సచివాలయం వద్ద రెండో రోజు ఉద్యోగుల నిరసనలు | revenue employees protest at telangana secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయం వద్ద రెండో రోజు ఉద్యోగుల నిరసనలు

Published Wed, Aug 17 2016 1:55 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

revenue employees protest at telangana secretariat

హైదరాబాద్: స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు బుధవారం తమ నిరసనలు తెలిపారు. ఉన్నతాధికారుల వద్ద పీఎస్లుగా పని చేస్తున్నవారిని తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును టీ. ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు.

ఈ సందర్భంగా ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్మిట్టల్ పీఎస్ పద్మావతిపై వారు ఫిర్యాదు చేశారు. అనంతరం పద్మావతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పద్మావతి చైర్ను ఉద్యోగులు బయటపెట్టారు. ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని నినదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement