
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి రెవెన్యూ ఉద్యోగులపై పంజా విసిరింది. ఆ శాఖలో అటెండర్ మొదలుఆర్డీవో స్థాయి వరకు 126 మంది వైరస్ బారినపడగా.. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ మల్లేశం మృతితో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సరైన చికిత్స అం దకపోవడమే తహసీల్దార్ మరణానికి కారణమని రెవె న్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా) తీవ్రంగా ఆరోపించిం ది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌తో కూడిన బెడ్‌ను ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదని, ఇలాంటి విపత్కకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన అధికారులే...తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమని వ్యా ఖ్యానించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఒకట్రెం డు రోజుల్లో సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేసింది.తమ వ్యవహారంలో సీఎస్ తీరుపై కూడా వారు ఆగ్రహంతో ఉన్నారు.
నిమ్స్‌లో చికిత్స అందించండి: ప్రజలకు సేవలు అం దిస్తూ కరోనా బారిన పడుతున్న రెవెన్యూ ఉద్యోగులకు నిమ్స్ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ‘ట్రెసా’ ప్రతినిధి బృందం కోరింది. కన్నెపల్లి తహసీల్దార్ మల్లేశం విషమస్థితిలో వెంటిలేటర్ సాయం లభించక గాంధీ ఆసుపత్రిలో మృతి చెందడం తమకు ఆందోళన కలిగిస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ ఉద్యోగులకు ‘ని మ్స్’తో పాటు ‘టిమ్స్’లో చికిత్సకు అవకాశం కల్పిస్తామ ని మంత్రి హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ‘ట్రెసా’రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యద ర్శి కె.గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment