
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అతని ఒంటిపై 65 శాతం కాలిన గాయాలు ఉన్నాయని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సంరక్షణలో ఉస్మానియా మెయిల్ బర్నింగ్ వార్డులో నిందితుడు చికిత్స పొందుతున్నాడు. నిందితుడి నుంచి మెజిస్ట్రేట్ డీడీ డిక్లరేషన్ నివేదిక తీసుకున్నారు. 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సురేష్ న్యూరో బర్న్ షాక్లో ఉన్నట్టు తెలిపారు. మరో 24 గంటలు దాటితే సురేష్ స్కిన్ బర్న్ సెప్టిక్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉందని తెలిపారు. ఉస్మానియా వైద్యులు పోలీసుల సమక్షంలో ఫ్లూయిడ్స్ ఇస్తూ.. చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment