చేశా. అరుణపై చీటింగ్ కేసు నమోదు చేయించడంతోపాటు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తా. నాకు ధైర్యంగా ఉంటుందని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. కాగా, దీనిపై అరుణ మాట్లాడుతూ తాము సంపాదించిన డబ్బులతో కుమారుడి పేరుమీద మరో 1.16 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపింది. ఇప్పుడే తన మందులు, ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని, మున్ముందు వృద్ధాప్యంలో ధైర్యంగా ఉంటుందని తన భర్త పేరుమీద ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చెప్పింది. నా తదనంతరం ఆ భూమి నా కుమారుడికే చెందుతుందని తెలిపింది. -
దారుణం: తహసీల్దార్‌పై యువకుల దాడి.. కారణం ఇదే..
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తహసీల్దార్‌పై గిరిజనులు దాడికి పాల్పడ్డారు. కాగా, తండావాసుల దాడిలో తహసీల్దార్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, ఆయనను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్‌పై ఆదివారం మధ్యాహ్నం పట్టణ శివారు సాలార్ తండాకు వెళ్లారు. ఈ సందర్బంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లా కోర్టుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. గత అధికారులు కేటాయించిన 9 ఎకరాల స్థలానికి హద్దులు పెడుతుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. భూమి తమదంటూ.. ఇక్కడ ఎలాంటి హద్దులు పెట్టొద్దంటూ తహసీల్దార్‌ను అడ్డగించారు. ఇలా కాసేపు వారి మధ్య వాగ్వాదం తర్వాత తహసీల్దార్ తిరిగి వెళ్తుండగా వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తహసీల్దార్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను తోటి సిబ్బంది మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితులు ప్రవీణ్, నవీన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.19.28 లక్షలు జప్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, రెండు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో రూ.19.28 లక్షల అనధికారిక నగదును స్వాదీనం చేసుకుంది. వరుసగా రెండో రోజు గురువారం కూడా ఏసీబీ అధికారులు ఆయా కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. పలు అక్రమాలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను గుర్తించారు. నగదుపై అధికారులు ఇచ్చిన వివరణను విశ్లేషించాక సబ్ రిజిస్ట్రార్లు, ఇతరులపై పీసీ చట్టం కింద క్రిమినల్ కేసుల నమోదుతో పాటు, తహసీల్దార్లపై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. జప్తు చేసిన నగదు ♦ గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి రూ.1.04 లక్షలు ♦ జలుమూరు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ అధికారి నుంచి రూ.27,500. ♦ బద్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం విధులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.2.70 లక్షలు, డాక్యుమెంట్ రైటర్ నుంచి రూ.2.10 లక్షలు ♦ అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ప్రైవేట్ డ్రైవర్ ఎస్కే ఇస్మాయిల్ డాక్యుమెంట్ రైటర్ల నుంచి వసూలు చేసిన రూ.2 లక్షలకు పైగా నగదు ♦కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ చాంబర్ నుంచి రూ.41 వేలు, డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.94 వేలు జప్తు వన్నం సతీశ్ అనే డాక్యుమెంట్ రైటర్ ఆరు నెలల్లో సబ్ రిజిస్ట్రార్‌కు రూ.94 వేలు, సబ్ రిజిస్ట్రార్ అటెండర్‌కు రూ.1.20 లక్షలు ఫోన్ పే ద్వారా పంపినట్టు గుర్తించారు. ♦ తిరుపతి రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ వద్ద రూ.90 వేలు, ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల వద్ద రూ.56 వేలు, జూనియర్ అసిస్టెంట్ వద్ద రూ.9 వేలు ♦ నర్సాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సబ్ రిజిస్ట్రార్ చాంబర్ నుంచి రూ.30 వేలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ.20 వేలు, సీనియర్ అసిస్టెంట్ వద్ద రూ.9,500, ప్రైవేటు ఉద్యోగి వద్ద రూ.6 వేలు. ♦ జగదాంబ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం( విశాఖపట్నం)లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ ప్రైవేటు ఉద్యోగి మూడు విడతల్లో ఓ సబ్ రిజిస్ట్రార్‌కు రూ.90 వేలు పంపినట్టు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.39 వేలు స్వాధీనం చేసుకున్నారు. ♦ తుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.20 వేలు, లెక్కల్లోకి రాని మరో రూ.20 వేలు. -
రిజిస్ట్రేషన్ చేయకుంటే పెట్రోల్ పోస్తాం.. తహసీల్దార్‌కు బెందిరింపులు..
సాక్షి, వరంగల్: ‘భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాం.. రిజిస్ట్రేషన్ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్‌పోసి చంపుతాం’ అని పోలీసుల సాక్షిగా కొందరు తహసీల్దార్‌ను బెదిరించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. బాధిత తహసీల్దార్ దూలం మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిల్‌నాయక్‌తండాకు గుగులోత్ పద్మ అనే మహిళ భూమి రిజిస్ట్రేషన్ చేయాలని స్లాట్ బుక్ చేసుకుంది. ఈ భూమిపై బ్యాంకు లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా పేపర్లు సక్రమంగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరిస్తూ బ్యాంక్ నుంచి నోడ్యూస్ సర్ఠిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఈ విషయాన్ని పద్మ వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో బిల్‌నాయక్‌తండాకు చెందిన కొందరు వ్యక్తులు సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి ‘స్లాట్ బుక్ చేసుకున్నాం..రిజిస్ట్రేషన్ చేయండి.. నోడ్యూస్ ఎందుకు తీసుకురావాలి’అంటూ నిలదీశారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కార్యాలయానికి చేరుకోగా, వారి ముందే రిజిస్ట్రేషన్ చేయకపోతే నీపై పెట్రోల్ పోసి చంపేస్తామని తహసీల్దార్‌ను నానా దుర్భాషలాడారు. నల్లబెల్లి నుంచి నువ్వు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని భయభ్రాంతులకు గురిచేసినట్లు తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. చదవండి: రేవంత్‌కు సిట్ నోటీసులు.. మరోసారి కౌంటర్ -
రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
మోటకొండూరు: గణతంత్ర వేడుకల వేళ ఓ రైతు కుటుంబం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.మోటకొండూరుకు చెందిన భూమండ్ల వెంకటేశ్‌కు భువనగిరి మండలంలోని చీమలకొండూరు రెవెన్యూ పరిధిలో 2.26 ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. అయితే బంట్రోతు నాగరత్నం అనే స్థానికేతర మహిళ ఆ భూమి తమదేనని పట్టా చేసుకోవాలని చూస్తోందంటూ వెంకటేశ్, అతడి భార్య శోభ, కుమారుడు శ్రీకాంత్ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. మండల కేంద్రంలో నివాసం ఉండని నాగరత్నంకు స్థానిక రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రికార్డులు పరిశీలించాకే సర్టిఫికెట్ ఇచ్చాం: తహసీల్దార్ జ్యోతి అక్కడే ఉన్న మోటకొండూరు తహసీల్దార్ జ్యోతి బాధిత రైతుతో మాట్లా డుతూ ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని గత నెలలో నాగరత్నం అర్జీ పెట్టుకుందని, రికార్డులు పరిశీలించగా ఆమె తాత నర్సెట్టి వెంకటస్వామికి చీమలకొండూరులో 1985లో పట్టా భూమి ఉందని గుర్తించి ఆమెకు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేశామని పేర్కొన్నారు. ఆ భూమి భువనగిరి రెవెన్యూ పరిధిలో ఉన్నందున సమస్యను భువనగిరి తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కరించుకోవా లని, అవసరమైతే ఆర్డీవోకు ఫిర్యాదు చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. -
రెవెన్యూశాఖలో కలకలం.. ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్
సాక్షి, నెల్లూరు(అర్బన్): జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి అధికారులపై వరుసగా వేటు పడుతోంది. ఇటీవల బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ ప్రమీలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా వెంకటాచలం తహసీల్దార్ నాగరాజు, తోటపల్లిగూడూరు తహసీల్దార్ హమీద్, గుడ్లూరు తహసీల్దార్ లావణ్యను సస్పండ్ చేస్తూ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి అలవాటుపడిన అధికారులు రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడం, ప్రభుత్వ భూములను పట్టా భూములుగా చూపించి పరిహారం ఇవ్వడం, చివరికి మర్రిపాడు ప్రాంతంలో అటవీశాఖ భూములను సైతం పట్టా భూములుగా చూపడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిపై చివరకు స్పందన కార్యక్రమంలో సైతం ప్రజలు తహసీల్దార్లు అర్జీలు సమర్పిస్తున్నారు. విషయాన్ని పరిశీలించిన కలెక్టర్ చక్రధర్‌బాబు విచారణాధికారిగా జేసీ కూర్మనాథ్‌ను నియమించారు. జేసీ విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగు చూశాయి. కలువాయి మండలంలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులదిగా చూపి అక్రమార్కులకు అండగా నిలిచారు. గుడ్లూరు మండలంలో ప్రభుత్వ భూమిని మ్యుటేషన్ చేశారు. ఇలా పలు చోట్ల అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్లను గుర్తించి సస్పెండ్ వేటు వేశారు. ఈ విషయం రెవెన్యూ శాఖలో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. మరో ఆరుగురిని విచారించేందుకు జేసీ నోటీసులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారులు సైతం ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మరి కొంత మందిపై వేటు పడే అవకాశం ఉంది. చదవండి: (విమాన ప్రమాదం: అంజూను మర్చిపోలేం.. షాక్‌కు గురైన సహ విద్యార్థులు) -
పనికి ముందే రేటు.. కావాలనే లేటు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లలో భారీగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి వివాదమూ లేని భూములను కూడా వివాదంలో ఉంచేందుకు అవతలి పార్టీ నుంచి డబ్బు తీసుకుని ఆన్లైన్లో రెడ్‌మార్క్ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ భూమిని అమ్మడానికి, కొనడానికీ ఉండదు. చిన్న చిన్న ఫైళ్లకు కూడా డబ్బు అడగడం, ఇవ్వకపోతే ఫైలును నెలల తరబడి పెండింగులో పెట్టడం ఇక్కడ మామూలైంది. ముఖ్య అధికారి మామూళ్ల పర్వం తహసీల్దార్ కార్యాలయ ముఖ్య అధికారి ప్రతి పనికీ రేటు కట్టి యథేచ్ఛగా మామూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు జనన, మరణ ధృవీకరణ పత్రాలకూ లంచం తీసుకుంటున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. సదరు అధికారి అవినీతి వైఖరి నచ్చక ఒక దశలో ఇక్కడ పనిచేస్తున్న వీఆర్ఓలు సమ్మెలోకి వెళ్లాలని అసోసియేషన్ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. తహసీల్దార్‌కు ఆర్డీఓ ఆఫీసులోని ఒక ఏఓ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) సహకరిస్తున్నారని, ఇవన్నీ ఆర్డీఓకు తెలిసినా మిన్నకుండిపోతున్నారని సమాచారం. దాదాపు 7 లక్షల మందికి ఈ తహసీల్దార్ కార్యాలయమే దిక్కు. ఈ నేపథ్యంలో భూముల సమస్యలపై ఇక్కడకు వచ్చే వేలాదిమంది పరిస్థితి వేదనాభరితంగా మారింది. రాప్తాడు నియోజకవర్గం మన్నీల పరిధిలోని భూమి(సర్వే నెం.25–4)కి సంబంధించి ఆర్ఓఆర్ (రైట్స్ ఆఫ్ రికార్డ్స్)కు యజమాని దరఖాస్తు చేసుకున్నారు. నెలల తరబడి తిరిగినా అనంతపురం తహసీల్దార్ కార్యాలయ అధికారులు కనికరించలేదు సరికదా.. ఆయన భూమిని వేరే వారి పేరున ఉన్నట్టు హక్కు పత్రాలు రాశారు. డైక్లాట్‌లో తనపేరే ఉన్నా తహసీల్దార్ అవతలి వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఇలా చేసినట్టు యజమాని ఆరోపిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం నారాయణపురం పంచాయతీ పరిధిలో సర్వే నం.93–2లోని 2.84 ఎకరాల భూమిని వివాదంలో (డిస్ప్యూట్ ల్యాండ్ కింద) పెట్టారు. ఎలాంటి ఆర్డరు గానీ, ఆర్డీఓ కోర్టు నుంచి ఆదేశాలు గానీ లేకుండానే భారీగా డబ్బు తీసుకుని ఈ విధంగా చేసినట్టు తేలింది. నిజమైన హక్కుదారుడు మాత్రం బాధితుడిగా మిగిలిపోయాడు. సోములదొడ్డి గ్రామ పరిధిలోని సర్వే నెం.212–1ఎ లోని 5.50 ఎకరాల భూమిని ఇటీవలే వ్యవసాయ భూమి నుంచి కమర్షియల్ కిందకు బదిలీ చేశారు. దీనికి సంబంధించి కిందిస్థాయిలో ఎలాంటి కన్వర్షన్ రిపోర్టు గానీ, అధికారుల సంతకాలు గానీ లేవు. నేరుగా తహసీల్దారే అన్నీ చేసేశారు. ఇందులో భారీగా డబ్బు చేతులు మారినట్టు తెలిసింది. ఉపేక్షించేది లేదు.. ఆర్‌ఓఆర్‌లు, ల్యాండ్ కన్వర్షన్లకు డబ్బు అడిగితే ఉపేక్షించేది లేదు. హక్కుదారులకు న్యాయం చేయకుండా ఫిర్యాదులను బట్టి భూములను వివాదాల్లో పెట్టడం సరి కాదు. దీనిపై ప్రత్యేక విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. – కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ (చదవండి: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి) -
AP: 66 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 66 మంది తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు, సూపరింటెండెంట్ క్యాడర్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళవారం జీవోఎంఎస్ నంబర్ 747 జారీచేశారు. వివిధ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారుల అవసరం పెరగడం, కొత్తగా 24 రెవెన్యూ డివిజన్ కేంద్రాల ఏర్పాటు, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ శాఖలో 66 కొత్త డిప్యూటీ కలెక్టర్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు, రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న సెక్షన్ అధికారులు, సూపరింటెండెంట్లకు పదోన్నతులు ఇచ్చి ఈ పోస్టుల్ని భర్తీచేసింది. పదోన్నతుల కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారుల పేర్లను ఎంపికచేసి 198 మందితో 2022–23 సంవత్సరం అడ్హాక్ ప్యానల్ తయారు చేసింది. ఈ నెల 8వ తేదీన జరిగిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ జాబితా నుంచి 66 మందిని డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికచేశారు. ఆ జాబితాను ప్రభుత్వం ఆమోదించింది. పదోన్నతులు తాత్కాలికమని జీవోలో పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన అధికారులంతా వెంటనే వెలగపూడి సచివాలయంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్టు చేయాలని జీవోలో స్పష్టం చేశారు. ఒకేసారి ఇంతమంది తహసీల్దార్ క్యాడర్ అధికారులకు పదోన్నతులు రావడం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది డిప్యూటీ తహసీల్దార్ల నుంచి తహసీల్దార్లుగా ప్రభుత్వం పెద్దఎత్తున పదోన్నతులు ఇచ్చింది. వీటికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూడగా చివరికి వైఎస్ జగన్ ప్రభుత్వం వారి కోరిక నెరవేర్చింది. తాజాగా తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఎంతోకాలంగా వాటికోసం ఎదురుచూస్తున్న వారి కలను నెరవేర్చింది. -
పెనమలూరు తహసీల్దార్‌పై ఏసీబీ కేసు
పెనమలూరు/రెడ్డిగూడెం/ఎ.కొండూరు: కృష్ణా జిల్లా పెనమలూరు తహసీల్దార్ జి.భద్రుపై అవినీతి నిరోధకశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదుతో శుక్రవారం ఏకకాలంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి రూ.రెండుకోట్ల ఆస్తులు గుర్తించారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. తహసీల్దార్ జి.భద్రు అక్రమార్జన, అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ఆయన కార్యాలయంతోపాటు కానూరులోని మనోహరి అపార్టుమెంట్లో ఆయన నివసిస్తున్న ఫ్లాట్, గుంటుపల్లి, పోరంకి, కొండపల్లి, ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల, రెడ్డిగూడెం మండలం కుదప తండా తదితర ప్రాంతాల్లోని బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు చేశారు. భద్రు పేరున ఒక ఫ్లాట్, ఒక ఇల్లు, ఒక ఖాళీస్థలం, 17.35 ఎకరాల వ్యవసాయ భూమి, విలాసవంతమైన కారు, రెండు మోటారు సైకిళ్లు, బంగారం, వెండి కలిపి మొత్తం రూ.2,54,90,170 విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. వీటిలో రూ.2 కోట్ల మేర అక్రమాస్తులని నిర్ధారించారు. కుదప తండాలో భద్రు బావమరుదులు, స్నేహితుల నివాసాల్లో ఏసీబీ సీఐలు సీహెచ్.రవిబాబు, వి.సురేష్‌బాబు తొమ్మిదిచోట్ల తనిఖీలు చేశారు. పలు రికార్డులు, ఆస్తుల వివరాలు పరిశీలించారు. కుమ్మరికుంట్లలో భద్రు సోదరుడు జి.చంటి ఇంట్లో భద్రు కుటుంబానికి సంబంధించిన విలువైన ఒరిజినల్ డాక్యుమెంట్లను గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ సోదాలు జరిగాయి. సుమారు రూ.30 లక్షల ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ సీఐ నాగరాజు తెలిపారు. సోదాలు పూర్తయిన తరువాత అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి.. ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట్లకు చెందిన భద్రు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి.. క్రమంగా డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగోన్నతి పొందారు. 2011లో తహసీల్దార్ అయ్యారు. మొవ్వ, తోట్లవల్లూరు, ఉయ్యూరు మండలాల్లో పనిచేశారు. -
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఇన్చార్జి తహసీల్దార్
సాక్షి, రామారెడ్డి(ఎల్లారెడ్డి): లంచం తీసుకుంటూ ఇన్చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాలు.. రామారెడ్డి ఇన్చార్జి తహసీల్దార్ మానస, ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ద్వారా అన్నారం గ్రామానికి చెందిన రైతు బన్నం బలరాం నుంచి రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా గురువారం మధ్యాహ్నం ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్, ఇన్స్పెక్టర్లు నగేశ్, శ్రీనివాస్‌లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రైతు బలరాం తన పెద్దమ్మ పేరున ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్‌ను కలిశాడు. తన పెద్దమ్మకు ఎవరూ లేకపోవడంతో బాగోగులు తనే చూసుకునేవాడినని రెండేళ్ల క్రితం ఆమె మరణించడంతో ఆమె పేరిట ఉన్న 37 గుంటల భూమిని తన పేరు మీదకు మార్చాలని అర్జీ పెట్టుకున్నాడు. దీంతో ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ఆన్లైన్ ఫీజు రూ. 3వేలు, దాని తర్వాత లంచం రూపంలో రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వలేనని రైతు ఇన్చార్జి తహసీల్దార్ మానసను కలవగా.. రూ. 4వేలు ఇవ్వాలని ఆమె సూచించారు. ఆ డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టంలేక బలరాం నిజామాబాద్‌లోని ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం బలరాం రూ. 4వేలు లంచం డబ్బులను ధరణి ఆపరేటర్ లక్ష్మణ్‌కు ఇస్తుండగా అధికారులు రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. తదుపరి విచారణ చేస్తున్నామని ఇన్చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్‌పై చర్యలు ఉంటాయని డీఎస్పీ వెల్లడించారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లు.. సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ అరెస్టు
చిత్తూరు అర్బన్/చిత్తూరు కార్పొరేషన్: ఓ స్థలానికి సంబంధించి యజమాని ఒకరైతే.. వాళ్లకే తెలియకుండా మరొకరి పేరిట రూ.కోట్లు విలువ చేసే భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠాను గత నెలలో చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన తహసీల్దార్ ఐ.సుబ్రహ్మణ్యం, సబ్ రిజిస్ట్రార్ జె.శ్రీధర్ గుప్తా, వీఆర్వోలు ధనుంజయ, ఎం.శివనారాయణ, కె.బాబును శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. చిత్తూరు నగరంలో దాదాపు రూ.50 కోట్లకుపైగా విలువ చేసే భూములు, ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల సాయంతో సురేంద్రబాబు తదితరులు ఓ ముఠాగా ఏర్పడి వేరేవారికి కట్టబెట్టారు. దీంతో సురేంద్రబాబుతో పాటు మొత్తం ఏడుగురిని సెప్టెంబర్ 30న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని అక్రమాలు జరిగినట్లు ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన లోతుగా దర్యాప్తు చేయించారు. అక్రమాలు బయటపడింది ఇలా.. చిత్తూరుకు చెందిన బాలగురునాథంకు చెందిన ఐదెకరాల స్థలాన్ని సురేంద్రబాబు ముఠా.. యాదమరి మండలం మాధవరం పంచాయతీకి చెందిన ఎబినైజర్, పూపతమ్మ, మురళి, శివకుమార్, చిట్టిబాబు, చిత్తూరుకు చెందిన నితీష్‌కు రూ.75 లక్షలకు అమ్మేశారు. తాము మోసపోయామని, ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకుండా విలువైన స్థలాలను తమకు రిజిస్ట్రేషన్ చేసి ఏమార్చారని ఎబినైజర్ గత నెల 25న యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన పోలీసులు ఎబినైజర్ కొన్న స్థలం బాలగురునాథంకు చెందిందిగా గుర్తించారు. ఈ భూమిని గ్రామకంఠం భూమిగా పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో రెండేళ్ల క్రితం చిత్తూరు తహసీల్దార్‌గా పనిచేసి, ప్రస్తుతం పుత్తూరు తహసీల్దార్‌గా ఉన్న ఐ.సుబ్రహ్మణ్యం, చిత్తూరు వీఆర్వోలు ధనంజయ, కె.బాబు, శివనారాయణ కీలకపాత్ర పోషించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో ఈకేవైసీ చేయడం, ఉద్యోగుల లాగిన్, పాస్‌వర్డ్‌తోపాటు ప్రభుత్వ సమాచారాన్ని దళారులకు ఇవ్వడంలో ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది హస్తం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ప్రభుత్వ అధికారులు నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పెద్ద మొత్తంలో నగదు రూపేణా లబ్ధి పొందినట్టు ఆధారాలు సేకరించారు. ఈ అరెస్టులు ఇంతటితో ఆగవని, మరికొంతమంది హస్తం ఉందని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.. చిత్తూరు అర్బన్ జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తాను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ గిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పందించిన ఆయన జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావును విచారణ అధికారిగా నియమించారు. విచారణలో శ్రీధర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు చిత్తూరు దాటివెళ్లవద్దని ఆదేశించారు. -
సారొచ్చారు.. పేదల్లో భరోసా.. భూకాసురుల్లో దడ
జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములపై పట్టున్న తహసీల్దార్‌గా అతనికి పేరుంది. ముచ్చటగా మూడోసారి తమ ప్రాంత తహసీల్దార్‌గా రావడంతో నిరుపేదల నుంచి హర్షం వ్యక్తం అవుతుంటే... కజ్జాదారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో ప్రభుత్వ భూమిని కాపాడటంలో కీలక పాత్ర పోషించి జిల్లా అధికారులతో శభాష్ అనిపించుకున్నారు. అతనే గౌతమ్‌కుమార్. సాక్షి, హైదరాబాద్: కాప్రా మండలం కొత్తగా ఏర్పాటైన తర్వాత అక్టోబర్ 11, 2016న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌కుమార్ మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాల కోసం వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 25న రెండోసారి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలతో పాటు కస్టోడియన్ భూములు, కార్పొరేషన్లో వందల ఎకరాలను కజ్జాదారుల చెర నుంచి కాపాడి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధికారిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉప్పల్ మండల తహసీల్దార్‌గా కొనసాగుతున్న గౌతమ్‌కుమార్‌ను ప్రభుత్వం కాప్రా మండల ఇన్చార్జ్ తహసీల్దార్‌గా బుధవారం అదనపు బాధ్యతలను అప్పగించింది. అక్రమార్కుల గుండెల్లో గుబులు... ప్రభుత్వ భూములపై పట్టున్న అధికారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్‌కుమార్ మూడోసారి అదనపు బాధ్యతలు చేపట్టడడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. వాస్తవ రికార్డులకు అనుకూలంగా వ్యవహరించి పేదలకు న్యాయం చేకూర్చుతూనే... ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి కాపాడి ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు స్వీకరించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ►గతంలో ప్రభుత్వ భూములను రక్షించి సఫలీకృతమయ్యారు. గౌతమ్‌కుమార్ అదన పు బాధ్యతలు స్వీకరించడంతో తమకు న్యాయం జరుగుతుందని నిరుపేదలు గట్టిగా నమ్ముతున్నారు. కాని అక్రమార్కుల్లో మా త్రం అప్పుడే ఆందోళన మొదలైంది. అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్తున్న తహసీల్దార్ (ఫైల్) గతంలో సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట.. జవహర్‌నగర్‌లోని మల్కారం గుట్టల్లో అక్రమంగా రాత్రి వేళల్లో నడిపిస్తున్న మట్టి దందాపై గతంలో తహసీల్దార్ గౌతమ్‌కుమార్ ఉక్కుపాదం మోపారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ గుంతలు తవ్వుతూ సహజ వనరులను దొచుకెళ్తున్న వారిపై కొరడా ఝులిపించారు. ఒంటరిగా గుట్టల్లోకి తానే ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్లి సహజ వనరుల దోపిడీని నివారించడంలో సఫలీకృతుడయ్యారు. మరోమారు ఈ ప్రాంతాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. సమగ్ర విచారణ, బాధ్యులపై చర్యలు ప్రభుత్వ భూములను కాపాడి భవిష్యత్ తరాలకు ఉపయోగడేలా చర్యలు తీసుకోవడమే నా భాధ్యత. గతంలో రెండు పర్యాయాలు ఇక్కడ విధులు నిర్వర్తించా. నిజమైన నిరుపేదలకు న్యాయం చేసి కజ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్ల కజ్జాలు, మున్సిపాలిటీకి (ప్రజల అవసరాల కోసం) కేటాయించిన స్థలాలపై సమగ్ర విచారణ చేసి వాటి పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తా. సిబ్బంది తప్పులు చేస్తే వారిపై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – గౌతమ్‌కుమార్, కాప్రా ఇన్చార్జ్ తహసీల్దార్ -
2019లో ‘ఉత్తమ’ అధికారి అవార్డు.. ఏసీబీ వలలో సంగెం తహసీల్దార్
ఆయన ప్రభుత్వం గుర్తించిన ఉత్తమ అధికారి. పైసా లేనిదే పనిచేయడనే విమర్శలున్నాయి. పనిచేసిన చోటల్లా పైత్యం చూపినట్లు సçహోద్యోగులు చెబుతున్నారు. ఎట్టకేలకూ పాపం పండింది. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సాక్షి, వరంగల్: రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు పక్కాగా వల పన్ని పట్టుకున్నారు. సంగెం తహసీల్దార్ నరిమేటి రాజేంద్రనాథ్‌ను శుక్రవారం ఉదయం 10 గంటలకు హంటర్‌రోడ్డు నందిహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. సంగెం మండల పరిధి కాపులకనిపర్తిలోని వ్యవసాయ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సంబంధిత రైతును నాలుగు నెలలుగా తహసీల్దార్ ఇబ్బందికి గురిచేస్తున్నాడు. ఈక్రమంలో బాధిత రైతు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులను అశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం.. ఏసీబీ అధికారులు తహసీల్దార్ రాజేంద్రనా«థ్‌ను పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాపులకనిపర్తిలో చింతనెక్కొండకు చెందిన నల్లెపు కుమార్‌కు మూడెకరాల భూమి ఉంది. అందులో నుంచి తన చెల్లెలికి ఎకరం భూమిని గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నాడు. కానీ తహసీల్దార్ రాజేంద్రనాథ్ రిజిస్ట్రేషన్ చేయకుండా.. నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. హనుమకొండలోని రాజేంద్రనాథ్ నివాసం ఈక్రమంలో రైతు ఈనెల 2న తహసీల్దార్ అడిగిన రూ.50 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే శుక్రవారం తహసీల్దార్ రాజేంద్రనాథ్ రైతు కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి రావాలన్నాడు. రైతు నుంచి డబ్బులు తీసుకున్న వెంటనే అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రాజేంద్రనాథ్ నివాసంలో కంప్యూటర్, ఇతర ఫైల్స్ పరిశీలించారు. విలువైన భూముల పత్రాలు, వాహనాలు, ప్లాట్లు ఇతర విలువైన పత్రాలు లభించినట్లు సమాచారం. అనంతరం సంగెం తహసీల్దార్ కార్యాలయానికి రాజేంద్రనాథ్‌ను తీసుకొచ్చి ఆర్డీఓ మహెందర్‌జీ సమక్షంలో రికార్డులు తనిఖీ చేసి, సోదాలు నిర్వహించారు. కాగా.. తహసీల్దార్ కార్యాలయంలో పలు డాక్యుమెంట్లను, రికార్డులను, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను, సీసీ పుటేజీలను సీజ్ చేసినట్లు సమాచారం. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, శ్రీను, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.హరీశ్‌కుమార్ తెలిపారు. ఆది నుంచి అదేతీరు! సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ ఉద్యోగ ప్రస్థానం ఆది నుంచి వివాదాస్పదమే! గతంలో డీటీ స్థాయిలో ఓప్రజాప్రతినిధి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేశారు. అక్కడ్నుంచి బదిలీ అయిన తర్వాత సుదీర్ఘకాలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జేసీల వద్ద సీసీగా పని చేశారు. తర్వాత ధర్మసాగర్లో పని చేశారు. జిల్లాల విభజన అనంతరం వరంగల్ జిల్లాకు వెళ్లిన ఆయన మొదట్లో నల్లబెల్లి తహసీల్దార్‌గా వెళ్లారు. అక్కడ కూడా వివాదాస్పద పనులతో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీంతో ఉన్నతాధికారులు అతడిని కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. కలెక్టరేట్‌కు వచ్చిన తర్వాత ఆయన తీరు మరింత ఆందోళనకరంగా మారిందని ఆరోపణలున్నాయి. కలెక్టరేట్ ఏఓగా పని చేస్తూ ఉద్యోగులు, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం చేయాల్సిన సమయంలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సదరు అధికారి ఇబ్బందులు భరించలేక జిల్లాలోని సçహోద్యోగులు, రెవెన్యూ శాఖలోని ఇతర స్థాయి ఉద్యోగులు ఇతడి వేధింపులపై ఓ జిల్లాస్థాయి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరుగా తమ బాధలు చెప్పుకున్నట్లు సమాచారం. పదే పదే ఆరోపణలు వస్తున్నా.. కొందరు అధికారులు సదరు తహసీల్దార్‌కు అన్ని విధాలా అండగా నిలవడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది. అండగా నిలిచిన ఆజిల్లా ఉన్నతాధికారి బదిలీ కావడంతో కలెక్టరేట్ నుంచి రాజేంద్రనాథ్ బదిలీ అనివార్యమైంది. దీంతో తోటి ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నట్లు చెబుతుంటారు. తీవ్రస్థాయిలో ఆరోపణలున్న రాజేంద్రనాథ్‌ను 2019లో ఉత్తమ అధికారి అవార్డు అందించడం విశేషం. -
బతికుండగానే చనిపోయినట్లు చూపి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయికోడ్: బతికుండగానే మరణించినట్లు చూపి 27.34 ఎకరాల భూమిని వేరొకరి పేర పట్టా చేసిన వ్యవహారంలో రాయికోడ్ తహసీల్దార్ రాజయ్య సస్పెండ్ అయ్యారు. ఈ భూమిపై క్రయవిక్రయాలు అసలైన పట్టాదారులకు కనిపించకుండా ధరణి వెబ్సైట్లో ప్రత్యేక సౌకర్యం ఉన్న ప్రైవసీ మోడ్‌లో పెట్టినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇలా ప్రైవసీ మోడ్‌లో పెడితే సదరు భూమిపై ఎలాంటి క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలు జరిగినా ధరణిలో కనిపించవు. అసలు ఉదంతమిదీ.. రాయికోడ్ మండలం నాగన్‌పల్లికి చెందిన పట్లోళ్ల హన్మంత్‌రెడ్డికి గ్రామంలో సర్వే నంబర్ 198లో 27.34 ఎకరాల భూమి ఉంది. హన్మంత్‌రెడ్డి గతేడాది మరణించడంతో ఆ భూమిని ఆయన భార్య శివమ్మ సక్సేషన్ (వారసత్వం కింద) పట్టా చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో కుమారుల వద్ద ఉంటున్నారు. అయితే శివమ్మ కూడా మరణించిందని రికార్డుల్లో చూపిన తహసీల్దార్ రాజ య్య ఆ భూమిని ఈనెల 19న అంజమ్మ పేర మార్చారు. లావాదేవీలు ధరణి వెబ్సైట్లో కనిపించకుండా ప్రైవసీ మోడ్‌లో పెట్టారు. అనుమానం వచ్చిన శివమ్మ కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఆరాతీయగా తన తల్లి పేరుతో ఉన్న భూమిని మరొకరి పేర మార్చారని చేసిన ట్లు తేలింది. దీంతో ఆయన కలెక్టర్ శరత్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు గురువారం విచారణ చేపట్టగా రాజయ్య బాగోతం బయటపడింది. ఆర్డీవో నివేదిక మేరకు కలెక్టర్.. తహసీల్దార్ రాజయ్యతోపాటు, ఆర్ఐ శ్రీకాంత్‌ను సస్పెండ్‌చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల క్రితం స్లాట్ బుకింగ్... పట్టా మార్పిడికి 3 నెలల క్రితమే స్లాట్ బుక్‌చేయడం గమనార్హం. సాధారణంగా స్లాట్ బుక్‌చేసిన నిర్ణీత వ్యవధిలోనే పట్టా మార్పిడి చేయాలి. అయితే తహసీల్దార్ మూడు నెలల అనంతరం పట్టా మార్పిడి చేశారు. ఈ వ్యవహారంలో రూ.40 లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ ఆర్ఐగా పనిచేసిన శ్రీకాంత్.. అసలైన పట్టాదారు శివమ్మకు వారసురాలు అంజమ్మనే అంటూ తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో పనిచేస్తున్న శ్రీకాంత్‌పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భూమి పౌతీమార్పు వ్యవహారంలో నకిలీ ధ్రువపత్రాలను వినియోగించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు రాయికోడ్ ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. శివమ్మ ఫిర్యాదు మేరకు.. ఆమె వియ్యంకురాలు అంజమ్మ, ఆమె కుమారుడు అమృత్‌రెడ్డి, మనవడు రాజశేఖర్‌రెడ్డి, భూ బదలాయింపులో సాక్షులుగా ఉన్న టి.మల్లేశం, బి.నర్సింలుపై కేసు నమోదు చేశారు. -
Hyderabad: షేక్‌పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి
-
షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం ప్రాణాలు విడిచారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో గతంలో సుజాత ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. ఆమెను అరెస్ట్ చేశారు. ఏసీబీ దాడుల అనంతరం ఏడాది క్రితమే సుజాత భర్త ఆత్మహత్య పాల్పడ్డాడు. అప్పటి నుంచి తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాతకు మళ్లీ విధుల్లోకి చేరేందుకు అవకాశం ఇచ్చినా ఆమె తిరస్కరించారు. క్రమంలోనే డిప్రెషన్లోకి వెళ్లిన సుజాత.. ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజాగాకు ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది. సుజాత మృతిని ధృవీకరించిన వైద్యులు మాజీ ఎమ్మార్వో సుజాత మృతిని వైద్యులు ధృవీకరించారు. గత వారం క్రితం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తీసుకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు సుజాతకు క్యాన్సర్ కూడా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అదే సమయంలో డెంగీ కూడా సోకడంతో వైద్యులు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. అయితే చికిత్స కొనసాగుతూ ఉండగానే ఈ ఉదయం గుండెపోటుతో సుజాత మృతి చెందినట్లు తెలిపారు. సుజాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చిక్కడ పల్లికి తరలించారు. చదవండి: వాట్సాప్ గ్రూపునకు అడ్మిన్ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి -
తహసీల్దార్ సస్పెన్షన్.. కుందుర్పి దాటి వెళ్లొద్దు
సాక్షి, అనంతపురం అర్బన్: ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలను జగన్ సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్ నాగలక్ష్మి చర్యలు చేపట్టారు. అవకతవకలు, అక్రమాలపై విచారణ చేయించడమే కాక, తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కూడేరు తహసీల్దారు శ్రీనివాసులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా కుందుర్పి విడిచి వెళ్లకూడదని ఆదేశాలిచ్చారు. ఇక కుందుర్పి తహసీల్దారుగా అదనపు బాధ్యతలను బ్రహ్మసముద్రం తహసీల్దారు బాలకిషన్‌కు అప్పగించారు. అత్మకూరులో ఉండగా అవినీతి కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామి గతంలో ఆత్మకూరు తహసీల్దారుగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో గొరిదిండ్ల, సనప, ఆత్మకూరు, మదిగుబ్బ, పి.యాలేరు. బి.యాలేరు రెవెన్యూ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత ఆర్డీఓ ద్వారా విచారణ జరిపించారు. వెబ్‌ల్యాండ్‌లో అవకతవకలకు పాల్పడి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అవకతవకలు నిర్ధారిస్తూ ఆర్డీఓ ఇచ్చిన నివేదిక ►గొరిదిండ్ల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 5–6లో 5.17 ఎకరాలు అన్‌సెటిల్డ్ భూమికి (ఖాతా నెంబరు 1000010) వెబ్‌ల్యాండ్‌లో రేనాటి వరలక్ష్మి పేరును పట్టాదారుగా మార్చారు. 788–3 సర్వే నెంబరులో 4.90 ఎకరాలు అన్‌సెటిల్డ్ భూమి (ఖాతా నెంబరు 1000010) డి.భీమానాయక్ పేరును పట్టాదారుగా మార్చారు. సర్వే నెంబరు 604–3లో నాగలక్ష్మికి చెందిన 2.85 ఎకరాలు భూమిని కొలిమి సల్మా అనే మహిళను పట్టాదారుగా మార్చారు. సర్వే నెంబరు 1122–1లో ఎలమకూరి తనుజాకు చెందిన 4.98 ఎకరాలను డి.గీంతాజలి పేరున మార్చారు. ►సనప రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 282–11లో చిన్నప్పకు చెందిన 4.15 ఎకరాల భూమిని పి.వై.ఎల్లప్ప పేరున మార్చారు. ►ఆత్మకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 373లో హరిజన మంత్రి ముత్యాలప్పకు చెందిన 0.50 ఎకరాల భూమిని వై.సుందరమ్మ పేరున మార్చారు. సర్వే నెంబరు 261–1లో ఎస్.నల్లమ్మకు చెందిన 3.42 ఎకరాల భూమిని లలితమ్మ పేరున పట్టా చేశారు. సర్వే నెంబరు 502–3లో అంకంపల్లి ఓబుళపతికి చెందిన 2.10 ఎకరాల భూమిని ఎ.సోమశేఖర్ పేరున మార్చారు. సర్వే నెంబరు 2–1లో బోడిపాటి నరసమ్మకు చెందిన ఐదు ఎకరాల భూమిని వెంటేసులు, బి.హరికుమార్ పేరున మార్చారు. సర్వే నెంబరు 122–బి1ఎ3లో ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన ఐదు ఎకరాలను ఎస్.నాగరత్నమ్మ పేరున మార్చారు. ►మదిగుబ్బలో సర్వే నెంబరు 136–6లో 1.25 ఎకరాల మిగులు భూమిని సద్దల పెద్ద నారాయణ పేరున మార్చారు. సర్వే నెంబరు 35–5లో బండి అపర్ణమ్మకు చెందిన 3.85 ఎకరాలను బండి ముత్యాలమ్మ పేరున మార్చారు. సర్వే నెంబరు 143–5బిలో 0.80 ఎకరాలు (లేని భూమి) తలారి నరసింహులు పేరున మార్చారు. ►పి.యాలేరులో సర్వే నెంబరు 403–1ఎలో మండల బొమ్మయ్యకు చెందిన ఐదు ఎకరాలను ఎం.మంజుల పేరున మార్చారు. సర్వే నెంబరు 181–1లో 2.50 ఎకరాల మిగులు భూమిని వై.సౌభాగ్య పేరున మార్చారు. సర్వే నెంబరు 58–1, 2లో ఎస్.దుబ్బరామయ్యకు చెందిన 0.98 ఎకరాలు, 0.96 ఎకరాల భూమిని సుగాలి బాబు పేరున మార్చారు. అదే సర్వే నెంబర్లలో దుబ్బరామయ్యకు చెందిన 0.97 ఎకరాలు, 0.96 ఎకరాల భూమిని సుగాలి లక్ష్మీనారాయణ పేరున మార్చారు. సర్వే నెంబరు 7–3లో జి.లక్ష్మన్నకు చెందిన 2.09 ఎకరాలను జి.శివారెడ్డి పేరున మార్చారు. సర్వే నెంబరు 453–6లో 4 ఎకరాల మిగులు భూమిని జె.మమత పేరున మార్చారు. ►బి.యాలేరులో సర్వే నెంబరు 85–1లో అన్‌సెటిల్డ్ భూమిని ఎనుముల అఖిల పేరున మార్చారు. సర్వే నెంబరు 224–1ఎలోని 2.20 ఎకరాలను (లేని భూమి) టి.లక్ష్మిదేవి పేరున మార్చారు. -
తృటిలో తప్పిన ప్రమాదం.. కూలిపోయిన తహసీల్దార్ ఆఫీసు పైకప్పు
సాక్షి, నిర్మల్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసు భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భవనం పైకప్పు కూలిపోతున్న సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, భవనం పరిస్థితిపై గత కొంతకాలంగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భవన పైకప్పు కూలిపోతున్న సమయంలో పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఇక, కొద్దిరోజలు నుంచి నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. -
తహసీల్దార్ కంత్రీ వేషాల్.. అమ్మాయిలను లోబరుచుకుని.. వీడియోలు తీసి..
►ఏదో పనిమీద కార్యాలయానికి వెళ్లిన మహిళపై కన్నేశాడు. అసైన్డ్ భూములు రాసిస్తానంటూ ఆశపెట్టాడు. నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ తన అవసరం తీర్చుకున్నాడు. ఆ తర్వాత తన కింది స్థాయి సిబ్బందికీ ఆమెను అప్పగించాడు. మొత్తంగా 8 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆ మహిళ పేరుపై పట్టా చేసిచ్చాడు. ►చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయిన ఓ మహిళను చేరదీశాడు. మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆమె ద్వారా అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి లోబరుచుకున్నాడు. ►దాదాపు 50 ఏళ్లున్న ఆ అధికారి వైద్య ఆరోగ్యశాఖతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ.. తన బిడ్డల వయస్సున్న కొందరు విద్యార్థుల జీవితాలను బలిచేశాడు. పైగా వారి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ నరకం చూపుతున్నాడు. ►ఇలా...ఎందరో మహిళల జీవితాలను నాశనం చేసిన ఆ తహసీల్దార్ అక్రమార్జనలోనూ ఆరితేరిపోయారు. అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మండలానికి మెజిస్ట్రేట్.. జవాబుదారీగా ఉండాల్సిన అధికారి దారి తప్పారు. మద్యం, మగువ, మనీ కోసమే ఉద్యోగమంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. వారానికి పాతిక లక్షలు అక్రమంగా ఆర్జిస్తున్నాడు..వీకెండ్లో అమ్మాయిలతో బెంగళూరుకు వెళ్లి సేదదీరుతున్నాడు. ఇటీవల ఈ అధికారి అవినీతి అక్రమాలపై ఓ వృద్ధురాలు కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేయగా.. ఆమె ఆర్డీఓను విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన ఆర్డీఓకు కళ్లుబైర్లుకమ్మే నిజాలు తెలియడంతో ఆయన సమగ్ర నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు సమర్పించారు. ఆమె దాన్ని సీసీఎల్ఏకు పంపనున్నట్లు తెలుస్తోంది. చదవండి: బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని.. చేయి తడపందే పని జరగదు గతంలో ధర్మవరం రెవెన్యూ డివిజన్లో పనిచేసిన సదరు తహసీల్దార్‌పై అవినీతి అరోపణలు వెల్లువెత్తాయి. భారీగా ముట్టజెప్పనిదే ఆయన పనిచేయరని బాధితులు గగ్గోలు పెట్టారు. పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సొంత శాఖ ఉద్యోగిపై ప్రేమ చూపిన అధికారులు ఆ తహసీల్దార్‌ను అక్కడి నుంచి ఉరవకొండ నియోజకవర్గానికి బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన పనితీరు మార్చుకోలేదు. పాత రూటులోనే వెళ్తూ భారీగా వెనకేసుకున్నారు. సంవత్సరం వ్యవధిలోనే 350 మ్యుటేషన్లు చేశారు. ఇందులో 23 అనధికారికంగా చేసినట్లు విచారణలో తేలింది. ఏకంగా రూ.6 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ♦అనంతపురం అశోక్‌నగర్‌లో రూ.1.50 కోట్లు విలువైన భవనంలో ఉంటున్న సదరు అధికారి...సమీపంలో ఉన్న రూ.2 కోట్ల బిల్డింగ్ కొనుగోలుకు రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిసింది. మరో అపార్టుమెంట్ కూడా బినామీల పేరుతో కొనుగోలు చేసి ఆధునికీకరణ పనులు చేయిస్తున్న సమాచారం. ♦బెంగళూరులో ఆరు అంతస్తుల అధునాతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ♦ఇటీవలే కాలువపల్లి సమీపంలో 30 ఎకరాల దానిమ్మతోట కొనుగోలు చేసినట్లు అధికారులే గుర్తించారు. అందరినీ ఏకం చేసి... తాను పనిచేసే మండల కేంద్రంలో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులను చేరదీసి దందాలకు దిగాడు. ఒక ఆర్ఎస్ఐ, వీఆర్ఓ, ఆర్ఐలతో జట్టుకట్టి భూ వివాదాలకు తెరతీశారు. రైతులు తమకు జరిగిన అన్యాయంపై నోరు మెదపాలని చూస్తే ఓ వైపు పోలీసులను, మరో వైపు రెవెన్యూ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దారికి తెచ్చుకుంటున్నారు. వీడియో కాల్స్‌తో... భారీగా ఆర్జిస్తున్న సదరు తహసీల్దార్‌కు అమ్మాయిలపై వ్యామోహం ఎక్కువ. పైగా ఉదయం 11 గంటల నుంచి మద్యం మత్తులో ఉంటాడని అధికారులే చెబుతున్నారు. కార్యాలయంలో గంట కూడా ఉండని ఆయన...ఆ తర్వాత తన మండల పరిధిలోనే ఓ గదిలో మహిళలతో కలిసి రాచకార్యాలు వెలగబెడుతుంటారని చెబుతున్నారు. యువతులకు డబ్బు ఎరవేసి బలితీసుకునే సదరు అధికారి తనకు నచ్చిన యువతి... ముందుగా వీడియో కాల్లో నగ్నంగా చూడాలని షరతు పెడతాడు. ఆ తర్వాతే ఆమెతో గడుపుతాడు. నచ్చితే తనతో పాటు కారులో తీసుకెళతాడు. అనంతపురం నగరంలోని మూడ నక్షత్రాల హోటల్లో ఆయన బస చేస్తారని తెలుస్తోంది. ఇలా కొందరితో సదరు తహసీల్దార్ చేసిన వీడియో చాట్లు ఇప్పుడు బహిర్గతం కాగా, ఉన్నతాధికారులు వాటిని కూడా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. -
శభాష్ తహసీల్దార్
మునుగోడు: వైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదని నల్లగొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు నిరూపిస్తున్నారు. ఆయన వీల్ చైర్లోనే విధులు నిర్వహిస్తున్నారు. పుట్టుకతోనే దివ్యాంగుడైన ఆయన గతంలో మునుగోడు డీటీగా పనిచేశారు. ఆరు నెలల క్రితం తహసీల్దార్‌గా పదో న్నతి పొంది ఇక్కడే పనిచేస్తున్నారు. సోమవారం మండలంలోని చొల్లేడు గ్రామంలో బృహత్ ప్రకృతివనం ఏర్పాటుకు అధికారులు చేపట్టిన భూ పరిశీలనకు ఆయన వీల్ చైర్లో హాజరయ్యారు. -
ప్రేమించుకున్నాం.. రక్షణ కల్పించండి..
తాడిమర్రి(శ్రీసత్యసాయి జిల్లా): కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలంటూ తహసీల్దార్‌ను ఆశ్రయించారు. వివరాలు... తాడిమర్రి మండలం దాడితోటకు చెందిన ఎం.కుళ్లాయప్ప కుమారుడు రాజ్‌కుమార్ టైల్స్ పరిచే పనిచేస్తున్నాడు. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలకు చెందిన తలారి శ్రీనివాసులు కుమార్తె మౌనిక, రాజ్‌కుమార్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదవండి👉: మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా కడపలో టైల్స్ పరిచేందుకు వెళ్లిన రాజ్‌కుమార్ వద్దకు ఈ నెల 4న మౌనిక ఒంటరిగా వెళ్లింది. అదే రోజు కడపలోని దుర్గమ్మ గుడిలో వీరు వివాహం చేసుకున్నారు. అయితే మౌనిక కనిపించడం లేదంటూ తండ్రి శ్రీనివాసులు చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమ జంట ఈ నెల 24న తాడిమర్రి పోలీసు స్టేషన్లో హాజరై తాము వివాహం చేసుకున్న సంగతి తెలిపారు. అనంతరం మంగళవారం తహసీల్దార్ హరిప్రసాద్‌ను కలిసి అమ్మాయి తరఫు కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తగిన రక్షణ కల్పించాలంటూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు హరిప్రసాద్, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
గాజువాక తహసీల్దార్‌కు 6 నెలలు జైలు శిక్ష
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో విశాఖపట్నం జిల్లా గాజువాక తహసీల్దార్ ఎంవీఎస్ లోకేశ్వరరావుకు హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. లోకేశ్వరరావు ఈ నెల 18న హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్) ముందు హాజరు కావాలని, అనంతరం ఆయన్ని ‘సివిల్ ప్రిజన్’కు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు. గాజువాక మండలం, తూంగ్లాం గ్రామం సర్వే నంబర్ 29/1లో ఉన్న తమ భూమి నుంచి అధికారులు ఖాళీ చేయిస్తున్నారంటూ పి.అజయ్‌కుమార్, మరొకరు హైకోర్టులో 2014లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్లను వారి భూమి నుంచి ఖాళీ చేయించవద్దని ఆదేశించింది. అయినా, అధికారులు ఆ భూమిలో నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో పిటిషనర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. పిటిషనర్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని తహసీల్దార్ తన కౌంటర్లో వివరించారు. ఇతర అధికారుల కౌంటర్లను కూడా పరిశీలించిన న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ.. పిటిషనర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చట్ట ప్రకారం ఖాళీ చేయించాల్సిందన్నారు. తహసీల్దార్ ఆ పని చేయకుండా నిర్మాణాలను కూల్చివేశారని, అది కూడా కోర్టు ఉత్తర్వులు ఉండగా చేశారని ఆక్షేపించారు. కోర్టు ఉత్తర్వులు చట్ట విరుద్ధమైతే అప్పిలేట్ కోర్టులో సవాలు చేయాలే తప్ప, వాటికి విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పారు. తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని తేల్చారు. అందువల్ల కోర్టు ధిక్కార చట్టం కింద తహసీల్దార్‌కు 6 నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
మంచిర్యాల: కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ హత్య
-
కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్య
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కొత్తపల్లి వీఆర్ఏ దుర్గం బాబును దుండగులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న దుర్గంబాబును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కక్షలతో వీఆర్ఏ హత్య జరిగిందా లేదా రెవెన్యూ అధికారుల మధ్య విబేధాలతో హత్య చోటుచేసుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా దుర్గం బాబు కొత్తపల్లి వీఆర్ఏగా పనిచేస్తున్నాడు, కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: ఫస్ట్ టైం క్రిమినల్స్: సినిమాలు, యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు అయితే కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా చంపేస్తామని బెదరిస్తున్నారని, అదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని దుర్గంబాబు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనే బాబును హత్య చేసి ఉంటాడని ఆరోపణలు చేస్తున్నారు. చదవండి: Banjara Hills: సీఎం శిలాఫలకానికే దిక్కులేదు.. ఇప్పటికైనా సాధ్యమేనా..? -
బాబు నుంచి భూమిని ఇప్పించండి
తాడేపల్లి రూరల్: తన ఇంటికి వెళ్లడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు వాడుతున్న రోడ్డు స్థలం తమదేనని, దాన్ని ఇప్పించాలని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన సింగంశెట్టి శ్రీనివాసరావు తాడేపల్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించాడు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డిని కలిశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఉండవల్లిలో ఆయన నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్‌కు దారిలేకపోవడంతో ఆర్డీవో, తాడేపల్లి తహసీల్దార్లు.. శ్రీనివాసరావుకు చెందిన 8 సెంట్ల స్థలాన్ని తీసుకున్నారు. ఈ స్థలంలో చంద్రబాబు ఇంటికి వెళ్లడానికి వీలుగా బీటీ రోడ్ వేశారు. అయితే ఈ స్థలానికి సంబంధించి బాధితుడికి రూపాయి కూడా చెల్లించలేదు. అప్పటి నుంచి అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అంటూ కాలం గడిపారు. ఇప్పుడు తన తండ్రి శేషగిరిరావుకు ఆరోగ్యం బాగోలేదని.. ఇప్పటికే రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టామని శ్రీనివాసరావు వాపోతున్నాడు. వైద్యానికి నగదు లేక ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశామని కన్నీటిపర్యంతమయ్యాడు. తన తండ్రి వైద్యానికి మరో రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. తమ స్థలం తమకు ఇస్తే అమ్ముకుని వైద్యానికి డబ్బు సమకూర్చుకుంటామని చెబుతున్నాడు. తన తండ్రి చావుబతుకుల్లో ఉంటే మరోవైపు తమకు కమీషన్ ఇస్తే స్థలానికి డబ్బులు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ స్థలం అయినా తమకు అప్పగించాలని లేదా నగదు అయినా ఇవ్వాలని కోరాడు. లేకపోతే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసరావు పేర్కొన్నాడు. -
తహసీల్ ఆఫీస్‌కే ఆపద !
సాక్షి, కామారెడ్డి: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు తయారైంది రెవెన్యూశాఖ పరిస్థితి. అందరి భూముల సమస్యలను పరిష్కరించే ఆ శాఖకే ఆపద వచ్చిపడింది. భూముల రికార్డులు భధ్రపరచడంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లు జరిగే తహశీల్దార్ కార్యాలయ భవనం ఉన్న స్థలం అటవీశాఖదట. తహసీల్ ఆఫీస్, మండల పరిషత్ కార్యాలయం, జూనియర్ కాలేజీ భవనం...ఇలా అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ అటవీశాఖకు సంబందించిన సర్వేనంబరులోనే ఉన్నాయంటున్నారు. అలాగే 175 మంది రైతులకు సంబందించిన వ్యవసాయ భూములు, 70 కిపైగా నివాసపు గృహాలు కూడా ఆ సర్వేనంబరులోకి వస్తాయట. ఎప్పుడో విడుదల చేసిన అటవీ శాఖ గెజిట్‌లో సదరు సర్వేనంబరు అటవీశాఖదిగా పేర్కొనడం ఇప్పుడు రెవెన్యూ శాఖకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఫారెస్ట్ గెజిట్‌లో పేర్కొన్న సర్వే నంబర్లకు సంబందించి ఎలాంటి పాసుపుస్తకాలు జారీ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. దీంతో ఆ సర్వేనంబరులోని రైతులకు పాసుపుస్తకాల జారీ ఆగిపోయింది. ఫలితంగా రైతుబంధు నిలిచిపోయింది. బాధిత రైతులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే రెవెన్యూ కార్యాలయమే ఆపదలో ఉంటే రైతుల కష్టం తీర్చేదెవరని నోరెల్లబెడుతున్నారు. లింగంపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారికి సమీపంలో 983 సర్వే నంబరులో 450.08 ఎకరాల భూమి ఉంది. ఈ సర్వేనంబరులో 175 మంది రైతులు వందలాది ఎకరాల భూమిని సాగుచేస్తున్నారు. 2005లో 150 ఎకరాలకు పట్టాలతో పాటు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఇచ్చారు. రైతులు బోర్లు తవ్వించుకుని పంటలు సాగు చేస్తున్నారు. పంట రుణాలు పొందారు. కొంత కాలం రైతుబంధు కూడా అందుకున్నారు. అదే సర్వేనంబరులో మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. అలాగే 70 కి పైగా ఇండ్లు కూడా నిర్మించుకుని ఉంటున్నారు. దశాబ్దాల తరబడిగా ఆ స్థలంలో జీవనం సాగుతోంది. రికార్డుల ప్రక్షాలణతో వెలుగులోకి.... రాష్ట్ర ప్రభుత్వం భూముల రికార్డుల ప్రక్షాలన మొదలుపెట్టిన సమయంలో అటవీ శాఖ తమ గెజిట్‌లోని సర్వే నంబర్లకు సంబందించిన వివరాలను రెవన్యూ శాఖ ముందుంచింది. రికార్డుల ప్రక్షాలన కొనసాగుతూ ఆ సర్వేనంబరుకు వచ్చేసరికి రెవెన్యూ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం దొరకలేదు. ఫారెస్ట్ గెజిట్‌లో పేర్కొన్నదానిని మార్చాలంటే ఇప్పట్లో సాధ్యం అయ్యే పనికాదని కూడా అంటున్నారు. కాగా అటవీ శాఖ గెజిట్‌లో 983 సర్వేనంబరు ఉండడంతో అందులో భూములు కలిగి ఉండి పంటలు సాగుచేస్తున్న రైతులకు డిజిటల్ పాసుపుస్తకాలు అందలేదు. దీంతో రైతులకు రైతుబంధు కూడా నిలిచిపోయింది. అక్కడి రైతులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. డిజిటల్ పాసుపుస్తకాలు రాకపోవడం, ఆ సర్వేనంబరును హోల్డ్‌లో పెట్టడంతో రైతుబంధు నిలిచిపోయింది. దీంతో రైతులు ఆవేధన చెందుతున్నారు. జడ్పీ సమావేశంలో ఇదే అంశంపై చర్చ.... ఈ నెల 5న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో లింగంపేట ప్రజాప్రతినిధులు 983 సర్వేనంబరుకు సంబందించిన సమస్యను ప్రస్తావించారు. ఆ సర్వే నంబరు గెజిట్‌లో ఉందని అటవీ శాఖ జిల్లా అధికారి నిఖిత పేర్కొన్నారు. తహశీల్దార్ కార్యాలయం కూడా అదే సర్వే నంబరులో ఉందని పేర్కొనడంతో సభలో నవ్వులు పూశాయి. తహశీల్దార్ కార్యాలయం అటవీశాఖ సర్వేనంబరులోనిది కావడంతో అందరూ విస్తుపోయారు. తమ చేతిలో ఏమీలేదని అటవీ అధికారులు సభలో పేర్కొన్నారు. అయితే అటవీ శాఖకు సంబందించిన భూమిని కొందరు రియల్టర్లు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని, దానిపై కేసులు వేశారని సభ్యులు పేర్కొనగా తాము కౌంటర్ పిటీషన్ వేసినట్టు ఆమె వివరణ ఇచ్చారు. ఫారెస్ట్ గెజిట్‌లో పేర్కొనడం వల్లే సమస్య.... 983 సర్వేనంబరునుఫారెస్ట్ గెజిట్‌లో పెట్టారు. అందువల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గెజిట్‌లో మార్పులు జరిగితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఉన్నతాధికారులకు గతంలోనే నివేదించాం. మా చేతుల్లో ఏమీ లేదు. రైతులు కూడా తిరుగుతున్నారు. పరిష్కారం దొరకాలంటే ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. గెజిట్‌లో ఆ సర్వేనంబరును తొలగిస్తేగానీ ఇబ్బంది పోదని భావిస్తున్నాం. –అమీన్ సింగ్, తహశీల్దార్ -
చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించిన తహశీల్దార్.. వీడియో వైరల్
సాక్షి మహబూబాబాద్: ఆయన తహశీల్దార్.. నిత్యం ఆఫీస్‌లో ఫైళ్లతో కుస్తీ పడుతుంటారు. ఎప్పుడూ రెవెన్యూ పని మీదే బిజీగా ఉంటారు. అయితే పనులన్నింటినీ కాసేపు పక్కకుపెట్టి సరదాగా గడిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన తహశీల్దార్ నూతన సంవత్సరం వేడుకల్లో డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు. కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లాలోని బలపాలపల్లి గ్రామం.అయితే అక్కడ జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో స్నేహితులతో కలిసి చిందేశారు. డ్యాన్సర్లకు ధీటుగా స్టెప్పులు వేస్తూ అలరించారు. అచ్చం మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించాడు. ప్రస్తుతం తహశీల్దార్ మంగీలాల్ డ్యాన్స్ చేసిన వీడియో స్థానిక వాట్సప్ గ్రూప్‌లలో వైరల్‌గా మారింది. చదవండి: దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్.. 84 ఏళ్ల చరిత్ర, నుమాయిష్ ఐడియా ఎలా వచ్చిందంటే.. -
Bribe: కదిరి తహశీల్దార్ ఆడియో వైరల్.. కలెక్టర్ సీరియస్
అనంతపురం అర్బన్: కదిరి తహసీల్దారు మారుతిపై కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ చర్యలు తీసుకున్నారు. ఆయన్ను కదిరి తహసీల్దారు స్థానం నుంచి రిలీవ్ చేస్తూ..కలెక్టరేట్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం పట్టాదారు పాసు పుస్తకం మంజూరుకు తహసీల్దారు లంచం అడుగుతున్నట్లుగా వాయిస్ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కదిరి ఆర్డీఓ ద్వారా ప్రాథమిక విచారణ చేయించారు. ఆర్డీఓ ఇచ్చిన నివేదికపై కలెక్టర్ సంతృప్తి చెందలేదు. ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్‌తో సమగ్ర విచారణ చేయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విచారణ అధికారి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు
జగిత్యాల రూరల్: తమ భూములు లాక్కోవద్దని రైతులు తహసీల్దార్‌పై కాళ్లపై పడ్డారు. పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన స్థలం తమ పొలంగా పేర్కొంటూ కొందరు రైతులు ఆందోళన చేసిన ఘటన జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది. గ్రామ శివారు సర్వే నంబర్ 125లో బృహత్ పల్లెప్రకృతి వనం నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించారు. ఆ భూమిలో మూడు రోజులుగా నేల చదును చేసే పనులు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది అది తమ భూమి అని పనులు అడ్డుకున్నారు. రూరల్ తహసీల్దార్ దిలీప్ నాయక్, ఎంపీడీఓ రాజేశ్వరి మంగళవారం గ్రామానికి వెళ్లి పనులు పరిశీలించారు. ఈ క్రమంలో పలువురు గ్రామస్తులు.. తమ భూములు లాక్కోవద్దని తహసీల్దార్ కాళ్లపై పడ్డారు. తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్ -
తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించొద్దు
హుజూరాబాద్: తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ తహసీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా మంజూరైన రేషన్ కార్డులన్నింటినీ ప్రింట్ తీసి, లబ్దిదారుల ఇంటికి వెళ్లి కొత్త కార్డుతో పాటుగా, 5వ తేదీలోగా బియ్యం పంపిణీ కూడా చేపట్టాలని అధికారులకు సూ చించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతీ ఒక్కరికి తెలుపు రేషన్ కార్డు మంజూరు చేశామని వెల్లడించారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఎంతమందికి కొత్త రేషన్ కా ర్డులు మంజూరు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా మండలాలకు సంబంధించిన అ ధికారులు, తదితరులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, బియ్యం పంపిణీ విషయాల గురించి తెలుసుకొని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సీహెచ్. రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’ చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం -
రెవెన్యూ శాఖలో పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ఎట్టకేలకు ఊరట. ఈ శాఖ పరిధిలోని ఉద్యోగులకు సెప్టెంబర్‌లో పదోన్నతులిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌ను కలిసినప్పుడు ఆయన ఈ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదా వరకు పలుస్థాయిల్లో పదోన్నతులు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 40–50 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 90–100 డిప్యూటీ కలెక్టర్లు, 160 తహశీల్దార్ పోస్టులు ఖాళీలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదిలో 369 మంది నాయిబ్ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) నిర్ణయించిందని, అయితే ఇందులో 190 మందికి మాత్రమే పదోన్నతులు ఖరారు చేయగా, మిగిలిన వారికి ఇవ్వలేదని సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ ప్యానెల్ ఇయర్ ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో డీపీసీ ఆమోదం వచ్చినా పదోన్నతులు రాని నాయబ్ తహసీల్దార్ల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన కూడా ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గ్రామానికి ఒక్కరే వీఆర్ఏ! సీఎస్ సోమేశ్‌కుమార్‌తో ట్రెసా నేతల భేటీ సందర్భంగా వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తామని, వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసినందున వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం (వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి ముందు) 5,836 మంది వీఆర్వోలుగా పనిచేస్తున్నారు. వీరి భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన సిబ్బందిలో కనిపిస్తున్నా, వారిలో అర్హులను రెవెన్యూ శాఖలోనే కొనసాగించి, మిగిలిన వారిని ఇతర శాఖలకు బదిలీ చేస్తారని తెలుస్తోంది. వీఆర్ఏల విషయానికి వస్తే గ్రామానికి ఒక్కరిని మాత్రమే వీఆర్ఏగా కొనసాగిస్తారని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేల మంది వీఆర్ఏలు ఉండగా, గ్రామానికి ఒకరి చొప్పున కొనసాగిస్తే 10 వేల మందికి ఊరట కలగనుంది. మిగిలిన వారిని అర్హతలకు అనుగుణంగా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సీనియార్టీ సమస్యలు రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ)ల వరకే పదోన్నతులు లభిస్తున్నాయి. ఆ తర్వా త రెవెన్యూ కోటాలో కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా మాత్రమే అవకాశముంది. దీంతో సీనియార్టీ సమస్యలు వస్తున్నాయని రెవె న్యూ సంఘాలంటున్నాయి. డీఆర్వో, జేసీలాంటి పోస్టుల్లో ఈ సమస్యలు వస్తున్నాయని, డీఆర్వో పోస్టుకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను పరిగణనలోకి తీసుకుంటుండటంతో ఆ తర్వాత పదోన్నతులు రావడం లేదని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ పరిధిలో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ) పోస్టు సృష్టించాలని ‘ట్రెసా’విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసారి ఐదు ఆప్షన్లు రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ బదిలీలకు ఒకట్రెండు ఆప్షన్లు ఇచ్చే సంప్రదాయం ఉండగా, ఈసారి ఐదు రకాల ఆప్షన్లు ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఇందులో స్పౌస్, మెడికల్, పీహెచ్సీ, జిల్లా, మల్టీజోన్ ఆప్షన్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
క్షణ క్షణం.. భయం భయం!
అంబర్‌పేట: అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. పాత భవనంలో తహశీల్దార్ కార్యకలాపాలు నిర్వహించడానికి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రెండు దశాబ్ధాల క్రితం నిర్మించిన భవనంలో ఇప్పటికీ తహశీల్దార్ కార్యాలయం కొనసాగుతుండటంతో అటు సిబ్బంది, ఇటు పౌరులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా తహశీల్దార్ కార్యాలయం మాత్రం మారడం లేదు. శిథిల భవనంలో సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నిత్యం వందలాది పౌరులకు, వివిధ సేవలు అందించే కార్యాలయం సౌకర్యవంతంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం కార్యాలయం ప్రారంభం కాగానే వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురవుతున్నారు. కార్యాలయ ఆవరణలో రేకుల షెడ్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, శిథిల భవనంలో తహశీల్దార్‌తో పాటు డిప్యూటీ తహశీల్దార్ విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సైతం ఇదేం కార్యాలయం అన్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పటికైనా తహశీల్దార్ కార్యాలయాన్ని పునర్నిర్మించాలని పలువురు కోరుతున్నారు. అమలుకు నోచుకోని హామీలు తహశీల్దార్ కార్యాలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో హామీలు, ప్రకటనలు ఇచ్చారే తప్ప ఇప్పటివరకు అవి ఆచరణకు నోచుకోలేదు. నియోజక వర్గంతో పాటు మలక్‌పేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు ఈ మండల పరిధిలోకి వస్తాయి. నిత్యం ఆ దాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రభు త్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్, ఆసరా పెన్షన్లు వంటి ప్రభుత్వ పథకాలు ఈ కార్యాలయం నుంచే సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు అమలు చేసే కీలకమైన తహశీల్దార్ కార్యాలయం అధ్వానంగా ఉండటంపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యాలయానికి వచ్చి పోతుంటారే తప్ప పునర్ నిర్మించేందుకు చొరవ తీసుకోకపోవడం గమనార్హం. అసౌకర్యంగా ఉన్నా మెరుగైన సేవలందిస్తున్నాం తహశీల్దార్ కార్యాలయం పునర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని ఎమ్మెల్యే సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే నిధులు విడుదల కాగానే మొదటి ప్రాధాన్యతలో భాగంగా కార్యాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఈవిషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం విధులు నిర్వహించేందుకు అసౌకర్యంగా ఉన్నా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. – వేణుగోపాల్, అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోప్రమాదకరంగా ఎండిన చెట్టు -
ఏసీబీ వలలో కాటారం తహశీల్ధార్
సాక్షి, భూపాలపల్లి: కాటారం తహశీల్దార్ మేడిపల్లి సునీత 2లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐత హరికృష్ణకు చెందిన కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు-3 లో భూమికి ఆన్లైన్ చేసి, పట్టా పాస్ బుక్కుల కోసం 3 లక్షలు తహశీల్దార్ డిమాండ్ చేశారు. చివరకు రూ. 2 లక్షలు తీసుకుంటూ సునీత.. ఏసీబీ అధికారులకు చిక్కారు. -
చోడవరం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని చోడవరం తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం బయటపడింది. భూమి మార్పిడి పేరిట నాలుగు లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఏసీబికి అడ్డంగా దొరికొపోయారు. వీరికి సహకరించిన డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. చోడవరం సమీపంలోని నరసాపురం వద్ద ఓ వ్యవసాయ భూమిని నివాసభూమి గా మార్చేందుకు ఓ వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆ పనులు చేయకుండా ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది జాప్యం చేశారు. ఈ దశలో దరఖాస్తుదారుడు ఎమ్మార్వో రవికుమార్‌తో పాటు డిప్యూటీ తాసిల్దారు రాజాను కలిసి భూముల రికార్డుల మార్పిడి చేయాలని కోరాడు. ఈ పని పూర్తి చేయాలంటే నాలుగున్నర లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని తాసిల్దారు డ్రైవర్ రమేష్ కు ఇవ్వాలని తెలిపారు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సదరు వ్యక్తి వారి సూచనల మేరకు డ్రైవర్ రమేష్‌కు నాలుగున్నర లక్షల రూపాయలను ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు వారి ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్ర పర్యవేక్షణలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. -
ఇదే నామాట.. నా మాటే శాసనం.. తహసీల్దార్‌పై ఎమ్మెల్సీ సోదరి జులుం..
సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లాలో మరో తహసీల్దార్ బదిలీ జరిగింది. అయితే, ఇది సాధారణ బదిలీ కాదు! మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మి బ‘ది’లీ అయినట్లు తెలుస్తోంది. సుమారు వారం పాటు తర్జనభర్జన చేసిన జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు రాజకీయ నేతల ఒత్తిడికే తలొగ్గినట్లు కనిపిస్తోంది. వేలేరు తహసీల్దార్‌ను కలెక్టరేట్‌కు బదిలీ చేసి సమస్యకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తహసీల్దార్, వేలేరు జెడ్పీటీసీకి నడుమ జరిగిన ఫోన్ సంభాషణ బయటకు లీక్ కావడంతో మొత్తం వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇప్పుడిది అటు ఉద్యోగ, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగింది.. వేలేరు మండలం షోడషపల్లి శివారు లోక్యాతండాలో కొంత కాలంగా మొరం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ ఒత్తిడి నేపథ్యాన చాలాకాలంగా రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు ఉంటోంది. కానీ స్థానిక ప్రజాప్రతినిధుల నడుమ తలెత్తిన అంతర్గత వివాదాల కారణంగా మైనింగ్‌పై తరుచూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో మొరం తరలిస్తున్న వాహనాలను వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు అడ్డుకున్నారు. వీటిని సీజ్ చేసి పెద్ద మొత్తంలో జరిమానా విధించడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోదరి.. వేలేరు జెడ్పీటీసీ సరిత రంగంలోకి దిగారు. నేరుగా తహసీల్దార్‌కు ఫోన్ చేసిన సీజ్ చేసిన వాహనాలకు కేవలం రూ.25వేల చొప్పున మాత్రమే జరిమానా విధించాలని సూచించారు. అక్కడి నాయకుల మాటలు విని ఎక్కువ ఫైన్ వేయొద్దని చెప్పారు. అంతేకాకుండా తాను ఎమ్మెల్సీ సోదరినని.. తాను చెబితే ఎమ్మెల్సీ చెప్పినట్లుగానే భావించాలని తెలిపారు. దీనికి తహసీల్దార్ ససేమిరా అన్నారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చెప్పి ఒక్కో వాహనానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. జెడ్పీటీసీ – తహసీల్దార్ నడుమ మాటామాటా పెరిగినా, తహసీల్దార్ వెనక్కి తగ్గలేదు. దీంతో ఆమెను బదిలీ చేయించేందుకు ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఫలితంగా ప్రజాప్రతినిధి మాట విననందుకు తహసీల్దార్ విజయలక్ష్మి అక్కడి నుంచి కలెక్టరేట్ బదిలీ అయ్యారు. గ్రామస్తుల ఫిర్యాదు తహసీల్దార్ – జెడ్పీటీసీ నడుమ వ్యవహారం రచ్చగా మారడంతో గ్రామంలో మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్న వారు తెరపైకి వచ్చారు. ఏకంగా వారు «పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా వ్యవహారం పెద్దగా మారుతుండడంతో ఇరువర్గాల వారికి కూర్చోబెట్టి సయోధ్య కుదర్చడానికి కొందరు ప్రజాప్రతినిధులు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే, ఫోన్లో మాట్లాడే క్రమంలో స్థానిక నాయకులపై కూడా జెడ్పీటీసీ అనుచితంగా మాట్లాడటం గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులను ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో వీరిని కూడా బుజ్జగించేందుకు చర్యలు మొదలయ్యాయని తెలుస్తోంది. నేనే సమాచారం ఇచ్చా... మొత్తం వ్యవహారంపై వేలేరు జెడ్పీటీసీ చాడ సరిత వివరణ ఇస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్యాతండా నుంచి కొందరు మొరం తరలిస్తుండగా తానే అడ్డుకుని తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా మైనింగ్ అధికారులకు సైతం ఫోన్లో సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. అంతేతప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని పేర్కొన్నారు. ఇక కలెక్టరేట్ అధికారులు మాత్రం వేలేరు తహసీల్దార్ బదిలీ వ్యవహారాన్ని పరిపాలనా సౌలభ్యం కోసమే చేపట్టినట్లుగా చూడాలని చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కొన్ని సందర్భాల్లో సహజమే అయినా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సామరస్య పూర్వకంగా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: పేకాటలో దొరికిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు -
ఫోన్‌కాల్ కలకలం: ‘నువ్వేమైనా కేసీఆర్వా.. లేక ఎర్రబెల్లివా?’
హన్మకొండ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోదరి చాడ సరిత వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో మొరం తరలింపు విషయం వివాదంగా మారింది. అప్పట్లో స్వాధీనం చేసుకున్న ఇటాచీ సహా ఇతర వాహనాలను తక్కువ జరిమానాతో వదిలేయాలని అక్కడి తహసీల్దార్ విజయలక్ష్మికి ఫోన్లో హుకుం జారీ చేశారు సరిత. అయినా తహసీల్దార్ వినకపోవడంతో గట్టిగా బెదిరించారు. ఇటీవల జడ్పీటీసీ, తహసీల్దార్ మధ్య సాగిన ఫోన్ సంభాషణ బుధవారం సోషల్ మీడి యాలో వైరల్‌గా మారింది. తాను చెప్పినా.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పినా ఒక్కటిగా భావించాలని, ఎమ్మెల్సీ మాట వింటారా, ఎంపీపీ మాట వింటారా మొదట తేల్చుకోవాలని జడ్పీటీసీ సరిత చెప్పారు. ‘రూ.25 వేలు కట్టించుకుని మిషన్ రిలీజ్ చేయండి.. అక్కడే పెట్టుకుంటే తుప్పు పట్టి పోవాల్నా.. అవసరమైతే ఎమ్మార్వో ఆఫీసు ఎదుట కూర్చుంటా’అని సరిత హెచ్చరించారు. అయితే.. తాము మొదటి నుంచీ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తున్నామని, అయినా కలెక్టర్ చెప్పినట్లు చేస్తానని తహసీల్దార్ చెప్పడంతో.. జడ్పీటీసీ జోక్యం చేసుకొని ‘మనవాడే కదా అని తీసుకొస్తే రూ.లక్ష కట్టమంటే ఎలా? రూ.25 వేలు కట్టించుకొని రిలీజ్ చేయాలని హుకుం జారీ చేశారు. అసలు ఎంపీపీ ఎవరు? ఏమన్నా.. ఎర్రబెల్లి దయాకర్‌రావా.. లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ప్రతీదిఅన్నయ్యకు చెప్పి చేస్తా.. ఇది మా అన్నయ్య మాట. పల్లా మాట వింటారా... ఎంపీపీ మాట వింటారా మీ ఇష్టం అని’సరిత చెప్పారు. తర్వాత ఏం జరిగిందో కానీ వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మిని కలెక్టరేట్‌కు బదిలీ చేయడం కొసమెరుపు. చదవండి: కఠిన కర్ఫ్యూ.. తెలంగాణలో భారీగా లాక్డౌన్ సడలింపులు -
వామ్మో..! యాసిడ్ తాగేసిన తహసీల్దార్
జమ్మూ: విధుల్లో భాగంగా తహసీల్దార్ ఓ గ్రామానికి వెళ్లగా అక్కడ పని ముగిసిన తర్వాత దుకాణంలో నీళ్ల బాటిల్‌గా భావించి యాసిడ్ బాటిల్ తీసుకుని తాగేశాడు. వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. అయితే దుకాణదారుడు నీళ్ల బాటిల్ అనుకుని పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. దీంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లో బుధవారం జరిగింది. కుల్గాం జిల్లాలోని దమాల్ హంజిపూర ప్రాంత తహసీల్దార్ నియాజ్ అహ్మద్ ఓ గ్రామంలో సాగు చేస్తున్న గసగసాల పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వాటిని ధ్వంసం చేసి ఉదయం 11 గంటల సమయంలో అక్కడే ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. నీళ్ల బాటిల్ అడగ్గా దుకాణదారుడు పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. ఇది గమనించకుండా తహసీల్దార్ నియాజ్ అహ్మద్ తాగేశాడు. తాగిన వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి ఉద్యోగులు స్థానికులతో కలిసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన దమాల్ హంజిపురలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు దుకాణదారుడిని అరెస్ట్ చేసి అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చదవండి: అయ్యో పాపం.. అదా రాణి! -
వృద్ధురాలికి అంత్యక్రియలు... మానవత్వం చాటుకున్న తహసీల్దార్
సాక్షి, గడివేముల: కుటుంబ సభ్యులంతా కరోనా బారినపడి కోవిడ్ కేర్ సెంటరులో ఉండగా.. ఇంటి వద్ద అనాథలా మృతిచెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు చేయడానికి స్థానికులెవరూ ముందుకు రాలేదు. కానీ స్వయాన మండల తహసీల్దార్ కన్నబిడ్డలా ముందుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సంఘటన గడివేముల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొరటమద్ది గ్రామానికి చెందిన వడ్డు లక్ష్మిదేవమ్మ(85) కుమారుడు, కోడలు, మనవడు, మనవడి భార్య మూడు రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరిని వైద్యసిబ్బంది చికిత్స నిమిత్తం నంద్యాలలోని కోవిడ్ కేర్ సెంటరుకు తరలించారు. అప్పటి నుంచి లక్ష్మిదేవమ్మ ఒక్కరే ఇంట్లో ఉండేవారు. కుటుంబ సభ్యుల పరిస్థితిని తలచుకుని ఆందోళన చెందుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. కుటుంబ సభ్యులు కోవిడ్ కేర్ సెంటరులో ఉండిపోవడం, కరోనా భయంతో స్థానికులెవరూ ఆమె అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాని విషయం తహసీల్దార్ నాగమణి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె మంగళవారం సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ఒక కూతురిలాగా లక్ష్మిదేవమ్మ మృతదేహాన్ని సిబ్బందితో కలిసి మోసుకుంటూ వెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అంత్యక్రియలలో తహసీల్దార్‌కు గ్రామ సర్పంచ్ నాగేశ్వర్‌రెడ్డి తదితరులు సహకరించారు. చదవండి: ‘మాయలేడి’ మామూలుది కాదు.. లక్షల కాజేసి.. భర్త అనుమానం.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య -
వైరల్ వీడియో: లాక్డౌన్ ఉల్లంఘన.. స్టెప్పులేసిన మహిళా తహసీల్దార్
-
లాక్డౌన్ ఉల్లంఘన.. స్టెప్పులేసిన మహిళా తహసీల్దార్
భువనేశ్వర్ : కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న వేళ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించారు ఓ తహసీల్దార్. ముఖానికి మాస్క్, సామాజిక దూరం పాటించకుండా ఓ వేడుకలో ఇష్టారీతీగా స్టెప్పులు వేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరలవ్వడంతో సదరు అధికారిణిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలేంజరిగిందంటే.. తీవ్రంగా వ్యాపిస్తున్న కోవిడ్‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఒడిశా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఈ క్రమంలో వివాహ వేడుకలకు కేవలం 25 మందికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒడిశాలోని సుకిందా మహిళా తహసీల్దార్ బుల్బుల్ బెహెరా లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించారు. జగత్సింగ్పూర్లో తన సోదరుడి వివాహ వేడుకకు తహసీల్దార్ హాజరయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ వేడుక ఊరేగిపులో లాక్డౌన్ మార్గదర్శకాలు పాటించకుండా బెహెరా డ్యాన్స్ చేశారు. ముఖానికి మాస్క్, సామాజిక దూరాన్ని గాలికొదిలేసి బంధువులతో కలిసి తీన్మార్ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో కోవిడ్ కట్టడి చర్యలను ప్రజలకు తెలియజేయాల్సిన అధికారులే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ నెటిజన్లు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. ఇక ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో జాజ్‌పూర్ జిల్లా కలెక్టర్ చక్రవర్తి సింగ్ రాథోడ్ స్పందించారు. ప్రస్తుతం ఆ మహిళా అధికారిర్ సెలవులో ఉన్నట్లు వెల్లడించారు.సెలవులు ముగిసి వీధుల్లో చేరిన తర్వాత ఆమె నుంచి వివరణ కోరి, తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినైనా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతనెల ఓ మహిళా హోంగార్డుతో నలుగురు పోలీసులు యూనిఫాంలో నృత్యం చేస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో పానికోయిలి పోలీస్ స్టేషన్ ఏఎస్సైను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: వైరల్: పెళ్లితో ఒక్కటైన జంట.. భూమ్మీద కాదండోయ్! -
కరోనాతో మునుగోడు తహసీల్దార్ మృతి
సాక్షి, మునుగోడు: కరోనా బారిన పడిన నల్ల గొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ సునంద (58) మృతి చెందారు. పక్షం రోజుల క్రితం వైరస్ బారినపడ్డారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండటంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె.. శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. (చదవండి: రైల్వే ఉద్యోగి దారుణహత్య) -
తహసీల్దార్ .. పనితో బేజార్
‘‘మీ సేవ కేంద్రాల నుంచి ఒక్క ధరణి పోర్టల్‌కు సంబంధించినవే వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోవడం లేదని తహసీల్దార్లు అంటున్నారు..’’ ‘‘ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్ల ద్వారా పరిష్కరించాల్సిన భూ సమస్యలు కోర్టు ఉత్తర్వులతో మళ్లీ విచారించాల్సి రావడంతో ఆయా కేసులకు సంబంధించిన రిపోర్టులు ఇచ్చే పనిని కూడా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు.. తహసీల్దార్లకే అప్పజెబుతున్నారు..’’ ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు బాధ్యత కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ, వ్యాక్సిన్‌పై అవగాహన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రొటోకాల్ విధులు సాక్షి, హైదరాబాద్: ఒక్కటి కాదు, రెండు కాదు.. అనేక బాధ్యతలతో రాష్ట్రంలోని తహసీల్దార్లు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారు. ఒకదానిపై మరొకటిగా మీద పడుతున్న పనులు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాధ్యతలన్నీ సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోంది. ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారం నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని బాధ్యతలూ రెవెన్యూ సిబ్బందిపైనే పెట్టడంతో అన్నింటినీ సమన్వయపర్చుకోవడం కష్టతరమవుతోంది. ముఖ్యంగా ధరణి సమస్యల పరిష్కారం తహసీల్దార్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ సమస్యల పరిష్కారం కోసం రికార్డులు తనిఖీ చేసి, స్వయం అధీకృత (అటెస్టెడ్) కాపీలు తయారు చేసేందుకే ఉన్న సమయం సరిపోతోందని తహసీల్దార్లు వాపోతున్నారు. మరోవైపు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, కోవిడ్ బాధ్యతలు, ధాన్యం కొనుగోళ్లు, ప్రకృతి వనాల భూసేకరణ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ప్రొటోకాల్ విధులు...ఇలా లెక్కకు మిక్కిలి పనులు అప్పగించడంతో ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, ఆయా పనులకు తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారానికి తోడు ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా తహసీల్దార్లే చేయాల్సి వస్తోంది. తహసీల్దార్ విధులు నిర్వహిస్తూనే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తోందని, తమకుండే సాధారణ పని బాధ్యతలకు తోడు వీటిని సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోందనేది తహసీల్దార్ల వాదన. ఇంకా ఎన్నో... అదనంగా ప్రభుత్వం కొత్తగా మరిన్ని బాధ్యతలను తహసీల్దార్లకు అప్పజెప్పింది. ముఖ్యంగా కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల ఎంపిక, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవడం, వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం, కోవిడ్ నిర్ధారణ కేంద్రాల వద్ద జన సమ్మర్ధ నియంత్రణ బాధ్యతలను కూడా రెవెన్యూకే ఇవ్వడంతో తహసీల్దార్లు ఆయా మండలాల్లోని వీఆర్ఏలు, వీఆర్వోలతో ఈ పనులు చేయిస్తూ పర్యవేక్షించాల్సి వస్తోంది. మరోవైపు రబీ ధాన్యం కొనుగోళ్లు పేరుకే పౌరసరఫరాల శాఖ ద్వారా చేస్తున్నా అన్ని పనులూ రెవెన్యూ సిబ్బందే చూసుకోవాల్సి వస్తోందని, ఈ పనిని కూడా జిల్లా కలెక్టర్లు తమకే అప్పగించారని తహసీల్దార్లు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎంపిక, మద్దతు ధర అందేలా చూడడం, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చూడడం, ప్యాడీ క్లీనర్లు, మంచినీళ్లు లాంటి కనీస సౌకర్యాల కల్పన పనులు కూడా తహసీల్దార్లకే అప్పగించడం గమనార్హం. దీనికి తోడు పల్లె ప్రకృతి వనాలకు భూసేకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు లాంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, ప్రొటోకాల్ విధులు వారే చేయాల్సి వస్తోంది. ఇక ధరణి ద్వారా మరిన్ని ఆప్షన్లు ఇస్తే దరఖాస్తులు ఇంకా పెరుగుతాయని, అప్పుడు ఈ రికార్డులు తయారు చేసుకోవడం తప్ప ఎలాంటి పనులూ చేయలేమని అంటున్నారు. పని భారంతో తప్పులు జరుగుతాయేమోననే ఆందోళన ఎక్కువ అవుతోందని, ముఖ్యంగా భూముల విషయంలో పొరపాట్లు జరిగితే ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ విషయంలో తగిన విధంగా ఆలోచించి ధరణి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కొన్ని బాధ్యతల నుంచి తమను తప్పించాలని తహసీల్దార్లు కోరుతున్నారు. పేరుకే కలెక్టర్లు.. చేసేదంతా తహసీల్దార్లే... ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారం విషయంలో తహసీల్దార్లను జిల్లాల కలెక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని సమాచారం. ఈ పోర్టల్ ద్వారా 11 రకాల సమస్యలు పరిష్కరించుకునేందుకు గత వారం రోజులుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆధార్‌లో తప్పులు, ఆధార్ అనుసంధానం, తండ్రి/భర్త పేరులో మార్పు, ఫోటో తప్పులు, లింగ నమోదులో తప్పులు, కులం తప్పులు, సర్వే నంబర్ల మిస్సింగ్, భూసేకరణ పద్ధతుల్లో మార్పు, భూమి స్వభావ రికార్డు సరిచేయడం, భూ వర్గీకరణ, డిజిటల్ సంతకాలు... ఇలా 11 రకాల సమస్యల పరిష్కారానికి భూ యజమానులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు నేరుగా తహసీల్దార్లకు వస్తాయి. కానీ, వీటిపై నిర్ణయం తీసుకునే అధికారం తహసీల్దార్లకు లేదు. కేవలం వీటిని తనిఖీ చేసి రిపోర్టు ఇస్తే జిల్లా కలెక్టర్లే నేరుగా ఆన్లైన్లో సరిచేస్తారు. అయితే కలెక్టర్లు కూడా పని ఒత్తిడితో భారమంతా తమపై వేసి చేతులు దులుపుకుంటున్నారని, తగిన సమయం ఇవ్వకుండా ఒత్తిడికి గురిచేస్తున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం మీ సేవ నుంచి దరఖాస్తు వస్తే ఆ దరఖాస్తుతో పాటు అందుకు సంబంధించిన సాక్ష్యాలను సిటిజన్ లాగిన్‌లో డౌన్లోడ్ చేసుకుని, రికార్డులను పరిశీలించి, జిరాక్సులు తీసి, ప్రతి దానికి ఫార్మాట్ రూపంలో సమాధానమిస్తూ వాటిని మళ్లీ తామే అటెస్ట్ చేస్తూ ఆర్డీవోలకు ఆఫ్‌లైన్‌లో సమర్పించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆ తర్వాత వాటిని ఆర్డీవోలు కూడా పరిశీలించి, ప్రతి సమస్యకూ ఓ ప్రొసీడింగ్ ఇచ్చి కౌంటర్ సంతకం పెట్టి వాటిని కలెక్టరేట్లో సమర్పిస్తేనే ధరణి సమస్యలను కలెక్టర్లు ఆన్లైన్లో పరిష్కరిస్తున్నారు. ఆ విధంగా కలెక్టర్లు ఓకే చేసిన దరఖాస్తులు తిరిగి తమ వద్దకు వస్తే వాటికి పూర్తి బాధ్యత వహిస్తూ తహసీల్దార్లే సంతకాలు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోడం లేదంటున్నారు. ఇక, ప్రభుత్వ భూముల నిర్ధారణ కోసం అయితే 1954 కంటే ముందు నుంచి రికార్డులన్నింటినీ (పహాణీలు) పరిశీలించాల్సి వస్తోందని, కలెక్టర్లు మాత్రం అన్ని బాధ్యతలూ తమపై వేసి త్వరగా పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలి రాష్ట్రంలోని తహసీల్దార్లకు ఇప్పుడు 24 గంటల సమయం సరిపోవడం లేదు. ప్రభుత్వం అప్పగించిన పనులు చేయడంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక్క తహసీల్దార్ ఇన్ని పనులు చేయడం చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించాల్సిన సమస్యల భారమంతా మాపై వేసి కలెక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే అప్పగించిన పనులను సజావుగా పూర్తి చేయగలం. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - వంగా రవీందర్‌రెడ్డి, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు -
టైమ్ 11 దాటినా పత్తాలేని తహసీల్దార్..
సాక్షి, మెదక్ : పరిపాలన వ్యవస్థ సక్రమంగా నడవాలంటే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఏ ప్రభుత్వానికైనా మంచిపేరు రావాలంటే అధికారుల కృషి ఉండాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం తరచూ సమయపాలన పాటించకపోవడం పట్ల ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన రేగోడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11గంటలు దాటినా కార్యాలయంలో కేవలం ధరణి కంప్యూటర్ ఆపరేటర్, ఒక వీఆర్ఏ మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో అక్కడే తహసీల్దార్ కోసం పడిగాపులు కాసిన రైతులు, ప్రజలు విలేకరులకు సమాచారం అందించారు. విలేకరులు వెల్లి చూడగా తహసీల్దార్‌తో పాటు పలువురు అందుబాటులో లేరు. తరచూ సమయపాలన పాటించడం లేదని పలువురు వాపోయారు. గతంలో అధికారుల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారుల తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలనెలా వేలరూపాయలు వేతనం తీసుకుంటున్నా విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భూమి మార్పు విషయంలో అడిగిన డబ్బులు ఇచ్చినా ఓ అధికారి, వీఆర్ఓ పనిచేయకుండా తిప్పించుకుంటున్నారని మర్పల్లి గ్రామానికి చెందిన ఒకరు తెలిపారు. మారుమూల మండలంలోని రేగోడ్పై జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిపిస్తున్నారని ఆరోపించారు. కార్యాలయానికి వెల్లే సన్నిహితులకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్యులను పట్టించుకోకపోవడం ఏమిటోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోని ఇబ్బందులు తప్పించాలని పలువురు కోరుతున్నారు. చదవండి: ఏంది స్వామి 20 లక్షలు అలా కాల్చినావ్ జిల్లా కేంద్రంలో ఏసీపీ హల్చల్ రెండేళ్లుగా తిరుగుతున్నా మా తాత పేరున ఉన్న 133అ సర్వే నంబరులో ఎకరా మూడుగుంటలనర భూమికి తొమ్మిది గుంటలు భూమి మాత్రమే ఆన్లైన్లో చూపిస్తుంది. మిగతా భుమిని ఆన్లైన్లో పెట్టాలని అధికారులను తరచూ కోరుతున్నా. గత సంవత్సరం కార్యాలయంలోని ఓ అధికారికి, వీఆర్ఓకు డబ్బులు ఇచ్చినా భూమిని సరిచేయలేదని, మా తాతపేరుపై ఉన్న భూమిని మా నాన్న పేరున చేయడం లేదు. రోజూ తిరుగుతున్నా పని కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. – అనిల్, మర్పల్లి ఫిర్యాదు చేసినా మారడం లేదు తహసీల్దార్‌తో పాటు సిబ్బంది సమయానికి రావడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా అధికారి, సిబ్బందిలో మార్పు రావడం లేదు. ఇక్కడి అధికారుల తీరువల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – నాగయ్య స్వామి, సిందోల్ ఒక్కోసారి ఆలస్యం అవుతుంది.. ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. కానీ ముందుగానే వస్తున్నాం. ఆఫీసుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలు అందిస్తున్నాం – సత్యనారాయణ, తహసీల్దార్ -
బ్లాక్ మనీని బూడిద చేసిన తహసీల్దార్
-
ఏంది స్వామి 20 లక్షలు అలా కాల్చినావ్
రాజస్తాన్: అవినీతికి పాల్పడే వారి ఇళ్లపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేస్తే ఏం చేస్తారు.. ఆ అవినీతి డబ్బును దాచడానికి నానా తంటాలు పడతారు. ఇక్కడ ఓ తహసీల్దార్ అధికారులకు సాక్షం ఉండకూడదని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల వరకు కాల్చి బూడిద చేశాడు. ఉద్యోగం ఉంటే ఇలాంటి లక్షలు ఎన్నైనా సంపాదించుకుంటా అనుకున్నాడో ఏమో ఇలాంటి వింత పని చేసి వార్తల్లో నిలిచాడు. ఏకంగా 20 లక్షలు స్వాహా రాజస్థాన్ లోని సిరోహీ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల డబ్బును లంచంగా తీసుకుంటున్న సమయంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. అనంతరం పర్వత్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఇందులో తన తప్పేమీ లేదనీ, తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ కారణంగానే తాను ఈ డబ్బును తీసుకుంటున్నట్టు తెలిపాడు. దీంతో అతడిని పట్టుకుని తహసీల్దార్ కల్పేశ్ ఇంటికి ఏసీబీ అధికారులు బయలు దేరారు. జరిగినదంతా ఇంట్లోనే ఉన్న తహసీల్దార్ కు ఎవరో సమాచారం ఇచ్చారు. ఇంకేముంది బ్లాక్ మనీతో పట్టుబడితే శ్రీ కృష్ణ జన్మస్థానమే అని కంగారుపడ్డాడు. అంతకు పూర్వం పలువురు వద్ద లంచంగా తీసుకున్న డబ్బు ఇంట్లోనే ఉండడంతో ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. చివరకు కాల్చి పడేస్తే పీడా పోతుందని ఓ నిర్ణయానికి వచ్చి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ డబ్బును కాల్చడం మొదలు పెట్టాడు. తెలివిగా ఏసీబీ అధికారులు ఇంట్లోకి రాకుండా తలుపులకు గడియ కూడా పెట్టాడండోయ్. ఇలా మొత్తం మీద ఏకంగా రూ.20 లక్షల రూపాయల నోట్ల కట్లను కాల్చేశాడు. ఈ లోపే ఏసీబీ అధికారులు అతడి ఇంటికి చేరుకొని వంటింట్లో అతడు చేస్తున్న నిర్వాకాన్ని చూశారు. తలుపుకి గడియ ఉండడంతో అధికారులు తలుపులు పగలగొట్టి తహసీల్దార్ నిర్వాకాన్ని ఆపేశారు. 20 లక్షల వరకు కాలి బూడిదైపోగా, కేవలం లక్షన్నర రూపాయలను మాత్రమే అతడి నుంచి స్వాధీనం చేసుకోగలిగారు. అయితే ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డు చేసిన ఓ అధికారి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైర్ల్ అయ్యింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: ఆశ చూపి.. బాలికల అమ్మకం ) -
కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన తహసీల్దార్
విస్సన్నపేట(తిరువూరు): ప్రభుత్వ పాఠశాలలో తన కుమార్తెను చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు విసన్నపేట తహసీల్దార్ బి మురళీకృష్ణ. స్థానిక మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్‌లో రెండో తరగతిలో తహసీల్దార్ తన కుమార్తెను బుధవారం చేర్పించారు. చదవండి: నచ్చిన వారికి కొలువులు.. అడిగినంత వేతనం సంక్షేమ క్యాలెండర్: పథకాల అమలు ఇలా.. -
హత్యా...?ఆత్మహత్యా...?
-
సారు చెబితేనే చేశాం..
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పన్నెండు లక్షల లంచం వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నర్సాపూర్ భూ వ్యవహారంలో అరెస్టయిన ఆర్డీవో, తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. స్వయంగా అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశ్ తమకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తేనే తాము పనులు చేశామని ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ కేసుకు సం బంధించి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌తో సహా నిందితులు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూని యర్ అసిస్టెంట్ మహ్మద్ వాసీం, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌లను ఏసీబీ రెండోరోజు మంగళవారం ప్రధాన కార్యాలయంలో విచారించింది. ఈ సందర్భంగా తామంతా అడిషనల్ కలెక్టర్ ఆదేశాలిస్తేనే పని చేశామంటూ... ఆర్డీవో, తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ మాత్రం ఏసీబీ అధికారులు అడిగిన అధిక ప్రశ్నలకు.. ‘నాకు తెలియదు’అని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. రింగ్‌రోడ్డు వద్ద కలవండి.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన వద్దకు వచ్చిన పలు వివాదాస్పద భూ వ్యవహారాలను అడిషనల్ కలెక్టర్ నగేశ్ చాలా జాగ్రత్తగా డీల్ చేసేవారు. ఎక్కడా తనపేరు బయటికి రాకుండా జీవన్‌గౌడ్ నంబరు ఇచ్చేవారు. ఆ తరువాత మొత్తం సెటిల్మెంట్లన్నీ జీవన్‌గౌడ్ చక్కదిద్దేవాడు. పనుల నిమిత్తం జీవన్‌గౌడ్‌కు ఎవరు ఫోన్ చేసినా.. వారితో నగదు గురించి మాట్లాడి, మేడ్చల్ వైపు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కలుసుకునేవాడని, అక్కడే లంచం కింద తీసుకునే నగదు చేతులు మారేదని సమాచారం. ఏ రోజు, ఏటైములో కలవాలో ఫోన్ లో ముందుగానే సూచనలు చే సేవాడు. రింగ్‌రోడ్డు ప్రాంతంలో జనసంచారం తక్కువగా ఉండటం, తాను సికింద్రాబాద్‌లో ఉండటం వల్ల రింగురోడ్డును వసూలు కేంద్రంగా వాడుకునేవాడని తెలిసింది. బినామీల విచారణ.. రెండో రోజు విచారణలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ బినామీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మొత్తం ముగ్గురు బినామీలను అధికారులు ప్రశ్నించారు. బినామీల్లో ఓ మహిళ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మెదక్, మ నోహరాబాద్, మేడ్చల్, కామారెడ్డిలో నగేశ్‌కు చెందిన పలు అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కిందిస్థాయి ఉద్యోగులను సైతం అధికారులు విచారించారు. నగేశ్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ లభ్యం కాకపోవడం తో, బ్యాంక్ అధికారులతో మరో డూప్లికేట్ కీ ని అధికారులు సిద్ధం చేయిస్తున్నారు. ఈ లా కర్ తెరిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వ స్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. -
ఆ లంచం కేసుతో నాకు సంబంధం లేదు
సాక్షి, మేడ్చల్ జిల్లా: కీసర తహసీల్దార్ రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదన్నారు. కీసర తహసీల్దార్ విచారణ సమయంలో తనపై తప్పుడు ప్రచారం కొనసాగటంపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. ‘మ్యుటేషన్ ప్రక్రియ తహసీల్దార్ పరిధిలోనే ఉంటుంది. కలెక్టర్ వద్దకు కనీసం ఫైలు కూడా రాదు.. ఈ కేసులో నా పాత్ర ఉందనే ఆరోపణలు మానుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే న్యాయపరమైన చర్యలకు వెళ్లాల్సి వస్తుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు సమస్యల తో వచ్చినప్పుడు విచారణ చేసి, నిబంధనల ప్రకారముంటేనే వాటిని పరిష్క రించాలని చెబుతాను. రోజూ విజిటింగ్ సమయంలో కలసిన ప్రతి ఆర్జీదారుకు సంబంధించిన విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. ఆ అధి కారులూ నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది’అని అన్నారు. -
తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించింది. సంతకవిటి (శ్రీకాకుళం జిల్లా), బలిజిపేట (విజయనగరం జిల్లా), కశింకోట (విశాఖ జిల్లా), కొయ్యలగూడెం (పశ్చిమగోదావరి జిల్లా), ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా), రాజుపాలెం (గుంటూరు జిల్లా), ఉలవపాడు (ప్రకాశం జిల్లా), ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా), కూడేరు (అనంతపురం జిల్లా) తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకున్నారు. ► రైతులకు పంపిణీ చేయకుండా ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలను గుర్తించారు. ‘స్పందన’, ‘మీ సేవ’ పోర్టళ్లలో చేసిన దరఖాస్తులను నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పరిష్కరించ లేదని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కొన్ని కార్యాలయాల్లో ప్రైవేట్ సిబ్బంది పని చేస్తున్నారని గుర్తించారు. ► తహసీల్దార్ కార్యాలయాలపై జరిపిన సోదాల్లో మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.3,50,277 నగదును స్వాధీనం చేసుకున్నారు. ► బిక్కవోలు (తూర్పు గోదావరి జిల్లా), జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా), బద్వేలు (వైఎస్సార్ జిల్లా), పీలేరు (చిత్తూరు జిల్లా) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ► సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అనధికార వ్యక్తులు పని చేస్తున్నట్టు గుర్తించారు. మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.9,23,940 స్వాధీనం చేసుకున్నారు. ► నెల్లూరు జిల్లా గూడురు మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా 33 భవన నిర్మాణ అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు. ఈ సోదాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని ఏసీబీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. -
రిటైర్డ్ అడిషనల్ ఎస్పీని ముప్పుతిప్పలు పెట్టిన నాగరాజు
సాక్షి, హైదరాబాద్ : కోటి 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కీసర తహసీల్దార్ నాగరాజు అక్రమాలు తవ్వినకొద్ది బయటకు వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా పోలీసు అధికారులను సైతం లంచం డిమాండ్ చేసి ముప్పు తిప్పలు పెట్టారు. ఆయన బాధితుల్లో తాను ఒకడినని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. లీగల్‌గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడని వాపోయారు. (చదవండి : 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) ‘నేను రిటైర్మెంట్ అయిన తర్వాత 2018లో సర్వేనెంబర్ 614లో నాలుగు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాను. లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడు. గతంలో నాగరాజుపై చీఫ్ సెక్రెటరీకి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీవో కు ఫిర్యాదు చేశాను. అధికారులను మభ్యపెడుతు తన పదవిని కాపాడుకుంటున్నాడు. ఒక పోలీస్ అధికారిగా ఉన్న నన్నే లంచం డిమాండ్ చేశాడంటే.. ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కై దందాలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుండా ఒక్క పని కూడా చేయడు.న్యాయస్థానం కూడా నాగరాజు వ్యవహారంలో సీరియస్ అయింది. ఇలాంటి వ్యక్తి ని కఠినంగా శిక్షించాలి’అని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. (చదవండి : నాగరాజు ఇంటిలో కొనసాగుతున్న సోదాలు) -
అవినీతిలో నాగరాజు
-
అవినీతిలో నాగ ‘రాజు’ లీలలు
సాక్షి, మేడ్చల్: కీసర తహసీల్దార్ నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో 28 లక్షలు నగదు, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు బినామీల పేర్లతో భారీగా అక్రమాస్తులు కలిగిఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. తహసీల్దార్ బంధువులు, బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది.తహసీల్దార్ నాగరాజు, రియల్టర్స్ అంజిరెడ్డి, శ్రీనాథ్, వీఆర్ఏ సాయిరాజులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గతంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తహశీల్దార్ నాగరాజు అరెస్టయ్యారు. తహసీల్దార్ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. కాగా, ఇటీవల కీసర మండలంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వెలుగుచూస్తున్న తహసీల్దార్ అక్రమాలు
విడవలూరు: ఇటీవల విడవలూరు మండలంలోని తీర ప్రాంతంలో ఉన్న చుక్కల భూములకు పట్టాలు పుట్టించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విడవలూరు తహసీల్దార్ లీలలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. వివరాలు.. ఇటీవల అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు పట్టా భూములను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. అందులో భాగంగా మండల కేంద్రమైన విడవలూరులో 10 ఎకరాలను గుర్తించారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎకరా రూ.20 లక్షలు ఉన్నట్లు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. అలాగే రామతీర్థంలో మూడున్నర ఎకరాలను కూడా గుర్తించారు. ఇక్కడ ప్రభుత్వ విలువ అతి తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కూడా ఎకరా రూ.20 లక్షలుగా ప్రతిపాదనలు పంపారు. దీంతోపాటు ముదివర్తి గ్రామంలో కూడా 6 ఎకరాలను గుర్తించారు. ఇక్కడ కూడా ప్రభుత్వ విలువ తక్కువగా ఉన్నప్పటికీ ఎకరా రూ.23 లక్షలుగా ఉందని ప్రతిపాదనలు పంపారు. ఇలా ప్రభుత్వ విలువ ఎక్కువగా ఉన్నచోట తక్కువ గానూ, తక్కువగా ఉన్న చోట ఎక్కువ గానూ ప్రతిపాదనలు పంపడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ముదివర్తి గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ సాహెబ్‌కు సర్వే నంబర్ 306–బీ లో 1.17 ఎకరాలు, 306–సీ లో 0.6 ఎకరాలు, 306–డీ1లో 0.22 ఎకరాల భూమి(మొత్తం 1.45 ఎకరాలు) ఉంది. ఇందుకు సంబంధించిన ఈ–పాస్ బుక్ కూడా సంబంధిత రైతు వద్ద ఉంది. అయితే గత నెల 8వ తేదీన ఈ రైతు పేరుతో కేవలం 0.39 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపుతున్నారు. దీనిని తహసీల్దార్ మార్చి వేశారని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు. తన మిగిలిన పొలాన్ని ప్రస్తుతం ఇళ్ల స్థలాలకు గుర్తించిన వాటిలో కలిపి ఎక్కువ పొలంగా చూపి మోసం చేసేందుకు తహసీల్దార్ సిద్ధమైనట్లు బాధిత రైతు వాపోయాడు. న్యాయం చేయండి నాకున్న 1.45 ఎకరాల భూమిలో దాదాపు 1.06 ఎకరాల భూమిని మరో రైతు పేరు మీదకు మార్చారు. ఇది కూడా గత నెల 8వ తేదీన జరిగింది. నా పొలాన్ని ప్రస్తుతం ఇళ్ల స్థలాల కోసం గుర్తించి, ఎక్కువ భూమిగా చూపి తహసీల్దార్ మోసం చేయడానికి సిద్ధపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. – షేక్ మస్తాన్‌సాహెబ్ -
వినయ విధేయ తహసీల్దార్
విడవలూరు: ఆయనొక తహసీల్దార్. పేదలకు అండగా నిలవాల్సిన వ్యక్తి పెద్దలకు వినయ, విధేయుడిగా మారాడు. అక్రమ సొమ్ముపై ఆశతో సెలవు దినాల్లో కూడా చుక్కల భూములకు పట్టాలు చేస్తున్నారు. ♦ విడవలూరు మండలంలో తీర ప్రాంతమైన ఊటుకూరు పంచాయతీ పరిధిలోని పల్లిపాళెం గ్రామంలో ప్రస్తుతం ఆక్వా గుంతల భూముల్లో సర్వే నంబర్లు 942–1, 942–2, 1300, 1398, 1399లలో దాదాపు 14.5 ఎకరాల చుక్కలు భూములు ఉన్నాయి. వీటికి రికార్డులు తారుమారు చేసి పట్టాలను సృష్టించేందుకు కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన టీడీపీ నాయకులతో తహసీల్దార్ నౌషాద్ అహ్మద్ చేతులు కలిపాడని ఆరోపణలున్నాయి. ♦ ముదివర్తిలో ఉన్న 2.5 ఎకరాలు, పల్లిపాళెం వద్ద ఉన్న మరో నాలుగు ఎకరాలకు కూడా రికార్డులు తారుమారు చేసి పట్టాలను ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తహసీల్దార్‌కు భారీ మొత్తంలో నగదు అందినట్లు సమాచారం. ♦ ఈ పనులకు తహసీల్దార్ నౌషాద్ అహ్మద్ సెలవు రోజు శనివారం మధ్యాహ్నం కార్యాలయానికి చేరుకున్నాడు. తన కారులో వస్తే స్థానికులకు అనుమానం వస్తుందని పడుగుపాడుకు చెందిన వ్యక్తి కారులో కార్యాలయానికి చేరుకున్నారు. ♦ తహసీల్దార్‌తో పాటు మరికొందరు రెవెన్యూ అధికారులను కూడా కార్యాలయానికి పిలిపించుకుని గుట్టు చప్పుడు కాకుండా పని ముగించే ప్రయత్నం చేశారు. ♦ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు సెలవు దినాల్లో కూడా తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్లు ఉండటాన్ని గమనించి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయట పడింది. ♦ చుక్కల భూములకు పట్టాలు సృష్టించేందుకు తహసీల్దార్ ప్రయత్నించడం ప్రభుత్వాన్నే మోసం చేయడమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు ఈ విషయమై జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబుకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి స్థానంలో ఉన్న తహసీల్దార్ ఇలా చుక్కల భూములకు పట్టాలను పుట్టించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు. -
ఎందరినో రక్షించి.. బలయ్యాడు
సాక్షి,చెన్నై: కోయంబేడు మార్కెట్ నుంచి గ్రామాల్లోకి వచ్చిన కూలీలను గుర్తించి, ఎందరినో క్వారైంటన్లకు, కరోనా వార్డులకు తరలించిన విరుదాచలం తహసీల్దార్ వైరస్‌కు బలికావడం చిదంబరంలో విషాదాన్ని నింపింది. చెన్నై కోయంబేడు రూపంలో విల్లుపురం, తిరువణ్ణామలై, కడలూరు, కళ్లకురిచ్చి జిల్లాల్లో అమాంతంగా కరోనా కేసులు పెరిగిన విషయం తెలిసిందే. ఇందుకు కారణం ఈ జిల్లాల్లో ఉన్న కూలీలు అత్యధికంగా కోయంబేడు మార్కెట్లో పనిచేస్తుండడమే. చడీచప్పుడు కాకుండా స్వగ్రామాలకు చేరిన కూలీలను గుర్తించేందుకు విరుదాచలం తహసీల్దార్ కవియరసు(48) నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ బృందం రెండు నెలలుగా ఎందరినో గుర్తించింది. గ్రామాలతో నిండిన కడలూరు జిల్లా పరిధిలో విస్తృతంగానే తిరిగింది. కూలి కార్మికుల రూపంలో గ్రామాల్లో వైరస్ బారిన పడ్డ వారిని పసిగట్టి క్వారంటైన్లు, కరోనా వార్డులకు తరలించింది. నిరంతర సేవలో ముందుకు సాగుతూ వచ్చిన కవియరసును ఈ నెల పదో తేదిన వైరస్ తాకింది. దీంతో ఆయన బృందంలో ఉన్న వారందరినీ స్వీయ నిర్భంధంలో ఉంచారు. ఎనిమిది రోజులుగా చిదంబరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన కవియరసు పరిస్థితి విషమించింది. ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారు. కరోనా వైరస్ బారిన పడి రెవెన్యూ అధికారి మరణించడంతో కడలూరు జిల్లా యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. ఎందరినో రక్షించి, చివరకు వైరస్ బారిన పడి కవియరసు మృత్యువాత పడడాన్ని రెవెన్యూ వర్గాలు జీర్ణించుకోలేకున్నాయి. విధి నిర్వహణలో సేవాతత్వంతో ముందుకు సాగే కవియరసు సేవలు అజరామరం అని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
అమరావతి భూముల్లో వెలుగులోకి వస్తున్న వాస్తవాలెన్నో!
సాక్షి, గుంటూరు: భూమి ఒకటే... సర్వే నంబరూ అదే... భూ యజమానులూ వారే... అయినా రికార్డులు మారాయి. ఇతరుల పేరిట భూమి బదలాయింపునకు తారుమారయ్యాయి. ఇలా ఒకటి రెండూ కాదు. పెద్ద సంఖ్యలోనే. రూ.కోట్లు చేతులు మారాయి. ఇదంతా నెలల వ్యవధిలోనే జరిగిపోయింది. ప్రపంచ స్థాయి నగరంగా చెప్పుకున్న రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఎన్నెన్ని లుకలుకలో. మరెన్ని లోగుట్లు ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నాయో... పెదలంక భూ ఉదంతాన్నే పరిశీలిస్తే... 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో భూసమీకరణ కింద దాదాపు 33 వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకుంది. ఆ సమయంలో తమకు అనుకూలురైన అధికారులను నియమించుకుని అప్పటి అధికార పార్టీ పెద్దలు అన్యాయాలకు పాల్పడ్డారని, పేదలు, నిరుపేదలను దారుణంగా మోసగించారని నిర్దిష్ట ఆరోపణలు వచ్చాయి. భూముల విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర వర్గాలకు చెందిన వారు పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులను కలిసి నేటికీ ఫిర్యాదులు అందజేస్తూ న్యాయాన్ని కోరుతున్నారు. అలాంటి ఫిర్యాదుల్లో భాగంగానే తుళ్లూరు మండలం రాయపూడి పంచాయతీలోని పెదలంకలో జరిగిన మోసాన్ని రెవెన్యూ సహకారంతో పోలీసులు ఛేదించారు. తుళ్లూరు మండల మాజీ (రిటైర్డు) తహసీల్దారు అన్నే సుధీర్‌బాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, విజయవాడలో ప్రముఖ ఎం అండ్ ఎం వస్త్ర దుకాణ యజమాని గుమ్మడి సురేష్లను బుధవారం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తుండటంతో విచారణాధికారులు సైతం విస్తుపోతున్నారు. అన్నే సు«దీర్‌బాబు 2014 నుంచి 2017 ఆగస్టు వరకు తుళ్లూరు తహసీల్దారుగా పనిచేసి రిటైరయ్యారు. సమీకరణలో అసైన్డు భూమి పట్టా భూమిగా మారింది పెదలంక సర్వే నంబరు 376/2ఎలో 3.70 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా 1975లో ప్రభుత్వపరమైంది. ఆ భూమిని అసైన్మెంట్ పట్టా కింద యలమంచిలి సూరయ్య, ఆయన కుమారులతో పాటు పలువురు స్థానికులకు ప్రభుత్వం అప్పట్లోనే పంపిణీ చేసింది. రాజధాని పేరిట ఆ భూమిని కూడా సమీకరణ కింద సర్కారు తీసుకుంది. అసైన్డ్ ల్యాండ్‌ను పట్టా భూమిగా అప్పటి తహసీల్దారు అన్నే సుధీర్‌బాబు రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించారు. అడంగల్, ఆర్ ఒ ఆర్– 1బి, పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లలో మార్పులు చేసేశారు. ఆరు పర్యాయాలు ఆరు రకాలుగా... యలమంచిలి సూరయ్య, ఆయన కుమారులకు చెందిన 86 సెంట్ల భూమికి ఆరుసార్లు ఆరు రకాలుగా రికార్డులు మార్పులు జరిగినట్లు పరిశీలనలో వెల్లడైంది. తొలుత సీలింగ్ ల్యాండ్‌ను అసైన్డ్ పట్టాల కింద ప్రభుత్వం పంపిణీ చేసింది. రాజధాని కోసం భూసమీకరణ ప్రక్రియ ఆరంభమైనప్పటి నుంచి 2017 ఆగస్టు మధ్య కాలంలో అసైన్డ్ నుంచి పట్టాగా మళ్లీ అసైన్డ్, ఆపై పట్టా, తిరిగి అసైన్డ్, ఆ తరువాత పట్టాగా రికార్డుల్లో మార్పులు జరిగాయి. అవసరాన్ని, సమయాన్ని బట్టి ఆన్లైన్ ద్వారా వెబ్‌ల్యాండ్‌లో ఈ మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నట్లు పోలీసు పరిశీలనలో తేటతెల్లమైంది. ఎందుకిలా చేశారంటే... అసైన్డ్ ల్యాండ్‌గా ఉంటే రిజిస్ట్రేషన్లకు వీలుకాదు. విక్రయానికీ కుదరదు. అందువల్లే వెబ్‌ల్యాండ్‌లో పట్టా భూమిగా మార్పుచేశారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారి గుమ్మడి సురేష్ పేరిట సేల్ కమ్ జీపీ చేశారు. ఆ తరువాతే గుమ్మడి సురేష్ వల్లూరు శ్రీనివాస్‌బాబుకు విక్రయించగలిగారు. అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకి ఇవ్వగలిగారు. ఎస్సీలను మోసగించినందున... ఎస్సీ వర్గానికి చెందిన రైతులను మోసగించే ఉద్దేశంతోనే అన్నే సుధీర్‌బాబు, గుమ్మడి సురేష్ ఉమ్మడిగానే వ్యవహారాలు నడిపారనేది వెల్లడైనందున వారివురిని అరెస్టు చేయడంతోపాటు సెక్షన్ 3(1)(ఎఫ్)(జి), 3(2)(విఎ) ఎస్సీ, ఎస్టీ అమెండ్మెంట్ యాక్టు–1989 కింద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తుళ్లూరు డీఎస్పీ మీడియాకు తెలిపారు. రికార్డుల తారుమారుతో పాటు సీఆర్డీఏకి భూమి అప్పగించడం వెనుక కుట్ర, మోసం ఉన్నందున సెక్షన్–7 ఆఫ్ ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్– 1977తో పాటు 120–బి, 407, 420, 465, 468,471,477(ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంలో ఆ ఇద్దరితో పాటు అసైనీలు సహా సంబంధితులందరూ నిందితులేనని తెలిపారు. మరో 9 సర్వే నంబర్లలోనూ... రాజధాని గ్రామాలైన అనంతవరం, నేలపాడు, వెలగపూడి, రాయపూడి, పెదలంక తదితర గ్రామాల్లోని తొమ్మిది సర్వే నంబర్లలోని రికార్డులు తారుమారయ్యాయని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. ఆయా గ్రామాలకు చెందిన పేద రైతులు తమను మోసగించారని రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. వీటిపై లోతైన దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని దళిత సంఘాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. -
పెట్రోల్‌బాటిల్ తీసి ఒంటిపై పోసుకుని..
వెల్దండ (కల్వకుర్తి): భూ సమస్య పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఇది గమనించిన తోటి రైతులు వెంటనే నిలువరించారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన బొక్కల రామస్వామి రెండేళ్ల క్రితం మృతి చెందారు. ఈయనకు సర్వే నం.187, 194. 195, 198, 199, 200, 201లలో నాలుగెకరాల పొలం ఉంది. అనంతరం దీనిని భార్య బొక్కల లక్ష్మమ్మకు విరాసతు చేశారు. అయితే ఈ పట్టా భూమి కాస్తా అన్లైన్లో అసైన్డ్గా నమోదైంది. దీంతో తల్లితో పాటు కుమారుడు బొక్కల శ్రీనివాస్ పట్టా భూమిగా నమోదు చేయాలని ఏడాది కాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కరించలేకపోయారు. చివరకు విసుగు చెందిన అతను సోమవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వెంట తీసుకొచ్చిన పెట్రోల్‌బాటిల్ తీసి ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకోవడానికి యత్నించాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న రైతులు బాటిల్‌ను తీసివేసి అగ్గిపెట్టెను లాగేశారు. అనంతరం బాధితుడితో ఎస్ఐ నర్సింహులు, తహసీల్దార్ సైదులు, డీటీ వెంకటరమణ మాట్లాడారు. మూడు రోజుల్లో సమస్యను తీర్చుతామని హామీ ఇవ్వడంతో శాంతించి వెనుదిరిగారు. -
‘రెవెన్యూ’పై.. కరోనా పంజా
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి రెవెన్యూ ఉద్యోగులపై పంజా విసిరింది. ఆ శాఖలో అటెండర్ మొదలుఆర్డీవో స్థాయి వరకు 126 మంది వైరస్ బారినపడగా.. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ మల్లేశం మృతితో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సరైన చికిత్స అం దకపోవడమే తహసీల్దార్ మరణానికి కారణమని రెవె న్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా) తీవ్రంగా ఆరోపించిం ది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌తో కూడిన బెడ్‌ను ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదని, ఇలాంటి విపత్కకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన అధికారులే...తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమని వ్యా ఖ్యానించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఒకట్రెం డు రోజుల్లో సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేసింది.తమ వ్యవహారంలో సీఎస్ తీరుపై కూడా వారు ఆగ్రహంతో ఉన్నారు. నిమ్స్‌లో చికిత్స అందించండి: ప్రజలకు సేవలు అం దిస్తూ కరోనా బారిన పడుతున్న రెవెన్యూ ఉద్యోగులకు నిమ్స్ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ‘ట్రెసా’ ప్రతినిధి బృందం కోరింది. కన్నెపల్లి తహసీల్దార్ మల్లేశం విషమస్థితిలో వెంటిలేటర్ సాయం లభించక గాంధీ ఆసుపత్రిలో మృతి చెందడం తమకు ఆందోళన కలిగిస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ ఉద్యోగులకు ‘ని మ్స్’తో పాటు ‘టిమ్స్’లో చికిత్సకు అవకాశం కల్పిస్తామ ని మంత్రి హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ‘ట్రెసా’రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యద ర్శి కె.గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఉన్నారు. -
శివారుపై ఏసీబీ కన్ను
సాక్షి, హైదరాబాద్: శివారు మండలాలపై ప్రభుత్వం డేగకన్ను వేసింది. అవినీతి రెవెన్యూ అధికారుల భరతం పట్టేందుకు సమాచారం సేకరిస్తోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ).. రాజధాని చుట్టూరా ఉన్న జిల్లాల్లోని తహసీల్దార్ల వ్యవహారశైలిపై నిఘా పెట్టింది. ప్రజల్లో అవినీతి అప్రతిష్టను మూటగట్టుకున్న రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశగా ఒకవైపు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఇటీవల షేక్‌పేట మండల తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ వలలో చిక్కడం సంచలనం కలిగింది. ఒక భూ వివాదంలో తలదూర్చిన ఈ రెవెన్యూ ద్వయం ఏకంగా రూ.50 లక్షల డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలడం ప్రభుత్వాన్ని నివ్వెర పరిచింది. గతేడాది రంగారెడ్డి జిల్లా తహసీల్దార్ కూడా రూ.93 లక్షల నగదుతో పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్రమార్కుల చిట్టాను తయారు చేసిన ఏసీబీ.. ఆ జాబితాను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. హైదరాబాద్ పరిసరాల్లో భూముల రేట్లు నింగినంటడం, రెవెన్యూ తగాదాలు కూడా గణనీయంగా పెరిగిపోవడంతో ఇదే అదనుగా అధికారుల అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే శివారు మండలాల పోస్టింగ్‌లకు పోటీ తీవ్రంగా ఉంటోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ క్షేత్రస్థాయిలో అవినీతి తిమింగలాల సమాచారాన్ని రాబడుతోంది. విలువైన భూములు, వివాదాస్పద భూములపై తహసీల్దార్లు తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అంతేగాకుండా రెవెన్యూ వ్యవహారాల్లో అధికారుల కుటుంబసభ్యులు, పైరవీకారుల పాత్రను కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. గాడ్ఫాదర్ల అండతో... కొలువులో చేరింది మొదలు పదవీ విరమణ వరకు అక్కడే నెలవు. పదో న్నతులు లభించినా.. బది లీ ఉత్తర్వులు అందినా.. గాడ్ఫాదర్ల అండ తో పక్క మండలాలకు వెళతారే తప్ప పొరపాటున జిల్లా సరిహద్దు దాటరు. ఒకవేళ కాదు కూడదని ప్రభుత్వం బదిలీ చేసినా.. పోస్టింగ్‌లో చేరకుండా కాలయాపన చేస్తా రు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను కదలించడం అంత ఆషామాషీ కాదు. వీరి పలుకుబడి ముందు ఐఏఎస్ అధికారులు బలాదూరే. నయాబ్ తహసీల్దార్‌గా ఉద్యోగంలో చేరి అదనపు కలెక్టర్‌గా అవే జిల్లాల్లో రిటైర్ అవుతున్నారంటే ప్రభుత్వంలో వీరికున్న పలుకుబడి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన భూ వివాదాలను అనువుగా మలుచుకుంటున్న రెవెన్యూ అధికారులు వివాదాస్పద భూ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారు. భూ విలువలు కోట్లలో పలుకుతుండటం.. భూ మాఫియా, రియల్టర్లు ఎంతైనా ఇచ్చుకునేందుకు ఆఫర్లు ఇస్తుండటంతో ఎందాకైనా వెళ్లేందుకు రెవెన్యూ గణం సాహసిస్తోంది. దీంతో శివారు మండలాల్లో పోస్టింగ్‌లు హాట్‌కేకులా మారిపోయాయి. తమకు అనువుగా ఉండే అధికారిని ఈ కుర్చీలో కూర్చోబెట్టేందుకు ప్రజాప్రతినిధులు మొదలు బడాబాబుల వరకు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
బంజారాహిల్స్ పీఎస్ ఎస్ఐ అరెస్ట్
సాక్షి, జూబ్లీహిల్స్ : భూ ఆక్రమణ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.3 లక్షలు డిమాండ్ చేసినందుకుగాను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవీందర్ నాయక్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఖాలీద్ అనే వ్యక్తి ఆక్రమించాడు. దీనిపై షేక్‌పేట మండల తహసీల్దార్ సుజాత గత ఏప్రిల్ 30న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఖాలీద్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు గాను రూ. 3 లక్షలు ఇవ్వాలని ఎస్ఐ రవీందర్ డిమాండ్ చేశాడు.(లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఆర్ఐ) ఖాలీద్ ఇటీవల రూ.1.50 లక్షలు రవీందర్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి వచ్చాడు. అందుకు సంబంధించిన ఆధారాలను ఏసీబీ అధికారులకు అందించిన ఖాలీద్ అతను మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు షేక్‌పేట మండల కార్యాలయం, ఆర్ఐ నివాసం, తహసీల్దార్ ఇంట్లో, ఎస్ఐ రవీందర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా అర్థరాత్రి వరకు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. అర్థరాత్రి రాత్రి 12 గంటలకు తహసిల్దార్ సుజాతను ఇంటికి పంపించారు. నేడు కూడా ఈ కేసుకు సంబంధించి తహిసిల్దార్ సుజాతను విచారించనున్నారు. ఎస్ఐ రవీందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రోజు కూడా తహసిల్దార్ సుజాతను విచారించనున్న ఏసీబీ అధికారులు. అసలు ఏం జరిగిదంటే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14 సర్వే నంబర్ 129/59లో ఉన్న 4865 గజాల ప్రభుత్వ స్థలాన్ని సయ్యద్ అబ్దుల్ ఖాలిద్ అనే వ్యక్తి ఆక్రమించి హెచ్చరిక బోర్డును తొలగించి తన పేరుతో బోర్డు ఏర్పాటు చేశాడు. సదరు స్థలాన్ని తాను కోర్టులో గెలిచినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ స్థలాన్ని తన పేరిట క్రమబద్దీకరించి హద్దులు చూపించాల్సిందిగా షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది ప్రభుత్వ స్థలం కావడంతో తహసిల్దార్ సుజాత గత జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు స్థలాన్ని ప్రైవేట్ పరం చేస్తూ హద్దులు చూపిస్తానంటూ అదే కార్యాలయంలో పని చేస్తున్న ఆర్ఐ నాగార్జున రెడ్డి ఖాలిద్ నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా శనివారం ఖాలిద్ రూ.15 లక్షల నగదును సాగర్‌సొసైటీ రోడ్డులో హార్లి డేవిడ్ సన్ షోరూం పక్క సందులో నాగార్జున్ రెడ్డికి ఇస్తుండగా అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నాగార్జునరెడ్డి నుంచి రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు యూసుఫ్‌గూడలోని అతడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. నిందితుడిని కార్యాలయానికి తీసుకువచ్చి విచారించగా కలెక్టరేట్లో ఓ అధికారికి రూ. 15 లక్షలు ఇవ్వాల్సి ఉందని అందుకే రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. -
బల్లకింద బుక్కయ్యారు
-
తెలంగాణ: తహసీల్దార్ల పవర్ కట్
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపునిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ శాఖకు వెన్నెముక అయిన తహసీల్దార్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. గతంలో భూ వ్యవహారాలపై సర్వాధికారాలు ఎమ్మార్వోలకే ఉండగా.. ఇప్పుడు వాటిలో సగం అధికారాలకు కత్తెర వేయబోతోంది. రెవెన్యూ అంశాల్లోనే కాకుండా తహసీల్లార్దు ప్రతిష్టాత్మకంగా భావించే రేషన్ వ్యవహారాల్లోనూ కోత విధిస్తోంది. రేషన్‌కార్డులు జారీచేసే అధికారం, రేషన్‌షాపుల పర్యవేక్షణ, రైసుమిల్లులపై అజమాయిషీ బాధ్యతల నుంచి వారిని తప్పించబోతోంది. ఇక, రైతు సంబంధ వ్యవహారాల్లోనూ తహసీల్దార్ల పాత్రను పరిమితం చేస్తోంది. జనగణన, పశుగణన వంటి అదనపు భారాల నుంచి కూడా విముక్తి కల్పించ బోతోంది. ఈ మేరకు తహసీల్దార్లకు ఉన్న ప్రధానమైన 44 అధికారాల్లో 20 మాత్రమే వారి పరిధిలో కొనసాగిస్తూ, 17 అధికారాలను వ్యవసాయ, పశుసంవర్థక, పోలీసు, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ శాఖలకు బదలాయించబోతోంది. కాలం చెల్లిన మరో ఏడు అధికారాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందులో రక్షితదారు చట్టం కూడా ఉంది. ► తహసీల్దార్లకు గల అధికారాల్లో ప్రధానమైనవి-44 ► ఇకపై తహసీల్దార్ల ప్రతిపాదిత విధులు-20 ► ఇతర శాఖలకు బదలాయించే అధికారాలు-17 ► రద్దు చేయాలని నిర్ణయించినవి-7 అంతర్గత కసరత్తు పూర్తి రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడమేగాకుండా.. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆలోచన ఫలితంగానే తహసీల్దార్ద విధుల్లో పెనుమార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార పాత్రను స్పష్టంగా ప్రస్తావించనుంది. తహసీల్దార్లతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) విధుల్లో కూడా ఈ చట్టం ద్వారా మార్పులు చేయనున్నారు. వాస్తవానికి మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే రెవెన్యూ ముసాయిదా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావించినా.. రెవెన్యూ కోడ్ తీసుకురావాలా? సంపూర్ణంగా కొత్త చట్టమే తీసుకురావాలా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ముందడుగు పడలేదు. అయితే, చట్టం ఎలా ఉండాలనే అంశంపై ఇప్పటికే నిర్ధిష్ట అభిప్రాయానికి వచ్చిన ఉన్నతాధికారులు... వీఆర్వోలు, తహసీల్దార్లు, ఆర్డీవోల అధికారాలు, ఇతర శాఖల్లో బదలాయింపుపై మాత్రం అంతర్గత కసరత్తు పూర్తిచేశారు. ఇక, కీలకమైన మ్యుటేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ అధికారాలను తహసీల్దార్లకే ఉంచాలా లేదా ఆర్డీఓలకు బదలాయించాలా అనేది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకే గొడుగు కిందకు.. రెవెన్యూ శాఖను సమూల ప్రక్షాళన చేసే దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టును రద్దుచేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇందులోభాగంగానే గత ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేయట్లేదని తెలుస్తోంది. సీసీఎల్ఏ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా కుదించి.. సచివాలయంలోని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం సేవలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయార్జన శాఖలన్నింటికీ ఒకే ముఖ్య కార్యదర్శి ఉండేలా, ఆ పోస్టులో స్పెషల్ సీఎస్ హోదా అధికారిని నియమించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న శాఖలను భారీగా కుదించాలని, కేవలం 18 శాఖలకే పరిమితం చేస్తే బాగుంటుందని గతంలో సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంత్రుల సంఖ్యకు అనుగుణంగా శాఖల కూర్పు చేసే దిశగా ఆలోచన సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల కోసం భారీగా భూ సేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని పోస్టులను ఆ శాఖకు శాశ్వతంగా బదలాయించే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ల ప్రతిపాదిత విధులు, బాధ్యతలు ► మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లపై పర్యవేక్షణ, సమన్వయం ► సాధారణ విచారణలు ► వీఐపీల పర్యటనల ప్రొటోకాల్ విధులు ► కుల, ఆదాయ, వాల్యూయేషన్, స్థానికత, న్యాయబద్ధమైన వారసుల సర్టిఫికెట్ల జారీ ► ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో జ్యూడీషియల్ అధికారాలు, భూసేకరణాధికారి (ఎల్ఏవో) ► రోడ్డు, రైల్వే కార్యకలాపాలకు సంబంధించిన ప్రొటోకాల్ డ్యూటీ ► వెట్టి కార్మికుల విముక్తి చట్టం అమలు ► రెయిన్‌గేజ్ మీటర్ల నిర్వహణ ► నీటి వనరులు, నీటి పరివాహక ప్రాంతాల పర్యవేక్షణ ► వ్యవసాయేతర రంగాలకు నీటి వనరుల కేటాయింపులపై అధికారం ► రెవెన్యూ రికవరీ చట్టం కింద ప్రభుత్వ బకాయిలు వసూలు చేయడం ► గ్రామ పద్దుల పరిశీలన ► ప్రకృతి విపత్తుల నిర్వహణ, పునరావాసం ► సాధారణ భూసేకరణ ► సాధారణ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ► ఓటర్ల జాబితా రూపకల్పన ► ప్రజారోగ్యం, అంటువ్యాధుల నివారణ బాధ్యతలు ► చెట్లపై హక్కుల జారీ ► రివాల్వర్ లైసెన్సులు, పేలుడు సంబంధిత అనుమతుల లైసెన్సుల తనిఖీ ► భూ ఆక్రమణల చట్టం కింద చర్యలు రద్దు కానున్న అధికారాలు ► సర్వే సబ్ డివిజన్ నంబర్ల జారీ ► ఉప్పు భూమి లీజులు, అద్దె వసూళ్లు ► సర్వే హద్దురాళ్ల తనిఖీ ► ఆక్రమణదారులకు బీ–మెమోల జారీ ► వ్యవసాయ, ఇళ్ల స్థలాల అసైన్మెంట్ ► హోమ్ స్టెడ్ యాక్ట్ కింద పట్టాల జారీ ► టెనెన్సీ యాక్డు -
తహసీల్దార్‌కు ‘కూన’ బెదిరింపులు
పొందూరు: రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్లిన శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణను టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించారు. ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీంతో రవికుమార్ తహసీల్దార్‌కు ఫోన్‌చేసి బెదిరించారు. ఆ ఆడియో ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. ‘వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను’ అని ‘కూన’ బెదిరించారు. ‘నా చేతిలో ఏం లేదు. సీజ్ చేసి అప్పగించేశాను’ అని తహసీల్దార్ చెప్పడంతో.. ‘కూన’ దుర్భాషలాడుతూ.. ‘నువ్వు సీజ్ చేశావుగానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి.. పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ‘నిబంధనల ప్రకారం వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు అప్పగించాను. తర్వాత మీరు రిలీజ్ చేసుకోండి సార్’ అని తహసీల్దార్ చెప్పడంతో.. ‘ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా..’ అంటూ రాయలేని రీతిలో ‘కూన’ అసభ్యంగా దూషించారు. దీంతో.. క్వారెంటైన్లో ఉన్న 13 మంది టీడీపీ వర్గీయులతో తనపై ఫిర్యాదులు చేయించారని తహసీల్దార్ రామకృష్ణ చెప్పారు. కాగా, కూన రవికుమార్ గతంలో కూడా ఇలాగే సరుబుజ్జిలి ఎంపీడీఓను.. అదే మండలానికి చెందిన పంచాయతీ విస్తరణాధికారిని బెదిరించారు. ఈ రెండు ఘటనల్లోనూ ఆయన అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చారు. -
రెవెన్యూ కార్యాలయం లంచాలకు అడ్డా..
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల రెవెన్యూ కార్యాలయంలంచాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చేయి తడపనిదే పనికాదని... ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించినట్లు చెబుతున్నారు. తాజాగా ఓ మహిళకు వారసత్వంగా వచ్చిన భూమికి డబ్బులు తీసుకుని ధ్రువీకరణపత్రం, పట్టాపాస్‌పుస్తకం కూడా ఇచ్చారు. ఆమె భర్త బంధువులు రంగప్రవేశం చేసి అధిక డబ్బులు ఆశచూపడంతో సదరు అధికారి ఆ భూమిపై మెలిక పెట్టి వివాదాస్పదంగా ఉందని హక్కుదారుకు నోటీసులు ఇచ్చారు. దీంతో బాధితురాలు కార్యాలయానికి చేరుకుని అధికారిని నిలదీసింది. దీనికి సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలం మల్గిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మల్గిరెడ్డి లక్ష్మమ్మకు తిరుమలగిరి శివారులో సుమారు 7 ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు సర్వేనంబర్లు 82, 83లో 2.28గుంటల భూమి వంశపారంపర్యంగా సంక్రమించింది. సర్వేనంబర్ 84లో 1.20 గుంటలను సొంతంగా కొనుగోలు చేసింది. మొత్తం 4 ఎకరాల 8 గుంటల భూమిని పట్టా చేసేందుకు మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగింది. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. చివరకు రూ.లక్షకు బేరం కుదిరింది. దీంతో లక్ష్మమ్మకు భూమికి సంబంధించి ప్రొసీడింగ్ ఆర్డర్, ధ్రువీకరణపత్రం ఇచ్చారు. మొత్తం 4ఎకరాల8గుంటల భూమిని పట్టా చేయించుకుంది. పాస్‌పుస్తకం కూడా ఇచ్చారు. విషయం తెలుసుకున్నలక్ష్మమ్మ బంధువులు రంగంలోకి దిగారు. భూమిపై మెలిక పెట్టేందుకు సదరు రెవెన్యూ అధికారిని కలిసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే 82, 83 సర్వేనంబర్లలోని 2ఎకరాల 28 గుంటల భూమి వివాదాస్పదంగా ఉందని ఈ నెల 11వ తేదీన మల్గిరెడ్డి లక్ష్మమ్మకు తహసీల్దార్ నోటీసులు అందజేసింది. దీంతో బాధితురాలు తన కూతురుతో కలిసి శుక్రవారం కార్యాలయానికి వెళ్లి సదరు అధికారిని ప్రశ్నించింది. ప్రొసీడింగ్స్ ఇచ్చింది మీరే కదా అని అడగగా ‘నేను చూడకుండా పెట్టానని, ఆ భూమిపై నీకు హక్కు లేదని, ఎవరికి ఫిర్యాదు చేస్తావో చేసుకో’’ అంటూ దబాయించింది. ఇదే అదునుగా స్థానిక నేతలు రంగంలోకి దిగారు. బేరసారాలకు తెరలేపారు. బాధితురాలు ఎంతకీ ఒప్పుకోలేదు. తాను రూ.లక్ష నష్టపోవడమే కాకుండా ఉన్న భూమిని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని బాధితురాలు అక్కడే ఉన్న అధికారులు, విలేకరుల ఎదుట వాపోయింది. తనకు డబ్బు ముఖ్యం కాదని, తన భూమి తనకు ఉంటే చాలని కన్నీటిపర్యంతమైంది. మా భూమి మాకే కావాలి నా భర్త అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో రైతుబంధు సాయం ప్రభుత్వం ప్రకటించడంతో మేము గ్రామానికి వచ్చాం. నా భర్త చనిపోయిన తరువాత భూమి సర్వే నంబర్ల వివరాలు తెలియక రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగాం. రూ. లక్ష లంచం తీసుకొని ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. పట్టాదార్ పాస్‌పుస్తకం కూడా వచ్చింది. ఇప్పుడు ప్రొసీడింగ్ నేను ఇవ్వలేదంటూ తహసీల్దార్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.– మల్గిరెడ్డి లక్ష్మమ్మ, బాధితురాలు, మల్గిరెడ్డిగూడెం నిబంధనల ప్రకారమే నడుచుకున్నా.. పట్టా్టదారు జమీన్లకు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నా. నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. అన్ని పనులు నిబంధనల ప్రకారమే పూర్తి చేస్తున్నా. మల్గిరెడ్డి లక్ష్మమ్మఎవరో నాకు తెలియదు. నాపై నింద వేస్తున్నారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే.– కేసీ ప్రమీల తహసీల్దార్, తిరుమలగిరి -
13 మంది తహసీల్దార్లకు కరోనా పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్: ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని 13 మంది తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఇటీవల అనంతపురం జిల్లాలో విధుల్లో ఉన్న ఓ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని రెడ్జోన్ల పరిధిలో ఉన్న తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, వడమాలపేట, పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం, నారాయణవనం, పలమనేరు తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. హాట్‌స్పాట్స్ జాబితాలో జిల్లా చిత్తూరు అర్బన్: కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన హాట్‌స్పాట్ ప్రాంతాల జాబితాలో మన జిల్లా కూడా ఉంది. కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న జిల్లాలను హాట్‌స్పాట్‌గా గుర్తించిన కేంద్రం ఓ జాబితాను విడుదల చేసింది. జిల్లాలో 23 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ జాబితాలో చేర్చింది. తిరుపతి, రేణిగుంట, నగరి, పలమనేరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కు వగా పాటిజివ్ కేసులు రావడంతో వీటిని రెడ్ జోన్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రాకపోకలపై పూర్తిగా నిషేధం. జిల్లా హాట్‌స్పాట్‌గా గుర్తించడం వల్ల మొదటి దశ లాక్డౌన్ అమలుపై అన్ని నియమ నిబంధనలు, షరతులు అలాగే వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. పాటిజివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యశాఖ సమాయత్తం అవుతోంది. కేవలం నిత్యావసర వస్తువుల రవాణా, అత్యవసర సేవలకు మాత్రమే వర్తిస్తుంది. నేటి నుంచి ట్రూనాట్లతో స్వాబ్స్ సేకరణ చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో గురువారం నుంచి ట్రూనాట్ మిషన్ల ద్వారా కరోనా స్వాబ్స్ సేకరణ ప్రారంభిస్తామని జిల్లా టీబీ కంట్రోలర్ రమేష్‌బాబు తెలిపారు. చిత్తూరులోని జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో 5, తిరుపతి రుయాలో 5, తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో 3, పలమనేరులో 2 , మదనపల్లెలో 2 చొప్పున ట్రూనాట్ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఫలితాలు గంటలోనే తెలుస్తాయన్నారు. పాజిటివ్ వస్తే తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపి మరోసారి పరీక్షిస్తామన్నారు. నెగటివ్ వస్తే ఆ ఫలితాన్ని తీసుకుంటామన్నారు. ఒక మిషన్ ద్వారా రోజుకు 20 మందిని పరీక్ష చేయవచ్చని వివరించారు. ట్రూనాట్ యంత్రాలను పరిశీలిస్తున్న రమేష్ బాబు మదనపల్లెలో కరోనా నిర్ధారణ పరీక్షలు మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో గురువారం నుంచి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా ఆస్పత్రిని రమేష్‌బాబు పరిశీలించారు జిల్లా ఆస్పత్రిలో అమర్చిన ట్రూనాట్ యంత్రాలను తనిఖీచేసి వాటి పనితీరును పరిశీలించారు. -
మందుపార్టీలో మధిర తహశీల్ధార్
-
యాదాద్రి భువనగిరి జిల్లాలో వడ్డెర కులస్తుల వినూత్న నిరసన
-
ఏసీబీ దాడులతో హడల్
చిత్తూరు కలెక్టరేట్ : ఏళ్ల కొద్దీ పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు... చేయితడిపితే చకచకా పనులు...లేదంటే నెలల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి...ఈ పరిస్థితి జిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయాల్లో ఉందని ప్రజల ఆరోపణ. ఆ కార్యాలయాల చుట్టూ పలు పనుల నిమి త్తం కాళ్లరిగేలా తిరిగితిరిగి విసిగి వేసారిపోయిన ప్రజలు మరికొందరు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యమని ముఖ్య మంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇదివరకే ప్రకటించడమే కాకుండా అవినీతిపరుల సమాచారం ప్రభుత్వం దృష్టికి తేవడానికి 14400 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభించిన విషయం విదితమే. అయితే తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి మూలాన ఏళ్లకాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతూనే వస్తున్నారు. అవి నీతి అధికారులపై చివరకు 14400 నంబర్‌కు ఫిర్యాదులు చేయడంతో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులకు పూనుకున్నట్టు తెలుస్తోంది. లంచావతారాల భరతం పట్టేందుకు.. లంచావతారాల భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాలపై దాడులు చేశారు. జిల్లాలోని రేణిగుంట, వడమాలపేట తహసీల్దార్ల కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఆ కార్యాలయాల్లోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను సేకరించి వారిని విచారణ చేశారు. అలాగే కార్యాలయాల వద్ద ఉన్న అనుమానితులను అదుపులోకి తీసుకుని ఆరా తీశారు. రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు ముమ్మర తనిఖీలు చేశారు. కార్యాలయాలకు పలు పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విచారణ పూర్తయిన తరువాత ఉన్నతాధికారులకు నివేదికలు పంపి తదుపరి విషయాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా జిల్లా ఏసీబీ అడిషినల్ ఎస్పీ శ్రీనివాసులు, ఆ శాఖ ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. ఉలిక్కిపడ్డ రెవెన్యూ అవినీతి నిరోధక శాఖ దాడులపై రెవెన్యూ శాఖ ఉలిక్కిపడింది. ఈ దాడులపై జిల్లావ్యాప్తంగా పలు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పక్క మండలాల రెవెన్యూ అధికారులు జాగ్రత్తలు పడ్డారు. ఏ సమయంలో ఏ కార్యాలయంపై దాడులు చేస్తారోనని ఉద్యోగులు హడలిపోయారు. ఈ దాడులు మరికొన్ని చోట్ల జరిగే అవకాశమున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
కల్లూరు తహసీల్దార్ కార్యాలయంలోఇష్టారాజ్యం
కర్నూలు,(న్యూటౌన్): కల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం నెలకొంది. తహసీల్దార్ రవికుమార్ ఏకంగా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించుకున్నారు. అత్యంత కీలకమైన డిజిటల్ కీ సైతం ప్రైవేటు వ్యక్తికి అప్పగించారు. అలాగే ప్రజలకు అందించే సేవలకు ఉద్దేశించిన పలు రిజిష్టర్లను నిర్వహించడం లేదు. ఈ విషయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల సోదాల్లో బట్టబయలైంది. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఇందులో భాగంగా టోల్‌ఫ్రీ నంబర్ 14400 ఏర్పాటు చేసి..ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. కల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు ఎక్కువైనట్లు టోల్‌ఫ్రీ నంబరుకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ ఇన్చార్జ్ డీఎస్పీలు జనార్దన్‌నాయుడు, తేజేశ్వర్రావు నేతృత్వంలో సీఐ వెంకటకృష్ణారెడ్డి, సిబ్బంది విస్తృత సోదాలుచేపట్టారు. ఉదయం 11 నుంచి రాత్రి ఏడు గంటల దాకా కార్యాలయంలో సోదాలు కొనసాగాయి. తహసీల్దార్ ల్యాప్‌టాప్‌ను అధికారులు పరిశీలించారు. కంప్యూటర్ సెక్షన్, డిప్యూటీ తహసీల్దార్ చాంబర్, వీఆర్ఓల చాంబర్లలోనూ తనిఖీలు చేశారు. ఐదుగురు ఆఫీసు సిబ్బంది, ఐదుగురు వీఆర్వో, వీఆర్ఏల నుంచి అక్రమంగా కలిగివున్న రూ.15,480 నగదును స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ సొంతంగా ఇద్దరు అనధికారిక వ్యక్తుల (ఎన్.సతీష్, యు.రంగస్వామి)ను కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించుకున్నట్లు గుర్తించారు. వీరికి నెలకు రూ.10 వేల చొప్పున వేతనం ఇస్తున్నట్లు తేలింది. అలాగే తహసీల్దార్ వద్దే ఉండాల్సిన అత్యంత కీలకమైన ‘డిజిటల్ కీ’ ఓ ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్‌కు అప్పగించినట్లు గుర్తించారు. సోదాల్లో వెల్లడైన ఇతర అంశాలు ♦ 106 ఈ–పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేయకుండా డిప్యూటీ తహసీల్దార్‌కు చెందిన అల్మారాలో ఉంచేశారు. ♦ మీసేవ దరఖాస్తులకు సంబంధించిన రిజిష్టర్ నిర్వహించలేదు. చాలావరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచారు. ♦ స్పందన, పర్సనల్ క్యాష్, గన్ లైసెన్స్, ట్రెజరీ బిల్లుల రిజిష్టర్ల ఊసే లేదు. అసైన్డ్ భూముల రిజిష్టర్ నిర్వహణ సక్రమంగా లేదు. ఫిర్యాదులపై ఆరా ఏ సేవల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న విషయాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించారు. సిటిజన్ చార్టరులో పేర్కొన్న విధంగా సేవలు సక్రమంగా అందుతున్నాయా, లేదా? పనులు చేయడంలో అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం తిరుగుతున్నామని, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని, ఆన్లైన్లో పొలం వివరాలు నమోదు చేయడం లేదని, మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా పని కావడం లేదంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. తాము గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక పంపుతామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
ఏసీబీ సోదాలు.. సిబ్బంది పరారీ !
సాక్షి, గుంటూరు/ భట్టిప్రోలు/ నూజెండ్ల/ మాచర్ల: రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఇటీవల 14400 టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం రెవెన్యూ శాఖపైనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ రెవెన్యూ అధికారుల భరతం పట్టడంలో భాగంగా శుక్రవారం కొరడా ఝుళిపించింది. ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన తనిఖీలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. జిల్లాలోని భట్టిప్రోలు, మాచర్ల, నూజెండ్ల తహసీల్దార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఎస్పీ సురేశ్ బాబు నేతృత్వంలో భట్టిప్రోలులో, సీఐ రవిబాబు నేతృత్వంలో నూజెండ్లలో, శ్రీధర్ నేతృత్వంలో మాచర్లలో తనిఖీలు నిర్వహించారు. ఆన్లైన్ దరఖాస్తులు పెండింగ్‌లో.. ఆకస్మిక తనిఖీల సందర్భంగా మాచర్లలో 148, నూజెండ్లలో 83, భట్టిప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో 118 ఆన్లైన్ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను అధికారులు గుర్తించారు. అదే విధంగా భట్టిప్రోలులో 18, మాచర్లలో 12, నూజెండ్లలో 30కుపైగా దరఖాస్తుదారులకు చేరాల్సిన పాస్పుస్తాకాలను గుర్తించి వీటిని ఎందుకు దరఖాస్తుదారులకు చేరవేయకుండా పెట్టుకున్నారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. భట్టిప్రోలులో రూ.18,600, మాచర్లలో రూ.65,500 లెక్కల్లో లేని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వోల వారీగా ఆన్లైన్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఇటీవల కాలంలో రిజెక్ట్, అప్రూవ్ చేసిన దరఖాస్తులను పరిశీలించారు. అయితే చాలా వరకూ దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది సకాలంలో రిజెక్ట్, అప్రూవ్ చేయనట్టు గుర్తించారు. పరారీలో సిబ్బంది... ఏసీబీ అధికారుల తనిఖీల నేపథ్యంలో కొందరు సిబ్బంది పరారయ్యారు. మరికొందరు రికార్డులు తీసుకువస్తామని వెళ్లి తిరిగి రాలేదు. ఇంకొందరైతే ఫోన్లకు కూడా అందుబాటులో లేరు. భట్టిప్రోలు మండలంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సూరేపల్లి వీఆర్వో ఎ.నరేంద్ర, ఐలవరం వీఆర్వో మోహన్‌రావు విచారణ సందర్భంగా రికార్డులు తీసుకువస్తామని వెళ్లి తిరిగి కార్యాలయానికి రాలేదు. మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సాంబశివరావు, వీఆర్వో సయ్యద్ హుస్సేన్‌లు పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. నూజెండ్ల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు అనధికారికంగా నియమించుకుని పనిచేయించుకుంటున్న ఈ. వెంకటరమణ అనే వ్యక్తి అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో ఏసీబీ సీఐ గంగరాజు, ఎస్సైలు షరీఫ్, శ్రీనివాసమూర్తి ఆరు మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఆరు మంది కానిస్టేబుళ్లు, ఆరుగురు మీడియేటర్లు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి తాళాలు మంగళగిరి: రెవెన్యూ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తున్నారనే పుకారుతో మంగళగిరిలో శుక్రవారం కలకలం రేగింది. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారనే సమాచారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో సమాచార సేకరణకు విలేకర్లంతా కార్యాలయానికి చేరుకోగా తాళం వేసి ఉంది. తహసీల్దార్‌తో పాటు అధికారులు సిబ్బంది సైతం కార్యాలయంలో లేకుండా పోయారు. ఏసీబీ దాడుల సమాచారం ముందుగానే తెలుసుకొని రెవెన్యూ అధికారులు ఉడాయించారని కార్యాలయం వద్ద పలువురు సందర్శకులు చర్చించుకున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ రామ్‌ప్రసాద్‌ను వివరణ కోరగా ట్రైనీ ఐఏఎస్ అధికారులు 26 మందికి వివిధ ప్రదేశాలను చూపించే బాధ్యత ఉన్నతాధికారులు తనకు అప్పగించారని చెప్పారు. తాను లేకపోవడం వలనే కార్యాలయానికి తాళం వేశారని పేర్కొన్నారు. సిబ్బంది అంతా విధులలోనే ఉన్నారని తమ కార్యాలయంలో ఎలాంటి ఏసీబీ దాడులు జరగలేదన్నారు. -
తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
-
ఏపీ: అవినీతిపరుల భరతం పడుతున్న ఏసీబీ
సాక్షి, విజయవాడ: సీఎం ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ప్రక్షాళనకు ఏసీబీ నడుంబిగించింది. అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లంచావతారాల భరతం పట్టేందుకు ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చిత్తూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేపట్టింది. 14400 స్పందన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు స్పందించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో బీరువాలు, సిబ్బంది బ్యాగులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. రికార్డులు పరిశీలించి సిబ్బందిని ఆరా తీస్తున్నారు. కార్యాలయాలకు పనులపై వచ్చిన ప్రజలను విచారించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. చిత్తూరు: జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. వివిధ సమస్యల మీద వచ్చిన ఫిర్యాదులు ఎంత వరుకు పరిష్కారం అయ్యాయి. పెండింగ్ ఉన్న ఫిర్యాదులు, పరిష్కారం చేయకపోవడానికి కారణాలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి: జిల్లాలోని చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో పలు దస్ర్తాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. కృష్ణా: జిల్లాలోని అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించడంతో పాటు, అధికారులు, సిబ్బంది బ్యాగులను కూడా తనిఖీ చేస్తున్నారు. కార్యాలయాలకు పనుల మీద వచ్చిన ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తూర్పుగోదావరి: జిల్లాలోని పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు,సిబ్బందిని విచారిస్తున్నారు. రికార్డులను పరిశీలించడంతో పాటు, తహసీల్ధార్ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా దాడుల్లో భాగంగా ఏసీబీ అధికారులు జిల్లాలోని ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎచ్చెర్ల తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రకాశం జిల్లా: పొన్నలూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా కార్యాలయంలో ఏసీబీ అధికారులు అపర్ణ, వెంకటేశ్వర్లు, రాఘవరావు, ప్రసాద్ రికార్డులను పరిశీలించారు. పాసు పుస్తకాలు జారీ అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం: జిల్లాలోని కొత్తూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్ధార్ కార్యాలయంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రికార్డులను పరిశీలించారు. విజయనగరం జిల్లా: జిల్లాలో వేపాడ తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కార్యాలయంలోని అధికారులు,సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రికార్డులు పరిశీలించి ఆరా తీస్తున్నారు.ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరుజిల్లా: సూళ్లూరుపేట తహసీల్ధార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించాయి. అవినీతిపై ఆరోపణలపై అధికారులను, సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు కార్యాలయాలకు వచ్చిన ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
కోడి కూరతో పాటు నువ్వూ కావాలి
సాక్షి, కురిచేడు(దర్శి టౌన్): ఓ మహిళా వీఆర్ఏపై మండల మేజిస్ట్రేట్ అసభ్యంగా ప్రవర్తించడానే ఆరోపణలు కురిచేడులో సోమవారం చర్చనీయాంశమైంది. మండలంలోని పడమర వీరాయపాలేనికి చెందిన వీఆర్ఏపై స్థానిక తహసీల్ధార్ డీవీబి వరకుమార్ లైగింక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... వీఆర్ఏ ఈనెల 25న క్రిస్మస్ సందర్భంగా కురిచేడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. సిబ్బంది అంతా హాజరు కాగా తహసీల్దార్ వరకుమార్ హాజరు కాలేదు. ఈ క్రమంలో గత శనివారం తహసీల్దార్ తన కార్యాలయంలో క్రిస్మస్ విందుకు తాను హాజరు కాలేదని, నాకు కోడి కూరతో పాటు నీవు కావాలంటూ తనతో అసభ్యకరంగా మాట్లాడారని బాధితురాలు ఆరోపిస్తోంది. తండ్రి లాంటి వారు ఇలా మాట్లాడటం సరికాదని వారించినా.. తనను వెనక నుంచి వచ్చి కౌగలించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: ఛీఛీ.. బాలికపై పోలీస్ బాస్ లైంగిక దాడి ఈ సంఘటనపై సోమవారం బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమేకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామిరెడ్డి తెలిపారు. తహసీల్దార్‌ను దర్శి డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై తహసీల్దార్ వరకుమార్ మాట్లాడుతూ తనపై బాధితురాలు నిరాధార ఆరోపణలు చేస్తోందని, దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. చదవండి: 'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు' -
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి
సాక్షి, పెద్దఅంబర్‌పేట: అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్‌గా కె.వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన విజయారెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు సరూర్‌నగర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఇన్చార్జిగా కొనసాగారు. పూర్తిస్థాయి తహసీల్దార్‌గా ప్రభుత్వం వెంకట్‌రెడ్డిని నియమించింది. హయత్‌నగర్‌లో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ నుంచి వెంకట్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌కు వెళ్లి తహసీల్దార్ కార్యాలయం నిర్వహణకు మరో భవనాన్ని చూశారు. బీసీ కాలనీలో గల కమ్యూనిటీ భవనాన్ని పరిశీలించారు. -
ఎమ్మార్వోలకే ‘పార్ట్–బీ’ బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్ : ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తేరుకుంది. చిక్కుముడిగా మారిన పార్ట్–బీ భూములను పరిష్కరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లూ జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల పేరిట కాలయాపన చేసిన రెవెన్యూశాఖ.. ఈ భూ వివాదాలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు వీలుగా.. సవరణ అధికారాన్ని తహసీల్దార్లకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం.. పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా పక్కనపెట్టింది. కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములు, భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు–రెవెన్యూ శాఖ ల మధ్య తగాదా, ఫారెస్టు, ప్రైవేటు భూముల మధ్య వివాదాస్పదంగా ఉన్నవాటిని కూడా ఈ కేటగిరీలో నమోదు చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల మేర భూములను పార్ట్–బీ కేటగిరీలో చేర్చింది. అయితే, వీటిని సకాలంలో పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగంఎడతెగని జాప్యం ప్రదర్శించింది. సాఫ్ట్వేర్ సమస్యలు, తప్పొప్పులను సవరించే అధికారం జేసీలకు కట్టబెట్టడంతో పార్ట్–బీ భూముల వ్యవహారం జటిలమైంది. ఈ భూములకు పాస్‌పుస్తకాలు నిలిపేయడంతో ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ రైతులు తిరగడం.. ఆ వివాదాలను పరిశీలన, పరిష్కరించే అధికారం తమకు లేదని తహసీల్దార్లు చెప్పినా వినకపోవడంతో ఉద్దేశపూర్వంగా రెవెన్యూ ఉద్యోగులే చేయడం లేదనే భావన రైతాంగంలో నెలకొంది. ఈ వివాదాలు మొదలు. భౌతిక దాడులు వరకు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురికావడంతో ప్రభుత్వం మేలుకుంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటునే.. పార్ట్–బీ భూములను కూడా సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ భూములను పరిశీలించి.. పరిష్కరించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని యోచిస్తోంది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో ఎడిట్ ఆప్షన్ అనుమతిని తహసీల్దార్లకు ఇవ్వనుంది. తాజాగా తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసినందున.. కొత్త తహసీల్దార్లు కుదురుకోగానే ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను వెలువరించనున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. త్వరలో సీఎంతో భేటీ! రెవెన్యూ సమస్యలపై త్వరలో సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో రెవెన్యూ ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి నేతృత్వంలోనిప్రతినిధి బృందం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌ను కలసింది. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల కొరత తదితర అంశాలపై చర్చించింది. అలాగే తాజా పరిణామాలను వివరించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలోనే సమావేశ తేదీని ఖరారు చేస్తానని హామీ ఇచ్చినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. అలాగే తహసీల్దార్ల బదిలీకి కృషి చేసినందున కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. -
ముగిసిన తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసింది. గతేడాది శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లా లకు బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు పంపుతూ ఆదివారం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే కేటాయించిన జిల్లాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 378 మంది ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల నుంచి రిలీవ్ కావడం.. పూర్వపు జిల్లాల్లో రిపోర్టు చేయడం.. మండలాల వారీగా పోస్టింగ్‌లు తీసుకోవడం జరిగిపోయాయి. మూడేళ్లు ఒకేచోట, సొంత జిల్లా ల్లో పనిచేస్తున్న తహసీల్దార్లను ఈసీ ఆదేశాల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా కుటుంబాలకు దూరంగా విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాల్లో నియమించాలని గత కొన్నాళ్లు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య అనంతరం ఈ డిమాండ్ మరోసారి తెరపైకి రావడంతో స్పందించిన ప్రభుత్వం బదిలీ ప్రక్రియను పూర్తి చేసింది. -
తహసీల్దార్ల బదిలీలపై స్పందించిన ప్రభుత్వం
సాక్షి, సంగారెడ్డి: తహసీల్దార్ల బదిలీపై రెవెన్యూ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించిందని జిల్లా అధ్యక్షుడు బొమ్మరాములు తెలిపారు. 2018 అక్టోబర్ ఎన్నికలకు ముందు జిల్లాకు బదిలీ అయిన తహసీల్దార్లు అంతా పూర్వ జిల్లాలకు బదిలీ కానున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్కుమార్, ట్రెస్సా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ) ప్రతినిధులు ఆదివారం చర్చించారని చెప్పారు. తమ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లు స్పందించారని ఆయన చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి షఫీయోద్దీన్, కార్యవర్గ సభ్యుడు గోపాల్, కిరణ్‌కుమార్, దశరథ్, కార్తీక్, వీరేశం, బాల్‌రాజ్, గుండేరావు, ఉమర్పాష, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో భారీగా తహశీల్దార్లు బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా తహశీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 378 మంది తహశీల్దార్లను బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారిని తిరిగి వారి స్థానాలకు పంపుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తమను బదిలీ చేయాలంటూ గత కొంత కాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. బదిలీల ప్రక్రియ పూర్తి చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ జేఏసీ కృతజ్ఞతలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న తహసీల్దారు బదిలీల ప్రక్రియను పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. బదిలీలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు మరింత భాధ్యత విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందేలా కృషి చేస్తారని ఆకాంక్షించింది. ఈమేరకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు కారం రవిందర్ రెడ్డి, మమత, మామిళ్ళ రాజేందర్, ఎ.సత్యనారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత పద్మాచారి, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేత చిలగాని సంపత్ కుమారస్వామి తదితరులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
పట్టుకోండి చూద్దాం!
గూడూరు తహసీల్దార్ ఏసీబీ అధికారులనే ముప్పుతిప్పలు పెడుతోంది. ఓ రైతు నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటూ తన బినామీ చిక్కిన వెంటనే అప్రమత్తమైన ఆమె.. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆపై స్థావరాలు మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతోంది. బుధవారం అనంతపురంలో చిక్కినట్లే చిక్కి చాకచక్యంగా తప్పించుకుంది. ఎలాగైనా అరెస్ట్ చేసి బోనులో నెలబెట్టేందుకు ఏసీబీ అధికారులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులోభాగంగానే ఆశ్రయమిచ్చిన కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్యపై కేసు నమోదు చేసి, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కోడుమూరు/కర్నూలు సిటీ: కోర్టు వివాదంలో ఉన్న భూమికి వెబ్‌ల్యాండ్‌లో డిజిటల్ సిగ్నేచర్ తొలగింపు కోసం రూ.4లక్షలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడిన గూడూరు తహసీల్దార్ హసీనాబీ కోసం ఏసీబీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నెల 7న గూడూరు తహసీల్దార్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకొని హసీనాబీ పరారీలో ఉన్నారు. నిందితురాలిని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నారు. బుధవారం అనంతపురంలో తమ బంధువుల వద్ద ఆశ్రయం పొందినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లేలోగా, విషయం గమనించిన నిందితురాలు పరారైనట్లు సమాచారం. కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్యపై కేసు నమోదు గూడూరు తహసీల్దార్ హసీనాబీ, కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్య గతంలో కలెక్టరేట్లోని రెవెన్యూ సెక్షన్లో పని చేశారు. అప్పటి నుంచే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇతడి సహకారంతోనే తప్పించుకు తిరుగుతున్నట్లు గ్రహించిన ఏసీబీ అధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ నెల 8న ఎంపీడీఓ గిడ్డయ్య కూడా సెలవు పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుసుకుని అతడు నివాసం ఉంటున్న సీక్యాంపు సెంటర్ సమీపంలోని ప్రభుత్వ క్వార్టర్‌కు వెళ్లారు. తాళం వేసి ఉండటంతో కల్లూరు తహసీల్దార్ రవికుమార్ సమక్షంలో తాళం పగులగొట్టి సోదాలు నిర్వహించారు. తహసీల్దారు, ఎంఈడీఓ కలిసి దిగిన ఫొటోలు, కీలక పత్రాలు, తహసీల్దారు ఊత కర్ర, గుర్తింపు కార్డు లభ్యమయ్యాయి. దీంతో ఎంపీడీఓపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. ఆరు హాస్టళ్లలో నివాసం.. గూడూరు తహసీల్దార్‌పై కేసు నమోదైన అనంతరం ఏసీబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. కర్నూలులోని వివిధ ప్రాంతాల్లోని ఆరు హాస్టళ్లలో నివాసముంటున్నట్లు ఏసీబీ పోలీసులు గుర్తించారు. ఆరు ప్రాంతాల్లో నిందితురాలికి సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరు హాస్టళ్లకు నెలనెలా అద్దె చెల్లిస్తున్నట్లు ఏసీబీ అధికారులకు హాస్టళ్ల యజమానులు తెలియజేశారు. ఒకే వ్యక్తి ఆరు చోట్లా నివాసముండేందుకు హాస్టళ్లలో ఎందుకు అద్దె కడుతుందనే విషయం అంతుపట్టడం లేదు. కాగా కొత్తపల్లి గిడ్డయ్య కేసు నుంచి బయటపడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. సీనియర్ అడ్వకేట్లను సంప్రదించి కేసు నుంచి ఎలా బయటపడాలి, నేరుగా కోర్టుకు హాజరైతే బాగుంటుందా అనే విషయాలపై అడ్వకేట్లను అమరావతిలో కలిసి చర్చించినట్లు సమాచారం. -
ఇక తహసీల్దార్లకు భద్రత
సాక్షి, ఆదిలాబాద్ : మండల కార్యాలయాల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రస్థా యి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండడంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. అయితే జిల్లాలో జనాలు ఎక్కువగా వెళ్లే మం డల కార్యాలయాలపై ఇది వరకే ఓ కన్నేసి ఉంచి న పోలీసు యంత్రాంగం ఇక నుంచి ఆ నిఘాను పటిష్టం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద పోలీస్ బుక్ పాయింట్‌ను ఏర్పాటు చేసి భద్రత పటిష్టం చేయనున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగుల్లో అభద్రత భావం నెలకొన్న విషయం తెలిసిందే. విజయారెడ్డి మృతికి సంతాపంగా వారంరోజుల పాటు నిరసనలు చేపట్టిన ఉద్యోగులు బుధవారం నుంచి విధుల్లో చేరారు. అయితే స్ట్రైక్ నుంచి విధుల్లో చేరిన మొదటిరోజు నుంచే భద్రత చర్యలు ప్రారంభం కావడం మంచి పరిణామం. కార్యాలయాల వద్ద బుక్ పాయింట్ జిల్లాలో 17 గ్రామీణ మండలాలు, ఒక అర్బన్ మండలం ఉన్నాయి. ఆదిలాబాద్ అర్బన్ మండల రెవెన్యూ కార్యాలయం కలెక్టరేట్ భవనంలో ఉంది. అయితే కలెక్టరేట్ ముందు, లోపల, వెనకాల, ఎప్పుడూ పోలీసుల నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. జనాలు కూడా అధిక సంఖ్యలో కలెక్టరేట్‌కు వస్తుంటారు. 17 గ్రామీణ మండలాల్లోనూ రెవెన్యూ కార్యాలయాలు, అంతే మోతాదులో పోలీసు స్టేషన్లు ఉన్నాయి. రెవెన్యూ ఆఫీసుల్లో జరుగుతున్న సంఘటనలపై ఆ మండల పోలీస్‌స్టేషన్, దాని పరిధిలో పని చేసే పోలీసు అధికారులు దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. మండల కార్యాలయాల్లో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే అక్కడున్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించే సౌకర్యం ఉంది. సమాచారం అందుకున్న సదరు పోలీస్‌స్టేషన్ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పరిష్కరిస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. రెవెన్యూ కార్యాలయాల వద్ద ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, సభలు జరిగినప్పుడు తప్పా.. ప్రతివారం రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు, ఆఫీసు పర్యవేక్షణ బృందాలు, స్పెషల్ టీంల పరిశీలన అంటూ ఏమీలేవని చెప్పవచ్చు. కానీ ఇప్పుడలా కాకుండా మండల రెవెన్యూ ఆఫీసుల వద్ద పోలీస్ బుక్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. బ్లూకోట్స్, పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు ప్రతి సోమవారం ఐదారుసార్లు రెవెన్యూ కార్యాలయాలను పరిశీలన చేసి బుక్పాయింట్లో సంతకం పెడతారు. దీంతో ఈ మండలాన్ని ఎవరెవరూ ఎప్పుడెప్పుడు పరిశీలన చేశారన్న విషయం ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు మండలాలను విజిట్ చేసినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఫలితంగా ఆఫీసులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పోలీసు శాఖ భావిస్తోంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు మండలాలు, గ్రామాలను రాత్రి, పగలు జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. జనాలు ఎక్కువగా వెళ్లే ఆఫీసులపై... ఒక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సూపరింటెండెంట్, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆ మండల పరిధిలోని వివిధ రెవెన్యూ గ్రామాలకు చెందిన వీఆర్వోలు, టైపిస్టు, అటెండర్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. అయితే వివిధ పనుల నిమిత్తం రైతులు, విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, సంస్థల ప్రతినిధులు, తదితరులు అనునిత్యం మండలాఫీసులకు వస్తుంటారు. అయితే ఏ మండల కార్యాలయానికి జనాలు ఎక్కువగా వెళ్తున్నారో ఆ మండలాఫీసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సదరు మండలంలో బుక్ పాయింట్ నిర్వహించడంతో పాటు ఆ మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారులు కూడా నిఘా ఉంచనున్నారు. ఎదైనా సంఘటన జరిగితే తక్షణమే స్పందించి సమస్యను అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటారు. రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, మండలాఫీసుల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలని రెవెన్యూ ఉద్యోగులు నిరసనలో భాగంగా సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిఘా మరింత పెంచుతాం జనాలు ఎక్కువగా వెళ్లే రెవెన్యూ కార్యాలయాలపై నిఘా మరింత పెంచుతాం. బుక్ పాయింట్లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపడుతాం. బ్లూ కోట్స్, పెట్రోలింగ్‌లో పాల్గొనేవారు రెవెన్యూ కార్యాలయాలను పరిశీలిస్తారు. కలెక్టరేట్‌తో పాటు మండలాల్లోని కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ చోట్ల భద్రత ఇప్పటికే ఉంది. దీనిని మరింత పటిష్టం చేస్తాం. – విష్ణు ఎస్ వారియర్, ఎస్పీ, ఆదిలాబాద్ భద్రత మంచిదే మండల కేంద్రాల్లో రెవెన్యూ ఉద్యోగులకు భద్రత ఏర్పాటు చేయడం మంచిదే. బుధవారం పోలీసు సిబ్బంది మా కార్యాలయానికి వచ్చి పరిశీలించి వెళ్లారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా నిఘా ఉంచడం సంతోషమే. రెవెన్యూ ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ముందుకు వస్తారు. – సి.రాజమనోహర్‌రెడ్డి, తహసీల్దార్, ఆదిలాబాద్ రూరల్ రెవెన్యూ కార్యాలయాలపై నిఘా ఇలా.. ► ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌లో పోలీసుల నిఘా. ► పరిశీలన చేసిన పోలీసు అధికారులు సంతకం చేసేలా బుక్ పాయింట్ ఏర్పాటు. ► పిటిషనర్లు రెవెన్యూ అధికారులకు అసౌకర్యం, ఇబ్బంది కల్గించకుండా చూస్తారు. ► అనుమానం ఉన్న సదరు పిటిషనర్‌ను లోనికి వెళ్లనివ్వరు. ► తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రతివ్యక్తిపై నిఘా -
పెట్రోల్‌తో తహసీల్దార్ కార్యాలయానికి రైతు
కల్హేర్(నారాయణఖేడ్): అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన మరువకముందే భూమి పట్టా చేయడం లేదని బాటిల్లో పెట్రోల్ పోసుకుని వచ్చి మరో రైతు రెవెన్యూ ఉద్యోగులకు షాక్ ఇచ్చాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని మహదేవుపల్లికి చెందిన రైతు జి.లింగయ్య, వీఆర్ఓగా పనిచేసిన లాలయ్య తన పట్టా పాసుపుస్తకం నుంచి రెండు ఎకరాల భూమిని తీసేసి ఇతరుల పేరిట మార్చారని ఆరోపించాడు. గ్రామ శివారులోని 49 సర్వే నంబర్లో తన తల్లి శివమ్మ పేరిట ఉండాల్సిన భూమికి హక్కులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీఆర్ఓ లాలయ్య తమకు అన్యాయం చేశారని సోదరులతో కలసి వచ్చి కార్యాలయం వద్ద కలకలం సృష్టించాడు. బాటిల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న వారు లింగయ్య చేతిలోంచి పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. అనంతరం లింగయ్య ఠాణాకు వెళ్లి వీఆర్ఓపై ఫిర్యాదు చేశాడు. దీనిపై వీఆర్ఓ లాలయ్యను ప్రశ్నించగా, సదరు 2 ఎకరాల భూమిని ఎవరిపేరుపై నమోదు చేయకుండా పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. -
తహసీల్‌కు తాళం !
సాక్షి, రంగారెడ్డి : తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం నేపథ్యంలో జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలు వారం రోజులుగా తెరుచుకోవడం లేదు. ఉద్యోగులు కార్యాలయాలకు అరకొరగా వస్తున్నా.. విధులకు దూరంగా ఉంటున్నారు. తహసీల్దార్ హత్యను ఖండిస్తూ గత వారంలో మూడు రోజులపాటు రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సయమంలో దాదాపు అన్ని తహసీల్దార్కార్యాలయాలకు తాళం కనిపించింది. అయితే, తమకు భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో రెవెన్యూ ఉద్యోగులు ఆ తర్వాత కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. కనీసం సోమవారమైనా ప్రజావాణి నిర్వహిస్తారని, కార్యాలయాలు తెరచుకుంటాయన్న నమ్మకంతో సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లిన బాధితులకు నిరాశే మిగిలింది. గ్రామీణ ప్రాంతంలో జిల్లా వ్యాప్తంగా 21 తహసీల్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో 15కుపైగా తాళం వేసి ఉన్నాయి. ఉద్యోగులు విధులు బహిష్కరించి నగరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లారు. ఈ విషయం తెలియని రైతులు, ప్రజలు ఆయా పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చారు. వ్యయ ప్రయాసాలకు ఓర్చి కార్యాలయాలకు వస్తే ఒక్క పని కూడా కావడం లేదని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఇంకెన్ని రోజులు విధులకు రారోనంటూ వెనుదిరిగారు. వారం రోజులుగా తిరుగుతున్నా.. అధికారులు వస్తారేమోనని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ వారం రోజులుగా తిరుగుతున్నా. నాకు మైసిగండి గ్రామంలో 9 గుంటల భూమి ఉంది. రికార్డుల్లో ఏడు గుంటల భూమి నమోదైంది. రికార్డుల్లో భూమి తక్కువగా నమోదు కావడంతో ఆన్లైన్లో సరిచేసుకుందామని తహసీల్దార్ కార్యాలయానికి రోజూ వస్తున్నా. మైసిగండి నుంచి కడ్తాల్‌కు రావడం.. కార్యాలయం మూసి ఉండటంతో తిరిగి ఇంటికి వెళ్లిపోవడం జరుగుతోంది. రోజూ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పోతుండటంతో వేరే పనులు చేసుకోలేకపోతున్నా. ప్రభుత్వం దృష్టిసారించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి. – జవహర్లాల్, మైసిగండి, కడ్తాల్ మండలం ప్రభుత్వం స్పందించాలి భూమికి సంబందించి పాత రికార్డులు పట్టుకుని రోజూ తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నా. వారం రోజులుగా కార్యాలయం మూసే ఉంటుంది. ప్రభుత్వం స్పందించి తహసీల్దార్ కార్యాలయాలు తెరిచేలా చర్యలు చేపట్టాలి. రైతుల సమస్యలు పరిష్కరించాలి. – సుందర్, మైసిగండి -
భూకాష్టం..
-
రైతు ఆత్మహత్యాయత్నం
అనంతపురం, గాండ్లపెంట: భూ సమస్య పరిష్కారంలో రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ సురేంద్రనాయక్ అనే రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన శుక్రవారం గాండ్లపెంటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తుమ్మలబైలు పెద్దతండాలోని సర్వేనంబర్లు 274–7లోని 1.4 ఎకరాలు, 239లో 62 సెంట్ల స్థలంపై వివాదం నెలకొంది. ఆ భూమికి సంబంధించిన పట్టా తమవద్ద ఉందని, అదంతా తమదేనని దశరథనాయక్, తిరుపాల్నాయక్లు వాదిస్తుండగా... సర్వేనంబర్ 274–7, 239లోని భూమిలో తమకు చెందిన కొంత భూమి ఉందని గ్రామానికే చెందిన రఘనాయక్, శివానాయక్‌లు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలు రెవెన్యూ అధికారులను ఆశ్రయించాయి. అయితే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో శుక్రవారం తిరుపాల్ నాయక్ తన కుమారుడు సురేంద్రనాయక్, కోడలు మాధవి, మరో రైతు దశరథ్‌నాయక్‌తో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. వారంతా అధికారులతో మాట్లాడేందుకు కార్యాలయం లోనికి వెళ్లగా...బయటే ఉండిపోయిన సురేంద్రనాయక్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు అతన్ని నిలువరించారు. వెంటనే అక్కడికి చేరుకున్న తహసీల్దార్ నారాయణ, సర్వేయర్, ఆర్ఐ, వీఆర్వో, ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి సమస్య వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే? రెవెన్యూ అధికారులు తుమ్మలబైలు పెద్దతండా గ్రామానికి వెళ్లి వివాదానికి కారణమైన భూమిని పరిశీలించారు. త్వరలోనే ఎవరి భూమి ఎంత అనేది తేలుస్తామని, అంతవరకూ ఎవరూ ఈ భూమిలో ప్రవేశించవద్దంటూ ఓ బోర్డు ఏర్పాటు చేశారు. -
సురేష్ మృతి.. స్పందించిన తండ్రి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్ట్‌మార్టం పూర్తి చేసిన ఉస్మానియా వైద్యులు సురేష్ మృత దేహాన్ని ఆయన స్వస్థలానికి తరలించారు. ఈ సందర్భంగా నిందితుడు సురేష్ మృతిపై ఆయన తండ్రి కృష్ణ స్పందించారు. తన కొడుకు తహసీల్దార్ కార్యాలయానికి ఎప్పుడూ వెళ్ళలేదని, తహశీల్దార్‌ను ఎందుకు హత్య చేశాడో తమకు తెలీదని అన్నారు. తమకు చెందిన తొమ్మిది గుంటల భూమిని ఏడాది క్రితం మల్రెడ్డి రంగారెడ్డికి అమ్మినట్లు ఆయన తెలిపారు. మొత్తం ఏడు ఎకరాలు భూమి తమ అన్నదమ్ములకు చెందినది ఉందని, అయితే భూ సమస్య నిమిత్తం తానే తహశీల్దార్ ఆఫీసు, కోర్టు చుట్టూ తిరుగుతున్నట్లు కృష్ణ తెలిపారు. తమ కుమారుడు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఈరోజు రాత్రి అంత్యక్రియలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాగా విజయారెడ్డిపై దాడి సమయంలో తీవ్ర గాయాలపాలైన సురేశ్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈసీజీలో పల్స్ రేటు ఫ్లాట్‌గా రావడంతో మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వెంటిలేటర్ తొలగించినట్లు పేర్కొన్నారు. కాగా వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి.. మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఇక ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు వెళ్లిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథం కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. -
తహసీల్దార్ హత్యపై రాజకీయ దుమారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంపై జిల్లాలో రాజకీయ రగడ మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత చల్లబడిన రాజకీయం.. విజయారెడ్డి హత్యోదంతంతో క్రమంగా వేడెక్కుతోంది. తహసీల్దార్ హత్యకు నువ్వంటే.. నువ్వే కారణమని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఒకరిపై ఒకరు మీడియా వేదికగా ఆరోపించుకుంటున్నారు. ఆది నుంచి వీరు రాజకీయ ప్రత్యర్థులు. ఒకరంటే ఒకరికి పడని వీరిద్దరూ మాటల తూటాలు పేల్చుతూ సవాల్.. ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. సోమవారం రైతు కూర సురేష్ తహసీల్దార్ విజయారెడ్డిపై కార్యాలయంలోనే పెట్రోల్ పోసి నిప్పటించడంతో సజీవదహనమైన చేసిన విషయం తెలిసిందే. ఈ అమానుషానికి ప్రధాన కారణమైన భూముల వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే హస్తం ఉందని మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపణల బాంబ్ పేల్చడంతో వివాదం రాజుకుంది. భూముల నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన... ల్యాండ్ మాఫియాకు ఎమ్మెల్యే నాయకత్వం వహిస్తున్నారని తీవ్రపదజాలంతో విరుచుకుపడటం సర్వత్రా చర్చనీయాంశమయింది. రూ.వేల కోట్లు ఎలా వచ్చాయ్? భూ మాఫియా అంటేనే మల్రెడ్డి రంగారెడ్డి. గత 20 ఏళ్లుగా ఆయనకు ఆస్తులు, భూములు ఎలా వచ్చాయో విచారణ జరిపితే తెలుస్తుంది. వందశాతం భూకబ్జా దారుడు.. ల్యాండ్ గ్రాబర్.. విచారణ జరిపిస్తే మాఫియా ఎవరో బయటపడుతుంది. తహసీల్దార్ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారో తేలాలి. విజయారెడ్డి హత్య కేసులో కావాలనే నాపై బురదజల్లుతున్నారు. నేను సాయం చేసే మనిషినే..అన్యాయం చేసే వాడినికాదు. రెండెకరాల మనిషి.. రూ.వేల కోట్లు ఎలా సంపాదించారో అందరికీ తెలుసు. మా ఆస్తులన్నీ మా తాతలు, తండ్రుల కాలం నాటివే. అబ్దుల్లాపూర్‌మెట్ చుట్టుపక్కల ఉన్న 412 ఎకరాల వివాదాస్పద భూమిపై విచారణ జరిపి తీరాలి. వాస్తవాలేంటో తేలుతాయి. అంబర్‌పేట ఓఆర్ఆర్ దగ్గర సర్వే నంబర్లు 230 – 233లో ఉన్న 16 ఎకరాల భూమిని మల్రెడ్డి రంగారెడ్డి బంధువులే కబ్జా చేశారు. మెట్రోసిటీ పేరుతో 60 ఎకరాలను కొల్లగొట్టారు. నేను రూ.30 లక్షలు ఎవరి దగ్గరా వసూలు చేయలేదు. తీసుకున్నట్లు ఆయన రుజువు చేయాలి. మూడుసార్లు ఓడిపోయిన వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తే స్పందించాలా అనుకున్నా. కానీ శవ రాజకీయాలు చేస్తుంటే తట్టుకోలేక మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే 40 ఎకరాలు ఎవరబ్బ సొమ్ము? ల్యాండ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. నయీంతో దోస్తీ చేసిన వ్యక్తి ఆయన. నాకున్న ఆస్తుల వివరాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఆ వివాదాస్పద భూముల్లో నా బంధువులు అక్రమంగా కొనుగోలు చేస్తే 24 గంటల్లోగా స్వాధీనం చేసుకుని పేదలకు పంచండి. అధికారంలో మీరే ఉన్నారు. సీఎంకు కూడా చెప్పు. నేను పది మందికి మంచి చెప్పేవాడిని. నేను ఎవరితోనూ చెప్పించుకోను. నువ్వు చెబుతున్నట్లుగానే.. ఎప్పుడో మావాళ్లు భూములు కొని ఉంటే ఇన్ని రోజులు ఏం చేశావ్? పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అడగలేదు? రూ.400 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని ఇబ్రహీంపట్నంలో కాజేశావ్. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఓఆర్సీ ఇప్పించావ్. దాని పక్కనే ప్రభుత్వ సంస్థలకు భూమిని గతంలో ఇచ్చారు. పోలీస్‌స్టేషన్, మార్కెట్ కమిటీ, ఆర్టీసీ డిపోలకు దాదాపు 30 ఎకరాలు కేటాయించారు. ఇదిపోగా 40 ఎకరాలు ఎవరబ్బ సొమ్మని బినామీల పేరిట తెచ్చుకున్నావ్? – మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్ మృతి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి చెందాడు. విజయారెడ్డిపై దాడి సమయంలో తీవ్ర గాయాలపాలైన సురేశ్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈసీజీలో పల్స్ రేటు ఫ్లాట్‌గా రావడంతో మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వెంటిలేటర్ తొలగించినట్లు పేర్కొన్నారు. కాగా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై రైతు సురేశ్ సోమవారం పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విజయారెడ్డి తన కార్యాలయంలోనే మృతి చెందారు. ఇక ఆమెతో పాటు నిందితుడు సురేశ్‌కు కూడా నిప్పంటుకోవడంతో 65 శాతం గాయాల పాలైన అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. కాగా వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి.. మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఇక ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు వెళ్లిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథం కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విజయారెడ్డి హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితుడు సురేశ్ కాల్‌డేటా, విజయారెడ్డి కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సురేశ్ మాట్లాడినట్లు తేలడంతో.. ఈ కేసులో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. (చదవండి: అదే ఆమె హత్యకు కారణమైంది..) -
పక్కా ప్లానింగ్ ప్రకారమేనా..?
సాక్షి, హైదరాబాద్: పక్కా పథకం ప్రకారమే అబ్దుల్లాపూర్‌మెట్ తాహసీల్దార్ విజయారెడ్డి హత్య జరిగిందా? హత్యా సమయంలో ఎమ్మార్వో ఆఫీసు బయట కారులో ఉన్నది ఎవరు? ఘటన తర్వాత నిందితుడు సురేష్ వారితో ఏం మాట్లాడాడు? అసలు హత్యకు ముందు విజయారెడ్డి గదిలో ఏం జరిగింది? సురేష్‌కు, విజయారెడ్డికి మధ్య వాగ్వాదానికి కారణం ఏంటి? సురేష్ ఆమెపై పెట్రోల్ పోస్తుండగా... ఆ వాసన బయటకు రాలేదా? ఆ సమయంలో అటెండర్‌తోపాటు అక్కడ ఎవరూ ఎందుకు లేరు? విజయారెడ్డి సజీవదహనం కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు సురేష్ పక్కా ప్రణాళికతోనే తహసీల్దార్ విజయారెడ్డిని హత్య చేసినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. సంఘటనాస్థలం పరిసరాల్లో లభించిన సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. హత్యకు ముందు, ఆ తర్వాత పరిణామాలు చూస్తే.. ఇది పక్కా ప్రణాళికగానే కనిపిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత సురేష్ మంటలతో బయటకు వచ్చి.. దగ్గరలోని వైన్ షాపు ముందు కారులో ఉన్నవారితో మాట్లాడినట్టు సమాచారం. వారితో మాట్లాడిన తర్వాతే అతను పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు చెప్తున్నారు. మరోవైపు అబ్థుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డికి నిప్పటించి హత్య చేసిన నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ రఫీ వెల్లడించారు. సురేష్‌కు 65 శాతం గాయాలయ్యాయని, ఆయన ప్రాణానికి గ్యారెంటీ ఇవ్వలేమని రఫీ తెలిపారు. -
ఎమ్మార్వో హత్య: నా భర్త అమాయకుడు
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ భార్య లత ఈ హత్యా ఉదంతంపై స్పందించారు. తన భర్త సురేష్ అమాయకుడని తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మార్వో హత్య చేసేంత దారుణానికి ఒడిగడుతాడని తాను భావించటం లేదని చెప్పారు. దీనివెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేసింది. ఎమ్మార్వో విజయారెడ్డి హత్యలో తన భర్తను పావుగా వాడుకున్నారని ఆరోపించారు. ఈ సంఘటన జరిగిన అనంతరం తన భర్త సురేష్‌తో ఇప్పటివరకు మాట్లాడలేదన్నారు. హత్య జరిగిన రోజు తనతో భూవివాదం, ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళుతున్నట్లు వంటి ఎలాంటి విషయాలు తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఈ దారుణం వెనక ఉన్న వాళ్లని కూడా బయటికి తీయాలని సురేష్ భార్య లత పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు. -
ఆ భూమి విలువ రూ. 100 కోట్లు: మంచిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పందించారు. నిందితుడు టీఆర్ఎస్ కార్యకర్త అని, ఎమ్మెల్యే అనుచరులే హత్య చేయించారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన మీద ఓడిపోయిన మల్రెడ్డి ఓటమి తట్టుకోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భూ కబ్జాదారులు అంటూ ప్రచారం చేస్తున్న వారే అసలు కబ్జాదారులని విమర్శించారు. విజయారెడ్డి మరణం దురదృష్టకరమని, ఆమె హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. విజయారెడ్డి మరణాన్ని రాజకీయం చేస్తున్నారని, ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. నిందితుడు సురేశ్ భూములు కొనుగోలు చేసింది మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి కుటుంబ సభ్యులేనని, మొత్తం 412 ఎకరాలపై పూర్తి దర్యాప్తు చేయాలని కోరారు. పాస్ పుస్తకాలు లేకుండా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 90 నుంచి 101 సర్వేలో మొత్తం భూమిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం ఈ భూములపై దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఆ భూమి విలువ రూ. 100 కోట్లు నాలుగు సర్వేల్లో ఉన్న భూమి విలువ 100 కోట్లు ఉంటుందని మంచిరెడ్డి అన్నారు. 1980లో ప్లాట్లు అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 16 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నది మల్ రెడ్డి రంగారెడ్డి కుటుంబ సభ్యులేనని ఆరోపించారు. తాను 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేగాక న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడు సురేష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్నాడని, మల్ రెడ్డి రంగారెడ్డి సోదరులతో పాటు ఇంకా అనేక మంది ఇందులో భాగమై ఉన్నారని ఆరోపించారు. -
విషమంగా సురేశ్ ఆరోగ్యం..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తునకై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వనస్థలిపురం ఏసీపీ జయరాంను విచారణ అధికారిగా నియమించారు. అదే విధంగా విజయారెడ్డిని కాపాడబోయి చికిత్స పొందుతూ ఆమె డ్రైవర్ గురునాథం మృతి చెందిన నేపథ్యంలో ఈ కేసులోని సెక్షన్లలో మార్పులు చేశారు. గురునాథం మృతి తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. అదే విధంగా ఘటనా స్థలంలో నిందితుడు సురేశ్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు... తహశీల్దార్ హత్య తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. కాగా విజయారెడ్డిని సజీవ దహనం చేసిన రైతు సురేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతడు ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సంరక్షణలో ఉస్మానియా ఆస్పత్రిలోని బర్నింగ్ వార్డులో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సురేశ్ ఛాతీ, పొట్ట, ముఖం, కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలు శరీరంలోని నీరు మొత్తం పోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం న్యూరో బర్న్ షాక్‌లో ఉన్న సురేశ్ మరో 24 గంటలు దాటితే స్కిన్ బర్న్ సెప్టిక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని.. ప్రస్తుతానికి అతడికి ఫ్లూయిడ్స్ అందిస్తూ చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో సురేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఉస్మానియా వైద్యులు 72 గంటలు గడిస్తే గానీ అతడి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం లేదన్నారు. హత్యకు కారణం అదేనా...? మరోవైపు ఇప్పటికే నిందితుడి నుంచి మెజిస్ట్రేట్ డీడీ డిక్లరేషన్ నివేదిక తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లనున్నారు. అదే విధంగా సురేశ్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హయత్‌నగర్ , అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్నేహితులతో సురేశ్ మాట్లాడినట్లు గుర్తించామన్నారు. అలాగే హత్యకు ముందు కొద్ది నిమిషాల క్రితం సురేశ్ తన పెదనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. అంతేకాకుండా వేరే వ్యక్తులతో మాట్లాడిన కాల్స్‌ను సురేశ్ రికార్డ్ చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా సురేష్ కుటుంబానికి చెందిన 9 ఎకరాల భూమి వివాదమే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికి సురేశ్ తండ్రి కృష్ణ, పెద్దనాన్న దుర్గయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా గతంలో కూడా ఈ భూ వివాదంపై గ్రామ సభల్లో తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో సురేశ్ గొడవలకు దిగినట్లు సమాచారం. -
వెలిదండకు చేరిన గురునాథం మృతదేహం
సాక్షి, గరిడేపల్లి (హుజూర్నగర్): అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్ సజీవ దహనం విషయంలో మృతి చెందిన కామళ్ల గురునాథం మృతదేహం మంగళవారం రాత్రి 7గంటలకు స్వగ్రామమైన వెలిదండకు చేరింది. గ్రామానికి మృతదేహం చేరగానే పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. భార్య సౌందర్య, తల్లి రమణమ్మ, తండ్రి బ్రహ్మయ్య కన్నీరు మున్నీరుగా విలపించారు. కోదాడ రూరల్ ఎస్ఐ సైదులు, గరిడేపల్లి ఎస్ఐ వెంకన్న, ఏఎస్ఐ నాగేశ్వరరావుతో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. గురునాథంకు బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద తహసీల్దార్ విజయారెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోలు పోసి నిప్పు అంటించిన ఘటనలో ఆమెను కాపాడబోయి మంటల్లో కాలి గాయాలైన కారు డ్రైవర్ కామళ్ల గురునాథం అలియాస్ గురుపాదం (29) చాంద్రాయణగుట్ట అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందాడు. మండలంలోని వెలిదండ గ్రామానికి చెందిన కామళ్ల బ్రహ్మయ్య, రమణమ్మ పెద్ద కుమారుడు గురునాథం బతుకు దెరువు కోసం ఏడేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. సుతారి పనిచేస్తూ డ్రైవింగ్ నేర్చుకుని విజయారెడ్డి వద్ద ఐదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. విజయారెడ్డి కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉంటూ అక్కా అని విజయారెడ్డిని పిలిచేవాడు. ఆమెతో చాలా ఆప్యాయంగా ఉండేవాడు. మంటల్లో ఆమె చిక్కుకున్న సమయంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్షించే ప్రయత్నం చేశాడు. దాంతో ఆయన కూడా 75 శాతం కాలిపోయాడు. గాయపడిన గురునాథాన్ని చికిత్స కోసం హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం తుదిశ్వాస విడిచారు. కాగా గురునాథంకు భార్య సౌందర్యతో పాటు ఏడాదిన్నర పాప ఉంది. భార్య ప్రస్తుతం గర్భవతి. గ్రామంలో మిన్నంటిన రోదనలు గురునాథం మరణవార్త విని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గురువారం ఇంటి వద్ద తల్లి రమణ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గురునాథం ఇంటి వద్దకు బంధువులు, స్నేహితులు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన ఎంతో నమ్మకస్తుడని కొనియాడారు. మండల ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ పోరెడ్డి శైలజరవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, సర్పంచ్ ఆదూరి పద్మ, ఎంపీటీసీ ములకలపల్లి విజయతో పాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గురునాథం ఇంటి వద్ద గరిడేపల్లి ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పరామర్శించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి... గురునాథం మృతదేహాన్ని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. సోమవారం జరిగిన ఘటనలో తహసీల్దార్ విజయారెడ్డి, గురునాథం మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. బాధితుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతికి సంతాపం... గ్రామానికి చెందిన యువకులు పాఠశాలకు చేరుకుని గురునాతం మృతికి సంతాపంగా నల్లబ్యాడ్జీలు ధరించి, మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సీవీ రాము, బాలస్వామి, ఉపాధ్యాయులు బుచ్చారావు, కేవీ సత్యనారాయణ, కళావతి, ప్రశాంతి, సువర్ణ, రంగయ్య, లక్ష్మయ్య, రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, చంద్రకళ, నవ్య, గ్రామ యువకులు నాగరాజు, గోపి, శేఖర్ పాల్గొన్నారు. -
బెదిరించాలనా? చంపాలనా..?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కేవలం తమ భూ వివాదం నేపథ్యంలోనే నిందితుడు కూర సురేష్ తహసీల్దార్‌ను సజీవదహనంచేశాడా? లేక ఇతరులు ఎవరైనా ఉసిగొల్పారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయారెడ్డిపై దాడి ఘటనకు ముందు నిందితుడు సురేష్ తన పెద్దనాన్న దుర్గయ్యతో పలుమార్లు సెల్ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దుర్గయ్య, అతని కుమారుడు ఆనంద్, నిందితుని తండ్రి కృష్ణ, మరొకరు భిక్షమయ్య.. ఈ నలుగురు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వీరి అన్ని నుంచి అన్ని వివరాలు రాబడుతున్నారు. వీరి ఫోన్లతో పాటు సురేష్ సెల్‌ఫోన్ కాల్‌డేటా విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా ఘటనకు ముందు సురేష్ ఎక్కడెక్కడ తిరిగాడ సెల్‌ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. భూ విషయంలో న్యాయం చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని తహసీల్దార్‌ను బెదిరించాడా? లేక ఆమెను హత్య చేయడానికే పథకం వేశాడా? లేదంటే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి క్షణికావేశంలో నిప్పంటించాడా? అనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇదికాక ముందస్తు ప్రకారమే హత్య అయితే.. ఈ విషయాన్ని సురేష్ తన పెద్దనాన్న దుర్గయ్యకు చెప్పాడా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు. నిందితుడు తీవ్ర కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకుంటేనే మరిన్ని వివరాలు తెలిసే వీలుంది. ఇదీ నేపథ్యం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని 92 నుంచి 101 సర్వే నంబర్ల పరిధిలో దాదాపు 70 ఎకరాల్లో భూమి వివాదాస్పదంగా మారింది. ఈ పట్టా భూమిపై 15 మంది చొప్పున కౌలుదారులు, భూ యజమానులకు మధ్య వివాదం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సురేష్ నాన్నతోడ పుట్టిన వారికి, ఇతర రక్త సంబంధీకులకు ఏడెకరాల వాటా ఉందని సమాచారం. 2010 నుంచి ఈ భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే, భూ యజమానుల నుంచి సాదాబైనామాలతో ఏళ్ల కిందటే తాము కొనుగోలు చేశామని, ఆ భూమి తమకే చెందుతుందని సురేష్ కుటుంబ సభ్యులు అంటున్నారు. భూ యజమానులు, కౌలుదారులకు అనుకూలంగా ఆర్డీఓ ఉత్తర్వులు ఇచ్చినా, జాయింట్ కలెక్టర్ తీర్పు వెలువరించినా ఆ భూమి తమదేనన్నది నిందితుని వాదన. జేసీ తీర్పును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపి వివాదాన్ని పరిష్కరించాలని జేసీకి కోర్టు సూచించింది. ఈ క్రమంలో పట్టాదారులకు గతంలో మాదిరిగానే అనుకూలంగా ఇటీవల జేసీ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో తహసీల్దార్ విజయారెడ్డి తమకు వ్యతిరేకంగా వ్యవహరించారని సురేష్ ఆమెపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆమెకు నిప్పంటించినట్లు ప్రచారం జరుగుతోంది. డ్రైవర్ మృతి పట్ల దిగ్భ్రాంతి తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన డ్రైవర్ గురునాథం నగరంలోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని అతని స్వస్థలమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండకు తరలించారు. గురునాథం మృతిపట్ల జిల్లా ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఉద్యోగ సంఘాల నాయకులు అతని మృతికి సంతాపం తెలిపారు. వారికి భూమే లేదు.. ఇదిలా ఉండగా.. సురేష్, ఆయన కుటుంబ సభ్యులపై సదరు సర్వేనంబర్లలో భూమే లేదని, అయినా తహసీల్దార్‌పై దాడి ఎందుకు చేశాడోనని రెవెన్యూ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరి ప్రోద్బలంతోనైనా అమానుషానికి ఒడిగట్టి ఉంటాడేమోనని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. రికార్డుల పరంగా ఆయనకు భూమి ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలూ లేకపోవడంతో హత్యకు కారణాలు ఏమిటనేది పోలీసుల విచారణలో తేలనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
తహసీల్దార్ ముందు జాగ్రత్త!
పత్తికొండ టౌన్ : తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనతో రెవెన్యూ ఉద్యోగులు హడలిపోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి తన చాంబర్లో అడ్డంగా తాడు కట్టించి.. అర్జీలు ఇచ్చేవారు ఎవరైనా తాడు బయట నుంచే ఇవ్వాలని, లోపలికి ఎవర్నీ అనుమతించవద్దని సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ హడావుడి చూసి కార్యాలయ సిబ్బందితో పాటు వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ విషయమై తహసీల్దార్‌ను విలేకరులు వివరణ అడగ్గా.. ‘మా జాగ్రత్త మేం తీసుకోవాలి కదా’ అన్నారు. -
తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్‌తో అలజడి
కొండాపురం: తెలంగాణలోని అబ్దుల్లాపూర్ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే వైఎస్సార్ జిల్లా కొండాపురం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అలాంటి ఘటన చోటుచేసుకుంది. అధికారులు, సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దత్తాపురం గ్రామానికి చెందిన బుడిగ ఆదినారాయణ మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పెట్రోలు పోసుకోవడంతో వెంటనే చుట్టూ ఉన్న వారు అతని చర్యలను అడ్డుకున్నారు. బయటకు తీసుకెళ్లి అతనిపై నీళ్లు పోసి ప్రమాదం తప్పించారు. ఆదినారాయణ తన తల్లి పేరు మీద ఉన్న డీకేటీ భూమిని తన పేరిట మార్చి నష్ట పరిహారం చెల్లించాలని వీఆర్వో, తహసీల్దార్‌ను గతంలో కోరాడు. అదే భూమి ఎరికల గారి నరసింహులు ఆక్రమించాడని 2009లో హైకోర్టులో ఆదినారాయణ పిటిషన్ వేయగా ఆ కేసు నడుస్తోంది. అయినా ఆ పొలాన్ని తన పేరిట మార్చాలని తహసీల్దార్‌కు ఇటీవల వినతిపత్రం ఇచ్చాడు. వారు స్పందించకపోవడంతో అధికారులపై పెట్రోలు పోసి నిప్పంటించి.. తానూ ఆత్మహత్య చేసుకోవాలని ఈ చర్యకు పాల్పడినట్లు ఆదినారాయణ చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హజీవలీ తెలిపారు. సరైన పత్రాలు లేవు బుక్కపట్నం రెవెన్యూ పొలంలో ఖాతా నంబర్ 789, సర్వే నంబర్ 122లో 3.61 ఎకరాల భూమికి ఆదినారాయణ నకిలీ పాసు పుస్తకం తయారు చేసుకున్నాడని తహసీల్దార్ తెలిపారు. ఆ పొలంపై ఆదినారాయణకు ఎలాంటి హక్కులు లేకున్నా అధికారులను బెదిరిస్తున్నాడని తెలిపారు. -
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు
దిల్సుఖ్నగర్/నాగోలు/మన్సూరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి అంతిమయాత్ర శోకసంద్రమైంది. మంగళవారం ఆర్కేపురం వాసవి కాలనీ లక్ష్మీ అపార్ట్మెంట్ నుంచి నాగోల్‌లోని శ్మశాన వాటిక వరకు ఐదు గంటలపాటు సాగిన అంతిమయాత్రలో దారి పొడవునా కన్నీటి నిరసనలు కనబడ్డాయి. పోలీసుల బందోబస్తు మధ్య అంతిమయాత్రలో భారీ సంఖ్యలో బంధువులు, రెవెన్యూ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయారెడ్డికి నివాళులర్పించారు. విజయారెడ్డి కుమారుడు భువనసాయి, కుమార్తె చైత్ర ఉన్నా చిన్నవాళ్లు కావడంతో భర్త సుభా‹Ùరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ దగ్గరుండి అంత్యక్రియలు ముగిసే వరకు పర్యవేక్షించారు. విజయారెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నాగోలు శ్మశాన వాటికలో నిర్వహించారు. రాస్తారోకో... స్వల్ప ఉద్రిక్తత... అల్కాపురి చౌరస్తాలో రెవెన్యూ ఉద్యోగులు మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. విజయారెడ్డి మృతదేహంతో ఒక్కసారిగా రెవెన్యూ ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చి రాస్తారోకో నిర్వహించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కమిషనర్ మహేశ్ భగవత్, జాయింట్ సీపీ సురేందర్‌బాబు, ఇతర పోలీస్ అధికారులు రెవెన్యూ ఉద్యోగులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. విజయారెడ్డికి గౌరవ వందనంగా తుపాకులను గాలిలోకి కాలుస్తున్న చేస్తున్న పోలీసులు ఉదయం ఏడు గంటల నుంచే... రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రెవెన్యూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పారీ్టల నేతలు మంగళవారం ఉదయం 7 గంటలకే విజయారెడ్డి నివాసానికి చేరుకొని అమె మృతదేహానికి నివాళులర్పించారు. ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయారెడ్డి అంతిమ యాత్రలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జిట్టా బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలి: రేవంత్ విజయారెడ్డి సజీవదహనం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మేజి్రస్టేట్ అధికారాలున్న అధికారిపై దాడి చేయడం దారుణమని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయని మండిపడ్డారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి... విజయారెడ్డి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉద్యోగులకు భద్రత కలి్పంచాలని కోరారు. విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందని, దీన్ని తేల్చాల్సిన అవసరముందని అన్నారు. అండగా ఉంటాం: మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి విజయారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇది ఉన్మాదంతో ఒక వ్యక్తి చేసిన పని. ఇలాంటి ఘటన ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్‌లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఉన్నచోట్ల ప్రత్యేక చర్యలు చేపడతాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: లచ్చిరెడ్డి విజయారెడ్డి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ తహసీల్దార్ల వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. 3 రోజులు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. త్వరలోనే పూర్తి కార్యాచరణ విడుదల చేస్తామని అన్నారు. విజయారెడ్డి కుటుంబానికి అండగా ఉందాం : రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అమానుష హత్యను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఖండించారు. మృతురాలి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ఘటన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి భద్రత కలి్పంచేలా వెంటనే చర్యలు చేపట్టాలని సోమేశ్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లాల కలెక్టర్లకు సందేశం పంపారు. కాగా,తహసీల్దారు సజీవ దహనంపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం (టీఎస్ఐఏఎస్) ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రభుత్వం విజయారెడ్డి కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరింది. ప్రజాసేవలో అధికారులు ధైర్యంగా పనిచేయాలంటే నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించింది. అఖిలపక్షం నిర్వహించాలి: చాడ సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన నేపథ్యంలోనైనా వెంటనే రెవెన్యూ నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో భేటీ ఏర్పాటు చేసి రెవెన్యూ చట్టాలు, భూరికార్డుల్లో మార్పులకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జాప్యం జరిగే కొద్దీ ఉద్యోగులు, ప్రజల మధ్య అంతరాలు పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని, ఇది సమాజానికి మంచిదికాదని మంగళవారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నేడు నల్లబ్యాడ్జీలతో నిరసనలు సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిస్తూ, రెవెన్యూ ఉద్యోగులకు సంఘీభావంగా బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్టు అటవీశాఖలోని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. మంగళవారం అరణ్యభవన్‌లో జరిగిన సమావేశంలో స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్, మినిస్టీరియల్ స్టాఫ్, డ్రైవర్లు, క్లాస్–4 ఉద్యోగుల సంఘాలు తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపం తెలిపాయి. విధుల బహిష్కరణ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మంగళవారం రెవెన్యూ, ఇతర ఉద్యోగ సంఘాలు విధులు బహిష్కరించాయి. విధి నిర్వహణలో అసువులుబాసిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఒక్కడి పనేనా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తహసీల్దార్‌పై పథకం ప్రకారం పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడు కూర సురేశ్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? హత్యకు కుట్రను అతను ఎవరితోనైనా పంచుకున్నాడా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సురేశ్ మొబైల్ కాల్‌డేటాను విశ్లేషిస్తున్నారు. హత్యకు ముందు సురేశ్ తన పెదనాన్న దుర్గయ్యతోపాటు పలువురు బంధువులు, స్నేహితులతో మాట్లాడినట్లు గుర్తించారు. మరోవైపు ఈ వ్యవహారంలో సురేశ్ పెదనాన్న దుర్గయ్య పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేశ్‌కు ఎలాంటి మానసిక రుగ్మతల్లేవని గ్రామస్తులంతా చెబుతుంటే దుర్గయ్య, కుటుంబ సభ్యులు మాత్రం అతనికి మతిస్థిమితం లేదని, రియల్టర్ అని, వివాదంతో సంబంధమే లేదని పొంతనలేని సమాధానాలు చెప్పడం వెనుక దురుద్దేశం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సురేశ్ కుటుంబానికి 1998లోనే ఆర్.ఓ.ఆర్ కింద పాసు పుస్తకాలు మంజూరయ్యాయని స్థానికులు చెబుతుండటంతో ఈ వ్యవహారంతో సురేశ్‌కు సంబంధం లేదని కుటుంబ సభ్యులు చెప్పడంపై సందేహపడుతున్నారు. సురేశ్ వెనక బంధువులు ఎవరైనా ఉన్నారా? అనే విషయంపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. -
తహసీల్దార్ కారు డ్రైవర్ మృతి
పెద్ద అంబర్‌పేట: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత ఆమెను కాపాడే యత్నంలో మంటలంటుకొని తీవ్రంగా గాయపడిన ఆమె కారు డ్రైవర్ గురునాథం (27) చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయారెడ్డిపై నిందితుడు సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఘట నా స్థలంలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో ఆమె కారు డ్రైవర్ గురునాథానికి మంటలంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను డీఆర్డీఎల్లోని అపోలో ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెం దినట్లు పోలీసులు తెలిపారు. గురునాథం స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామం. విజయారెడ్డి వద్ద నాలుగేళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురునాథంకు భార్య, ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య ఎనిమిది నెలల గర్భిణి. గురునాథం మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు సురేష్ అరోగ్య పరిస్థితి విషమం తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడు సురేష్‌కు ఉస్మానియా ఆస్పత్రిలోని ప్లాస్టీక్ సర్జరీ విభాగంలో పోలీసుల సంరక్షణలో చికిత్స కొనసాగుతోంది. కాగా 65 శాతం కాలడంతో సురేష్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు చూడడానికి బంధువులుగానీ, స్నేహితులుగానీ ఎవ్వరూ రాలేదని ఆçస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్స పొందుతున్న మరో ఇద్దరు... తహసీల్దార్‌కు నిప్పంటించిన ఘటనలో గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోనే అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రయ్యకు కూడా గాయపడటంతో డీఆర్డీఎల్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి శరీరం 50 శాతం మేర కాలినట్లు పోలీసులు తెలిపారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం. అదేవిధంగా తన భూ సమస్య పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన కవాడిపల్లికి చెందిన బొడిగె నారాయణగౌడ్‌కు కూడా గాయాలైన విషయం తెలిసిందే. అయితే ఆయనను హయత్‌నగర్‌లోని టైటాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఉద్యోగం కల్పించండి: సౌందర్య విధి నిర్వహణలో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్ధార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన డ్రైవర్ గురునాథం భార్య సౌందర్య తనకు ఉద్యోగం కల్పించాలని కోరారు. తన, పిల్లల భవిష్యత్ కోసం ఉద్యోగం కల్పించి, దళితులకు కేటాయించిన 3 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. -
ఎమ్మార్వో హత్య కేసు : నిందితుడి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అతని ఒంటిపై 65 శాతం కాలిన గాయాలు ఉన్నాయని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సంరక్షణలో ఉస్మానియా మెయిల్ బర్నింగ్ వార్డులో నిందితుడు చికిత్స పొందుతున్నాడు. నిందితుడి నుంచి మెజిస్ట్రేట్ డీడీ డిక్లరేషన్ నివేదిక తీసుకున్నారు. 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సురేష్ న్యూరో బర్న్ షాక్‌లో ఉన్నట్టు తెలిపారు. మరో 24 గంటలు దాటితే సురేష్ స్కిన్ బర్న్ సెప్టిక్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉందని తెలిపారు. ఉస్మానియా వైద్యులు పోలీసుల సమక్షంలో ఫ్లూయిడ్స్ ఇస్తూ.. చికిత్స అందిస్తున్నారు. -
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు..
-
సజీవదహనం: తాపీగా నడుచుకుంటూ వెళ్లిన సురేష్
-
సజీవదహనం: తాపీగా నడుచుకుంటూ వెళ్లిన సురేష్
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. కేసు దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ ఘటనాస్థలంలో శాంపిల్స్‌ను సేకరించింది. దీంతోపాటు తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉన్న హాస్టల్లోని సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు సేకరించారు. నిందితుడు సురేష్ కాలిన గాయాలతో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను ఈ సీసీటీవీ కెమెరా నమోదుచేసింది. తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన అనంతరం కాలిన గాయాలతో నిందితుడు సురేష్ తాపీగా నడుచుకుంటూ వెళుతున్నట్టు ఈ దృశ్యాలలో కనిపిస్తోంది. ఇప్పటికే సేకరించిన శాంపిల్స్, వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు పంపించారు. తహసీల్దార్ చంపేందుకు సురేష్ కిరోసిన్‌లో పెట్రోల్ కలిపి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే విజయారెడ్దిని కూర సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి.. పట్టపగలే అమానుషంగా సజీవం దహనం చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో ఆ వ్యక్తి ఈ దుర్మార్గానికి ఒడిగడ్డాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబడ్డ కూర సురేశ్... రెప్పపాటులోనే విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో గురునాథ్ మంగళవారం ప్రాణాలు విడిచాడు. -
పూర్తయిన తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు
-
విజయారెడ్డి హత్యకు నిరసనగా విధుల బహిష్కరణ
సాక్షి, విజయవాడ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా విజయవాడ గొల్లపూడిలో రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. మహిళా తహశీల్దార్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు.. గొల్లపూడి సెంటర్ నుంచి వై జంక్షన్ వరుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసే ఉద్యోగులపై పాశవిక దాడి అత్యంత దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రజలకు రక్షణ కల్పించే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ
సాక్షి, ఖమ్మం టౌన్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మం కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ హత్యను గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సేవకులు తీవ్రంగా ఖండించారు. నిరసనగా నగరంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద మానవహారం చేశారు. నిందితుడు సురేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. -
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్ శ్మశాన వాటికలో పూర్తయాయి. విజయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూశాఖ ఉద్యోగులు, స్థానికులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం నాగోల్ శ్మశాన వాటికలో విజయారెడ్డి భౌతికకాయానికి భర్త సుభాష్‌రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించి.. అంత్యక్రియలు పూర్తి చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే విజయారెడ్దిని కూర సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి.. పట్టపగలే అమానుషంగా సజీవం దహనం చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో ఆ వ్యక్తి ఈ దుర్మార్గానికి ఒడిగడ్డాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబడ్డ కూర సురేశ్... రెప్పపాటులోనే విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో గురునాథ్ మంగళవారం ప్రాణాలు విడిచాడు. విజయారెడ్డికి భర్త సుభాష్‌తోపాటు ఇద్దరు చిన్నపిల్లలు.. అమ్మాయి(10), అబ్బాయి(5) ఉన్నారు. తల్లి మరణంతో పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. -
మరో ఇద్దరు కూడా వచ్చారు: ప్రత్యక్ష సాక్షి
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి, రైతు నారాయణ ప్రస్తుతం హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివాదాస్పద భూమి పట్టా విషయమై సురేశ్ అనే రైతు విజయారెడ్డిని ఆమె కార్యాలయంలో సజీవదహనం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో అక్కడే ఉన్న నారాయణ అనే రైతుకు కూడా తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన తన ఇద్దరు కుమారులతో ఘటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘ నేను ఎమ్మార్వోతో మాట్లాడుతుండగానే ముగ్గురు వ్యక్తులు గదిలోకి వచ్చారు. దీంతో నన్ను కాసేపు బయట ఉండమని ఎమ్మార్వో చెప్పడంతో నేను గది ముందే వేచి చూస్తున్నాను. కొద్ది సేపటికే ఎమ్మార్వో విజయ మంటలతో బయటకు పరుగులు పెట్టారు. తలుపు దగ్గరే ఉన్న నాకు తీవ్ర గాయాలయ్యాయి అని నారాయణ పేర్కొన్నాడు. కాగా విజయారెడ్డి హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి నారాయణ నుంచి మెజిస్ట్రేట్ వాంగ్మూలం సేకరించారు. ఈ నేపథ్యంలో నారాయణ చెబుతున్న ప్రకారం సురేశ్‌తో పాటు మరో ఇద్దరు కూడా కార్యాలయానికి వచ్చారన్న విషయం స్పష్టమైంది. పోలీసులు ఈ కోణంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా నాగోల్‌లోని శ్మశాన వాటికలో విజయారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. -
తహసీల్దార్ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’
-
తహసీల్దార్ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’
సాక్షి, భువనగిరి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి హత్యోదంతంతో రెవెన్యూ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ పిలుపునిచ్చారు. తహసీల్దార్‌ను దారుణంగా హతమార్చిన నిందితుడు సురేష్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈనేపథ్యంలో నిరసన చేపట్టిన భువనగిరి జిల్లా గుండాల మండల రెవెన్యూ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. (చదవండి : పెట్రోల్ పోసి.. నిప్పంటించి..) నిరసనకు దిగిన సిబ్బందిని అక్కడి ప్రజలు నిలదీశారు. అన్నీ పత్రాలు సక్రమంగా తమ పనులు చేయడానికి కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఈక్రమంలో తన వద్ద రూ.2 వేలు లంచం తీసుకున్నాడంటూ ఓ మహిళ రెవెన్యూ ఉద్యోగిని నిలదీసింది. తన దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుంటే గల్లా పట్టి వసూలు చేస్తానని హెచ్చరించింది. ఈవ్యవహారమంతా వీడియో రికార్డింగ్ అవుంతోందని గ్రహించిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. (చదవండి : మూడు రోజులు విధుల బహిష్కరణ ) -
మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ.. రేపు..?: రేవంత్
సాక్షి, హైదరాబాద్ : పట్టపగలే ప్రభుత్వ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డి హత్య జరగడం దారుణమని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగానే విజయారెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు దూరం ప్రభుత్వమే పెంచిందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. ఘటనపై ఉద్యోగులు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని హామీ ఇచ్చారు. ‘మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న అధికారిణిపై దాడి దారుణం. దాదాపు ఐదు వందల ఎకరాల భూ వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగింది. ఇంతటి ఘోరమై ఘటన జరిగితే న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దగ్గరే ఉంది. హత్య జరిగి 24 గంటలు గడుస్తున్నా సీఎం నివాళులు అర్పించేందుకు రాలేదు. రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మంత్రి కేటీఆర్ రెవెన్యూ అధికారులపై దాడి చేయాలని పిలుపునివ్వడం ఇలాంటి ఘటనలకు ఉసిగొల్పుతుంది. ఘటనపై సీబీఐ విచారణ జరపాలి’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారిక లాంఛానలతో జరపాలి! ‘భూ వివాదంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి. మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ.. రేపు మరో శాఖకు ఇలాంటి చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. జ్యూడిషియల్ అధికారి విధి నిర్వహణలో మరణిస్తే అధికారిక లాంఛనాలతో జరపాలని ప్రభుత్వం ప్రకటించలేదు. విజయారెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కనీసం పలకరించకపోవడం బాధాకరం. బాధిత కుటుంబాన్ని సీఎం పరామర్శించాలి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి’ అని రేవంత్‌రెడ్డి ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో సమస్యలు పరిష్కరించింది: కోమటిరెడ్డి విజయారెడ్డిపై దాడి మానవత్వాన్ని మంటగలిపే విధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తహశీల్దార్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన తనను వేదనకు గురిచేసిందన్నారు. ‘విజయారెడ్డి ఎన్నో సమస్యలను పరిష్కరించింది. ఆమె హత్య చూసి సమాజం బాధ పడుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా. రెవెన్యూశాఖ సమస్యలను ఒకేసారి పరిష్కారం చేయలేము. అధికారుల పై విపరీతమైన ఒత్తిడి ఉంది’ అని పేర్కొన్నారు. -
విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి..
-
‘అధికారులకు అలా జరగాల్సిందే..’
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్‌పూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య అనంతరం.. గౌరెల్లి గ్రామంలోని 412 ఎకరాల భూ వివాదం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సంచలనం రేపుతున్న ఈ హత్య గురించి ఓ రాజకీయ నేత గౌరెల్లి గ్రామానికి చెందిన రైతుతో మాట్లాడారు. వారిద్దరి సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ భూములు తాతల కాలం నాటివని.. అందులో 7 ఎకరాలు విజయారెడ్డిపై దాడికి పాల్పడ్డ సురేశ్ కుటుంబానికి చెందినవని గౌరెల్లి రైతు సదరు రాజకీయ నేతతో అన్నారు. ఇది రజకార్లు ఉన్నప్పుడు కొన్న భూమి అని.. దీని కోసం దాదాపు 1950 నుంచి కొట్లాడుతున్నామని తెలిపారు. ఎన్నో ఎళ్లుగా వాటిని కాజేయాలని చాలా మంది యత్నించారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారిన సమస్య మాత్రం తీరలేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లు నకిలీ పత్రాలు సృష్టించి భూములు కాజేసేందుకు యత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూముల కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఈ భూములు రైతులకు ఇప్పిస్తానని చెప్పి.. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వారి వద్ద నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. అందులో సురేశ్ కుటుంబానివి కూడా 2 నుంచి 3 లక్షల రూపాయలు ఉంటాయని చెప్పారు. రాజకీయ నేతతో రైతు జరిపిన సంభాషణ.. అలాగే పై అధికారులకు కూడా అలా జరగాల్సిందేనని సదరు రైతు అన్నారు. అయితే గౌరెల్లికి చెందిన రైతుతో మాట్లాడుతున్న సమయంలో సదరు రాజకీయ నేత కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద అంబర్‌పేటలో కూడా ఇలాగే 402 ఎకరాల భూమి ఉందని అన్నారు. 1955లో అక్కడి రైతులు ఈ భూములను కొనుగోలు చేశారని.. 1976 వరకు వారి పేర్లపైనే పట్టాలు ఉన్నాయని.. ఆ తర్వాత పేరు మార్చారని.. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉందని తెలిపారు. ఈ వివాదాన్న వెనకనుంచి ఓ ప్రముఖ నాయకుడి కుమారుడి నడిపిస్తున్నాడని ఆరోపించారు. అయితే చివర్లో ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించేలా పోరాటం రెండు గ్రామాల రైతులు చేసేలా చూడాలని వారి ఇరువురు అనుకున్నారు. -
గురునాథం మృతి.. అయ్యో పాపం భార్యాబిడ్డలు
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డి దారుణ హత్య నేపథ్యంలో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్ కామళ్ల గురునాథం మంగళవారం మృతి చెందాడు. సోమవారం రైతు దాడిలో అగ్నికి ఆహుతైన విజయారెడ్డిని రక్షించేందుకు గురునాథం తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో అతడికి కూడా నిప్పు అంటుకోవడంతో దాదాపు 85 శాతం శరీరం కాలిపోయింది. దీంతో గురునాథాన్ని అపోలో డీఆర్డీఎల్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు మరణించాడు. కాగా విజయారెడ్డి డ్రైవర్ గురునాథం స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామం. అతడికి భార్య, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. ప్రస్తుతం గురునాథం భార్య ఏడు నెలల గర్భిణి. ఇక గురునాథం మరణవార్త తెలిసిన నేపథ్యంలో ఆయన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయ్యో పాపం అంటూ పలువురు అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహమైన విషయం విదితమే. రైతు సురేశ్ పెట్రోల్‌తో చేసిన దాడిలో తొలుత మరణించింది ఎవరో అర్థంకాక సిబ్బంది అయోమయానికి గురయ్యారు. తహశీల్దార్ గది వెనుక కిటికీలోంచి చూస్తే ఆమె కనిపించకపోయే సరికి భయంతో అని కేకలు పెట్టారు. ఈ క్రమంలో మరొక వ్యక్తి వచ్చి విజయారెడ్డి చేతికి ఉన్న వాచీని చూసి ఆమెను తహశీల్దార్‌గా గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక విజయారెడ్డిని కాపాడేందుకు ఆమె కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య ముందుకురాగా వారు సైతం మంటల్లో కాలిపోయారు. దీంతో వారిని కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గురునాథ్ మంగళవారం మరణించగా.. చంద్రయ్య 50 శాతం కాలిన గాయాలకు చికిత్స పొందుతున్నాడు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
-
అందుకే విజయారెడ్డిని హత్య చేశాను: సురేశ్
సాక్షి, రంగారెడ్డి : వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ తెలిపాడు. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే సురేశ్ అగ్నికి ఆహుతి చేసిన విషయం విదితమే. సోమవారం జరిగిన ఈ ఘటనలో 60 శాతం గాయాలపాలైన సురేశ్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో వైద్యుల సమక్షంలో పోలీసులు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వోను ఎన్నో రోజులుగా... ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లానని... మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో తనకు నిప్పంటించుకుని విజయారెడ్డిని కూడా తగులబెట్టానని పేర్కొన్నాడు. కాగా విజయారెడ్డి దారుణ హత్యపై తీవ్రంగా స్పందించిన రెవెన్యూ ఉద్యోగులు మృతదేహానికి నివాళులు అర్పించేందుకు భారీ ఎత్తున ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. హత్య వెనుక ఉన్న మాఫియా ఆగడాలను బయటపెట్టి... వారిని కఠినంగా శిక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి : మహిళా తహసీల్దార్ సజీవ దహనం) ఆ భూమి విలువ రూ. 40 కోట్లు బాచారంలోని దాదాపు 412 ఎకరాల భూమి గత 70 ఏళ్లుగా వివాదాల్లో కూరుకుపోయింది. మహారాష్ట్రకు చెందిన రాజా ఆనందరావు పేరిట ఉన్న ఈ భూమిలో 130 ఎకరాల భూమిని... రాష్ట్ర ప్రభుత్వం భూప్రక్షాళన అనంతరం అతడు తమకు విక్రయించాడని సయ్యద్ యాసిన్ వారసులు తెరపైకి వచ్చారు. కాగా వివాదంలో ఉన్న ఆ భూమిని పలు కుటుంబాలు ఇప్పటికే సాగు చేసుకుంటున్నాయి. ఇందులో నిందితుడు సురేష్ కుటుంబం కూడా ఉంది. ఈ క్రమంలో తమకు చెందిన భూమిని వేరొకరికి బదిలీ చేశారంటూ రైతు కుటుంబాలు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ భూమి ఉండటంతో కబ్జాదారులు దీనిని చేజిక్కించుకునేందుకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. ఈ భూకబ్జాలో పలువురు రాజకీయ నేతల హస్తం కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిందితుడు సురేష్ తనదిగా పేర్కొంటున్న భూమి మార్కెట్ విలువ సుమారు 40 కోట్ల రూపాయలని సమాచారం. -
అధికారులపై ఇలాంటి దాడులు జరగడం దారుణం
-
ఆ కెమెరాలు పనిచేస్తున్నాయా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తహసీల్దార్ విజయారెడ్డి చాంబర్లో సీసీ కెమెరా ఉన్నప్పటికీ అది పనిచేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తేగాని ఘటన తీరు స్పష్టంగా తెలియదు. జెడ్పీ రోడ్డుకు ఆనుకుని ఉన్న తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించే చోట, ఆమె చాంబర్లోకి వెళ్లే వద్ద కూడా ఒకటి చొప్పున సీసీ కెమెరాలు బిగించారు. తహసీల్దార్ చాంబర్లోకి వెళ్లడం.. తిరిగి బయటికి రావడానికి ఒకే ద్వారం ఉంది. నిందితుడు సురేష్ లోపలికి వెళ్లడం కచ్చితంగా ఈ కెమెరాలకు చిక్కే ఉంటుంది. చాంబర్లో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందా? ఎంతసేపు చాంబర్లో ఉన్నాడు? తదితర వివరాలను ఫుటేజీ పరిశీలన ద్వారా తెలిసే వీలుంది. ఒకవేళ కెమెరాలు పనిచేసి ఉంటే.. నిందితుడు కార్యాలయంలోకి ప్రవేశించడం మొదలు.. ఆమె చనిపోయే వరకు ప్రతిక్షణం రికార్డు అయి ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట గుమిగూడిన ప్రజలు ఒక ఘటన..నాలుగు కుటుంబాల్లో విషాదం.. అబ్దుల్లాపూర్ మెట్లో తహసీల్దార్‌ను పట్టపగటు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడం నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. తహసీల్దార్ విజయారెడ్డికి ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. వీరు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెను కాపాడేందుకు యత్నించిన డ్రైవర్ గురునాథం కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అక్కడే ఉన్న అటెండర్ చంద్రయ్యకు కూడా గాయాలయ్యాయి. వీరిద్దరి కుటుంబం కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉంది. ఇక హత్యకు పాల్పడ్డ నిందితుడు కూర సురేశ్‌కు కూడా గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగానే ఉంది. సురేశ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మొత్తానికి ఒక వ్యక్తి పెంచుకున్న కక్ష.. నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. విజయారెడ్డి పిల్లలు తల్లిలేని వారయ్యారు. తమ తండ్రి బతుకుతాడో లేదోనన్న బెంగతో సురేష్ పిల్లలు క్షణక్షణం భయంతో గడుపుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియాలో సురేశ్, డీఆర్డీఎల్ అపొలోలో డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య చికిత్స పొందుతున్నారు. ఇక తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహం ఉస్మానియా మార్చురీలో ఉంది. -
పిల్లలు అన్యాయం అయిపోయారు
-
పెట్రోల్ పోసి.. నిప్పంటించి..
-
‘నా భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి తన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురికావడంతో ఆమె భర్త సుభాష్‌రెడ్డి కన్నీరు మున్నీరవుతున్నారు. తన భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆయన రోదిస్తున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. హత్య చేసిన వాళ్ల వెనకాల భూ కబ్జాదారులు ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వం విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. తన ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ఆఫీస్‌లో ఒత్తిడిని ఇంట్లో కనిపించనిచ్చేది కాదని గుర్తుచేసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి బదిలీ కోసం చాలా ప్రయత్నించిందని.. అలా జరిగి ఉంటే ఆమె బతికి ఉండేదని అన్నారు. కాగా, విజయారెడ్డి ఆమె కార్యాలయం లోనే సోమవారం హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. విజయారెడ్డి దంపతులకు కుమార్తె చైత్ర (10), కుమారుడు భువనసాయి (5) ఉన్నారు. విజయరెడ్డి మృతితో రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆందోళనలకు పిలుపునిచ్చారు. విజయారెడ్డి హత్యపై పోలీసులు దార్యప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయారెడ్డి ఇంటి వద్ద విషాదఛాయలు తహసీల్దార్ విజయారెడ్డి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణంతో భర్త సుభాష్‌రెడ్డి, అత్త, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి ఎక్కడ అని అడుగుతున్న చిన్నారులకు.. అర్దరాత్రి దాటిన తరువాత కుటుంబ సభ్యులు విజయారెడ్డి మరణవార్తను చెప్పారు. పిల్లలు ఎక్కడ భయభ్రాంతులకు గురవుతారనో భయంతో.. కుటుంబ సభ్యులు వారిని తల్లి మృతదేహానికి దూరంగా ఉంచారు. ఆర్టీసీ జేఏసీ నివాళి.. విజయారెడ్డి మృతదేహానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌గా విజయారెడ్డికి మంచి పేరు ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై ఇలాంటి దాడులు జరగడం బాధకరమని తెలిపారు. నేడు అంత్యక్రియలు.. ఎమ్మార్వో విజయారెడ్డి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు నాగోల్ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. చదవండి : మహిళా తహసీల్దార్ సజీవ దహనం డాడీ.. మమ్మీకి ఏమైంది? -
సీఎం బాధ్యత వహించాలి: కోమటిరెడ్డి
ఇబ్రహీంపట్నం/హయత్‌నగర్/తుక్కుగూడ/పెద్దఅంబర్‌పేట : తహశీల్దార్ హత్యకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగులతో కలిసి జాతీయ రహదారిపై ఎంపీ బైఠాయించారు. భూప్రక్షాళన పేరుతో గత 60, 70 సంవత్సరాల భూసమస్యలను కొంతమేరకే పరిష్కరించారని, మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ ఉద్యోగులు ఆయా భూసమస్యలను పరిష్కరించలేకపోవడంతో ప్రజలు వీరిపై కక్ష పెంచుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యమే విజయారెడ్డి హత్యకు కారణమని, విజయారెడ్డికి గత ఆరు నెలలుగా వచ్చిన ఫోన్ కాల్స్‌పై విచారణ జరిపితే అసలు దోషులు బయటపడతారని అన్నారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హతురాలి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో తహశీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్, వీఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, టీఎన్జీఓ జిల్లా నాయకుడు యశ్వంత్, తహశీల్దార్లు సుశీల, శైలజ, సుచరిత, సీహెచ్ సుజాత, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడు రోజులు విధుల బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ పిలుపునిచ్చారు. మహిళా అధికారిని హత్య చేయడం అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని ఓ ప్రకటనలో ఖండించారు. విజయారెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు రెవెన్యూ ఉద్యోగులంతా హైదరాబాద్ తరలిరావాలని కోరారు. నిందితుల వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, మహిళా ఉద్యోగులకోసం రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలి: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తహసీల్దార్ విజయారెడ్డి దారుణహత్యకు గురికావడం దురదృష్టకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్‌రెడ్డి, వి.మమత అన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల పెన్షనర్లు, కారి్మకుల ఐక్యత కార్యాచరణ సమితి ప్రగాఢ సానుభూతి తెలిపింది. -
రెవెన్యూలో భయం.. భయం!
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే ఓ మహిళాధికారి దారుణహత్యకు గురికావడం రాష్ట్ర ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. తహసీల్దార్ విజయారెడ్డిని ఆమె పనిచేస్తున్న చోటే సజీవదహనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణమేదైనా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఆందోళనకు గురైంది. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు, నిందలతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం తాజా ఘటనతో మరింత ఆందోళనకు లోనైంది. విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ సంఘాల నేతలు ఘటనను తీవ్రంగా ఖండించడంతోపాటు విధులను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చినా.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తీవ్ర ఒత్తిడితో పాటు బదిలీపై వెళ్లి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందన్న మనస్తాపంతో నెల కింద నిజామాబాద్ తహసీల్దార్ జ్వాలాగిరిరావు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉద్యోగవర్గాలను కలవరపరిచింది. ఈ ఘటన మరువక ముందే ఇప్పు డు మహిళా తహసీల్దార్‌ను ఏకంగా హత్య చేయడం రెవెన్యూ వర్గాలను కలవరపరుస్తోంది. ఎవరికీ తెలియలేదు.. మండలాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ కార్యాలయంలో విధి నిర్వహణలో తలమునకలైన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారిపై సులువుగా దాడి జరగడానికి భద్రతా లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తహసీల్దార్ గదికి రానుపోను ఒకే ద్వారం ఉండడం, మిగతా సిబ్బంది గదులకు దూరంగా, వేరుగా ఉండటంతో తహసీల్దార్ రూమ్‌లో ఎవరున్నారనేది కూడా గమనించలేని పరిస్థితి ఉంది. సోమవారం తహసీల్దార్ ఉండే గది లోపలికి నిందితుడు వెళ్లి గడియ వేసుకున్నా.. ఆమెతో వాగి్వవాదానికి దిగినా.. ఆఖరికిపై ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టినా వెలుపల హాల్లో పనిచేసేవారికి తెలియలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి విజయారెడ్డికి నిప్పంటించే క్రమంలో కాలిన గాయాలతో భరించలేక నిందితుడు గడియ తీసుకొని బయటకు పరుగులు తీస్తే కానీ, లోపలేం జరిగిందో తెలియని అయోమయం నెలకొంది. ప్రైవేటు సెక్యూరిటీని కూడా నియమించుకోకపోవడం.. తహసీల్దార్‌ను కలిసిన సమయంలో అక్కడే ఉండాల్సిన సిబ్బంది లేకపోవడం కూడా ఘటనకు ఊతమిచ్చింది. రికార్డుల నవీకరణతో సతమతం.. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు రెవెన్యూ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రికార్డుల నవీకరణ అనంతరం రెవెన్యూ ఉద్యోగులపై పనిభారమే కాకుండా ఒత్తిడీ పెరిగిపోయింది. ముఖ్యంగా చాలాచోట్ల క్షేత్రస్థాయి పరిస్థితులకు, రికార్డులకు పొంతన కుదరకపోవడంతో వివాదాలు పెరిగిపోయాయి. సాంకేతిక సమస్యలు, కౌలుదారులు, పట్టాదారులు, సోదరులు, కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, ప్రభుత్వ భూములుగా తేలిన వంటి వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పక్కనపెట్టడంతో రెవెన్యూ ఉద్యోగులే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే అపవాదు ఎదుర్కొంటున్నారు. కబ్జా కాలమ్‌ను ప్రభుత్వం తొలగించడం రెవెన్యూ యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారింది. న్యాయపరమైన వివాదాలపై అర్జీదారులను సముదాయించినా.. సమాధానం చెప్పినా.. శాంతించకపోవడంతో రెవెన్యూ వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ధరణి సాఫ్ట్వేర్ లోపాలూ వీరిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజాయారెడ్డి హత్యపై ప్రభుత్వం విచారణకుఆదేశించింది. -
తహశీల్దార్ సజీవ దహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: డాడీ.. మమ్మీకి ఏమైంది? ఇంటికి ఎప్పుడొస్తుంది? ఇప్పుడు వీళ్లంతా (బంధువులు) మన ఇంటికి ఎందుకొచ్చారు? అంటూ ఏడుస్తూ అమాయకంగా ఆ పసి హృదయాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తండ్రి సుభాశ్‌రెడ్డి సహా బంధువులంతా పిల్లలను గుండెలకు హత్తుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి విజయారెడ్డికి ఏం జరిగిందో తెలియక ఆ చిన్నారులు గుక్కపెట్టి ఏడుస్తుండటం అక్కడి వారిని తీవ్రంగా కలచి వేసింది. విజయారెడ్డి దంపతులకు కుమార్తె చైత్ర (10), కుమారుడు భువనసాయి (5) ఉన్నారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం కూడా తల్లి విజయారెడ్డి పిల్లలను స్కూలుకు రెడీ చేసి స్కూలుకు పంపింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు సజీవ దహనం అయిన తల్లికి ఏం జరిగిందో కూడా అర్థంగాక అమాయకంగా చూశారు. పిల్లల పరిస్థితి చూసి బంధువులు విలపించారు. టీచర్ నుంచి తహసీల్దార్ దాకా... మునుగోడు/నకిరేకల్/గరిడేపల్లి: నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన విజయారెడ్డి పెళ్లికి ముందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2006లో డీఎస్సీలో ఎస్జీటీ ఉద్యోగం రాగా ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల ప్రాథమిక పాఠశాలలో ఆమె పనిచేశారు. 2007లో వివాహం అనంతరం ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్–2 పరీక్షలకు సిద్ధమయ్యారు. 2009లో వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో ఆమె డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించారు. మొదట మెదక్ జిల్లా సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. ఆ తరువాత అదే జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేసి నూతనంగా ఏర్పాటైన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి తహసీల్దార్‌గా పదోన్నతిపై వచ్చారు. ఆమె భర్త సుభాష్‌రెడ్డి 2014లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నారు. నకిరేకల్‌లో విషాద ఛాయలు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మరణంతో ఆమె స్వగ్రామం నకిరేకల్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. వాస్తవానికి విజయారెడ్డి తల్లిదండ్రుల సొంత గ్రామం శాలిగౌరారం మండలం పెర్క కొండారంకాగా 30 ఏళ్ల క్రితమే నకిరేకల్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె తండ్రి చామకురి లింగారెడ్డి, తల్లి వినోద. వారికి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు. కూమారుడు 10వ తరగతిలో ఉండగా మృతి చెందాడు. తండ్రి లింగారెడ్డి పెర్కకొండారం జెడ్పీ హైస్కూల్లో తెలుగు పండిట్‌గా పని చేసి మూడేళ్ల కిందట పదవీ విరమణ పొందారు. లింగారెడ్డి తన ఇద్దరు కూమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమార్తె సంధ్యారాణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా హైదారాబాద్‌లోనే పనిచేస్తున్నారు. నేడు అంత్యక్రియలు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మరణవార్త తెలియగానే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహానికి నివాళులు అరి్పంచారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆమె అంత్యక్రియలను మంగళవారం అత్తగారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లిలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. -
వీఆర్వో గల్లా పట్టిన మహిళ
కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఓ మహిళ హల్చల్ చేసింది. తన భర్త పేరిట ఉన్న భూమిని అతని సోదరులపై అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ వీఆర్వో కాలర్ పట్టుకుంది. మండలంలోని నమిలికొండలో కనకమ్మ భర్త లింగాల లచ్చయ్య, అతని సోదరులిద్దరికి 8 గుంటల చొప్పున భూమి ఉంది. కనకమ్మ భర్త చనిపోవడంతో కొన్నాళ్లుగా తల్లి ఊరైన మంగపేటలో ఉంటోంది. కనకమ్మ స్థానికంగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఆమె బావ, మరిది కుమారులు కనకమ్మకు సంబంధించిన 8 గుంటల భూమిని వారి పేరిట మార్చుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదు. ఇదే విషయమై వీర్వోను ప్రశ్నిస్తూ కాలర్ పట్టుకుంది. వీఆర్వో రమేశ్ మాట్లాడుతూ కనకమ్మ తనను గతంలో ఒకసారి కలిసిందన్నారు. మళ్లీ సోమవారం రాగా.. ఫోన్లో ఆమె మరిది నుంచి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుండగా దాడి చేసిందని పేర్కొన్నారు. -
మహిళా తహసీల్దార్ సజీవ దహనం
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: రాష్ట్ర రాజధాని శివారులో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయం లోనే సోమవారం హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎలా జరిగిందంటే.. సమయం.. మధ్యాహ్నం 1:45 గంటలు. ప్రదేశం.. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయం. ఉన్నట్టుండి హాహాకారాలు.. ఆ వెంటనే భారీ పేలుడు.. దరఖాస్తుదారులు, సిబ్బంది ఉరుకులు పరుగులతో అంతటా ఉది్వగ్న వాతావరణం. ఏం జరిగిందో తెలిసేలోపే ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. తన భూ వివాదాన్ని మహిళా తహసీల్దార్ పరిష్కరించలేదన్న ఆక్రోశంతో ఓ రైతు హంతకుడిగా మారాడు. ఆమెను అంతం చేసేందుకు పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబ డ్డాడు. రెప్పపాటులో మహిళా తహసీల్దార ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. అయితే ఈ ఘటనలో మరణించింది ఎవరో అర్థంకాక సిబ్బంది తొలుత అయోమయానికి గురయ్యారు. ఆమె గది వెనుక కిటికీలోంచి చూస్తే ఆమె కనిపించకపోయే సరికి మేడం, మేడం అని కేకలు పెట్టారు. మరొక వ్యక్తి వచ్చి విజయారెడ్డి చేతికి ఉన్న వాచీని చూసి ఆమెను తహసీల్దార్‌గా గుర్తించారు. వెంటనే తహసీల్దార్ సజీవదహనంపై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లో తీవ్రంగా గాయ పడిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్యను కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గురునాథ్ 84%, చంద్రయ్య 40– 50% కాలిన గాయాలకు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ నిందితుడు సురేశ్‌ను తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన పోలీసులు అతని పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలో విజయారెడ్డి మృతదేహం. విలపిస్తున్న బంధువులు. బదిలీ అయ్యుంటే ప్రాణాలు దక్కేవి! తహసీల్దార్ విజయారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ లో 2016 అక్టోబర్ నుంచి పనిచేస్తున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో కొత్త మండలంగా ఏర్పాటైన అబ్దుల్లాపూర్‌మెట్ లో ఆమెకు పోస్టింగ్ లభించింది. మూడేళ్లకు పైగా ఇక్కడ పని చేసిన తనను బదిలీ చేయాలని లోక్‌సభ ఎన్నికలు ముగియగానే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బదిలీపై సర్కారు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. 10రోజుల కిందట విజయారెడ్డి దంపతులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సైతం కలిశారు. తనను బదిలీ చేయాలని విజయారెడ్డి మంత్రికి విన్నవించారు. ఇంతలోనే ఆమె దారుణ హత్యకు గురవడంతో అందరూ హతాశులయ్యారు. బదిలీ జరిగి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. భర్త, పిల్లలతో విజయారెడ్డి ఫైల్ ఫొటో భారీ పేలుడు శబ్దం వినిపించింది మధ్యాహ్నం 1.45కు మేడం వద్దకు ఫైలుతో వెళ్లా. సరిగ్గా 5 నిమిషాల్లో ఏదో పెద్ద పేలిన శబ్దం వినిపించింది. వెంటనే మేడం చాంబర్‌వైపు పరిగెత్తాం. అక్కడ అరుపులు, కేకలు దట్టమైన పొగతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తొలుత ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనుకున్నాం. మేడం.. మేడం అని అరిస్తే మా పిలుపులకు స్పందించి మేడం చేయి లేపడంతో అప్పుడు అర్థమైంది.– సునీత, సీనియర్ అసిస్టెంట్ పేలుడు ధాటికి పగిలిన అద్దాలు మధ్యాహ్నం 1.50 గం.కు దరఖాస్తుదారులు వచ్చారు. అప్పుడే వచ్చిన మేడం కొందరితో మాట్లాడారు. మాకు కొన్ని పనులు కూడా చెప్పారు. మేం వాటిని చూసేందుకు మా చాంబర్లలోకి వెళ్లగానే భారీ పేలుడుతో అద్దాలు పగిలిపోయాయి. మేం పరిగెత్తుకుం టూ వచ్చేసరికి మంటల్లో కాలుతున్న మేడం కనిపించారు. వెంటనే కార్పెట్లు తెచ్చి మంటలను ఆర్పాం. కానీ మేడంను కాపాడుకోలేకపోయాం. – మహేశ్ ఆర్.ఐ. కాలిన గాయాలతో సురేశ్ (ఇన్సెట్లో సురేశ్ ఫైల్) ఎవరీ సురేశ్.. ఎందుకీ దారుణానికి ఒడిగట్టాడు? రైతు సురేశ్ అబ్దుల్లాపూర్‌మెట్ బాచారం గ్రామస్తుడు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 73 నుంచి 101 వరకు విస్తరించిన దాదాపు 412 ఎకరాలను సురేశ్ కుటంబం సహా గౌరెల్లికి చెందిన 53 మంది 50 ఏళ్లుగా సాగుచేస్తున్నారు. వాస్తవానికి ఈ భూమి వారి సొంతం కాదు. ఇందులో 280 ఎకరాలు రాజా ఆనంద్‌కు చెందినది. ఆయన 1980 తరువాత మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో వారంతా సాదా బైనామా కింద రాజా ఆనంద్ నుంచి కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించి 1980 నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయని సమాచారం. అయితే వారికి 1998లో 1–బీ కింద రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) ఇచ్చారు. పట్టా పాసుపుస్తకాలు కూడా మంజూరయ్యాయని చెబుతున్నారు. కానీ 2004లో ఈ భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ అదే గ్రామానికి చెందిన షఫీక్, హబీబ్ సహా మరికొందరు కోర్టులో కేసు వేయగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో వివాదాస్పద 130 ఎకరాలను ఇటీవల తహసీల్దార్ విజయారెడ్డి వేరే వాళ్ల పేరిట పట్టా పాసుపుస్తకాలు జారీ చేశారని సురేశ్ బంధువులు ఆరోపిస్తున్నారు. 130 ఎకరాల్లో తన తాత నుంచి వారసత్వంగా రావాల్సిన 2 ఎకరాల భూమి కూడా ఉందని, దీనిపై సురేశ్ ఏడాదిగా అభ్యంతరం చెబుతున్నాడని పేర్కొన్నారు. దీనిపై ఏడాదిగా తహసీల్దార్ విజయారెడ్డి కార్యాలయం చుట్టూ అతను తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. తనకు భూమి దక్కనీయకుండా చేసిందని కక్ష పెంచుకున్న సురేశ్ ప్రతీకారంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అంటున్నారు. మా వాడు అమాయకుడు నా కొడుకు అమాయకుడు. ఇలా ఎందుకు చేశాడో తెలియట్లేదు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదు. కొంతకాలం వ్యవసాయం చేశాడు, ఇప్పుడు ఆటో, రియల్ ఎస్టేట్‌తోపాటు పొలం చూసుకుంటున్నాడు. వాడికి ఇద్దరు పిల్లలు మనస్వి (7), శ్రీచరణ్ (5) ఉన్నారు. వాడికేమైనా అయితే నా గతి, నా మనవల గతి ఏంగాను? – కూర పద్మ, సురేశ్ తల్లి మతిస్థిమితం సరిగా లేదు.. చిన్నప్పటి నుంచి సురేశ్ ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదు. కొంతకాలంగా అతని మానసిక పరిస్థితి బాలేదు. ఈ వివాదంపై సురేశ్ తండ్రి ఇప్పటికే పోరాడుతున్నాడు. సంబంధం లేని విషయంలో సురేశ్ తలదూర్చాడు. – కూర దుర్గయ్య, సురేశ్ పెదనాన్న -
దారుణం... అమానుషం
వాగ్వాదం పెరిగి సంయమనం కోల్పోయి దుర్భాషలాడటం, సవాళ్లు విసురుకోవడం... ఆవేశం ముదిరి అవతలి వ్యక్తిపై దౌర్జన్యానికి దిగడం, ప్రాణాలు తీయడం తరచు వింటూనే ఉంటాం. కానీ తన కార్యాలయంలో విధుల్లో నిమగ్నమై ఉన్న ఒక మహిళా అధికారిని పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేయడం అనేది ఎవరి ఊహకూ అందనిది. హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై సోమవారం మధ్యాహ్నం ఒక దుండగుడు అత్యంత దారు ణంగా దాడి చేసి హతమార్చిన తీరు దిగ్భ్రాంతికరం. సమస్య ఉండొచ్చు. దాని పరిష్కారంలో జాప్యం వల్లనో, ఆ పరిష్కారం చేసిన తీరువల్లనో పట్టరాని కోపం వచ్చి ఉండొచ్చు. ఆ అధికారి తీసుకున్న నిర్ణయం పర్యవసానంగా అన్యాయమే జరిగి ఉండొచ్చు. దాన్ని సరిచేయడానికి భిన్న మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు వాటన్నిటినీ విడనాడి దౌర్జన్యానికి పూనుకోవడం, ప్రాణాలు తీయడం అత్యంత ఘోరం. తమ కుటుంబాలకు దక్కాల్సిన కొంత భూమి రెవెన్యూ అధికారుల నిర్ణయం కారణంగా వేరెవరికో వెళ్లిందన్నది దుండగుడి ఆగ్రహానికి కారణం. కానీ తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని వివాదం సబ్ కలెక్టర్ దృష్టికో, కలెక్టర్ దృష్టికో తీసుకెళ్లి న్యాయం దక్కేలా చూసుకోవచ్చు. ఇవన్నీ దాటాక న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి. ఇందువల్ల డబ్బు, సమయం వృధా అవుతున్నాయన్న నిరాశానిస్పృహలు ఏర్పడతాయనడంలో సందేహం లేదు. కానీ దేనికైనా ఒక క్రమాన్ని పాటించాల్సిందే. భూసంబంధ వివాదాలతో నిత్యం వ్యవహరించవలసి వచ్చే రెవెన్యూ సిబ్బంది విధి నిర్వహణ కత్తి మీద సాము వంటిది. తమ ముందున్న సమస్యను అన్ని కోణాల్లో పరిశీలించి తీసుకునే నిర్ణయం సహజంగానే కొందరికి కోపం తెప్పించవచ్చు. వివాదంలో ఎక్కువ పక్షాలున్నప్పుడు పరిష్కారం మరింత సంక్లిష్టమైనది. ఎవరికి వారు తమ వాదనే సరైందనుకుంటారు. లేదా ఏదే మైనా నిర్ణయం తమకు అనుకూలంగా ఉండాల్సిందే అనుకుంటారు. ఇలాంటివారందరితోనూ రెవెన్యూ సిబ్బంది నిత్యం మాట్లాడవలసి ఉంటుంది. ముఖ్యంగా తహసీల్దార్ స్థానంలో ఉండేవారు ఈ క్రమంలో ఎదుర్కొనే ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, పార్టీలు... ఇలా అనేకులు వచ్చి కలిసి, ఫలానా వారి విషయంలో తీసుకున్న నిర్ణయం సరికాదని, దాన్ని పునఃపరిశీలించాలని కోరుతుంటారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తారు. తీసుకున్న నిర్ణయం తమకు రుచించనప్పుడు అవతలి పక్షం నుంచి లంచం తీసుకున్నారని ఆరోపించేవారుంటారు. అలా చేతివాటం ప్రదర్శించేవారు ఏసీబీకి చిక్కిన సందర్భాలు లేకపోలేదు. కానీ అది అందరికీ సాధ్యమయ్యే కళ కాదు. వీటి సంగతలా ఉంచి ఎందరు ఎన్నివిధాలుగా ఒత్తిళ్లు తెస్తున్నా, బెదిరింపులకు దిగుతున్నా చాకచక్యంగా వాటిని అధిగమించే అధికారులు లేకపోలేదు. కొన్ని వృత్తిలో భాగమనుకుని చేసుకుంటూ వెళ్లడం, అలవాటుపడటం అధికారులకు తప్పదు. కానీ ప్రాణాలు తీసే స్థితి ఏర్పడిందంటే అసలు విధి నిర్వహణ సాధ్యమేనా? తహసీల్దార్ అధికారాల రీత్యా తన పరిధిలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. ఆ స్థాయి అధికారి వద్దకు ఒక దుండగుడు సులభంగా పెట్రోల్‌తో వెళ్లగలిగాడంటే విస్మయం కలుగుతుంది. రెవెన్యూ అధికారులు వారు పరిష్కరించా ల్సిన సమస్యల రీత్యా పటిష్టమైన భద్రత అవసరమైనవారు. కానీ అది సక్రమంగా లేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది. తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన మొదలయ్యాక రెవెన్యూ సిబ్బందిపై పనిభారం అపా రంగా పెరిగింది. పట్టాదారులు, కౌలుదారులు, ఇతరత్రా హక్కుదారులు రికార్డుల నవీకరణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాల్లోనే కలహాలు పెరుగుతున్నాయి. కోర్టు కేసుల వల్ల కావొచ్చు...ప్రభుత్వ భూములుగా నిర్ధారణ కావడం వల్ల కావొచ్చు– పట్టాదారు పాస్ పుస్తకాలు హక్కుదారులుగా చెప్పుకుంటున్నవారికి ఇవ్వడం అసాధ్యం. అలా చేస్తే ఉద్యోగాలకు ముందూ మునుపూ ముప్పు కలగొచ్చు. ఇవ్వకపోతే ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ సిబ్బందే వాటిని అంద కుండా చేస్తున్నారన్న అపోహలు బయల్దేరవచ్చు. కొన్నిసార్లు సాఫ్ట్వేర్ లోపాలు కూడా సమస్యలకు దారితీస్తాయి. వీటిని విడమరిచి చెప్పడం, సముదాయించడం సిబ్బందికి పెను సమస్యగా మారు తుంటుంది. సమయమంతా దానికే సరిపోతుంది. ఇలా ఒకటికి పదిసార్లు తిరగకతప్పని పరిస్థితి ఏర్పడటంతో అవతలివారిలో అసహనం కలుగుతుంది. ఇలాంటి అనేకానేక సమస్యల మధ్య పని చేసే సిబ్బందికి కాస్తయినా వెసులుబాటు దొరకడం అసాధ్యమవుతున్నది. తగినంత సిబ్బంది లేక పోవడం వల్ల లేదా కుటుంబాలకు దూరంగా ఉండకతప్పని పరిస్థితులు ఏర్పడటం వల్ల వృత్తి పరమైన ఒత్తిళ్ల తీవ్రత మరింత పెరుగుతోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో తహసీల్దార్ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన దీనికి ఉదాహరణ. దీనికితోడు 24 గంటల న్యూస్ చానెళ్లు ప్రారంభమయ్యాక, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో వెనువెంటనే ప్రచారంలో పెట్టే అవకాశం ఏర్పడటం వల్ల కొందరు నాయకులు హద్దులు మరుస్తున్నారు. సంగతి చూస్తాం...తాటతీస్తాం...రోడ్లపై తిరగనివ్వం అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. అధికారులను తూలనాడుతున్నారు. ఇలా అనడం వల్ల బాధితుల్లో ధైర్యం ఏర్పడుతుందనో, వారు మానసికంగా సంతృప్తి చెందుతారనో నేతలు అనుకుంటున్నారు. కానీ మూర్ఖత్వమో, మొండితనమో, మానసిక వ్యాధో ఉన్నవారిలో ఇటువంటి మాటలు చేతలకు పురిగొల్పుతాయి. పర్యవసానాల గురించి వారు ఆలోచించలేరు. కనుక ఆ బాపతు నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. జరిగిన ఉదంతంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కారకులకు కఠిన శిక్షలు పడేలా చూడటం అవసరం. అలాగే ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం... అధికారులు స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేసే పరిస్థితులు కల్పించడం ముఖ్యం. -
‘నిందితునిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు’
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై జరిగిన సంఘటనకు కారణమైన నిండితునిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. తహశీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, అబ్దుల్లాపూర్ మెట్టు తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడిపై ఐపీసీ 302, 333, 307 సెక్షన్లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
తహశీల్ధార్ హత్య.. అత్యంత పాశవికం
సాక్షి, అమరావతి: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మహిళా తహశీల్ధారుపై ఇటువంటి చర్య అత్యంత దారుణమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ ఘటనను దేశ రెవెన్యూ చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైనదిగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు రెవెన్యూ శాఖకు సంబంధం లేని పనులు అంటగట్టడం వల్ల శాఖా సంబంధమైన పనులు చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తున్నా.. ప్రజల దృష్టిలో మన్ననలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు చేసే తప్పులను అందరికి ఆపాదించడం వలన రెవెన్యూ ఉద్యోగులందరూ దోషులుగా నిలబడాల్సి వస్తోందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కే రక్షణ కరువైతే సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. విజయారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుతాన్ని వెంకటేశ్వర్లు కోరారు. -
సురేశ్.. ఎమ్మార్వో ఆఫీసుకు ఎందుకెళ్లాడు?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు భూ వివాదమే కారణమని కూర సురేశ్ ముదిరాజ్ పెదనాన్న దుర్గయ్య తెలిపారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ తమ భూమిని ప్రత్యర్థులకు తహశీల్దార్ విజయారెడ్డి బదలాయించినట్టు ఆరోపించారు. బచారంలో సర్వే నంబరు 90 నుండి 102 వరకు ఉన్న మొత్తం 110 ఎకరాల భూమిపై హైకోర్టు, కలెక్టరేట్లోనూ కేసులు నడుస్తున్నాయన్నారు. తమకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. ఈ విషయాలు ఎప్పుడు సురేశ్‌తో చర్చించలేదన్నారు. అతడికి మతిస్థిమితం సరిగ్గా ఉండదని, ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని అస్సలు ఊహించలేదని దుర్గయ్య వాపోయారు. తమకు ఎటువంటి భూ వివాదాలు లేవని, తన కొడుకు ఎప్పుడు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లలేదని సురేశ్ తల్లి పద్మ అన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు ఇంట్లోనే వున్నాడని, తండ్రి కృష్ణతో కలిసి ఉదయం కట్టెలు కొట్టాడని చెప్పారు. ‘మధ్యాహ్నం భోజనానికి రాకపోయేసరికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. ఎమ్మార్వోపై దాడి చేశాడని కొద్దిసేపటికి తెలిసింది. భూములకు సంబంధించిన విషయాలను నా భర్తే చూసుకుంటాడు. సురేశ్ ఎమ్మార్వో కార్యాలయానికి ఎందుకు వెళ్లాడో తెలియద’ని ఆమె వివరించారు. కాగా, తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో దుర్గయ్య పైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. మంత్రి గంగుల ఘెరావ్ తహశీల్దార్ విజయారెడ్డిపై దాడి చేసి సజీవ దహనం చేయడంపై కరీంనగర్లో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. క్యాండిల్ ర్యాలీతో విజయారెడ్డికి నివాళులర్పించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్యోగులు ఘెరావ్ చేయడంతో వారిపై మంత్రి అసహనం ప్రదర్శించారు. సంబంధిత వార్తలు తహశీల్దార్ సజీవ దహనం; పాపం పిల్లలు తహశీల్దార్ సజీవ దహనం; అసలేం జరిగింది? అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన; మరో ఇద్దరికి సీరియస్ తహశీల్దార్‌పై కిరోసిన్ పోసి నిప్పంటిన దుండగుడు -
ఎమ్మార్వో మృతికి ఉద్యోగ సంఘాలే కారణం: ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ అధికారులపై వ్యవహరిస్తున్న తీరే తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం రూపొందించిన రెవెన్యూ చట్టం మార్పులు రైతులకు, అధికారులకు ఇబ్బందిగా మారాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో నేపథ్యంలో జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. లంచాన్ని అరికట్టడం ఏ నాయకునితో సాధ్యంకాదని, ఎమ్మార్వో మృతి ఘటనలో ఉద్యోగ సంఘాల నాయకుల తప్పిందం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమె మృతికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ సంఘాల నేతలు రాజేందర్, రవీందర్ రెడ్డి, మమతలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. (చదవండి: తహశీల్దార్ సజీవ దహనం; అసలేం జరిగింది?) సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘నమస్తే తెలంగాణాలో పత్రికలో ప్రసారం అవుతున్న ధర్మగంట కార్యక్రమం రైతులు, అధికారులకు మధ్య వైరాన్ని పెంచింది. రెవెన్యూ అధికారులపై ధర్మగంట ప్రజల్లో విషాన్ని, ద్వేషాన్ని నురిపోసింది. కేసీఆర్ నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు గుడ్డిగా నమ్ముతూ.. ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నది నిజం కాదా.?. రైతు ఆవేశానికి ప్రభుత్వం విధానాలు.. ఉద్యోగ సంఘాలే తీరే కారణం. ప్రభుత్వం మేల్కొని అధికారులు.. ప్రజలకు మధ్య మంచి వాతావరణం ఉండేలా చూడాలి. ప్రభుత్వం మేల్కొకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది’ అని అన్నారు. -
మాటలకందని ఘోరం.. షాక్ తిన్నాను!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని పట్టపగలే సజీవ దహనం చేసిన ఘటనపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. విజయారెడ్డి దుర్మార్గమైన హత్య.. మాటలకందనిరీతిలో తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. సమస్య ఏదైనా ఉండొచ్చు కానీ.. ఇలా అమానుషంగా దాడి చేయడం మాత్రం అత్యంత హేయమని, ఇలాంటి ఘటనలకు ప్రజాస్వామ్యంలో తావులేదని ఆయన స్పష్టం చేశారు. తాహశీల్దార్ విజయారెడ్డి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయరెడ్డిపై సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమెను కాపాడాటానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తహశీల్దార్ కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తహశీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన వ్యక్తిని కూర సురేశ్ ముదిరాజ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. I am shocked beyond words about the Abdullapurmet MRO Smt. Vijaya’s brutal murder. No matter what the unresolved issue was, this sort of inhuman attack is reprehensible and has no place in a democracy. My heartfelt condolences to the family of Smt. Vijaya Reddy Garu🙏 — KTR (@KTRTRS) November 4, 2019 -
అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన; మరో ఇద్దరికి సీరియస్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన ఆమె డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కవాడిపల్లి వాసి బొడిగా నారాయణ గౌడ్ అనే వృద్ధుడు కూడా గాయపడ్డాడు. తన భూమి సమస్య పరిష్కారం కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి గాయాలపాలైన ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కూర సురేశ్‌కు ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడికి 60 శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. రేపు విజయారెడ్డి అంత్యక్రియలు విజయారెడ్డి మృతదేహానికి ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. ఆమె మృతదేహాన్ని నల్గొండ జిల్లా కల్వలపల్లి గ్రామానికి తీసుకెళ్లారు. రేపు విజయా రెడ్డి స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. న్యాయం జరిగేలా చూస్తాం: డీజీపీ ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను డీజీపీ మహేందర్ రెడ్డి ఖండించారు. ఇటువంటి ఘటనలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. నిందితుడు సురేశ్‌కు తక్కువ సమయంలోనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఎమ్మార్వో కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వపరంగా విధులు నిర్వహించే అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంది. ప్రజలకు రక్షణ కల్పించే ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పై ఇలాంటి సంఘటన జరగటం దురదృష్టకరమని.. నిందితుడిని కఠినంగా శిక్షించి ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని కోరింది. విజయారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంబంధిత వార్తలు తహశీల్దార్ సజీవ దహనం; పాపం పిల్లలు తహశీల్దార్ సజీవ దహనం; అసలేం జరిగింది? తహశీల్దార్‌పై కిరోసిన్ పోసి నిప్పంటిన దుండుగుడు -
తహశీల్దార్ సజీవ దహనం; పాపం పిల్లలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయానికి వెళ్లి దారుణంగా హత్య చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయారెడ్డి చాలా నిజాయితీగా పనిచేసేదని ఆమె మేనమామ తెలిపారు. సమయపాలన, క్రమశిక్షణ కలిగివుండేదని వెల్లడించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉత్తమ ఎమ్మార్వోగా ఎంపికై గతేడాది కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రం కూడా అందుకుందని చెప్పారు. ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్-2 రాసి ఆమె ఎమ్మార్వోగా ఉద్యోగంలో చేరినట్టు తెలిపారు. విజయారెడ్డికి ఇద్దరు చిన్నపిల్లలు.. అమ్మాయి(10), అబ్బాయి(5) ఉన్నారన్నారు. తల్లి మరణంతో పిల్లలు కన్నీరుమున్నీరవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయారెడ్డి తండ్రి లింగారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని మూసి రోడ్డులో ఉంటున్నారని.. కూతురు మరణాన్ని తట్టుకోలేక తన బావ, సోదరి శోకిస్తున్నారని కంటతడి పెట్టారు. విజయారెడ్డి సోదరుడు పదేళ్ల క్రితం చనిపోయాడని చెప్పారు. విజయారెడ్డి సోదరి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన విజయారెడ్డి హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. భువనగిరి ఎమ్మార్వో కార్యాలయంలో ఉద్యోగులు పెన్‌డౌన్ చేసి, బైఠాయింపు జరిపారు. ఆలేరు డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది నిరసన తెలిపారు. రెవెన్యూ అధికారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల తహసీల్దార్ కార్యాలయాలలో రెవెన్యూ సిబ్బంది విధులను బహిష్కరించారు. సంగారెడ్డి, దుబ్బాక, ఆందోల్ తహశీల్దార్ కార్యాలయాల్లోనూ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. హైదరాబాద్ తరలిరండి ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న విజయారెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు అన్ని కేడర్ల రెవెన్యూ ఉద్యోగులు హైదరాబాద్ తరలిరావాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. రాములు పిలుపునిచ్చారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య అత్యంత దారుణ, విషాదకర సంఘటనగా వీరు పేర్కొన్నారు. (ప్రాథమిక వార్త: తహశీల్దార్ సజీవ దహనం; అసలేం జరిగింది?) -
ఎమ్మార్వో సజీవ దహనంపై రేవంత్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : విధుల్లో ఉన్న తహశీల్దార్‌ను పట్టపగలు ఓ వ్యక్తి సజీవ దహనం చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న విజయారెడ్డిని సజీవ దహనం చేసిన సురేశ్ అనే వ్యక్తి, అనంతరం అతను కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడన్నీఈ ప్రమాదంలో ఎమ్మార్వో మృతి చెందగా.. నిందితుడు ప్రస్తుతం హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన అధికారిక ట్విటర్లో స్పందించిన ఆయన.. తహశీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు కారకులైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయ రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలి. ఈ సంఘటనకు కారకులైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలి #RIPvijayareddy — Revanth Reddy (@revanth_anumula) November 4, 2019 చదవండి : తహశీల్దార్‌పై కిరోసిన్ పోసి నిప్పంటిన దుండుగుడు చదవండి : తహశీల్దార్ సజీవ దహనం; అసలేం జరిగింది?