గురునాథ్‌ కుటుంబానికి ఆర్థిక సాయం | Revenue Employees Announced Financial Support For Gurunath Family | Sakshi
Sakshi News home page

గురునాథ్‌ కుటుంబానికి ఆర్థిక సాయం

Published Sun, Nov 10 2019 3:45 AM | Last Updated on Sun, Nov 10 2019 3:45 AM

Revenue Employees Announced Financial Support For Gurunath Family - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని రక్షించే క్రమంలో మంటలు అంటుకొని మరణించిన డ్రైవర్‌ గురునాథ్‌ కుటుంబానికి మాజీ ఐఏఎస్‌ అధికారి కేఆర్‌ వేణుగోపాల్‌ రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రెవెన్యూ ఉద్యోగులూ గురునాథ్‌ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. మేడ్చల్‌ జేసీ విద్యాసాగర్, రాజేంద్రనగర్‌ ఆర్డీఓ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) తరఫున గురునాథ్‌ భార్యకు రూ. 1.15 లక్షలు అందజేశామని, మొత్తంగా రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement