abdullapurmet
-
అబ్దుల్లాపూర్ మెట్ లో హృదయవిదారక ఘటన
-
విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
సాక్షి, హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ ఇనాంగూడ వద్ద డీసీఎం వ్యాను బైక్‌ని ఢీ కొట్టింది. రెండు సంవత్సరాల కుమారుడు ముందే తండ్రి మృతి చెందాడు.తండ్రి మృతదేహం పక్కనే కుమారుడు ఏడుస్తూ కూర్చోవడం స్థానికులను కలిచివేసింది. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చిన్నారికి కూడా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. -
ఆంజనేయులు ఎక్కడ?.. బ్రిలియంట్ కాలేజీలో ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థి ఆంజనేయులు గత ఆదివారం నుంచి కాలేజ్ హాస్టల్ నుంచి అదృశ్యం అయినప్పటికీ ఇప్పటి వరకు కళాశాల యాజమాన్యం స్పందించలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి విద్యార్థులు భారీ ధర్నాకు దిగారు. కొడంగల్‌కి చెందిన ఆంజనేయులు ఆ కళాశాలలో డిప్లమో రెండో సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి అదృశ్యానికి యాజమాన్యమే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆంజనేయులుకు అతని తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో.. స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానంతో తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. తన కుమారుడి గురించి అడగ్గా, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇంత పెద్ద కాలేజీలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: విశాఖ: చైనా వెళ్తున్నానని చెప్పి లాడ్జిలో.. -
నవీన్ హత్య కేసు.. ‘సాక్షి’ చేతిలో నిందితుడు హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్: బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు నిందితుడు రిమాండ్ రిపోర్టు సాక్షి చేతికి అందింది. హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలల క్రితమే నవీన్ హత్యకు హరిహరకృష్ణ ప్లాన్ వేసినట్లు తేలింది. గెట్ టు గెదర్ పేరుతో జవరి 16న హత్యకు కుట్ర చేయగా.. వీలు కాకపోవడంతో ఫిబ్రవరి 17న హత్య చేసినట్లు వెల్లడైంది. బ్రహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్‌కు నవీన్ హత్య గురించి చెప్పి, అతని ఇంట్లోనే నిందితుడు హరిహరకృష్ణ గడిపినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా తెలిసింది. అంతేగాక ప్రియురాలిని కలిసి నవీన్ హత్య గురించి తెలపగా.. పోలీసులకు లొంగిపోవాలని ఆమె చెప్పినా వినకుండా వరంగల్ వెళ్లినట్లు వెల్లడైంది. రిమాండ్ రిపోర్టు ప్రకారం..ఈ నెల 17వ తేదీన రాత్రి 9 గంటలకు పెద్దంబర్‌పేట్ తిరుమల వైన్స్ వద్ద నవీన్, హరిహర కృష్ణ మద్యం సేవించారు. ఎల్బీనగర్, నాగోల్, ముసారంబాగ్, సైదాబాద్, చైతన్యపురి, కొత్తపేట పప్రాంతాల్లో నవీన్‌తో కలిసి తిరిగాడు. రాత్రి 12 గంటలకు యువతి ప్రేమ వ్యవహారంలో పరస్పరం వాగ్వాదం జరిగింది. తొలుత గొంతు నులిమి నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ.. అనంతరం కత్తితో నవీన్ శరీర భాగాలను వేరుచేశాడు. బ్యాగ్‌లో తలతో సహా శరీర విడిభాగాలను తీసుకెళ్లాడు. ఫోన్ హైదరాబాద్ నివాసంలో ఉంచిన నిందితుడు.. కోదాడ, ఖమ్మం, వైజాగ్‌లో రెండు రోజులు గడిపాడు. ఈనెల 23న తిరిగి వరంగల్ చేరుకొని తండ్రికి నవీన్ హత్య గురించి చెప్పాడు. ఈనెల 24న తిరిగి బ్రహ్మణపల్లి హత్యా స్థలంలోనవీన్ శరీర భాగాలతోపాటు ఆధారాలను తగలబెట్టిన హరిహరకృష్ణ.. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లొంగిపోయాడు. కాగా హరిహరకృష్ణకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. -
అయ్యో.. ఏమైందో ఏమో!
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: కూలి పనికోసం వలస వచ్చిన వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. రాత్రి పడుకున్న మంచంపైనే తెల్లవారేసరికి విగతజీవులుగా మారారు. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ధన్వాడ మండ లం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నాగారం హను మంతు (65), భార్య వెంకటమ్మ(50)తో కలిసిఅబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్పూర్లో సుగుణ అనే మహిళా రైతు వద్ద హార్టీకల్చర్ పనులు చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. మంగళవారం ఉదయం ఇంకా ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో సుగుణ వారిని పిలిచేందుకు వెళ్లింది. లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో పాటు దంపతులిద్దరూ స్పందించకపోవడంతో అనుమా నం వచ్చి విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. దీంతో కొంతమంది వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా హనుమంతుదంపతులు మంచంపై విగతజీవులుగా కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. మృతుల కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. (చదవండి: ‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’!) -
Ranga Reddy District: భూదాన్ భూముల్లో వాలిన గద్దలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూదాన్ భూములకు రక్షణ లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే వందల ఎకరాలు అన్యాక్రాంతమవగా తాజాగా మరికొంత భూమిని మాయం చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయి. గతంలో భూదాన్ బోర్డు సభ్యులుగా చెలామణి అయిన కొందరు పెద్ద మనుషులు ఈ భూములను కొల్లగొట్టి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకొనేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నగరంలో సొంత గూడు సంపాదించుకోవాలన్న ఆశతో ఉన్న పేదల బలహీనతను వారు క్యాష్ చేసుకుంటున్నారు. వీకర్ సెక్షన్ కింద పేద, మధ్య తరగతి ప్రజలకు నకిలీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. విలువైన ఈ భూములకు రక్షణ గోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కబ్జాల బారి నుంచి కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఖాళీ భూములపై ‘పెద్ద’ల కన్ను.. భూదానోద్యమంలో భాగంగా ఆచార్య వినోబా భావే అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో పర్యటించి మిగులు భూములు ఉన్న రైతుల నుంచి సుమారు 22,000 ఎకరాలు సేకరించి భూదాన్ బోర్డుకు అప్పగించారు. దీనిలో కొంత భూమి పేదలకు పంచారు. మరికొంత భూమిని రైతులు, రియల్టర్లు పక్కనే ఉన్న తమ పట్టా భూముల్లో కలిపేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని బోర్డు పరిధిలో 7000 ఎకరాల వరకు ఖాళీ భూములు ఉన్నట్లు అంచనా. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 215 నుంచి 227 వరకు ఉన్న సర్వే నంబర్లతోపాటు జాఫర్‌గూడ సర్వే నంబర్ 317, 319లలో 20 ఎకరాలకుపైగా, బాటసింగారం రెవెన్యూ పిగ్లీపూర్ సర్వే నంబర్ 17లో 75 ఎకరాలకుపైగా, కుంట్లూరులో 216 నుంచి 220 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 100 ఎకరాలకుపైగా భూదాన్ భూమి ఉంది. అదేవిధంగా తారామతిపేట్ సర్వే నంబర్ 235, 236లలో 48 ఎకరాలు ఉండగా గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నంబర్ 186, 187, 188, 189లలో పెద్ద సంఖ్యలోనే భూదాన్ భూములున్నాయి. బాలాపూర్‌లోని సర్వే నంబర్ 88లో 27 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఇక యాచారం, ఇబ్రహీపట్నం, మంఖాల్, మహేశ్వరంలోనూ ఈ బోర్డుకు భూములు ఉన్నాయి. ఈ భూములు అమ్మడం, కొనడం నేరమైనప్పటికీ జిల్లాలో యథేచ్ఛగా ఆక్రమణలు, అమ్మకాలు కొనసాగు తున్నాయి. లీజు పేరుతో గలీజు వ్యవహారాలు... ఇప్పటికే మెజారిటీ భూములను రియల్టర్లు కొల్లగొట్టగా మరికొంత భూమిని గతంలో బోర్డు సభ్యులుగా పనిచేసిన కొందరు మాయం చేస్తున్నారు. వీకర్ సెక్షన్లకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో పెద్ద మొత్తంలో భూములు కొల్లగొట్టారు. ఒకే ప్లాటుకు 2, 3 నకిలీ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఒక్కో ప్లాటును రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొంత మంది విద్యాసంస్థలు, గోశాలలు, అనాథాశ్రమాలు, ఇతర సామాజిక సేవల పేరుతో ఈ భూములను వందేళ్లకు లీజుకు తీసుకొని స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. (క్లిక్ చేయండి: డీజీపీ రేసులో పోటాపోటీ!) బోర్డును పునరుద్ధరించాలి... నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్ల ద్వారా సుమారు రూ. 19 కోట్లు అక్రమంగా వసూలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. భూదాన్ భూములను కాపాడాలంటే బోర్డును పునరుద్ధరించడం ఒక్కటే పరిష్కారం. – వెదిర అరవింద్‌రెడ్డి, అధ్యక్షుడు, సర్వసేవాసంఘ్ (అఖిల భారత సర్వోదయ మండల్) మేమే పంచుతాం.. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్ల భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ భూములు మాయమయ్యాయి. కబ్జాదారుల చెరలోని భూములను విడిపించాలి. కనీసం మిగిలిన భూములైనా ప్రభుత్వం పేదలకు పంచాలి. లేదంటే సీపీఐ ఆధ్వర్యంలోనే భూపంపిణీ చేపడతాం. – రవీంద్రాచారి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
మంత్రి కేటీఆర్ ఔదార్యం.. గాయపడిన మహిళను..
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చాటుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జమ్ముల నర్మద, రమేశ్ దంపతులు వారి కుమారుడిని ద్విచక్రవాహనంపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో దింపి మంగళవారం సాయంత్రం తిరుగుపయనమయ్యారు. పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులోని వ్యక్తులు అకస్మాత్తుగా డోర్ తెరవడంతో దంపతులు కిందపడి గాయపడ్డారు. అదే సమయంలో విజయవాడ జాతీయ రహదారిపై మునుగోడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మంత్రి కేటీఆర్ తన కారును ఆపి ప్రమాదానికి గురైన దంపతులను పరామర్శించారు. వెంటనే వారిని తన కాన్వాయ్‌లోని ఓ కారులో హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంత్రి ఔదార్యంపై స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. -
చర్చికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
నాగోలు: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు రూ. లక్ష నగదు దోచుకెళ్లిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితుల వివరాల ప్రకారం.. నాగోలు బండ్లగూడలోని కేతన ఎన్‌క్లేవ్‌లో ఉండే లాలయ్య, మాదాపూర్‌లో విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వరసగా రెండ్రోజులు సెలవులు ఉండడంతో భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అబ్దుల్‌పూర్‌మెట్ సమీపంలోని చర్చికి వెళ్లారు. రాత్రి అక్కడ బస చేశారు. ఆదివారం ఉదయం లాలయ్య ఇంటికి వచ్చే సరికి గ్రిల్స్‌కు ఉన్న తాళం పగలగొట్టి ఉంది లోపలికెళ్లి చూడగా అల్మారా పగల గొట్టి అందులో ఉన్న 49 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1 లక్ష నగదు, 8 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. లాలయ్య ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, పోలీస్ డాగ్స్‌తో తనిఖీలు చేసి అక్కడి వేలిముద్రాలు సేకరించారు. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. లాలయ్య ఇంట్లో పనిచేసేవారు తరుచూ ఇంటికి వచ్చే వారిని పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడు చర్చికి వెళ్లిన విషయం తెలుసుకున్న వారే చోరీ పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కోళ్ల చోరికి వచ్చిన యువకుడిపై దాడి) -
రైతులకు మద్దతుగా త్వరలో 72 గంటలు దీక్ష చేస్తా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-
అసైన్డ్‌పై రియల్ కన్ను! ఎకరాకు రూ.20 లక్షలకు చెల్లింపు, ధరణిలోనూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసైన్డ్ భూములపై కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. వీటిని అమ్మడం, కొనడం నేరమని తెలిసినా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా వీటిని స్వాధీనం చేసుకోవచ్చని స్థానికంగా ప్రచారం చేస్తూ.. రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారు. వీరి నుంచి తక్కువ ధరకు కొల్లగొట్టే కుట్రకు తెరలేపారు. రెవెన్యూ శాఖలోని లొసుగులకు తోడు అధికార పార్టీ పెద్దల అండదండలు వీరికి కలిసొస్తోంది. న్యాయపరమైన చిక్కులు, అధికారులతో ఏ సమస్యలు ఎదురైనా అన్నీ తామే చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. రిజిస్ట్రేషన్‌కు ముందే అసైన్డ్‌దారుల పేరుతో ఎన్ఓసీ సంపాదించి రూ.కోట్లు విలువ చేసే భూములను చవక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం వీరిచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డగోలుగా ఎన్ఓసీలు జారీ చేసి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ అగ్రిమెంట్ సమయంలో అసైన్డ్ దారులకు వ్యాపారులునగదు రూపంలో కాకుండా చెక్కుల రూపంలో చెల్లిస్తుండటం గమనార్హం. అబ్దుల్లాపూర్‌మెట్‌లో.. పెద్దఅంబర్‌పేట్‌లోని సర్వే నంబర్ 244లో నాలుగెకరాలు, సుర్మాయిగూడ సర్వే నంబర్ 128లో వంద ఎకరాలకుపైగా, బాటసింగారం సర్వే నంబర్ 10లో సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రూ.కోట్లు విలువ చేసే ఈ భూములపై వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు, అనుచరుల కన్నుపడింది. రెవెన్యూలోని లొసుగులను అడ్డుపెట్టుకుని అసైన్డ్ దారుని పేరుతోనే ఎన్ఓసీ పొందేందుకు యత్నిస్తున్నారు. అగ్రీమెంట్లు చేసుకుని, కొంత అడ్వాన్స్ కూడా ఇస్తున్నట్లు తెలిసింది. అబ్దుల్లాపూర్‌మెట్ కొత్త పోలీసు స్టేషన్ వెనుకభాగంలో సర్వే నంబర్ 283లోని 350పైగా ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ప్రస్తుతం వంద ఎకరాల వరకు ఖాళీగా ఉంది. దీనిపై రియల్టర్ల కన్ను పడింది. మహేశ్వరంలో.. మహేశ్వరం మండలం మహబ్బుత్నగర్లో రంగనాథసాయి పేరిట 9.06 ఎకరాల భూములున్నాయి. ప్రభుత్వం వీటిని 1988లోనే సీలింగ్ భూములుగా గుర్తించి, స్వాధీనం చేసుకుని స్థానిక తహసీల్దార్‌కు అప్పగించింది. ఆ తర్వాత ఇందులోని ఆరెకరాలను అప్పటి ఆర్డీఓ ఉత్తర్వుల (ఎ/ 6345/1987) మేరకు 1989 జనవరిలో భూమిలేని ఆరుగురు పేదలకు అసైన్ చేశారు. మరో 3.06 ఎకరాలను ఇద్దరు ఎక్స్ సర్వీస్మెన్లకు కేటాయించారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం దీని విలువ ధర రూ.60 కోట్ల పైమాటే. విలువైన ఈ భూమిపై ఓ ప్రముఖ సంస్థ కన్నుపడింది. పక్కనే ఉన్న తమ భూమిలో అసైన్డ్ భూములను కలిపేసుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణం కూడా తీసుకుంది. ఈ విషయం బ్యాంకు, రెవెన్యూ అధికారులకు తెలిసి ఒత్తిడి చేయడంతో.. తీసుకున్న లోన్ డబ్బులు తిరిగి చెల్లించింది. కానీ సదరు భూమి మాత్రం ఇప్పటికీ సంస్థ ఆధీనంలోనే ఉండటం, స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తుండటం విశేషం. ఇబ్రహీంపట్నంలో చెర్లపటేల్‌గూడ రెవెన్యూలోని సర్వే నంబర్ 710లో 83 ఎకరాల భూమిని 70 మందికి అసైన్ చేశారు. కొంత సాగుకు అనుకూలంగా ఉండగా, మరికొంత ప్రతికూలంగా ఉంది. ఈ భూమిని దక్కించుకునేందుకు కొంత మంది రియల్టర్లు యత్నిస్తున్నారు. నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వ్యాపారులు ఈ భూములపై కన్నేశారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా వీరికి సహకరిస్తున్నారు. పొల్కపల్లి, దండుమైలారం, రాయపోలు రెవెన్యూ పరిధిలో కూడా అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యాచారంలో.. మొండిగౌరెల్లి, నల్లవెల్లి, కొత్తపల్లి, తక్కెళ్లపల్లి, మా ల్, మంతన్‌గౌరెల్లి రెవెన్యూ పరిధిలో అసైన్డ్ భూము లు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లిలోని సుమారు పది వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో సేకరించింది. బాధితులకు రూ.8 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చింది. ఫార్మాసిటీ భూ సేకరణను బూచిగా చూపిస్తున్న రియల్టర్లు మిగిలిన గ్రామాల్లోని రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. రైతుకు ఎకరాకు రూ.17 లక్షలు చెల్లిస్తూ, మరో రూ.2 లక్షలు మధ్యవర్తులు కమీషన్‌గా తీసుకుంటున్నారు. ఇప్పటికే 60– 70 ఎకరాలకు అడ్వాన్స్‌లు కూడా చెల్లించినట్లు సమాచారం. మొండిగౌరెల్లిలో సర్వే నంబర్ 19లో 575.30 ఎకరాలు ఉండగా, సర్వే నంబర్ 68లో 625.20 గుంటలు, సర్వే నంబర్ 127లో 122.22 ఎకరాల భూమి ఉంది. వీటిపై నగరానికి చెందిన కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. ఈటల వ్యవహారంతో కలకలం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ ఆధీనంలో (మెదక్ అచ్చంపేట) ఉన్న ఎనిమిది సర్వే నంబర్లలో 85.19 ఎకరాల అసైన్డ్ భూమిని 65 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో జిల్లాలోని అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మన జిల్లాలోని 26 మండలాల పరిధిలో 321 గ్రామాల్లో 6,471.03 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, 5,440 మందికి 6,198.11 ఎకరాలు అసైన్ చేశారు. వీటిలో ఇప్పటికే చాలా భూములు పరాధీనమయ్యాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన రియల్టర్ల నుంచి మళ్లీ భూములు స్వాధీనం చేసుకునేందుకు అనేక మంది యత్నిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసిన రియల్టర్లలో ఆందోళన మొదలైంది. అమ్మడం, కొనడం నేరం అసైన్డ్ భూములు అమ్మడం, కొనడం నేరం. వీటిని రిజిస్ట్రేషన్ చేయలేము. అమ్మిన రైతులతో పాటు కొనుగోలు చేసిన వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. –వెంకటాచారి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
HYD: నగర శివారులో రేవ్ పార్టీ భగ్నం..
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ ఇనాంగూడలో యువత రేవ్ పార్టీ జరుపుకుంటున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు రైడ్స్ చేశారు. ఈ దాడుల్లో భాగంగా 10 మందికి పైగా యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల సందర్భంగా మద్యం సహా హుక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: చదువు పేరుతో హైదరాబాద్‌లో సహజీవనం.. ఇంటికి వచ్చాక .. -
ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..
సాక్షి, సిటీబ్యూరో/నాగోలు: నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న కొలిపాక శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. హతురాలు అతడికి రెండో భార్య అని, ఆమె ప్రియుడితో గడపడానికి అంగీకరించినట్లు నటించి ఇద్దరినీ అంతం చేశాడని పోలీసులు తేల్చారు. ఏసీపీ కె.పురుషోత్తమ్‌రెడ్డితో కలిసి గురువారం డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం నగరానికి వలసవచ్చి.. విజయవాడలోని పాయకాపురం సుందరయ్య కాలనీకి చెందిన కొలిపాక శ్రీనివాసరావు మొదటి భార్య ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో సత్యవతి అలియాస్ జ్యోతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. ఐదుగురు సంతానంలో ఇద్దరికి వివాహాలు కాగా... మిగిలిన ముగ్గురూ విజయవాడలో నానమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఏడాది క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీనివాసరావు తన భార్య జ్యోతితో కలిసి నగరానికి వలస వచ్చాడు. స్క్రాప్ వ్యాపారం చేస్తున్న ఇతడు ఆరు నెలలు పార్శిగుట్టలో ఉండి ఆపై వారాసిగూడకు మారాడు. నామాలగుండులో ఉంటున్న సమయంలో బౌద్ధనగర్‌కు చెందిన యడ్ల యశ్వంత్ అలియాస్ బన్నీతో జ్యోతికి పరిచయం ఏర్పడింది. గతంలో బన్నీ క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఓ సందర్భంలో జ్యోతి అతడి క్యాబ్ బుక్ చేసుకోవడంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వినకపోవడంతో ‘వదిలించుకోవాలని’... వారి మధ్య వివాహేతర సంబంధం విషయం కొన్నాళ్ల క్రితమే శ్రీనివాసరావుకు తెలిసింది. మందలించినప్పటికీ జ్యోతి తన ప్రవర్తన మార్చుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ తన ఇంట్లోనే ఏకాంతంగా గడుపుతున్నారని తెలిసి శ్రీనివాసరావు ఆవేశంతో రగిలిపోయాడు. మాట వినని జ్యోతితో పాటు ఆమెను లోబర్చుకున్న బన్నీని అంతం చేయాలని నిర్ణయించుకుని సరైన సమయం కోసం వేచి చూశాడు. తొలుత జ్యోతిని తీసుకుని విజయవాడకు కాపురం మారిస్తే పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించాడు. ఇదే విషయం ఆమెకు చెప్పిన శ్రీనివాసరావు గత వారమే సామాన్లు పంపేశాడు. ఆదివారం బైక్‌పై ఇద్దరూ విజయవాడ వెళ్లాల్సి ఉంది. ఆ సందర్భంలో జ్యోతి ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ శ్రీనివాసరావుతో చెప్పింది. ఇలాంటి సందర్బం కోసమే ఎదురు చూస్తున్న అతడు వెంటనే అంగీకరించి ఆమెతోనే బన్నీకి ఫోన్ చేయించి తన ఇంటికి రప్పించాడు. నగర శివార్లకు వెళ్లిన తర్వాత అనువైన ప్రాంతంలో ఇద్దరూ ఏకాంతంగా గడపాలని, ఆపై తాము విజయవాడ వెళ్లిపోతామని, నువ్వు వెనక్కు వచ్చేయమంటూ బన్నీకి చెప్పాడు. సుత్తితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో పొడిచి... దీంతో నామాలగుండు నుంచి శ్రీనివాసరావు, జ్యోతి ఒక వాహనంపై బన్నీ తన సోదరుడి వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యం, బిర్యానీ ప్యాకెట్లు కొనుక్కున్నారు. అనంతరం ముగ్గురూ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కొత్తగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి పొదల మధ్యలో శ్రీనివాసరావు మద్యం తాగుతుండగా... కాస్త దూరంలో జ్యోతి, బన్నీ ఏకాంతంగా గడుపుతున్నారు. ఇద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో తన వాహనంలో నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్ తీసుకుని వెళ్లి వారిపై దాడి చేశాడు. తేరుకునే లోపే ఇద్దరి తలపై కొట్టాడు. ఆపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా పొడిచాడు. సమీపంలో ఉన్న రాయితో బలంగా మోది చంపేశాడు. అక్కడ నుంచి జ్యోతి సెల్‌ఫోన్ తీసుకుని తన వాహనంపై విజయవాడకు వెళ్లిపోయాడు. మంగళవారం ఈ హత్యలు వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ వి.స్వామి, ఎస్సై డి.కరుణాకర్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.అంజిరెడ్డి నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి వాహనంతో పాటు హత్యకు వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: నగరంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసును పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. జ్యోతి ప్రవర్తనతో విసిగివేసారిన ఆమె భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. హత్య చేసిన అనంతరం విజయవాడకు పారిపోయిన నిందితుడు శ్రీనివాసరావును రాచకొండ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరంలో మరెవరికీ ప్రమేయం లేదంటూ అతడు చెబుతున్నా... అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి దర్యాప్తు అధికారులు సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. గురువారం అధికారికంగా నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. భార్య ప్రవర్తనతో విసుగుచెంది... వారాసిగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు, జ్యోతి (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆమెకు ఏడాది క్రితం ఇదే ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ యడ్ల యశ్వంత్‌తో పరిచయమైంది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య పలుమార్లు వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాను యశ్వంత్‌ను విడిచి ఉండలేనని, తనకు మీరిద్దరూ కావాలంటూ జ్యోతి చెప్పడంతో విసుగు చెందాడు. దీంతో ఇద్దరినీ హతమార్చాలని నిర్ణయించుకున్నాడు శ్రీనివాసరావు. అభ్యంతరం లేదంటూ నమ్మించి... వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్న శ్రీనివాసరావు ఆదివారం ఆ పని పూర్తి చేయాలని భావించాడు. దీనికి ముందే యశ్వంత్‌తో సంబంధం కొనసాగించడానికి తనకు అభ్యంతరం లేదంటూ భార్యతో చెప్పి ఆమెను నమ్మించాడు. ఆదివారం రాత్రి 7 గంటలకు జ్యోతితో యశ్వంత్‌కు ఫోన్ చేయించాడు. నగర శివార్లకు వెళ్దామంటూ చెప్పించడంతో యశ్వంత్ తన సోదరుడి వాహనం తీసుకుని వచ్చాడు. వారాసిగూడ నుంచి ముగ్గురూ రెండు బైక్‌లపై ఎల్బీనగర్ చేరుకున్నారు. అక్కడ జ్యోతికి శ్రీనివాస్ అనే వ్యక్తి కలిశాడు. ఆమెకు తన స్నేహితుడి ద్వారా శ్రీనివాస్‌తో అంతకుముందే పరిచయం ఉంది. బిల్లు చెల్లించి.. డబ్బులు బదిలీ చేసి.. ఎల్బీనగర్లోని ఓ పాదరక్షల దుకాణంలో జ్యోతి కొత్త చెప్పులు కొనుగోలు చేసింది. వీటి నిమిత్తం రూ.3 వేలు శ్రీనివాస్ చెల్లించాడు. అతడి ద్వారానే గూగుల్‌పే ద్వారా మరో రూ.5 వేలు తన భర్త శ్రీనివాసరావుకు బదిలీ చేయించింది. అక్కడి నుంచి శ్రీనివాస్ వెళ్లిపోగా.. జ్యోతి, శ్రీనివాసరావు, యశ్వంత్ బైక్‌లపై విజయవాడ జాతీయ రహదారి వైపు వెళ్లారు. ఈ దృశ్యాలు ఆ మార్గంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మార్గమధ్యలోని ఓ వైన్స్‌లో మద్యం, కూల్‌డ్రింక్స్ ఖరీదు చేశారు. రాత్రి మొత్తం శివార్లలోనే గడపాలనే ఉద్దేశంతో తమ వెంట ప్లాస్టిక్ చాప, ఎల్ఈడీ టార్చిలైట్, మూడు పవర్ బ్యాంక్స్ కూడా తీసుకువెళ్లారు. రాయితో కొట్టి.. స్క్రూడ్రైవర్‌తో పొడిచి... వీరు ముగ్గురూ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి పొదల్లో యశ్వంత్, శ్రీనివాసరావు మద్యం తాగా రు. ఆపై ఏకాంతంగా గడిపేందుకు జ్యోతి, యశ్వంత్ కొంచెం దూరం వెళ్లారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా శ్రీనివాసరావు వెనక నుంచి రాయితో దాడి చేశాడు. దీంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన యశ్వంత్‌ను పక్కగా లాక్కెళ్లిన శ్రీనివాసరావు తన బైక్‌లో నుంచి స్క్రూడ్రైవర్ తీసి అతడి పొట్ట, గొంతుపై పొడిచా డు. మరో రాయితో అతడి మర్మాంగాన్ని ఛిద్రం చే సి, అక్కడ నుంచి విజయవాడకు పారిపోయాడు. చెప్పుల దుకాణం రసీదు ఆధారంగా.. జంట హత్యల విషయం మంగళవారం వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలో లభించిన జ్యోతి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న చెప్పుల దుకాణం బిల్లు ఆధారంగా శ్రీనివాస్ వివరాలు తెలుసుకుని ఆ దిశగా విచారణ జరిపారు. అతడి ద్వారానే శ్రీనివాసరావు ఫోన్ నంబర్ తీసుకున్నారు. భార్య జ్యోతి ఆదివారం నుంచి కనిపించకపోయినా స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవడంతో అతడిపై పోలీసులకు అనుమానం బలపడింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌లోనూ కొన్ని ఆధారాలు లభించాయి. అతడి సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా విజయవాడలో ఉన్నట్లు గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యల్లో మరెవరి ప్రమేయం లేదంటూ నిందితుడు చెబుతున్నాడు. మరికొంత సాంకేతిక దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు. (చదవండి: అబ్దుల్లాపూర్‌మెట్ హత్యలు: జ్యోతి కళ్ల ముందే యశ్వంత్‌ను చంపి, ఆపై..) -
అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో మరో ట్విస్ట్
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ కొత్తగూడెం పరిధిలో జంట హత్యల కేసులో మరో విషయం వెలుగు చూసింది. జ్యోతి-యశ్వంత్‌ల వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని తెలిసిందే. భార్య ప్రియుడైన యశ్వంత్‌తో పాటు భార్యను కూడా చంపాలనే తీవ్రంగా యత్నించినట్లు జ్యోతి భర్త శ్రీనివాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించి యశ్వంత్ తో పాటు ఆమె ప్రియుడ్ని చంపించాడు భర్త శ్రీనివాస్. భార్య కళ్ల ముందే యశ్వంత్‌ను దారుణంగా హతమార్చిన భర్త.. అక్కడితో ఆగలేదు. తనను చంపొద్దని బతిమాలినా భార్య జ్యోతిని సైతం వదలకుండా హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఆపై శవాలను అక్కడే పడేసి సుపారీ గ్యాంగ్‌తో పాటు వెళ్లిపోయాడు. ఈ కేసుకు సంబంధించి.. శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత కొంతకాలంగా యశ్వంత్, జ్యోతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. ఆ విషయం తెలిసి భరించలేక ఇలా ఇద్దరినీ హతమార్చాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధిత వార్త: యశ్వంత్-జ్యోతి వివాహేతర సంబంధం భరించలేక.. -
అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసు: భర్త శ్రీనివాసే సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించగా.. ఈ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఊహించినట్లుగానే వివాహేతర సంబంధం ఈ హత్యకు ప్రధాన కారణంగా తేలింది. జ్యోతి భర్త శ్రీనివాసరావే నిందితుడిగా గుర్తించారు. జ్యోతితో యశ్వంత్‌కు గత కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం ఉండడంతో.. ఈ నేపథ్యంలోనే హత్య చేసినట్లు శ్రీనివాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌తో పాటు ఈ హత్యలో అతనికి నలుగురు సహకరించినట్లు సమాచారం. దీంతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని వారాసిగూడ ప్రాంతానికి చెందిన యెడ్ల యశ్వంత్(22) క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(28)అనే మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. కొత్తగూడెం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో వీళ్ల మృతదేహాలు నగ్నంగా పడి ఉండడం కలకలం రేపింది. యశ్వంత్ తలపై బలమైన గాయం కాగా, జ్యోతి తలపై బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తులు ఉన్నాయి. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు.. ఆ దిశగానే క్లూస్ లభించడం విశేషం. ఇదిలా ఉంటే.. హత్యకు గురైన మహిళతో యశ్వంత్‌కు పరిచయం ఉన్న విషయం తెలియదని యశ్వంత్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సంబంధిత వార్త: హైదరాబాద్ శివారులో నగ్నంగా మృతదేహాలు! -
అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం.. జంట మృతదేహాల కలకలం
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట మృతదేహాల కలకలం చోటుచేసుకుంది. కొత్తగూడెం బ్రిడ్జ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువతి, యువకుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. నగ్నంగా మృతదేహాలు ఉన్నాయి. గుర్తు పట్టడానికి వీలులేకుండా శవాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. ఏకాంతంగా ఉన్న జంటను దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మృతులు కవాడిగూడకు చెందిన వారుగా సమాచారం. మృతి చెందిన యువకుడిని యశ్వంత్, యువతిని జ్యోతిగా గుర్తించారు యువతి ముఖం గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది. సంఘటన స్థలానికి కొద్దిదూరంలోనే హోండా యాక్టివాను పోలీసులు గుర్తించారు. యువతీయువకులు హత్యకు గురయ్యారా? లేక బలవన్మరణానికి పాల్పడ్డారా? మరేదైనా ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం జరిగిందని అనుమానిస్తున్నారు. -
రంగారెడ్డి: అబ్దుల్లాపుర్ మెట్లో చైన్‌స్నాచర్ వీరంగం
-
విషాదం మిగిల్చిన ఈత సరదా
అబ్దుల్లాపూర్‌మెట్: సరదాగా కుంటలో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. నాదర్గుల్లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న మహబూబ్‌నగర్ జిల్లా కొమిరెడ్డిపల్లికి చెందిన ఎస్.క్రాంతికుమార్‌రెడ్డి (20), సంగారెడ్డి జిల్లా పాంపాడ్‌కు చెందిన పటోళ్ల శ్రీకాంత్ (20) శుక్రవారం సప్లిమెంటరీ పరీక్షలు రాసి మిగతా ఆరుగురు స్నేహితులతో కలిసి సంఘీనగర్ దేవాలయాల పరిసరాలకు వచ్చారు. కొహెడ శివారులోని నీటి కుంటలో సరదాగా ఈత కొట్టేందుకు దిగారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన మిగతా విద్యార్థులు.. 100కు డయల్ చేసి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కుంటలోకి దిగి ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాల లీకేజీ కలకలం
-
Abdullapurmet: పాలిటెక్నిక్ క్వశ్చన్ పేపర్స్ లీక్
-
అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. 6 ఏళ్లకు
సాక్షి, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ళ క్రితం వివాహం చేసుకున్న ప్రేమ జంటపై అమ్మాయి మేనమామ గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో వివాహిత భర్తకు గాయలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివరాలు.. అబ్దుల్లాపూర్‌మెట్ లష్కర్ గూడకు చెందిన రాజు, అదే గ్రామానికి చెందిన మరో మైనారిటీ యువతి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపతో శుక్రవారం హాస్పిటల్‌కు వెళ్ళి తిరిగి వస్తుండగా వివాహిత మేనమామ జహంగీర్.. మహిళ, ఆమె భర్త రాజుపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో రాజుకు తీవ్ర గాయాలవ్వగా హయత్ నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు జహంగీర్ కోసం గాలిస్తున్నారు. చదవండి: ఉప్పల్‌లో దారుణం: నా భర్త కామపిశాచి.. కన్నకొడుకుపై కర్కషంగా.. -
అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ అబ్దుల్లాపూర్‌మెట్ కూడలి వద్దకు రాగానే అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్‌పై ఉన్న విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సిరిసిల్లా జిల్లా ప్రగతి నగర్‌కు చెందిన ప్రణయ్ గౌడ్(20)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే లారీ అదుపు తప్పినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వృద్ధురాలిపై పైశాచికం: మద్యం తాగించి.. లైంగిక దాడికి పాల్పడి..
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: ఓ వృద్ధురాలు హత్యకు గురికాగా, ఆమెకు మద్యం తాగించి లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో భర్త తోపాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని తారామతిపేటకు చెందిన ఇరగదిండ్ల ఆండాలు (58), ఆమె భర్త ఈదయ్య కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కుమారుడు మల్లేశ్ హయత్‌నగర్‌లో ఉంటూ అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుండేవాడు. కాగా మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కృష్ణ.. మల్లేశ్‌కు ఫోన్ చేసి మీ అమ్మ ఇంట్లో చనిపోయి ఉందని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని సమాచారమిచ్చాడు. మల్లేశ్ ఇంటికి వచ్చి చూడగా ఆండాలు విగతజీవిగా పడి ఉంది. ఆమె చేతిపై, భుజాలు, మెడపై కమిలిపోయి బలమైన గాయాలు ఉన్నాయి. చదవండి: కుక్క చేసిన పని.. రెండు కుటుంబాల మధ్య గలాటా తన తల్లి హత్యపై తండ్రి ఈదయ్య, అదే గ్రామానికి చెందిన బొడిగ శ్రీకాంత్, దేవర సురేశ్‌లపై అనుమానం ఉందని మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ స్వామి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కాగా, మృతురాలు ఆండాలుకు ఈదయ్య మూడో భర్త అని స్థానికులు తెలిపారు. అత్యాచారం చేసి ఆపై హత్య చేశారా? ఆండాలుతో పాటు ఆమె భర్త ఈదయ్య, బొడిగ శ్రీకాంత్, దేవర సురేశ్ సోమవారం రాత్రి మద్యం సేవించారని స్థానికుల ద్వారా తెలిసింది. మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్, సురేశ్ ఆండాలుపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్ర«థమికంగా నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులకు ఈదయ్య సహకరించాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆండాలు హత్య కేసులో అనుమానితులు ఈదయ్య, శ్రీకాంత్, సురేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అండాలును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై ఎఫ్ఐఆర్ నమోదు
FIR against Mani Ratnam: ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్’ చిత్రీకరణలో ఓ గుర్రం చనిపోవడంతో పెటా ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో గుర్రం యజమాని, మణిరత్నంలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గత నెలలో హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత నెల ‘పొన్నియిన్ సెల్వన్’ అనే సినిమా షూటింగ్ జరుగింది. యుద్ధం సీన్ కోసం ఏకధాటిగా షూటింగ్ చేయడంతో డీహైడ్రేషన్ కారణంగా ఓ గుర్రం చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పెటా ప్రతినిథులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మణిరత్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, గుర్రం యజమానిపై పిసిఎ చట్టం 1960, సెక్షన్ 11 మరియు భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 429 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన తమిళ హిస్టారికల్ ఫిక్షనల్ నవల "పోన్నియన్ సెల్వన్" కథ ఆధారంగా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తి వంటి స్టార్ కాస్టింగ్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చదవండి : సినిమా షూటింగ్లో దారుణం: గుర్రాన్ని చంపేసి... గుట్టుగా పూడ్చేసి RC 15: మరో వివాదంలో డైరెక్టర్ శంకర్.. -
సినిమా షూటింగ్లో దారుణం: గుర్రాన్ని చంపేసి... గుట్టుగా పూడ్చేసి
సాక్షి, హైదరాబాద్: యుద్ధం సీన్‌ను భారీగా తీయాలన్న అత్యాశ ఓ గుర్రం ప్రాణం తీసేసింది. సినిమా షూటింగ్లో జంతువులను ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిబంధనలు ఉన్నా.. నిర్వాహకుల నిర్లక్ష్యం ఆ మూగజీవి ప్రాణాన్ని తీసింది. అయితే, గుర్రం చనిపోతే కేసు అవుతుందన్న భయమో... లేక గుర్రమే కదా అన్న నిర్లక్ష్యమోగానీ... గుట్టుచప్పుడు కాకుండా గుర్రాన్ని పూడ్చేసి చేతులు దులుపుకున్నారు సినిమా నిర్వాహకులు. కానీ, షూటింగ్లో పాల్గొన్న వారిచ్చిన సమాచారంతో పెటా ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత నెల ‘పొన్నియిన్ సెల్వన్’ అనే సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో యుద్ధం సీన్ కోసం 40–50 గుర్రాలను వినియోగించారు. హైదరాబాద్‌కే చెందిన ఓ గుర్రాల యజమాని దగ్గరి నుంచి గుర్రాలను తెప్పించుకున్న నిర్వాహకులు వాటితో ఏకధాటిగా షూటింగ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ సమూహంలోని ఓ గుర్రం షూటింగ్ జరుగుతుండగానే డీహైడ్రేషన్ కారణంగా గత నెల 11న చనిపోయింది. చనిపోయిన గుర్రాన్ని సినిమా నిర్వాహకులు గుంత తీసి పూడ్చేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయారు. ఆనోటా ఈనోటా గుర్రం మృత్యువాత పడ్డ విషయం పెటా ప్రతినిధులకు తెలిసింది. దీంతో గత నెల 18న అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌కు వెళ్లి పిటిషన్ ఇచ్చారు. పెటా పిటిషన్ ఆధారంగా చిత్ర నిర్మాత, గుర్రం యజమానిపై కేసు దర్యాప్తు చేసి విచారణ చేస్తున్నారు. స్థానిక పశువైద్యుడి సహకారంతో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు చనిపోయిన గుర్రానికి పోస్టుమార్టం నిర్వహించారు. చదవండి: Sidharth Shukla: బిగ్‌బాస్ విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం -
ఫోన్ మాట్లాడుతూ.. రెండు డోసులు?
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లో ఓ యువతికి నర్సు ఫోన్లో మాట్లాడుతూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూర్‌లోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీ ప్రసన్న (21) ఈ నెల 17న పెద్దఅంబర్‌పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌కు టీకా తీసుకునేందుకు వెళ్లింది. ఆమెకు వ్యాక్సిన్ వేస్తుండగానే నర్సుకు ఫోన్ రావడంతో ఆమె ఫోన్లో మాట్లాడుతూ లక్ష్మీప్రసన్నను అక్కడే కూర్చోమని చెప్పింది. ఫోన్ మాట్లాడిన అనంతరం తిరిగొచ్చిన నర్సు మరోసారి వ్యాక్సిన్ ఇచ్చింది. ఈ విషయాన్ని లక్ష్మీప్రసన్న అక్కడున్న వారికి తెలుపడంతో కొద్దిసేపు గందరగోళం చోటుచేసుకుంది. అనంతరం ఆమెను వైద్య సిబ్బంది పరిశీలనలో ఉంచి వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యాక్సిన్ వేస్తున్న సమయంలోనే నర్సుకు ఫోన్ వచ్చిందని, ఫోన్ మాట్లాడిన అనంతరం రెండో డోసు వేసిందని, ఆందోళన చేయడంతోనే తనను ఏరియా ఆస్పత్రికి తరలించారని బాధితురాలు ఆరోపించారు. కాగా, లక్ష్మీ ప్రసన్నకు రెండు డోసులు వేశామన్నది అవాస్తవమని, యువతి ఆందోళన చేయడం వల్లనే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి పరిశీలన కోసం పంపించామని వైద్యాధికారులు అంటున్నారు. -
పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి హత్య
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్:మండలంలోని అనాజ్‌పూర్ గ్రామంలో ఇంట్లోని నీటి ట్యాంకులో రెండు నెలల చిన్నారి మృతదేహం లభ్యమవడం స్థానికంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా చిన్నారి అనుమానాస్పద మృతి వెనుక ఉన్న మిస్టరీ వీడింది. ఈ ఘటనను పోలీసులు హత్యకేసుగా తేల్చారు. తమకు పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి మేనమామ, అత్త ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే వారిని అరెస్టు చేసిన పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు. విషయంలోకి వెళితే.. అనాజ్‌పూర్‌కు చెందిన మంచాల రంగయ్య కూతురు లతకు ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి నివాసి దూసరి తిరుమలేశ్‌తో పన్నెండేళ్ల కింద పెళ్లయింది. అప్పటినుంచి దంపతులకు సంతానం కలగలేదు. రెండు నెలల కిందటే వారికి బాలుడు జన్మించగా, ఉమామహేశ్వర్ అని పేరు పెట్టుకున్నారు. బాబు పుట్టినప్పటి నుంచి అనాజ్‌పూర్‌లోని పుట్టింట్లో తమ్ముడు బాల్‌రాజ్, మరదలు శ్వేతతో కలసి లత ఉంటోంది. తిరుమలేశ్ తరచూ వచ్చి భార్య, కొడుకును చూసి వెళ్తుండే వాడు. అయితే గురువారం రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత లత తన బాబును పక్కనే పడుకోపెట్టుకుని నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె లేచిచూడగా కుమారుడు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. చివరకు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో బాలుడు విగతజీవిగా తేలాడు. చదవండి: దారుణం: రాత్రి తల్లి చెంత.. తెల్లారేసరికి నీళ్ల ట్యాంకులో -
దారుణం: రాత్రి తల్లి చెంత.. తెల్లారేసరికి నీళ్ల ట్యాంకులో
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: వివాహమైన పన్నెండేళ్ల తర్వాత ఆ దంపతులకు బాబు పుట్టాడు. ఆ సంతోషం వారికి కొద్ది రోజులు కూడా నిలవలేదు. రాత్రి తల్లి చెంత నిద్రించిన రెండు నెలల బాలుడు తెల్లారేసరికి వాటర్ ట్యాంకులో విగతజీవిగా కనిపించాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అనాజ్‌పూర్‌కు చెందిన మంచాల రంగయ్య కూతురు లతకు ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి నివాసి దూసరి తిరుమలేశ్‌తో పన్నెండేళ్ల కింద పెళ్లయింది. అప్పటినుంచి దంపతులకు సంతానం కలగలేదు. రెండు నెలల కిందటే వారికి బాలుడు జన్మించగా, ఉమామహేశ్వర్ అని పేరు పెట్టుకున్నారు. బాబు పుట్టినప్పటి నుంచి అనాజ్‌పూర్‌లోని పుట్టింట్లో తమ్ముడు బాల్‌రాజ్, మరదలు శ్వేతతో కలసి లత ఉంటోంది. తిరుమలేశ్ తరచూ వచ్చి భార్య, కొడుకును చూసి వెళ్తుండే వాడు. అయితే గురువారం రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత లత తన బాబును పక్కనే పడుకోపెట్టుకుని నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె లేచిచూడగా కుమారుడు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. చివరకు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో బాలుడు విగతజీవిగా తేలాడు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ స్వామి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో వివరాలు సేకరించారు. కుటుంబీకులే చంపారా? పసికందును కుటుంబీకులే చంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి మేనమామ బాల్‌రాజ్, అతడి భార్య శ్వేతను అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు వచ్చే అవకాశం లేదని, వారిద్దరే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
చిన్నారి అనుమానాస్పద మృతి; నీటిట్యాంకులో మృతదేహం
సాక్షి, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన రెండునెలల చిన్నారి తెల్లవారే సరికి ఇంటిపై నీటి ట్యాంకులో శవమై కనిపించాడు. రాత్రి తమ వద్దే నిద్రించిన చిన్నారి తెల్లవారుజామున 2 గంటల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి ఆచూకీ కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఇంటిని గాలించారు. చివరకు ఇంటిపైకప్పుపై ఉన్న నీటి ట్యాంకును పరిశీలించగా చిన్నారి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసిన పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదవశాత్తు జరిగిందా.? లేక హత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా చిన్నారి హత్యకేసుతో మేనమామ, అత్తకు సంబంధమున్నట్లు ఆరోపణలు రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. -
అబ్దుల్లాపూర్ మెట్లో టిప్పర్ బీభత్సం
సాక్షి,రంగా రెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం కూడలి వద్ద టిప్పర్ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెల్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఆగి ఉన్నా ఆటోలపైకి దూసుకెళ్లిన టిప్పర్ బోల్తాపడటంతో రెండు ఆటోలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక్కరికి తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉన్న అయిదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 సహాయంతో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద లారీ బీభత్సం
సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మంగళవారం లారీ బీభత్సం సృష్టించింది. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఆ తర్వాత ట్రాన్స్ ఫార్మర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకున్నాడు. డ్రైవర్ ను బయటకు తీసేందుకు స్థానికులు శ్రమిస్తున్నారు. -
అబ్దుల్లాపూర్‌మెట్టులో అనూహ్య ఘటన!
సాక్షి, అబ్దుల్లాపూర్ మెట్టు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో అనూహ్య ఘటన వెలుగుచూసింది. ఇసుక లోడ్‌లో గుర్తుతెలియని మహిళ పుర్రెతోపాటు శరీరభాగాలు లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సాహెబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం అబ్దుల్లాపూర్ మెట్టు నుంచి ఇసుకను కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. తన ఇంటి వద్ద ఇసుక వేస్తుండగా అందులో మహిళా పుర్రె బయటపడింది. దీంతో కంగుతిన్న ఆయన పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌రెడ్డిని వెంట తీసుకొని వెళ్లిన పోలీసులు ఇసుక డంప్ వద్దకు క్లూస్ టీమ్‌తో తనిఖీలు చేశారు. దీంతో ఇసుక డంప్‌లో మరికొన్ని శరీరభాగాలు లభించాయి. మహుబూబ్ నగర్ జిల్లా నుంచి ఏడు నెలలు క్రితం ఇసుక డంప్ చేసినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. చనిపోయిన మహిళ వయసు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రయ్య విషాదాంతం
పెద్దఅంబర్‌పేట, శంషాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. నవంబర్ 4న విజయారెడ్డిపై కార్యాలయంలోనే రైతు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. విజయారెడ్డిని కాపాడబోయిన కారు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య గాయపడ్డారు. అయితే, గురునాథం 5న చికిత్స పొందుతూ మృతి చెందగా, హత్యకు కారణమైన కూర సురేశ్ 8న మృతిచెందాడు. ఇక చంద్రయ్య డీఆర్డీఎల్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ సోమవారం ప్రాణాలొదిలాడు. మృతులందరికీ చిన్నపిల్లలే.. ఈ ఘటనలో మృతిచెందిన నలుగురికీ చిన్న పిల్లలే ఉన్నారు. విజయారెడ్డికి ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. నిందితుడు సురేశ్‌కు కూతురు, కుమారుడు, డ్రైవర్ గురునాథంకు ఏడాదిన్నర వయసు కుమారుడు, అటెండర్ చంద్రయ్యకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. రాళ్లగూడలో అంత్యక్రియలు చంద్రయ్య అంత్యక్రియలు సోమవారం శంషాబాద్ పట్టణంలోని రాళ్లగూడలో జరిగాయి. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన చంద్రయ్య జిల్లాల విభజన సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ కార్యాలయంలో అటెండర్‌గా నియమితులయ్యా రు. ఆయన తన భార్య పద్మమ్మ, పిల్లలు అభినవ్, కీర్తనలతో కలసి ఉంటున్నారు. ఘటన జరిగాక ప్రభుత్వం వైద్యం చేయించినా ఇంతవరకు ఆర్థిక సాయం చేయలేదని కుటుంబ సభ్యులన్నారు. ట్రెసా చేయూత సాక్షి, హైదరాబాద్: చంద్రయ్య కుటుంబానికి తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) బాసటగా నిలిచింది. అత్యవసర ఖర్చులకుగాను చంద్రయ్య కుటుంబ సభ్యులకు ట్రెసా సంఘం నాయకులు రూ. లక్ష అందజేశారు. డ్యూటీకి వెళ్లిన రోజు నుంచి మళ్లీ ఇప్పుడే.. డ్యూటీకి వెళ్లిన రోజు మా నాన్నను చూశాం.. ఆ తర్వాత మేము ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. ఈ రోజు చనిపోయాడని చెప్పారు. మా నాన్న బతికుండగా చూసి చనిపోయిన తర్వాత మళ్లీ ఈరోజే చూడాల్సి వచ్చింది. మా నాన్ననే ఇంటికి ఆధారం.. మేము ఇప్పుడు పదో తరగతి, తొమ్మిదో తరగతి చదువుతున్నాం. మమ్మల్ని ఎవరు చదివిస్తారు.. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – చంద్రయ్య కుమారుడు అభినవ్, కుమార్తె కీర్తన -
విజయారెడ్డి కేసు: అటెండర్ మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయారెడ్డి హత్య కేసులో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన అటెంబర్ చంద్రయ్య సోమవారం కన్నుమూశారు. నవంబర్ 4న విజయారెడ్డికి అంటుకున్న మంటలను ఆర్పేస్తూ... చంద్రయ్య తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. చంద్రయ్య నెలరోజులుగా..డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. చంద్రయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరవుతున్నారు. సరైన వైద్యం అందించకే చంద్రయ్య చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారని.. కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారని ఆగ్రహిస్తున్నారు. చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విజయారెడ్డిపై సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటిచగా ఆమె ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. ఎమ్మార్వోను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె కారు డ్రైవర్ గురునాథానికి మంటలంటుకోవడంతో మరుసటిరోజే మృతి చెందాడు. అలాగే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిందితుడు సురేష్ డిఆర్డిఓలో చికిత్స పొందుతూ నవంబర్ 7న మరణించాడు. ఈ ఘటనలో మొత్తంగా నలుగురు మరణించారు. చికిత్స పొందుతూ ఏఎస్ఐ నర్సింహులు మృతి.. బాలాపూర్: ఆత్మహత్యాయత్నం చేసిన ఏఎస్ఐ నర్సింహులు ఆసుపత్రిలో సోమవారం మృతి చెందాడు. కొన్నిరోజుల క్రితం బాలాపూర్ పోలీసు స్టేషన్ ఎదుట పెట్రోలు పోసి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన నర్సింహులు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం మరణించాడు. కాగా ఆయన మృతికి సీఐ సైదులు వేధింపులే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చర్యలు చేపట్టిన పోలీసు కమిషనర్ సీఐపై బదిలీ వేటు వేశారు. చదవండి.. తహశీల్దార్ సజీవదహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది? దారుణం: మహిళా తహశీల్దార్ సజీవదహనం -
24 రోజుల తర్వాత... అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్..
సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య అనంతరం 24 రోజుల తర్వాత గురువారం అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం తెరుచుకుంది. ఘటన జరిగిన భవనాన్ని ఖాళీ చేసి..నూతన భవనంలో కార్యాలయం ప్రారంభించారు. ఎమ్మార్వో వెంకట్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయంలోనే ఈ నెల 4వ తేదీన హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేష్ కూడా మృతి చెందాడు. ఈ సంఘటన అనంతరం కార్యాలయం మూతపడింది. నేడు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నూతన కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు. చదవండి: మహిళా తహసీల్దార్ సజీవ దహనం తహశీల్దార్ సజీవ దహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది? -
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌గా వెంకట్‌రెడ్డి
సాక్షి, పెద్దఅంబర్‌పేట: అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్‌గా కె.వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన విజయారెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు సరూర్‌నగర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఇన్చార్జిగా కొనసాగారు. పూర్తిస్థాయి తహసీల్దార్‌గా ప్రభుత్వం వెంకట్‌రెడ్డిని నియమించింది. హయత్‌నగర్‌లో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ నుంచి వెంకట్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌కు వెళ్లి తహసీల్దార్ కార్యాలయం నిర్వహణకు మరో భవనాన్ని చూశారు. బీసీ కాలనీలో గల కమ్యూనిటీ భవనాన్ని పరిశీలించారు. -
అబ్దుల్లాపూర్‌మెట్‌లోనే తహసీల్దార్ కార్యాలయం!
పెద్దఅంబర్‌పేట: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన అనంతరం మూతపడిన ఆ కార్యాలయం తరలింపుపై జరుగుతున్న తర్జనభర్జనలు కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది. అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ కార్యాలయాన్ని హయత్‌నగర్ మండలానికి తరలించాలని అధికారులు చేసిన ప్రయత్నాలకు ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. విజయారెడ్డి హత్య ఘటన అనంతరం సరూర్‌నగర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా ఆయన ఇక్కడికి రావడానికి విముఖత చూపారు. ఇక్కడి సిబ్బంది కూడా కార్యాలయ భవనాన్ని మారిస్తేనే విధులకు హాజరవుతామని ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో ఈ కార్యాలయాన్ని హయత్‌నగర్ మండలానికి తరలించాలని అధికారులు ప్రయత్నించారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకతరావడంతో.. స్థానికంగానే మరో భవనాన్ని పరిశీలించారు. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత రానుంది. కాగా, ప్రభుత్వం షేక్‌పేట మండల తహసీల్దార్ వెంకట్‌రెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన గురువారం లేదా శుక్రవారం రానున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. -
రెవెన్యూ చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య, తదనంతర పరిణామాలు కలకలం సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లో పట్టపగలే ఓ అధికారిణిని సజీవ దహనం చేయడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎన్నడూ లేని విధంగా 8 రోజుల పాటు విధులు బహిష్కరించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఉద్యోగుల భద్రత, సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో గత బుధవారం నుంచి విధులకు హాజరవుతున్నారు. ఏ శాఖపైనా లేనన్ని ఆరోపణలు రావడం, రెవెన్యూ వ్యవస్థపై ముఖ్యమంత్రే అసంతృప్తి వ్యక్తం చేయడం, ఏసీబీకి చిక్కుతున్న అధికారుల్లోనూ ఈ శాఖకు చెందినవారే అధికంగా ఉండడం, రికార్డుల ప్రక్షాళన, ధరణి వెబ్సైట్ మొరాయింపు, పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో జాప్యం, ఎడతెగని పార్ట్– బీ భూముల వివాదం రెవెన్యూ సిబ్బందికి అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి. పనిభారం తడిసిమోపెడు భూ పరిపాలతోపాటు ఇతర శాఖలకు సంబంధించిన పనుల్లోనూ రెవెన్యూ సిబ్బంది కీలకం. విద్యార్థుల కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల నుంచి ఓటరు జాబితా సవరణలు, ఆహార భద్రత, సంక్షేమ పథకాల అమలులో వీరిది పెద్దన్న పాత్ర. 26 శాఖలకు సంబంధించిన పనిభారం రెవెన్యూ ఉద్యోగులకు గుదిబండగా మారింది. ప్రతి పనిలో వీరే కీలకం కావడంతో భూపరిపాలన గాడి తప్పింది. దీంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు వీఆర్వోల నుంచి తహసీల్దార్ల వరకు చేతివాటం ప్రదర్శించడం ఆ శాఖకు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. హడావుడి ప్రక్షాళనతో... రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించాలనే హడావుడిలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన ప్రస్తుత అగచాట్లకు కారణమైంది. తప్పులు సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వకపోవడం, సాంకేతిక సమస్యలు, ధరణి వెబ్సైట్ సహకరించకపోవడం లాంటి కారణాలు రెవెన్యూ సిబ్బంది పనితీరును ప్రశ్నించేలా చేశాయి. లెక్కకు మిక్కిలి చట్టాలు, జీవోలతో గందరగోళం ఏర్పడింది. పార్ట్ బీ భూముల వ్యవహారం వీరికి తలనొప్పిగా మారింది. తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనతో రెవెన్యూ ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకమైంది. దీంతో ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాలకు తొలిసారిగా పోలీస్ బందోబస్తు కల్పించింది. రెవెన్యూ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే సందర్శకుల రాకపోకలను నియంత్రించింది. 26 శాఖలకు సంబంధించిన పనిభారం రెవెన్యూ ఉద్యోగులకు గుదిబండగా మారింది. ప్రతి పనిలో వీరే కీలకం కావడంతో భూపరిపాలన గాడి తప్పింది. -
పెట్రోల్‌తో తహసీల్దార్ కార్యాలయానికి రైతు
కల్హేర్(నారాయణఖేడ్): అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన మరువకముందే భూమి పట్టా చేయడం లేదని బాటిల్లో పెట్రోల్ పోసుకుని వచ్చి మరో రైతు రెవెన్యూ ఉద్యోగులకు షాక్ ఇచ్చాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని మహదేవుపల్లికి చెందిన రైతు జి.లింగయ్య, వీఆర్ఓగా పనిచేసిన లాలయ్య తన పట్టా పాసుపుస్తకం నుంచి రెండు ఎకరాల భూమిని తీసేసి ఇతరుల పేరిట మార్చారని ఆరోపించాడు. గ్రామ శివారులోని 49 సర్వే నంబర్లో తన తల్లి శివమ్మ పేరిట ఉండాల్సిన భూమికి హక్కులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీఆర్ఓ లాలయ్య తమకు అన్యాయం చేశారని సోదరులతో కలసి వచ్చి కార్యాలయం వద్ద కలకలం సృష్టించాడు. బాటిల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న వారు లింగయ్య చేతిలోంచి పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. అనంతరం లింగయ్య ఠాణాకు వెళ్లి వీఆర్ఓపై ఫిర్యాదు చేశాడు. దీనిపై వీఆర్ఓ లాలయ్యను ప్రశ్నించగా, సదరు 2 ఎకరాల భూమిని ఎవరిపేరుపై నమోదు చేయకుండా పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. -
అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమం
సాక్షి, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ ఆఫీసు అటెండర్ చంద్రయ్య అరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో చంద్రయ్యకు గాయాలయ్యాయి. ప్రస్తుతం డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులు చంద్రయ్య పరిస్థితిని పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అతని కుటుంబసభ్యులు హెచ్చరించారు. ఇప్పటికే మూడు లక్షల బిల్లు అయిందని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డబ్బు చెల్లిస్తే చికిత్స చేస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది పేర్కొంది. డబ్బులు లేకపోతే ఇప్పటి వరకు అయిన వైద్య ఖర్చులు చెల్లించాలంటూ ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లాలని కుటుంబసబ్యులకు డీఆర్‌డీఓఅపోలో ఆసుపత్రి వర్గాలు సూచించాయి.అతన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వాధికారులు సూచించారు. తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమైన ఘటనలో.. విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన అటెండర్ చంద్రయ్యకు కూడా మంటలంటుకొని గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కాలిన గాయాలతో విజయారెడ్డి డ్రైవర్ గురునాథ్ మరణించిన విషయం తెలిసిందే. -
గురునాథ్ కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని రక్షించే క్రమంలో మంటలు అంటుకొని మరణించిన డ్రైవర్ గురునాథ్ కుటుంబానికి మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రెవెన్యూ ఉద్యోగులూ గురునాథ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. మేడ్చల్ జేసీ విద్యాసాగర్, రాజేంద్రనగర్ ఆర్డీఓ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) తరఫున గురునాథ్ భార్యకు రూ. 1.15 లక్షలు అందజేశామని, మొత్తంగా రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు -
దగ్ధ పుత్రుడు
హటాత్తుగా అమానుష జ్వాలలు బుసలు కొట్టాయి. ‘అమ్మ’ చుట్టూ మంటలు. అమ్మ ఆక్రందనలు. ‘గురూ.. ఎక్కడా..’.. అమ్మ పిలుపు! అమ్మను అంటుకున్న మంటలపైకి గురునాథం ఎగబాకాడు. అమ్మను కాపాడే ప్రయత్నంలో తనూ దగ్ధమయ్యాడు. విజయారెడ్డి కారు డ్రైవర్ గురునాథం. అధికారిలా కాకుండా ‘అమ్మ’లా చూసింది అతడిని. ఆగ్రహావేశాలకు ఆహుతై అమ్మ అక్కడిక్కడ చనిపోతే.. గురునాథం ఆ మర్నాడు ఆసుపత్రిలో కన్ను మూశాడు. దగ్ధ పుత్రుడిలా మిగిలాడు! తాసీల్దార్ విజయారెడ్డిది మనసును కలచివేసే ఘటన అయితే.. ఆమె డ్రైవర్ గురునాథం కుటుంబానిది మనిషి మనిషినీ కదిలిస్తున్న వ్యథ! గురునాథానిది సూర్యాపేట జిల్లా, వెల్దండ మండలం, గరుడపల్లి గ్రామం. తల్లిదండ్రులు బ్రహ్మయ్య, రమణమ్మ. కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి ముగ్గురూ కుమారులే. పెద్ద కుమారుడే గురునాథం. నానమ్మ పేరు గురువమ్మ. ఆమె పేరు కలిసి వచ్చేలా గురునాథం అని పెట్టారు. రెండేళ్ల క్రితమే నేరేడు చర్ల మండలం వైకుంఠాపురానికి చెందిన సాలమ్మ, అముర్తయ్యల చిన్న కూతురు సౌందర్యతో గురునాథానికి వివాహం జరిగింది. గురునాథానికి కారు డ్రైవింగ్ వచ్చు. పదేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. తొలి రెండేళ్లు ఎల్బీనగర్లో స్నేహితుల వద్ద ఉంటూ గ్యారేజీల్లో రోజు వారి వేతనం తీసుకొని కారు డ్రైవింగ్ చేశాడు. విజయారెడ్డి భర్తకు తెలిసిన వ్యక్తి గురునాథం కుటుంబానికి తెలుసు. ఆయన ద్వారానే గురునాథం విజయారెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా కుదిరాడు. అలా ఎనిమిదేళ్లుగా ఆమె వద్దే పని చేస్తున్నాడు. ‘గురూ... ఎప్పుడొస్తావ్?’ గురునాథం విజయారెడ్డికి నమ్మకస్తుడిగా ఉండేవాడు. అతడి వివాహానికి విజయారెడ్డి.. భర్త, పిల్లలతో కలిసి వెల్దండకు వచ్చి వెళ్లారు కూడా. గురునాథం తల్లిదండ్రులను ఆమె పిన్ని, బాబాయి అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. గురునాథానికి ఏ ఇబ్బంది రాకుండా తానే చూసుకుంటానని చెప్పేవారు. ‘‘మేడమ్.. నా కొడుకును తల్లిలా చూసేది. తను ఏం తింటున్నా నా కొడుకుకూ పెట్టేది. గురునాథం ఒక్కరోజు ఊరికి వచ్చినా మేడమ్ ఫోన్ చేసేది. ‘‘గురు... హైదరాబాద్‌లో కారు తోలడం మాటలు కాదు. నువ్వు ఉండాల్సిందే’’ అని మేడమ్ అంటే.. మేము వెంటనే గురునాథంను డ్యూటీకి తోలేవాళ్లం. నాకే ఫోన్ చేసి.. ‘బాబాయ్ గురును పంపించు’ అని చెప్పేది’’ అని గురునాథం తండ్రి బ్రహ్మయ్య కన్నీటిని దిగమింగుకుంటూ చెప్పాడు. ‘‘డబ్బులు అయినా, ఇంకే సహాయానికైనా అన్నింటికి గురునాథాన్ని మేడమ్ ఆదుకునేది. వాళ్లిద్దరూ తల్లీకొడుకుల్లా ఉండేవాళ్లు. అందుకే ఆ తల్లికి ఆ కొడుకు పాణం ఇవ్వాల్సి వచ్చిందేమో’’ అని వలవలమన్నాడు బ్రహ్మయ్య. దసరాకు భార్య, కొడుకుతో కలిసి వెల్దండకు వచ్చిండు. ఒక్కరోజు ఉండి తెల్లారే మళ్లీ డ్యూటీకి హైద్రాబాద్ పోయిండు. మళ్లీ హుజూర్నగర్ ఉప ఎన్నికలకు గ్రామానికి వచ్చి ఓటేసి పోయిండు. వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల ఉన్న వారినందరినీ పలకరించేవాడు. గ్రామంలో స్నేహితులు, ఇంటి చుట్టు పక్కల ఉన్న వాళ్లంతా ‘గురు’ అని పిలిచేవారు. తన వద్ద ఏళ్లుగా నమ్మకంగా డ్రైవర్‌గా పని చేస్తుండడంతో విజయారెడ్డి మేడమ్ కూడా ‘గురు’ అని అప్యాయంగా పిలిచేది’’ అని గుర్తు చేసుకున్నాడు బ్రహ్మయ్య ‘మా మేడమ్‌ని బతికించండి’ గురునాథం భార్య సౌందర్య మనో వేదన వర్ణనాతీతం. ఎవరూ ఆమె దుఃఖాన్ని పట్టలేకపోతున్నారు. ‘‘బాబుకు ఇప్పుడు ఏడాదిన్నర వయస్సు. సిద్దార్థ అని బావే పేరు పెట్టిండు. నాకు ఇప్పుడు ఎనిమిదో నెల. వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు కావడంతో ‘మనకు అమ్మాయి పుట్టాలి’ అని బావ ఎప్పుడూ అంటుండేవాడు. మేము ఎల్బీనగర్ మన్సురాబాద్‌లో, మేడమ్ వాళ్లు కొత్తపేటలో ఉంటారు. ఉదయం తొమ్మిదిన్నరకు డ్యూటీకి వెళ్తే రాత్రి తొమ్మిది గంటల తర్వాతే ఇంటికి వచ్చేవాడు. మేడమ్ గృహ ప్రవేశానికి మేము వెళ్లితే మంచిగా చూసుకుంది. బాబు పుట్టిన రోజు మార్చి 15న మా ఇంటికి మేడమ్ వచ్చింది. బావ కూడా మేడమ్ మంచిదని, మనకు ఏ ఇబ్బంది లేకుండా మేడమ్ చూసుకుంటుంది అని చెప్పేవాడు. సోమవారం ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిండు. మధ్యాహ్నం తర్వాత అక్కడి నుంచి ఒకరు ఫోన్ చేసి.. ‘మేడమ్ కాలిపోయింది, మీ ఆయన కూడా కాలిపోయాడు’ అని నాకు చెప్పిండ్రు. నేను ఇంటి దగ్గర ఉన్న ఒకళ్లను తీసుకొని ఆస్పత్రికి పోయా. బావ కాలిపోయి బెడ్‌పై ఉండేసరికి చూడలేకపోయా. తను కాలిపోతూ కూడా ‘మా మేడమ్‌ను బతికించండి’ అని అరిచాడట’’ అని సౌందర్య బోరుమంది. ‘‘డ్యూటీకి వెళ్తే మేడమ్ పెట్టిందే బావ తినేవాడు. బాబు కోసం వాళ్ల నాయినమ్మ నెయ్యి పంపితే.. ఆ నెయ్యి బాగుంటుందో ఉండదోనని.. ‘గురు మా అమ్మవాళ్లు నెయ్యి పంపారు. మా పిల్లలకు అదే పెడుతున్నా. మీ బాబుకు తీసుకపో’ అని మేడమ్ నెయ్యి పంపించింది. అంత మంచిగా గురునాథంను మేడమ్ చూసుకుంది’’ అని సౌందర్య ఒక్కో సంగతినీ గుర్తు చేసుకుంటోంది. గురునాథం కుటుంబ సభ్యుల కన్నీటి మంటలు ఇప్పట్లో ఆరేలా లేవు. బొల్లం శ్రీనివాస్, సాక్షి, సూర్యాపేట ఫొటోలు : అనమాల యాకయ్య -
207 మంది అవినీతిపరుల్లో 50 మంది వాళ్లే..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసుతో రెవెన్యూ యంత్రాంగంపై అందరి దృష్టి పడింది. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిని కోల్పోతానేమోనన్న భయంతోనే విజయారెడ్డిని హత్యచేసినట్టు సురేశ్ మరణ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా పనులు చేయకుండా రెవెన్యూ అధికారులు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటారని రైతులు ఆరోపిస్తున్నారు. (చదవండి : అదే అతడికి అవకాశం.. ఆమెకు శాపం) లంచం లేనిదే రెవెన్యూశాఖలో ఫైలు కదలదన్న తీరుగా పరిస్థితులు దాపురించాయని వాపోతున్నారు. ఈనేపథ్యంలో రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీ దాడుల్లో పట్టుబడిన అవినీతి అధికారుల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. గత రెండేళ్లలో 207 ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కితే వారిలో 50 మంది రెవెన్యూ ఉద్యోగులే ఉండటం గమనార్హం. ఇక ఎవరికీ దొరకని అవినీతి అధికారులు నేటికీ దొరలుగానే చలామణి అవుతున్నారు..! (చదవండి : విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్ మృతి) అవినీతి రెవెన్యూ అధికారుల్లో కొందరు.. రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్ లావణ్య , వీఆర్వో అనంతయ్య రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా బాచుపల్లి డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట తహసీల్దార్ రవిరాజా కుమార్‌రావు,వీఆర్ఏ రామకృష్ణ రూ. లక్షా 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్ జిల్లా మద్దివంచ వీఆర్వో సీరం శివరావు రూ.లక్షా 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వనపర్తి జిల్లా కొత్తకోట ఆర్దీఓ చంద్రా రెడ్డి, తహసీల్దార్ మల్లికార్జునరావు రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన మంచిర్యాల ఆర్డీవో గూడెం మనోహర్‌రావు రూ.42 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన యాదాద్రి జిల్లా సుద్దాల వీఆర్వో శ్రీనివాస్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన నిజామాబాద్ ఆర్మూర్ ఆర్దీఓ శ్రీనివాస్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల సర్వేయర్ రాజు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన పంచాయతిజిల్లా సర్వేయర్ రవి కుమార్ అవినీతి అధికారుల చిట్టా కోసం క్లిక్ చేయడం : -
కేసీఆర్ మాటలే విజయారెడ్డి హత్యకు దారి తీశాయి
సాక్షి, హయత్‌నగర్: అధికారులపై ప్రజలు రెచ్చిపోయే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలే విజయారెడ్డి హత్యకు దారితీశాయని, రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, లేదంటే విజయారెడ్డి వంటి ఘటనలు పెరిగిపోయే ప్రమాదం ఉందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్‌నేత వి. హనుమంతరావు అన్నారు. విజయారెడ్డి హత్యకు గురైన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలామంది రైతులు ఏళ్ల తరబడి పట్టాదారు పాస్బుక్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, రెవెన్యూ చట్టాల్లో చాలా లొసుగులు ఉన్నాయని విమర్శించారు. వాటిని ఆసరాగా చేసుకుని అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, మార్పులు రాకుంటే ఇలాంటి హత్యలు పెరుగుతాయని తెలిపారు. మ్యుటేషన్ పేరుతో రెవెన్యూ సిబ్బంది రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటక తరహాలో భూములను కొన్న మరునాడే రెవెన్యూ రికార్డులు మారేవిధంగా వ్యవస్థ ఉండాలని, రెవెన్యూ చట్టాల్లో మార్పుల కోసం కర్ణాటకలోని విధానాలపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. పటేల్, పట్వారీల కాలంలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండేదని, వీఆర్ఓల వ్యవస్థ కారణంగా వారికి అవగాహన లేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో లోపాల కారణంగా డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపించారు. సీబీసీఐడీ విచారణపై తనకు నమ్మకం లేదని, గతంలో వారు విచారణ జరిపిన నయీం హత్య కేసు ఎంతవరకు వచ్చిందని, అతడి డబ్బులు ఏమయ్యాని ఆయన ప్రశ్నించారు. తహసీల్దార్ విజయారెడ్డి భర్త కోరిన విధంగా సీబీఐ విచారణ చేట్టాలని, హంతకుడి వెనుక ఉన్న వారిని బయటకు తీసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించారు. పీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందికి భరోసా కల్పించి తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్రరేఖ మహేందర్‌గౌడ్, నాయకులు గుండ్ల వెంకట్‌రెడ్డి, యాదగిరిచారి తదితరులు ఉన్నారు. -
తహసీల్దార్ హత్య కేసు నిందితుడు మృతి
సాక్షి, హైదరాబాద్/అఫ్జల్‌గంజ్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసు నిందితుడు కూర సురేశ్ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ నెల 4న విధినిర్వహణలో ఉన్న తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెను కాపాడే ప్రయత్నంలో నిప్పంటుకుని ఆస్పత్రిలో చేరిన డ్రైవర్ గుర్నాధం రెండ్రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటు నిందితుడు సురేశ్ కూడా ఘటనలో గాయపడిన విషయం విదితమే. గాయాలతోనే సురేశ్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో పోలీసులు ఆరోజే చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సురేశ్ ఛాతీ, ముఖం, చేతులు.. ఇలా 65 శాతం కాలిన గాయాలయ్యాయి. మంటల్లో చర్మం కాలిపోవడంతో పాటు మంటల వేడికి రక్తనాళాలు దెబ్బతిన్నాయి. శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. దీంతో బుధవారం సాయంత్రం సురేశ్‌ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేశారు. అయితే గురువారం ఉదయమే ఆయన చనిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఉస్మానియా వైద్యులు సురేశ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు. తీరా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సురేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. భర్త సురేశ్ మరణవార్తతో భార్య లత అస్వస్థతకు గురైంది. ఆమెను అత్యవసర విభాగానికి తరలించి ప్రాథమిక చికిత్సలు అందజేశారు. పోలీసుల భద్రత మధ్య సురేశ్ మృతదేహాన్ని సొంతూరు గౌరెల్లికి తరలించారు. అక్కడ రాత్రి భారీ బందోబస్తు మధ్య సురేశ్ అంత్యక్రియలు జరిగాయి. నా భర్త అమాయకుడు: లత నా భర్త సురేశ్ అమాయకుడు. ఎవరితో గొడవలకు వెళ్లేవాడు కాదు. ఆయనను ఎవరో పావుగా వాడుకున్నారు. ఎమ్మార్వో హత్య కేసులో వెనుకున్న వారెవరో పోలీసులే బయటకు తీయాలని వేడుకుంటున్నా. -
సురేష్ మృతి.. స్పందించిన తండ్రి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్ట్‌మార్టం పూర్తి చేసిన ఉస్మానియా వైద్యులు సురేష్ మృత దేహాన్ని ఆయన స్వస్థలానికి తరలించారు. ఈ సందర్భంగా నిందితుడు సురేష్ మృతిపై ఆయన తండ్రి కృష్ణ స్పందించారు. తన కొడుకు తహసీల్దార్ కార్యాలయానికి ఎప్పుడూ వెళ్ళలేదని, తహశీల్దార్‌ను ఎందుకు హత్య చేశాడో తమకు తెలీదని అన్నారు. తమకు చెందిన తొమ్మిది గుంటల భూమిని ఏడాది క్రితం మల్రెడ్డి రంగారెడ్డికి అమ్మినట్లు ఆయన తెలిపారు. మొత్తం ఏడు ఎకరాలు భూమి తమ అన్నదమ్ములకు చెందినది ఉందని, అయితే భూ సమస్య నిమిత్తం తానే తహశీల్దార్ ఆఫీసు, కోర్టు చుట్టూ తిరుగుతున్నట్లు కృష్ణ తెలిపారు. తమ కుమారుడు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఈరోజు రాత్రి అంత్యక్రియలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాగా విజయారెడ్డిపై దాడి సమయంలో తీవ్ర గాయాలపాలైన సురేశ్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈసీజీలో పల్స్ రేటు ఫ్లాట్‌గా రావడంతో మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వెంటిలేటర్ తొలగించినట్లు పేర్కొన్నారు. కాగా వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి.. మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఇక ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు వెళ్లిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథం కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. -
విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్ మృతి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి చెందాడు. విజయారెడ్డిపై దాడి సమయంలో తీవ్ర గాయాలపాలైన సురేశ్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈసీజీలో పల్స్ రేటు ఫ్లాట్‌గా రావడంతో మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వెంటిలేటర్ తొలగించినట్లు పేర్కొన్నారు. కాగా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై రైతు సురేశ్ సోమవారం పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విజయారెడ్డి తన కార్యాలయంలోనే మృతి చెందారు. ఇక ఆమెతో పాటు నిందితుడు సురేశ్‌కు కూడా నిప్పంటుకోవడంతో 65 శాతం గాయాల పాలైన అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. కాగా వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి.. మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఇక ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు వెళ్లిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథం కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విజయారెడ్డి హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితుడు సురేశ్ కాల్‌డేటా, విజయారెడ్డి కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సురేశ్ మాట్లాడినట్లు తేలడంతో.. ఈ కేసులో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. (చదవండి: అదే ఆమె హత్యకు కారణమైంది..) -
జమీన్.. జంగ్!
సాక్షి, హైదరాబాద్/పెద్ద అంబర్‌పేట: ఆ భూమే వారికి జీవనాధారం. స్వేదం చిందిస్తూ, సేద్యం చేస్తూ హాయిగా జీవితం నెట్టుకొస్తున్న రైతాంగానికి ఆ భూమి తమది కాదని తెలియదు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఈ భూమిపై సర్వహక్కులు మావేననే ధీమా వారిలో కనిపించేది. వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ కొందరు రావడం.. ఈ భూమి మాది.. కౌలుదారులమని తేలి్చచెప్పడంతో పేద రైతుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ఇలా అప్పటివరకు సాఫీగా సాగిన వారి వ్యవసాయం కాస్తా చిన్నాభిన్నమైంది. ఈ కథ అంతా ఎక్కడిదో కాదు.. రెండు రోజుల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ హత్యకు కారణంగా భావిస్తున్న భూ వివాదం గురించి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని ఈ భూవివాదానికి 2004 సంవత్సరంలోనే బీజం పడిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు. భూ పోరాటానికి అంకురం ఇక అప్పటి నుంచి మొదలైంది భూ పోరాటం. రైతులు, కౌలుదారుల మధ్య నెలకొన్న ఈ వివాదం రెవెన్యూ, కోర్టుల్లో కొనసాగుతూ వస్తోంది. ప్రతి చోటా రైతులకు వ్యతిరేకంగా, కౌలుదారులకు అనుకూలంగా తీర్పులు రావడంతో భూములు దక్కవేమోననే ఆందోళన రైతాంగంలో మొదలైంది. నగర శివారు కావడం, ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుకుని ఉన్న ఈ భూమికి భారీగా డిమాండ్ ఉండడం కూడా గంపెడాశకు కారణమైంది. ఇదే సర్వేనంబర్‌లో పలువురికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేసిన రెవెన్యూ యంత్రాంగం.. వివాదాస్పద భూమి పేరిట కొందరికి ఇవ్వకుండా నిలిపివేసింది. బాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 90 నుంచి 101 వరకు విస్తరించిన దాదాపుగా 412 ఎకరాలు గౌరెల్లి, బాచారం గ్రామాలకు చెందిన 53 మంది యాభై సంవత్సరాల నుంచి సాగుచేస్తున్నారు. వాస్తవానికి ఈ భూమి వంశపారంపర్యంగా వచి్చంది కాదు. ఇందులో 412 ఎకరాలు రాజానందరావుదికాగా, 1980 తర్వాత ఆయన మహారాష్ట్రకు వలస పోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అప్పటికే పొజిషన్లో ఉన్న రైతులు సాదా బైనామా కింద రాజానందరావు నుంచి కొనుగోలు చేశామని, 1998లో 1–బీ రికార్డులో కూడా తమ పేర్లను నమోదు చేయడమేగాకుండా.. ఆర్ఓఆర్ ఇచ్చి పట్టా పాసుబుక్కులు కూడా ఇచ్చారని చెబుతున్నారు. రైతుల గుండెల్లో కుదుపు అప్పటివరకు భూములు సాగు చేసుకుంటున్న రైతాంగానికి 2004లో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఝలక్ ఇచ్చారు. సదరు సర్వే నంబర్లలో సుమారు 130 ఎకరాల భూమిపై తమకు హక్కులున్నాయని కోర్టు మెట్లెక్కారు. ఊరు విడిచి ఎప్పుడో నగరానికి వలస వెళ్లిన వీరికి స్థానికంగా కొందరు రియల్టర్లు తోడయ్యారు. దీనికితోడు అప్పటి రెవెన్యూ అధికారులు కూడా సహకరించడంతో ఈ వ్యవహారం ముందుకు సాగింది. ఇదే అదనుగా బడాబాబులు.. భూమి తమ ఆ దీనంలో లేకున్నా డాక్యుమెంట్ల ద్వారా విక్రయిస్తూ వచ్చారు. అప్పటివరకు కౌలుదారులు, రైతులకు మధ్య నడుస్తున్న వివాదాల్లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా రంగప్రవేశం చేయడంతో వివాదం కాస్తా మరింత క్లిష్టంగా తయారైంది. ఈ క్రమంలోనే 2016లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఇచి్చన ఉత్తర్వుల మేరకు వివాదాస్పద 130 ఎకరాల భూమికి సంబంధించిన పాస్‌పుస్తకాలను కౌలుదారుల నుంచి కొనుగోలు చేసిన వారి పేరిట రెవెన్యూ అధికారులు జారీ చేశారు. పహాణీల్లో కూడా నమోదు చేశారు. దీంతో జేసీ ఉత్తర్వులపై.. తహసీల్దార్ హత్య కేసులో నిందితుడైన సురేశ్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ క్రమంలోనే తమ ఆ«దీనంలో ఉన్న భూమికి పాసుపుస్తకాలు ఎందుకు ఇవ్వరంటూ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సురేశ్, పాస్ పుస్తకాలు రాకపోవడానికి తహసీల్దార్ విజయారెడ్డే కారణమని కక్ష పెంచుకొని ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఈ హత్య చేయడానికి సురేశ్‌ను కుటుంబసభ్యులు ఎవరైనా ఉసిగొల్పారా లేదా భూ మాఫియా ప్రేరేపించిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో ఉసిగొల్పారు నా భర్త అమాయకుడు. భూమి ఎక్కడ ఉందో కూడా అతనికి తెలియదు. కూలీనాలి చేసుకుంటున్న ఆయన రెండు నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి పూర్తిగా మారిపోయాడు. మాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఏమీ తెలియని అమాయకుడు, అంతపెద్ద అధికారిణిని అలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఆయనను వెనుక ఉండి ఎవరో రెచ్చగొట్టారు. మేడం లాగే నాకూ పిల్లలు ఉన్నారు. సురేశ్ చేసింది తప్పే. – లత, నిందితుడు సురేశ్ భార్య -
డ్రైవర్ గురునాథానికి కన్నీటి వీడ్కోలు
గరిడేపల్లి: తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో తీవ్ర గాయాలపాలై మరణించిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథానికి గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్‌ను కాపాడబోయి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండకు అదేరోజు రాత్రి తీసుకువచ్చారు. బుధవారం బంధుమిత్రులు కడసారి గురునాథం భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టారు. నల్లగొండ, సూర్యాపేట తహసీల్దార్ల సంఘం అధ్యక్షులు షేక్ మౌలానా, షేక్ జమీరుద్దీన్, గరిడేపల్లి తహసీల్దార్ హెచ్.ప్రమీల గురునాథం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రూ.20 వేల సాయాన్ని అతని కుటుంబ సభ్యులకు సంఘం తరఫున అందించారు. అక్క అన్న అభిమానంతో కాపాడే సాహసం చేశాడు పేద కుటుంబానికి చెందిన గురునాథం తహశీల్దార్ విజయారెడ్డి వద్ద నమ్మకంగా పనిచేసేవాడని, ఆమెను అక్కా అని ఆప్యాయంగా పిలుస్తుండేవాడని బంధువులు తెలిపారు. అందుకే మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని చెప్పారు. -
పక్కా ప్లానింగ్ ప్రకారమేనా..?
సాక్షి, హైదరాబాద్: పక్కా పథకం ప్రకారమే అబ్దుల్లాపూర్‌మెట్ తాహసీల్దార్ విజయారెడ్డి హత్య జరిగిందా? హత్యా సమయంలో ఎమ్మార్వో ఆఫీసు బయట కారులో ఉన్నది ఎవరు? ఘటన తర్వాత నిందితుడు సురేష్ వారితో ఏం మాట్లాడాడు? అసలు హత్యకు ముందు విజయారెడ్డి గదిలో ఏం జరిగింది? సురేష్‌కు, విజయారెడ్డికి మధ్య వాగ్వాదానికి కారణం ఏంటి? సురేష్ ఆమెపై పెట్రోల్ పోస్తుండగా... ఆ వాసన బయటకు రాలేదా? ఆ సమయంలో అటెండర్‌తోపాటు అక్కడ ఎవరూ ఎందుకు లేరు? విజయారెడ్డి సజీవదహనం కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు సురేష్ పక్కా ప్రణాళికతోనే తహసీల్దార్ విజయారెడ్డిని హత్య చేసినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. సంఘటనాస్థలం పరిసరాల్లో లభించిన సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. హత్యకు ముందు, ఆ తర్వాత పరిణామాలు చూస్తే.. ఇది పక్కా ప్రణాళికగానే కనిపిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత సురేష్ మంటలతో బయటకు వచ్చి.. దగ్గరలోని వైన్ షాపు ముందు కారులో ఉన్నవారితో మాట్లాడినట్టు సమాచారం. వారితో మాట్లాడిన తర్వాతే అతను పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు చెప్తున్నారు. మరోవైపు అబ్థుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డికి నిప్పటించి హత్య చేసిన నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ రఫీ వెల్లడించారు. సురేష్‌కు 65 శాతం గాయాలయ్యాయని, ఆయన ప్రాణానికి గ్యారెంటీ ఇవ్వలేమని రఫీ తెలిపారు. -
సురేష్ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం : డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడయిన సురేష్ ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎమ్మార్వోపై దాడి ఘటనలో సురేష్‌కు కూడా మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. సురేష్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పిరిస్థితి గురించి బుధవారం ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎమ్ఓ డాక్టర్ రఫీ మాట్లాడుతూ.. యాభై శాతం కంటే తక్కువ గాయాలయిన కేసులలో మాత్రమే గ్యారంటీ ఇస్తామని, సురేష్‌కు 65 శాతం గాయాలయ్యాయని తెలిపారు. ఛాతీ, తల భాగాల్లో మంటలంటుకుపోవడంతో మెదడు, గుండె కూడా కాలిపోయాయని వెల్లడించారు. ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల ప్రాణాలతో ఉన్నాడు కానీ, పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్లు వివరించారు. -
ఆ భూమి విలువ రూ. 100 కోట్లు: మంచిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పందించారు. నిందితుడు టీఆర్ఎస్ కార్యకర్త అని, ఎమ్మెల్యే అనుచరులే హత్య చేయించారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన మీద ఓడిపోయిన మల్రెడ్డి ఓటమి తట్టుకోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భూ కబ్జాదారులు అంటూ ప్రచారం చేస్తున్న వారే అసలు కబ్జాదారులని విమర్శించారు. విజయారెడ్డి మరణం దురదృష్టకరమని, ఆమె హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. విజయారెడ్డి మరణాన్ని రాజకీయం చేస్తున్నారని, ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. నిందితుడు సురేశ్ భూములు కొనుగోలు చేసింది మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి కుటుంబ సభ్యులేనని, మొత్తం 412 ఎకరాలపై పూర్తి దర్యాప్తు చేయాలని కోరారు. పాస్ పుస్తకాలు లేకుండా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 90 నుంచి 101 సర్వేలో మొత్తం భూమిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం ఈ భూములపై దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఆ భూమి విలువ రూ. 100 కోట్లు నాలుగు సర్వేల్లో ఉన్న భూమి విలువ 100 కోట్లు ఉంటుందని మంచిరెడ్డి అన్నారు. 1980లో ప్లాట్లు అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 16 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నది మల్ రెడ్డి రంగారెడ్డి కుటుంబ సభ్యులేనని ఆరోపించారు. తాను 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేగాక న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడు సురేష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్నాడని, మల్ రెడ్డి రంగారెడ్డి సోదరులతో పాటు ఇంకా అనేక మంది ఇందులో భాగమై ఉన్నారని ఆరోపించారు. -
విషమంగా సురేశ్ ఆరోగ్యం..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తునకై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వనస్థలిపురం ఏసీపీ జయరాంను విచారణ అధికారిగా నియమించారు. అదే విధంగా విజయారెడ్డిని కాపాడబోయి చికిత్స పొందుతూ ఆమె డ్రైవర్ గురునాథం మృతి చెందిన నేపథ్యంలో ఈ కేసులోని సెక్షన్లలో మార్పులు చేశారు. గురునాథం మృతి తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. అదే విధంగా ఘటనా స్థలంలో నిందితుడు సురేశ్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు... తహశీల్దార్ హత్య తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. కాగా విజయారెడ్డిని సజీవ దహనం చేసిన రైతు సురేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతడు ప్రస్తుతం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సంరక్షణలో ఉస్మానియా ఆస్పత్రిలోని బర్నింగ్ వార్డులో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సురేశ్ ఛాతీ, పొట్ట, ముఖం, కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలు శరీరంలోని నీరు మొత్తం పోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం న్యూరో బర్న్ షాక్‌లో ఉన్న సురేశ్ మరో 24 గంటలు దాటితే స్కిన్ బర్న్ సెప్టిక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని.. ప్రస్తుతానికి అతడికి ఫ్లూయిడ్స్ అందిస్తూ చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో సురేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఉస్మానియా వైద్యులు 72 గంటలు గడిస్తే గానీ అతడి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం లేదన్నారు. హత్యకు కారణం అదేనా...? మరోవైపు ఇప్పటికే నిందితుడి నుంచి మెజిస్ట్రేట్ డీడీ డిక్లరేషన్ నివేదిక తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లనున్నారు. అదే విధంగా సురేశ్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హయత్‌నగర్ , అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్నేహితులతో సురేశ్ మాట్లాడినట్లు గుర్తించామన్నారు. అలాగే హత్యకు ముందు కొద్ది నిమిషాల క్రితం సురేశ్ తన పెదనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. అంతేకాకుండా వేరే వ్యక్తులతో మాట్లాడిన కాల్స్‌ను సురేశ్ రికార్డ్ చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా సురేష్ కుటుంబానికి చెందిన 9 ఎకరాల భూమి వివాదమే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికి సురేశ్ తండ్రి కృష్ణ, పెద్దనాన్న దుర్గయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా గతంలో కూడా ఈ భూ వివాదంపై గ్రామ సభల్లో తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో సురేశ్ గొడవలకు దిగినట్లు సమాచారం. -
వెలిదండకు చేరిన గురునాథం మృతదేహం
సాక్షి, గరిడేపల్లి (హుజూర్నగర్): అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్ సజీవ దహనం విషయంలో మృతి చెందిన కామళ్ల గురునాథం మృతదేహం మంగళవారం రాత్రి 7గంటలకు స్వగ్రామమైన వెలిదండకు చేరింది. గ్రామానికి మృతదేహం చేరగానే పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. భార్య సౌందర్య, తల్లి రమణమ్మ, తండ్రి బ్రహ్మయ్య కన్నీరు మున్నీరుగా విలపించారు. కోదాడ రూరల్ ఎస్ఐ సైదులు, గరిడేపల్లి ఎస్ఐ వెంకన్న, ఏఎస్ఐ నాగేశ్వరరావుతో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. గురునాథంకు బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద తహసీల్దార్ విజయారెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోలు పోసి నిప్పు అంటించిన ఘటనలో ఆమెను కాపాడబోయి మంటల్లో కాలి గాయాలైన కారు డ్రైవర్ కామళ్ల గురునాథం అలియాస్ గురుపాదం (29) చాంద్రాయణగుట్ట అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందాడు. మండలంలోని వెలిదండ గ్రామానికి చెందిన కామళ్ల బ్రహ్మయ్య, రమణమ్మ పెద్ద కుమారుడు గురునాథం బతుకు దెరువు కోసం ఏడేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. సుతారి పనిచేస్తూ డ్రైవింగ్ నేర్చుకుని విజయారెడ్డి వద్ద ఐదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. విజయారెడ్డి కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉంటూ అక్కా అని విజయారెడ్డిని పిలిచేవాడు. ఆమెతో చాలా ఆప్యాయంగా ఉండేవాడు. మంటల్లో ఆమె చిక్కుకున్న సమయంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్షించే ప్రయత్నం చేశాడు. దాంతో ఆయన కూడా 75 శాతం కాలిపోయాడు. గాయపడిన గురునాథాన్ని చికిత్స కోసం హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం తుదిశ్వాస విడిచారు. కాగా గురునాథంకు భార్య సౌందర్యతో పాటు ఏడాదిన్నర పాప ఉంది. భార్య ప్రస్తుతం గర్భవతి. గ్రామంలో మిన్నంటిన రోదనలు గురునాథం మరణవార్త విని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గురువారం ఇంటి వద్ద తల్లి రమణ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గురునాథం ఇంటి వద్దకు బంధువులు, స్నేహితులు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన ఎంతో నమ్మకస్తుడని కొనియాడారు. మండల ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ పోరెడ్డి శైలజరవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, సర్పంచ్ ఆదూరి పద్మ, ఎంపీటీసీ ములకలపల్లి విజయతో పాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గురునాథం ఇంటి వద్ద గరిడేపల్లి ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పరామర్శించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి... గురునాథం మృతదేహాన్ని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. సోమవారం జరిగిన ఘటనలో తహసీల్దార్ విజయారెడ్డి, గురునాథం మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. బాధితుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతికి సంతాపం... గ్రామానికి చెందిన యువకులు పాఠశాలకు చేరుకుని గురునాతం మృతికి సంతాపంగా నల్లబ్యాడ్జీలు ధరించి, మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సీవీ రాము, బాలస్వామి, ఉపాధ్యాయులు బుచ్చారావు, కేవీ సత్యనారాయణ, కళావతి, ప్రశాంతి, సువర్ణ, రంగయ్య, లక్ష్మయ్య, రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, చంద్రకళ, నవ్య, గ్రామ యువకులు నాగరాజు, గోపి, శేఖర్ పాల్గొన్నారు. -
ఇదో రకం...‘భూకంపం’
సాక్షి, హైదరాబాద్: స్వాదీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డుల్లో పేరుంటేనే భూ హక్కుకి భద్రత. రాష్ట్రంలో అలా ఉన్న భూ యజమానులు పది శాతంలోపే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అదే భూ రికార్డుల ప్రక్షాళన. సమస్యలన్నీ వెలికి తీసే ప్రయత్నం చేసింది. ఆచరణలో హడావుడి ప్రదర్శించింది. అయితే రెండేళ్లయినా.. భూ రికార్డుల నవీకరణ కొలిక్కిరాలేదు. అన్ని సమస్యలు పరిష్కారం కాకపోగా.. అపరిష్కృత సమస్యలు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతిమంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షిత కౌలుదారు, ఇనాం, సీలింగ్ చట్టాలపై స్పష్టత లేకపోవడంతో రైతులను తహసీల్దార్ల చుట్టూ తిరిగేలా చేస్తోంది. సాంకేతిక సమస్యలు సరేసరి. ఇటు రైతులు.. అటు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ వ్యవహారం పలువురి ప్రాణాల మీదకు తెస్తోంది. చిక్కుముడిగా ‘పార్ట్–బీ’ వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం వాటికి పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేయలేదు. ఈ జాబితాలో చేర్చిన భూములకు రైతుబంధు కూడా నిలిపేసింది. పెట్టుబడి సాయానికి పాస్‌బుక్కును ప్రాతిపదికగా తీసుకోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,43,983 ఖాతాల్లోని సుమారు 4 లక్షల ఎకరాల మేర భూములను పరిగణనలోకి తీసుకోలేదు. పార్ట్–బీ కేటగిరీలో కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు–పట్టా భూముల మధ్య వివాదాస్పదమైనవి ఇందులో నమోదు చేసింది. భూ రికార్డుల నవీకరణకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడం, ఖరీఫ్‌లోపు కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేసి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలనే ఒత్తిడి మూలంగా క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించలేదు సరికదా ఎవరైనా అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ ఇస్తే చాలు పార్ట్–బీలో చేర్చింది. ఇదే ఇప్పుడు రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఎడిట్‌కు అనుమతి ఇవ్వకపోవడం, ఒకసారి నమోదు చేసిన తర్వాత మార్పులు, చేర్పులు చేసే అధికారం లేకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ప్రతి చిన్నదానికి జేసీకి అప్పీల్‌కు చేసుకోవాల్సిరావడంతో కుప్పలు తెప్పలుగా ఫైళ్లు పేరుకుపోయాయి. రెండేళ్ల తర్వాత మేలుకున్న ప్రభుత్వం ఇటీవలనే ఆర్డీఓలకు ఎడిట్ ఆప్షన్ ఇచి్చంది. పారాచూట్‌లా.. వాలారు! భూ రికార్డుల గందరగోళంలో ప్రధాన పాత్ర వక్ఫ్, దేవాదాయ, భూదాన్ బోర్డు, అటవీ శాఖలదే. ఇన్నాళ్లు కనీసం గ్రామ, మండలం, జిల్లా స్థాయిల్లో రికార్డులను అప్డేట్ చేయని ఈ విభాగాలు భూ రికార్డుల ప్రక్షాళన మొదలుకాగానే.. బూజుపట్టిన గెజిట్ నోటిఫికేషన్లతో వాలాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతాంగాన్ని కాదని.. ఈ భూమి తమదేనని పేచీ పెట్టాయి. చట్ట ప్రకారం ఈ భూమి ఆయా విభాగాలకే చెందుతుందని 22 (ఏ) కేటగిరీలో (ప్రభుత్వ భూములుగా) నమోదు చేసింది. ఇన్నాళ్లు తమ అ«దీనంలో ఉన్న భూమిని తన్నుకుపోవడంతో దిక్కుతోచని రైతాంగం తహశీల్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఇక సాంకేతిక లోపాలు కూడా రికార్డుల ప్రక్షాళనకు చెడ్డపేరు తెచి్చపెట్టాయి. తప్పుల తడకగా నమోదు చేసిన పేర్లను సవరించే వెసులుబాటు లేకపోవడం.. మ్యుటేషన్ జరిగినా... మూడు నెలల వరకు పాస్‌బుక్ చేతికి రాకపోవడం కూడా చికాకు కలిగించింది. నాలుగేళ్లుగా పహణీలోకి ఎక్కించడం లేదు.. ‘1981లో శివలింగం రామయ్య వద్ద నుంచి సర్వే నం.689, 690/2లలో 2.19 ఎకరాలను కొన్నాం. అప్పటినుంచి సాగు చేస్తున్నాం. 2009లో నాన్న చౌకి బాలయ్య నుంచి నా పేరిట మారి్పడి చేసుకున్నాను. పాస్ పుస్తకం వచి్చంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా విదేశాలకు వెళ్లి వస్తున్నాను. భూమి ఎక్కడికి పోతుందనే ఉద్దేశంతో భూమి వద్దకు వెళ్లి చూడలేదు. 2010లో 689 సర్వేనంబర్‌లో 1.04 ఎకరాల భూమిని సదాశివనగర్‌కు చెందిన సుతారి రాజమణి పేరు మీద సాదాబైనామా చేసినట్లు ఉంది. అదే 690/2 సర్వే నంబర్లో 1.15 ఎకరాలను సుతారి సుధాకర్ పేరు మీద పట్టా చేశారు. ఈ భూమిని నా పేరు మీదికి మార్చాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కొన్నాళ్లుగా తిరుగుతున్నాను. పాస్ పుస్తకమున్న పహణీలోకి ఎక్కించడం లేదు. సమస్యను జేసీకి వివరించినా రికార్డుల్లో సరిచేయడం లేదు.’ – చౌకి భాస్కర్, సదాశివనగర్, కామారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన కనువిప్పు కావాలి సమస్యలకు పరిష్కారం.. చంపడమో, చావడమో కాకూడదు. భూ సమస్యల పరిష్కారానికి, మెరుగైన భూపరిపాలన కోసం తక్షణ చర్యలు అవసరం. అలా జరగకపోతే, రైతుల కష్టాలు తీరవు. రెవెన్యూ ఇక్కట్లు తొలగవు. ఏ భూరికార్డు భూమిపై హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యం కాదు. ఏ భూమి రికార్డునైనా ఎప్పుడైనా సవరించవచ్చు. భూమి హద్దులు తెలిపే పటాలు లేవు. ఉన్న భూములకు హద్దు రాళ్లు లేవు. భూ సమస్యలపై ఎవరిని కలవాలి.. ఎంతకాలంలో ఆ సమస్యను పరిష్కరించాలి అనే విషయాలపై స్పష్టత లేదు. అపరిష్కృత భూ సమస్యలకు ఎన్నో కారణాలు.. అన్ని కోణాలు చూడాలి.. సమస్యకు సమగ్ర పరిష్కారం వెతకాలి. భూమి సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషాద ఘటనలు, హత్యలకు కూడా దారితీస్తున్న దుర్ఘటనలు.. మరోపక్క తీవ్ర ఒత్తిడిలో రెవెన్యూ యంత్రాంగం. ఇకనైనా పరిష్కారాలపై చర్చ జరగాలి. అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన ఒక కనువిప్పు కావాలి. – ఎం.సునీల్ కుమార్, భూచట్టాల నిపుణుడు, న్యాయవాది క్రమబద్ధీకరణతో వివాదాలకు ఫుల్స్టాప్ భూ రికార్డుల ప్రక్షాళనతో ప్రభుత్వం తేనె తుట్టెను కదిలించింది. రికార్డుల నవీకరణ కంటే ముందు సమగ్ర భూసర్వే చేస్తే ఈ సమస్యలు వచ్చేవి కావు. దేవాదాయ, వక్ఫ్, అటవీ, భూదాన్ బోర్డులు ఇన్నాళ్లు తమ భూములెక్కడ ఉన్నాయో పట్టించుకోకుండా.. ఒకేసారి ఈ భూములన్నీ మావేనని వాదించడం అత్యధిక వివాదాలకు కారణం. దశాబ్దాలుగా ఆ భూమిని అనుభవిస్తూ... పాస్బుక్కు కలిగి ఉన్నవారిని కాదని.. 22(ఏ)లో ఆ భూమిని చేర్చడం ఎంతవరకు న్యాయం. ఈ సమస్యకు పరిష్కారం ఒకటే. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారి పేరిట క్రమబద్ధీకరిస్తే.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.. రైతాంగానికి లాభం కలుగుతుంది. – సురేశ్ పొద్దార్, జాయింట్ కలెక్టర్ (రిటైర్డ్) రికార్డుల ప్రక్షాళనలో ఒత్తిడి ఎక్కువైంది.. రికార్డుల ప్రక్షాళన మొదలైన నుంచి రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగింది. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరిగినప్పటికీ సమయం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రక్షాళనకు డెడ్లైన్లు విధించడంతో సిబ్బంది ఒత్తిడికి గురయ్యారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లడానికి సరిపడా సమయం దొరకలేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది చెప్పిందే వినాల్సి వచి్చంది. రికార్డులో సాదాబైనామాలకు సంబంధించి తప్పుడు కాగితాలతో చాలా మంది భూములను తమపేరిట నమోదు చేయించుకునే ప్రయత్నాలు చేశారు. దానికి తోడు రాజకీయ జోక్యం కూడా ఉండటం ఒత్తిడిని పెంచింది. – సత్తయ్య, జాయింట్ కలెక్టర్ (రిటైర్డ్) సమస్యకు పరిష్కారాలు.. సమగ్ర భూ సర్వే జరగాలి. భూచట్టాలను సమీక్షించి ఒక సమగ్ర రెవెన్యూ కోడ్‌ను రూపొందించాలి. టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలి. భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో భూరికార్డుల సవరణ చేయాలి. భూ సమస్యలున్న పేదవారికి సహాయం చేసే పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను కొనసాగించాలి. -
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు
దిల్సుఖ్నగర్/నాగోలు/మన్సూరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి అంతిమయాత్ర శోకసంద్రమైంది. మంగళవారం ఆర్కేపురం వాసవి కాలనీ లక్ష్మీ అపార్ట్మెంట్ నుంచి నాగోల్‌లోని శ్మశాన వాటిక వరకు ఐదు గంటలపాటు సాగిన అంతిమయాత్రలో దారి పొడవునా కన్నీటి నిరసనలు కనబడ్డాయి. పోలీసుల బందోబస్తు మధ్య అంతిమయాత్రలో భారీ సంఖ్యలో బంధువులు, రెవెన్యూ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయారెడ్డికి నివాళులర్పించారు. విజయారెడ్డి కుమారుడు భువనసాయి, కుమార్తె చైత్ర ఉన్నా చిన్నవాళ్లు కావడంతో భర్త సుభా‹Ùరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ దగ్గరుండి అంత్యక్రియలు ముగిసే వరకు పర్యవేక్షించారు. విజయారెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నాగోలు శ్మశాన వాటికలో నిర్వహించారు. రాస్తారోకో... స్వల్ప ఉద్రిక్తత... అల్కాపురి చౌరస్తాలో రెవెన్యూ ఉద్యోగులు మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. విజయారెడ్డి మృతదేహంతో ఒక్కసారిగా రెవెన్యూ ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చి రాస్తారోకో నిర్వహించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కమిషనర్ మహేశ్ భగవత్, జాయింట్ సీపీ సురేందర్‌బాబు, ఇతర పోలీస్ అధికారులు రెవెన్యూ ఉద్యోగులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. విజయారెడ్డికి గౌరవ వందనంగా తుపాకులను గాలిలోకి కాలుస్తున్న చేస్తున్న పోలీసులు ఉదయం ఏడు గంటల నుంచే... రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రెవెన్యూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పారీ్టల నేతలు మంగళవారం ఉదయం 7 గంటలకే విజయారెడ్డి నివాసానికి చేరుకొని అమె మృతదేహానికి నివాళులర్పించారు. ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయారెడ్డి అంతిమ యాత్రలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జిట్టా బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలి: రేవంత్ విజయారెడ్డి సజీవదహనం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మేజి్రస్టేట్ అధికారాలున్న అధికారిపై దాడి చేయడం దారుణమని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయని మండిపడ్డారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి... విజయారెడ్డి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉద్యోగులకు భద్రత కలి్పంచాలని కోరారు. విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందని, దీన్ని తేల్చాల్సిన అవసరముందని అన్నారు. అండగా ఉంటాం: మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి విజయారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇది ఉన్మాదంతో ఒక వ్యక్తి చేసిన పని. ఇలాంటి ఘటన ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్‌లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఉన్నచోట్ల ప్రత్యేక చర్యలు చేపడతాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: లచ్చిరెడ్డి విజయారెడ్డి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ తహసీల్దార్ల వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. 3 రోజులు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. త్వరలోనే పూర్తి కార్యాచరణ విడుదల చేస్తామని అన్నారు. విజయారెడ్డి కుటుంబానికి అండగా ఉందాం : రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అమానుష హత్యను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఖండించారు. మృతురాలి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ఘటన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి భద్రత కలి్పంచేలా వెంటనే చర్యలు చేపట్టాలని సోమేశ్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లాల కలెక్టర్లకు సందేశం పంపారు. కాగా,తహసీల్దారు సజీవ దహనంపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం (టీఎస్ఐఏఎస్) ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రభుత్వం విజయారెడ్డి కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరింది. ప్రజాసేవలో అధికారులు ధైర్యంగా పనిచేయాలంటే నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించింది. అఖిలపక్షం నిర్వహించాలి: చాడ సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన నేపథ్యంలోనైనా వెంటనే రెవెన్యూ నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో భేటీ ఏర్పాటు చేసి రెవెన్యూ చట్టాలు, భూరికార్డుల్లో మార్పులకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జాప్యం జరిగే కొద్దీ ఉద్యోగులు, ప్రజల మధ్య అంతరాలు పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని, ఇది సమాజానికి మంచిదికాదని మంగళవారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నేడు నల్లబ్యాడ్జీలతో నిరసనలు సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిస్తూ, రెవెన్యూ ఉద్యోగులకు సంఘీభావంగా బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్టు అటవీశాఖలోని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. మంగళవారం అరణ్యభవన్‌లో జరిగిన సమావేశంలో స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్, మినిస్టీరియల్ స్టాఫ్, డ్రైవర్లు, క్లాస్–4 ఉద్యోగుల సంఘాలు తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపం తెలిపాయి. విధుల బహిష్కరణ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మంగళవారం రెవెన్యూ, ఇతర ఉద్యోగ సంఘాలు విధులు బహిష్కరించాయి. విధి నిర్వహణలో అసువులుబాసిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఒక్కడి పనేనా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తహసీల్దార్‌పై పథకం ప్రకారం పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడు కూర సురేశ్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? హత్యకు కుట్రను అతను ఎవరితోనైనా పంచుకున్నాడా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సురేశ్ మొబైల్ కాల్‌డేటాను విశ్లేషిస్తున్నారు. హత్యకు ముందు సురేశ్ తన పెదనాన్న దుర్గయ్యతోపాటు పలువురు బంధువులు, స్నేహితులతో మాట్లాడినట్లు గుర్తించారు. మరోవైపు ఈ వ్యవహారంలో సురేశ్ పెదనాన్న దుర్గయ్య పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేశ్‌కు ఎలాంటి మానసిక రుగ్మతల్లేవని గ్రామస్తులంతా చెబుతుంటే దుర్గయ్య, కుటుంబ సభ్యులు మాత్రం అతనికి మతిస్థిమితం లేదని, రియల్టర్ అని, వివాదంతో సంబంధమే లేదని పొంతనలేని సమాధానాలు చెప్పడం వెనుక దురుద్దేశం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సురేశ్ కుటుంబానికి 1998లోనే ఆర్.ఓ.ఆర్ కింద పాసు పుస్తకాలు మంజూరయ్యాయని స్థానికులు చెబుతుండటంతో ఈ వ్యవహారంతో సురేశ్‌కు సంబంధం లేదని కుటుంబ సభ్యులు చెప్పడంపై సందేహపడుతున్నారు. సురేశ్ వెనక బంధువులు ఎవరైనా ఉన్నారా? అనే విషయంపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. -
తహసీల్దార్ కారు డ్రైవర్ మృతి
పెద్ద అంబర్‌పేట: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత ఆమెను కాపాడే యత్నంలో మంటలంటుకొని తీవ్రంగా గాయపడిన ఆమె కారు డ్రైవర్ గురునాథం (27) చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయారెడ్డిపై నిందితుడు సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఘట నా స్థలంలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో ఆమె కారు డ్రైవర్ గురునాథానికి మంటలంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను డీఆర్డీఎల్లోని అపోలో ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెం దినట్లు పోలీసులు తెలిపారు. గురునాథం స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామం. విజయారెడ్డి వద్ద నాలుగేళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురునాథంకు భార్య, ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య ఎనిమిది నెలల గర్భిణి. గురునాథం మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు సురేష్ అరోగ్య పరిస్థితి విషమం తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడు సురేష్‌కు ఉస్మానియా ఆస్పత్రిలోని ప్లాస్టీక్ సర్జరీ విభాగంలో పోలీసుల సంరక్షణలో చికిత్స కొనసాగుతోంది. కాగా 65 శాతం కాలడంతో సురేష్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు చూడడానికి బంధువులుగానీ, స్నేహితులుగానీ ఎవ్వరూ రాలేదని ఆçస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్స పొందుతున్న మరో ఇద్దరు... తహసీల్దార్‌కు నిప్పంటించిన ఘటనలో గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోనే అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రయ్యకు కూడా గాయపడటంతో డీఆర్డీఎల్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి శరీరం 50 శాతం మేర కాలినట్లు పోలీసులు తెలిపారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం. అదేవిధంగా తన భూ సమస్య పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన కవాడిపల్లికి చెందిన బొడిగె నారాయణగౌడ్‌కు కూడా గాయాలైన విషయం తెలిసిందే. అయితే ఆయనను హయత్‌నగర్‌లోని టైటాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఉద్యోగం కల్పించండి: సౌందర్య విధి నిర్వహణలో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్ధార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన డ్రైవర్ గురునాథం భార్య సౌందర్య తనకు ఉద్యోగం కల్పించాలని కోరారు. తన, పిల్లల భవిష్యత్ కోసం ఉద్యోగం కల్పించి, దళితులకు కేటాయించిన 3 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. -
ఎమ్మార్వో హత్య కేసు : నిందితుడి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అతని ఒంటిపై 65 శాతం కాలిన గాయాలు ఉన్నాయని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సంరక్షణలో ఉస్మానియా మెయిల్ బర్నింగ్ వార్డులో నిందితుడు చికిత్స పొందుతున్నాడు. నిందితుడి నుంచి మెజిస్ట్రేట్ డీడీ డిక్లరేషన్ నివేదిక తీసుకున్నారు. 74 గంటలు దాటితే తప్ప సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సురేష్ న్యూరో బర్న్ షాక్‌లో ఉన్నట్టు తెలిపారు. మరో 24 గంటలు దాటితే సురేష్ స్కిన్ బర్న్ సెప్టిక్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉందని తెలిపారు. ఉస్మానియా వైద్యులు పోలీసుల సమక్షంలో ఫ్లూయిడ్స్ ఇస్తూ.. చికిత్స అందిస్తున్నారు. -
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు..
-
సజీవదహనం: తాపీగా నడుచుకుంటూ వెళ్లిన సురేష్
-
సజీవదహనం: తాపీగా నడుచుకుంటూ వెళ్లిన సురేష్
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. కేసు దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ ఘటనాస్థలంలో శాంపిల్స్‌ను సేకరించింది. దీంతోపాటు తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉన్న హాస్టల్లోని సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు సేకరించారు. నిందితుడు సురేష్ కాలిన గాయాలతో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను ఈ సీసీటీవీ కెమెరా నమోదుచేసింది. తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన అనంతరం కాలిన గాయాలతో నిందితుడు సురేష్ తాపీగా నడుచుకుంటూ వెళుతున్నట్టు ఈ దృశ్యాలలో కనిపిస్తోంది. ఇప్పటికే సేకరించిన శాంపిల్స్, వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు పంపించారు. తహసీల్దార్ చంపేందుకు సురేష్ కిరోసిన్‌లో పెట్రోల్ కలిపి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే విజయారెడ్దిని కూర సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి.. పట్టపగలే అమానుషంగా సజీవం దహనం చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో ఆ వ్యక్తి ఈ దుర్మార్గానికి ఒడిగడ్డాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబడ్డ కూర సురేశ్... రెప్పపాటులోనే విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో గురునాథ్ మంగళవారం ప్రాణాలు విడిచాడు. -
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్ శ్మశాన వాటికలో పూర్తయాయి. విజయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూశాఖ ఉద్యోగులు, స్థానికులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం నాగోల్ శ్మశాన వాటికలో విజయారెడ్డి భౌతికకాయానికి భర్త సుభాష్‌రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించి.. అంత్యక్రియలు పూర్తి చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే విజయారెడ్దిని కూర సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి.. పట్టపగలే అమానుషంగా సజీవం దహనం చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో ఆ వ్యక్తి ఈ దుర్మార్గానికి ఒడిగడ్డాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబడ్డ కూర సురేశ్... రెప్పపాటులోనే విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో గురునాథ్ మంగళవారం ప్రాణాలు విడిచాడు. విజయారెడ్డికి భర్త సుభాష్‌తోపాటు ఇద్దరు చిన్నపిల్లలు.. అమ్మాయి(10), అబ్బాయి(5) ఉన్నారు. తల్లి మరణంతో పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. -
మరో ఇద్దరు కూడా వచ్చారు: ప్రత్యక్ష సాక్షి
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి, రైతు నారాయణ ప్రస్తుతం హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివాదాస్పద భూమి పట్టా విషయమై సురేశ్ అనే రైతు విజయారెడ్డిని ఆమె కార్యాలయంలో సజీవదహనం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో అక్కడే ఉన్న నారాయణ అనే రైతుకు కూడా తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన తన ఇద్దరు కుమారులతో ఘటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘ నేను ఎమ్మార్వోతో మాట్లాడుతుండగానే ముగ్గురు వ్యక్తులు గదిలోకి వచ్చారు. దీంతో నన్ను కాసేపు బయట ఉండమని ఎమ్మార్వో చెప్పడంతో నేను గది ముందే వేచి చూస్తున్నాను. కొద్ది సేపటికే ఎమ్మార్వో విజయ మంటలతో బయటకు పరుగులు పెట్టారు. తలుపు దగ్గరే ఉన్న నాకు తీవ్ర గాయాలయ్యాయి అని నారాయణ పేర్కొన్నాడు. కాగా విజయారెడ్డి హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి నారాయణ నుంచి మెజిస్ట్రేట్ వాంగ్మూలం సేకరించారు. ఈ నేపథ్యంలో నారాయణ చెబుతున్న ప్రకారం సురేశ్‌తో పాటు మరో ఇద్దరు కూడా కార్యాలయానికి వచ్చారన్న విషయం స్పష్టమైంది. పోలీసులు ఈ కోణంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా నాగోల్‌లోని శ్మశాన వాటికలో విజయారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. -
విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి..
-
‘అధికారులకు అలా జరగాల్సిందే..’
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్‌పూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య అనంతరం.. గౌరెల్లి గ్రామంలోని 412 ఎకరాల భూ వివాదం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సంచలనం రేపుతున్న ఈ హత్య గురించి ఓ రాజకీయ నేత గౌరెల్లి గ్రామానికి చెందిన రైతుతో మాట్లాడారు. వారిద్దరి సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ భూములు తాతల కాలం నాటివని.. అందులో 7 ఎకరాలు విజయారెడ్డిపై దాడికి పాల్పడ్డ సురేశ్ కుటుంబానికి చెందినవని గౌరెల్లి రైతు సదరు రాజకీయ నేతతో అన్నారు. ఇది రజకార్లు ఉన్నప్పుడు కొన్న భూమి అని.. దీని కోసం దాదాపు 1950 నుంచి కొట్లాడుతున్నామని తెలిపారు. ఎన్నో ఎళ్లుగా వాటిని కాజేయాలని చాలా మంది యత్నించారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారిన సమస్య మాత్రం తీరలేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లు నకిలీ పత్రాలు సృష్టించి భూములు కాజేసేందుకు యత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూముల కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఈ భూములు రైతులకు ఇప్పిస్తానని చెప్పి.. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వారి వద్ద నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. అందులో సురేశ్ కుటుంబానివి కూడా 2 నుంచి 3 లక్షల రూపాయలు ఉంటాయని చెప్పారు. రాజకీయ నేతతో రైతు జరిపిన సంభాషణ.. అలాగే పై అధికారులకు కూడా అలా జరగాల్సిందేనని సదరు రైతు అన్నారు. అయితే గౌరెల్లికి చెందిన రైతుతో మాట్లాడుతున్న సమయంలో సదరు రాజకీయ నేత కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద అంబర్‌పేటలో కూడా ఇలాగే 402 ఎకరాల భూమి ఉందని అన్నారు. 1955లో అక్కడి రైతులు ఈ భూములను కొనుగోలు చేశారని.. 1976 వరకు వారి పేర్లపైనే పట్టాలు ఉన్నాయని.. ఆ తర్వాత పేరు మార్చారని.. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉందని తెలిపారు. ఈ వివాదాన్న వెనకనుంచి ఓ ప్రముఖ నాయకుడి కుమారుడి నడిపిస్తున్నాడని ఆరోపించారు. అయితే చివర్లో ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించేలా పోరాటం రెండు గ్రామాల రైతులు చేసేలా చూడాలని వారి ఇరువురు అనుకున్నారు. -
గురునాథం మృతి.. అయ్యో పాపం భార్యాబిడ్డలు
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డి దారుణ హత్య నేపథ్యంలో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్ కామళ్ల గురునాథం మంగళవారం మృతి చెందాడు. సోమవారం రైతు దాడిలో అగ్నికి ఆహుతైన విజయారెడ్డిని రక్షించేందుకు గురునాథం తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో అతడికి కూడా నిప్పు అంటుకోవడంతో దాదాపు 85 శాతం శరీరం కాలిపోయింది. దీంతో గురునాథాన్ని అపోలో డీఆర్డీఎల్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు మరణించాడు. కాగా విజయారెడ్డి డ్రైవర్ గురునాథం స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామం. అతడికి భార్య, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. ప్రస్తుతం గురునాథం భార్య ఏడు నెలల గర్భిణి. ఇక గురునాథం మరణవార్త తెలిసిన నేపథ్యంలో ఆయన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయ్యో పాపం అంటూ పలువురు అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహమైన విషయం విదితమే. రైతు సురేశ్ పెట్రోల్‌తో చేసిన దాడిలో తొలుత మరణించింది ఎవరో అర్థంకాక సిబ్బంది అయోమయానికి గురయ్యారు. తహశీల్దార్ గది వెనుక కిటికీలోంచి చూస్తే ఆమె కనిపించకపోయే సరికి భయంతో అని కేకలు పెట్టారు. ఈ క్రమంలో మరొక వ్యక్తి వచ్చి విజయారెడ్డి చేతికి ఉన్న వాచీని చూసి ఆమెను తహశీల్దార్‌గా గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక విజయారెడ్డిని కాపాడేందుకు ఆమె కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య ముందుకురాగా వారు సైతం మంటల్లో కాలిపోయారు. దీంతో వారిని కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గురునాథ్ మంగళవారం మరణించగా.. చంద్రయ్య 50 శాతం కాలిన గాయాలకు చికిత్స పొందుతున్నాడు. -
అందుకే విజయారెడ్డిని హత్య చేశాను: సురేశ్
సాక్షి, రంగారెడ్డి : వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ తెలిపాడు. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే సురేశ్ అగ్నికి ఆహుతి చేసిన విషయం విదితమే. సోమవారం జరిగిన ఈ ఘటనలో 60 శాతం గాయాలపాలైన సురేశ్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో వైద్యుల సమక్షంలో పోలీసులు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వోను ఎన్నో రోజులుగా... ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లానని... మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో తనకు నిప్పంటించుకుని విజయారెడ్డిని కూడా తగులబెట్టానని పేర్కొన్నాడు. కాగా విజయారెడ్డి దారుణ హత్యపై తీవ్రంగా స్పందించిన రెవెన్యూ ఉద్యోగులు మృతదేహానికి నివాళులు అర్పించేందుకు భారీ ఎత్తున ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. హత్య వెనుక ఉన్న మాఫియా ఆగడాలను బయటపెట్టి... వారిని కఠినంగా శిక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి : మహిళా తహసీల్దార్ సజీవ దహనం) ఆ భూమి విలువ రూ. 40 కోట్లు బాచారంలోని దాదాపు 412 ఎకరాల భూమి గత 70 ఏళ్లుగా వివాదాల్లో కూరుకుపోయింది. మహారాష్ట్రకు చెందిన రాజా ఆనందరావు పేరిట ఉన్న ఈ భూమిలో 130 ఎకరాల భూమిని... రాష్ట్ర ప్రభుత్వం భూప్రక్షాళన అనంతరం అతడు తమకు విక్రయించాడని సయ్యద్ యాసిన్ వారసులు తెరపైకి వచ్చారు. కాగా వివాదంలో ఉన్న ఆ భూమిని పలు కుటుంబాలు ఇప్పటికే సాగు చేసుకుంటున్నాయి. ఇందులో నిందితుడు సురేష్ కుటుంబం కూడా ఉంది. ఈ క్రమంలో తమకు చెందిన భూమిని వేరొకరికి బదిలీ చేశారంటూ రైతు కుటుంబాలు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ భూమి ఉండటంతో కబ్జాదారులు దీనిని చేజిక్కించుకునేందుకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. ఈ భూకబ్జాలో పలువురు రాజకీయ నేతల హస్తం కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిందితుడు సురేష్ తనదిగా పేర్కొంటున్న భూమి మార్కెట్ విలువ సుమారు 40 కోట్ల రూపాయలని సమాచారం. -
పిల్లలు అన్యాయం అయిపోయారు
-
పెట్రోల్ పోసి.. నిప్పంటించి..
-
‘నా భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి తన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురికావడంతో ఆమె భర్త సుభాష్‌రెడ్డి కన్నీరు మున్నీరవుతున్నారు. తన భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆయన రోదిస్తున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. హత్య చేసిన వాళ్ల వెనకాల భూ కబ్జాదారులు ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వం విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. తన ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ఆఫీస్‌లో ఒత్తిడిని ఇంట్లో కనిపించనిచ్చేది కాదని గుర్తుచేసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి బదిలీ కోసం చాలా ప్రయత్నించిందని.. అలా జరిగి ఉంటే ఆమె బతికి ఉండేదని అన్నారు. కాగా, విజయారెడ్డి ఆమె కార్యాలయం లోనే సోమవారం హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. విజయారెడ్డి దంపతులకు కుమార్తె చైత్ర (10), కుమారుడు భువనసాయి (5) ఉన్నారు. విజయరెడ్డి మృతితో రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆందోళనలకు పిలుపునిచ్చారు. విజయారెడ్డి హత్యపై పోలీసులు దార్యప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయారెడ్డి ఇంటి వద్ద విషాదఛాయలు తహసీల్దార్ విజయారెడ్డి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణంతో భర్త సుభాష్‌రెడ్డి, అత్త, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి ఎక్కడ అని అడుగుతున్న చిన్నారులకు.. అర్దరాత్రి దాటిన తరువాత కుటుంబ సభ్యులు విజయారెడ్డి మరణవార్తను చెప్పారు. పిల్లలు ఎక్కడ భయభ్రాంతులకు గురవుతారనో భయంతో.. కుటుంబ సభ్యులు వారిని తల్లి మృతదేహానికి దూరంగా ఉంచారు. ఆర్టీసీ జేఏసీ నివాళి.. విజయారెడ్డి మృతదేహానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌గా విజయారెడ్డికి మంచి పేరు ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై ఇలాంటి దాడులు జరగడం బాధకరమని తెలిపారు. నేడు అంత్యక్రియలు.. ఎమ్మార్వో విజయారెడ్డి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు నాగోల్ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. చదవండి : మహిళా తహసీల్దార్ సజీవ దహనం డాడీ.. మమ్మీకి ఏమైంది? -
మూడు రోజులు విధుల బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ పిలుపునిచ్చారు. మహిళా అధికారిని హత్య చేయడం అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని ఓ ప్రకటనలో ఖండించారు. విజయారెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు రెవెన్యూ ఉద్యోగులంతా హైదరాబాద్ తరలిరావాలని కోరారు. నిందితుల వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, మహిళా ఉద్యోగులకోసం రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలి: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తహసీల్దార్ విజయారెడ్డి దారుణహత్యకు గురికావడం దురదృష్టకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్‌రెడ్డి, వి.మమత అన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల పెన్షనర్లు, కారి్మకుల ఐక్యత కార్యాచరణ సమితి ప్రగాఢ సానుభూతి తెలిపింది. -
రెవెన్యూలో భయం.. భయం!
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే ఓ మహిళాధికారి దారుణహత్యకు గురికావడం రాష్ట్ర ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. తహసీల్దార్ విజయారెడ్డిని ఆమె పనిచేస్తున్న చోటే సజీవదహనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణమేదైనా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఆందోళనకు గురైంది. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు, నిందలతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం తాజా ఘటనతో మరింత ఆందోళనకు లోనైంది. విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ సంఘాల నేతలు ఘటనను తీవ్రంగా ఖండించడంతోపాటు విధులను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చినా.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తీవ్ర ఒత్తిడితో పాటు బదిలీపై వెళ్లి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందన్న మనస్తాపంతో నెల కింద నిజామాబాద్ తహసీల్దార్ జ్వాలాగిరిరావు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉద్యోగవర్గాలను కలవరపరిచింది. ఈ ఘటన మరువక ముందే ఇప్పు డు మహిళా తహసీల్దార్‌ను ఏకంగా హత్య చేయడం రెవెన్యూ వర్గాలను కలవరపరుస్తోంది. ఎవరికీ తెలియలేదు.. మండలాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ కార్యాలయంలో విధి నిర్వహణలో తలమునకలైన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారిపై సులువుగా దాడి జరగడానికి భద్రతా లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తహసీల్దార్ గదికి రానుపోను ఒకే ద్వారం ఉండడం, మిగతా సిబ్బంది గదులకు దూరంగా, వేరుగా ఉండటంతో తహసీల్దార్ రూమ్‌లో ఎవరున్నారనేది కూడా గమనించలేని పరిస్థితి ఉంది. సోమవారం తహసీల్దార్ ఉండే గది లోపలికి నిందితుడు వెళ్లి గడియ వేసుకున్నా.. ఆమెతో వాగి్వవాదానికి దిగినా.. ఆఖరికిపై ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టినా వెలుపల హాల్లో పనిచేసేవారికి తెలియలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి విజయారెడ్డికి నిప్పంటించే క్రమంలో కాలిన గాయాలతో భరించలేక నిందితుడు గడియ తీసుకొని బయటకు పరుగులు తీస్తే కానీ, లోపలేం జరిగిందో తెలియని అయోమయం నెలకొంది. ప్రైవేటు సెక్యూరిటీని కూడా నియమించుకోకపోవడం.. తహసీల్దార్‌ను కలిసిన సమయంలో అక్కడే ఉండాల్సిన సిబ్బంది లేకపోవడం కూడా ఘటనకు ఊతమిచ్చింది. రికార్డుల నవీకరణతో సతమతం.. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు రెవెన్యూ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రికార్డుల నవీకరణ అనంతరం రెవెన్యూ ఉద్యోగులపై పనిభారమే కాకుండా ఒత్తిడీ పెరిగిపోయింది. ముఖ్యంగా చాలాచోట్ల క్షేత్రస్థాయి పరిస్థితులకు, రికార్డులకు పొంతన కుదరకపోవడంతో వివాదాలు పెరిగిపోయాయి. సాంకేతిక సమస్యలు, కౌలుదారులు, పట్టాదారులు, సోదరులు, కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, ప్రభుత్వ భూములుగా తేలిన వంటి వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పక్కనపెట్టడంతో రెవెన్యూ ఉద్యోగులే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే అపవాదు ఎదుర్కొంటున్నారు. కబ్జా కాలమ్‌ను ప్రభుత్వం తొలగించడం రెవెన్యూ యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారింది. న్యాయపరమైన వివాదాలపై అర్జీదారులను సముదాయించినా.. సమాధానం చెప్పినా.. శాంతించకపోవడంతో రెవెన్యూ వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ధరణి సాఫ్ట్వేర్ లోపాలూ వీరిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజాయారెడ్డి హత్యపై ప్రభుత్వం విచారణకుఆదేశించింది. -
తహశీల్దార్ సజీవ దహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: డాడీ.. మమ్మీకి ఏమైంది? ఇంటికి ఎప్పుడొస్తుంది? ఇప్పుడు వీళ్లంతా (బంధువులు) మన ఇంటికి ఎందుకొచ్చారు? అంటూ ఏడుస్తూ అమాయకంగా ఆ పసి హృదయాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తండ్రి సుభాశ్‌రెడ్డి సహా బంధువులంతా పిల్లలను గుండెలకు హత్తుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి విజయారెడ్డికి ఏం జరిగిందో తెలియక ఆ చిన్నారులు గుక్కపెట్టి ఏడుస్తుండటం అక్కడి వారిని తీవ్రంగా కలచి వేసింది. విజయారెడ్డి దంపతులకు కుమార్తె చైత్ర (10), కుమారుడు భువనసాయి (5) ఉన్నారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం కూడా తల్లి విజయారెడ్డి పిల్లలను స్కూలుకు రెడీ చేసి స్కూలుకు పంపింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు సజీవ దహనం అయిన తల్లికి ఏం జరిగిందో కూడా అర్థంగాక అమాయకంగా చూశారు. పిల్లల పరిస్థితి చూసి బంధువులు విలపించారు. టీచర్ నుంచి తహసీల్దార్ దాకా... మునుగోడు/నకిరేకల్/గరిడేపల్లి: నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన విజయారెడ్డి పెళ్లికి ముందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2006లో డీఎస్సీలో ఎస్జీటీ ఉద్యోగం రాగా ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల ప్రాథమిక పాఠశాలలో ఆమె పనిచేశారు. 2007లో వివాహం అనంతరం ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్–2 పరీక్షలకు సిద్ధమయ్యారు. 2009లో వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో ఆమె డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించారు. మొదట మెదక్ జిల్లా సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. ఆ తరువాత అదే జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేసి నూతనంగా ఏర్పాటైన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి తహసీల్దార్‌గా పదోన్నతిపై వచ్చారు. ఆమె భర్త సుభాష్‌రెడ్డి 2014లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నారు. నకిరేకల్‌లో విషాద ఛాయలు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మరణంతో ఆమె స్వగ్రామం నకిరేకల్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. వాస్తవానికి విజయారెడ్డి తల్లిదండ్రుల సొంత గ్రామం శాలిగౌరారం మండలం పెర్క కొండారంకాగా 30 ఏళ్ల క్రితమే నకిరేకల్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె తండ్రి చామకురి లింగారెడ్డి, తల్లి వినోద. వారికి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు. కూమారుడు 10వ తరగతిలో ఉండగా మృతి చెందాడు. తండ్రి లింగారెడ్డి పెర్కకొండారం జెడ్పీ హైస్కూల్లో తెలుగు పండిట్‌గా పని చేసి మూడేళ్ల కిందట పదవీ విరమణ పొందారు. లింగారెడ్డి తన ఇద్దరు కూమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమార్తె సంధ్యారాణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా హైదారాబాద్‌లోనే పనిచేస్తున్నారు. నేడు అంత్యక్రియలు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మరణవార్త తెలియగానే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహానికి నివాళులు అరి్పంచారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆమె అంత్యక్రియలను మంగళవారం అత్తగారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లిలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. -
మహిళా తహసీల్దార్ సజీవ దహనం
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్: రాష్ట్ర రాజధాని శివారులో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయం లోనే సోమవారం హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎలా జరిగిందంటే.. సమయం.. మధ్యాహ్నం 1:45 గంటలు. ప్రదేశం.. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయం. ఉన్నట్టుండి హాహాకారాలు.. ఆ వెంటనే భారీ పేలుడు.. దరఖాస్తుదారులు, సిబ్బంది ఉరుకులు పరుగులతో అంతటా ఉది్వగ్న వాతావరణం. ఏం జరిగిందో తెలిసేలోపే ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. తన భూ వివాదాన్ని మహిళా తహసీల్దార్ పరిష్కరించలేదన్న ఆక్రోశంతో ఓ రైతు హంతకుడిగా మారాడు. ఆమెను అంతం చేసేందుకు పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబ డ్డాడు. రెప్పపాటులో మహిళా తహసీల్దార ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. అయితే ఈ ఘటనలో మరణించింది ఎవరో అర్థంకాక సిబ్బంది తొలుత అయోమయానికి గురయ్యారు. ఆమె గది వెనుక కిటికీలోంచి చూస్తే ఆమె కనిపించకపోయే సరికి మేడం, మేడం అని కేకలు పెట్టారు. మరొక వ్యక్తి వచ్చి విజయారెడ్డి చేతికి ఉన్న వాచీని చూసి ఆమెను తహసీల్దార్‌గా గుర్తించారు. వెంటనే తహసీల్దార్ సజీవదహనంపై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లో తీవ్రంగా గాయ పడిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్యను కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గురునాథ్ 84%, చంద్రయ్య 40– 50% కాలిన గాయాలకు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ నిందితుడు సురేశ్‌ను తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన పోలీసులు అతని పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలో విజయారెడ్డి మృతదేహం. విలపిస్తున్న బంధువులు. బదిలీ అయ్యుంటే ప్రాణాలు దక్కేవి! తహసీల్దార్ విజయారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ లో 2016 అక్టోబర్ నుంచి పనిచేస్తున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో కొత్త మండలంగా ఏర్పాటైన అబ్దుల్లాపూర్‌మెట్ లో ఆమెకు పోస్టింగ్ లభించింది. మూడేళ్లకు పైగా ఇక్కడ పని చేసిన తనను బదిలీ చేయాలని లోక్‌సభ ఎన్నికలు ముగియగానే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బదిలీపై సర్కారు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. 10రోజుల కిందట విజయారెడ్డి దంపతులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సైతం కలిశారు. తనను బదిలీ చేయాలని విజయారెడ్డి మంత్రికి విన్నవించారు. ఇంతలోనే ఆమె దారుణ హత్యకు గురవడంతో అందరూ హతాశులయ్యారు. బదిలీ జరిగి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. భర్త, పిల్లలతో విజయారెడ్డి ఫైల్ ఫొటో భారీ పేలుడు శబ్దం వినిపించింది మధ్యాహ్నం 1.45కు మేడం వద్దకు ఫైలుతో వెళ్లా. సరిగ్గా 5 నిమిషాల్లో ఏదో పెద్ద పేలిన శబ్దం వినిపించింది. వెంటనే మేడం చాంబర్‌వైపు పరిగెత్తాం. అక్కడ అరుపులు, కేకలు దట్టమైన పొగతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తొలుత ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనుకున్నాం. మేడం.. మేడం అని అరిస్తే మా పిలుపులకు స్పందించి మేడం చేయి లేపడంతో అప్పుడు అర్థమైంది.– సునీత, సీనియర్ అసిస్టెంట్ పేలుడు ధాటికి పగిలిన అద్దాలు మధ్యాహ్నం 1.50 గం.కు దరఖాస్తుదారులు వచ్చారు. అప్పుడే వచ్చిన మేడం కొందరితో మాట్లాడారు. మాకు కొన్ని పనులు కూడా చెప్పారు. మేం వాటిని చూసేందుకు మా చాంబర్లలోకి వెళ్లగానే భారీ పేలుడుతో అద్దాలు పగిలిపోయాయి. మేం పరిగెత్తుకుం టూ వచ్చేసరికి మంటల్లో కాలుతున్న మేడం కనిపించారు. వెంటనే కార్పెట్లు తెచ్చి మంటలను ఆర్పాం. కానీ మేడంను కాపాడుకోలేకపోయాం. – మహేశ్ ఆర్.ఐ. కాలిన గాయాలతో సురేశ్ (ఇన్సెట్లో సురేశ్ ఫైల్) ఎవరీ సురేశ్.. ఎందుకీ దారుణానికి ఒడిగట్టాడు? రైతు సురేశ్ అబ్దుల్లాపూర్‌మెట్ బాచారం గ్రామస్తుడు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 73 నుంచి 101 వరకు విస్తరించిన దాదాపు 412 ఎకరాలను సురేశ్ కుటంబం సహా గౌరెల్లికి చెందిన 53 మంది 50 ఏళ్లుగా సాగుచేస్తున్నారు. వాస్తవానికి ఈ భూమి వారి సొంతం కాదు. ఇందులో 280 ఎకరాలు రాజా ఆనంద్‌కు చెందినది. ఆయన 1980 తరువాత మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో వారంతా సాదా బైనామా కింద రాజా ఆనంద్ నుంచి కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించి 1980 నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయని సమాచారం. అయితే వారికి 1998లో 1–బీ కింద రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) ఇచ్చారు. పట్టా పాసుపుస్తకాలు కూడా మంజూరయ్యాయని చెబుతున్నారు. కానీ 2004లో ఈ భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ అదే గ్రామానికి చెందిన షఫీక్, హబీబ్ సహా మరికొందరు కోర్టులో కేసు వేయగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో వివాదాస్పద 130 ఎకరాలను ఇటీవల తహసీల్దార్ విజయారెడ్డి వేరే వాళ్ల పేరిట పట్టా పాసుపుస్తకాలు జారీ చేశారని సురేశ్ బంధువులు ఆరోపిస్తున్నారు. 130 ఎకరాల్లో తన తాత నుంచి వారసత్వంగా రావాల్సిన 2 ఎకరాల భూమి కూడా ఉందని, దీనిపై సురేశ్ ఏడాదిగా అభ్యంతరం చెబుతున్నాడని పేర్కొన్నారు. దీనిపై ఏడాదిగా తహసీల్దార్ విజయారెడ్డి కార్యాలయం చుట్టూ అతను తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. తనకు భూమి దక్కనీయకుండా చేసిందని కక్ష పెంచుకున్న సురేశ్ ప్రతీకారంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అంటున్నారు. మా వాడు అమాయకుడు నా కొడుకు అమాయకుడు. ఇలా ఎందుకు చేశాడో తెలియట్లేదు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదు. కొంతకాలం వ్యవసాయం చేశాడు, ఇప్పుడు ఆటో, రియల్ ఎస్టేట్‌తోపాటు పొలం చూసుకుంటున్నాడు. వాడికి ఇద్దరు పిల్లలు మనస్వి (7), శ్రీచరణ్ (5) ఉన్నారు. వాడికేమైనా అయితే నా గతి, నా మనవల గతి ఏంగాను? – కూర పద్మ, సురేశ్ తల్లి మతిస్థిమితం సరిగా లేదు.. చిన్నప్పటి నుంచి సురేశ్ ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదు. కొంతకాలంగా అతని మానసిక పరిస్థితి బాలేదు. ఈ వివాదంపై సురేశ్ తండ్రి ఇప్పటికే పోరాడుతున్నాడు. సంబంధం లేని విషయంలో సురేశ్ తలదూర్చాడు. – కూర దుర్గయ్య, సురేశ్ పెదనాన్న -
దారుణం... అమానుషం
వాగ్వాదం పెరిగి సంయమనం కోల్పోయి దుర్భాషలాడటం, సవాళ్లు విసురుకోవడం... ఆవేశం ముదిరి అవతలి వ్యక్తిపై దౌర్జన్యానికి దిగడం, ప్రాణాలు తీయడం తరచు వింటూనే ఉంటాం. కానీ తన కార్యాలయంలో విధుల్లో నిమగ్నమై ఉన్న ఒక మహిళా అధికారిని పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేయడం అనేది ఎవరి ఊహకూ అందనిది. హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై సోమవారం మధ్యాహ్నం ఒక దుండగుడు అత్యంత దారు ణంగా దాడి చేసి హతమార్చిన తీరు దిగ్భ్రాంతికరం. సమస్య ఉండొచ్చు. దాని పరిష్కారంలో జాప్యం వల్లనో, ఆ పరిష్కారం చేసిన తీరువల్లనో పట్టరాని కోపం వచ్చి ఉండొచ్చు. ఆ అధికారి తీసుకున్న నిర్ణయం పర్యవసానంగా అన్యాయమే జరిగి ఉండొచ్చు. దాన్ని సరిచేయడానికి భిన్న మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు వాటన్నిటినీ విడనాడి దౌర్జన్యానికి పూనుకోవడం, ప్రాణాలు తీయడం అత్యంత ఘోరం. తమ కుటుంబాలకు దక్కాల్సిన కొంత భూమి రెవెన్యూ అధికారుల నిర్ణయం కారణంగా వేరెవరికో వెళ్లిందన్నది దుండగుడి ఆగ్రహానికి కారణం. కానీ తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని వివాదం సబ్ కలెక్టర్ దృష్టికో, కలెక్టర్ దృష్టికో తీసుకెళ్లి న్యాయం దక్కేలా చూసుకోవచ్చు. ఇవన్నీ దాటాక న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి. ఇందువల్ల డబ్బు, సమయం వృధా అవుతున్నాయన్న నిరాశానిస్పృహలు ఏర్పడతాయనడంలో సందేహం లేదు. కానీ దేనికైనా ఒక క్రమాన్ని పాటించాల్సిందే. భూసంబంధ వివాదాలతో నిత్యం వ్యవహరించవలసి వచ్చే రెవెన్యూ సిబ్బంది విధి నిర్వహణ కత్తి మీద సాము వంటిది. తమ ముందున్న సమస్యను అన్ని కోణాల్లో పరిశీలించి తీసుకునే నిర్ణయం సహజంగానే కొందరికి కోపం తెప్పించవచ్చు. వివాదంలో ఎక్కువ పక్షాలున్నప్పుడు పరిష్కారం మరింత సంక్లిష్టమైనది. ఎవరికి వారు తమ వాదనే సరైందనుకుంటారు. లేదా ఏదే మైనా నిర్ణయం తమకు అనుకూలంగా ఉండాల్సిందే అనుకుంటారు. ఇలాంటివారందరితోనూ రెవెన్యూ సిబ్బంది నిత్యం మాట్లాడవలసి ఉంటుంది. ముఖ్యంగా తహసీల్దార్ స్థానంలో ఉండేవారు ఈ క్రమంలో ఎదుర్కొనే ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, పార్టీలు... ఇలా అనేకులు వచ్చి కలిసి, ఫలానా వారి విషయంలో తీసుకున్న నిర్ణయం సరికాదని, దాన్ని పునఃపరిశీలించాలని కోరుతుంటారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తారు. తీసుకున్న నిర్ణయం తమకు రుచించనప్పుడు అవతలి పక్షం నుంచి లంచం తీసుకున్నారని ఆరోపించేవారుంటారు. అలా చేతివాటం ప్రదర్శించేవారు ఏసీబీకి చిక్కిన సందర్భాలు లేకపోలేదు. కానీ అది అందరికీ సాధ్యమయ్యే కళ కాదు. వీటి సంగతలా ఉంచి ఎందరు ఎన్నివిధాలుగా ఒత్తిళ్లు తెస్తున్నా, బెదిరింపులకు దిగుతున్నా చాకచక్యంగా వాటిని అధిగమించే అధికారులు లేకపోలేదు. కొన్ని వృత్తిలో భాగమనుకుని చేసుకుంటూ వెళ్లడం, అలవాటుపడటం అధికారులకు తప్పదు. కానీ ప్రాణాలు తీసే స్థితి ఏర్పడిందంటే అసలు విధి నిర్వహణ సాధ్యమేనా? తహసీల్దార్ అధికారాల రీత్యా తన పరిధిలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. ఆ స్థాయి అధికారి వద్దకు ఒక దుండగుడు సులభంగా పెట్రోల్‌తో వెళ్లగలిగాడంటే విస్మయం కలుగుతుంది. రెవెన్యూ అధికారులు వారు పరిష్కరించా ల్సిన సమస్యల రీత్యా పటిష్టమైన భద్రత అవసరమైనవారు. కానీ అది సక్రమంగా లేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది. తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన మొదలయ్యాక రెవెన్యూ సిబ్బందిపై పనిభారం అపా రంగా పెరిగింది. పట్టాదారులు, కౌలుదారులు, ఇతరత్రా హక్కుదారులు రికార్డుల నవీకరణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాల్లోనే కలహాలు పెరుగుతున్నాయి. కోర్టు కేసుల వల్ల కావొచ్చు...ప్రభుత్వ భూములుగా నిర్ధారణ కావడం వల్ల కావొచ్చు– పట్టాదారు పాస్ పుస్తకాలు హక్కుదారులుగా చెప్పుకుంటున్నవారికి ఇవ్వడం అసాధ్యం. అలా చేస్తే ఉద్యోగాలకు ముందూ మునుపూ ముప్పు కలగొచ్చు. ఇవ్వకపోతే ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ సిబ్బందే వాటిని అంద కుండా చేస్తున్నారన్న అపోహలు బయల్దేరవచ్చు. కొన్నిసార్లు సాఫ్ట్వేర్ లోపాలు కూడా సమస్యలకు దారితీస్తాయి. వీటిని విడమరిచి చెప్పడం, సముదాయించడం సిబ్బందికి పెను సమస్యగా మారు తుంటుంది. సమయమంతా దానికే సరిపోతుంది. ఇలా ఒకటికి పదిసార్లు తిరగకతప్పని పరిస్థితి ఏర్పడటంతో అవతలివారిలో అసహనం కలుగుతుంది. ఇలాంటి అనేకానేక సమస్యల మధ్య పని చేసే సిబ్బందికి కాస్తయినా వెసులుబాటు దొరకడం అసాధ్యమవుతున్నది. తగినంత సిబ్బంది లేక పోవడం వల్ల లేదా కుటుంబాలకు దూరంగా ఉండకతప్పని పరిస్థితులు ఏర్పడటం వల్ల వృత్తి పరమైన ఒత్తిళ్ల తీవ్రత మరింత పెరుగుతోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో తహసీల్దార్ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన దీనికి ఉదాహరణ. దీనికితోడు 24 గంటల న్యూస్ చానెళ్లు ప్రారంభమయ్యాక, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో వెనువెంటనే ప్రచారంలో పెట్టే అవకాశం ఏర్పడటం వల్ల కొందరు నాయకులు హద్దులు మరుస్తున్నారు. సంగతి చూస్తాం...తాటతీస్తాం...రోడ్లపై తిరగనివ్వం అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. అధికారులను తూలనాడుతున్నారు. ఇలా అనడం వల్ల బాధితుల్లో ధైర్యం ఏర్పడుతుందనో, వారు మానసికంగా సంతృప్తి చెందుతారనో నేతలు అనుకుంటున్నారు. కానీ మూర్ఖత్వమో, మొండితనమో, మానసిక వ్యాధో ఉన్నవారిలో ఇటువంటి మాటలు చేతలకు పురిగొల్పుతాయి. పర్యవసానాల గురించి వారు ఆలోచించలేరు. కనుక ఆ బాపతు నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. జరిగిన ఉదంతంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కారకులకు కఠిన శిక్షలు పడేలా చూడటం అవసరం. అలాగే ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం... అధికారులు స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేసే పరిస్థితులు కల్పించడం ముఖ్యం. -
తహశీల్ధార్ హత్య.. అత్యంత పాశవికం
సాక్షి, అమరావతి: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మహిళా తహశీల్ధారుపై ఇటువంటి చర్య అత్యంత దారుణమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ ఘటనను దేశ రెవెన్యూ చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైనదిగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు రెవెన్యూ శాఖకు సంబంధం లేని పనులు అంటగట్టడం వల్ల శాఖా సంబంధమైన పనులు చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తున్నా.. ప్రజల దృష్టిలో మన్ననలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు చేసే తప్పులను అందరికి ఆపాదించడం వలన రెవెన్యూ ఉద్యోగులందరూ దోషులుగా నిలబడాల్సి వస్తోందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కే రక్షణ కరువైతే సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. విజయారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుతాన్ని వెంకటేశ్వర్లు కోరారు. -
సురేశ్.. ఎమ్మార్వో ఆఫీసుకు ఎందుకెళ్లాడు?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు భూ వివాదమే కారణమని కూర సురేశ్ ముదిరాజ్ పెదనాన్న దుర్గయ్య తెలిపారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ తమ భూమిని ప్రత్యర్థులకు తహశీల్దార్ విజయారెడ్డి బదలాయించినట్టు ఆరోపించారు. బచారంలో సర్వే నంబరు 90 నుండి 102 వరకు ఉన్న మొత్తం 110 ఎకరాల భూమిపై హైకోర్టు, కలెక్టరేట్లోనూ కేసులు నడుస్తున్నాయన్నారు. తమకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. ఈ విషయాలు ఎప్పుడు సురేశ్‌తో చర్చించలేదన్నారు. అతడికి మతిస్థిమితం సరిగ్గా ఉండదని, ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని అస్సలు ఊహించలేదని దుర్గయ్య వాపోయారు. తమకు ఎటువంటి భూ వివాదాలు లేవని, తన కొడుకు ఎప్పుడు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లలేదని సురేశ్ తల్లి పద్మ అన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు ఇంట్లోనే వున్నాడని, తండ్రి కృష్ణతో కలిసి ఉదయం కట్టెలు కొట్టాడని చెప్పారు. ‘మధ్యాహ్నం భోజనానికి రాకపోయేసరికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. ఎమ్మార్వోపై దాడి చేశాడని కొద్దిసేపటికి తెలిసింది. భూములకు సంబంధించిన విషయాలను నా భర్తే చూసుకుంటాడు. సురేశ్ ఎమ్మార్వో కార్యాలయానికి ఎందుకు వెళ్లాడో తెలియద’ని ఆమె వివరించారు. కాగా, తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో దుర్గయ్య పైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. మంత్రి గంగుల ఘెరావ్ తహశీల్దార్ విజయారెడ్డిపై దాడి చేసి సజీవ దహనం చేయడంపై కరీంనగర్లో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. క్యాండిల్ ర్యాలీతో విజయారెడ్డికి నివాళులర్పించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్యోగులు ఘెరావ్ చేయడంతో వారిపై మంత్రి అసహనం ప్రదర్శించారు. సంబంధిత వార్తలు తహశీల్దార్ సజీవ దహనం; పాపం పిల్లలు తహశీల్దార్ సజీవ దహనం; అసలేం జరిగింది? అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన; మరో ఇద్దరికి సీరియస్ తహశీల్దార్‌పై కిరోసిన్ పోసి నిప్పంటిన దుండగుడు -
ఎమ్మార్వో మృతికి ఉద్యోగ సంఘాలే కారణం: ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ అధికారులపై వ్యవహరిస్తున్న తీరే తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం రూపొందించిన రెవెన్యూ చట్టం మార్పులు రైతులకు, అధికారులకు ఇబ్బందిగా మారాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో నేపథ్యంలో జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. లంచాన్ని అరికట్టడం ఏ నాయకునితో సాధ్యంకాదని, ఎమ్మార్వో మృతి ఘటనలో ఉద్యోగ సంఘాల నాయకుల తప్పిందం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమె మృతికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ సంఘాల నేతలు రాజేందర్, రవీందర్ రెడ్డి, మమతలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. (చదవండి: తహశీల్దార్ సజీవ దహనం; అసలేం జరిగింది?) సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘నమస్తే తెలంగాణాలో పత్రికలో ప్రసారం అవుతున్న ధర్మగంట కార్యక్రమం రైతులు, అధికారులకు మధ్య వైరాన్ని పెంచింది. రెవెన్యూ అధికారులపై ధర్మగంట ప్రజల్లో విషాన్ని, ద్వేషాన్ని నురిపోసింది. కేసీఆర్ నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు గుడ్డిగా నమ్ముతూ.. ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నది నిజం కాదా.?. రైతు ఆవేశానికి ప్రభుత్వం విధానాలు.. ఉద్యోగ సంఘాలే తీరే కారణం. ప్రభుత్వం మేల్కొని అధికారులు.. ప్రజలకు మధ్య మంచి వాతావరణం ఉండేలా చూడాలి. ప్రభుత్వం మేల్కొకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది’ అని అన్నారు. -
మాటలకందని ఘోరం.. షాక్ తిన్నాను!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని పట్టపగలే సజీవ దహనం చేసిన ఘటనపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. విజయారెడ్డి దుర్మార్గమైన హత్య.. మాటలకందనిరీతిలో తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. సమస్య ఏదైనా ఉండొచ్చు కానీ.. ఇలా అమానుషంగా దాడి చేయడం మాత్రం అత్యంత హేయమని, ఇలాంటి ఘటనలకు ప్రజాస్వామ్యంలో తావులేదని ఆయన స్పష్టం చేశారు. తాహశీల్దార్ విజయారెడ్డి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయరెడ్డిపై సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమెను కాపాడాటానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తహశీల్దార్ కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తహశీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన వ్యక్తిని కూర సురేశ్ ముదిరాజ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. I am shocked beyond words about the Abdullapurmet MRO Smt. Vijaya’s brutal murder. No matter what the unresolved issue was, this sort of inhuman attack is reprehensible and has no place in a democracy. My heartfelt condolences to the family of Smt. Vijaya Reddy Garu🙏 — KTR (@KTRTRS) November 4, 2019 -
అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన; మరో ఇద్దరికి సీరియస్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన ఆమె డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కవాడిపల్లి వాసి బొడిగా నారాయణ గౌడ్ అనే వృద్ధుడు కూడా గాయపడ్డాడు. తన భూమి సమస్య పరిష్కారం కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి గాయాలపాలైన ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కూర సురేశ్‌కు ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడికి 60 శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. రేపు విజయారెడ్డి అంత్యక్రియలు విజయారెడ్డి మృతదేహానికి ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. ఆమె మృతదేహాన్ని నల్గొండ జిల్లా కల్వలపల్లి గ్రామానికి తీసుకెళ్లారు. రేపు విజయా రెడ్డి స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. న్యాయం జరిగేలా చూస్తాం: డీజీపీ ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను డీజీపీ మహేందర్ రెడ్డి ఖండించారు. ఇటువంటి ఘటనలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. నిందితుడు సురేశ్‌కు తక్కువ సమయంలోనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఎమ్మార్వో కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వపరంగా విధులు నిర్వహించే అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంది. ప్రజలకు రక్షణ కల్పించే ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పై ఇలాంటి సంఘటన జరగటం దురదృష్టకరమని.. నిందితుడిని కఠినంగా శిక్షించి ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని కోరింది. విజయారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంబంధిత వార్తలు తహశీల్దార్ సజీవ దహనం; పాపం పిల్లలు తహశీల్దార్ సజీవ దహనం; అసలేం జరిగింది? తహశీల్దార్‌పై కిరోసిన్ పోసి నిప్పంటిన దుండుగుడు