one family
-
Rajasthan election 2023: ఒకే ఒక్క కుటుంబం కోసం పోలింగ్ బూత్
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్ అసెంబ్లీకి నేడు జరగనున్న ఎన్నికల్లో ఒకే ఒక్క కుటుంబం కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న బార్మర్ జిల్లా పార్ గ్రామంలో రాష్ట్రంలోనే అతి చిన్న పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ ఒక కుటుంబంలోని 35 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ గ్రామ ప్రజలు గత ఎన్నికల వరకు ఓటేయడానికి 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఎడారిలో రోడ్లు లేకపోవడంతో ప్రజలు కాలినడకన, ఒంటెలపై పోలింగ్ బూత్‌కు చేరుకొనేవారు. పోలింగ్ కేంద్రం చాలా దూరంగా ఉండటంతో వృద్ధులు, మహిళలు పలుమార్లు ఓటు వేయలేకపోయారు. ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న ఎన్నికల కమిషన్ అధికారులు గ్రామంలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మూడు వేర్వేరు ఇళ్లలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మహిళలు, 18 మంది పురుషులు మొత్తం 35 మంది ఓటేయనున్నారు. కాగా, సిరోహి జిల్లాలోని అబు–పింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో 4,921 అడుగులఎత్తులో ఉన్న షేర్‌గావ్ ఓటర్లు తొలిసారిగా తమ సొంతూళ్లోనే ఓటు వేయనున్నారు. గ్రామంలోని 117 మంది గిరిజనుల ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల సిబ్బంది దట్టమైన అటవీప్రాంతంలో దాదాపు 18 కిలోమీటర్లు నడిచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. -
ఒకే కుటుంబంలో ముగ్గురికి పీహెచ్‌డీలు
గూడెంకొత్తవీధి: వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం..ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పం.. పట్టుదల.. వారి కలలను సాకారం చేసింది. ఒకే కుటుంబంలో ముగ్గురికి డాక్టరేట్ లభించింది. శనివారం ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో జరిగిన 87–90 స్నాతకోత్సవాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని సీలేరుకు చెందిన గసాడి శాంతి, ఆమె భర్త సత్యవర ప్రసాద్, అతని సోదరుడు ఆనంద్ లు ఏయూ వీసీ ప్రసాదరెడ్డి చేతుల మీదుగా పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు. ప్రస్తుతం సీలేరు మహిళా పోలీసుగా పనిచేస్తోన్న గసాడి శాంతి 2013–18 మధ్య సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రొఫెసర్ ప్రేమానందం సారథ్యంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఈమె భర్త సత్య వరప్రసాద్, అతని సోదరుడు ఆనంద్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ పొలిటికల్ ప్రొఫెసర్ జాలాజీ రవి సారథ్యంలో పూర్తి చేశారు. -
ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ఉపాధ్యాయులు
సాక్షి, హన్మకొండ: ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు.. మహా అయితే నలుగురు ఒకే వృత్తిని ఎంచుకోవడం సాధారణం. కానీ ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. బెంజిమన్ అనే వ్యక్తికి చెందిన నాలుగు తరాలకు చెందిన 78మందికి బుధవారం హనుమకొండ కంచరకుంటలోని సెయింట్‌పాల్ హైస్కూల్ చైర్మన్ ఎం.ఆనంద్ ఆహ్వానం పంపగా 22మంది హాజరయ్యారు. వీరిని గురుపూజోత్సవం సందర్భంగా సన్మానించారు. బెంజిమన్ తండ్రి మోజెస్ బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1901లో బెంజిమన్ కుటుంబ సమేతంగా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి -
Congress chintan shivir: ప్రజలతో బంధం తెగింది
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: దేశ ప్రజలతో కాంగ్రెస్ బంధం తెగిపోయిందని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తెగిపోయిన బంధాన్ని మళ్లీ కలుపుకొని బలోపేతం చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం అక్టోబర్‌లో దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. చింతన్ శిబిర్‌లో ముగింపు సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక కుటుంబం, ఒకే టికెట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఉద్ఘాటించారు. ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది పార్టీ కోసం పనిచేయకుండా ఎన్నికల్లో పోటీ చేయలేరని అన్నారు. ‘‘నేను మీ కుటుంబం, మీరు నా కుటుంబం. ఇది ఒక కుటుంబం. నా పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంపైనే. అది దేశానికి ముప్పుగా మారింది. మనం కేవలం ఒక రాజకీయ పార్టీతో కాదు, దేశంలో అతిపెద్ద క్రోనీ క్యాపిటలిస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం’’ అని చెప్పారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ వంటి శక్తులకు తాను భయపడనని పేర్కొన్నారు. ‘‘నేను జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. భరతమాత నుంచి ఒక పైసా కూడా తీసుకోలేదు. కాబట్టి నాకు భయం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల దగ్గర ఎక్కువ డబ్బులున్నాయ్ రానున్నది చాలా కఠినమైన పోరాటమని రాహుల్ చెప్పారు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమని తెలిపారు. భారతదేశ సంస్థాగత నిర్మాణాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగ సంస్థలు పని చేయడం మానేసిన రోజు మనమంతా తీవ్రమైన ఇబ్బందుల్లో పడతామన్నారు. ఇప్పటికే అలాంటి పరిస్థితులు చూస్తున్నామని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. ప్రజలతో కలిసి పోరాడటం, వారికి అండగా నిలవడం కాంగ్రెస్ బాధ్యత అని వివరించారు. నాయకుల దృష్టి అంతా ప్రజా సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారంపైనే ఉండాలన్నారు. పార్టీ కోసం కాకుండా దేశం కోసం నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చెమట చిందించాల్సిందేనని.. ఇది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని ఉద్ఘాటించారు. రాజకీయ ప్రత్యర్థులను అధిగమించేలా పని చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ పిలుపునిచ్చారు. మన దగ్గరి కంటే ప్రత్యర్థుల వద్దే ఎక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పారు. అందుకే వారిలాగా ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగతంగా యువత, సీనియర్లతో కూడిన మిశ్రమ నాయకత్వం ఉండాలని చెప్పారు. -
Congress Chintan Shivir: ఒక కుటుంబం.. ఒకే టికెట్
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: భవిష్యత్ ఎన్నికల్లో ‘ఒక కుటుంబం, ఒకే టిక్కెట్’ నిబంధనను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఒక కుటుంబం నుంచి రెండో టికెట్ ఆశించే వ్యక్తి కనీసం ఐదేళ్లపాటు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి ఉండాలి. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ శుక్రవారం ప్రారంభమైంది. పార్టీలో మార్పు తీసుకొచ్చే దిశగా నేతలు మథనం సాగిస్తున్నారు. ‘ఒక కుటుంబం.. ఒకే టిక్కెట్’ సహా అనేక నియమాలను ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమంలో ఆమోదించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన, మినహాయింపు ఫార్ములా గాంధీ కుటుంబంతో సహా పార్టీ శ్రేణులందరికీ వర్తిస్తుందని రాజస్తాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తెలిపారు. ఈ నిబంధనపై పార్టీలో దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. ఐదేళ్ల తర్వాత ఎవరినీ పార్టీ పదవి కొనసాగించకూడదని, మళ్లీ అదే పోస్టు కోరితే కనీసం మూడేళ్లు కూలింగ్ పీరియడ్‌లో ఉంచాలన్న అంశాలపై చింతన్ శిబిర్‌లో చర్చ జరిగిందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అన్ని స్థాయిల్లో పరివర్తనాత్మక మార్పు కాంగ్రెస్‌లో ప్రతి స్థాయిలో ఉన్న పార్టీ కమిటీల్లో 50 ఏళ్లలోపు వారికి 50 శాతం (ఫిఫ్టీ బిలో ఫిఫ్టీ) పదవులు కేటాయించాలనే ప్రతిపాదన సైతం పార్టీ పెద్దల పరిశీలనలో ఉంది. పార్టీలో ఎలాంటి పని చేయనివారి పిల్లలు, బంధువులకు టికెట్లు ఇవ్వొద్దన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ రాజకీయ ప్యానెల్ సభ్యుల మధ్య దాదాపు పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తమయ్యింది. పార్టీ ఆఫీస్ బేరర్ల పనితీరును పర్యవేక్షించేందుకు ‘అసెస్మెంట్ వింగ్’ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు, ఎన్నికలకు సమాయత్తం కావడానికి సర్వేలు చేసేందుకు ‘ప్రజా అంతర్దృష్టి విభాగం’ ఏర్పాటుపై సమాలోచనలు జరుగుతున్నాయి. పార్టీలో బూత్, బ్లాక్ స్థాయిల మధ్య మండల కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో మండల కమిటీలో 15–20 బూత్‌లు ఉంటాయి. బ్లాక్ కాంగ్రెస్ కమిటీలో 3–4 మండలాలు ఉంటాయి. చింతన్ శిబిర్ కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్స్ చేసిన సూచనలను ఆమోదించిన తర్వాత పార్టీలో అన్ని స్థాయిల్లో పరివర్తనాత్మక మార్పు కనిపించనుందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. చింతన్ శిబిర్‌లో మొదటి రెండు రోజులు చర్చలు సాగుతాయి. చివరి రోజు తీర్మానం చేస్తారు. ఈ తీర్మానం ముసాయిదాపై అదే రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చిస్తారు. సెల్ ఫోన్లకు అనుమతి లేదు! ఉదయ్‌పూర్‌లోని తాజ్ ఆరావళి రిసార్ట్‌లో జరుగుతున్న నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్‌లో దాదాపు 450 మంది నేతలు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి రైలులో ఉదయ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి నేతలు, కార్యకర్తలు రాజస్థానీ సంప్రదాయ స్వాగతం పలికారు. చర్చల వివరాలు బయటికి పొక్కకుండా మొబైల్ ఫోన్లను హాల్ బయట డిపాజిట్ చేసిన తర్వాతే నేతలను లోపలికి అనుమతించారు. వేదిక వద్ద మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సహా కాంగ్రెస్ దిగ్గజాల పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తెలుగు నేతల సందడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు చింతన్ శిబిర్కు హాజరయ్యారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణంలో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా సోకింది. 14 మంది ఒకే ఇంట్లో ఉండే ఈ కుటుం బం పట్టణంలోని ఆర్టీసీ కా లనీలో నివాసం ఉంటోందని అధికారులు చెప్పారు. ఇందు లో తల్లిదండ్రులు, అన్నదమ్ములతో పాటు వారి పిల్లలందరికీ కలిపి 12 మందికి వైరస్ సోకింది. ఆ కుటుంబంలో వీఆర్ఓగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి తొలుత కరోనా వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు అనుమానంతో మదీనాగుడలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా 12 మందికి వైరస్ సోకినట్లు తేలింది. శనివారం మున్సిపల్ సిబ్బంది ఆర్టీసీ కాలనీలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. ఇదిలా ఉండగా సాయి భగవాన్ కాలనీలో ఒకరికి, మారుతీనగర్‌లో మరొకరికి కూడా కరోనా సోకిందని అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు. -
ఒకే కుటుంబంలో 8మంది ఆత్మహత్యయత్నం
-
నా భార్య తప్పుకోవాల్సిందే!: అమరిందర్ సింగ్
అమృత్సర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టికెట్ (వన్ ఫ్యామిలీ-వన్ టికెట్) ఇస్తామని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ స్పష్టంచేశారు. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను అసలు మార్చే ఉద్దేశమే లేదని, అలా చేస్తే పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఏది ఏమైనా ఈ రెండు ఫార్ములాలను మార్చేది లేదన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన తర్వాత వచ్చే వారం అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. వన్ ఫ్యామిలీ-వన్ టికెట్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తన భార్య, పాటియాలా ఎమ్మెల్యే ప్రిణీత్ కౌర్ కు టికెట్ ఇవ్వలేదని (తన కోసం ఎలక్షన్ నుంచి తప్పుకుంటున్నట్లు) చెప్పారు. రాష్ట్రంలో మరికొందరు నేతల ఇళ్లల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఇతర నియోజకవర్గాల నుంచి బరిలో దింపితే ప్రతికూల ఫలితాలు వస్తాయని, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇది తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని కెప్టెన్ అమరిందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే జనరల్ సీట్లను మాత్రమే వారికే ఇస్తామని, 34 శాతం ఉన్న రిజర్వ్డ్ స్థానాల్లో కొత్త వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం గానీ, నియోజకవర్గాల మార్పు చేయడం తదితర అంశాలు ఉన్నాయని తెలిపారు. ఇదివరకే 61 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించామని, ఇక మిగిలిన 56 సీట్లను పార్టీ ఎలక్షన్ కమిటీ భేటీ అనంతరం వెల్లడిస్తామన్నారు. ఈ సారి ఎలాగైనా అకాలీదళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పార్టీని గెలిపించాలని వ్యూహాలు రచిస్తున్నారు. -
ఒకే కుటుంబంలో మూడ్రోజుల్లో ముగ్గురి మృతి...
చిగురుమామిడి(కరీంనగర్ జిల్లా): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వివిధ కారణాలతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కుంచం రాజు(26) రెండు రోజుల క్రితం కూకట్‌పల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను దుబాయి వెళ్లాలని అప్పు చేసి అది తీరకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని మృతదేహన్ని సొంత గ్రామానికి తరలించారు. ఈ విషయం తెలిసిన రాజు అమ్మమ్మ అల్లెపు మల్లవ్వ(75) మనస్తాపంతో శనివారం మృతిచెందింది. కాగా, ఒకవైపు కొడుకు, మరోవైపు అత్త మరణించడంతో కుంచం రాములు(60) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో పూర్తి విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఒకే సారి ముగ్గురికి ఆంత్యక్రియలు జరపనున్నట్లు సమచారం. -
ఒకే కుటుంబంలో 31 మంది డాక్టర్లు
జైపూర్: ఒక కుటుంబంలో ఇద్దరో, ముగ్గురో డాక్టర్లుంటేనే ‘వాళ్లది డాక్టర్ల కుటుంబం’ అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఒక కుటుంబంలో ఏకంగా 31 మంది డాక్టర్లుంటే? డాక్టర్ల వంశం అనాలా, డాక్టర్ల ప్రపంచం అనాలా.. మీరే తేల్చుకోండి! అలాంటి అరుదైన కుటుంబం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉంది. తాజాగా అందులోని వినమతా పత్ని అనే విద్యార్థిని(17)కి కూడా ఎంబీబీఎస్‌లో సీటొచ్చింది. రాజస్థాన్ ప్రీ-మెడికల్ టెస్ట్‌లో ఆమెకు 107వ ర్యాంకు లభించింది. ఆమె కోర్సు పూర్తి చేస్తే కుటుంబంలో వైద్యుల సంఖ్య 32కు చేరుతుంది. వినమత చదువులోనే కాదు ఆటల్లోనూ ముందుంది. అండర్-19 యువతుల విభాగంలో ఆమె రాష్ట్రంలో ఉత్తమ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. అయితే బాస్కెట్ బాల్ ను మాత్రం కెరీర్ గా ఎంచుకోదల్చుకోలేదని ఆమె తెలిపింది. అది తనకు ఒక హాబీ మాత్రమేనని స్పష్టం చేసింది.తన తొలి ప్రాధాన్యత మాత్రం కుటుంబం ఎంచుకున్న వైద్య వృత్తికేనని పేర్కొంది. ప్రస్తుతం ఆమె తండ్రి తరుణ్ పత్నిపీడియాట్రిషిన్ (శిశు వైద్యుడు)గా సేవలందిస్తుండగా, తల్లి మాత్రం గైనకాలజిస్ట్ గా పని చేస్తున్నారు. కాగా, ఆమె తాత మాత్రం న్యాయవాది వృత్తిలో కొనసాగారు. ఆయన ఎనిమిది మంది సంతానంలో ఏడుగురు వైద్య వృత్తిలో ఉన్నారు. ఇక అక్కడ నుంచి వారి ప్రస్థానం వైద్య వృత్తినే ముడిపడుతూ వస్తోంది. ఇలా అందరూ ఒకే వృత్తిలో ఉండటానికి ప్రజలకు సేవ చేయాలన్న తాత ఆశయమే కారణమని వినమత పేర్కొంది.