
నాచారం తెలంగాణ ఫుడ్స్‌లో ఉద్యోగుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్న వైద్యులు
మల్లాపూర్ (హైదరాబాద్): నాచారం తెలంగాణ ఫుడ్స్ సంస్థలో కరోనా కలకలం రేపింది. అందులో పనిచేసే కొంతమందికి పాజిటివ్ రావడంతో కార్మికులు, సిబ్బ ంది ఉలిక్కిపడ్డారు. మేడ్చల్ డీఎంహెచ్‌వో వీరాంజనేయులు సారథ్యంలో 434 మంది నుంచి గురువారం శాంపిల్స్ సేకరించారు. తెలంగాణ ఫుడ్స్ కంపెనీలో గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీ చిన్నారుల కోసం బాలామృతం, స్నాక్స్, ఇతర పౌష్టికాహారం తయారవుతుంటుంది. తాజా ఘటనతో రెండ్రోజులుగా ఈ తయారీని నిలిపివేశారు. కాగా, నాచారంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కరోనా శాంపిల్స్ సేకరణ కొనసాగుతోంది. గురువారం 50 మంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment