revenue employees
-
ప్రభుత్వ ఉద్యోగాలున్నయ్.. కానీ జీతాల్లేవ్!
కోరుట్ల: పేరుకి ప్రభుత్వోద్యోగమే అయినా ఆర్నెల్లుగా నయాపైసా జీతం లేక అల్లాడిపోతున్నారు కొత్త మండలాల్లోని రెవిన్యూ ఉద్యోగులు. గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో నంబరు 97 జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత తహసీల్దార్ కార్యాలయాలకు రూపునిచ్చారు. ఆయా జిల్లాల్లోని వివిధ మండలాల్లో పనిచేసే సిబ్బందికి వాటిలో పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉందికానీ.. కొత్త మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల మంజూరు కోసం సీసీఎల్ఏ నుంచి ’క్యాడర్ స్ట్రెంత్’సర్కులర్ జారీచేయాల్సి ఉంటుంది. ఈ జీవో జారీ ఆరు నెలలుగా జాప్యమవుతోంది. దీంతో సిబ్బందికి వేతనాలు అందడంలేదు. ♦ 13 మండలాలు.. 240 మంది సిబ్బంది.. ♦ కొత్త మండలాల జీవో జారీ కాగానే తహసీల్దార్ కార్యాయాలు ఏర్పాటు చేశారు. ♦ నిబంధనల ప్రకారం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు గిర్దావర్లు(ఆర్ఐలు), ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, సర్వేయర్, అటెండర్, చైన్‌మన్‌తోపాటు గ్రామాల సంఖ్యను బట్టి 15–25 మంది వీఆర్ఏలను నియమించారు. ♦ జీవో 97 ప్రకారం ఇతర మండలాల్లోని సిబ్బందిని కొత్త మండలాల్లో నియమిస్తూ జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. ♦ ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన 13 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో సుమారు 240 మంది ఉద్యోగులు వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. ఆర్నెల్లుగా అరిగోస.. విధులు నిర్వర్తిస్తున్నా.. తమకు జీతాలు రాకపోవడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ స్ట్రెంత్ జీవో జారీకోసం కొందరు జిల్లా కలెక్టర్లు సీసీఎల్ఏకు మొరపెడుతూ లేఖలు రాసినా పట్టించుకునే వారులేరు. జీవో జారీ కాకపోవడంతో ఉద్యోగుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, వేతనాల విడుదల వంటి అంశాల వివరాలు జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో నమోదు కాలేదు. ఫలితంగా ఆరు నెలలుగా జీతాలు లేక కొత్త మండలాల్లో పనిచేస్తున్న సుమారు 240 మంది రెవెన్యూ ఉద్యోగులు నానాతిప్పలు పడుతున్నారు. ఏమిటీ క్యాడర్ స్ట్రెంత్? కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాల్లో హోదాల ప్రకారం ఉండాల్సిన సిబ్బంది, వేతన వివరాలు, ఆర్థికపరమైన అనుమతులను రెవెన్యూ పరిభాషలో క్యాడర్ స్ట్రెంత్ అంటారు. ఈ క్యాడర్ స్ట్రెంత్ జీవో విడుదల అయితేనే కొత్త మండలాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వేతనాలు నేరుగా సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ జీవోను సీసీఎల్ఏ జారీ చేయాల్సి ఉంటుంది. -
రెవెన్యూ శాఖలో పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ఎట్టకేలకు ఊరట. ఈ శాఖ పరిధిలోని ఉద్యోగులకు సెప్టెంబర్‌లో పదోన్నతులిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌ను కలిసినప్పుడు ఆయన ఈ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదా వరకు పలుస్థాయిల్లో పదోన్నతులు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 40–50 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 90–100 డిప్యూటీ కలెక్టర్లు, 160 తహశీల్దార్ పోస్టులు ఖాళీలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదిలో 369 మంది నాయిబ్ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) నిర్ణయించిందని, అయితే ఇందులో 190 మందికి మాత్రమే పదోన్నతులు ఖరారు చేయగా, మిగిలిన వారికి ఇవ్వలేదని సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ ప్యానెల్ ఇయర్ ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో డీపీసీ ఆమోదం వచ్చినా పదోన్నతులు రాని నాయబ్ తహసీల్దార్ల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన కూడా ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గ్రామానికి ఒక్కరే వీఆర్ఏ! సీఎస్ సోమేశ్‌కుమార్‌తో ట్రెసా నేతల భేటీ సందర్భంగా వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తామని, వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసినందున వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం (వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి ముందు) 5,836 మంది వీఆర్వోలుగా పనిచేస్తున్నారు. వీరి భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన సిబ్బందిలో కనిపిస్తున్నా, వారిలో అర్హులను రెవెన్యూ శాఖలోనే కొనసాగించి, మిగిలిన వారిని ఇతర శాఖలకు బదిలీ చేస్తారని తెలుస్తోంది. వీఆర్ఏల విషయానికి వస్తే గ్రామానికి ఒక్కరిని మాత్రమే వీఆర్ఏగా కొనసాగిస్తారని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేల మంది వీఆర్ఏలు ఉండగా, గ్రామానికి ఒకరి చొప్పున కొనసాగిస్తే 10 వేల మందికి ఊరట కలగనుంది. మిగిలిన వారిని అర్హతలకు అనుగుణంగా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సీనియార్టీ సమస్యలు రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ)ల వరకే పదోన్నతులు లభిస్తున్నాయి. ఆ తర్వా త రెవెన్యూ కోటాలో కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా మాత్రమే అవకాశముంది. దీంతో సీనియార్టీ సమస్యలు వస్తున్నాయని రెవె న్యూ సంఘాలంటున్నాయి. డీఆర్వో, జేసీలాంటి పోస్టుల్లో ఈ సమస్యలు వస్తున్నాయని, డీఆర్వో పోస్టుకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను పరిగణనలోకి తీసుకుంటుండటంతో ఆ తర్వాత పదోన్నతులు రావడం లేదని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ పరిధిలో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ) పోస్టు సృష్టించాలని ‘ట్రెసా’విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసారి ఐదు ఆప్షన్లు రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ బదిలీలకు ఒకట్రెండు ఆప్షన్లు ఇచ్చే సంప్రదాయం ఉండగా, ఈసారి ఐదు రకాల ఆప్షన్లు ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఇందులో స్పౌస్, మెడికల్, పీహెచ్సీ, జిల్లా, మల్టీజోన్ ఆప్షన్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
మరింత బాధ్యతతో పనిచేయండి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా నూతన రెవెన్యూ చట్టంతో రైతుల జీవితాల్లో మార్పు రావడానికి ఉద్యోగులు కృషి చేయాలని రోడ్లు, భవ నాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో కలసిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. కొత్తగా రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నందున మరింత బాధ్యతతో పనిచేయాలని కోరారు. మం త్రిని కలసిన వారిలో ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్య దర్శి గౌతమ్‌కుమార్ తదితరులున్నారు. -
ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూశాఖలోని అధికారులు, సిబ్బంది సమిష్టిగా చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కోరారు. ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. శనివారం ప్రగతి భవన్ లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రెవెన్యూ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తూ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలని, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లోని పేదలను కడుపులో పెట్టుకొన్నట్లుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజల్లో చైతన్యం పెరిగిందని దానికి అనుగుణంగా పోలీసుశాఖలో మార్పు వచ్చిందని, అదే తరహాలో రెవెన్యూశాఖలో కూడా మార్పు రావాలన్నారు. (వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్) కొత్తం చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు.. వివిధ పనులపై రెవెన్యూ కార్యాయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా హుందాగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా పరిష్కరించాలని కోరారు. గతంలో మండలాల్లో, గ్రామాల్లో బాగా పనిచేసే అధికారులను ప్రజలు దేవుళ్లుగా భావించే వారని, మళ్లీ అలాంటి సంస్కృతిని నెలకొల్పాలని సీఎం సూచించారు. అధికారులు తమతో ఎలా మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తుంటారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ యంత్రాంగం వారి సమస్యలను పరిష్కరించే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలు కేంద్ర బిందువుగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని, ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఎలక్షన్లు, ప్రకృతి వైపరీత్యాలు సహా 54 రకాల బాధ్యతలను నిర్వహిస్తూ రెవెన్యూ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు. రెవెన్యూశాఖలో అన్నిస్థాయిల్లో ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, తహసీల్దార్లకు కారు అలవెన్సు రెగ్యులర్ గా ఇవ్వాలని ముఖ్యమంత్రి సీఎస్ ను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రొటోకాల్ సహా కార్యాలయాల నిర్వహణ కోసం నిధుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. (దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ బంద్) రూ. 260 కోట్ల అదనపు భారం వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. వీఆర్ఏలలో అత్యధికంగా పేదవర్గాల వారే ఉన్నారని, వీరిలో వయోభారం ఉన్నవారి పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. వీఆర్ ఏలకు స్కేల్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రెవెన్యూ యంత్రాంగానికి విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి 60 మంది ట్రెసా ప్రతినిధులు హాజరయ్యారు. నూతన రెవెన్యూ చట్టనికి ట్రెసా సంపూర్ణ మద్దతు : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, నాయకులు మన్నె ప్రభాకర్, రామకృష్ణ, బాణాల రాంరెడ్డి, దేశ్యా నాయక్, నాగమణి, వాణిరెడ్డి, శైలజ, మాధవి, పల్నాటి శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకు మరింత మేలైన సేవలందుతాయని వారు పేర్కొన్నారు. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మేలైన సేవలందించి ముఖ్యమంత్రి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. రాష్ట్రంలో భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టును భర్తీ చేయాలని, అర్హులైన వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రెవెన్యూశాఖలో ఖాళీలను భర్తీ చేసి, సిబ్బందిని పెంచాలని, కంప్యూటర్ ఆపరేటర్లను రెగ్యులరైజ్ చేయాలని, రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడానికి ముందు తహసీల్దార్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని వారు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎస్ సోమేశ్ కుమార్, సెక్రటరీ స్మితా సభర్వాల్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
నారాయణపేటలో భూ మాయ!
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బాపూర్ శివారులోని సర్వే నం. 30/ఏఅ, ఖాతా నం. 635లో 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆనంద (భర్త పేరు వెంకట్‌రెడ్డి) అక్రమంగా పొందారు. ఆమె పేరుతో పట్టాపాసు పుస్తకాలు మంజూరయ్యాయి. హద్దులు తెలియకపోవడంతో అక్రమంగా పట్టా పొందిన ఈ భూమిని సాగు చేయడం లేదు. అయినా ‘రైతుబంధు’ ద్వారా పెట్టుబడి సాయం మాత్రం క్రమం తప్పకుండా పొందుతున్నారు. ఇలా 2018–19లో రూ.18వేలు, 2019–20లో రూ.22,500 తీసుకున్నారు. అలాగే సర్వే నం.30/ఆ ఖాతా నం.372లో లక్ష్మి (భర్త పేరు నాగరాజు) రెండెకరాలకు పట్టాపాసు పుస్తకాలు తీసుకున్నా సాగు చేయడంలేదు. 2018–19లో రూ.ఎనిమిది వేలు, 2019–20లో రూ.పది వేల పెట్టుబడి సాయం మాత్రం తీసుకున్నారు. ఇలాంటి రైతులు పదుల సంఖ్యలో ఉన్నారు. రెవెన్యూ అధికారుల అవినీతితో అక్రమ పట్టాలు పొందిన వీరు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం తీసుకుంటూనే ఉన్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ ఊట్కూరు: తవ్విన కొద్దీ అక్రమాలు.. ఒకదాని తర్వాత మరొకటి.. ఎవరికీ అంతుబట్టకుండా ప్రభుత్వ భూములను కాజేసే కొందరు రెవెన్యూ ఉద్యోగులు.. వారికి సహకరించే మరికొందరు అధికారులు.. ఆలస్యంగా వెలుగుచూస్తున్న అక్రమాలతో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం వార్తల్లోకెక్కింది. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని గుట్టుచప్పుడు కాకుండా వాటిని తమ కుటుంబ సభ్యుల పేతో పట్టాలు చేయడం.. ఇతరులకు అమ్ముకోవడం ఆ మండల రెవెన్యూ అధికారులు కొందరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇదే మండలంలోని దంతన్‌పల్లి, ఊట్కూర్, బాపూర్ శివారులో ఎనిమిది సర్వే నెంబర్ల పరిధిలో ఉన్న 21.81ఎకరాలను తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో పట్టా చేసిన స్థానిక వీఆర్వో, ముగ్గురు వీఆర్ఏల ఉదంతం వెలుగుచూడక ముందే బాపూర్ శివారులో మరో 75 ఎకరాల ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట పట్టా చేసినట్టు ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఆ మండలంలో ప్రభుత్వ భూ బదలాయింపు 96.81 ఎకరాలకు చేరింది. బాపూర్ శివారులోని సర్వే నం.157, 158, 164, 30లో ఉన్న 150 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో 75 ఎకరాల అన్యాక్రాంతమైందని 2018లోనే ఆ గ్రామస్తులు గుర్తించారు. ఏడాది క్రితం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతుల జాబితాను గ్రామసభలో చదవి వినిపించడంతో 75 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదే క్రమంలో కొందరు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతర రైతులకు పట్టాలు చేశారని అప్పట్లో కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ అప్పటి తహసీల్దార్ తిరుపతయ్యను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అయితే నామమాత్రంగా రికార్డులను పరిశీలించిన అధికారులు అక్రమార్కులను కాపాడారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా విచారణ అనంతరం గ్రామస్తులు మళ్లీ ఆందోళన చేపడతారనే ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు అక్రమ పట్టాలు పొందిన రైతులకు హద్దులు కేటాయించలేదు. దీంతో పట్టా పాసు పుస్తకాలు తీసుకున్న రైతులు ఆ భూముల్లో సాగు చేయడం లేదు. అయితే పెట్టుబడిసాయం పొందడం గమనార్హం. సర్వే నం.30లోనే అత్యధికంగా సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే.. అందులో 30 నుంచి 40 ఎకరాల వరకు ఇతరుల పేరిట పట్టా అయినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక సర్వే నం.157, 158 164 లలో మిగిలిన మరో 30 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఆది నుంచి అదే తీరు..! ఊట్కూరు మండలంలో భూ అక్రమాలు కొత్తేమీ కాదు. అధికారుల పర్యవేక్షణ లోపమో.. అవినీతి కారణమో తెలియదు కానీ అక్రమాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2009లో నకిలీ పట్టా పాసు పుస్తకాలు తయారు చేసిన ఐదుగురు వీఆర్వోలు వాటిని రైతులకు అమ్మిన విషయం సంచలనం రేపింది. ఈ సంఘటనలో వీఆర్వోలను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు అక్రమ పట్టాలు పొందిన 36 మంది రైతులపై కేసు నమోదు చేశారు. ఈ తతంగంలో సదరు వీఆర్వోలు కొందరు దళారులను నియమించుకుని వ్యవహారమంతా నడిపించారు. అప్పట్లో కలెక్టరేట్ నుంచి కొత్త పాసు పుస్తకాలను తెచ్చి రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి, స్టాంపులు వేసి దళారుల చేతుల మీదుగా బినామీ రైతులకు అందించారు. ఒక పాసు పుస్తకానికి రూ.పది వేల నుంచి రూ.20 వేల వరకు డబ్బులు దండుకుని మండలంలోని పగిడిమారి, మొగ్దూంపూర్, అమీన్పూర్ తదితర గ్రామాల బినామీ రైతులకు అందించారు. నకిలీ పాస్ పుస్తకాలు పొందిన రైతులు మక్తల్ కో–ఆపరేటివ్ బ్యాంకు ద్వారా లక్షలాది రూపాయల రుణాలు పొందారు. అదే సమయంలో విషయం తెలుసుకున్న స్థానికులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది మక్తల్ కో–ఆపరేటివ్ సొసైటీకి Ðవెళ్లి బ్యాంకులో బోగస్ పుస్తకాలను పట్టుకుని ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు 2009 ఆగస్టు 26న 36 మంది రైతులపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో అప్పటి డిప్యూటీ తహసీల్దార్ ఉండటం గమనార్హం. తాజాగా.. అదే స్థాయిలో ప్రభుత్వ భూమిని ఇతరుల పేరిట పట్టా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ అక్రమార్కులకు ఉన్నతాధికారుల అండదండలున్నాయనీ.. అందుకే ప్రభుత్వ భూములు ఇతరుల పేరిట పట్టా చేస్తున్నా.. తమ పై స్థాయి అధికారులకు తప్పుడు నివేదికలు పంపుతూ అక్రమార్కులను కాపాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుత నారాయణపేట కలెక్టర్ హరిచందన దాసరి ఎలా స్పందిస్తారో అనే చర్చ జోరుగా సాగుతోంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంటారా? లేదా? అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అనేది జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభుత్వ భూమిపై సర్వే చేట్టాలి మండలంలోని ఊట్కూర్, దంతన్‌పల్లి, బాపూర్ శివారులో ప్రభుత్వ భూమిని అక్రమంగా కుటుంబ సభ్యులపై పట్టాలు చేసుకున్న రెవెన్యూ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మండలంలోని ప్రభుత్వ భూములపై మళ్లీ సర్వే చేపట్టి అక్రమంగా పట్టాలు చేసుకున్న వారి నుంచి భూమిని స్వా«దీనం చేసుకోవాలి. మిగులు భూమిని నిరుపేద దళితులు, జోగినీలకు పంపిణీ చేయాలి. – హాజమ్మ, ఊట్కూరు బాధ్యులపై చర్య తీసుకోవాలి ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమం అవినీతి అధికారులకు వరంలా మారింది. మండలంలో అక్రమాలకు పాల్పడ్డ రెవెన్యూ సిబ్బంది, వారికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఊట్కూర్, దంతన్‌పల్లి, బాపూర్, పెద్దపొర్ల, చిన్నపొర్ల, మల్లెపల్లి, ఏర్గాట్పల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూమిపై అధికారులు రిటైర్డ్ తహసీల్దార్‌తో దర్యాప్తు చేయించి.. భూమిని స్వా«దీనం చేసుకోవాలి. – సలీం, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట విచారణ చేపడతాం మండలంలో పలు చోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్టు ఫిర్యాదులు అందాయి. వీటన్నింటిపై విచారణ చేపట్టి అక్రమంగా ఇతరుల పేరిట పట్టాలు చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా భూములు పొందిన వారిపైనా చర్యలు తప్పవు. ప్రభుత్వ భూమిని ఇతరుల పేరిట పట్టాలు చేయడం నేరం. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులను నివేదిస్తాం. – దానయ్య, తహసీల్దార్, ఊట్కూర్ -
పెట్రోల్‌తో తహసీల్దార్ కార్యాలయానికి రైతు
కల్హేర్(నారాయణఖేడ్): అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన మరువకముందే భూమి పట్టా చేయడం లేదని బాటిల్లో పెట్రోల్ పోసుకుని వచ్చి మరో రైతు రెవెన్యూ ఉద్యోగులకు షాక్ ఇచ్చాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని మహదేవుపల్లికి చెందిన రైతు జి.లింగయ్య, వీఆర్ఓగా పనిచేసిన లాలయ్య తన పట్టా పాసుపుస్తకం నుంచి రెండు ఎకరాల భూమిని తీసేసి ఇతరుల పేరిట మార్చారని ఆరోపించాడు. గ్రామ శివారులోని 49 సర్వే నంబర్లో తన తల్లి శివమ్మ పేరిట ఉండాల్సిన భూమికి హక్కులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీఆర్ఓ లాలయ్య తమకు అన్యాయం చేశారని సోదరులతో కలసి వచ్చి కార్యాలయం వద్ద కలకలం సృష్టించాడు. బాటిల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న వారు లింగయ్య చేతిలోంచి పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. అనంతరం లింగయ్య ఠాణాకు వెళ్లి వీఆర్ఓపై ఫిర్యాదు చేశాడు. దీనిపై వీఆర్ఓ లాలయ్యను ప్రశ్నించగా, సదరు 2 ఎకరాల భూమిని ఎవరిపేరుపై నమోదు చేయకుండా పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. -
గురునాథ్ కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని రక్షించే క్రమంలో మంటలు అంటుకొని మరణించిన డ్రైవర్ గురునాథ్ కుటుంబానికి మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రెవెన్యూ ఉద్యోగులూ గురునాథ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. మేడ్చల్ జేసీ విద్యాసాగర్, రాజేంద్రనగర్ ఆర్డీఓ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) తరఫున గురునాథ్ భార్యకు రూ. 1.15 లక్షలు అందజేశామని, మొత్తంగా రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు -
రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ
సాక్షి, ఖమ్మం టౌన్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మం కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ హత్యను గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సేవకులు తీవ్రంగా ఖండించారు. నిరసనగా నగరంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద మానవహారం చేశారు. నిందితుడు సురేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘రెవెన్యూ విలీనంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’
సాక్షి, సంగారెడ్డి: రెవెన్యూ శాఖ విలీనంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఉద్యోగులు పత్రికల్లో వస్తోన్న వదంతులను నమ్మొద్దని టీఎన్జీవో సంగం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కోరారు. జిల్లాలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.20లక్షల మంది ఉద్యోగులు ఉన్నరన్నారు. ప్రతి ఉద్యోగి 10 మొక్కలు నాటాలని నిర్ణయించామని.. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి నుంచే శ్రీకారం చుట్టామని తెలిపారు. గతంలో కమల్‌నాథ్ కమిటీ చర్యల వలన ఉద్యోగ విభజనలో తెలంగాణ ఉద్యుగులే అధికంగా నష్టపోయారని తెలిపారు. దాదాపు 1200 మంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్లారని.. వారందరిని తిరిగి తెలంగాణకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్నేహపూర్వక ప్రభుత్వం ఏర్పడి.. విభజన సమస్యల్లో కదలిక వచ్చిందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులు సంఖ్య తగ్గి పని భారం పెరిగిందన్నారు. ప్రభుత్వం వీలైనంత తొందరలో కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచి వారికి 20 శాతం హెచ్ఆర్ కేటాయించాలని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
‘ఉద్యోగుల పని సంస్కృతి మారకపోతే ఇబ్బందులు తప్పవు’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పని సంసృతి మారకపోతే ఇబ్బందులు తప్పవని మాజీ ఎమెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. గురువారం రెవెన్యూ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ.. వ్యవస్థ మారనంత వరకు రాజకీయ నాయకులు అధికారులపై పెత్తనం చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందంటే అది చూస్తున్న ముఖ్యమంత్రి కూడా బాధపడాలని వ్యాఖ్యానించారు. దేశంలో రాజకీయ అవినీతి అంతం కాకుండా ఉద్యోగుల అవినీతి నిర్మూలన అసాధ్యం అని తెలిపారు. రాజకీయ అవినీతిని తొలగించకుండా ఉద్యోగులపై నెపం నెట్టే ప్రయత్నం సరికాదని సూచించారు. ఉద్యోగులపై దాడి ప్రభుత్వానికి మంచిది కాదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టకముందే రెవెన్యూ అధికారులు మీటింగ్ పెట్టి ఉంటే బాగుండేదిని అభిప్రాయపడ్డారు. అవినీతి ఆగాలంటే వ్యక్తిగత నిజాయితీ, వ్యక్తిగత హితబోధ జరగాలని పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోషియేషన్ మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు మఠం శివశంకర్ మాట్లాడుతూ.. 35 ఏళ్ల నుంచి రెవెన్యూ శాఖలో తప్పులు జరుగుతూ వస్తున్నాయని తెలిపారు. తమిళనాడు, రాజస్తాన్‌లలో ప్రతి గ్రామంలో రెవెన్యూ కార్యాలయం ఉందన్నారు. రెవెన్యూ యంత్రాంగంలో ఎలాంటి శిక్షణ ఉండదని అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో దళారులు ఎక్కువైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. -
రెవెన్యూలో పెరిగిన పనిభారం
సాక్షి, అమరావతి: తీవ్రంగా పెరిగిన పనిభారంతో రెవెన్యూ ఉద్యోగుల తలబొప్పి కడుతోంది. పనిభారం రెట్టింపయినా ఉద్యోగులను మాత్రం ప్రభుత్వం పెంచడం లేదు. ఉన్న ఖాళీల భర్తీకి కూడా చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సుమారు 5,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ‘1986లో తాలూకాల స్థానంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మండల వ్యవస్థను తెచ్చింది. ఒక్కో తాలూకా రెండు మూడు మండలాలు అయ్యాయి. ఉన్న ఉద్యోగులనే మండలాలకు సర్దుబాటు చేసింది కానీ పోస్టుల సంఖ్య పెంచలేదు. గత 32 ఏళ్లలో జనాభా పెరిగింది. కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ, రకరకాల నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ), పంచనామాలు లాంటి విధులు పెరిగాయి. ఇవేకాకుండా ఓటర్ల జాబితాల సవరణ, అభ్యంతరాల స్వీకరణ, ప్రజాసాధికార సర్వే, గ్రామసభలు, జన్మభూమి సభలు, రైల్వే, రోడ్లు, పరిశ్రమలు తదితరాలకు భూసేకరణ లాంటి పనులు రెట్టింపయ్యాయి. ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా రెవెన్యూ శాఖనే ముందుగా కనిపిస్తోంది. చౌక దుకాణాలకు నిత్యావసర సరుకులు వచ్చాయో? రాలేదో? డీలర్లు వీటిని పంపిణీ చేశారో? లేదో రెవెన్యూ ఇన్స్పెక్టర్లే చూడాలి. వాస్తవంగా ఇందులో చాలా పనులు రెవెన్యూ శాఖకు సంబంధం లేనివి. అయితే ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ప్రతి పనికీ రెవెన్యూతోనే లింకు పెట్టి భారం మోపుతోంది’ అని క్షేత్రస్థాయి ఉన్నతాధికారులు చెబుతున్నారు. బరువు మోపేందుకేనా? ‘అన్ని విధులూ మా నెత్తిన పెట్టడానికైతే రెవెన్యూ కీలకమని సర్కారు చెబుతోంది.. పేరుకు రెవెన్యూ శాఖ అయినా చేసేది మాత్రం సాధారణ పరిపాలన శాఖ బాధ్యతలే. మమ్మల్ని సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల్లా గుర్తించాలంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఏ విధంగానూ రెవెన్యూ శాఖకు సంబంధం లేని వ్యవహారం. అయినా ప్రభుత్వం దీనికీ మమ్మల్నే బాధ్యులను చేసింది. రెవెన్యూ ఉద్యోగులు ఎక్కువగా వ్యక్తిగత మరుగుదొడ్ల టార్గెట్లు సాధించడంపైనే దృష్టి పెట్టారు. దీంతో ఇతర రెవెన్యూ పనులన్నీ పెండింగులో పడిపోయాయి’ అని ఒక జిల్లా జాయింట్ కలెక్టర్ వాపోయారు. సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులుగా గుర్తించాలి రెవెన్యూ ఉద్యోగులు సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల్లా అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాకు కలెక్టరేట్ అనేది జిల్లా సచివాలయం. అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లు ఇక్కడకు వస్తాయి. రెవెన్యూ డివిజనల్ కార్యాలయం అనేది డివిజన్‌కు సచివాలయం లాంటిది. అందువల్ల రెవెన్యూ ఉద్యోగులను సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులుగా గుర్తించి ప్రత్యేక స్కేల్ ఇవ్వాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన సీసీఎల్ఏలో ఉంది. త్వరగా దీన్ని ఆమోదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు,రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. -
రెవెన్యూ సమస్య
అసలే సిబ్బంది కొరత.. ఆపై అదనపు పనిభారం.. రికార్డుల ప్రక్షాళనకు తక్కువ గడువు.. వేధిస్తున్న సాంతికేక సమస్యలు.. దీంతో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. పని ఒత్తిడి తగ్గించకపోతే సమ్మె బాట పట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి క్రైం : భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర భుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన వి షయం తెలిసిందే. మూడు నెలల్లో రికార్డుల ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. దీంతో గ్రామ, మండల, జిల్లా స్థాయి రె వెన్యూ అధికారులు, సిబ్బంది తీరికలేకుండా పనిచేసి మొదటి విడత కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆపై రైతుబంధు అమలు, పాస్బుక్కుల జారీ తదితర ప్రక్రియలోనూ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆగమేఘాల మీద పనులు చేయాల్సి రావడంతో పాసుబుక్కులు, రైతుబంధు చెక్కుల్లో చాలా పొరపాట్లు దొర్లాయి. ఇదే సమయంలో రికార్డుల ప్రక్షాళనకు ఉపయోగిస్తున్న సా ఫ్ట్‌వేర్ తరచుగా మొరాయిస్తుండడంతో పనులకు ఆటంకం కలుగుతూనే ఉంది. ప్రక్షాళన, రైతుబం ధు పాస్‌పుస్తకాల, చెక్కుల పంపిణీ, ఫిర్యాదుల స్వీకరణ, తప్పుల సవరణ తదితర పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. దీంతో సిబ్బం ది ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ఓవైపు సాంకేతిక సమస్యలతో పనులు ఆలస్యం అవుతుండడం, మ రోవైపు త్వరగా పనులు పూర్తి చేయాలంటూ అధికారులనుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో మానసి కంగా ఇబ్బంది పడుతున్నామని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలకు తోడు సిబ్బంది కొరత వేధిస్తోందని, దీం తో పనులు వేగంగా సాగడం లేదని పేర్కొంటున్నారు. రాష్ట్రప్రభుత్వం గత సెప్టెంబర్ 15 న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట మూడు నెలల్లో ప్రక్షాళన పూర్తవుతుందనుకున్నారు. ఇప్పటికి పది నెలలు గడిచినా ఒక కొలిక్కి రాలేదు. ఇంకా పార్ట్–బి కి సంబంధించిన భూ రికార్డుల ప్రక్షాళనను ప్రారంభించనే లేదు. ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా పని ఒత్తిడి నుంచి బయటపడేయాలని రెవెన్యూ ఉద్యోగులు కోరుతున్నారు. విధుల్లో ఒత్తిళ్లు... భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం అయ్యాక రెవెన్యూ సిబ్బందికి పనిభారం ఎక్కువైంది. భూ సర్వే, వివరాల నమోదు, ఆన్లైన్ ఎంట్రీలు, వన్ బీల తయారీ, తప్పుల సవరణ, ఫిర్యాదుల స్వీకరణ, డిజిటల్ పాస్బుక్కుల తయారీకి ఏర్పాట్లు, రైతు బంధు చెక్కులు, పాస్బుక్కుల పంపిణీ లాంటి అన్ని కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు మండల, గ్రామస్థాయి అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. నిర్దేశిత సమయాన్ని కేటాయించి పనులు అప్పగించారు. అంతేగాకుండా పనులు చేపడుతున్న తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించారు. రైతుబంధు చెక్కుల పంపిణీ దృష్ట్యా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండటంతో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితి తప్పనిసరైంది. రాత్రిపగలనక పనులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. లక్ష్యం పెద్దదిగా ఉండడం, సమయం తక్కువగా ఉండడంతో తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సి వస్తోందంటున్నారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు. సాంకేతిక సమస్యలు... లక్ష్యాన్ని చేరుకోవడంలో రెవెన్యూ ఉద్యోగులకు సాంకేతిక సమస్యలు తలనొప్పిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేసిన సాప్ట్వేర్ సక్రమంగా పనిచేయడం లేదని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అష్టకష్టాలు పడి పనులు పూర్తి చేశామంటున్నారు. సాంకేతిక సమస్యలు, ఆన్లైన్ కనెక్షన్లు అస్తవ్యస్తంగా ఉండడం ఇబ్బందులు తప్పడం లేదని, పనులు ఆలస్యం అవుతున్నాయని పేర్కొంటున్నారు. వారంలో మూడు, నాలుగుసార్లు ఉన్నతాధికారులు గ్రామాల పర్యటిస్తుండడం కూడా సిబ్బందికి తలనొప్పిగా మారింది. రివ్యూలకే రోజుల తరబడి ఫైళ్లు మోసుకుంటూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత.... అసలే పని ఒత్తిడి తీవ్రంగా ఉన్న రెవెన్యూ శాఖను సిబ్బంది కొరత మరో విధంగా వేధిస్తుంది. కలెక్టరేట్లో ఆరుగురు తహసీల్దార్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరే పనిచేస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పోస్టే ఖాళీగా ఉంది. డీఆర్వో మణిమాల ఉద్యోగ విరమణ పొందాక ఆ స్థానం ఖాళీగానే ఉండిపోయింది. జిల్లాలో మొత్తం 31 మంది తహసీల్దార్లు ఉండాలి. కానీ 24 మందితో వెళ్లదీస్తున్నారు. పిట్లం, నాగిరెడ్డిపేట మండలాలకు ఇన్‌చార్జీలే ఉన్నారు. భిక్కనూరు తహసీల్దార్ రిటైరవడంతో అక్కడా ఇన్‌చార్జియే పనులు చూస్తున్నారు. జిల్లాలో 42 మంది డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకుగాను 36 మందే పనిచేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 50 ఉండగా.. 22 మంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు 44 ఉండగా.. 22 మంది విధుల్లో మాత్రమే ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 45కుగాను 31 మందే ఉన్నారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో కలిపి 87 మంది అటెండర్లు ఉండాల్సి ఉండగా.. 49 మంది మాత్రమే ఉన్నారు. క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పోస్టు వీఆర్వోది. ఒక గ్రామానికి సంబంధించిన పూర్తిస్థాయి రికార్డులు, రెవెన్యూ వ్యవహారాలు చూసుకునే బాధ్యత వారిదే.. జిల్లాలో 255 వీఆర్వో పోస్టులు ఉండగా.. 207 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగిలిన గ్రామాల్లో ఇన్‌చార్జీలే ఉన్నారు. దీంతో ఇన్‌చార్జీలుగా ఉన్న గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం వేగంగా సాగడం లేదు. జిల్లాలో వీఆర్ఏ పోస్టులు 1,523 ఉండగా.. 1,424 మంది పనిచేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకాల పనుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే జిల్లా రెవెన్యూశాఖలో ఉన్న ఖాళీల ప్రభావం తీవ్రంగానే పడుతోంది. ఈ ఖాళీలను, సాంకేతిక సమస్యలను పనిభారాన్ని దృష్టిలో పెట్టుకునైనా తమపై ఒత్తిడి తగ్గించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు. ఒత్తిడి తగ్గించకపోతే సమ్మెకైనా వెనుకాడబోమని పేర్కొంటున్నారు. -
23 ఏళ్లుగా నిరీక్షణ
రెవెన్యూ ఉద్యోగుల చేతి వాటం వల్ల 21 మంది లబ్ధిదారులు 23 ఏళ్ల నుం చి ఇబ్బంది పడుతున్నారు. ఇన్నేళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా బాధితులకు న్యాయం జరగడం లేదు. భూములు మంజూరైన వారిలో కొం దరు లబ్ధిదారులు మరణిం చారు. ఇచ్చిన అనంతరం వారి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదు. నెల్లూరు(పొగతోట) : రాపూరు మండలం తెగచర్లలో సర్వేనంబర్ 263లో 21 మందికి ఎస్సీ, ఎస్టీ, యాదవులకు ప్రభుత్వం ఒక్కొక్కరి ఎకరం చొప్పున 1995లో భూములు పంపిణీ చేసింది. అనంతరంఅధికారులు వాటికి సం బంధించిన పట్టాలు, పాసుపుస్తకాలు కేటాయించి, లబ్ధిదారులకు భూములు చూపించారు. అప్పట్లో కేటాయించిన భూముల్లో రాళ్ల గుట్టలు, చెట్లు ఉంటే బాధితులు రోజుల తరబడి శ్రమించి చదును చేసుకున్నారు. కాగా అవి రోడ్డుపక్కనే ఉన్న భూములు కావడంతో వా టిపై భూ స్వాముల కన్నుపడింది. దీంతో వారు రెవెన్యూ అధికారులతో కుమ్మకై రికార్డులు మార్చేశారు. పాసుపుస్తకాల నంబర్లు సరి చేసి ఇస్తానని వీఆర్వో లబ్ధిదారుల నుంచి వాటిని తీసుకుని తిరిగి ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకున్నాడు. పాసుపుస్తకాల్లో తెగచర్ల అని చెప్పి, భూములు మాత్రం జోరేపల్లిలో ఉన్నాయని రెవెన్యూ అధి కారులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో బాధితులు కలెక్టరేట్, రాపూరు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ గత 23 ఏళ్ల నుంచి తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సెంటు భూమి తమకు కొంత భూమి వచ్చిందనే పేద ల ఆశ రోజుల వ్యవధిలోనే అడిఆశ అ య్యింది. ప్రస్తుతం ఆ భూముల్లో బడా బాబులు నిమ్మచెట్లు సాగు చేసుకుంటున్నారు. గ్రామ వీఆర్వోను బాధితులు మా భూములు ఎక్కడా? అని ప్రశ్నిస్తే జోరేపల్లిలో ఉన్నాయని సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. కాగా బాధితులు జోరేపల్లి వెళ్లి పరిశీలిస్తే అక్కడి ప్ర జలు మా భూముల జోలికి వస్తారా అ ంటు వాదనకు దిగారు. తెగచర్లలో సర్వేనంబర్ 245–11లో 10 మందికి ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. వీటిలో లబ్ధిదారులు నిమ్మచెట్లు వేసుకున్నా రు. అయితే సంవత్సరం తర్వాత ఆ భూములు నావం టూ గ్రామానికి చెం దిన ఓ భూస్వామి రాత్రికి రాత్రే నిమ్మచెట్లను అక్రమించేశాడు.కాగా తెగచెర్లలో పేదలకు పం పిణీ చేసిన భూములే కాకుండా వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణ కు గురయ్యాయి. కాగా 23 ఏళ్ల నుంచి తాము రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అ ధికారులు పట్టించుకోవడం లేదని బా ధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలñ æక్టర్ స్పందించి తమ గ్రామంలో వి చా రణ చేపడితే అసలు విషయం బయట కు వస్తుందని వారు పేర్కొంటున్నారు. 23 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం మాకు 23 ఏళ్ల క్రితం భూములు పంపిణీ చేశారు. వాటిని చదును చేసుకున్న తర్వాత భూ స్వాములు అక్రమించారు. భూములు సాధించుకునేందుకు 23 ఏళ్ల నుం చి పోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలే దు. పట్టాలు, పాసుపుస్తకాలు ఇ చ్చి సర్వేనంబర్లు గ్రామంలోవి కా వని ఇబ్బంది పెడుతున్నారు. కలెక్టర్ స్పందించి విచారణ చేపడితే మాకు న్యాయం జరుగుతుంది. – బుజ్జమ్మ, బాధితురాలు తల్లిదండ్రులిద్దరూ మరణించారు నా చిన్న వయస్సులో భూములు కేటాయించారు. మా తల్లి దండ్రులు భూములు చదను చేశారు. భూములు వస్తాయనే ఆశాతో ఎదురు చూసి తల్లిడండ్రులు ఇద్దరు మరణించారు. నాకు నలుగురు ఆడపిల్లలు. భూములు వస్తే పంటలు సాగు చేసుకోవచ్చుననే ఆశాతో ఉన్నాం. జిల్లా అధికారులు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. – కె.మాచర్ల, బాధితుడు రాత్రికి రాత్రే నిమ్మచెట్లు నరికేశారు సర్వేనంబర్ 245–11లో 68 సెంట్ల భూమి కేటాయించారు. దాన్ని చదును చేసుకుని నిమ్మచెట్లు వేశాం. ఏడాది తర్వాత ఓ భూ స్వామి ఆ భూమి నాదంటూ రాత్రికి రాత్రే చెట్లు నరికేశాడు. విషయం అధికారులు చెప్పినా ఎవ్వరు పట్టించుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతునే ఉన్నా ఇంతవరకు న్యాయం జరగలేదు. – శంకరమ్మ బాధితురాలు ఫిర్యాదు అందలేదు భూములకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. తెగచెర్లకు సంబంధించి భూ సమస్యలపై ఒకటి రెండు ఫిర్యాదులు ఉన్నాయి. సర్వేనంబర్ 263పై ఏవైనా ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తాం. బాధితులు వారి వద్ద ఉన్న పాసుపుస్తకాలు తీసుకువస్తే పరిశీలించి, న్యాయం జరిగేలా చూస్తాం. – అనురాధ, ఇన్చార్జ్ తహసీల్దార్, రాపూరు -
అధికార పెత్తనం!
- టీడీపీ నాయకులకు తలొగ్గిన రెవెన్యూ అధికారులు పుట్టపర్తి అర్బన్ : టీడీపీ నాయకుల అధికార పెత్తనానికి తలొగ్గిన రెవెన్యూ అధికారులు నిరుపేదలకు పంపిణీ చేసిన ఇంటి పట్టాలను రద్దు చేసి నివేశన స్థలాలను స్వాధీనం చేసుకుంటామని నోటీసులు పంపిణీ చేసిన సంఘటన పుట్టపర్తి మండలం గువ్వలగుట్టపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు..మండలంలోని పెడపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 203–3లో సుమారు 33 మంది నిరుపేదలకు రెండు సెంట్లు చొప్పున నివేశ స్థలాలను 2006లో పంపిణీ చేశారు. గ్రామానికి దూరంగా ఉండడం, మౌలిక వసతులు లేక పోవడంతో ఇంటి నిర్మాణాలు చేపట్టలేదు. మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. రెండు నెలల క్రితం స్థానిక సర్పంచ్ భారతమ్మ నీటి వసతి కల్పించడంతో 30 మంది లబ్ధిదారులు నిర్మాణాలకు పూనుకున్నారు. అయితే గ్రామానికి చెందిన కొంత మంది టీడీపీ నాయకుల కళ్లు ఆ స్థలంపై పడ్డాయి. అనుకున్న వెంటనే వారు రెవెన్యూ అధికారులను సంప్రదించి పథకం రచించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి గ్రామ సమీపంలోని ఇళ్ల నిర్మాణాల వద్దకు వెళ్లి నిర్మాణ పనులను ఆపు చేయించారు. అయినా కొందరు నిర్మాణాలను కొనసాగించడంతో ఇన్చార్జ్ తహసీల్దార్ ప్రకాష్‌రావ్ ద్వారా నోటీసులు ఇప్పించారు. మూడు రోజుల లోపు సంజాయిషీ ఇవ్వక పోతే పట్టాను రద్దు చేసి నివేశన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొన్నారు. వెంటనే వారు వైఎస్సార్ సీపీ నాయకులు ఎ.వి.రమణారెడ్డి, చిత్తరంజన్‌రెడ్డి ద్వారా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను కోర్టు దృష్టికి తీసుకెళ్లి పోరాటం సాగించనున్నట్లు ఆయన భరోసా ఇచ్చినట్లు పట్టాదారులు తెలిపారు. అసలే కరువు కాటకాలతో వలసలు పోతున్న సమయంలో వేలాది రూపాయలు వెచ్చించి ఇంటి నిర్మాణాలు చేపడితే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు కావడంతోనే ఇలా కక్ష సాధిస్తున్నారని వారు వాపోయారు. కాగా మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు, ఏడీసీసీ డైరెక్టర్ ఎ.వి.రమణారెడ్డి ఆధ్వర్యంలో పట్టాదారులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సంజాయిషీ ఇచ్చారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని పట్టాలు రద్దు చేసే కార్యక్రమాన్ని విరమించుకోవాలని వారు కోరారు. -
'ఉద్యోగులను కలెక్టర్లు వేధిస్తున్నారు'
హైదరాబాద్ : రాష్ట్రంలో రెవిన్యూ ఉద్యోగులను కలెక్టర్లు వేధిస్తున్నారని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు సమయపాలన లేదనడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా రెవిన్యూ ఉద్యోగులే పని చేస్తున్నారని చెప్పారు. ఆఖరికి కొత్త సినిమా రిలీజైనా తామే పని చేస్తున్నామన్నారు. దళారీ వ్యవస్థ వల్ల ఉద్యోగుల విధులకు ఆటంకం కలుగుతోందన్నారు. ఎవరో తప్పు చేశారని అందరిని నిందించడం సరికాదని వెంకటేశ్వర్లు సూచించారు. -
విజేతగా కలెక్టరేట్ జట్టు
- ముగిసిన రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు అనంతపురం సప్తగిరిసర్కిల్ : రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్ విజేతగా కలెక్టరేట్ జట్టు నిలిచింది. అనంత క్రీడా మైదానంలో జరిగిన ఫైనల్ పోరులో అనంతపురం జట్టుపై విజయం సాధించింది. రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు ఆదివారంతో ముగిశాయి. చివరిరోజు అనంత క్రీడా మైదానంలో అథ్లెటిక్స్, లాంగ్‌జంప్, బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల క్రీడలు రెండు రోజుల నుంచి నగరంలోని ఇండోర్ స్టేడియం, అనంత క్రీడా మైదానం, పోలీస్ పరేడ్ గ్రౌండ్, కృష్ణ కళామందిరాల్లో నిర్వహించారు. జిల్లాలోని 6 సబ్ డివిజన్లలోని క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేశారు. విజేతగా కలెక్టరేట్ జట్టు ఆదివారం జరిగిన తుదిపోరులో అనంతపురం, కలెక్టరేట్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కలెక్టరేట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. జట్టులో అక్రం 45 పరుగులు చేసి జట్టుకు భారీ లక్ష్యాన్ని అందించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది. వ్యాఖ్యాతగా కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్‌కు ఆయన తన కామెంట్రీతో అలరించారు. కలెక్టరేట్ జట్టు విజయం దిశగా పయనించే సమయంలో ఆయన తన కామెంట్ల ద్వారా క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. కార్యక్రమంలో అనంతపురం ఆర్డీఓ మలోలా, జిల్లా రెవెన్యూ సంఘం అ«ధ్యక్షులు జయరామప్ప, భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ హరిప్రసాద్, నిజాం పాల్గొన్నారు. చివరిరోజు విజేతలు వీరే.. 100 మీ పరుగు పందెం పురుషులు అశోక్ చక్రవర్తి–కదిరి–ప్రథమ స్థానం రమేష్–అనంతపురం–ద్వితీయ స్థానం నరసింహులు–ధర్మవరం–తృతీయ స్థానం 4“100 రిలే పరుగు పందెం పురుషులు అనంతపురం–రమేష్ టీం–ప్రథమ స్థానం కళ్యాణదుర్గం–తరుణ్ టీం–ద్వితీయ స్థానం ధర్మవరం–ప్రభంజన్‌రెడ్డి టీం–తృతీయ స్థానం 4“100 మహిళలు లహరిక టీం–ప్రథమ స్థానం నందిని టీం–ద్వితీయ స్థానం బాలమ్మ టీం–తృతీయ స్థానం లాంగ్ జంప్–పురుషులు రమేష్–అనంతపురం–ప్రథమ స్థానం అశోక్ చక్రవర్తి–కదిరి–ద్వితీయ స్థానం లోకేష్–కళ్యాణదుర్గం–తృతీయ స్థానం బాల్ బ్యాడ్మింటన్ పురుషులు ధర్మవరం–ప్రథమ స్థానం కదిరి–ద్వితీయ స్థానం -
రెవెన్యూ రగడ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పరిపాలనలో కీలకమైన రెవెన్యూ శాఖలో మరోసారి రగడ మొదలైంది. కలెక్టర్ కాటంనేని భాస్కర్, రెవెన్యూ ఉద్యోగుల మధ్య వివాదం రాజుకుంది. గతంలోనూ కలెక్టర్ తీరుకు నిరసనగా ఉద్యోగులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా.. రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వర్క్ టు రూల్ (నిబంధనల మేరకే పని) పాటిస్తామని ప్రకటించారు. ఉద్యోగుల విషయంలో కలెక్టర్ తీరు బాగోలేదని, ఆయన పద్ధతి మార్చుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై కలెక్టర్ సైతం స్పందించారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కోపాలు, కక్షలు లేవన్నారు. తాను మారేది లేదని.. ఇలాగే ఉంటానని తెగేసి చెప్పారు. ఉద్యోగుల సంఘ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం మామూలేనని ఆయన కొట్టిపారేశారు. వివరాల్లోకి వెళితే.. కలెక్టర్ భాస్కర్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో భీమవరం తహసీల్దార్ చవాకుల ప్రసాద్‌ను కలెక్టర్ దుర్భాషలాడారు. దీనికి నిరసనగా ఏలూరులోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో ఎన్జీఓ నేతలు సమావేశమయ్యారు. అధికారులు, ఉద్యోగుల విషయంలో కలెక్టర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి వీడియో కాన్ఫెరెన్స్‌లో రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాను పాలించే కలెక్టర్ తీరు మారకపోతే భవిష్యత్‌లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బెదిరించి పనిచేయించడం మానుకోవాలని.. ప్రేమతో పని చేయించుకోవాలని కోరారు. బెదిరించే ధోరణిలో ఉంటే రెవెన్యూ యంత్రాంగం ద్వేషిస్తుందని నాయకులు అన్నారు. సోమవరం నుంచి వర్క్ టు రూల్ పాటిస్తామని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విధుల్లో ఉంటామని స్పష్టం చేశారు. దేనికైనా రెడీ అన్నట్టుగా.. ఎన్జీవో నేతల అల్టిమేటంపై కలెక్టర్ సైతం తీవ్రంగానే స్పందించారు. వందసార్లు చెప్పినా పనులు చేయకపోతే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. జీతం తీసుకుంటున్నాం కాబట్టి పనిచేయాలన్న ఆలోచన వారికి ఉండాలన్నారు. రెవెన్యూ అసోసియేషన్ గతంలోనూ యూనియన్ ఎన్నికలకు ముందు ఇటువంటి ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. ఆరోపణలు చేయడం ఆ తర్వాత వచ్చి క్షమాపణ చెప్పడం కొంతమందికి అలవాటుగా మారిందన్నారు. కలెక్టరేట్లో డ్రైవర్‌గా పనిచేసి.. ఆ తరువాత 12 ఏళ్లపాటు కువైట్‌లో పనిచేసిన వ్యక్తిని తీసుకువచ్చి ఉద్యోగం ఇవ్వాలని తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి కోరాడని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ పరంగా పదవీ విరమణ లబ్ధి చేకూర్చాలని కోరగా.. ఆ పైరవీని తాను అంగీకరించలేదన్నారు. అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉద్యోగుల విమర్శలపై కలెక్టర్ తీవ్రంగానే ప్రతిస్పందించడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పడతారా.. లేక మౌనంగా ఉండిపోతారా అన్నది సోమవారం తేలనుంది. పని చేయకపోయినా ఊరుకోవాలా – కలెక్టర్ భాస్కర్ ఏలూరు (సెంట్రల్) : ‘నాకు వ్యక్తిగత కోపాలు, కక్షలు లేవు. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న మనం ప్రజ లకు సకాలంలో పనులు చేయాలని చెబుతున్నా. వందసార్లు చెప్పినా పనులు చేయకపోతే చూస్తు ఊరుకోవాలా. పని చేయమంటే తిట్టినట్టుగా భావిస్తే ఎలా..’ రెవెన్యూ అసోసియేషన్ నాయకుల అల్టిమేటంపై కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పందిస్తూ అన్న మాటలివి. శనివారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన భాస్కర్ మాట్లాడుతూ జీతం తీసుకుంటున్నాం కాబట్టి పనిచేయాలనే ఆలోచన ఉద్యోగులకు ఉండాలన్నారు. రెవెన్యూ అసోసియేషన్ గతంలోనూ యూనియన్ ఎన్నికల ముందు ఇటువంటి ఆరోపణలు చేసిందన్నారు. త్వరలో ఆ సంఘ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధికోసం కొంతమంది ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరోపణలు చేయడం, తరువాత వచ్చి క్షమాపణలు చెప్పుకోవడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానిం చారు. ఇటువంటి ఆరోపణలకు స్పందిం చాల్సిన అవసరం తనకు లేదని, ప్రజ లకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ విషయాలను బహిర్గతం చేస్తున్నానని అన్నారు. భీమవరం తహసీల్దార్‌ను తాను దుర్భాషలాడానన్న ఆరోపణపై స్పందిస్తూ భీమవరంలో కాపురం ఉంటూ మొగల్తూరులో పనిచేసిన ప్రసాద్‌ను ఏలూరు బదిలీ చేశామని, ఇక్కడకు కూడా రోజూ భీమవరం నుంచి వచ్చి ఉద్యోగం చేస్తానంటే ఎలా అని ప్రశ్నిం చారు. ప్రసాద్ ఇక్కడ పనిచేసినప్పుడు ఆయన తీరులో మార్పు రాలేదన్నారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో భీమవరం బదిలీ చేశామని, అయినా పనితీరులో మార్పు రాలేదన్నారు. అలాంటప్పుడు మందలించకూడదా అని ప్రశ్నించారు. ఏప్రిల్ నుంచి రెండు నెలల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించనని, అందరూ స్వేచ్ఛగా విధులు నిర్వర్తించుకోవచ్చని, ఆ తరువాత వివిధ శాఖల పనితీరు సమీక్షిస్తానని ఫలితాలు ఎలా ఉంటాయో మీడియా ప్రతినిధులు చూడొచ్చని కలెక్టర్ అన్నారు. ఏలూరు వీఆర్ఓ సర్టిఫికెట్ కోసం ఓ మహిళను రూ.2 వేలు లంచం డిమాండ్ చేస్తే ఆ సొమ్ము తాను ఇచ్చానని చెప్పారు. లం చాలు తీసుకుంటే ఊరుకోవాలా.. అటువంటి వారిని శిక్షించకపోతే సమాజంలో అవినీతి పెరగదా అని ప్రశ్నించారు. ఏయే రోజుల్లో సమీక్షిస్తానో ముందుగానే తెలియచేశామని, అధికారులు వారంలో రెండుసార్లు మించి సమావేశాలకు హాజరుకావాల్సిన పనిలేదని అన్నారు. మండల స్థాయి అధికారులతో వారంలో రెండుసార్లు వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రూ.లక్షలు ఖర్చు చేసి రూ.కోట్లు సంపాదించాలనే ఆలోచనతో ఉండే అధికారులు తనకు అవసరం లేదని, నీతి, నిజాయితీలతో ప్రజలకు సేవలందించే అధికారులు కావాలని అన్నారు. వర్క్ టు రూల్ పాటిస్తాం – రెవెన్యూ అసోసియేషన్ నాయకుల అల్టిమేటం ఏలూరు (మెట్రో) : ‘కలెక్టర్ తీరు మారాలి. లేదంటే మేమే మారతాం’ అంటూ కలెక్టర్ కాటంనేని భాస్కర్‌పై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని జిల్లా రెవెన్యూ భవనంలో శనివారం కీలక సమావేశం జరిగింది. కలెక్టర్ ప్రవర్తన, ఉద్యోగులను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న తీరుపై అసోసియేషన్ నాయకులు నిరసన గళం విప్పారు. భాస్కర్ తీరుతో విసిగిపోతున్నామని.. ఆయన పద్ధతి మార్చుకోకుంటే ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని ప్రకటించారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ సోమవారం నుంచి వర్క్ టు రూల్ పాటిస్తామని, ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకే పని చేస్తామని వెల్లడించారు. విధుల విషయంలో చిన్నచిన్న పొరపాట్లు, తప్పిదాలు ఏ ఉద్యోగికైనా సహజమని.. వాటిని పెద్దగా చూస్తూ కలెక్టర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా రెవెన్యూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బాధ్యత గల హోదాలో ఉండి.. పని వేళలను కనీసం గుర్తించకుండా ‘డయల్ యువర్ కలెక్టర్’ అంటూ ఉదయాన్నే కార్యక్రమం నిర్వహిస్తున్నారని.. రాత్రి వేళ వీడియో కాన్ఫెరెన్స్‌లు ఏర్పాటు చేస్తూ ఉద్యోగుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. దీనివల్ల రెవెన్యూ ఉద్యోగులంతా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని వివరించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో భీమవరం తహసీల్దార్ చవాకుల ప్రసాద్‌ను జిల్లా అధికారులంతా చూస్తుం డగా కలెక్టర్ దుర్భాషలాడారని, గతంలోనూ అనేక మందితో నోటికొచ్చినట్టు మాట్లాడారని గుర్తు చేశారు. సమావేశంలో రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డీఏ నరసింహరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జీవీవీ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ, పెదపాడు తహసీల్దార్ వీజీఎస్ కుమార్, అసోసియేట్ కార్యదర్శి, పెరవలి తహసీల్దార్ వై.జితేంద్ర, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జీలుగుమిల్లి తహసీల్దార్ ఎం.రాజశేఖర్, కుకునూరు కార్యాలయ ఏఓ సుబ్బారావు, గోపాలపురం తహసీల్దార్ ఎన్.నరసింహమూర్తి, అత్తిలి తహసీల్దార్ జి.కనకరాజు, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
హోరాహోరీగా రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు రెండోరోజు హోరాహోరీగా సాగాయి. శనివారం స్థానిక ఇండోర్ స్టేడియంలో కబడ్డీ, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, షటిల్, టెన్నికాయిట్ పోటీలను నిర్వహించారు. అన్ని విభాగాల్లోనూ కలెక్టరేట్ క్రీడాకారులు సత్తాను చాటారు. విజేతలుగా నిలిచారు. పురుషులతో సమానంగా క్రీడాకారిణులు కూడా సత్తాచాటారు. నేడు ముగియనున్న పోటీలు రెవెన్యూ ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఆదివారం స్థానిక కృష్ణ కళా మందిరంలో జరగనున్నాయి. ముగింపు కార్యక్రమంలో క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరగనున్న రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్ పోటీల్లో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పాల్గొననున్నారు. క్రికెట్ ఫైనల్ పోటీల్లో అనంతపురం రెవెన్యూ డివిజన్, కలెక్టరేట్ జట్లు తలపడనున్నాయి. రెండోరోజు విజేతలు వీరే క్యారమ్స్ డబుల్స్ విభాగంలో నిర్మల, ప్రమీల–విన్నర్స్ జ్యోతి, బాలమ్మ–రన్నర్స్ క్యారమ్స్ సింగల్స్ విభాగంలో నిర్మల–విన్నర్, సుజాత–రన్నర్ , చెస్ మహిళల విభాగంలో కలెక్టరేట్–విన్నర్, అనంతపురం – రన్నర్, చెస్ పురుషుల విభాగంలో ధర్మవరం – విన్నర్స్, కలెక్టరేట్–రన్నర్స్, షటిల్ బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో (45 ఏళ్లు పై బడి)–డబుల్స్‌లో జ్యోతి, ప్రతిమ–విన్నర్స్ , ప్రమీల, నిర్మల–రన్నర్స్ మహిళల విభాగం (45 ఏళ్ల లోపు), ప్రసన్నలక్ష్మీ, బాలమ్మ–విన్నర్స్, మాధవి, సురేఖ–రన్నర్స్, సింగల్స్ మహిళల విభాగంలో ప్రసన్న లక్ష్మీ– అనంతపురం–విన్నర్ , సురేఖ–ధర్మవరం–రన్నర్, టెన్నికాయిట్ పురుషుల సింగల్స్ విభాగంలో సంజీవరెడ్డి–అనంతపురం , అక్రం–కలెక్టరేట్, డబుల్స్ పురుషుల విభాగంలో కలెక్టరేట్–విన్నర్స్, అనంతపురం–రన్నర్స్ ,షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పురుషుల విభాగంలో కలెక్టరేట్–విన్నర్స్ , అనంతపురం–రన్నర్స్, సింగల్స్ పురుషుల విభాగంలో కళ్యాణదుర్గం–విన్నర్స్, పెనుకొండ–రన్నర్స్, మహిళల విభాగం సింగల్స్‌లో ప్రసన్నలక్ష్మీ–కలెక్టరేట్, సురేఖ–ధర్మవరం , షటిల్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో (45 ఏళ్లు పై బడి) కదిరి–విన్నర్స్, కళ్యాణదుర్గం–రన్నర్స్, క్యారమ్స్ డబుల్స్ పురుషులు కలెక్టరేట్ (శ్రీధర్, గురుప్రసాద్)–విన్నర్స్, అనంతపురం(ప్రసాద్, పునీత్)–రన్నర్స్, సింగల్స్ పురుషుల విభాగంలో గురుప్రసాద్–కలెక్టరేట్–విన్నర్ , ప్రసాద్–అనంతపురం–రన్నర్ , టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో రామకృష్ణారెడ్డి–కదిరి–విన్నర్స్, షణ్ముఖ కుమార్ యాదవ్–ధర్మవరం–రన్నర్స్ కబడ్డీ పురుషుల విభాగంలో కలెక్టరేట్–విన్నర్స్, కళ్యాణదుర్గం కీడ్రాకారులు రన్నర్స్‌గా నిలిచారు. -
నేడు రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్ టోర్నీ
అనంతపురం అర్బన్ : రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ఆదివారం నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మొదట క్రికెట్ టోర్నీని కలెక్టర్ కోన శశిధర్ ప్రారంభిస్తారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆ వివరాలను శనివారం వారు కలెక్టరేట్లో విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు పని ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమన్నారు. అందులో భాగంగానే రెండు సంఘాలు సంయుక్తంగా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే సమయాభావం వల్ల నిర్ణయించిన తేదీ కన్నా ముందే క్రికెట్ పోటీలు మొదలుపెడుతున్నట్లు తెలిపారు. స్థానిక ఆర్డీటీ స్టేడియంలో ఆదివాకరం ఉదయం 8 గంటలకు క్రికెట్ టోర్నీని కలెక్టర్ ప్రారంభిస్తారన్నారు. క్రికెట్ మ్యాచ్‌లు ఇలా... ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం ఉదయం 8 గంటలకు పెనుకొండ, అనంతపురం రెవెన్యూ జట్ల మధ్య, ధర్మవరం, కదిరి రెవెన్యూ జట్ల మధ్య పోటీ ఉంటుంది. విజేతలైన జట్లతో మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్, కళ్యాణదుర్గం రెవెన్యూ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 9 గంటలకు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. -
సమష్టికృషితోనే అభివృద్ధి
– మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందండి – అధికారులు,సిబ్బందికి కలెక్టర్ సూచన – రెవెన్యూ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ అనంతపురం అర్బన్ : ‘‘నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం. మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందుదాం‘‘ అని కలెక్టర్ కోన శశిధర్ ఉద్యోగులకు సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కలెక్టర్ శశిధర్‌ను, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంను ఆదివారం వారి క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం రూపొందించిన డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా పనిచేసి 'అనంత'ను ఉన్నత స్థానంలో నిలపాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలైనప్పుఽడే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, డీఎఫ్ఓ రాజశేఖర్, సీపీఐ రామచంద్ర, ఆర్డీఓలు, రెవెన్యూ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షులు జయరామప్ప, రెవెన్యూ ఉద్యోగులు కల్చరల్, స్పోర్ట్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. -
సర్దుకోవాలే..!
రెవెన్యూ శాఖలో ఉద్యోగుల కొరత కొత్తగా 400 మందికి పైగా అవసరం నూతన పోస్టులు కేటాయించని ప్రభుత్వం హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటుకు గడువు సమీపిస్తున్న కొద్ది రెవెన్యూ ఉద్యోగుల్లో హైరానా పెరుగుతోంది. ప్రస్తుత వరంగల్ జిల్లా విడిపోయి ఐదు జిల్లాలుగా ఏర్పడనుండడంతో సిబ్బందిని సర్దుబాటు చేయడం సమస్యగా మారింది. ప్రధానంగా ఈ ఇబ్బంది రెవెన్యూ శాఖలో తీవ్రంగా ఉంది. అసలే సిబ్బంది కొరతతో సతమతమవుతున్న రెవెన్యూ శాఖలో ప్రస్తుతం కొత్త జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేయడం ఇబ్బందిగా పరిణమించనుంది. కొత్త మండలాలు, జిల్లాలకు సిబ్బందిని ఇస్తామని మొదట్లో ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చినా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఉన్నవారితో సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. 400మందికి పైగా.. ప్రస్తుత ముసాయిదా ప్రకారం వరంగల్ జిల్లాలోని మండలాలకు తోడు పక్క జిల్లాల నుంచి కొన్ని మండలాలను కలుపుకుని ఐదు జిల్లాలు ఏర్పడనున్నాయి. అదేవిధంగా మూడు రెవెన్యూ డివిజన్లు, 13 కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. వీటి ఒక్కో కలెక్టరేట్‌కు కలెక్టర్, జేసీ, డీఆర్వో కాకుండా ఇతర పోస్టులు 47 ఉంటాయి. ఇక ఒక్కో తహసీల్దార్ కార్యాలయానికి పది మంది ఉద్యోగులు అవసరం. వీరితో పాటు సర్వేయర్లు, ఏఎస్‌వోలు అదనం. ఇదేవిధంగా మూడు కొత్త ఆర్డీవో కార్యాలయాలను ప్రతిపాదించగా.. ఇందులో ఒక్కో కార్యాలయానికి 15మందికి తగ్గకుండా సిబ్బంది కావాలి. ఇలా ఐదు కలెక్టరేట్లు, మూడు కొత్త రెవెన్యూ డివిజన్లు, 13మండలాలకు కలిపి మొత్తంగా తహసీల్దార్ కేడర్ నుంచి కింది వరకు సుమారు 400మందికి పైగా సిబ్బంది అవసరమవుతారు. అయితే వీటిలో తాత్కాలికంగా కొన్ని పోస్టులు సర్దుబాటు చేసి మిగతావి కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా స్థాయిలో పదోన్నతుల ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొత్త పోస్టులు మంజూరు కానందున పదోన్నతులు ఇచ్చేందుకు వీలు లేదు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద డీపీసీ కోసం డీటీల జాబితా సిద్ధంగా ఉంది అయితే కొత్త జిల్లాలకు పోస్టులు మంజూరైతేనే ఈ జాబితాపై ఆమోదముద్ర వేసేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే ఖాళీ పోస్టులు ప్రస్తుతం జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ యంత్రాంగానికి ఇబ్బందిగా మారింది. జిల్లాలో మొత్తం 51 మండలాల్లో ఇప్పటికే ఆరు మండలాలకు తహసీల్దార్లు లేరు. కలెక్టరేట్లో 12మందికి ఏడుగురే ఉన్నారు. ఇక డీటీలు, ఆర్ఐలు కూడా అంతంత మాత్రమే. చాలా మండలాల్లో ఎంఆర్ఐ, ఏఆర్ఐ పోస్టులకు ఒక్కొక్కరితోనే నెట్టుకొస్తున్నారు. మండలాల సిబ్బంది ఇలా... కొత్తగా ఏర్పడే రెవెన్యూ మండలాలకు 1985 మండలాల ఏర్పాటు చట్టం ప్రకారం ఉద్యోగులను కేటాయించాలి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంజూరు, ఆర్థిక శాఖ అనుమతి లభిస్తే కింది స్థాయి ఉద్యోగులను పదోన్నతులు, అఫీషియేటింగ్ ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే దసరాకు ఒక రోజు ముందో... అదే రోజో ఉత్తర్వులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జిల్లా స్థాయిలో ఉన్నవారితో సర్దుబాటు చేయాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ప్రసుత్తం కలెక్టరేట్ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఉన్నతాధికారుల కేటాయింపు ప్రసుతం ఉన్న సమాచారం ప్రకారం కొత్త జిల్లాలకు సంబంధించి తహసీల్దార్ స్థాయి నుంచి కింద పోస్టులు జిల్లా స్థాయిలో ఉన్నవారితో సర్దుబాటు చేసుకోవాలి. ఇక కొత్త ఏర్పడే జిల్లాలు, డివిజన్లకు కలెక్టర్, జేసీ, డీఆర్వో, ఆర్డీవో పోస్టులకు అధికారులను ప్రభుత్వం కేటాయించనుంది. కేటాయింపు ఇలా.. ప్రస్తుతం జిల్లాలో కొత్తగా తొర్రూరు, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ రూరల్ పేరుతో మూడు రెవెన్యూ డివిజన్లు అధికారులు ప్రతిపాదించారు. అక్కడ ఆర్డీవో పోస్టును రాష్ట్రం నుంచి భర్తీ చేసినా మిగతా సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్.. ఇతర పోస్టులు ఇక్కడే సర్ధుబాటు చేయాలి. ఇక కొత్త మండలాలలకు మాత్రం డీటీ నుంచి కింది స్థాయి ఉద్యోగులను అదే రెవెన్యూ డివిజన్ పరిధిలోని నుంచి పక్క మండలాల వారిని కేటాయిస్తున్నారు. ఆర్ఐలు ఇద్దరు ఉన్నచోట ఒకరిని కొత్త మండలాలకు ఇస్తారు. ఆర్ఐ పీరియడ్ పూర్తయిన వారికి సీనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇసుక కోసం భూ దందా
* మూడెకరాలు ఇతరుల పేరిట నమోదు * ప్రయోగం చేసిన రెవెన్యూ అధికారి * వాటా కోసం తెలుగు తమ్ముళ్ల లాలూచీ సర్వే నంబరు 660... కొల్లిపర మండలం మున్నంగి గ్రామ పరిధిలోని ఈ సర్వే నంబరు అంటే ఇప్పుడు ఆ మండలంలోనే కాక డివిజన్ స్థాయిలోనూ రెవెన్యూ అధికారులు హడలిపోతున్నారు. విత్‌హెల్డ్‌లో ఉన్న ఈ సర్వే నంబరుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరగవు. అయినా ఇటీవల మూడెకరాల పొలాన్ని అధికారులు చేతివాటంతో ఇద్దరికి కేటాయించారు. అధికారులందరూ జాతీయ జెండా ఆవిష్కరణలు, పుష్కర విధుల్లో బిజీగా ఉండగా, ఓ అధికారి మాత్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూదందాకు పాల్పడ్డాడు. తెనాలి రూరల్: కొల్లిపర మండలం మున్నంగి గ్రామ పరిధిలో సర్వే నంబరు 660 కింద 147.4 ఎకరాలు ఉన్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ సర్వే నంబరులోని పొలాల్లో కొంత మేర సాగు భూమి ఉండగా, మిగిలిన భూమి ఇసుకమేట. మీ భూమి పోర్టల్‌లో మొత్తం 147.4 ఎకరాల్లో రికార్డుల పరంగా 58 మంది పేరున 110.46 ఎకరాలు ఉన్నాయి. మిగిలిన 36.94 ఎకరాలు ఇతరులు అని పొందుపరచి ఉంది. సుమారు రెండేళ్ల క్రితం కొందరు తమ భూమి అన్యాక్రాంతమవుతోందని, తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌లో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సర్వే నంబరును విత్‌హెల్డ్ జాబితాలో చేర్చారు. ఈ భూములను సాగుచేస్తున్న సుమారు 30 మంది అడంగల్, పట్టాదారు పుస్తకం, భూమి కొలతల మార్పులు చేర్పులు, పేర్లు సరి చేయాలంటూ దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. మీ భూమి పోర్టల్‌లో మాయ చేశారు... ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15వ తేదీన 660 సర్వే నంబరులోని భూమికి సంబంధించి ఇద్దరి పేరున మూడెకరాలు ఉన్నట్టు మీ భూమి పోర్టల్‌లో మార్పు జరిగింది. యల్లమాటి భూషణం(ఖాతా నంబరు 100116) పేరిట ఒక ఎకరం, కేఎస్ కుమారి(ఖాతా నంబరు 100117) పేరున రెండెకరాలుగా నమోదు చేశారు. అంటే 58గా ఉన్న సాగుదారులు 60కి పెరిగారు. ఏడాదిన్నరగా విత్‌హెల్డ్‌లో ఉన్న సర్వే నంబరు భూమిలో లావాదేవీలకు ఆస్కారం లేదని తెలిసిందే. అలాంటపుడు ఒకేరోజు మూడెకరాల భూమిని ఇద్దరి పేర్లతో చేర్చి, మళ్లీ విత్‌హెల్డ్‌లో వుంచడమంటే ఉన్నతాధికారుల నోటీసు లేకుండా జరిగివుండదనే భావన వ్యక్తమవుతోంది. ఇసుక కోసమే.? నదీ పరివాహక ప్రాంతం కావడంతో ఇసుకను తవ్వుకుని సొమ్ము చేసుకునేందుకే ప్రధానంగా ఈ దందాకు పాల్పడినట్టు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరంలో ఇసుక తవ్వి అమ్ముకుంటే ఖర్చులన్నీ పోను సుమారు రూ.10 లక్షల వరకు మిగులుతాయి. అందుకోసమే మూడెకరాలను ప్రస్తుతానికి ఇద్దరి పేరున నమోదు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా పేర్లూ చేర్చు.. చర్యలుండవు... ఈ పకడ్బందీ దందా ఎలాగో మొత్తానికి బయటకు పొక్కింది. కొత్తగా నమోదు చేసిన పేర్లను తీసివేసి, తిరిగి విత్‌హెల్డ్ కొనసాగేలా చేద్దామన్న ఆలోచనలో సదరు అధికారి ఉండగా, కొందరు తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. ‘అయ్యిందెలాగూ అయింది.. మాపేర్లు కూడా చేర్చు.. చర్యలు లేకుండా మేము చూస్తాం..’ అని భరోసా ఇచ్చారని తెలుస్తోంది. నేను కొత్తగా వచ్చా... విచారణ చేస్తాం... నేను ఆగస్ట్ 10వ తేదీన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, 26వ తేదీ వరకు నాకు డిజిటల్ సైన్ రాలేదు. భూ దందాకు సంబంధించిన వ్యవహారం నా దృష్టికి రాలేదు. విచారిస్తాను. – సీహెచ్‌వీ రమణమూర్తి, తహసీల్దారు -
సచివాలయం వద్ద రెండో రోజు ఉద్యోగుల నిరసనలు
హైదరాబాద్: స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు బుధవారం తమ నిరసనలు తెలిపారు. ఉన్నతాధికారుల వద్ద పీఎస్లుగా పని చేస్తున్నవారిని తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును టీ. ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్ పీఎస్ పద్మావతిపై వారు ఫిర్యాదు చేశారు. అనంతరం పద్మావతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పద్మావతి చైర్‌ను ఉద్యోగులు బయటపెట్టారు. ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని నినదించారు. -
'వీఆర్ఏలను రికార్డు అసిస్టెంట్లుగా నియమిస్తాం'
హైదరాబాద్: ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పెట్టకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై ఆయన బుధవారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. కొత్త అర్బన్ మండలాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రతి మూడు లక్షల మందికి ఒక తహశీల్దార్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నామని అధికారులకు తెలిపారు. ఇకపై రెవెన్యూ ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి స్పష్టం చేశారు. ఉన్నత విద్యార్హత గల వీఆర్ఏలను రికార్డు అసిస్టెంట్లుగా నియమిస్తామన్నారు. కొత్త తహశీల్దార్లు ఏజెన్సీలో పనిచేసేలా నిబంధలు తీసుకొస్తామని చెప్పారు. -
'ఏయ్.. జేసీ నువ్వేం చేస్తున్నావ్'
► ఏం తమాషానా.. ఇదేం పాలన?.. వదలను: సీఎం ► ‘జన్మభూమి-మీ ఊరు’లో రెవెన్యూ అధికారులపై బాబు మండిపాటు సాక్షి, విజయవాడ: ‘‘ఏయ్ నువ్వు ఏం చేస్తున్నావ్.. ఏం తమాషాగా ఉందా? ఇదేం అడ్మినిస్ట్రేషన్? ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఏయ్ జేసీ చంద్రుడు.. నువ్వు ఏం చేస్తున్నావ్? నేను ఎవరినీ వదిలిపెట్టను’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ అధికారులపై విరుచుకుపడ్డారు. వీఆర్ఓ మొదలుకొని జాయింట్ కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారులను జన్మభూమి బహిరంగ సభ వేదికపైకి పిలిచి మరీ తనదైన శైలిలో తీవ్ర స్వరంతో మందలించారు. సీఎం వైఖరి పట్ల అధికారులు నొచ్చుకున్నారు. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలులో మంగళవారం ‘జన్మభూమి-మా ఊరు’ సభకు చంద్రబాబు హాజరయ్యారు. అధికారులనే లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. గ్రామానికి చెందిన పోలేపల్లి అంజలికి సభావేదికపై పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడానికి అధికారులు ఆమెను వేదికపైకి తీసుకొచ్చారు. సీఎం ఆమెతో మాట్లాడారు. నీకు పట్టాదారు పాసు పుస్తకం ఎందుకు? అని సీఎం ప్రశ్నించడంతో పాసుబుక్ లేకపోతే మీ భూమి రికార్డుల్లో ఉండదని అధికారులు చెప్పారని, అందుకే పుస్తకం తీసుకుంటున్నామని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. భవిష్యత్తులో మీభూమి పోర్టల్ ద్వారా ఫాం-1బి తీసుకోవాలి, పట్టాదారు పాసుబుక్ అవసరం లేదు, అధికారులు కావాలని చెప్పడంతో ఇదంతా జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. వేదికపైకి వీఆర్ఓ లావణ్యను పిలిచారు. గ్రామంలో ఎంతమందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారని ప్రశ్నించారు. 2,008 మందికి గాను 1,474 పుస్తకాలు ఇచ్చామని చెప్పడంతో మిగిలిన వాటి సంగతి ఏంటని నిలదీశారు. వాటిలో తప్పులు ఉన్నాయని వీఆర్ఓ చెప్పడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో ఉన్న రైతులు కూడా పాసు పుస్తకాలు ఇవ్వడం లేదంటూ నినాదాలు చేయడంతో బాబు అధికారులపై మండిపడ్డారు. తహసీల్దార్ నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట సంజీవిని ప్రారంభం పంటలకు నిత్యం నీరు ఉండడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వం రూపొందించిన పంట సంజీవిని పథకాన్ని పెనుగంచిప్రోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. సగటున 3 నుంచి 5 ఎకరాలు ఉన్న ప్రతి పొలంలో పల్లపు ప్రాంతంలో నీటి కుంటను తవ్వుకొని, అక్కడ వర్షపు నీటిని నిల్వ చేసుకొని వినియోగించుకోవాలని సూచించారు. -
ఏడో తరగతి పాసైనా సరే!
వీఆర్ఏ కారుణ్య నియామకాలకు వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్ఏ)లకు సంబంధించి కారుణ్య నియామకాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తెలంగాణ వీఆర్ఏ సర్వీస్‌రూల్స్‌కు సంబంధించి గతంలో జారీచేసిన ఉత్తర్వులను సవరిస్తూ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జారీచేసిన జీవో 161 ప్రకారం మరణించిన వీఆర్ఏ కుటుంబంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందగోరిన వారికి కనీస విద్యార్హత టెన్త్‌గా ఉండేది. దీంతో తెలంగాణ వీఆర్ఏల కేంద్ర సంఘం, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం(ట్రెసా) విన్నపాల మేరకు సర్కారు వెసులుబాటు కల్పించింది. సవరణ ఉత్తర్వుల మేరకు బాధిత కుటుంబంలో ఉద్యోగం కోరుకునే వారు ఏడవ తరగతి పాసై ఉంటే చాలు. అయితే.. సదరు అభ్యర్థి కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లలో టెన్త్ పాసవ్వాల్సి పొందాల్సి ఉంటుంది. లేని పక్షంలో సర్వీసు నుంచి తొలగించనున్నట్లు స్పష్టం చేసింది. -
సీఎస్ వరం.. సీసీఎల్ఏ నిర్లక్ష్యం
- అమలుకు నోచుకోని సీఎస్ హామీలు - రెవెన్యూ ఉద్యోగులకు తప్పని పాట్లు - నాన్చుడు ధోరణిలో సీసీఎల్ఏ అధికారులు సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు గత జూలైలో ఆందోళన (వర్క్ టు రూల్) చేశారు. దీంతో సర్కారు సైతం ఒక మెట్టు దిగింది. వారి డిమాండ్లు న్యాయ సమ్మతమైనవేనని, వెంటనే పరిష్కరిస్తామని సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ హామీ ఇచ్చి రెండు నెలలు గడిచాయి. అయినా ఇంతవరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేరలేదు. దీనికి భూపరిపాలన విభాగం (సీసీఎల్ఏ) అధికారుల నాన్చుడి ధోరణే కారణమని తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థలో అత్యధికంగా 23 వేలమంది ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రభుత్వ ఉద్యోగులందరి మాదిరిగానే 010 పద్దు కింద వేతనాలు చెల్లించేందుకు, ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల వేతనాన్ని పీఆర్సీ సిఫార్సుల ప్రకారం పెంచేందుకు అంగీకారం తెలుపుతూ.. ఈమేరకు ఫైలు పంపాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. అయితే, సీసీఎల్ఏలో ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఉలుకుపలుకు లేదు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతి నిధులు ప్రతిరోజూ సచివాలయం, భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతిపాదనలు పంపేదెన్నడో.. వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతుల కోటాను పెంచడం, పదవీ విరమణ పొందిన వీఆర్ఏలకు కనీస పింఛను, అర్హులైన డిప్యూటి తహ శీల్దార్లకు తహశీల్దార్లుగా, తహశీల్దార్లకు డిప్యూటి కలెక్టర్లుగా పదోన్నతులు, ఆర్డీవో, తహశీల్దార్లకు వాహన సదుపాయం, మండల, గ్రామ రెవెన్యూ కార్యాలయాల ఆధునీకరణ, రెవెన్యూ కార్యాలయాల గ్రేడింగ్, వీఆర్వోల నుంచి కలెక్టర్ వరకు సీయూజీ మొబైల్ కనెక్టివిటీ, కలెక్టరేట్లలో ఉన్న ఏజేసీ పోస్టును జేసీ-2గా చే యడం, పరిపాలనాధికారి (ఏవో) పోస్టులను డిప్యూటి కలెక్టర్ స్థాయికి పెంచడం, డిప్యూటి కలెక్టర్ కేడర్‌లో తహశీల్దార్ల పోస్టుల స్థాయిని తగ్గించడం తదితర డిమాండ్లకు నాడు సీఎస్ అంగీకారం తెలిపారు. వీటిపై సీసీఎల్ఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. మళ్లీ ఆందోళన చేస్తాం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. ప్రమోషన్ల గురించి అడిగితే కోర్టు కేసులంటూ అధికారులు తప్పుకుంటున్నారు. పోనీ మిగిలిన సమస్యలన్నా పరిష్కరించారా అంటే అదీ లేదు. పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొద్దిరోజుల సమయం కోరారు. పరిష్కారం కాకుంటే మళ్లీ ఉద్యమిస్తాం. -శివశంకర్, రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడి సమస్యలు అక్కడే చిరుద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం కాకుండా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పలుమార్లు ధర్నాలు, ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. పీఆర్సీ సిఫార్సుల మేరకు వేతనం పెంపు, ప్రమోషన్ చానల్ మార్పు, మూడేళ్లకు పదోన్నతి లభించేలా నిబంధనలు మార్చాలని అడుగుతున్నాం. -శివరాం, వీఆర్ఏ (డెరైక్ట్ రిక్రూట్మెంట్)ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
కలెక్టర్ తీరుపై నిరసనోద్యమం
- చిత్తూరులో రెవెన్యూ ఉద్యోగుల భారీ ర్యాలీ, ధర్నా - అనవసరంగా వేధిస్తున్నారని ఆరోపించిన రెవెన్యూ ఉద్యోగ సంఘ నేతలు - సస్పెండ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చిత్తూరు (గిరింపేట) : జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తమను వేధిస్తున్నారని నిరసిస్తూ జిల్లాలోని వేలాది మంది రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం చిత్తూరులో ర్యాలీ నిర్వహించారు. గిరింపేట నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ నిరంతరం కష్టపడి ప్రజలకు సేవలందిస్తున్న తమ పట్ల కలెక్టర్ ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా ఉద్యమం చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎటువంటి కారణం లేకుండా రెవెన్యూ ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన వలే కలెక్టర్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయపాలన లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు వీడియోకాన్ఫరెన్స్‌లు పెట్టి ఉద్యోగులను హింసిస్తున్నారన్నారు. డెప్యూటీ తహశీల్దార్లు నిర్మల, శకుంతల, జూనియర్ అసిస్టెంట్ లీలాకృష్ణారెడ్డిని అన్యాయంగా సస్పెండ్ చేశారన్నా రు. వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యవేడు, పాకాల, గంగవరం సత్యనారాయణ నాయుడు, కృష్ణయ్య,రమణిని బలవంతంగా సెలవులో పంపారని ఆరోపించారు. రెవెన్యూ సిబ్బం దిని ప్రతి సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు సమీక్షల పేరుతో వేధిస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ధోరణిపై రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు మంగళవారం రెవెన్యూ మంత్రికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు విజయసింహారెడ్డి తెలిపారు. తిరుపతి డివిజన్ అధ్యక్షుడు నరసింహులనాయుడు మాట్లాడుతూ సమావేశాల్లో కలెక్టర్ రెవెన్యూ ఉద్యోగుల పట్ల అవమానకరంగా మాట్లాడడం మానుకోవాలన్నారు. సస్పెన్షన్‌కు గురైన వీఆర్వో రామనారాయణను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నుంచి ఉత్తర్వులు అంది 110 రోజులు అయినా, ఇంతవరకు విధుల్లోకి తీసుకోకుండా కలెక్టర్ వేధిస్తున్నట్లు తెలిపా రు. చిత్తూరు డివిజన్ అధ్యక్షుడు రమేష్ పాల్గొన్నారు. వామపక్ష పార్టీల నాయకులు నాగరాజన్, రమణ, మధుకుమార్ తదితరులు మద్దతు తెలిపారు. -
'కలెక్టర్ వేధింపులు ఎక్కువయ్యాయి'
గిరీంపేట: చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మంగళవారం విధులు బహిష్కరించిన ఉద్యోగులు పాత కలెక్టర్ బంగ్లా నుంచి కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు మాట్లాడుతూ స్వాతంత్య్ర దినం సందర్భంగా తమకు కనీసం ప్రశంస పత్రాలు కూడా ఇవ్వలేదని, ఇటీవలి కాలంలో ఆయన వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఆయనను వెంటనే బదిలీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంత ఉద్యోగులు మినహా అందరూ విధులు బహిష్కరించారు. చిత్తూరులో జరిపిన ఆందోళన కార్యక్రమానికి దాదాపు వెయ్యిమంది ఉద్యోగులు తరలివచ్చారు. -
కలెక్టరేట్ ముట్టడికి రెవెన్యూ ఉద్యోగుల యత్నం
పీలేరు (చిత్తూరు): చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్ద జైన్, రెవెన్యూ ఉద్యోగులతో కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగ సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిచ్చాయి. దీంతో మంగళవారం ఉదయం పీలేరు రెవెన్యూ ఉద్యోగుల కలెక్టరేట్ ముట్టడికి బైకులపై ర్యాలీగా వెళ్లారు. కలెక్టర్ తీరుకు నిరసనగా తాము కలెక్టరేట్ ముట్టడి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఓ రెవెన్యూ ఉద్యోగి తెలిపాడు. -
అందులో రెవెన్యూ ఉద్యోగులను మినహాయించాలి
- ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు డిమాండ్ ఒంగోలు టౌన్ (ప్రకాసం జిల్లా) : రెవెన్యూ ఉద్యోగులను సాధారణ బదిలీల నుండి మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రెవెన్యూ ఉద్యోగుల బదిలీల్లో రిక్వస్ట్, పరస్పర అవగాహన కలిగిన వారిని మాత్రమే బదిలీ చేయాలని సూచించారు. సోమవారం ఒంగోలులోని రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం 57, 58, 60, 98ఇలా రకరకాల జీఓలు జారీ చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ ప్రథమార్థంలో రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్నందున ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల బదిలీలపై సానుకూలంగా స్పందించాలని, ఇదే విషయాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు బొప్పరాజు వెల్లడించారు. -
గుంటూరు కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగుల ధర్నా
గుంటూరు : గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయం ఎదుట సోమవారం వీఆర్ఓ, వీఆర్ఏ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రెవెన్యూ ఉద్యోగులపై దాడికి దిగిన టీడీపీ రియల్టర్లపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతున్న రియల్టర్లను అడ్డుకున్నందుకు అసభ్య పదజాలంతో దుర్భాషలాడి, రెవెన్యూ ఉద్యోగుల చొక్కాలు ఊడదీయించిన సంగతి తెల్సిందే. -
చింతమనేనికి ముఖ్యమంత్రి రక్ష!
తహసీల్దార్‌పై దాడి కేసును నీరుగార్చే యత్నం * పరిస్థితిని చక్కదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశాలు * మంత్రి ఉమ రాజీయత్నాలు సాక్షి, విజయవాడ బ్యూరో: ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి వ్యవహారం రోజురోజుకీ ఉద్ధృత రూపం దాలుస్తుండడం, ప్రభుత్వం పరువు బజారున పడడంతో సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఈ కేసు నుంచి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను బయటపడేసేందుకు రక్షగా నిలిచిన బాబు అధికారులను దారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దాలని మంత్రి దేవినేని ఉమకు సీఎం బాధ్యతలు అప్పగించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి ఉమ శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నేతలు మోడల్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి ఉమతో చర్చల్లో పాల్గొన్నారు. వనజాక్షికి నచ్చజెప్పి కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. పుష్కరాల విధులకు హాజరు కావాలని, ఆందోళన విరమించాలనే ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాలు ససేమిరా అనడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆందోళన విరమించాలి: మంత్రి ఉమ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని దేవినేని ఉమ మీడియాతో అన్నారు. తహసీల్దార్‌పై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి సూచించామన్నారు. చర్చల్లో రెవెన్యూ అసోసియేషన్ నేతలు మూడు ప్రధాన డిమాండ్లు పెట్టారు. చింతమనేని అరెస్టు, ఆయన అనుచరుల అరెస్టు, సంఘటన స్థలంలో ఉండి మహిళా అధికారిపై దాడి జరుగుతున్నా పట్టించుకోని ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలకు డిమాండ్ చేశారు. చింతమనేని అరెస్టు మినహా మిగిలిన రెండు డిమాండ్లను నెరవేర్చేందుకు మంత్రి.. కృష్ణా, పశ్చిమ గోదావరి ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు. చింతమనేనిని అరెస్టు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. సోమవారం వరకు ఆగాలని, సీఎం నిర్ణయం తీసుకుంటారని ఉమ నచ్చజెప్పారు. సోమవారం రండి మాట్లాడుకుందాం జరిగిన ఘటనపై సోమవారం మాట్లాడుకుందామని, హైదరాబాద్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం చంద్రబాబు సూచించినట్లు సమాచారం. బాధితురాలు వనజాక్షి, రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో ఆయన వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా, మహిళా అధికారిపై దౌర్జన్యం చేసిన ఘటనలో ముసునూరు పోలీస్ స్టేషన్లో చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైన సంగతి తెల్సిందే. నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైనప్పటికీ చింతమనేనిని అరెస్టు చేయకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు దాటవేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వనజాక్షిపై దాడికి నిరసనగా కృష్ణా జిల్లాలో అన్ని తహసీల్దార్ కార్యాలయాకు శుక్రవారం తాళాలు వేశారు. సోమవారం నాటికి చింతమనేనిని అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. మరోవైపు వనజాక్షిపై చింతమనేని దాడి ఘటనపై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్యోగ సంఘాలు, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలు చింతమనేనిని అరెస్టు చేసి విప్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి. -
అధికార జులుంపై నిరసన
♦ టీడీపీ ఎమ్మెల్యేని అరెస్టు చేయండి ♦ రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన ♦ నల్లబ్యాడ్జీలతో విధుల్లో పాల్గొన్న అధికారులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాటపట్టారు. మహిళా తహశీల్దార్‌పై దాడిచేసిన ఎమ్మెల్యేని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేట వద్ద అక్రమంగా ఇసుకను తరలించడాన్ని అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షి, ఆర్ఐపై టీడీపీ ఎమ్మెల్యే విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనపై జిల్లాలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తహశీల్దార్‌పై దాడిచేసిన వారిని వెంటనే శిక్షించాలని నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఏపీఆర్ఎస్ఏ, ఎస్‌ఆర్‌ఎస్‌ఏ నాయకులు ఆందోళన చేశారు. నెల్లూరు రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో కలిగిరి, ఉదయగిరిల్లో రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ ఎంప్లాయీస్ టీడీపీ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. కావలి పరిధిలో రెవెన్యూ కార్యాలయాల్లో ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో ఆర్డీఓ, తహశీల్దార్లు, సిబ్బంది నిరసన తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు మండల రెవెన్యూ ఉద్యోగులు టీడీపీ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి ఎమ్మెల్యేని అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఏఎస్‌పేట, మర్రిపాడు, సంగం, చేజర్ల మండల కార్యాలయాల వద్ద రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో డక్కిలిలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. గూడూరులో ఆర్డీఓ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు మద్దతుగా పలుచోట్ల వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ మద్దతు తెలిపారు. -
ఆందోళన తీవ్రతరం
పట్టుబిగించిన రెవెన్యూ ఉద్యోగులు చింతమనేని అరెస్ట్‌కు డిమాండ్ మంత్రి ఉమాతో చర్చలు విఫలం సోమవారం చర్చిద్దామన్న సీఎం జిల్లాలో స్తంభించిన పాలన విజయవాడ : తహశీల్దార్ వనజాక్షిపై దాడికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన జరిపారు. నగరంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో తహశీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. వీరికి సంఘీభావంగా వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్, మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బందరు కలెక్టరేట్‌ను మూసివేసి గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారికి మద్దతుగా ఇతర ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందీ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని ఆందోళనకు మద్దతు ప్రకటించారు. నగరంలో హడావుడి నగరంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రెవెన్యూ ఉద్యోగులు, ఎన్జీవో నాయకులు హడావుడి చేశారు. ఉదయం రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఏపీఆర్ఎస్ఏ నాయకులతో చర్చలు జరిపారు. అనంతరం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించడంతో ఇంద్రకీలాద్రి వద్ద ఉన్న ఇరిగేషన్ మోడల్ గెస్ట్‌హౌస్‌కు తహశీల్దార్ వనజాక్షి, ఇతర తహశీల్దార్లు, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు చర్చలు జరిగాయి. వనజాక్షిని అవమానించి, ఆమెపై దాడిచేసిన చింతమనేనిని అరెస్ట్ చేయాల్సిందేనని ఉద్యోగులు తేల్చిచెప్పారు. మంత్రి ఉమాతో చర్చలు విఫలం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో ఏపీఆర్ఎస్ఏ, ఎన్జీవో నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చింతమనేని ప్రభాకర్‌తో పాటు తహశీల్దార్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే అంగరక్షకులు, అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ ఘటనను చూస్తూ ప్రేక్షకపాత్ర పోషించిన ముసునూరు ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని కోరారు. అయితే, ఇందులో ఎమ్మెల్యే చింతమనేని అనుచరులను అరెస్ట్ చేసేందుకు, ఎస్ఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునేందుకుమ మాత్రమే మంత్రి హామీ ఇవ్వడంతో చర్యలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లు శుక్రవారం సాయంత్రానికి అమలు కావాలని యూనియన్ నేతలు మంత్రికి వివరించారు. ఎమ్మెల్యే అరెస్ట్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి సీఎంతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా తహశీల్దార్ వనజాక్షి, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజుతో కూడా జరిగిన సంఘటనపై సీఎంతో మాట్లాడారు. దాడిని ఖండించిన ఆయన ఇటువంటి సంఘటనలు బాధాకరమన్నారు. దీనిపై తాను సోమవారం చర్చిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం నుంచి ఆందోళన ఉధృతం శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం నుంచి ఆందోళనా కార్యక్రమాన్ని ఉధృతం చేసేందుకు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించింది. అయితే, ముఖ్యమంత్రి సోమవారం అసోసియేషన్‌తో చర్చించేందుకు హామీ ఇచ్చినందున అంతవరకు వేచి చూడాలనే ధోరణి ఉద్యోగ సంఘాల నేతల్లో ఉంది. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వేదన తహశీల్దార్లో ఉన్నట్లు మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద శుక్రవారం రెండు గంటల పాటు జరిగిన పరిణామం స్పష్టం చేసింది. మంత్రి దేవినేనితో చర్చలు విఫలం కాగానే బయటకు వచ్చిన వనజాక్షి నేరుగా కారులో వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కారు తలుపు రాకపోవడంతో ఏపీఆర్ఎస్ఏ నాయకులు వనజాక్షికి నచ్చజెప్పి మీడియాతో మాట్లాడించారు. చర్చల్లో మంత్రి వ్యవహరించిన తీరు నచ్చక ఆమె బాధతో వెళ్లిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అక్కడి ఉద్యమ నాయకులు ఆమెను వారించి అందరితో పాటు తీసుకువెళ్లారు. -
కృష్ణా జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన
విజయవాడ: కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు దాడిని జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. ఎమ్మార్వోపై దాడికి నిరసనగా శుక్రవారం వివిధ ప్రాంతాలలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ముసునూరు మండలం నేలపాటివారికుంట సమీపంలోని రహదారిపై రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగి..బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే నందిగామ ఎమ్మార్వో కార్యాలయానికి రెవెన్యూ ఉద్యోగులు తాళాలు వేసి తమ నిరసన తెలిపారు. -
మళ్లీ అదే చీప్ ట్రిక్...ఎమ్మెల్యే హల్చల్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తనకు నచ్చని అధికారులపై అనుచరవర్గంలోని మహిళలు, దళితులను ఉసిగొల్పి తప్పుడు కేసులు పెట్టించడం.. వంటి వాటితో ఐదారేళ్లుగా దందా చేస్తున్న దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ గురువారం మరోసారి అదే చీప్ ట్రిక్‌ను ప్రయోగించారు. కృష్ణాజిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై బుధవారం చింతమనేని, ఆయన అనుచరుల దాడిని నిరసిస్తూ రాష్ర్టవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు రోడ్డెక్కారు. దీంతో చింతమనేని మరోసారి తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. ముసునూరు ఇసుక ర్యాంపు వద్ద తహశీల్దార్ వనజాక్షి తమపై దాడి చేశారని, కులం పేరుతో దుర్భాషలాడారని విజయరాయి ఇసుక సొసైటీ సభ్యులైన మీసాల కుమారి, సేసం నాగలక్ష్మిలతో పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఇసుక సొసైటీ సభ్యులపై దాడి చేసిన తహశీల్దార్‌ను వెంటనే అరెస్ట్ చేసి విధుల నుంచి తొలగించాలని గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అనుచరులు భారీఎత్తున ధర్నా చేపట్టారు. అనంతరం ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు వినతిపత్రం సమర్పించారు. చింతమనేని ఏలూరు రేంజి డీఐజీ హరికుమార్‌తో భేటీ అయ్యారు. -
‘రెవెన్యూ’లో పదోన్నతులకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: గత పది రోజులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు జరిపిన ఆందోళనతో ఎట్టకేలకు సర్కారు దిగివచ్చింది. రెవెన్యూ విభాగంలో వివిధ స్థాయిల్లో పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పదోన్నతుల నిమిత్తం ఈ నెల 20న శాఖాపరమైన పదోన్నతుల(డీపీసీ) క మిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరి పాలన విభాగం ముఖ్య(ఇన్చార్జి) కమిషనర్ రాజీవ్‌శర్మ ప్రకటించారు. డిమాండ్ల పరి ష్కారం నిమిత్తం రెవెన్యూ జేఏసీ ప్రతినిధులు సీఎస్‌తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. గురువారం సీసీఎల్ఏ కార్యాలయంలో జరిగిన చర్చల అనంతరం సీఎస్ రాజీవ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన పలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా అర్హులైన డిప్యూటీ తహసీల్దార్ల(డీటీ)కు తహసీల్దారు, తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టరు పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను వెంటనే విడుదల చేయాలని సీసీఎల్ ప్రిన్సిపల్ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. సీనియారిటీ జాబితాపై ఈనెల 16 వరకు ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని, 20న డీపీసీ సమావేశమై పదోన్నతుల ప్రక్రియను చేపడుతుందన్నారు. షరతులతో పదోన్నతులు.. కమలనాథన్ కమిటీ విభజన ప్రక్రియ కొలిక్కి రానందున తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చే విషయమై కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సీఎస్ చెప్పారు. అయితే.. ఖాళీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన తహసీల్దార్లకు షరతులతో కూడిన పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కమలనాథ న్ కమిటీ ప్రక్రియ అనంతరం పోస్టులు ఖాళీ ఉండని పక్షంలో.. పదోన్నతులు పొందిన వారు వెనక్కి వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాగే.. కీలకమైన రెవెన్యూ విభాగంలో ఉద్యోగులకు సరైన విశ్రాంతి లభించ నందున, తప్పనిసరి పరిస్థితుల్లో మినహా సెలవు రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. వీఆర్వోలకు పెన్షనరీ బెనిఫిట్, 010 పద్దు కింద వేతనాలు అందించేందుకు అంగీకరించారు. ఆందోళన విరమిస్తున్నాం: రెవెన్యూ జేఏసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున, తమ ఆందోళన కార్యక్రమాలను విరమిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి, సెక్రటరీ జనరల్ శివశంకర్, కన్వీనర్ లచ్చిరెడ్డి, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి, వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు శివరామ్ ప్రకటించారు. చర్చల్లో సీసీఎల్ఏ ప్రిన్సిపల్ కమిషనర్ అధర్‌సిన్హా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 3 కేటగిరీలుగా విభజన.. మండల రెవెన్యూ కార్యాలయాలకు పక్కా భవనాలు, తగినంత మంది సిబ్బంది, అవసరమైన మేరకు బడ్జెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎస్ రాజీవ్ శర్మ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండల రెవెన్యూ కార్యాలయాలను మూడు కేటగిరీలుగా విభజిస్తామని, జిల్లా కేంద్రాల్లో, మున్సిపల్ ఏరియాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఆర్వో ఆఫీసులను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రతిపాదనలను పంపాలని ప్రిన్సిపల్ కమిషనర్‌ను ఆదేశించామన్నారు. -
వర్క్ టు రూల్!
- నేటినుంచి రెవెన్యూ ఉద్యోగుల ఉద్యమబాట - 13 వరకు కొనసాగిస్తామని యూనియన్ నేతల స్పష్టీకరణ మహబూబ్‌నగర్ టౌన్: ఇన్నాళ్లూ ప్రభుత్వానికి బాసటగా నిలిచిన ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు పోరుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమపార్టీ అధికారంలోకి వచ్చిందని సంబరపడిన ఉద్యోగులు నిరసనలకు దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏడాదిగా తమకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోగా కనీస సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపిస్తూ రెవెన్యూశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు వీఆర్వో నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు సోమవారం నుంచి ‘వర్క్ టు రూల్’ను పాటించనున్నారు. రెవెన్యూశాఖలోని అన్ని యూనియన్లు తమ పూర్తిమద్దతు ప్రకటించడంతో సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈనెల 13వ తేదీ వరకు నిరసనలు కొనసాగించిన అనంతరం సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ తరువాత కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని యూనియన్ నేతలు ప్రకటిస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. - డిపార్ట్మెంటల్ పదోన్నతులు కల్పించాలి. గతేడాది ఆగస్టులో నిర్వహించని కారణంగా దాదాపు పదిమంది అధికారులు పదోన్నతులు రాకుండానే పదవీవిరమణ పొందారు. - రెవెన్యూశాఖలో ఖాళీపోస్టులను భర్తీచేసి అధికారులు సిబ్బందిపై పనిభారం తగ్గించాలి. - వీఆర్ఏలకు కనీస వేతనం రూ.6నుంచి రూ.13వేలకు పెంచాలి. 10వ పీఆర్సీలో ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇవ్వాలి. 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలి. -పెద్ద మండలాల్లో రూరల్, అర్బన్ రెండు తహశీల్దార్ కార్యాలయాలను ఏర్పాటుచేయాలి. - వాహనాల బడ్జెట్ రూ.17వేల నుంచి రూ.24వేలు పెంచుతూ వచ్చిన జీఓను అమలుచేయాలి. ప్రొటోకాల్‌కు అదనపుబడ్జెట్ ఇవ్వాలి. - ప్రతి మండలానికి ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక స్వీపర్, ఒక రికార్డ్ అసిస్టెంట్, ఒక వాచ్మెన్ పోస్టులను మంజూరుచేయాలి. స్పందించేంత వరకు కొనసాగిస్తాం - రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న తీరు సరైందికాదు. వాటిని పరి ష్కరించుకునేందుకు చేపడుతున్న వర్క్‌టు రూల్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేదంటే స్పందించేంత వరకు కొనసాగిస్తాం. - బక్క శ్రీనివాసులు, రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి రెవెన్యూశాఖ పట్ల నిర్లక్ష్యం తగదు రెవెన్యూశాఖలో పనిచేస్తోన్న ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. అన్ని సర్వేలను రెవెన్యూ శాఖపై వేసే ప్రభుత్వం సమస్యలపై కూడా శ్రద్ధచూపాలి. -అమరేందర్, తహశీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
రెవెన్యూ పోరు
నేటి నుంచి పురపాలక, మునిసిపాలిటీల్లో ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నేటి నుంచి వర్క టూ రూల్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విధులు కలెక్టర్ కరుణతో జేఏసీ నేతల భేటీసమస్యలు పరిష్కరించే వరకూ అంతేనన్న నేతలు హన్మకొండ అర్బన్ : దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో రెవెన్యూ ఉద్యోగులు పోరుబాట పట్టారు. తొలిదశ ఆందోళనలో భాగంగా జిల్లాలో సోమవారం నుంచి వర్క్ టు రూల్ అమలు చేయాలని నిర్ణయించా రు. జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో డీఆర్వో నుంచి తహసీల్దార్ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్రెస్సా, తహసీల్దార్ల సంఘం, వీఆర్ఏల సంఘం సంయుక్తంగా జేఏసీగా ఏర్పడ్డారు. రాష్ట్ర జేఏసీ నిర్ణయంతోపాటు జిల్లాలో చేపట్టనున్న తమ కార్యాచరణను ఆదివారం కలెక్టర్ వాకాటి కరుణను కలిసి వివరించారు. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ వర్క్ టూ రూల్ కార్యక్రమం కొనసాగుతుందని తే ల్చిచెప్పారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ 1985లో మండలాల వ్యవస్థ ఏర్పడ్డప్పటి లెక్కల ప్రకారం కార్యాలయం అధికారులు, సిబ్బంది పోస్టులే ఉన్నాయని తెలిపారు. ఆ పోస్టుల్లో కూడా ప్రసుత్తం చాలా వరకు ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిని భ ర్తీ చేయక పోవడం, పోస్టుల సంఖ్య పెంచకపోవడం వల్ల పరిపాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... అధికారులు, సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోందన్నారు. నెలల కాలంగా డీటీలకు పదోన్నతులు లేవని.. ఉన్న స్థానం నుంచే ఉద్యోగ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్లకు వాహనాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, వీఆర్ఏలకు కనీస వేతనాలు ఒక్కొక్కరికి రూ.13 వేలు 101పద్దు ద్వారా చెల్లించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు మార్గం కుమారస్వామి, తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షులు పూల్‌సింగ్ చౌహాన్, రాష్ట్ర నాయకులు చెన్నయ్య, ట్రెస్సా కార్యదర్శి రాజ్‌కుమార్, రత్నవీరాచారి, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు రాకేష్, వీఆర్ఓల సంఘం నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకే బంద్... జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్,ఆర్డీవో కార్యాలయాలకు సోమవారం నుంచి సాయంత్రం 5 గంటలకే తాళాలు పడనున్నాయి. తహసీల్దార్ నుంచి వీఆర్ఏ వరకు ప్రతి ఒక్కరూ వర్క్ టు రూల్ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రెవెన్యూ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు.. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. {పొటోకాల్ కోసం నిధులు పెంచాలి. కాంటింజెన్సీ నిధులు పెంచాలి. మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన చేయాలి. జనాభాకు తగ్గట్టు ఉద్యోగుల సంఖ్యను పెంచాలి. ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి. కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. డీటీలు, వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలి. వీఆర్ఓలకు ఎఫ్‌టీఏ ఇవ్వాలి. తహసీల్దార్లకు వాహన సౌకర్యం కల్పించాలి. -
కష్టపడి పనిచేసి జిల్లాకు పేరు తేవాలి
- రెవెన్యూ ఉద్యోగులకు - జేసీ వెంకట్రాంరెడ్డి పిలుపు సంగారెడ్డి క్రైం: విధి నిర్వహణలో కష్ట పడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని జాయింట్ కలెక్టర్ పి.వెంకట్రాం రెడ్డి రెవెన్యూ ఉద్యోగులకు సూచించా రు.తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ నాయకులతో గురువారం ఆయన సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా జేసీ ఉద్యోగుల సమస్యల పై చర్చించారు. ఉద్యోగుల సమస్యలను నేరుగా తన దృష్టికి తెస్తే త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా అర్హత గల సీనియర్ సహాయకులకు ఉప తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించాలని, అర్హత గల ఆఫీస్ సబార్డినేట్లకు జూనియర్/రికార్డు సహాయకులుగా పదోన్నతి కల్పించాలని, సీనియర్ సహాయకులకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా నియమించాలని ఉద్యోగులు జేసీకి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.శివప్రసాద్, కార్యదర్శి మనోహర్ చక్రవర్తి, అసోసియేట్ అధ్యక్షుడు బొమ్మ రాములు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.సతీష్‌కుమార్, సాంస్కృతిక కార్యదర్శి గుండేరావు, సంగారెడ్డి డివిజన్ అధ్యక్షుడు షఫీయొద్దీన్, కార్యదర్శి సురేష్, గంగాధర్‌రావు, కిరణ్‌కుమార్, శ్రీనివాస్, చంద్రకాంత్, కార్తిక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం
రెవెన్యూ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి హామీ ఒక రోజు వేతనాన్ని విరాళంగా {పక టించిన ఉద్యోగ సంఘాలు హైదరాబాద్: వివిధ స్థాయిల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం (ట్రెసా) శనివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘మిషన్ కాకతీయ అవగాహన సదస్సు’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పున ర్నిర్మాణ కార్యక్రమాల్లో అత్యధికంగా శ్రమించింది రెవెన్యూ ఉద్యోగులేనని కితాబిచ్చారు. టీఆర్ఎస్ ప్లీనరీ అనంతరం అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. రెవెన్యూ విభాగం పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులపై అధిక పనిభారం పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నారని చెప్పారు. రెవెన్యూ ఉద్యోగులంతా తమ ఒకరోజు వేతనాన్ని మిషన్ కాకతీయ కార్యక్రమానికి విరాళంగా ఇస్తున్నట్లుగా అంగీకార పత్రాన్ని డిప్యూటీ సీఎంకు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాదరావు, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదనరెడ్డి, ట్రెసా ప్రతినిధులు నారాయణరెడ్డి, నిరంజన్‌రావు, విష్ణుసాగర్, బాలశంకర్, మల్లేశ్ పాల్గొన్నారు. -
జీవో నెంబర్ 777ను ఉపసంహరించుకోవాలి
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 777 ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఆర్ జేఏసీ) డిమాండ్ చేసింది. ప్రభుత్వం జీవో నం 777 విడుదలతో పాటు తదనంతరం ఈ నెల 16వ తేదీన మెమో నం. జీఏడీ 5455ను ఇచ్చిందని దీన్ని తెలంగాణ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం చాలా మంచిదని, అందుకే రెవెన్యూ ఉద్యోగులందరం కలిసి ఒక రోజు వేతనం రూ.1 కోటి 50 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చామన్నారు. -
స్తంభించిన ‘రెవెన్యూ’ సేవలు
తహసీల్దార్‌పై దాడికి నిరసనగా ఉద్యోగుల ఆందోళన కలెక్టరేట్, ఆర్డీఓ, మండల కార్యాలయాల్లో నిలిచిన కార్యకలాపాలు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మీనా హామీతో అందోళన విరమణ హైదరాబాద్‌సిటీ: నగరంలోని బహదూర్‌పురా మండల తహసీల్దార్ హసీనా బేగంపై దాడిని నిరసిస్తూ గురువారం జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం, తహశీల్దార్ అసోసియేషన్లు సంయుక్తంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ధర్నాకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం, వీఆర్ఓ సంఘం, టీఎన్జీఓలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. స్తంభించిన కార్యకలాపాలు తహశీల్దార్‌పై దాడికి నిరసనగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయాలు, పదహారు మండల కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, కలెక్టరేట్లోని రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించి, ధర్నాలో పాల్గొన్నారు. దీంతో అన్నిచోట్లా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. నల్లబ్యాడ్జీలు ధరించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్ల కార్డులు పట్టుకొని విధుల నిర్వహణలో భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ధర్నాలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగుల ఆందోళనకు జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య, డీఆర్ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓలు నిఖిల, రఘురామ్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్లు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో అధికార, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలు లచ్చిరెడ్డి, శివశంకర్, కృష్ణ యాదవ్, హరినాథ్ జిల్లా నాయకులు రామకృష్ణ, నాగరాజారావు, చంద్రకళ, జహీరుద్దీన్, మల్లేష్ కుమార్, లీలా, సి.హెచ్. వెంకటేశ్వర్లు, చంద్రకళ మాట్లాడారు. మీనా హామీతో అందోళన విరమణ.. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి మీనా హామీతో ధర్నాతో పాటు శుక్రవారం నుంచి నిర్వహించతలపెట్టిన అందోళన కార్యక్రమాలను విరమింపజేస్తున్నట్లు తహశీల్దార్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. మీనాకు వినతి పత్రం సమర్పించగా తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్నా వేదిక వద్దకు వచ్చిన జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
ఇంటికిపో, బయటకు పో అంటూ...
విజయవాడ : జిల్లా కలెక్టర్ బాబు.ఎ వ్యవహార శైలిపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. శనివారం రాత్రి గాంధీనగర్ ఎన్జీవో అసోసియేషన్ హాలులో జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ వేధింపులపై పలువురు నాయకులు, అధికారులు మండిపడ్డారు. కలెక్టర్ తమను కట్టు బానిసలుగా చూస్తున్నారని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ప్రతి అధికారిని యూజ్లెస్, వేస్ట్‌ఫెలో, ఇంటికిపో, బయటకు పో అంటూ పదేపదే దుర్భాషలాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ తన తీరు మార్చుకోకపోతే సహకరించేది లేదని సమావేశంలో తీర్మానించారు. జిల్లా అధికారులు, గెజిటెడ్ అధికారులను సైతం అటెండర్ల కంటే హీనంగా కలెక్టర్ తిడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దస్తమానం ల్యాప్‌ట్యాబ్, ల్యాప్‌టాబ్ అంటూ తమను ముప్పుతిప్పలు పెడుతున్నారని వారు పేర్కొన్నారు. దీనివల్ల సాధారణ విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడి ప్రజలు తమపై తిరగబడుతున్నారని చెప్పారు. ఈ-పోస్ విధానం అట్టర్ ఫాప్ల్ అయిందని అన్నారు. సాయంత్రం 6 గంటల తరువాత వీడియో కాన్ఫరెన్స్‌లు, సెల్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కాకూడదని తీర్మానించారు. ఈ సమావేశానికి ఎన్జీవో అసోసియేషన్ నాయకులు హాజరై తమ మద్దతు ప్రకటించారు. -
'రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి పెంచితే సమ్మె చేస్తాం'
హైదరాబాద్‌సిటీ: రెవెన్యూ ఉద్యోగులపై ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా వారు మానసికంగా ఆందోళన చెందుతున్నారని తెలంగాణ తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణ అన్నారు. ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాల్సిందిగా కోరుతూ తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, వి.నరేందర్‌ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించామన్నారు. ఈ మేరకు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... గతేడాది జరిగిన ఎన్నికల నాటి నుంచి రెవెన్యూ సిబ్బందిపై అదనపు పనిభారం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూఎల్సీ భూముల గుర్తింపు, సమగ్ర కుటుంబ సర్వే, పెన్షన్ల ప్రక్రియ, క్రమబద్ధీకరణ వంటి కార్యక్రమాలను తాము స్వాగతిస్తున్నప్పటికీ, పనిభారాన్ని తగ్గించేలా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది పూర్తిగా ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణలో బిజీగా ఉండటంతో సాధారణ పౌరసేవలు దాదాపుగా స్తంభించాయని రామకృష్ణ అన్నారు. దీంతో పలు మండలాల్లో పౌరులు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారన్నారు. రెవెన్యూ సిబ్బంది సమస్యలను గుర్తించి తక్షణమే తగిన చర్యలు తీసుకోకపోతే తాము సమ్మె బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. (కంటోన్మెంట్) -
రెవెన్యూ శాఖకు జవసత్వాలు తేవాలి
తెలంగాణ రాష్ర్టంలో రెవెన్యూశాఖలో పనిచేస్తున్న తహసీల్దార్ స్థాయి నుంచి ఆఫీసు సబార్డినేట్ వరకున్న రెవెన్యూ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత ప్రభుత్వాలతో పలు మార్లు చర్యలు జరిపినా ఫలితం శూన్యమే. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) మొదలు తహసీల్దార్ స్థాయి వరకు మొత్తం సిబ్బంది సంఖ్య 48 వేలు ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం రాత్రింబవళ్లు శ్రమించాల్సింది కూడా ఈ రెవెన్యూ ఉద్యోగులే. పలు సందర్భాల్లో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, వీఆర్ఓలు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సివస్తోంది. రాత్రిబవళ్లూ సేవలే: పోలీస్ శాఖ తర్వాత 24 గంటలు పనిచేసే విభాగం రెవెన్యూ శాఖనే పనివేళలు అసలేలేవు. సాయంత్రం వేళ పనిముగించుకొని ఇంటికి వెళ దామంటే మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు రాత్రి వరకు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత కిందిస్థాయి అధికారుల సూచనలు షరా మామూలే! పైగా ప్రతి జిల్లాలోని కలె క్టరేట్‌లో ఏ నుంచి జె వరకు సెక్షన్లు ఉంటాయి. వీటికి పరిపాలనా ధికారులుగా తహశీల్దార్ స్థాయిలో పది మంది ఉండాలి కానీ ఏ జిల్లాలోను ముగ్గురికి నలుగురికి మించిలేరు. మండలాల్లో కూడా కొన్ని చోట్ల తహసీల్దార్లు లేక డిప్యూటీ తహశీల్దార్లు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారిపై రెట్టింపు భారం పడుతోంది. శ్రమకు తగ్గ వేతనాలు రెవెన్యూ ఉద్యోగులకు అధికారులకు లేవు. విద్యాశాఖలోని హెడ్మాస్టర్లకు ఉన్న స్కేలు తహశీల్దార్లకు లేదు. ఉపాధ్యాయులకు ఉన్న స్కేళ్లు రెవెన్యూ ఉద్యోగులకు లేవు. పే స్కేలు రెట్టింపు చేయాలని, స్పెషల్ స్కేల్ ఇవ్వాలని వేతన సవరణ సంఘాలకు గత ప్రభుత్వాలకు రెవెన్యూ కేంద్ర సంఘం అధ్యక్షుడు శివశంకర్ ఆధ్వర్యంలో ఉద్యమించినా ఫలితం దక్కలేదు. ప్రభుత్వ భూముల పరి రక్షణలో, ఇసుక అక్రమ రవాణా అరికట్టే విషయంలో వాల్టా చట్టం అమలులో తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వీఆర్ఓ లపై తరచు దాడులు జరుగుతూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా లో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న ఓ మహిళ తహశీల్దార్‌పై హత్యా ప్రయత్నం, ఆదిలాబాద్ జిల్లా భీమిని మండల తహశీల్దా ర్‌పై సర్పంచ్ దాడి చేయడం ఇందుకు ఉదాహరణలు. పలు జిల్లాల్లో నిక్కచ్చిగా వ్యవహరించే రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేయించడం, తమ అనుచరులచే ఎస్సీ, ఎస్టీ, ఏసీబీ తదితర కేసుల్లో ఇరికించడం వంటి బాధలు పెడుతున్నారు. ఈ బాధల నుంచి రెవెన్యూ శాఖ ఉద్యోగుల రక్షణకు ప్రభుత్వపరంగా తగు చర్యలు చేపట్టి ఆ శాఖకు జవసత్వాలు తేవాలి. - హరి అశోక్ కుమార్ హైదరాబాద్ -
బానిసలుగా పనిచేయలేం!
కర్నూలు జిల్లాలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు - రెవెన్యూ ఉద్యోగులకు మధ్య అగ్గి రాజుకుంది. ఏకంగా జిల్లా సర్వోన్నతాధికారి కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌పైనే రెవెన్యూ సిబ్బంది తిరుగుబావుటా ఎగరవేశారు. బానిసలుగా పనిచేయలేమని స్పష్టం చేశారు. వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తే అభినందనలు లేకపోగా.. అభిశంషలు ఏమిటని నిలదీశారు. కలెక్టర్, జేసీల వ్యవహరశైలిపై మండిపడుతూ జిల్లా రెవెన్యూ సర్వీసు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉస్సేన్, రామన్న, ట్రెజరర్ వేణు ఆధ్వర్యంలో గురువారం రాత్రి 7 గంటలకు రెవెన్యూ ఉద్యోగులు అత్యవసరంగా సమావేశమయ్యారు. సంఘం భవనంలో జరిగిన ఈ సమావేశం రాత్రి 10 గంటల వరకూ సాగింది. ఈ సమావేశంలో ప్రధానంగా కలెక్టర్, జేసీలు రెవెన్యూ ఉద్యోగులపై వ్యక్తిగత దూషణలు చేస్తున్న అంశంపైనా ఉద్యోగులందరూ చర్చించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, జేసీల వైఖరి మార్చుకునే వరకూ ఫిబ్రవరి 2 నుంచి వర్క్ టు రూల్ పాటించడం ద్వారా నిరసన తెలపాలని సమావేశంలో నిర్ణయించారు. అప్పటికీ కలెక్టర్, జేసీలు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించాలని సమావేశం తీర్మానించింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపడతామని ప్రకటించారు. సౌకర్యాలు కల్పించకుండా చిందులా? ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా పని కాలేదంటూ తమపై చిందులేయడం ఎంత వరకు సమంజసమని రెవెన్యూ ఉద్యోగులు ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోయినప్పటికీ తాము పనిచేస్తున్నామని... అయినప్పటికీ తమను వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశామని... వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్నామని వాపోయారు. ఒక్కరూపాయి బడ్జెట్ ఇవ్వకుండా పనికాలేదని తమపై మండిపడటం సరికాదని స్పష్టం చేశారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తే పనిచేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. తమ తప్పు ఏమాత్రమూ లేకపోయినా తమనే నిందించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రధానంగా పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడిన తీరుతో పాటు సీ బ్యాంకు రైతు బజారు వద్ద ఆక్రమణల కూల్చివేత విషయంలో కల్లూరు ఎమ్మార్వోపై కలెక్టర్ వ్యవహరించిన శైలి, వాడిన పదజాలంపై సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో కలెక్టరేట్, ఆదోని, నంద్యాల, కర్నూలు డివిజన్ అధ్యక్షుడు, కార్యవర్గ సిబ్బందితో పాటు 54 మండలాలకు గానూ 46 మండలాల తహశీల్దార్లతో పాటు పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
అత్తమ్మా.. ధాన్యం మాకే అమ్మాలమ్మా...
అత్తిలి(పశ్చిమగోదావరి): సాధారణంగా పెళ్లి, పేరంటాళ్ల సందర్భంలోను.. అదీ కాదంటే ఎన్నికలొచ్చినప్పుడు ఇంటింటీకీ వెళ్లి ముత్తయిదవులకు బొట్టుపెట్టి పేరంటానికి పిలవడం లేదా ఓటు అడగడం రివాజు. కానీ.. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలో మాత్రం ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్మాలంటూ డ్వాక్రా మహిళలు, రెవెన్యూ ఉద్యోగులు ఇంటింటీకీ వెళ్లి బొట్టుపెట్టి మరీ అడుగుతున్నారు. 'సూరమ్మత్తా.. ఇలా రా.. ఇదిగో బొట్టుంచుకో.. ఇది పేరంటం బొట్టు కాదులే. మనూళ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టాం. వెంకన్న మావకు .. పెద్దిరాజు బావకు చెప్పి కోతలయ్యాక మొత్తం ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలోనే అమ్మాలని చెప్పు. మర్చిపోవద్దు అత్తమ్మా' అని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్తిలి మండలం బల్లిపాడు, మంచిలి, అత్తిలి, కె. సముద్రపుగట్టు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
‘వర్క్‌టూ రూల్’కు స్వస్తి!
మహబూబ్‌నగ్ టౌన్: ఇటీవల కొద్దిరోజులుగా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, రెవెన్యూ ఉద్యోగుల మధ్య రగులుతున్న వర్క్‌టూ రూల్ వివాదం ఇక సమసినట్లే..! జేసీ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలమై.. ఉద్యోగులు కలెక్టర్‌కు సహకరిస్తామని ఆదివారం ప్రకటించారు. ఇదిలాఉండగా, కలెక్టర్ జిల్లా కు వచ్చిరాగానే ప్రభుత్వం రకరకాల సర్వేలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగంపై కూడా కొంత పనిఒత్తిడి పెరిగింది. సామాజిక భద్రత పింఛన్లు, రేషన్‌కార్డులకు సంబంధించి అర్హులను గుర్తించే క్రమంలో అధికారు లు, సిబ్బందితో కలెక్టర్ ఒక్కోసారి రాత్రి సమయం వరకు కూడా సమీక్ష లు నిర్వహిస్తుండేవారు. ఈ పరంపరలో సీసీకుంట వీఆర్వో రంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందాడు. పనిఒత్తిడి కారణంగానే సదరు వీఆర్వో చనిపోయారని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగిన విషయం విదితమే. అర్ధరాత్రి వరకు సమావేశాలు నిర్వహించకుండా పనిలో స్వేచ్ఛాయుత వాతావరణం ఇవ్వాలని వారు కలెక్టర్‌కు విజ్ఞప్తిచేశారు. స్పందించిన కలెక్టర్ విధుల నిర్వహణ పట్ల కాస్త కఠినంగానే ఉంటానని ప్రకటించడంతో ఉద్యోగులు నిరసనబాట పట్టారు. రెండురోజులుగా జిల్లాలో విధులు బహిష్కరిస్తూ వర్క్‌టూ రూల్‌ను అమలుచేశారు. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వీరికితోడు ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడంతో కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగుల యుద్ధ వాతావరణం రాజుకుందనే చెప్పొచ్చు. నాలుగైదు రోజులుగా సమస్య ఓ కొలిక్కిరాకపోవడంతో రెవెన్యూ ఉద్యోగులు ఏకంగా సీఎం సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. అంతటితో ఆగకుండా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం చేపట్టిన ఉద్యమం తరహాలో కొనసాగిస్తామని ప్రకటించారు. జేసీ ఎల్.శర్మన్ సమస్య మరింత ముందుకు పోకుండా పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగులకు మధ్యవర్తిత్వం వహించి శనివారం రాత్రి రెవెన్యూ అసోసియేషన్ నేతలను కలెక్టర్‌తో చర్చలకు ఆహ్వానించారు. సుమారు రెండుగంటలపాటు కొనసాగిన చర్చల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషిచేయడంతో ఉద్యోగులు మెత్తబడ్డారు. విధుల నిర్వహణలో కలెక్టర్‌కు సహకరిస్తామని అంగీకరించారు. దీంతో వర్క్‌టూ రూల్ విధానానికి స్వస్తి పలికినట్లయింది. కలెక్టర్‌కు పూర్తిగా సహకరిస్తాం కొంత ఇబ్బందులు కలిగినా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని స్పందించి తమకు పూర్తిగా సహకరించి సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారని, ఆమెకు విధుల పట్ల అన్నివిధాలుగా సహకరిస్తామని రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ప్రకటించారు. ఆదివారం స్థానిక రెవెన్యూభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి సమావేశాలతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. కలెక్టర్ అంగీకరించి పదోన్నతులు సైతం ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ఇది ఒక కుటుంబ సమస్యేనని, పరిష్కరించుకున్నట్లు తెలిపారు. సమావేశంలో టీజీఓ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్, కార్యదర్శి బక్క శ్రీనివాస్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. -
రెవెన్యూ ఉద్యోగులకు పింఛన్ యోగం
సాక్షి, హైదరాబాద్: కనీస సర్వీసు లేని కారణంగా పింఛను పొందే అవకాశం కోల్పోయిన రెండు వేల మంది పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులకు పింఛను ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పెన్షన్ రూల్స్ సవరణ ఫైలుపై సీఎం చంద్రబాబు మంగళవారం ఆమోద ముద్ర వేశారు. 1992 నుంచి 2002 వరకు గౌరవ వేతనంపై పనిచేసిన గ్రామ పరిపాలనాధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు తర్వాత స్కేలు పొందారు. అయితే వారు పదవీ విరమణ చేశాక కనీస సర్వీసు లేని కారణంగా పింఛను పొందే అవకాశం కోల్పోయారు. తాజాగా సీఎం నిర్ణయంతో రెండు వేల మందికి పింఛను రానుందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) తెలిపింది. -
ఏసీబీ వలలో రెవెన్యూ చేపలు
కొవ్వూరు: కొవ్వూరులో ఒక రైతు నుంచి రూ.3 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు, ఒక రిటైర్డ్ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కొవ్వూరు తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్-1గా పనిచేస్తున్న కె.నల్లరాజు, వీఆర్వో ఎన్.దుర్గారావు, రిటైర్డ్ వీఆర్వో మహ్మద్ అబ్దుల్ షరీఫ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ఐ.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వేములూరు గ్రామానికి చెందిన సున్నం వీరవెంకట సుబ్రహ్మణ్యాచార్యులు అనే రైతుకు 60 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. అందులోని పాతబోరు పైపులు తుప్పు పట్టడంతో నీరు సక్రమంగా రావడం లేదు. దీంతో ఈనెల 2న సుబ్రహ్మణ్యాచార్యులు బోరుకు ఉన్న ఇనుప పైపులను తొలగించి ప్లాస్టిక్ పైపులను వేసే పని ప్రారంభించారు. ఈనెల 4న ఆర్ఐ నల్లరాజు రిటైర్డ్ వీఆర్వో అబ్దుల్ షరీఫ్‌తో కలిసి వెళ్లి అనుమతి లేకుండా బోరు ఎలా వేస్తున్నావని రైతును ప్రశ్నించారు. ఆఫీసుకు వచ్చి కలవాలని సూచించారు. ఆ రైతు తహసిల్దార్ కార్యాలయూనికి వెళ్లగా, రూ.10 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందుగా బోరు వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, బోరు పూర్తయిన తరువాత కలుస్తానని చెప్పిన సుబ్రహ్మణ్యాచార్యులు వారిని కలవలేదు. దీంతో వీఆర్వో ఎన్.దుర్గారావు రైతు ఇంటికి వెళ్లి వాల్టా చట్టానికి విరుద్ధంగా బోరు వేశారని, సుబ్రహ్మణ్యాచార్యులును జైలుకు పంపుతామంటూ అతని భార్యను బెదిరిం చారు. దీంతో ఈనెల 22, 23 తేదీల్లో ఆ రైతు తహసిల్దార్ కార్యాలయూనికి వెళ్లి అంత సొమ్ము ఇచ్చుకోలేనని ఆర్ఐని బతిమాలారు. మొదట రూ.3 వేలు ఇస్తానని చెప్పి వచ్చాడు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి సుబ్రహ్మణ్యాచార్యులుకు రూ.3 వేలు ఇచ్చి తహసిల్దార్ కార్యాలయూనికి పంపించారు. అతడు ఆ మొత్తం లంచం ఇవ్వగా, అందులో రూ.2 వేలను ఆర్ఐ నల్లరాజు తీసుకున్నారని, వీఆర్వో దుర్గారావుకు రూ.వెయ్యి ఇచ్చారని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితులైన ఆర్ఐ నల్లరాజు, వీఆర్వో దుర్గారావు, రిటైర్డ్ వీఆర్వో మహ్మద్ అబ్దుల్ షరీఫ్‌ను అరెస్ట్ చేశామని వివరించారు. వారిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ యూజే విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యోగులను కబళించిన లారీ
కర్నూలు జిల్లాలో ఐదుగురు దుర్మరణం మృతుల్లో నలుగురు రెవెన్యూ సిబ్బంది కర్నూలు: విధుల్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగులపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటన కర్నూలు జిల్లాలోని 18వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుల్లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ), ముగ్గురు గ్రామసేవకులున్నారు. తీవ్రంగా గాయపడిన ఓర్వకల్లు తహశీల్దార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఏర్పాటుకు అనువైన స్థల పరిశీలనకు కర్నూలు జిల్లా కలెక్టర్ వస్తుండటంతో ఓర్వకల్లు తహశీల్దార్ సునీతాబాయి, ఆర్ఐ శ్రీనివాసులుతోపాటు గ్రామసేవకులు, ఇతర ఉద్యోగులు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నన్నూరు సమీపంలోని గడెంతిప్ప వద్ద ప్రధాన రహదారిపై వేచి ఉన్నారు. అదే సమయంలో సిలికా(కృత్రిమ ఇసుక) లోడుతో నంద్యాల వైపు నుంచి కర్నూలుకు వెళుతున్న మహారాష్ట్రకు చెందిన లారీ వీరిపైనుంచి దూసుకెళ్లి బోల్తాపడింది. ఆర్ఐ శ్రీనివాసులు, గ్రామసేవకులు శివరాముడు(36), రామకృష్ణ(45), వెంకటేశ్వర్లు(43)తోపాటు స్థానికుడు గోపాల్(28) దుర్మరణం పాలయ్యారు. ఓర్వకల్లు తహశీల్దార్ సునీతాబాయి, వీఆర్వో తిమ్మయ్య, గ్రామసేవకుడు నాయుడుకు తీవ్ర గాయాలవగా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో తహశీల్దార్ సునీతాబాయి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ఇసుక మాఫియానే కారణం! సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల మృతికి ఇసుక మాఫియానే కారణమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అనుమానం వెలిబుచ్చింది. ఈ ప్రమాదంపై తమకు అనుమానాలున్నాయని తెలిపింది. ఉద్యోగులను హత్య చేయించడానికి జరిగిన కుట్రగా ఉందని సందేహం వ్యక్తం చేసింది. -
'అవినీతిని సహించేది లేదని సంకేతానికే...'
హైదరాబాద్ : అవినీతిని సహించేది లేదన్న సంకేతం ఇచ్చేందుకే పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులను బదిలీలు చేసినట్లు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు. అధికారుల బదిలీల్లో ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్డీవోలను మూకుమ్మడిగా ఎందుకు బదిలీలు చేస్తున్నారంటూ రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలో పారదర్శకంగానే బదిలీలు చేశామన్నారు. పాత ప్రభుత్వాల మాదిరిగా వ్యవహరించలేదని ఆయన తెలిపారు. రాజకీయ అవినీతి అంతానికి కట్టుబడి ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు. -
కొనసాగుతున్న ఎన్జీఓల దీక్షలు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట ఎన్జీఓలు. రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ఒకవైపు కార్యాలయాల్లో విధులను అడ్డుకుంటూనే...దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. త్యాగాలు చేసి అయినా సమైక్యాంధ్రను కాపాడుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రొంగలి ఎర్రన్నాయుడు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విడదీయాలని చూడడటం దుర్మార్గమన్నా రు. కొన్ని పార్టీల నాయకులు ద్వంద్వ ప్రమాణాలు అవలంభించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా సమైక్య వాణి విన్పించాలన్నారు. కాగా దీక్షలకు విశాలాంధ్ర మహా సభ నాయకలతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. -
‘సమైక్య’ హోరు
రెండో రోజూ రెవెన్యూ ఉద్యోగుల సమ్మె జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు పలమనేరులో ఎన్జీవోల రాస్తారోకో మదనపల్లెలో ఉద్యోగుల మానవహారం సాక్షి, చిత్తూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు రెండో రోజు శుక్రవారమూ కొనసాగాయి. జిల్లాలోని 66 రెవెన్యూ కార్యాలయాలు మూతపడ్డాయి. రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ పూర్తిస్థాయిలో సమైక్యాం ధ్ర సమ్మెను కొనసాగిస్తోంది. మదనపల్లె, చిత్తూరు లాంటిచోట్ల జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బయటకు పంపారు. చిత్తూరులో ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించారు. నీటిపారుదలశాఖ ఉద్యోగులు, జెడ్పీ ఉద్యోగులు ర్యాలీ లో పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కలెక్టరేట్లో రెవెన్యూ సర్వీసెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రవాణాశాఖ కార్యాలయంలో కార్యకలాపాలు స్తంభించాయి. జిల్లా అధికారులు కార్యాలయాలకు వచ్చి కూర్చున్నారు. తిరుపతిలో తహశీల్దారు, సివిల్ సప్లయిస్, ఆర్డీవో కార్యాల యాలు మూతపడ్డాయి. భూసర్వే, స్టాటిస్టికల్ విభాగాల ఉద్యోగులు విధులు బహిష్కరించారు. జ్యోతి రావు పూలే విగ్రహం నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు రాజకీయపార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 9వ తేదీ సమైక్య రన్‌కు సన్నాహకంగా ఈ ర్యాలీ చేపట్టారు. మదనపల్లెలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసేవారిని బయటకు పంపేశారు. పోస్టాఫీసు ఎదుట మౌన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. తహశీల్దారు కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. హౌసింగ్, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని జేఎసీ నాయకులు బయటకు పంపేశారు. శ్రీకాళహస్తిలో రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేశారు. రెవెన్యూ ఉద్యోగులు మాత్రం విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. పలమనేరులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలనూ మూసేశారు. పలమనేరులోని చెన్నై-బెంగళూరు రహదారి వద్ద ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పుత్తూరులో బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. తహశీల్దారు కార్యాలయం పని చేయలేదు. రాజకీయపార్టీల నాయకులు మ ద్దతు ప్రకటించారు. కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లె మండలాల్లోనూ రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. -
సమ్మెలోకి రెవెన్యూ ఉద్యోగులు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమైక్యాం ధ్రకు మద్దతుగా..ఏపీ ఎన్జీవోలు, వివిధ ఉద్యోగ సంఘాలు గురువారం నుంచి సమ్మెలోకి వెళుతున్నాయని, రెవెన్యూ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం రెవెన్యూ సర్వీసుల సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వీఆర్ఏ నుంచి తహశీల్దార్ వరకూ అందరూ సమ్మెలో పాల్గొనాలన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యోగుల కృషిలో రెవెన్యూ ఉద్యోగులు కీలక బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీకాంత్, సంఘ సభ్యులు శ్రీహరి, వెంకటరావు, రాంబాబు, మహంకాళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
తరగని పోరాట స్ఫూర్తి
అదే ఉద్యమ దీప్తి.. అదే పోరాట స్ఫూర్తి.. 60 రోజులుగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా.. జనం రోడ్లపైకొచ్చి సమైక్యవాణి వినిపిస్తున్నారు. విభజన నిర్ణయంపై తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు పోరు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమం శనివారానికి 60 రోజులు పూర్తిచేసుకుంది. రెండు నెలలు గడిచినా సమైక్యవాదుల్లో పోరాట స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 47 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఇంకా ఉధృత రూపం తీసుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా ఉద్యోగులు, విద్యార్థుల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల బంద్ రెండోరోజూ కొనసాగింది. విద్యాసంస్థలు వరుసగా ఆరో రోజు మూతపడ్డాయి. సకల జనుల రిలేదీక్ష... సమైక్యాంధ్రకు మద్దతుగా ఇబ్రహీంపట్నంలో ఎన్జీఓలు, ఆర్టీసీ, రెవెన్యూ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సకల జనుల రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. రెవెన్యూ సిబ్బందితో పాటు 200 మంది సమైక్యవాదులు ఈ దీక్షలో పాల్గొన్నారు. వత్సవాయిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో కార్మికులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లికి వినతిపత్రాన్ని అందజేశారు. గుడ్లవల్లేరులో సమైక్యాంధ్రను కోరుతూ పోలిమెట్ల సర్పంచ్ ఆధ్వర్యంలో దీక్షల్లో పాల్గొన్నారు. పామర్రులో జేఏసీ నాయకులు నిల్వ కూలీల వేషంలో వలసలు వెళ్తున్నట్టుగా వినూత్న నిరసన తెలిపారు. డీఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శన జరిపారు. నాగాయలంక మండలంలో రేపల్లె హర్షవర్ధన్ అనే బధిరుడు దీక్ష చేశారు. తుంగలవారిపాలేనికి చెందిన విద్యార్థులు భారీ జాతీయపతాకంతో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిపారు. నూజివీడులో దిష్టిబొమ్మలతో శవయాత్ర.. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నూజివీడులో విలేకరుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, దిగ్విజయ్‌సింగ్, షిండేల దిష్టిబొమ్మలను పట్టణంలో శవయాత్ర చేసి దహనం చేశారు. మండవల్లి జేఏసీ నేతలు కత్తిపూడి-పామర్రు జాతీయ రహదారిపై ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలిపారు. ముదినేపల్లి మండల ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో 214 జాతీయ రహదారిపై తెలుగుతల్లి చిత్రపటం ఏర్పాటుచేసి కొబ్బరికాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. కైకలూరు తాలూకా సెంటర్లో మహిళా జేఏసీ నాయకులు శిబిరం వద్ద ఉదయమే గారెలు వండారు. జాతీయ రహదారిపై సీమాంధ్ర టిఫిన్ సెంటర్, తెలంగాణ టీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. కలిదిండి సెంటరులో ఉపాధ్యాయులు గెడ్డాలు గీయించుకుంటూ నిరసన తెలిపారు. పెనుగంచిప్రోలులో చేపట్టిన రిలే దీక్షా శిబిరంలో కూర్చున్న ఆర్టీసీ కార్మికులకు డ్వాక్రా సంఘ లీడర్లు, అంగన్వాడీ కార్యకర్తలు జై సమైక్యాంధ్ర, సేవ్ ఏపీ అంటూ చేతులపై గోరింటాకు పెట్టి వినూత్న కార్యక్రమం చేపట్టారు. వత్సవాయి జిల్లా పరిషత్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతమ్మ తల్లికి వినతిపత్రం.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో కార్మికుల జేఏసీ నేతలు పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారికి వినతిపత్రం అందజేశారు. జగ్గయ్యపేట జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలో స్థానిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఉపాధ్యాయినులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విమలాభాను శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. నందమూరు గ్రామ వాసులు గుడివాడ-విజయవాడ ఆర్ అండ్ బీ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు జిలేబీ అమ్మి నిరసన కార్యక్రమం చేపట్టారు. కోడూరు శ్రీగాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం గణపతి హోమాన్ని నిర్వహించారు. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో మున్సిపల్ చేపల మార్కెట్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. నెహ్రూ చౌక్ సెంటర్లో యువకులు కర్రసాము, కత్తిసాముతో సాహస విన్యాసాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. చనుబండ గ్రామంలో వివేకానంద విద్యావిహార్ విద్యార్థు పిరమిడ్ ఆకారంలో విన్యాసాలు చేశారు. ముదినేపల్లి మండలంలోని వణుదుర్రు శివారు కొత్తపల్లి సెంటర్లో సమైక్య రైతు శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ముదినేపల్లి - బంటుమిల్లి ఆర్అండ్బీ రహదారిపై సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రధాన ద్వారం వ ద్ద ఎముకల వైద్య నిపుణుడు అల్లాడ శ్రీనివాసరావు ఆధ్వర్యాన వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకులో వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు, నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన రహదారిపై పాస్టర్లతో కలసి ప్రార్థనలు చేశారు. విజయవాడలో... విజయవాడలో శనివారం విద్యార్థులు కాగడాల ప్రదర్శన నిర్వహించగా, మున్సిపల్ ఉద్యోగులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఎన్జీవోలు బెంజిసర్కిల్ వద్ద జాతీయ రహదారిపై జాగరణ చేశారు. ఉపాధ్యాయులు సబ్‌కలెక్టరేట్ ముందు కూరగాయల దండలతో నిరసన తెలిపారు. చిట్టినగర్‌లో విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని మానవహారం నిర్మించారు. మునిసిపల్ ఇంజనీర్లు అత్యవసర విధులను 72 గంటలపాటు బహిష్కరించి మూడో రోజు కూడా దీక్షలలో పాల్గొన్నారు. ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ (ఏటీఏ) చేపట్టిన రిలే దీక్షలు శనివారం 44వ రోజుకు చేరుకున్నాయి. ఓల్డ్ స్క్రాప్ అండ్ ప్లాస్టిక్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన నాయకులు, మహిళలు రిలే దీక్షల్లో కూర్చున్నారు. ఈ నెల 30న చలో విజయవాడ కార్యక్రమం పేరుతో హెల్త్ యూనివర్సిటీని ముట్టడించాలని మెడికల్ జేఏసీ నిర్ణయించింది. ఎన్జీఓల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లను మూయించి వేశారు.