
కాలనీలో హైపోక్లోరైట్ ద్రావణం చల్లుతున్న మునిసిపల్ సిబ్బంది
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పట్టణంలో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా సోకింది. 14 మంది ఒకే ఇంట్లో ఉండే ఈ కుటుం బం పట్టణంలోని ఆర్‌టీసీ కా లనీలో నివాసం ఉంటోందని అధికారులు చెప్పారు. ఇందు లో తల్లిదండ్రులు, అన్నదమ్ములతో పాటు వారి పిల్లలందరికీ కలిపి 12 మందికి వైరస్ సోకింది. ఆ కుటుంబంలో వీఆర్‌ఓగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి తొలుత కరోనా వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు అనుమానంతో మదీనాగుడలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా 12 మందికి వైరస్ సోకినట్లు తేలింది. శనివారం మున్సిపల్ సిబ్బంది ఆర్టీసీ కాలనీలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. ఇదిలా ఉండగా సాయి భగవాన్ కాలనీలో ఒకరికి, మారుతీనగర్‌లో మరొకరికి కూడా కరోనా సోకిందని అమీన్‌పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment