Padmavathi
-
చెట్టుకు, మనిషికి మధ్య ఉండే ప్రేమకథతో ‘గాంధీ తాత చెట్టు’
‘‘గాంధీ తాత చెట్టు’ సినిమా మహాత్మాగాంధీగారి బయోపిక్ కాదు. గాంధీ, తాత, చెట్టు.. ఈ మూడింటి కథే ఈ చిత్రం. గాంధీగారి సిద్ధాంతాలు ఉన్న గాంధీ అనే అమ్మాయి అహింసావాదంతో తన ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేది కథ. ప్రకృతి, మనుషుల మధ్య అహింస చాలా అవసరం అనే సందేశాన్ని మా సినిమా ద్వారా ఇస్తున్నాం’’ అని డైరెక్టర్ పద్మావతి మల్లాది చెప్పారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. తబితా సుకుమార్ సమర్పణలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధూరావు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ–‘‘నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. పీజీ పూర్తిచేసిన తర్వాత డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిగారి దగ్గర రచనా విభాగంలో పనిచేశాను. ‘రాధే శ్యామ్, ‘మహానటి, చూసీ చూడంగానే, అమ్ము’ అనే సినిమాలతో పాటు ‘బృంద’ అనే వెబ్ సిరీస్‌కు రచయితగా పని చేశాను. ‘గాంధీ తాత చెట్టు’ విషయానికొస్తే.. చెట్టుకు, మనిషికి మధ్య ఉండే ప్రేమకథతో పాటు మొక్కల గురించి తర్వాతి తరం వాళ్లకు చెప్పాలనే సంకల్పంతో ఈ కథ రాశాను. సందేశం, భావోద్వేగాలు, వాణిజ్య అంశాలున్న ఈ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. సుకృతి వేణి గాంధీ పాత్ర కోసం నిజంగా గుండు చేయించుకుంది. ఈ సినిమాకు రీ అందించిన సంగీతం, నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది’’ అని పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ గూస్ బంప్స్ విజువల్స్
-
నాగార్జునపై పెట్టిన కేసును ఏం చేస్తారు?
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మరొకరిపై తాను చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని, ఆయన తనపై అత్యాచారం చేయలేదంటూ ఫిర్యాదుదారే ప్రమాణపూర్వక అఫిడవిట్ దాఖలు చేసినందున, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసును ఏం చేయదలచుకున్నారో చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆ కేసును కొనసాగిస్తారో లేదో పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. అప్పటివరకు నాగార్జునపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు కొట్టేయాలంటూ నాగార్జున పిటిషన్ ఉద్యోగం, కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ తన వద్ద డబ్బులు తీసుకున్నారని, లైంగికంగా వేధించారంటూ విజయవాడకు చెందిన పద్మావతి ఇచి్చన ఫిర్యాదు మేరకు నాగార్జునపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ నాగార్జున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గత వారం విచారణకు రాగా.. పద్మావతి కోర్టు ముందు హాజరై, నాగార్జునపై తానిచి్చన ఫిర్యాదులోని అంశాలు అవాస్తవాలని తెలిపారు. తనపై లైంగిక దాడి చేయలేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కూడా లేవని చెప్పారు. సమాజంలో చాలా పెద్దవారు, రాజకీయ బలం ఉన్న వారు చేసిన ఒత్తిడి వల్ల నాగార్జునపై ఫిర్యాదు ఇచ్చినట్లు వివరించారు. ఆ మేరకు ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు డైరీ (సీడీ)ని తమ ముందుంచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే ఫిర్యాదు చేశానని మరోసారి కోర్టుకు చెప్పిన పద్మావతి ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) సాయి రోహిత్ సీడీ ఫైల్‌ను న్యాయమూర్తికి అందజేశారు. దానిని న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం పద్మావతితో న్యాయమూర్తి మాట్లాడారు. ప్రమాణ పత్రం గురించి ప్రశ్నించారు. దానిని తానే దాఖలు చేశానని పద్మావతి తెలిపారు. నాగార్జున తనపై లైంగిక దాడి చేయలేదని, రాజకీయ ఒత్తిళ్లతోనే ఫిర్యాదు చేశానని మరోసారి చెప్పారు. కేసు ఎందుకు పెట్టాల్సి వచి్చందో సవివరంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని పద్మావతి తరఫు న్యాయవాది టి.నాగార్జున రెడ్డి తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌పై తప్పుడు ఫిర్యాదు ఇచ్చానంటూ ఫిర్యాదుదారే ప్రమాణపూర్వకంగా చెప్పినందున, కేసును ఏం చేస్తారో చెప్పాలని పోలీసులను ఆదేశించారు. -
తిరుమల : వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)
-
ఎల్లో మీడియా నా మాటలను వక్రీకరించింది...ఎమ్మెల్యే పద్మావతి క్లారిటీ
-
రెండోసారి జంటగా అసెంబ్లీకి ఉత్తమ్ దంపతులు
కోదాడ : టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన సతీమణి పద్మావతిరెడ్డి జంటగా మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2014 ఎన్నికల్లో కోదాడ నుంచి పద్మావతి, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనసభ్యులుగా గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2018లో కోదాడలో పద్మావతి ఓడిపోగా.. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ గెలుపొందారు. తాజాగా 2023 ఎన్నికల్లో కోదాడ నుంచి పద్మావతిరెడ్డి గెలుపొందగా, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ మరోసారి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో వీరిద్దరూ రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం. -
ఉపాధ్యాయురాలు విధులు ముగించుకుని ఆటోలో వెళ్తుండగా ఘటన.. తీవ్ర విషాదం!
సాక్షి, మహబూబ్‌నగర్: కోయిలకొండ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పద్మావతి (40), జాయింట్ మెర్సి, పద్మప్రియ, లక్ష్మీమానస, సయబాసుల్తానా విధులు ముగించుకుని ఆటోలో మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా, పారుపల్లి స్టేజీ వద్ద పంది అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో పద్మావతి మృతి చెందగా, నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇవి చదవండి: పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్‌ఫోన్స్ ఆధారంగా.. -
అఫిడవిట్లో అలసత్వం వద్దు
తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందువల్లే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, ఉన్న కేసులు, జైలు జీవితం అనుభవిస్తే ఆ వివరాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ నామినేషన్ సందర్భంగా లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారికి తెలపాలని పేర్కొంది. అయితే కొందరు అభ్యర్థులు అఫిడవిట్లో అన్ని వివరాలు తెలపడంలో అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. దీనిపై 2013లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దాని ప్రకారం అఫిడవిట్లో ఏ ఒక్క కాలమ్‌ను నింప కుండా ఖాళీగా ఉంచవద్దంటూ పేర్కొంది. ఎవరైనా అభ్యర్థి పొరపాటున ఎక్కడైనా ఖాళీగా వదిలేస్తే దాన్ని పూర్తిగా నింపాలంటూ తేల్చి చెప్పింది. ఓటర్ల హక్కు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సతీమణి వనమా పద్మావతి పేరిట ఉన్న ఇన్నోవా వాహనంపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.135 ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉంది. ఆయన కుటుంబం పాల్వంచ మున్సిపాలిటీకి రూ.3,120 వాటర్ బిల్లు బకాయి ఉంది. వీటితో పాటు వివిధ ఆస్తులు, తనపై నమోదైన పోలీసు కేసుల వివరాలను 2018 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా వనమా అఫిడవిట్లో పేర్కొనలేదు. పారదర్శకత పాటించడంలో విఫలమైనందున వనమా ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించి చుక్కలు చూపించారు. చిన్న ట్రాఫిక్ చలానాయే కదా అనే నిర్లక్ష్యం, ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై పోలీసు కేసులు సహజమే అనే ఏమరుపాటు ఇబ్బంది తెచ్చి పెట్టగా కేసు ఇంకా సుప్రీంలో కొనసాగుతోంది. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు ప్రతీ అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందే. ఆస్తులు, అప్పులు, కేసుల వివరాల వెల్లడిలో అలసత్వముంటే ఇబ్బందులు ఎదురవుతాయనేందుకు వనమా ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. వనమా తరహాలోనే నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలను టాంపరింగ్ చేశారనే ఆరోపణలతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సైతం న్యాయపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. పత్రికా ప్రకటనలు అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు బహిరంగా తెలపాలనే నిబంధన సైతం 2013 నుంచి అమల్లోకి తెచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పోలింగ్‌కు రెండు రోజుల ముందులోపు స్థానికంగా ఉన్న పేపర్లు/టీవీల్లో ప్రకటనల ద్వారా క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు తెలపాల్సి ఉంటుంది. అది కూడా ఏ మూలనో కాకుండా ప్రముఖంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలి. ఇలా ప్రజలకు అన్ని వివరాలను తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం –1951 ప్రకారం అనర్హతకు గురవుతారు. బీ ఫామ్ అందుకోగానే బీ ఫామ్ అందుకోవడమే ఆలస్యం నామినేషన్ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ (లిఖిత వాంగ్మూలం) విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అక్కడ రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. -
పద్మావతి ఆస్పత్రిలో ఆరో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్
తిరుపతి: తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ఆరో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతమైంది. 33 ఏళ్ల వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు నిర్వహించారు. గుంటూరులో బ్రెయిన్‌డెడ్ అయిన 19 ఏళ్ల యువకుడి గుండెను అమర్చారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం గుంటూరు నుంచి ప్రత్యేక చాపర్‌లో గుండెను తిరుపతి పద్మావతి ఆస్పత్రికి తరలించారు. గుండె తరలింపునకు సీఎం జగన్ చొరవతో ప్రత్యేక చాపర్‌ను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ చొరవతో రెండేళ్ల కిందటే టీటీడీ ఆధ్వర్యంలో హార్ట్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈ రెండేళ్లలోనే 1900 గుండె ఆపరేషన్లను ఈ ఆస్పత్రిలో నిర్వహించారు. దేశం నలుమూలలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా తిరుపతికి రోగులు వస్తున్నారు. పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అనతికాలంలోనే ది బెస్ట్‌గా గుర్తింపు సాధించింది. ఇదీ చదవండి: వ్యవసాయ ఉత్పత్తులకు ముందే మద్ధతు ధరలు : మంత్రి కాకాణి -
తిరుపతి ఎస్వీ గోశాలలో ‘సరోగసి’ దూడ జననం
తిరుపతి రూరల్: దేశంలో తొలిసారిగా పిండమార్పిడి (సరోగసి) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించినట్లు టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం తిరుపతిలోని ఎస్వీ గోశాలలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా టీటీడీ పరిధిలోని తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో మేలుజాతి ఆవుల అండాలు సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారని చెప్పారు. వీటిని టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో శనివారం రాత్రి ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కోసం దాతలు ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చా రని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఐదేళ్లలో 324 సాహివాల్ గోజాతి దూడల ఉత్పత్తి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ సరోగసి పద్ధతిలో రానున్న ఐదేళ్లలో 324 మేలు రకమైన సాహివాల్ గోజాతి దూడలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీన్లోభాగంగా పిండమార్పిడి చేసిన ఆవుల్లో ఇప్పటివరకు 11 గర్భం దాల్చినట్లు చెప్పారు. ఒక ఆవు శనివారం రాత్రి సాహివాల్ పెయ్యదూడకు జన్మనిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో మరో పది సాహివాల్ దూడలు జన్మించనున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, గో సంరక్షణ ట్రస్ట్ సభ్యులు రామ్సునీల్రెడ్డి, గో సంరక్షణశాల డైరెక్టర్ హరినాథరెడ్డి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం డీన్ వీరబ్రహ్మయ్య, వెంకట్‌నాయుడు పాల్గొన్నారు. -
ఆంధ్ర టు డచ్ వయా ఆక్లాండ్...
ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి ఆటలను విపరీతంగా ఇష్టపడ్డాడు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆటగాడిగా మారాలనే కోరిక కూడా పెరుగుతూ వచ్చింది. సొంత ఊరు వదిలినా, దేశాలు మారినా ఆ ఆలోచన మనసులోంచి పోలేదు. అన్ని రకాల క్రీడలూ ప్రయత్నించిన తర్వాత క్రికెట్ వద్ద అతను ఆగాడు. అందులోనే అగ్ర స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆపై దానిని చేరుకునేందుకు అన్ని రకాలుగా శ్రమించాడు. ఆ క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా ఎక్కడా ఆశ కోల్పోలేదు. చివరకు తాను పుట్టిన, పెరిగిన దేశం కాకుండా ఉపాధి కోసం వెళ్లిన మూడో దేశం తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ముద్ర వేయించుకొని సగర్వంగా నిలిచాడు. అతని పేరే అనిల్ తేజ నిడమనూరు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగి ఇప్పుడు నెదర్లాండ్స్ జట్టుకు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహిస్తున్న తేజపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అంతర్జాతీయ క్రికెటర్ కావాలనే ఏకైక లక్ష్యంతో అన్ని ప్రయత్నాలూ చేశాను. ఇందు కోసం చాలా కష్టపడ్డా. ఏదీ సునాయాసంగా దక్కలేదు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా పట్టుదలగా నిలబడ్డా. న్యూజిలాండ్‌లో నా 16 ఏళ్ల వయసులోనే అమ్మానాన్న భారత్‌కు వెనక్కి వచ్చేశారు. నేను కూడా రావాల్సి ఉండగా, కెరీర్‌ను నిర్మించుకుంటున్న దశలో రాలేనని చెప్పా. అప్పటి నుంచి అన్నీ నేనే సొంతంగా చేసుకున్నా. పార్ట్‌టైమ్ జాబ్‌లు చేస్తూ క్రికెట్‌ను మాత్రం వదల్లేదు. ఎవరి అండ లేకపోయినా, డచ్ భాష రాకపోయినా మొండిగా నెదర్లాండ్స్‌లో అడుగు పెట్టా. ఇదంతా నా స్వయంకృషి. ఈ ఏడాది జూన్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో రాణించి మా జట్టు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తే భారత్‌లో ఆడే అవకాశం వస్తుంది. అదే జరిగితే నా కెరీర్లో గొప్ప క్షణం అవుతుంది. అందు కోసం ఎదురు చూస్తున్నా. –‘సాక్షి’తో తేజ నిడమనూరు సాక్షి, హైదరాబాద్: నెదర్లాండ్స్ క్రికెట్ టీమ్‌లో ఇప్పుడు తేజ నిడమనూరు కీలక సభ్యుడు. గత వారం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో అజేయ సెంచరీలతో అతను జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది మేలో తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను ఇప్పటి వరకు 11 వన్డేలు, 6 టి20లు ఆడాడు. దక్షిణాఫ్రికాతో శుక్ర, ఆదివారాల్లో జరిగే వన్డే మ్యాచ్‌లకు తేజ ప్రస్తుతం సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తేజ తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. క్రికెటర్‌గా ప్రాథమికాంశాలు నేర్చుకోవడం మొదలు అవకాశాల కోసం యూరోప్ దేశం చేరడం వరకు అతని ప్రస్థానంలో అనేక మలుపులున్నాయి. అలా మొదలైంది... తేజ స్వస్థలం విజయవాడ. తేజ తల్లిదండ్రులు పాండురంగారావు, పద్మావతి మెరుగైన ఉపాధి అవకాశాల కోసం న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. దాంతో 2001లో ఏడేళ్ల వయసులో తేజ కొత్త జీవితం కూడా అక్కడే ప్రారంభమైంది. పాఠశాలలో చదువుతున్న సమయంలోనే భిన్నమైన ఆటల్లో తేజ రాణించాడు. ముఖ్యంగా కివీస్ అభిమాన క్రీడ రగ్బీలో కూడా అతను పట్టు సంపాదించాడు. అయితే అనుకోకుండా క్రికెట్‌పై కలిగిన ఆసక్తి పూర్తిగా ఈ క్రీడ వైపు మళ్లేలా చేసింది. ఆక్లాండ్‌లో తల్లి పని చేస్తున్న సంస్థ పక్కనే ప్రఖ్యాత ‘కార్న్‌వాల్ క్రికెట్ క్లబ్’ ఉంది. న్యూజిలాండ్‌లో అతి పెద్ద క్లబ్‌లలో ఒకటైన ఇక్కడే పలువురు దిగ్గజ క్రికెటర్లు మార్టిన్ క్రో, గ్రేట్‌బ్యాచ్, ఆడమ్ పరోరె తమ ఆటను మొదలు పెట్టారు. ఈ క్లబ్లో రోజూ క్రికెట్ చూస్తూ తేజ కూడా ఆకర్షితుడయ్యాడు. దాంతో తల్లిదండ్రులు అతడిని ఇందులో చేర్పించారు. ఆపై అతని క్రికెట్ సాధన మొదలైంది. చురుకైన ఆటతో వేగంగా పట్టు పెంచుకున్న తేజ స్థానిక లీగ్‌లలో సత్తా చాటడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ఇదే క్రమంలో ఆక్లాండ్ ‘ఎ’ టీమ్‌లో అతను చోటు దక్కించుకున్నాడు. అక్కడా స్థానం లభించడంతో ఆక్లాండ్ సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ‘క్రికెట్‌ను ఎంచుకున్న తర్వాత ఎక్కడా నేను ఉదాసీనతకు చోటు ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని గట్టిగా నిర్ణయించుకొని సుదీర్ఘ సమయాల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఒకే లక్ష్యంతో సాగాను. నా ప్రదర్శనపై ప్రశంసలు రావడం, పలువురు ప్రోత్సహించడంతో భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది’ అని తేజ చెప్పాడు. అవకాశాలు దక్కకపోవడంతో... అయితే ఆటలో ఎదుగుతున్న కొద్దీ తేజకు ఊహించని పరిణామాలు ఆక్లాండ్‌లో ఎదురయ్యాయి. కేవలం అంకెలు, రికార్డులు మాత్రమే మెరుగైన అవకాశాలు కలి్పంచలేవని అతనికి అర్థమైంది. సీని యర్లు టీమ్‌లో పాతుకుపోవడం, వేర్వేరు కారణాల వల్ల అతనికి పూర్తి స్థాయిలో తన సత్తా చాటే అవకాశం రాలేదు. అయితే ఆటకు విరామం మాత్రం ఇవ్వరాదని పట్టుదలగా భావించడంతో మరో ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చింది. ముందుగా ఇంగ్లండ్ కౌంటీ డర్హమ్ మైనర్ లీగ్‌లలో అడుగు పెట్టిన తేజ ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో లీగ్‌లు ఆడేందుకు ఆరు నెలల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయం ముగిసిన తర్వాత మళ్లీ కివీస్‌కు వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలోనూ క్రికెట్‌ను వదలకూడదనుకున్నాడు. సరైన దిశలో... నెదర్లాండ్స్‌లో గతంలో ఆడిన అనుభవం సరైన సమయంలో తేజకు పనికొచ్చింది. అక్కడే ఉండి పూర్తి స్థాయిలో క్రికెట్ ఆడితే భవిష్యత్తులో పైకి ఎదగవచ్చని అర్థమైంది. అయితే అలా చేయాలంటే ముందు అక్కడ ఒక ఉద్యోగంలో చేరాలి. దాంతో తాను చేసిన స్పోర్ట్స్ మేనేజ్మెంట్ డిగ్రీతో ఉద్యోగ ప్రయత్నం చేశాడు. అయితే అతని అర్హత ప్రకారం కాకుండా మరో రూపంలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ‘స్టార్ట్‌ఎక్స్’ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 2019 మే నెలలో తేజ నెదర్లాండ్స్ గడ్డపై చేరాడు. నిబంధన ప్రకారం జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపిక కావాలంటే కనీసం మూడేళ్లు నివాసం ఉండాలి. అయితే కొద్ది రోజులకే ‘కరోనా’ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆటను తీసి కొంత కాలం గట్టున పెట్టాల్సి వచ్చింది! ఇలాంటి స్థితిలో మరోసారి క్రికెట్ కెరీర్ సందేహంలో పడింది. అయినా సరే, తేజ వెనక్కి తగ్గలేదు. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు క్రికెట్ ఆడుతూ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకున్నాడు. సెలక్షన్ టోర్నీల్లో సత్తా చాటి ఎట్టకేలకు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 2022 ఏప్రిల్‌లో మూడేళ్లు ముగియగా, మే 31న ఆమ్స్టెల్వీన్లో వెస్టిండీస్‌తో తొలి వన్డే ఆడటంతో అతని స్వప్నం సాకారమైంది. 51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 58 పరుగులు చేసిన తేజ అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా మొదలు పెట్టాడు. -
Nagarkurnool: ముందస్తు ఊహాగానాలు.. టీఆర్ఎస్లో అలజడి
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతిపై అనర్హత వేటు అధికార పార్టీ టీఆర్ఎస్కు తలనొప్పి తెచ్చిపెట్టింది. నేతల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు జిల్లా పరిషత్ పీఠం సాక్షిగా మరోసారి తెరమీదకు రావడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్‌ప్రసాద్‌ను కాదని.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం దుమారానికి దారితీసినట్లు తెలుస్తోంది. భరత్ప్రసాద్కు చెక్ పెట్టేలా జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు గతంలో లాగే పావులు కదిపి.. తెరవెనుక తతంగం నడిపించినట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల్లో వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలొస్తాయని ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా.. తాజా రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఆందోళన పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. తొలుత అలా.. 2019 జూన్‌లో జరిగిన నాగర్‌కర్నూల్ జెడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 20 జెడ్పీటీసీలకు 17 స్థానాలను కైవసం చేసుకుని జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వేషన్ కాగా.. కల్వకుర్తి నుంచి గెలుపొందిన భరత్‌ప్రసాద్‌ను చేయాలని తొలుత భావించారు. అయితే అనూహ్యంగా తెలకపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి పేరును ఓ ఇద్దరు ముఖ్యనేతలు తెరపైకి తీసుకు రాగా.. ఆమెకే అవకాశం దక్కింది. రాములు ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉండడం, గతంలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడంతో ఆయన కుమారుడు, విద్యావంతుడైన భరత్‌ప్రసాద్‌ను చైర్మన్ చేస్తే తమకు భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని భావించిన సదరు నేతలు పద్మావతి పేరును తెరమీదికి తెచ్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు, వారి అనుచరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ అనుచరుల్లో అసహనం.. విమర్శలు జెడ్పీ పీఠానికి సంబంధించి జిల్లాకు చెందిన ముఖ్యనేతలు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఎంపీ రాములు, అతడి అనుచరుల్లో అసహనం నెలకొన్నట్లు తెలుస్తోంది. అంతర్గత భేటీలో ఈ విషయం చర్చకు రాగా.. కావాలనే గతంలో తెరచాటు రాజకీయాలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారని ఒకరిద్దరు ఆగ్రహావేశాలకు లోనైనట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు నడుచుకోవాలని.. సంయమనం పాటించాలని వారికి ఎంపీ సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలకు సమయం ఇంకా ఏడాదికి పైగా ఉన్నప్పటికీ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టడం.. ఎస్సీకి కేటాయించిన స్థానంలో వేరొకరిని నియమించడంపై ఆ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కోర్టు ఆదేశించినప్పటికీ.. తెలకపల్లి జెడ్పీటీసీగా సుమిత్ర ప్రమాణస్వీకారంలో జాప్యం జరుగుతోంది. పద్మావతి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని.. అందుకే జాప్యం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇలా.. తెలకపల్లి జెడ్పీటీసీ పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్లో సంతానానికి సంబంధించి తప్పు డు వివరాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 1997లో మొదటి కుమారుడు, 2001లో ఇద్దరు కవలలు జన్మించినట్లు పేర్కొన్నారని.. వాస్తవానికి 1991లో మొదటి కుమారుడు, 1997లో ఒకరు, 2001లో మరొకరు జని్మంచారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ తర్వాత పద్మావతిని జెడ్పీటీసీ సభ్యత్వానికి అనర్హురాలిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికైనట్లు ప్రకటించాలని ఆదేశించింది. దీనిపై పద్మావతి హైకోర్టును ఆశ్రయించగా ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. చివరకు స్టే పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించడంతో పద్మావతిపై అనర్హత వేటు పడింది. దీనిపై ఆమె డివిజనల్ బెంచీకి వెళ్లినా చుక్కెదురైంది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎంపిక అనివార్యం కాగా.. భరత్‌ప్రసాద్‌తో పాటు ఊర్కొండ జెడ్పీటీసీ శాంతకుమారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే తొలి నుంచి పీఠం ఆశిస్తున్న భరత్‌నే జెడ్పీచైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్‌కు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక సైతం తొలుత అడ్డు పడిన వారే ఉన్నారని.. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అన్నీ తానై పథకం ప్రకారం భరత్‌కు చెక్‌పెట్టేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
సీఎంకు కాల్చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. ఎవరా సీఎం?
50 ఏళ్లపాటు నిరంతరాయంగా 'సాహసమే ఊపిరి'గా ఎన్నో రికార్డులను నెలకొల్పిన నటశేఖరుడు.. ఇక లేడనే విషయం తెలుసుకొని యావత్ సినీలోకం కంటతడిపెడుతోంది. అయితే సూపర్‌స్టార్ కృష్ణ మనల్ని విడిచి వెళ్లిపోయిన ఆయన జ్ఞాపకాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో సూపర్‌స్టార్ కృష్ణ జీవితంలో జరిగిన ఒక సంఘటన మాత్రం ఔరా అనిపించకమానదు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే కుమార్తె వివాహానికి రావొద్దని చెప్పారంటే మనం నమ్మగలమా?. కానీ ఇదే నిజం.. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో ఒకసారి పరిశీలిస్తే.. కృష్ణ తన పెద్దకుమార్తె పద్మావతి వివాహ వేడుకను గల్లా జయదేవ్‌తో చెన్నైలో నిశ్చయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను సూపర్‌స్టార్ కృష్ణ స్వయంగా వెళ్లి వివాహానికి ఆహ్వానించారు. చెన్నైలోనే వివాహం జరుగుతుండటంతో అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేస్తూ తప్పకుండా వస్తానని మాటిచ్చింది. అయితే వివాహానికి మూడు రోజుల ముందు జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి కృష్ణను కలిశారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో మొదటి మూడు వరుసలు భద్రతా కారణాల రీత్యా జయలలితకు కేటాయించాల్సిందిగా సెక్యూరిటీ ఆఫీసర్ కోరారు. దీంతో షాక్ తిన్న కృష్ణ.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖలు వివాహానికి వస్తున్న సంగతి చెప్పి మొదటి మూడు వరుసలు పూర్తిగా కేటాయించడం కదురదని చెప్పారు. కృష్ణ వెంటనే జయలలితకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలోనే జయలలితను సున్నితంగా వివాహానికి రావొద్దని.. మీ ఆశీర్వచనాలు ఉంటే చాలని చెప్పారు. విషయాన్ని అర్థం చేసుకున్న జయలలిత వివాహానికి హాజరు కాకుండా పెళ్లిరోజున వధూవరులకు ఒక బొకేను పంపారు. కాగా, జయలలిత సూపర్‌స్టార్ కృష్ణతో గూఢాచారి 116, నిలువు దోపిడి వంటి సినిమాల్లో కలిసి నటించారు. చదవండి: (మహేశ్ బాబు గొప్ప మనసు.. తీవ్ర విషాదంలోనూ వారికోసం..!) -
Sirivennela Sitarama Sastry: 16 ఏళ్ల వయసులో పెళ్లి.. తను నా బెటర్ త్రీ ఫోర్త్!
Sirivennela Sitarama Sastry Heart Touching Words About Wife Old Interview: మామూలుగా జీవిత భాగస్వామిని ‘బెటరాఫ్’ అంటుంటాం. సిరివెన్నెల తన సతీమణికి అంతకన్నా ఎక్కువే ఇచ్చారు. ‘పద్మ నాకు బెటర్ హాఫ్ కాదు, బెటర్ త్రీ ఫోర్త్’ అని ‘సాక్షి’కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిరివెన్నెల అన్నారు. ‘‘ఆమె నా పాట... నా భార్య, నా పాట ఎప్పుడూ బోర్ కొట్టవు. ‘నువ్వు సీతారామశాస్త్రి మాత్రమే.. నీ జీవితానికి నిజమైన సిరివెన్నెల పద్మ’’ అని ప్రముఖ గాయని జానకిగారు నాకు చెప్పిన మాట అక్షరాలా నిజం. నన్ను, నాకుటుంబాన్ని పద్మ చూసుకుంటూ, అందరి బాధ్యతలు నిర్వర్తిస్తూ చాలా ఆనందాలను కోల్పోయింది. నా జగమంత కుటుంబాన్ని తానే మోసి నన్నెప్పుడూ ఏకాంతంగా ఉంచి, ప్రొఫెషన్‌కి అంకితం అయ్యేలా చేసింది. అలాంటి పద్మ నాకు బెటర్ హాఫ్ కాదు... బెటర్ త్రీ ఫోర్త్’’ అని ఆ ఇంటర్వ్యూలో సిరివెన్నెల అన్నారు. ఆమే ఆయన పాటకు తొలి శ్రోత పదహారేళ్ల వయసులో ‘సిరివెన్నెల’ చిటికెన వేలు పట్టుకుని ఏడడుగులు వేశారు పద్మావతి. సిరివెన్నెలతో తన జీవితం గురించి ఆ ఇంటర్వ్యూలో పద్మావతి మాట్లాడుతూ – ‘‘మాదీ, సీతారామశాస్త్రిగారిదీ అనకాపల్లే. నాకు సినిమాలన్నా, పాటలన్నా చాలా ఇష్టం. లంచ్ బ్రేక్‌లో ఇంటికి వచ్చినప్పుడు రేడియోలో వచ్చే పాటలు విన్నాకే స్కూలుకెళ్లేదాన్ని. పాటలంటే అంత ఇష్టం ఉన్న నేను సినిమా పాటలు రాసే వ్యక్తితో జీవితం పంచుకుంటానని అనుకోలేదు. పెళ్లి చూపుల్లో సీతారామశాస్త్రిగారు నన్ను చూశారు కానీ నేను బిడియంతో తలెత్తి చూడలేదు. పెళ్లి పీటల మీదే ఆయన్ను చూశాను. మా మామగారు లేకపోవడంతో ఇంటి పెద్ద కొడుకుగా అన్ని బాధ్యతలూ శాస్త్రిగారివే. పెళ్లి తర్వాత ఆయన భాగస్వామిగా అన్ని బాధ్యతలు నాకూ వచ్చాయి. ఇంటి బాధ్యతల్లో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకునేవారు కాదు. మా అత్తగారి (సుబ్బలక్ష్మి) సలహాలు తీసుకుని అన్నీ నేనే చూసుకున్నాను. మావారు ఎప్పుడూ ఏదో ఒకటి చదువుకుంటూ, రాసుకుంటూ ఉండేవారు. ‘సిరివెన్నెల’ సినిమాకు సీతారామశాస్త్రిగారిని గేయ రచయితగా కె. విశ్వనాథ్‌గారు నిర్ణయించినప్పుడు మేం పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ‘సిరివెన్నెల’ చిత్రం విడుదల వరకూ అనకాపల్లిలో ఉండేవాళ్లం. ఆ సినిమా హిట్ తర్వాత శాస్త్రిగారికి ఎక్కువ అవకాశాలు రావడంతో మద్రాసుకు (చెన్నై) షిఫ్ట్ అయ్యాం. మా అత్తగారి సహకారంతో ఇల్లు, పిల్లల చదువులన్నీ నేనే చూసుకున్నాను. పదేళ్ల తర్వాత హైదరాబాద్‌కి వచ్చాం. ఆయన రాసిన ప్రతి పాటను ముందు వినేది నేనే. ఆయన రాసిన ప్రతి చిన్న కాగితం జాగ్రత్తగా దాస్తాను. ఆయన రాసిన పాటలతో మా ఇంట్లో నేను ఒక లైబ్రరీ ఏర్పాటు చేశాను’’ అన్నారు. చదవండి: Sirivennela Seetharama Sastry: సిరివెన్నెలకు ఆ జిల్లా అంటే అమితమైన ప్రేమ.. -
అలుపెరగని సేవకి... డాక్టర్ పద్మావతి!
గురజాల: గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల పీహెచ్సీలో పనిచేస్తోన్న డాక్టర్ జి.పద్మావతి కోవిడ్ వారియర్‌గా కరోనా రోగులకు నిర్విరామ సేవలు అందిస్తున్నారు. పీహెచ్సీలో పద్మావతితో పాటు మరో డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ సెలవులో ఉండటంతో పద్మావతి ఒక్కరే సేవలు అందిస్తున్నారు. అనుమానితులకు కరోనా పరీక్షలు చేయించడం నుంచి వ్యాక్సినేషన్ వరకు అన్నీ డాక్టర్ పద్మావతి పర్యవేక్షిస్తున్నారు. నిత్యం పీహెచ్సీ పరిధిలో పదుల సంఖ్యలో కరోనా టెస్టులు, వందల సంఖ్యలో కోవిడ్ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మాడుగుల పీహెచ్సీ పరిధిలో 95 మందికి పైగా కరోనా రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వారిపై ప్రత్యేక దృష్టి సారించి, వారికి సలహాలిచ్చి త్వరగా కొలుకునే విధంగా పద్మావతి చర్యలు తీసుకుంటున్నారు. వరండాలోనే నిద్ర... డాక్టర్ పద్మావతికి పదేళ్లు, ఏడేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. రోజూ వైద్యశాలలో కోవిడ్ అనుమానితులకు పరీక్షలు చేయించిన తరువాత ఇంటికి వెళ్తే పిల్లలకు ఇబ్బందులు వస్తాయనే భావనతో వారిని తన పుట్టింటికి పంపించారు. విధుల అనంతరం ఇంటికి వెళ్లినా బయట నుంచే తన భర్త శ్రీహర్ష, అత్త బాగోగులు తెలుసుకుంటున్నారు. ఇంటి వరండాలో ఉన్న గదిలోనే నిద్రిస్తున్నారు. భర్త కూడా వైద్యుడు కావడంతో ఆమెను ప్రోత్సహిస్తున్నారు. సేవలోనే సంతృప్తి.. కోవిడ్ రోగులకు సేవ చేయడం ఎంతో తృప్తినిస్తోంది. రామాపురానికి చెందిన ఒక వృద్ధుడు కోవిడ్ బారిన పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటే, అతని కుమారుడు ఆస్పత్రికి తీసుకురావడం కుదరదని చెప్పాడు. వెంటనే అతని ఇంటికి ప్రైవేట్ అంబులెన్సును పంపి, అతనికి ఆక్సిజన్ అందించి గుంటూరుకు రిఫర్ చేయడంతో ఆ వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతని ప్రాణాలను కాపాడినందుకు ఎంతో ఆనందంగా ఉంది. – జి పద్మావతి, మాడుగుల పీహెచ్సీ వైద్యురాలు -
పద్మావతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలో హత్యకు గురైన యేదుపాటి పద్మావతి హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. గత నెల 31వ తేదీన పట్టపగలే ఆమెను హత్య చేసి నగలు దొంగతనం చేయడాన్ని సవాలుగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలను దర్యాప్తుకు ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణా ల్లో జల్లెడ పట్టి చివరకు హంతకుడి ఆచూకీ కనుగొన్నట్లు సమాచారం. పక్కా ప్రొఫెషనల్.. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు లభించకుండా కారం చల్లడం.. చేతి వేలిముద్రలు కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి గమనించిన ఇది పక్కా ప్రొఫెషనల్ పనిగా భావించి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు సాగించారు. దొంగతనానికి వచ్చిన ఆగంతకుడు క్షణాల వ్యవధిలో పని ముగించుకొని వెళ్లడానికి వచ్చాడని తెలుస్తోంది. అందువల్లే ఆమె మెడలో ఉన్న గొలుసు, నల్లపూసల దండ, చేతికి ఉన్న నాలుగు గాజులను మాత్రమే తీసుకెళ్లడం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పెనుగులాటతో హత్య.. పక్కాగా రెక్కీ చేసికుని దొంగతనానికి వచ్చిన ఆగంతకుడికి.. మృతురాలు పద్మావతికి మధ్య తీవ్ర పెనుగులాట జరిగినట్లు ఆధారాలు చెబుతున్నాయి. జనవరి 31వ తేదీన చివరగా మృతురాలు, ఆమె భర్త వెంకటేశ్వర్లు స్థానికంగా ఉన్న అమ్మపాద అపార్ట్మెంట్ జరిగిన ఫంక్షన్‌కు హాజరై ఇంటికొచ్చారు. ఆ తర్వాత ఆమె భర్త పనిపై బయటకు వెళ్లిపోయారు. ఈ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగను చూసిన పద్మావతి తీవ్రంగా ప్రతిఘటించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. చివరకు ఆమె అరుపులతో చుట్టుపక్కల వారు వస్తే తన పనైపోతుందనే కారణంతోనే దొంగ పద్మావతిని హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు వినియోగించిన ఆయుధం కూడా అతనిదేనని పోలీసు లు అంచనాకు వచ్చినట్లు సమాచారం. పక్క జిల్లాలకు పరారీ.. సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకీని కనుగొన్నట్లు సమాచారం. అతనిది విజయవాడేననీ.. హత్య చేసి నగలు దోచుకున్న వెంటనే నగరాన్ని వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతాల్లోనూ తలదాచుకున్నట్లు సమాచారం. ఆ తరువాత ఏలూరు తదితర ప్రాంతాల్లోనూ తిరిగినట్లు పోలీసులు గుర్తించారు.సాంకేతిక అంశాల ఆధారంగా చివరకు నిందితుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఎదిగిన ఆకాశం
తల ఎత్తి చూస్తే భారత జాతీయ పతాకం కనిపించిందామెకు. ఈ దేశానికి నేను సైతం సేవ చేయాలి అనుకుంది. ఇంటి నుంచి ఆడపిల్ల కాలు బయటపెట్టలేని రోజుల్లో కాలికి యూనిఫామ్ షూ కట్టుకోవడం ఎంత కష్టం. కాని ఉండిపోతే అలాగే ఉండిపోతాం. ఎదగాలి. ఎగరాలి. ఆకాశాన్ని అందుకోవాలి. అంతకు మించిన ఠీవితో తల ఎత్తుకు నిలబడాలి అనుకుందామె. పోరాడింది. గెలిచింది. భారతదేశపు తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి. మగవాళ్ల సామ్రాజ్యంగా ఉండే సైన్యంలో త్రీ స్టార్ ర్యాంక్‌కు ఎదిగిన ధీర మహిళ ఆమె. 1962– చైనా యుద్ధం. ఆ యుద్ధ వాతావరణం, ఆ వాతావరణంలో వినిపించిన ‘అయ్ మేరే వతన్‌కీ లోగో..’ పాట అప్పటి పద్నాలుగేళ్ల అమ్మాయి ఆలోచనా ధోరణిని, జీవనశైలినే మార్చేశాయి. ఆమె దేశానికే తన జీవితాన్ని అంకితం చేసింది. ఫలితం? ఎన్నో ఘనతలను తన పేరుకు ముందు జత చేర్చుకోవడమే కాదు తాజాగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునే గౌరవాన్ని పొందింది. నాటి ఆ అమ్మాయే నేటి 76 ఏళ్ల పద్మావతి బంధోపాధ్యాయ. భారత వైమానిక దళంలో తిరుగులేని పేరు. తొలి మహిళా ఎయిర్ మార్షల్, త్రివిధ దళాలలో 3 స్టార్ ర్యాంకుకు ఎదగగలిగిన రెండవ మహిళ, డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కోర్స్ పూర్తి చేసిన తొలి మహిళా అధికారి, ఏవియేషన్ సైన్స్‌లో తొలి మహిళా ఎక్స్పర్ట్, ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్... ఇంత కీర్తి ఉన్నా ఎంతో ఒదిగి ఉండడం పద్మావతికున్న ముఖ్యమైన క్వాలిఫికేషన్. అదే ఈ రోజు ఆమె గురించి తెలుసుకునేలా చేసింది. పుట్టింది 1944వ సంవత్సరం తిరుపతిలో. తండ్రి ఎస్.స్వామినాథన్, తల్లి అలమేలు. కాని పెరిగింది మాత్రం ఢిల్లీలో. చదువును ఆడపిల్లలకు ఆమడదూరం ఉంచే కాలం కావడం ఒకటి, కుటుంబ çకట్టుబాట్ల కారణాన మరొకటి మొత్తానికి పదేళ్లు వచ్చేవరకు బడిని చూడలేదు పద్మావతి. అప్పటిదాకా సోదరుడి పాఠ్యపుస్తకాలతోనే అక్షర జ్ఞానం సంపాదించుకుని నేరుగా అయిదవ తరగతిలో బడిలో చేరింది. డాక్టర్ కావాలని పద్మావతి కల. కాని ఎనిమిదవ తరగతి పూర్తయ్యాక సైన్స్ అండ్ ఆర్ట్స్ కోర్సులు ఉన్న స్కూలు ఇంటికి దూరంగా ఉండటంతో అంతదూరం ఆడపిల్లను బస్సులో పంపడం ఇష్టం లేక ఇంటిముందున్న స్కూల్లోనే పద్మావతిని చేర్పించింది తల్లి. ఆ స్కూల్లో డొమెస్టిక్ సైన్స్, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, తమిళం, సంస్కృతం చదువుకుంది పద్మావతి. బోర్డ్‌లో ఫస్ట్‌న నిలిచింది. ఇప్పుడు పెద్దదయ్యింది కనుక ప్రీ మెడికల్ చదువుతా అని ఉత్సాహపడింది పద్మావతి. ఆ మాట విని అందరూ నవ్వారు. ‘సైన్స్ బేస్ లేంది ప్రీ మెడికల్ ఎలా చదువుతావు?’ అన్నారు. అయినా వెరవక ప్రీ మెడికల్‌లో చేరాలనే పట్టుపట్టిన కూతురి కోసం తండ్రి ‘మా అమ్మాయికి సీట్ ఇవ్వండి.. ’ అంటూ ఢిల్లీలోని ఎక్కని కాలేజి మెట్టు లేదు.. చేతులు జోడించి విన్నవించుకోలేని కాలేజీ సిబ్బంది లేదు. మొత్తానికి ఒక కాలేజ్ ఆ రిక్వెస్ట్‌ను మన్నించి పద్మావతికి ప్రీ మెడికల్ చదువుకు అవకాశమిచ్చింది. అలా ఢిల్లీ బోర్డ్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఢిల్లీ యూనివర్శిటీ సైన్స్ కోర్సెస్‌కు వెళ్లిన తొలి విద్యార్థిని పద్మావతే అయ్యింది. ఎయిర్‌ఫోర్స్‌లో.. అప్పుడే అంటే 1962లో వచ్చిన చైనా యుద్ధం ఆమెలో ‘దేశం కోసం ఏదైనా చేయాలనే’ ఆలోచనను రేకెత్తించాయి. ఎలాగైనా ఆర్మీలో చేరాలి అని నిశ్చయించుకుంది. అసలు వాళ్లింట్లో ఏ తరమూ కనీసం మిలిటరీ కవాతు శబ్దం కూడా విని ఎరగదు. ఆ మాటకొస్తే పద్మావతికీ దానికి సంబంధించిన అవగాహన ఆవగింజంతైనా లేదు. ఆమె ఆకాంక్ష విన్న వాళ్లంతా ఎద్దేవా చేయడమే ‘అమ్మాయి అయ్యుండి మిలటరీలో చేరుతావా?’ అని. ఈలోపు అదే యేడు ఆర్డ్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది. ‘ఇది నాకోసమే అనుకుంది’ పద్మావతి. ఆ తర్వాతి యేడు అందులో సీటు తెచ్చుకుంది. పూర్తయ్యాక వైద్యసేవలను అందించడానికి ఎయిర్‌ఫోర్స్‌ను ఎంపిక చేసుకుంది. ‘ఆ వయసులో ఆ యూనిఫామ్, ఆ విమానాల విన్యాసాలు చూస్తుంటే ఎయిర్ ఫోర్స్ అంటే క్రేజ్ ఉండేది. అందుకే దాన్ని ఎంచుకున్నా’ అంటారు పద్మావతి నవ్వుతూ. ఎలాగూ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాను కాబట్టి పైలట్‌గా కూడా ప్రయత్నిద్దామని దానికోసమూ శ్రమించింది ఆమె. అయితే ఫిట్నెస్ లేని కారణంగా ఆ అవకాశం రాలేదు. అయినా నిరాశ పడలేదు. ఏవియేషన్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ చేసింది. అలాగైనా పెలట్స్ కలిసి పనిచేయొచ్చని. అనుకున్నట్లుగానే తను పని చేసిన చాలాచోట్ల పైలట్స్‌తో ఎయిర్‌క్రాఫ్ట్స్‌లో ప్రయాణించింది కూడా. 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో.. యుక్త వయసులో చైనా యుద్ధం చూసింది. సర్వీస్‌లో చేరగానే పాకిస్తాన్‌తో యుద్ధ పరిస్థితులు అనుభవంలోకి వచ్చాయి. అప్పుడు ఆమె పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఇంటర్న్‌షిప్‌లో ఉంది. కుటుంబంతో కలిసి ఉండే నివాస ప్రాంతం కాదు అది. ‘అందుకే బంకర్లలో ఉండేవాళ్లం. అప్పటికి నాకు ఆరునెలల కొడుకు. నేను తప్ప ఆ బంకర్లలో మిగిలిన వాళ్లంతా మగవాళ్లే. నా పారామెడికల్ స్టాఫ్‌తో కలిసి బంకర్లో ఉండేదాన్ని. యుద్ధం మొదటి రోజు పాకిస్తాన్ బాంబ్‌తో దాడి చేసింది. ఆ టైమ్‌లో మేము బయటే నిలబడి ఉన్నాం. రెండో రోజు 250 మంది క్షతగాత్రులయ్యారు. వాళ్లందరికీ చికిత్స చేశాను. మెడిసిన్‌లో ప్రాక్టికల్ లెసన్స్ నేర్చుకున్న సందర్భం అది’ అంటూ ఆ రోజులను గుర్తు తెచ్చుకున్నారు పద్మావతి. కార్గిల్ యుద్ధమప్పటికీ ఆమె కల్నల్‌గా పర్యవేక్షణా బాధ్యతల్లో ఉన్నారు. ఎప్పటికీ మరిచిపోలేనివి.. ‘‘ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని అయ్యాక.... ముందు కార్ ఫ్లాగ్ ఎగురుతుండగా నా అధికార వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే అక్కడున్న ఆడవాళ్లంతా చప్పట్లు కొట్టారు. ఎందుకు అలా? అని అడిగాను. ఇప్పటివరకు భార్యను పక్కన కూర్చోబెట్టుకొని అధికార వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లిన మేల్ ఆఫీసర్లనే చూశాం. కాని ఇప్పుడు ఒక మహిళ దర్పంగా అధికార వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే గర్వంగా అనిపించి చప్పట్లు కొట్టాం అని చెప్పారు. అప్పుడు ఆ ప్రత్యేకత తెలిసింది నాకు’’ అంటూ తను ఎప్పటికీ మరిచిపోలేని విషయాలను పంచుకున్నారు. పద్మావతి భర్త ఎస్.ఎన్.బందోపాధ్యాయ కూడా ఎయిర్‌ఫోర్స్‌లోనే సేవలందించారు. 1971 పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ ఇద్దరికీ ఒకే రోజున విశిష్ఠ సేవా పురస్కారం లభించింది. భార్యభర్తలిద్దరూ ఒకేసారి.. ఒకే రోజున ఇలా మెడల్ తీసుకోవడం ప్రపంచ సైనికచరిత్రలోనే లేదు. అదీ రికార్డే. ‘నాకు మా నాన్న, నా భర్త.. ఇద్దరూ స్ఫూర్తే. వీళ్లిద్దరూ ఆడ, మగ ఇద్దరూ సమానమని నమ్మారు కాబట్టే నేను ఈ రోజు దేశానికి తెలిశాను’ అంటారు పద్మావతి. ‘పనికి ఆడ, మగ వ్యత్యాసం ఉండదు. సామర్థ్యమే ప్రధానం. ఏ స్త్రీ అబల కాదు. మహిళ నిర్ణయాధికారమే సాధికారత. చదువుతోనే అది సాధ్యమవుతుంది’ అని చెప్తారు పద్మావతి. మత సామరస్యం నేను దక్షిణ భారతదేశంలో పుట్టి ఢిల్లీలో పెరిగాను. మా ఆయన వాళ్లది ఉత్తర ప్రదేశ్‌లో స్థిరపడ్డ బెంగాలీ కుటుంబం. మేం పెళ్లిచేసుకున్నాం. కులం, మతం, ప్రాంతం ప్రాతిపాదికగా కాదు. భారతీయత ప్రాతిపాదికగా. కులం, మతం, ప్రాంతంతో గొడవలెందుకు? అందరం భారతీయులమే. ఈ సందర్భంగా నా చిన్నప్పటి సంఘటన ఒకటి చెప్తాను. దేశ విభజనప్పుడు జరిగిన మత కల్లోలాల సమయంలో మేము లోఢీ మార్గ్‌లో ఉండేవాళ్లం. అది ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఆ టైమ్‌లో ఓ రెండు రోజులు మా పేరెంట్స్ నన్ను ఓ ముస్లిం ఇంట్లో ఉంచి వెళ్లారు. ఆ రెండు రోజులు నా పేరును ఫాతిమాగా మార్చి కంటికి రెప్పలా కాపాడుకుంది ఆ కుటుంబం. తర్వాత వాళ్లు పాకిస్తాన్ వెళ్లారో.. ఎక్కడికి వెళ్లారో.. వివరాలు తెలియలేదు. మానవత్వానికి ఇంతకుమించిన ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? – పద్మావతి బంధోపాధ్యాయ -
ఆదర్శ సేద్యం.. ఆనం మార్గం
యాభై ఏళ్లు గృహిణిగా జీవితాన్ని గడిపిన అన్నే పద్మావతి నడి వయసులో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. 12 ఎకరాల్లో ఒకటికి పది ఉద్యాన పంటలను సునాయాసంగా పండిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ వంటి అరుదైన పంటలు సాగు చేయడంతోపాటు సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరోగ్యదాయకంగా తాను పండించిన పండ్లు, కూరగాయలతోపాటు నూజివీడు ప్రాంతంలో ఇతర రైతుల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయోత్పత్తులను సేకరించి విజయవాడ తీసుకెళ్లి.. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం ద్వారా.. వినియోగదారులకు అందిస్తూ ఆదర్శ మహిళా రైతుగా నిలుస్తున్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పద్మావతి ఈ నెల 23న హైదరాబాద్‌లో కర్షక సాధికార సంఘటన్ నుంచి ‘జీవన సాఫల్య పురస్కారం’ అందుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి: జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సానుకూల దృక్పథంతో ఎదుర్కొని జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవడంతోపాటు అమృతాహారాన్ని సమాజానికిందించే ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారుగా మారారు అన్నే పద్మావతి. డిగ్రీ చదువుకున్న పద్మావతి భర్త అకాల మరణం తర్వాత మొక్కవోని దీక్షతో పిల్లలు ఇద్దరినీ పెంచి పెద్దచేశారు. వారు స్థిరపడిన తర్వాత రెండేళ్ల క్రితం నడి వయసులో తనకు బొత్తిగా అనుభవం లేని వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. ఇజ్రాయిల్ దేశానికి విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడ డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ తదితర పండ్ల తోటలను ఆమె శ్రద్ధగా గమనించారు. అప్పుడే పండ్లతోటల సాగుపై ఆమెకు ఆసక్తి కలిగింది. ఆవిధంగా ఆమె వ్యవసాయంలోకి వచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేటలోని తమ 8 ఎకరాల భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో డ్రాగన్ ఫ్రూట్ తోట ఏడాదిగా సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా సీతాఫలం, జామ, బొప్పాయి, టమాట, పచ్చిమిర్చి, వంగ తదితర పంటలు సాగు చేస్తున్నారు. తోటపల్లి వద్ద మరో 4 ఎకరాల్లో కాకర, పొట్ల వంటి పందిరి కూరగాయలతోపాటు టమాటా, ఆకుకూరలు, పూలు, బీట్రూట్, క్యారట్, దోస తదితర కూరగాయలు సాగు చేస్తున్నారు. రమణక్కపేటలో పద్మావతి సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోట నుభవం లేకపోయినా ప్రకృతి సేద్యం.. ప్రకృతి వ్యవసాయ మూలసూత్రాలను అర్థం చేసుకోగలిగితే వ్యవసాయంలో పూర్వానుభవం లేని వారు, ముఖ్యంగా మహిళలు కూడా సులభంగానే ప్రకృతి వ్యవసాయం చేపట్టవచ్చని పద్మావతి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖలోని జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది ద్వారా ప్రకృతి వ్యవసాయం కాన్సెప్ట్ గురించి తెలుసుకొని.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా కూడా పంటలు పండించవచ్చు అని తెలుసుకొని ఆశ్చర్యపోయానని, ఈ కాన్సెప్ట్ నచ్చటంతో అనుసరిస్తున్నానన్నారు. మెట్ట భూముల్లో పెద్దగా కష్టపడకుండానే సాగు చేయడానికి వీలైన పంట కావడం, అత్యంత ఎక్కువ పోషక విలువలతోపాటు మార్కెట్ డిమాండ్ ఉన్నందు వల్లే డ్రాగన్ ఫ్రూట్ తోట సాగుకు శ్రీకారం చుట్టానంటారామె. పది నెలల క్రితం వియాత్నం నుంచి అమెరికన్ బ్యూటీ(పింక్ కలర్) రకం డ్రాగన్‌ఫ్రూట్ మొక్కలను ఒక్కొక్క మొక్క రూ.100కు 10 వేల మొక్కలు తెప్పించి 8 ఎకరాల్లో నాటారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కల నడుమ బొప్పాయి మొక్కలు 4 వేలు, సీతాఫలం మొక్కలు 4 వేలు, 10 వేల జామ మొక్కలు, 3 వేల శ్రీగంధం మొక్కలు నాటారు. అలాగే తోట చుట్టూ కొబ్బరి మొక్కలు నాటించారు. మొక్కల చుట్టూ సజీవ ఆచ్ఛాదన మొక్కలను బీజామృతంతో శుద్ధి చేసి గుంతల్లో ఘనజీవామృతం వేసి నాటామన్నారు. మొక్కల చుట్టూ నవధాన్యాలను చల్లి సజీవ ఆచ్ఛాదన కల్పిస్తున్నామని, కోసిన గడ్డిని, మినప పొట్టును ఆచ్ఛాదనగా వేస్తున్నామని పద్మావతి తెలిపారు. వారానికి ఒకటి, రెండు సార్లు నీటితోపాటు జీవామృతం ఇస్తున్నారు. అప్పుడప్పుడూ పంచగవ్యను నీటితో డ్రిప్ ద్వారా ఇవ్వడంతోపాటు పిచికారీ కూడా చేస్తున్నారు. అవసరం మేరకు సప్త ధాన్యాంకుర, దశపత్ర కషాయాలను పిచికారీ చేస్తున్నామని ఆమె వివరించారు. డ్రాగన్ ఫ్రూట్ తోటలో మహిళా రైతు పద్మావతి పాతికేళ్లు దిగుల్లేని దిగుబడి నాటిన 8 నెలలకే డ్రాగన్ ఫ్రూట్ తొలి కాపు వచ్చింది. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయడం వల్ల రుచి, తియ్యదనం, నిల్వ సామర్థ్యం బాగా ఉన్నాయన్నారు. వివిధ దేశాల డ్రాగన్ ఫ్రూట్స్ తిన్న వారికి తమ పండ్లు తినిపించి చూశానని, రుచి, తీపి చాలా బాగుందన్నారని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్క నాటిన ఐదేళ్లకు కనీసం 10 టన్నుల దిగుబడిని ఇస్తుందన్నారు. వ్యవసాయానుభవం లేని తమ పిల్లలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పాతికేళ్ల పాటు నిశ్చింతగా దిగుబడి ఇచ్చే పంట కావడంతోనే డ్రాగన్ ఫ్రూట్‌ను ప్రధాన పంటగా వేశానని ఆమె తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్‌కు పెద్దగా నీరు అవసరం లేదని, అయితే అధిక వర్షాలను కూడా తట్టుకునే మొండి మొక్కన్నారు. ఎండ 40 సెల్షియస్‌కు మించితే కొంచెం ఇబ్బంది ఉంటుందని, అందుకనే అంతర పంటలుగా సీతాఫలం, శ్రీగంధం, మునగ నాటించామని పద్మావతి వివరించారు. ఇప్పటికే బొప్పాయి దిగుబడి ఒక పంట వచ్చిందని చెబుతూ, అధిక వర్షాలకు తమ ప్రాంతంలో చాలా బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయని, పంచగవ్య పిచికారీ వల్ల తమ తోట తిప్పుకొని ఇప్పుడు మళ్లీ పూతకు వచ్చిందన్నారు. సంఘటితమైతేనే అమ్ముకోగలం ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రకృతి వ్యవసాయదారులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటేనే మార్కెటింగ్ సమస్యను అధిగమించగలుగుతారన్నది పద్మావతి విశ్వాసం. అందుకే విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహకార సంఘంలో ఆమె సభ్యురాలిగా చేరారు. తన 12 ఎకరాల్లో పండించిన పండ్లు, కూరగాయలతోపాటు తమ పరిసర ప్రాంతాల్లో శ్రద్ధగా, నిబద్ధతగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చిన్న రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు పండించే నాణ్యమైన ఉత్పత్తులను కూడా సేకరించి, తన సొంతవాహనంలో ప్రతి రోజూ విజయవాడ తీసుకెళ్లి, సహకార సంఘం ద్వారా వినియోగదారులకు నమ్మకంగా విక్రయిస్తుండడం విశేషం. కూరగాయలను కిలో రూ. 30 రూపాయలకు సంఘానికి తాము ఇస్తున్నామని, మరో పది రూపాయలు వేసుకొని సంఘం వినియోగదారులకు విక్రయిస్తున్నదన్నారు. సంఘం తీసుకోగా మిగిలిన కూరగాయలను తమ పొలాల దగ్గరే కిలో రూ. 40కి అమ్ముతున్నామని పద్మావతి తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలలో సహకార సంఘం ద్వారా ప్రచార కార్యక్రమాలు, సభలు నిర్వహించడం ద్వారా తాము రసాయనాలు వాడకుండా నిబద్ధతతో పండిస్తున్న పంటల గురించి ప్రచారం చేస్తున్నారు. తమ తోటలను సందర్శించి తాము అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను స్వయంగా తెలుసుకొని మరీ ధైర్యంగా కొనుగోలు చేయవలసిందిగా ప్రజలను ఆహ్వానిస్తున్నామన్నారు పద్మావతి. నడి వయసులో వ్యవసాయం చేపట్టడమే కాకుండా ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్న పద్మావతి అభినందనీయురాలు. – ఉమ్మా రవీంద్రకుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు, కృష్ణా జిల్లా ప్రకృతి సేద్యంతో ఎంతో సంతృప్తి ప్రకృతి సేద్యం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. వ్యవసాయ అనుభవం లేని వారు కూడా మొదలు పెట్టి ఒక సంవత్సరంలో నేర్చుకోవచ్చు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ఆరోగ్యదాయకమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను పండించి మేం తింటున్నాం. సహకార సంఘం ద్వారా అంతే నమ్మకంగా ప్రజలకూ అందిస్తున్నాం. మా తోటలకు వచ్చి చూసి నమ్మకం కలిగితేనే కొనమని సంఘం తరఫున కాలనీలకు వెళ్లి వినియోగదారులను ఆహ్వానిస్తున్నాం. చిన్న రైతులు పండించే ఆరోగ్యదాయకమైన కూరగాయలను కూడా నా వాహనంలో విజయవాడ తీసుకెళ్లి ప్రజలకు అందిస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉంది. – అన్నే పద్మావతి (89778 77477), రమణక్కపేట, కృష్ణా జిల్లా -
మూడు వేల పున్నములు
తుర్లపాటి పద్మావతి 86 ఏళ్లు. అడిదం బాలాత్రిపుర సుందర స్వరాజ్య రాజ్యలక్ష్మి 88 ఏళ్లు. మల్లంపల్లి రమా జయలక్ష్మి 90 ఏళ్లు. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లకు వీరి కుటుంబ సభ్యులు ఈ నెల 15న విజయవాడలో ‘సహస్ర చంద్ర దర్శన వేడుక’ జరుపుతున్నారు. సహస్ర చంద్ర దర్శనం అంటే.. వెయ్యి పున్నములను చూసిన వయసును కలిగి ఉండటం. ముగ్గురు కాబట్టి మూడు వేల పున్నముల సంబరం ఇది!! ఈ సందర్భంగా వీరిని ‘సాక్షి’ పలకరించింది. మల్లంపల్లి రమా జయలక్ష్మి అన్నయ్య తరవాత మేం ఎనిమిది మంది ఆడపిల్లలం. మా చిన్నప్పుడే నాన్నగారు పోయారు. నేను ఐదో అమ్మాయిని. మా పెద్దక్కయ్య పెళ్లి అయిన కొత్తల్లోనే అన్నయ్య కన్ను మూయడంతో, నా మీద కుటుంబ బాధ్యత పడింది. నేను ఎస్ఎస్ఎల్సి చదివాను. టైప్ నేర్చుకుని, ఉద్యోగంలో చేరాను. ఇంటి బాధ్యతల కారణంగా నేను పెళ్లి చేసుకోలేదు. నాలుగో బావగారు నన్ను పిడబ్లు్యడి ఆఫీసులో టైపిస్టుగా చేర్పించారు. అక్కడ నేను ఒక్కర్తినే అమ్మాయిని. సూపరింటెండెంట్ పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగి, ఆ పదవిలోనే రిటైర్ అయ్యాను. ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడే చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాను. సహస్ర చంద్ర దర్శనం కార్యక్రమం గురించి విన్నాను కాని, ఎన్నడూ చూడలేదు. మా చెల్లెలి కొడుకు ఇలాంటి కార్యక్రమం మా ముగ్గురికి కలిపి చేయడం చాలా సంతోషంగాను, ఆశ్చర్యంగానూ ఉంది. ఎలా జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. మా తరంలో మేం ముగ్గురమే మిగిలాం. కుటుంబాలు పూర్వపు పద్ధతిలో ఉంటేనే బాగుంటుంది. అలా ఉండటం వల్లే ఈ రోజు మాకు ఈ పండుగ జరుగుతోందని నేను అనుకుంటున్నాను. తుర్లపాటి పద్మావతి ఏలూరులో గవర్నమెంటు స్కూల్లో చదువుకున్నాను. స్నేహితులతో స్కిప్పింగ్, త్రోబాల్ ఆడేదాన్ని. మేం అందరం ఆడపిల్లలమే అయినా నాన్నగారు ఎన్నడూ విసుక్కునేవారు కాదు. బాల్యమంతా చాలా సంతోషంగా, యాక్టివ్‌గా గడిచింది. స్కూల్లోనే కోలాటాలు, గొబ్బి పాటలు అన్నీ నేర్చుకునేవాళ్లం. చిన్నప్పడు అక్కచెల్లెళ్లు కొట్టుకోవడం సహజమే కదా. ఇప్పుడు ఈ పండుగలాంటి కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. మేం కలలో కూడా ఊహించని వేడుక. మా అక్కయ్య కొడుకు చేస్తున్నాడు. పెళ్లయ్యాక సంసారం బాధ్యతలు, అత్తగారు, మావగారు, ఆడపడుచులు.. ఇంటికి ఎవరు వచ్చినా ఆదరించడం, కష్టసుఖాలు పంచుకోవడం... ఉమ్మడి కుటుంబంలో అలవాటయ్యాయి. ఇప్పుడే పండుగ జరగబోతోందంటే ఆనందంతో నా కళ్లు చెమరుస్తున్నాయి అడిదం స్వరాజ్య రాజ్యలక్ష్మి మా అబ్బాయి మాకు సహస్ర పూర్ణ చంద్ర దర్శన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. ఇంతకుముందు మా పెద్దక్కయ్య పెద్ద కొడుక్కి జరిగినప్పుడు ఈ కార్యక్రమం చూశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా మాకు జరుగుతోంది కాబట్టి ఆనందంగా ఉంది. మా అక్కచెల్లెళ్ల మధ్యన ఉండే అనుబంధం కారణంగానే మా అబ్బాయి మా వాళ్లను కూడా కన్నతల్లిలాగే చూసుకుంటాడు. ఈ విధంగా ముగ్గురికి ఒకేసారి ఈ పండుగ బహుశా.. అరుదుగా జరుగుతుందేమో. సంభాషణ: వైజయంతి పురాణపండ ఫొటోలు: విజయకృష్ణ, సాక్షి, విజయవాడ ముగ్గురమ్మలు ముగ్గురు అమ్మలకు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటినుండి ఉమ్మడి కుటుంబాలలో పెరగటం, కష్టం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చిన్నప్పటి నుండి అనుభవించటం, ఆ సమయంలో అమ్మ కష్టపడి కుటుంబాన్ని నడిపించటం... ఈ కారణాలన్నిటితో పెద్దల మంచి చెడులు చూడాలన్న తపన నాలో కలిగింది. వాళ్ల సంతోషమే నా సంతోషం. వాళ్ల కళ్లల్లో కనిపించే ఆనందం, పసి పిల్లల కళ్లల్లో ఆనందం ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్లే నాకు పిల్లలు. అడిదం కృష్ణమోహన్ (అడిదం రాజ్యలక్ష్మి కుమారుడు) -
భావోద్వేగానికి లోనైన పద్మావతి
సాక్షి, సూర్యాపేట: ఉప ఎన్నికల్లో ఓటమి బాధ కలిగించిందని హుజుర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి అన్నారు. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. హుజూర్నగర్ ఓటు, నియంతృత్వ కేసీఆర్ పాలనకు ప్రశ్నగా మారుతుందనుకున్నామని వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలన అంతం కావాలని అందరూ అనుకున్నారని చెప్పారు. యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను మోసుకుంటూ అభ్యర్థిగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని పేర్కొన్నారు. తమ ఆకాంక్షను హుజురాబాద్ ఉప ఎన్నిక ద్వారా తెలియజెప్పాలని ప్రజలంతా కోరుకున్నారని చెప్పారు. వ్యక్తిగతంగా హుజుర్నగర్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు పలికినా ఓడిపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. మొదటి రౌండ్లోనే టీఆర్ఎస్ అభ్యర్థికి 2 వేల ఆధిక్యం అనగానే తనకు అనుమానం వచ్చిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా టీఆర్ఎస్ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఈవీఎంలలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. తమ బంధువులు వేసిన ఓట్లు కూడా పడలేదని స్వతంత్ర అభ్యర్థులు తనదో చెప్పారని, దీనిబట్టి చూస్తే ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ఈవీఎంలను మేనేజ్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని, ఈ ఫలితం కరెక్ట్ కాదని పద్మావతి అన్నారు. (చదవండి: హుజుర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఇలా...) -
మొదటి రౌండ్లోనే డౌట్ వచ్చింది
-
పద్మావతి రెడ్డి పేరు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు సోనియా గాంధీ ఆమోదముద్ర వేయడంతో, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఆమె అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 21న జరగనుంది. 24వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. సెప్టెంబర్ 23 నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 3 వరకు ఉపసంహరణ జరగనుంది. హుజూర్నగర్ నియోజకవర్గానికి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో ఏకైక స్థానం హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానం మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
పద్మావతిని గెలిపించుకుంటాం : కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిని గెలిపించుకుంటామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమావ్యక్తం చేశారు. తనతోపాటు ఉత్తమ్, జానా, దామోదర్‌రెడ్డి లాంటి నేతలంతా హుజూర్‌నగర్‌లో ఐకమత్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. గురువారం అసెంబ్లీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్నగర్ విషయంపై మాట్లాడేందుకు రేవంత్‌రెడ్డి ఎవరని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నల్లగొండ వ్యవహారాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. పక్క జిల్లా నుంచి వచ్చి తమ వ్యవహారాల్లో వేలు పెడితే సహించేది లేదన్నారు. హుజూర్నగర్ నుంచి పద్మావతి కాకుండా ఎవరైనా పోటీ చేయాలని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నేతలను అడిగామని, అంతా పద్మావతి పేరునే ప్రతిపాదించా రని చెప్పారు. నల్లగొండ జిల్లా కీలకనేతల మధ్య గతంలో ఉన్న భేదాభిప్రాయాలను పోగొట్టుకుని అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. పీసీసీ రేసులో నేను తప్ప ఎవరూ లేరు.. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా ‘రేసులో ఉండడం ఏంటి? నేను తప్ప పీసీసీ అధ్యక్ష పదవికి పోటీలో ఎవరూ లేరు. వీహెచ్‌ను అడిగినా, ఎవరిని అడిగినా, పాత కాంగ్రెస్ నేతలెవరైనా నాకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు’అని వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటును చూసిన తర్వాత అసెంబ్లీ చిన్నగా కనిపిస్తోందన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు నిధులివ్వాలని ఆర్థికమంత్రి హరీశ్‌ను కోరానని ఎంపీ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. -
మంత్రి యుక్తి
మహారాజు విక్రమవర్మ మరణానంతరం విజయవర్మ అతి పిన్నవయసులోనే కళింగ సింహాసనం అధిరోహించాడు. తండ్రి విక్రమవర్మ మహావీరుడు, పరాక్రమవంతుడు అవడం వల్ల యుద్ధంలో చాలా రాజ్యలు గెలిచి తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. అంతేకాకుండా, విక్రమవర్మ పరిపాలన విషయంలో కూడా సమర్థుడవడం వల్ల అతని పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతూ వుండేవారు. అయితే విక్రమవర్మ కుమారుడు విజయవర్మ పూర్తిగా శాంతికాముకుడు. విజయవర్మ కూడా మహావీరుడేకాని యుద్ధం, రక్తపాతం అంటే పూర్తి విముఖత కలిగి ఉండేవాడు. అందుకే రాజ్య విస్తరణకి పూనుకోలేదు. అతని పరిపాలనలో యుద్ధాలు లేక రాజ్యంలో శాంతి వాతావరణం నెలకొంది. ఇరుగుపొరుగు రాజ్యాలతో సఖ్యంగా ఉండేవాడు. రాజ్యపరిపాలన బాధ్యత తీసుకున్న తరువాత పరిపాలనా విషయంలో బోలెడన్ని సంస్కరణలు చేపట్టి అనతికాలంలోనే ప్రజల మన్నన చూరగొని తండ్రిని మించిన తనయుడని అనిపించుకున్నాడు. గ్రామాల్లో చెరువులు, బావులు తవ్వించి రైతులకి వ్యవసాయరంగంలో ఏ లోటు రాకుండా చేశాడు. తనరాజ్యంలో పిల్లలు చదువుకోవడానికి ఉరూరా విద్యాలయాలు ఏర్పాటుచేశాడు. తన రాజ్యంలో వ్యాపారం పుంజుకోవటానికి వివిధ కార్యక్రమాలు చేపట్టాడు. లలితకళలను పెంచి పోషించాడు. పండిత పామరులకు తన కొలువులో చోటిచ్చాడు.యుద్ధాలు లేకపోవడంతో రాజ్యం సర్వతోముఖంగా అభివృద్ధి చెందింది. అతని కారణంగా ఆ రాజ్య ప్రజలు కూడా శాంతికాముకులుగా మారారు. ఇలా ఉండగా, రాజు విజయవర్మకు ఓరోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా మహామంత్రి వివేకవర్ధనుడిని పిలిపించాడు. ‘‘మహామంత్రి!... ప్రస్తుతం మన రాజ్యం సుభిక్షంగా ఉంది కదా! ఇరుగు పొరుగు రాజులందరితోనూ మైత్రి ఉంది. అలాంటప్పుడు నాన్నగారి హయాం నుంచి ఉన్న అంత అధికసైన్యం ఇప్పుడు మనకు అవసరం అంటారా? ఇప్పుడు ఇక యుద్ధభయం రాజ్యానికి లేదు. మనకి అంతసేన అక్కర్లేదు అన్నది నా ఉద్దేశం. సత్వరం సైన్యాన్ని తగ్గించే ఏర్పాట్లు చెయ్యండి. అధిక సైన్యం కోసం వెచ్చించే ఆ ధనం మరేదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించటం మంచిదని నా అభిమతం’’ అన్నాడు విజయవర్మ. అంతా విన్న మంత్రి చిన్నగా నవ్వి, ‘‘మహారాజా! తమరు శాంతికాముకులు. మన రాజ్య ప్రజలందరూ కూడా మీ అడుగు జాడలలో నడిచేవారే! అయితే, ఇరుగుపొరుగు రాజ్యాల రాజుల మీద అంత నమ్మకం తగదు. వాళ్ళల్లో అందరూ శాంతికాముకులు కాకపోవచ్చు. పైగా మన సామ్రాజ్యాన్ని, విశాల సైన్యాన్నీ చూసి మనతో మైత్రి నెరపుతూ ఉండవచ్చు. అందువల్ల ప్రస్తుతం మనం సైన్యం తగ్గించుకోవడం అంత మంచిది కాదనిపిస్తోంది ప్రభూ!’’ అన్నాడు. మహామంత్రి మాటవిన్న విజయవర్మ, ‘‘మనది విశాల సామ్రాజ్యం కదా, మన రాజ్యంవైపు కన్నెత్తి చూడటానికి కూడా ఎవరూ సాహసం చెయ్యరు. పైగా మనతో మైత్రి, స్నేహభావం కలిగిన రాజులు మనరాజ్యంపై దండెత్తుతారని నేననుకోవడంలేదు. పైగా నా శాంతి సందేశాన్ని అన్ని రాజ్యాల రాజులు హర్షిచారు కూడా. మరేమీ ఆలోచన పెట్టుకోకుండా సత్వరమే సైన్యం తగ్గించే ఏర్పాట్లు చెయ్యండి’’ అన్నాడు. మరేమీ చేయలేక మహామంత్రి వివేకవర్ధనుడు సరేనన్నాడు. ఆ విధంగా రాజ్యంలో సైన్యం తగ్గించడం ఆరంభించాడు మహామంత్రి. ఈ వార్త ఇరుగుపొరుగు రాజ్యాలకు చేరింది. అంతే! అంతవరకు విజయవర్మతో స్నేహంగా మసలుతున్న రాజులు ఒకరితో ఒకరు కూడబలుక్కుని కళింగరాజ్యంపై దండెత్తడానికి యుద్ధసన్నాహాలు ప్రారంభించసాగారు.అప్పుడు వేగుల ద్వారా ఈ వార్త విన్న విజయవర్మ నివ్వెరపోయాడు. తనతో మైత్రి కలిగిన రాజ్యాల నుంచి ఈ విధమైన ప్రతిక్రియ కలుగుతుందని ఊహించలేదు అతడు. వెంటనే మహామంత్రి వివేకవర్ధనుడిని పిలిపించి విషయం చెప్పాడు.విషయం విన్న వివేకవర్ధనుడు ఇలా అన్నాడు: ‘‘ప్రభూ!... అనాడే నేను ఈ విషయం విన్నవించుకున్నాను. ఇరుగుపొరుగు రాజులు మనతో స్నేహం చేయడానికి కారణం మన అపార సైన్యం చూసి భయపడి మాత్రమే. అంతేకాని మన శాంతికాముకత్వం చూసికాదు. ఎప్పుడైతే మనం సైన్యం తగ్గించుకుంటున్నామని విన్నారో అప్పటినుంచే మనరాజ్యాన్ని జయించడానికి వాళ్ళల్లో యుద్ధకాంక్ష మొదలయింది. అందుకే ప్రభూ! యుద్ధం ఉన్నా, లేకున్నా తగినంత సైన్యం కలిగి ఉండటం తప్పనిసరి. తగినంత సైన్యం ఉంటే మనవైపు ఏ రాజూ కన్నెత్తి చూడలేడు.యుద్ధ భయం లేకపోతేనే కదా ప్రజలందరూ శాంతిసౌఖ్యాలతో కాలంగడిపేది.’’ ‘‘మంత్రివర్యా! సరిగ్గా చెప్పారు, అయితే ప్రస్తుతం ఏం చేయడం?’’ ఆందోళనగా అడిగాడు విజయవర్మ.అందుకు వివేకవర్ధనుడు, ‘‘ప్రభూ! నన్ను క్షమించాలి. ఈ సంగతి నాకు ముందే తెలుసు, అందుకే నేను నిజంగా సైన్యం తగ్గించే ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు. ఈ వార్త పొరుగు రాజ్యాలకు చేరేలా మాత్రమే చేశాను. దాంతో వాళ్ళ అసలురంగు బయటపడింది.’’ అన్నాడు.వివేకవర్ధనుడి యుక్తిని మెచ్చుకుని, తక్షణం సైన్యం తగ్గించే ఆలోచన విరమించుకున్నాడు విజయవర్మ. ఆ విషయం చారుల ద్వారా గ్రహించిన పొరుగు రాజులు యుద్ధ ప్రయత్నాలు మాని ఎప్పటిలాగానే విజయవర్మ పట్ల తమ మైత్రిభావాన్ని ప్రకటించుకున్నారు. -
మహిళ మొక్కవోని దీక్ష
విశాఖపట్నం ,దేవరాపల్లి: దేవరాపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబానికి చెందిన నాళం పద్మావతి అలియాస్ పూడి పద్మావతి సబ్ఇన్స్పెక్టర్ ఆప్ పోలీస్(ఎస్ఐ) పోస్టుకు అర్హత సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెలువరించిన ఫలితాల్లో పద్మావతిని ఎస్ఐ పోస్టు వరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందితో పోటీపడ్డ పద్మావతి విశేష ప్రతిభ కనబరిచి ఎస్ఐ పోస్టును దక్కించుకని తన కలలను సాకారం చేసుకున్నారు. పద్మావతికి వివాహమైనప్పటికీ తన భర్త సహకారంతో రెండున్నరేళ్లలో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. మామిడిపల్లికి చెందిన పద్మావతికి అదే గ్రామానికి చెందిన పూడి దేముడినాయుడుతో వివాహం జరిగింది. ఇండియన్ నేవి, ఎయిర్స్‌ఫోర్స్ లేదా సివిల్, ఎస్ఐ ఉద్యోగాలలో ఏదో ఒక దానిని సాధించాలన్న తపనను తన భర్త దేముడునాయుడుకు తెలియజేయగా ఎస్ఐ పోస్టుకు కోచింగ్ తీసుకోవాలన్న భర్త సూచన మేరకు 2016లో రాజమండ్రిలో ఒక ఇనిస్టిట్యూట్‌లో చేరారు. కుటుంబ సభ్యులతో పద్మావతి తొలి ప్రయత్నంలో కేవలం 8 మార్కుల తేడాలో త్రుటిలో విజయం చేజారిపోయింది. ఎక్కడా నిరాశకు గురి కాకుండా మొక్కవోని దీక్షతో కఠోర సాధన చేసింది. 2017లో విశాఖలోని షైన్ ఇండియా కోచింగ్ సెంటర్లో చేరి శిక్షణ పొందుతున్న క్రమంలో 2018లో ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ధరఖాస్తు చేశారు. డిసెంబర్లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణ సాధించిన పద్మావతి ఆ తర్వాత జనవరిలో జరిగిన ఈవెంట్స్‌లో కూడా పాసై పిభ్రవరి 20న జరిగిన మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. వీటి ఫలితాలు సోమవారం విడుదల కాగా పద్మావతి 211మార్కులు సాధించి రాష్ట్రంలో ఓపెన్ కేటగిరిలో 625వ ర్యాంక్ సాధించారు. అలాగే రాష్ట్ర స్థాయి మహిళా విభాగం ఓపెన్ కేటగిరీలో 15 స్థానంను, బీసీ–డి మహిళా విభాగంలో జిల్లా ప్రధమ స్థానంలోను, విశాఖ జిల్లా స్థాయిలో మూడవ స్థానంను సొంతం చేసుకోని నేటి నిరుద్యోగ యువతకు దిక్సూచిగా పద్మావతి నిలిచింది. -
పద్మావతీ సమేత ‘వనమా’
‘పద్మావతి భార్యగా రావడం నా అదృష్టం. 53 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. నా ఎదుగుదలకు ఆమే ప్రధాన కారణం. ఆమెది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం.. ఈ క్రమంలో ఇంటి వ్యవహారాలతోపాటు కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకుంటుంది. ఆమె సహకారంతోనే వార్డు సభ్యుడి స్థాయి నుంచి ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ‘మా అమ్మ సేవాభావాన్ని ఇప్పటికీ నా భార్య కొనసాగిస్తోంది. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో మొత్తం మూడు సినిమాలు చూశాం. నా రాజకీయ జీవితంలో ఎక్కువగా ప్రజా క్షేత్రంలోనే గడిపాను. రాత్రి ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా నవ్వుతూ పలకరించి బాగోగులు చూసుకుంటుంది’ అంటూ ‘సాక్షి’తో జీవిత విశేషాలను పంచుకున్నారు. సాక్షి, కొత్తగూడెం: మాది ఉమ్మడి కుటుంబం. నాన్న నాగభూషణం వ్యవసాయం చేసేవారు. నా భార్య పద్మావతిది కొంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. రాజకీయంగా అనేక ఎత్తుపల్లాలు చవిచూసిన నా ఎదుగుదలకు పద్మావతే కారణం. వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర మంత్రి వరకు పని చేశా. ఏ పదవిలో ఉన్నా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపైనే నా ధ్యాస, శ్వాస. నా జీవితం నిరంతరం ప్రజలతో మమేకమవడమే. కుటుంబ వ్యవహారాలన్నీ పద్మావతే చూసుకునేది. కార్యకర్తల బాగోగులు కూడా చూడడంతోపాటు ఎవరికి ఏ అవసరం వచ్చినా స్పందించేది. అందుకే మమ్మల్ని అందరూ ఆది దంపతులు అంటారు. పద్మావతి తండ్రి శ్రీమంతుల గోపాలరావు అప్పట్లో భద్రాచలం ఏరియాలో కాంగ్రెస్ నాయకుడిగా, భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 1960లో పద్మావతితో వివాహం అయింది. నాటి నుంచి ఇప్పటివరకు మూడు సినిమాలు మాత్రమే చూశాం. శ్రీకృష్ణ పాండవీయం, శ్రీ సీతారాముల కల్యాణం.. ఇంకో సినిమా పేరు గుర్తు లేదు. ఈ మూడూ హైదరాబాద్‌లోనే చూశాం. ఇంట్లో గడిపిన సమయం తక్కువ కావడంతో టీవీలో కూడా కలిసి సినిమాలు చూసింది పెద్దగా లేదు. ఉదయం పూజ అయిన తర్వాత ఇద్దరం కలిసి అల్పాహారం తీసుకుంటాం. రాత్రి బాగా ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పటికీ నా బాగోగులన్నీ ఆమే చూసేది. పెద్దగా గొడవ పడింది ఎప్పుడూ లేదు. కొన్ని ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక వంటలు చేసినప్పుడు మాత్రం అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురుచూసేది. సమయం దొరికితే తిరుపతికి వెళ్లొస్తుంటాం.. మా ఇష్ట దైవం వేంకటేశ్వరస్వామి. రాజకీయ జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ తీరిక దొరికితే మాత్రం ఇంటిల్లిపాదీ కలిసి తిరుపతికి వెళ్లి దేవుడిని దర్శించుకుని వస్తుంటాం. పాత పాల్వంచలో వేంకటేశ్వరస్వామి గుడి, హనుమాన్ ఆలయం, సాయిబాబా ఆలయం కట్టించాం. బొడ్రాయి పనులను దగ్గరుండి చేశాం. పాల్వంచలోని అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సహకరించాం. పెద్దమ్మ గుడి వద్ద వంటశాల నిర్మింపజేశాం. ఈ అన్ని కార్యక్రమాల్లో పద్మావతి కీలకపాత్ర పోషించింది. మా అమ్మ అన్నపూర్ణమ్మ తర్వాత మా ఉమ్మడి కుటుంబ బాధ్యతలను పద్మావతమ్మే పోషిస్తూ వస్తోంది. ఎవరింట్లో పెళ్లయినా మంగళసూత్రం మాదే.. అప్పట్లో మా అమ్మ అన్నపూర్ణమ్మ ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెట్టి పంపించేది. ఈ ప్రాంతంలో ఎవరింట్లో పెళ్లి జరిగినా పసుపు, కుంకుమ, మంగళసూత్రం, మెట్టెలు, బియ్యం, ఆర్థిక సహాయం అందజేసేది. ఇప్పుడు నా సతీమణి పద్మావతి సైతం అదే ఒరవడి కొనసాగిస్తోంది. నేను కాలేజీలో చదివే రోజుల్లోనే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పని చేశా. 1966లో పాత పాల్వంచ (ప్రస్తుత పాల్వంచతో కలిపి) పంచాయతీకి మొదటిసారి వార్డు సభ్యుడిగా, ఆ తర్వాత పార్టీ రహితంగా పాల్వంచ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఆ సమయంలో నాన్నకు సహాయంగా ఉండేందుకు తమ్ముడు చిన్న వెంకటేశ్వరరావుతో కలిసి పొలం పనులకు కూడా వెళ్లేవాడిని. మేము వరి, వేరుశనగ, మిర్చి పంటలు పండించేవాళ్లం. మామిడి తోట కూడా వేశాం. నాన్నకు ఉత్తమ రైతుగా ఆ రోజుల్లో బంగారు పతకం వచ్చింది. నాకు అన్ని విషయాల్లో తమ్ముడు చిన్నవెంకటేశ్వరరావు సహాయపడేవాడు. మా ఇద్దరిని అందరూ రామలక్ష్మణులని పిలిచేవారు. పదేళ్ల క్రితం తమ్ముడు మృతిచెందాడు. అప్పటి నుంచి మేనల్లుళ్లు ముత్యాల వీరభద్రరావు, కొత్వాల సత్యనారాయణ, కొత్వాల శ్రీనివాసరావు, రమణమూర్తి, కుమారులు రాఘవేందర్రావు, రామకృష్ణ అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. -
కాస్త పాజిటివ్‌గా ఆలోచించాలి
జీవితం కొట్టిన చావు దెబ్బలను తట్టుకుని నిలబడ్డ ఓ సాధారణ గృహిణి ఆమె. తమ జీవితం ముగిసిపోయిందనుకుంటున్న ఎందరికో పునర్జీవితం అందిస్తున్న ఆత్మబంధువు ఆమె. తన కష్టాలను అధిగమిస్తూ.. తన లాంటి వారి కన్నీళ్లను తుడుస్తున్న ఆమె ఎందరికో స్ఫూర్తి.. మరెందరికో ధైర్యం. ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం... నా పేరు మజ్జి పద్మావతి.. ‘విజయ పాజిటివ్ పీపుల్’ అనే స్వచ్ఛంద సంస్థలో 2005లో నేను మొదటగా కౌన్సిలర్‌గా జాయిన్ అయ్యాను. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్నాను. మా దగ్గర 7300 మంది హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు నమోదు చేసుకుని ఉన్నారు. వాళ్లలో ఎక్కువ మంది యంగ్ విడోస్‌తో పాటు పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలే. ఆ సమస్య నుంచి వారు బయట పడేందుకు, వారికి ఒక ఆశ కల్పించేందుకు గత ఏడాది అక్టోబరు 28న అధికారికంగా హెచ్ఐవి మ్యారేజ్ బ్యూరో ఒకటి ఆరంభించాం. ఇప్పటికే దాదాపు 150 పైగా జంటలను ఒకటి చేశాం. ఆధారం లేని జంటలను కలిపి వారికి ఒక కొత్తకుటుంబాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నానో చెప్పాలంటే ముందు నా గురించి మీకు తెలియాలి.. మా సొంతూరు పార్వతీపురం. పదవతరగతి అయిన వెంటనే పెళ్లి అయ్యింది. ఆరు నెలల తరువాత నా భర్తకు ప్రాణాంతక వ్యాధి ఉందనే విషయం తెలిసింది. అప్పటికి నేను గర్భవతిని. పెళ్లైన మూడేళ్లకే ఆయన చనిపోయారు. ఆ షాక్‌లో నేను మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయాను. అప్పటికి పాప పుట్టింది. ఒకసారి ప్రభుత్వాసుపత్రిలో టెస్టులు చేయించుకున్నాను. టెస్టుల్లో నేను పాజిటివ్ అనే భయంకర నిజం తెలిసింది. ఆశ ప్రోగ్రామ్‌కు వెళ్లాను. అక్కడ హెచ్ఐవీ పాజిటివ్స్ 30 మంది ఉన్నారు. అత్తవారింట్లో ఆదరణ కరువైంది. న్యాయంకోసం లోక్ అదాలత్‌లో కేసు వేశాను. మూడు సంవత్సరాలు పాటు కోర్టు చుట్టూ తిరిగాను. ప్రతి కలెక్టర్‌ను, ప్రతి జడ్జిని కలిశాను. ఫలితం లేదు. అయితే ఈ పోరాటంతో నా జీవితంలో మరో మజిలీ మొదలైంది. ‘విజయ పాజిటివ్ పీపుల్’తో బంధం ఏర్పడింది. హెచ్ఐవి వాళ్లను గుర్తించడం, వారికి మెరుగైన జీవితం అందించడంపై కృషి చేయడం, ప్రభుత్వ పథకాలతో వారిని అనుసంధానించడం వంటివి చేస్తున్నాను. పాజిటివ్స్‌పై ఎవరైనా వివక్ష చూపిస్తే వెంటనే అక్కడకు వెళతాం. వారికి కోర్టు ద్వారా గాని పోలీస్‌ల ద్వారా గాని రక్షణ కల్పిస్తాం. 2008లో నా జీవితం మరో మలుపు తిరిగింది. నేను ప్రతీ ఊరు వెళ్లి హెచ్ఐవీ గురించి అవగాహన తరగతులు చెప్పేదాన్ని.. శ్రీకాకుళం, బెంగుళూరు, ఒరిస్సా వరకు మీటింగ్‌లకు వెళ్లేదాన్ని. ఆ సమయంలో నన్ను చూసి, నా గురించి అన్నీ తెలిసి, మంచి వ్యక్తి ఒకరు నాకు కొత్తజీవితాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆయన మెడికల్ రిప్రంజెటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇష్టపూర్తిగా నన్ను ద్వితీయవివాహం చేసుకున్నాను. మా కుటుంబం, అత్త, మామ అందరూ ఇప్పుడు విజయనగరంలోనే ఉంటున్నాం. హెచ్ఐవీతో ఉన్న వారే ‘విజయ పాజిటివ్ పీపుల్’ అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యులుగా ఉంటారు. 2003లో బీఎస్ఆర్ మూర్తి ద్వారా ఈ సంస్థను ఏర్పాటయ్యింది. అన్ని మందుల కంటే మనోధైర్యమే హెచ్ఐవికి మందు. సేవ చేసినందుకు మేం డబ్బులు తీసుకోం.. పాజిటివ్స్ ముఖంలో చిరునవ్వు చూడటమే మా లక్ష్యం.. రాష్ట్రంలో 3.60 లక్షల మంది హెచ్ఐవీ పీడితులుంటే విజయనగరం జిల్లాలో 14 వేల మంది పైగానే మా సంస్థలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు కాకుండా, ప్రైవేట్‌గా మందులు వాడే వాళ్లు చాలా మందే ఉన్నారు. క్లాసుల మూలంగా కొంత కాలంగా అవగాహన, జాగ్రత్తలు పెరిగి వ్యాధి వ్యాప్తి 30 శాతం వరకు తగ్గింది. మా దగ్గరకు మ్యారేజ్ కోసం ఎక్కువగా అబ్బాయిలు వస్తుంటారు. వారి బయోడేటా తీసుకుని మూడు నెలలనుంచి మూడు సంవత్సరాలు వరకు వారిని పరిశీలిస్తాం. వారి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం తదితర అంశాలను గుర్తిస్తాం. భార్యను చూసుకోగలరా లేదా అని తెలుసుకుంటాం. అన్నీ బాగున్నాయంటే వారికి సంబంధం కుదిర్చి పెళ్లి చేస్తాం. వాటిలో కొన్ని కులాంతర వివాహాలు కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సొంత ఖర్చులతోనే ఈ వివాహాలు చేస్తున్నాం. మాకు వీహాన్ ప్రోగ్రాం ద్వారా రోజుకి రూ. 300 జీతం వస్తుంది. ఇంతకుమించి మాకు ఎలాంటి ఫండ్స్‌గానీ.. ప్రాజెక్టులు కానీ లేవు.. బడ్జెట్లు కూడా లేవు. వీటన్నిటినీ మించి ప్రాణం పోతుందని తెలిసిన తర్వాత కూడా ఆ భయాన్ని వీడి బతికే ధైర్యాన్ని కల్పిస్తున్నాం అన్న ఆత్మసంతృప్తి మాత్రం చాలా ఉంది. అది చాలు మాకు. – బోణం గణేష్, సాక్షిప్రతినిధి, విజయనగరం -
టీడీపీకో దండం.. ఎమ్మెల్యే బీకే ఓ ఉన్మాది
అనంతపురం సెంట్రల్: పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఓ ఉన్మాది అని, తమపై కక్ష సాధించేందుకు రొద్దం మండల అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నాడని ఆ మండల ఎంపీపీ పద్మావతి, పలువురు టీడీపీ నాయకులు ఆరోపించారు. సోమవారం ఎంపీపీ పద్మ తన పదవికి రాజీనామా చేశారు. తమ అనుచరులతో నేరుగా జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్న ఆమె తన రాజీనామా లేఖను డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణకు అందజేశారు. అనంతరం తన రాజీనామాకు గల కారణాలను మీడియాకు వెల్లడించారు. 2017 నుంచి (18 నెలలు) ఎంపీపీగా కొనసాగుతున్నట్లు వివరించారు. రొద్దం మండలంలో తమ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఎమ్మెల్యే పార్థసారథి కక్షసాధింపు చర్యలతో వేధింపులకు పాల్పడుతూ వచ్చాడని ఆరోపించారు. పేరుకు మాత్రం తాము ఎంపీపీ హోదాలో ఉన్నా.. ఆశించిన స్థాయిలో ప్రజలకు సేవలు అందించలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరుడుగట్టిన ఉన్మాదిలా మారిన ఎమ్మెల్యే... మండల అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరనీయకుండా అడుగడుగునా అడ్డుకుంటూ వచ్చారన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సైతం ఎమ్మెల్యే అనుమతి లేనిదే ఇవ్వడం లేదన్నారు. కార్యాలయానికి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నాడన్నారు. జిల్లా పరిషత్‌లో కూడా ఎమ్మెల్యేలు లేఖలు ఉంటేనే నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. అధికార టీడీపీ కన్నా గత కాంగ్రెస్ హయామే మేలని అన్నారు. చివరకు ఎంపీ నిమ్మలకిష్టప్ప తమను చేరదీయడాన్ని జీర్ణించుకోలేక మరింత వేధింపులకు గురి చేస్తూ వచ్చాడన్నారు. తమకు అనుకూలంగా వైఎస్సార్సీపీ సిద్ధాంతాలు ఉండడంతో ఆ పార్టీలో త్వరలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. తమతో కలిసి వచ్చే కార్యకర్తలు, నాయకులను కలుపుకుని జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఇకపై పనిచేస్తామం టూ పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకరనారాయణ తమను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారని నమ్ముతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్థసారథి సన్నిహితుడు సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ... ఎమ్మెల్యేది, తనది ఒకే ఊ రని, అయినా ఆయన వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇంత కాలం టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డామని, పార్థసారథి వెన్నంటే ఉంటూ వచ్చామని వివరించారు. త్వరలో తమ అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరుతామని ప్రకటించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు, ఎంపీపీ భర్త అక్కులప్ప, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు అంజన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పార్థుడికి షాక్ రొద్దం: మండలంలో టీడీపీని బలోపే తం చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి విజయంలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ నేత, ఎంపీపీ పద్మావతి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇదే సందర్భంగా ఆమె భర్త అక్కులప్పతో పాటు తాజా మాజీ సర్పంచ్ నాగరాజు, ఎం.కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యుడు, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, మాజీ సర్పంచ్ సి.నారాయణరెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు జెట్టి అంజినరెడ్డి, సీనియర్ నాయకుడు కొత్తపల్లి కురుబ తిప్పన్న, పలువురు కార్యకర్తలు టీడీపీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మా ట్లాడుతూ.. నమ్మిన వ్యక్తులను, పార్టీ అ భ్యున్నతికి కృషి చేసే వ్యక్తులను ఎమ్మెల్యే పార్థసారథి మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. అక్కులప్ప మాట్లాడుతూ పార్థసారథిని నమ్మి ఆయన గెలుపు కోసం నిరంతరం పనిచేసినట్లు తెలిపారు. ఓ క్రమంలో పార్టీ కోసం జైలుకు సైతం వెళ్లినట్లు గుర్తు చేశారు. మండల అభివృద్ధిని అడ్డుకుంటు, ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కకుండా చేస్తున్న ఎమ్మెల్యే వైఖరితో విసుగు చెంది టీడీపీని వీడుతున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వ్యక్తిత్వానికి ఆకర్షితులై త్వరలో వైఎస్సార్ సీపీలో చేరబోతున్నట్లు తెలిపారు. -
ఆడ పిల్లలకు రక్షణ కరువు
విశాఖపట్నం, చోడవరం: ఆడ పిల్లలకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ ఆవేదన వ్యక్తం చేసింది. చోడవరంలో పిల్లల పద్మావతి అనే బాలికపై అత్యాచారం, దారుణ హత్య నేపథ్యంలో శుక్రవారం చోడవరంలో ఆ పార్టీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. బాలిక పద్మావతిని దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందించాలని నినదించింది. పార్టీ అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్లమెంటు సమన్వయకర్త వరుదు కల్యాణి, చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో పాటు మహిళలు, నాయకులు పెద్దసంఖ్యలో చోడవరం పార్టీ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, టీడీపీ నాయకుల గూండాయిజం నశించాలని, ఎమ్మెల్యే ఆగడాలకు బుద్ధి చెప్పాలం టూ నినాదాలు చేశారు. ఆడపిల్లలకు రక్షణ కల్పిం చాలంటూ పోలీసు స్టేషన్‌ను ముట్టడించి ధర్నాకు ప్రయత్నించగా, సీఐ శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని ఆందోళన చేయవద్దని కోరారు. రాజకీ య ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగారిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిందితులను శిక్షించాలని అమర్నాథ్ సీఐను కోరారు. అనంతరం నిరసన ప్రదర్శనను కోటవీధిలో ఉన్న బాధితురాలి ఇంటి వరకు నిర్వహించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బాలిక తల్లిదండ్రులు లక్ష్మి, ఈశ్వరరావును నాయకులు పరామర్శించి ఓదార్చారు. కొంత ఆర్థిక సా యం అందించారు. ‘మీకు న్యాయం జరిగే వరకు మీ తరఫున పోరాడతా’మని భరోసా ఇచ్చారు. నిందితులు.. ఎమ్మెల్యే అనుచరులే? అమర్నాథ్ మాట్లాడుతూ చోడవరంలో అశాంతి నెలకొందని, ఈ దారుణానికి పాల్పడిన యువకులు స్థానిక ఎమ్మెల్యే రాజు వెంట తిరుగుతున్న వారేనని..ఎమ్మెల్యే పుట్టినరోజుకు వేసిన ఫ్లెక్సీలో ప్రధాన నిందితుడు కూడా ఉండటం.. ఆ ప్లెక్సీని ఎవరికీ ఇవ్వవద్దని ప్రింటింగ్ షాపు నిర్వాహకులపై ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి తెచ్చినట్టు తెలి సిందని చెప్పారు. తమ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డిపై ఇటీవల జరిగిన దాడి చూస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనాయకుడికే రక్షణ లేకపోతే మిగతా ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంవదన్నారు. తుందన్నారు. వరుదు కల్యాణి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అండదండలు చూసుకొనే ఆయన అనుచరులు రెచ్చిపోయి ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మం డిపడ్డారు. బాలికను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాం డ్ చేశారు. రూ.20లక్షల పరిహారం అందించాలన్నారు. పార్టీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గెడ్డం ఉమ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మళ్ల శ్రీదేవి, అనకాపల్లి జిల్లా ప్రధానకార్యదర్శి ఏడువాక సత్యారావు, మండల అధ్యక్షుడు పల్లా నర్సింరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మారి శెట్టి శ్రీకాంత్, గౌరవ అధ్యక్షుడు బొడ్డే డ సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు సూరి శెట్టి గోవింద, పిల్లల గోవింద, కోన చంద్రరావు, బైన ఈశ్వరరావు, సర్పంచ్‌లు మొల్లి సోమునాయుడు, నాయకులు ఓరుగంటి నెహ్రూ, గూనూరు రామకృష్ణ, పందిరి శ్రీనువాసరావు, చిటికెల నాగేష్, బొడ్డు ప్రసాద్, చంద్రరావు, ఎస్సీసెల్ జిల్లా, మం డల, పట్టణ అధ్యక్షులు వేచలపు ప్రకాష్, గాడి అప్పారావు, మహిళా ప్రతినిధులు మర్రిపల్లి శోభ, చేకూరి పద్మావతి, బలిజపల్లి లక్ష్మి, అల్లాడ భవా నీ, వరలక్ష్మి, లక్కుందాసు సూర్యకుమారి తదిత రులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రక్షణ కరువు విశాఖ క్రైం: చోడవరంలో మైనర్ బాలికను దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నగర మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అట్టా డ బాబూజీకి ఆయన కార్యాలయంలో శుక్రవా రం వినతిపత్రం అందజేశారు. గౌరి మాట్లాడు తూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలు, విద్యార్థినులు, మైనర్ బాలికలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. ఈ రాష్ట్రంలో మహిళల కు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందా రు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. విమానాశ్రయంలో తమ పార్టీ అధినేతపై హత్యాయత్నానికి పాల్పడితే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం, హత్య సం ఘటనను ఖండిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీని కలి సిన వారిలో పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధా న కార్యదర్శి శ్రీదేవి వర్మ, మళ్ల ధనలత, సాడి పద్మారెడ్డి, విశాఖ పార్లమెంట్ సంయుక్త కార్యదర్శి జ్యోతి, కుమారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమికుడి ఘాతుకం
విశాఖపట్నం, చోడవరం టౌన్: చోడవరం శివారు లక్ష్మీపురం రోడ్డులోని ఫారెస్టు డిపో సమీపంలో బుధవారం వెలుగులోకి వచ్చిన విద్యార్థినిపై అత్యాచారం, హత్య సంఘటన పట్టణంతో పాటు మండలంలో సంచలనమైంది. దీపావళి పండుగ పూట అంతటా విషాదం చోటుచేసుకుంది. విద్యార్థిని పద్మావతిని ఇంటి ఎదురుగా ఉంటున్న తుంపాల రాజు ప్రేమిస్తున్నాడు. అతడే స్నేహితుల సాయంతో హత్య చేసి ఉంటాడని అంతా అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం కోటవీధికి చెందిన పిల్లల ఈశ్వరరావు, లక్ష్మీ దంపతుల రెండో కుమార్తె పిల్లల పద్మావతి (17) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఎదురింటిలో ఉంటున్న మైనర్ బాలునితో ప్రేమలో పడింది. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. మంగళవారం రాత్రి రాజు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. సంఘటన స్థలంలో మృతదేహం వద్ద పోలీసులు, స్థానికులు ఆ తరువాత అంతా పార్టీ చేసుకున్నారు. బుధవారం ఫారెస్టు డిపో సమీపంలో బాలిక హత్యకు గురైనట్టు వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ మల్లేశ్వరరావు సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. హత్యచేశాక పెట్రోలు పోసి తగులబెట్టడంతో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌కు పోలీసులు సమాచారం అందించారు. వారు వచ్చి అక్కడ ఆనవాళ్లు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలం వద్ద నుంచి పక్కనే ఉన్న తోటలు, ఖాళీ స్థలాల్లో తిరిగి సమీపంలో ఉన్న ఒక చర్చి వద్దకు వెళ్లి నిలిచిపోయాయి. కాగా, ఇంటిలో మంగళవారం రాత్రి పడుకున్న కుమార్తె తెల్లవారే సరికి కనిపించక పోవడంతో ఈశ్వరరావు, లక్ష్మీ దంపతులు చుట్టుపక్కల వెతుకుతున్న సమయంలో ఎవరో బాలిక హత్యకు గురైనట్లు గ్రామస్తులు చెప్పుకోవడంతో అనుమానం వచ్చి పోలీసుల వద్దకు వెళ్లారు. సంఘటన స్థలంలోని ఆనవాళ్లు ప్రకారం తమ కుమార్తెవే అని గుర్తించారు. దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అనకాపల్లి తరలించి విచారిస్తున్నారు. గురువారం అనకాపల్లి డీఎస్పీ వెంకటరమణ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను దోషులుగా ఇంకా నిర్ధారించలేదని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. -
నాగరాజు పద్మవతి దంపతులకు కేసీఆర్ క్షమాపణలు చేప్పాలి
-
'పేపర్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరపాలి'
లండన్ : తెలంగాణ ఎన్నారైల ఆహ్వానం మేరకు లండన్‌లో బోనాలకు విచ్చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన నడుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 90 సీట్లు గెలిచేలా కార్యకర్తలు పనిచేస్తున్నారని తెలిపారు. అనేక సందర్భాల్లో ఈవీఎం యంత్రాల పని తీరుపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందిన, టెక్నాలజీలో దూసుకుపోతున్న దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయని పద్మావతి తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల సందేహాలను దృష్టిలో పెట్టుకొని పేపర్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నారైలు కూడా చొరవ చూపాలని కోరారు. బీజేపీ పాలనలో దేశం 100 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూకే, యూరోప్ అధ్యక్షుడు కమల్ అన్నారు. సంపన్నులు సంపాదనలో 100 ఏళ్లు ముందుకు వెళ్లారన్నారు. ప్రధాని మోదీ సంపన్నులకు సేల్స్ మెన్‌గా పని చేస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దాడులు అరికట్టడంలో మోదీ విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారైలను నిర్లక్ష్యం చేస్తుందని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ అన్నారు. ఎన్నారై పాలసీ అమల్లోకి తీసుకువచ్చేలా మంత్రి కేఆటీర్ శ్రద్ద చూపడం లేదని అన్నారు. గల్ఫ్ కు వలస వెళ్లిన లక్షలాది రైతులు రైతు బంధు పథకం నిబంధనలతో నష్ట పోయారని పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువత ఉపాధికి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ నియామకాలు చేపడుతుందని టీపీసీసీ కో కన్వీనర్ సుధాకర్ రంగుల అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గురమిందర్ సింగ్, అస్రా అంజుమ్, రాకేష్ బిక్కుమండ్ల, మంగళారపు శ్రీధర్, బాలకృష్ణా రెడ్డి, అచ్యుత రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, మధు గట్ట తదితరులు పాల్గొన్నారు. -
శతపద్మం
ఆమె డెబ్బయ్ ఏళ్లకు పైగా వైద్యం చేస్తున్నారు. మీరు చదివింది నిజమే!ఆమెకు డెబ్బయ్ ఐదేళ్లు కాదు డెబ్బయ్ ఐదేళ్లుగా వైద్యం చేస్తున్న డాక్టర్ ఆమె. మరి ఆమెకిప్పుడు ఎన్నేళ్లు? వందేళ్లు దాటాయి! ఎల్లుండి బుధవారానికి 102లోకి అడుగు పెడతారు. పేరు డాక్టర్ ఎస్.ఐ. పద్మావతి. దేశంలో తొలి మహిళా కార్డియాలజిస్ట్ ఆమె. వేల గుండెల్ని కాపాడిన చెయ్యి ఆమెది. అంతకంటే ముందు.. యుద్ధం... ఆమె జీవితంలో కల్లోలాన్ని రేపింది. ఆ అలజడిని తట్టుకున్న ‘గుండె’ ఆమెది. డాక్టర్ ఎస్. ఐ. పద్మావతి నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. అఖిల భారత జాతీయ హార్ట్ ఫౌండేషన్‌కి స్థాపకాధ్యక్షురాలు కూడా. పద్మావతి రంగూన్ (బర్మా రాజధాని)లో ఎం.బి.బి.ఎస్ చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం రేపిన కల్లోలంతో కొంత విరామం. ఆ తర్వాత 1949లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఫెలోషిప్తో లండన్‌కు వెళ్లారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ, హార్వర్డ్ మెడికల్స్కూల్లో చదివారు. లండన్‌లో కార్డియాలజిస్టుగా ప్రాక్టీస్ చేశారు. స్వీడన్లో అడ్వాన్స్డ్ కోర్స్ చేసి 1953లోఇండియాకి వచ్చి ఢిల్లీలో మహిళల కోసం మహిళలే డాక్టర్లుగా సేవలందించిన లేడీ హార్డింగే మెడికల్ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేరారు. ఢిల్లీలో క్లినిక్ ప్రారంభించి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అప్పటికి మనదేశంలో గుండె వ్యాధులకు సరైన వైద్యం లేకపోవడమే కాదు, వ్యాధుల గురించిన అవగాహన కూడా ఉండేది కాదు. ఆ సమయంలో ఒక సుదీర్ఘమైన ప్రయాణానికి తొలి అడుగు వేశారామె. వైద్యాన్ని తెచ్చారు మనదేశంలో కార్డియాలజీ విభాగంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (డిఎమ్)కోర్సును ప్రవేశపెట్టడం పద్మావతి చొరవతోనే సాధ్యమైంది. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ, జి.బి.పంత్ హాస్పిటల్లో కార్డియాలజీకి విడిగా డిపార్డ్మెంట్ ఏర్పాటు చేశారామె. 1978లో రిటైరయిన తర్వాత నేషనల్ హార్ట్ ఫౌండేషన్ స్థాపించారు. అంతకుముందు ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ కూడా స్థాపించారు. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో ఇప్పటికీ ఆమె గౌరవ ఆచార్యులు (ఎమెరిటస్ ప్రొఫెసర్)గా విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న వైద్యప్రక్రియలను ఔపోశన పట్టారామె. మనదేశానికి తెలియని వైద్య సేవలను అందుబాటులోకి తేవడానికి జీవితాన్ని అంకితం చేశారు. ఒకప్పుడు గుండె ఆపరేషన్ అంటే విదేశాలకు వెళ్లాల్సిందే, అమెరికా, లండన్‌లకు వెళ్లి ఆపరేషన్ చేయించుకోగలిగిన సంపన్నులు మాత్రమే గుండె జబ్బుల నుంచి బతికి బట్టకట్టేవాళ్లు. అలాంటి గుండె వైద్యం ఇండియాకి వచ్చి, పట్టణాలకూ విస్తరించడంలో చొరవ చూపిన దార్శనికత పద్మావతిది. టెక్స్పీరియెన్స్ టెక్నాలజీకి ఎక్స్‌పీరియెన్స్ తోడయితే డాక్టర్ పద్మావతిలా ఉంటుంది. ఆమె చదువుకున్నప్పటి కంటే ఇప్పటి విజ్ఞానం ఎన్నో రెట్లు మెరుగైంది. కొత్త టెక్నాలజీని అందుకోవడంలో తాను నిత్య విద్యార్థినేనంటారామె. ఆమె అనుభవం హృద్రోగ విభాగంలో అధ్యయనానికి దోహదం చేస్తోంది, కొత్త టెక్నాలజీ ముందున్న సవాళ్లేంటో చెబుతోంది. రెండు తరాలను చూసిన ఆమె అనుభవం... కొత్త విద్యార్థులకు... ఔషధాల వాడకం– వాటి సైడ్ఎఫెక్ట్స్ మీద సంపూర్ణమైన అవగాహన కలగడానికి దోహదం చేస్తోంది. తండ్రి బర్మాలో వేల గుండెల్ని కాపాడిన పద్మావతి జీవితంలో గుండెల్ని అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన గతం ఉంది. యుద్ధం చిన్నాభిన్నం చేసేది దేశాల్ని మాత్రమే కాదు. అనేక జీవితాలు అల్లకల్లోలానికి గురవుతాయన్నారు డాక్టర్ పద్మావతి. ఆమె 1917, జూన్ 20వ తేదీన బర్మాలో (మయన్మార్) పుట్టారు. ఎంబీబీఎస్ పూర్తయ్యే నాటికి రెండవ ప్రపంచ యుద్ధం ఉధృతమైంది. ‘ఇరవై నాలుగ్గంటల్లో ఖాళీ చేయండి’ అనే హుకుంతో ఆమె తండ్రి భార్యాపిల్లలను ఇండియాకు పంపించేశారు. అలా 1942లో ఉన్నఫళంగా బర్మాను వదిలి స్వస్థలం కోయంబత్తూర్‌కి వచ్చేసింది వారి కుటుంబం. ఆ తర్వాత మూడేళ్లకు ఆయన కోయంబత్తూర్‌కి వచ్చారు. ఆ మూడేళ్ల కాలంలో ఆయన ఆచూకీ కుటుంబానికి తెలియదు. బర్మాకి తొలి డాక్టరమ్మ పద్మావతి చదువుకున్న రోజుల్లో చదువులు, ఉద్యోగాల్లో మహిళలను వేళ్ల మీద లెక్కపెట్టుకోవాల్సిందే. ఈ తరానికి ఆశ్చర్యంగా ఉంటుందేమో కానీ, రంగూన్ మెడికల్కాలేజ్లో ఎంబీబీఎస్‌లో చేరిన తొలి మహిళ ఆమె. స్విమ్మింగ్ హాబీ! తన ఆరోగ్య రహస్యం అడిగితే ఆమె నిశ్శబ్దంగా నవ్వుతారు. బర్మాలో మొదలైన స్విమ్మింగ్ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. ఢిల్లీలోని ఫోర్డ్ ఫౌండేషన్ స్విమ్మింగ్ పూల్ ఆమె స్విమ్మింగ్ పాయింట్. ఏడాదిలో ఆరు నెలలు రోజూ స్విమ్మింగ్ చేస్తారు. శీతాకాలంలో వాకింగ్ చేస్తారు. స్విమ్మింగ్, వాకింగ్‌తోపాటు బుక్ రీడింగ్ ఆమె హాబీలు. ఆమె సౌత్ ఢిల్లీలో ఉన్న నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లైబ్రరీకి కస్టోడియన్ కూడా. వందేళ్ల జీవనానికి మాత్రం తాతల నుంచి జన్యువులే కారణమంటారు. ఆమె తాతగారు (తండ్రికి తండ్రి) 103 ఏళ్లు జీవించారు. పూర్వికులు జన్యుపరమైన నిధిని ఇస్తారు. అది గొప్ప అదృష్టం. దేహానికి తగినంత శ్రమనిస్తూ మనమే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆ జాగ్రత్త లేకపోతే అనారోగ్యాలతో స్నేహం చేయకతప్పదంటారు పద్మావతి. రోజుకు 12 గంటలు ఇప్పటి కార్పొరేట్ హాస్పిటళ్లలాగ గంటకు ఎంతమందిని చూడాలనే లెక్కలు తెలియదు పద్మావతికి. పేషంట్ ఆరోగ్య స్థితిని బట్టి టైమ్ పెరుగుతూ పోతుంటుంది. రోజుకు పన్నెండు గంటల సమయం పేషెంట్లతోనే ఉంటారు. అలా వారానికి ఐదు రోజులు. అంత దీక్షగా పని చేయడంతోపాటు ఆమెలో మరో గొప్పతనం పేషెంట్ల భాషలు నేర్చుకోవడం. ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, బర్మా, జర్మన్, ఫ్రెంచ్భా భాషలు మాట్లాడతారామె. పేషెంట్ తన బాధను ఉన్నదున్నట్టుగా చెప్పుకోగలిగేది సొంత భాషలోనే. తమ బాధను సరిగ్గా చెప్పలేకపోతే సరైన వైద్యం అందదు, అందుకే ఆమె దగ్గరకు ఎక్కువగా వచ్చే పేషెంట్ల భాషలు నేర్చుకున్నారు. పద్మావతి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆమె కుటుంబం గురించిన ఆసక్తి కలుగుతుంది ఎవరికైనా. అదే మాట అడిగిన వాళ్లతో ‘నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోనందుకు నేనేమీ బాధపడడం లేదు. పేషెంట్లు, రీసెర్చ్‌లో నిమగ్నమై ఉంటాను. ఇందులో నాకు సంపూర్ణమైన తృప్తి ఉంది. నా జీవితం నేను కోరుకున్నట్లే సాగుతోంది’ అంటారు డాక్టర్ పద్మావతి. రికార్డులు ♦ దేశంలో తొలి కార్డియాలజీ క్లినిక్ స్థాపన ∙కార్డియాలజీలో ‘డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్’ కోర్సును ప్రవేశ పెట్టడం ♦ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, జిపి పంత్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్థాపన ♦ ఢిల్లీ లో ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ స్థాపన ♦ ఐదవ ప్రపంచ కార్డియాలజీ కాంగ్రెస్‌కు అధ్యక్షత ♦ పద్మభూషణ్ (1967) పద్మవిభూషణ్ (1992) పేషెంట్లే పాఠాలు (36 ఏళ్ల వయసులో.. లేడీ హార్డింగే మెడికల్ కాలేజ్‌లో...) నేను పేషెంట్‌ను తాకి, వారు చెప్పేది మొత్తం నా చెవులతో విని, నా కళ్లతో పేషెంట్‌ను నిశితంగా చూసి వైద్యం చేస్తాను. టెక్నాలజీ ఎంత ఎదిగినా పేషెంటుకి సంతోషం కలిగేది డాక్టర్ చూపించే శ్రద్ధతోనే.∙ఆ అలవాటు కారణంగానే మా మెడికల్ టెక్ట్స్‌బుక్స్‌లో లేని అనేక రోగాలను తెలుసుకోగలిగాను. వాటి మీద రీసెర్చ్ చేసే అవకాశం కూడా వచ్చింది. నేనందుకున్న అనేక పురస్కారాలకు మూలం ఆ అబ్జర్వేషనే. ఇన్నేళ్ల అనుభవంలో నేను చెప్పేదొక్కటే... మందులు మనిషి అదుపులో ఉండాలి, అంతే తప్ప అవి మనిషి మీద స్వారీ చేయకూడదు. మనకు జీవనశైలిలో క్రమశిక్షణ లేకపోతే మందులే మనిషికి యజమానులవుతాయి. – డాక్టర్ పద్మావతి, సీనియర్ కార్డియాలజిస్ట్ – వాకా మంజులారెడ్డి -
కష్టాన్ని జుట్టుపట్టిఈడ్చేసింది
కష్టం అలివిగాని జుట్టులా అదేంటో నెత్తి మీదే మొలుస్తుంది. పెద్ద భారమైపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చిక్కులుగా తయారవుతుంది. అలాగే భరిస్తూ కూచుంటే ఊడల్లాగా పాకుతుంది. ఎక్కడో మనలో దాగున్న మనోధైర్యాన్ని బయటికి తీసుకొస్తే ఆ కష్టాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చేయొచ్చు. ‘అమ్మా... బిడ్డల మొహం చూసి బతకాలమ్మా... కష్టం ఎప్పుడూ శాశ్వత చుట్టం కాదు.. ఏదో ఒక రోజు అది పెట్టె సర్దుకొని వచ్చినదారినే వెళ్లాల్సిందే’ అని ఆమె ఇచ్చిన మానసిక ధైర్యంతో ఆలోచన విరమించుకున్నా. మా స్వస్ధలం చీరాల. చిన్న వయసులోనే మా అమ్మానాన్నలు నాకు లోకేశ్వర్‌రావుతో పెళ్లి చేశారు. నా భర్తది బార్బర్ పని. ఆరుగురు పిల్లలు పుట్టారు. అందరూ కొడుకులే. నా భర్త ఉమ్మడి కుటుంబంలో ఉంటూ బార్బర్‌గా కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లయిన కొన్నాళ్లు మా జీవితం సజావుగానే సాగింది. మూడో పిల్లాడు కలిగేనాటి నుంచి నా భర్తలో మార్పులొచ్చాయి. చెడు అలవాట్లలో పడి ఇంటికి ఆలస్యంగా రావడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం చేసేవాడు. అతని బాధ్యతారాహిత్యంపై ఆయన అన్నదమ్ములు విసిగిపోయారు. నా భర్త మారతాడని ఎన్ని రకాలుగానో ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి కుటుంబం నుంచి దూరంగా పెడితే బాగుపడతాడని మమ్మల్ని దూరం పెట్టారు. స్కూలు ఉప్మాయే భోజనం నా భర్త, నేను, పిల్లలం విశాఖ వలస వచ్చేసి పాతగోపాలపట్నంలో చిన్నపాక అద్దెకు తీసుకుని బతకడం ప్రారంభించాం. మా ఆయన చిన్నబడ్డీ పెట్టుకుని క్షౌరవృత్తితో సంపాదనకు ప్రయత్నించాడు. కొంతకాలం తిండికి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని నెట్టుకు వస్తుండగా కష్టం నా నెత్తి మీద పడింది. ఆయనకు హటాత్తుగా క్యాన్సర్ సోకింది. నాకేం అర్థం కాలేదు. ఇంత పెద్ద కష్టమా అనుకున్నాను. కేజీహెచ్‌లో ఆయనకు వైద్యం ఇప్పిస్తూ ఇంకో వైపు పిల్లలను పోషించడానికి నానా ప్రయాశలు పడ్డాను. చేతిలో చిల్లి గవ్వ ఉండేది కాదు. భయంకరమైన ఆకలి. చివరకు శనక్కాయలు అమ్మి పిల్లలకు పట్టెడన్నం పెట్టడానికి చాలా కష్టపడ్డాను. చాలామార్లు పస్తులుండేదాన్ని. పాతగోపాలపట్నం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో పెట్టే ఉప్మాయే తప్ప ఇంట్లో భోజనం ప్రతి రోజూ ఉండేది కాదు. పాఠశాలకు సెలవిస్తే ఆ రోజు నాతో పాటు పిల్లల పరిస్ధితి రోదనగానే ఉండేది. నా వేదనను మా బావ బోసుబాబు, మరిది అప్పారావు అర్థం చేసుకున్నారు. పెద్దకొడుకు వరప్రసాద్‌ను చీరాల తీసుకువెళ్లారు. రెండో కొడుకు శ్రీనుని తొమ్మిదో ఏటే గత్యంతరం లేక గోపాలపట్నంలో ఓ సెలూన్లో చేర్పించాను. శ్రీను నాకు తోడుగా రోజుకి రూపాయి సంపాదన తెచ్చిపెడుతుండేవాడు. అదే చాలా పెద్ద మొత్తంగా ఉండేది నాకు. నా మూడో కొడుకు విజయకుమార్ అప్పటికి ఒకటో తరగతి చదువుతుండగా, బలరాం నాలుగో సంవత్సరంలో అడుగులేస్తున్నాడు. కవలపిల్లలుగా ఉన్న రామ లక్ష్మణులకు రెండేళ్ల వయసు. ఆ సమయంలో నా భర్తకి ఆపరేషన్ చేసినా బతకలేదు. చనిపోయాడు. ఆ రోజు పాతగోపాలపట్నంలో భోరున వర్షం. క్యాన్సర్ రోగి అని నా భర్తని మోయడానికి గ్రామస్తులు ముందుకు రాలేదు. అంత్యక్రియలు చేయడానికి నా చేతిలో చిల్లిగవ్వలేదు. ఆ కష్టం ఒకటి ఈ కష్టం ఒకటి. చివరికి గ్రామస్తుల్ని ప్రాధేయపడితే నలుగురు వ్యక్తులు వచ్చారు. వారితో నేను కూడా పాడి మోశాను. పదేళ్ల వయసున్న నా కొడుకు శ్రీను తలకొరివి పెట్టాల్సి వచ్చింది. మళ్లీ సొంతూరికి ప్రయాణం... నా భర్త మరణంతో తేరుకోలేకపోయాను. ఒంటరి బతుకు ఎలా బతకాలా అని భయపడిపోయాను. బతుకు సాగించలేక పిల్లలతో స్వస్ధలం చీరాల వెళ్లిపోయాను. మా బావకు ఇద్దరు కొడుకుల్ని, మరిదికి ఇద్దరు కొడుకుల్ని అప్పగించి రామలక్ష్మణులతో అదే ఊళ్లో కన్నవారి ఇంటికి వెళ్లిపోయాను. చీరాల వెళ్లాక ఎన్నో అవమానాలు, సూటిపోటి మాటలు, నిందలూ భరించాను. తండ్రిలేని బిడ్డలతో ఎన్నాళ్లిలా కాలం గడిపేదని కుమిలిపోతుండేదాన్ని. ఆ రోజుల్లో భర్త లేని ఆడవాళ్లను సమాజంలో ఆదరించే పరిíస్థితి లేదు. విధవరాలి మొహం చూడకూడదని, ఎదురు పడితే ఛీఛీ అంటూ కొంతమంది ఈసడించుకుంటుండే వారు. మనోధైర్యం చెప్పేవారు ఉండేవారు కాదు. బంధుమిత్రుల్లో ఆదరణలేదు. ఇలాగైతే బతకలేమని, బతికి ఉన్నా జనం బతకనిచ్చేలా లేరని కుంగిపోయేదాన్ని. ఒకదశలో ఆత్మహత్యే శరణ్యమనుకున్నా. కానీ, ఆ సమయంలో ఓ ముసలామె ఓదార్పు నాకు బతకాలనిపించేలా చేసింది. ‘అమ్మా... బిడ్డల మొహం చూసి బతకాలమ్మా... కష్టం ఎప్పుడూ శాశ్వత చుట్టం కాదు.. ఏదో ఒక రోజు అది పెట్టె సర్దుకొని వచ్చినదారినే వెళ్లాల్సిందే’ అని ఆమె ఇచ్చిన మానసిక ధైర్యంతో ఆలోచన విరమించుకున్నా. మున్ముందు మంచి రోజులొస్తాయని ఆమె చెప్పిన మాటలు ఇపుడు నిజమయ్యాయి. కొత్తజీవితం పెద్ద ఫ్యామిలీగా... పిల్లలు ఎదిగొచ్చాక కుటుంబాన్ని వృద్ధి చేసుకోవడానికి మళ్లీ పిల్లలతో విశాఖ వలస వచ్చేశాను. గోపాలపట్నం శివారు చంద్రనగర్‌లో కుటుంబాన్ని నిలబెట్టుకున్నాను. ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో కష్టార్జితంతో కమ్మలిల్లు కట్టించాను. పిల్లలు సెలూన్లలో చేరి నాకు అండగా నిలిచారు. ఇలా ప్రతిరూపాయినీ పొదుపు చేసి బుచ్చిరాజుపాలెంలో చిన్నసెలూన్ పెట్టించాను. పిల్లలకు వరుసగా పెళ్లిళ్లు చేశాను. కోడళ్లు, కొడుకులతో ఉమ్మడి కుటుంబాన్ని బలోపేతం చేశాను. పిల్లల రెక్కల కష్టంతో కమ్మలింటిని కాస్తా మేడ ఇల్లుగా చేసుకున్నాం. పిల్లలు ఇపుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు సెలూన్లని నిర్వహించడంతో అవి ‘ఎంహెచ్yీ ఫ్యామిలీ∙సెలూన్’ పేరిట విస్తరిస్తున్నాయి. గోపాలపట్నంలో ఎంహెచ్‌డీ సెలూన్ నగరంలో అతిపెద్దదిగా పేరుపొందిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మా ఆలోచనలకు తోడుగా కోడళ్లు కూడా ఊరికే కూర్చోకుండా ఫ్యామిలీ సెలూన్‌ని నడుపుతున్నారు. ఇలా కొడుకులు, కోడళ్లు మనుమలు, మనువరాళ్లతో ఒకేతాటిపై పెద్ద కుటుంబంగా ఉన్నామని చెప్పడానికి ఇపుడు గర్వంగానే ఉంది. కష్టాలొస్తే జీవితం లేదన్న భావన ఉండకూడదు...ఓర్పు, శ్రమ, విలువలే జీవితమని నన్ను ఉదహరిస్తూ జనం చెప్పుకుంటుంటే సంతోషంగా ఉంది. – ఉద్దండం హరేకృష్ణగాంధీ, గోపాలపట్నం -
పద్మావతి ఓకే ప్యాడ్‌మ్యాన్ నాట్ ఓకే
‘ప్యాడ్‌మ్యాన్’ మూవీ మొన్న ఫ్రైడే ప్రపంచమంతా విడుదలైంది. ఒక్క పాకిస్థాన్‌లో తప్ప! రుతుస్రావ పారిశుధ్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని దర్శకుడు ఆర్.బల్కీ తీసిన ఈ చిత్రం తమ సంస్కృతికి, సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా ఉందని భావించిన పాక్ సెన్సార్ బోర్డు... విడుదలకు అనుమతిని తిరస్కరించడంతో, అక్కడి ప్రభుత్వం కూడా ఈ సినిమాపై నిషేధం విధించింది. ‘‘గోప్యమైన విషయాలను బాహాటంగా చర్చించడం, చర్చకు అవకాశం కల్పించడం అన్నవి ఈ దేశపు మనోభావాలను భంగపరిచేవి కనుక ‘ప్యాడ్‌మ్యాన్’కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నాం’’ అని అక్కడి పంజాబ్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు కూడా ప్రకటించింది. పాకిస్థాన్ ఎంతగానో అభిమానించే మన అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్.. ప్యాడ్‌మ్యాన్ చిత్రంలో ఉన్నప్పటికీ, ప్యాడ్‌మ్యాన్ థీమ్‌ను మాత్రం ఆ దేశం మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోతోంది. భారత్‌లోని సగటు మహిళా ప్రేక్షకులు కూడా ప్యాడ్‌మ్యాన్ చిత్రాన్ని చూసేందుకు బిడియపడకుండా రాలేకపోతున్నారని సమీక్షలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. భారత్‌లో ఆటంకాలను ఎదుర్కొన్న ‘పద్మావతి’ చిత్రానికి పాక్ ఒక్క కట్ కూడా లేకుండా ఓకే చెప్పింది. ఒక్క కట్ కూడా లేకుండా భారత్‌లో విడుదలైన ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్రం పాక్‌లో రిలీజ్ కాలేకపోయింది. ఎవరి మనోభావాలు వారివి. వాటిని గౌరవించడం మానవ సంప్రదాయం. -
మేకింగ్ ఆఫ్ మూవీ పద్మావత్
-
పద్మావత్‌పై పంతం
-
బీజేపీపై ప్రకాశ్‌రాజ్, కంచ ఐలయ్య ఫైర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్రం, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు భావప్రకటనా స్వేచ్ఛను దారుణంగా హరిస్తున్నాయని నటుడు ప్రకాశ్‌రాజ్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియాటుడే సౌత్ కంక్లేవ్-18లో వారు మాట్లాడారు. ఎస్ దుర్గా, పద్మావతి సినిమాలపై జరుగుతోన్న దాడిని ఖండించారు. నటుడు విశాల్, ‘ఎస్ దుర్గ’ దర్శకుడు శశిధరన్లు కూడా చర్చలో భాగస్వాములుగా ఉన్నారు. కంచె ఐలయ్య ఏమన్నారంటే.. ‘‘బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగిందంటే దళితుల ఓట్లు కూడా కారణమని చెప్పుకుంటారు. అయితే, నిజానికి ప్రజాస్వామ్య భావన కేవలం ఓట్లతో ముడిపడిన అంశమేకాదు! అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏ కూలీన వర్గాలైతే ఓట్లు వేశాయో వారిని ప్రభుత్వాలు ఇంకా అణిచివేతకు గురిచేస్తుండటం గర్హనీయం. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా దళిత, పేద వర్గాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండటం దేనికి సంకేతమో ఆలోచించాలి. మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌పై చూపించిన శ్రద్ధ.. ‘దళితులకు అర్చకత్వ హక్కు’ విషయంలో చూపించడంలేదు. వారు మతరాజకీయాలు చేస్తున్నారనడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే’’ అని పేర్కొన్నారు. హిందూ వ్యతిరేకిని కాను.. మోదీ వ్యతిరేకిని : ప్రకాశ్ రాజ్ ‘‘నా స్నేహితురాలు గౌరీ లంకేశ్‌ను చంపేసిన తర్వాత కొంత మంది సంబరాలు చేసుకున్నారు. వారంతా మోదీ ఆరాధకులని తెలిసింది. నేను బీజేపీకి ఓటు వేశానా లేదా అన్నది అనవసరం. మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి అన్నది నిజం. మరి దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోరెందుకు? ఆయన గురించి ఏదైనా మాట్లాడితే ‘నువ్వు హిందూ వ్యతిరేకివి’ అని విమర్శిస్తారు. నిజానికి నేను హిందూ వ్యతిరేకిని కాను. మోదీ వ్యతిరేకిని. అమిత్ షా వ్యతిరేకిని. అనంతకుమార్ హెగ్డేకి వ్యతిరేకిని. ఆ బీజేపీ ఎంపీ హెగ్డే ఏమన్నారు? రాజ్యాంగాన్ని మార్చేస్తారా! ఆయనను ప్రశ్నిస్తూ నేను ప్రెస్‌మీట్ పెడితే.. వాళ్లు బీఫ్ గురించి మాట్లాడతారు. అరే! ఒక విధానమంటూ ఉండదా ఆ పార్టీకి! పద్మావతి సినిమా విషయంలో జరుగుతున్నదేంటి? సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేనప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఉండి మాత్రం ఏం లాభం? వెంటనే దిగిపోతే ప్రజలకు మంచిది’’ అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. ‘సెక్సీ దుర్గా’కు మతంతో సంబంధంలేదు: శశిధరన్ తాను రూపొందించిన ‘సెక్సీ దుర్గా’ సినిమాకు మతాలకు అసలు సంబంధమేలేదన్నారు దర్శకుడు శశిధరన్. ఇతర మతాల కంటే హిందూత్వని విమర్శిస్తూ లేదా వ్యతిరేకిస్తూ వ్యక్తీకరణలు ఎక్కువైపోయాయన్న ప్రయోక్త ప్రశ్నకు దర్శకుడు ఘాటుగా బదులిచ్చారు. ‘‘ఒక మతాన్ని చులకనగా తీసుకుంటారనే ప్రశ్న.. క్యూరియాసిటీ(జిజ్ఞాస) నుంచి కాకుండా డివిజనిజం(వేర్పాటుభావన) నుంచి పుడుతుంది. ఇది నిర్మాణాత్మకమైన ప్రశ్నకాదు’ అని శశిధరన్ అన్నారు. న్యాయస్థానాలే దిక్కు : విశాల్ ‘‘పద్మావతి సినిమా విషయంలో సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ఇచ్చింది. వ్యక్తులు, సంస్థలు సృష్టించే వివాదాలు పరిష్కారం కావాలంటే సినిమావాళ్లు న్యాయస్థానాలను ఆశ్రయించడమే ఉత్తమ మార్గం. అక్కడైతే న్యాయం దొరుకుతుంది’’ అని విశాల్ అన్నారు. -
‘పద్మావత్’ విడుదలైతే ప్రజా కర్ఫ్యూ: రాజ్‌పుత్ వర్గం
న్యూఢిల్లీ: వివాదాస్పద ‘పద్మావత్’చిత్రం విడుదలైతే థియేటర్లలో ప్రజా కర్ఫ్యూ చేపడతామని రాజ్‌పుత్ కర్ణిసేన బుధవారం మరోసారి హెచ్చరించింది. ఆ చిత్రంపై పూర్తిగా నిషేధం విధించాలని పునరుద్ఘాటించింది. చరిత్రను వక్రీకరించి ఈ సినిమా తీశారని, నిర్మాతలతో తాము రాజీపడబోమని ఆ సంస్థ నాయకుడు లోకేంద్ర సింగ్ కల్వి అన్నారు. ‘పద్మావత్‌ను జనవరి 25న విడుదల చేయబోతున్నట్లు విన్నాం. అదే జరిగితే వీధుల వెంట ఆందోళనలు చేస్తాం. థియేటర్లలో పబ్లిక్ కర్ఫ్యూ నిర్వహించాలని యువతను కోరుతాం’అని కల్వి విలేకర్లతో చెప్పారు. -
25న ‘పద్మావత్’ అయ్యారే.. వెనక్కి తగ్గారే!
అనుకున్నదే జరిగింది. ‘పద్మావత్’ ముందుకొస్తే.. కొన్ని సినిమాలు వెనక్కి తగ్గుతాయని చాలామంది అనుకున్నారు. అదే జరిగింది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘పద్మావత్’. పలుమార్లు వాయిదా పడుతూ, ఆదివారం వరకూ ఈ చిత్రం విడుదల అయోమయ పరిస్థితిలోనే ఉంది. ఈ నెల 25న విడుదల చేయాలని సోమవారం చిత్రబృందం నిర్ణయించుకుంది. అదే సమయానికి అక్షయ్‌కుమార్ ‘ప్యాడ్‌మ్యాన్’, ‘అయ్యారీ’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ‘పద్మావత్’లాంటి భారీ చిత్రం వచ్చినప్పుడు తాము రావడం శ్రేయస్కరం కాదు అనుకున్నారో ఏమో ‘అయ్యారే’ దర్శకుడు నీరజ్ పాండే తమ చిత్రం విడుదలను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. బాలీవుడ్ కథనం ప్రకారం ‘ప్యాడ్‌మ్యాన్’ వెనకడుగు వేయాలనుకోవడంలేదట. ఈ నెల 25న వచ్చేయాల్సిందేనని చిత్రబృందం అనుకుంటోందట. -
పద్మావత్ ఎఫెక్ట్ ఎవరిపై?
పద్మావతి... కాదు.. కాదు.. ఇప్పుడు ‘పద్మావత్’. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన చిత్రం ‘పద్మావత్’. సెన్సార్ కంప్లీట్ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రజెంట్ బాలీవుడ్లో హాట్ టాపిక్. ఈ నెల 25 లేదా 26న రిలీజ్ అవుతుందని కొందరు, ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుందని మరికొందరి వాదన. ఒకవేళ ‘పద్మావత్’ ఈ నెల 25 లేదా 26న అని చిత్రబృందం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే.. ఆల్రెడీ ఈ డేట్స్‌ను బుక్ చేసుకున్న ‘ప్యాడ్‌మ్యాన్’, ‘అయ్యారీ’ వాయిదా పడతాయా? అనే చర్చ జరుగుతోంది. ఆర్. బాల్కీ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌కపూర్ నటించిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అయ్యారీ’. ఒకవేళ ‘పద్మావత్’ని 25 లేక 26న కాకుండా వార్తల్లో ఉన్నట్లు ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తే ఆల్రెడీ అదే తేదీన రిలీజ్ కానున్న అనుష్కా శర్మ ‘పరీ’ రిలీజ్ డేట్ భవితవ్యం ఏంటి? అనే చర్చ కూడా జరుగుతోంది. ‘ప్యాడ్‌మ్యాన్’, ‘అయ్యారీ’, ‘పరీ’.. ఈ మూడు చిత్రాల విడుదల విషయంలో క్లారిటీ రావాలంటే ‘పద్మావత్’ బృందం అధికారికంగా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేయాల్సిందే. ఇంతకు ముందు ‘పద్మావత్’ సినిమాను గతేడాది డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ‘102 నాటౌట్, తుమ్హారీ సులు, తేరా ఇంతిజార్, ఫిరంగీ, ఫక్రీ రిటర్న్స్’ చిత్రాల రిలీజ్ డేట్స్ విషయంలో మార్పులు జరిగాయి. మరి.. ఈసారి ‘పద్మావత్’ ఎఫెక్ట్ ఏయే సినిమాల మీద పడుతుందో చూడాలి. -
పద్మావతి కాదు.. పద్మావత్
శనివారం ‘పద్మావతి’ సెన్సార్ కండీషన్ల గురించి వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో ..సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి స్పందించారు. ‘‘ పద్మావతి సినిమా పై సెన్సార్ బృందం 26 కట్స్‌ను విధించింది అన్న వార్తలు అవాస్తవం. మేము ఎటువంటి కట్స్ చెప్పలేదు. కేవలం 5 మార్పులు మాత్రమే చెప్పాం’’ అని అన్నారు. ‘తి’ కాదు.. ‘త్’.. అవును ఇక ‘పద్మావతి’ కాదు.. ‘పద్మావత్’. అదేంటీ? ఎందుకీ మార్పు? సినిమా మొత్తం పూర్తయి, రిలీజ్‌కి రెడీ అయిన సమయంలో టైటిల్లో మార్పేంటి? అనేకదా మీ సందేహం. ‘సెన్సార్ బోర్డ్’ ఆజ్ఞాపన ఇది. నిజానికి ఏ ముహూర్తాన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావతి’ని మొదలుపెట్టారో కానీ..అడుగడుగునా అడ్డంకులే. షూటింగ్ స్పాట్లో దర్శకుడు భన్సాలీపై దాడి చేయటం, సెట్స్ తగులబెట్టడం, చరిత్రను వక్రీరిస్తున్నారని, చిత్రాన్ని రిలీజ్ చేయనివ్వబోమని కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుచెప్పటం, మమ్మల్ని తక్కువ చేసే అవకాశం ఉందని రాజ్‌పుత్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేయటం, చిత్ర కథానాయిక దీపికా పదుకోన్‌ని బెదిరించటం.. ఇలా ఎన్నో ఇబ్బందులు. ఈ కారణంగా ‘పద్మావతి’ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమాను విడుదల చేయటం కష్టం అని భావించిన చిత్రనిర్మాణ సంస్థ వయాకామ్18 ‘పద్మావతి’ సినిమాను వాయిదా వేసింది. ఈ సినిమాను సెన్సార్ సభ్యులతో పాటు కొంతమంది చరిత్రకారులు, రాజ్‌పుత్‌లను వీక్షించమని కోరారు నిర్మాతలు. ఈ నెల 28న సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి ఆధ్వర్యంలో సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూశారు. ఆ తర్వాత కొన్ని నిబంధనలు విధించారనే సమాచారం బయటికొచ్చింది. అవేంటంటే... ► ‘పద్మావతి’ సినిమా పేరును ‘పద్మావత్’గా మార్చాలి. ► సుమారు 26 కట్స్ చేయమని కోరింది. ► సినిమా మెదలైనప్పుడు, ఇంటర్వెల్‌తో పాటు కొన్ని సీన్స్‌లో ..... హెచ్చరిక జారీ చేయమని ఆదేశించింది. సతీ సహగమనం సన్నివేశాల్లో , ఘూమర్ పాటలో ఈ డిస్క్లైమర్లు వేయాలని కోరారు. ఈ మార్పులు చేసి, మళ్లీ సెన్సార్ బోర్డ్‌కి సినిమాని సబ్మిట్ చేశాక సభ్యులందరూ వీక్షిస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ జారీ చేస్తారు. చెప్పిన మార్పులు చేస్తే సినిమాకు యు/ఏ సర్టిఫికెట్‌ను లభిస్తుందని పేర్కొన్నారట. -
విరుష్కల పెళ్లి ప్రకటనే ‘గోల్డెన్ ట్వీట్’
ముంబై: ట్వీటర్లో ఈ ఏడాది ఎక్కువ మంది మాట్లాడుకున్న సంఘటనగా విరుష్కల పెళ్లి నిలిచింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లిని పెళ్లి చేసుకున్నట్లు బాలీవుడ్ నటి అనుష్కా శర్మ ట్వీటర్లో ప్రకటించడం తెల్సిందే. ఈ విషయాన్నే ఈ ఏడాది ‘గోల్డెన్ ట్వీట్’గా ట్వీటర్ అభివర్ణించింది. అలాగే ప్రముఖల జాబితాలో షారుక్, సల్మాన్ల గురించి ఈ ఏడాది ఎక్కువ మంది ట్వీటర్లో మాట్లాడుకున్నారు. కాగా, మహిళా నటుల్లో వివాదాస్పద చిత్రం ‘పద్మావతి’లో నటించిన హీరోయిన్∙ దీపికా పదుకొనె గురించి ఈ ఏడాది ట్వీటర్లో ఎక్కువ మంది మాట్లాడుకున్నారు. -
బాలీవుడ్ రౌండప్ 2017
2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కథ బాగా ఉన్న దాదాపు పదిహేను చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. కమర్షియల్ సినిమాలు మూడు నాలుగే ఈ సంవత్సరం తల ఎత్తుకొని తిరిగాయి. యాభై ఏళ్లు పైబడిన ఒక వితంతువు తన కంటే వయసులో చిన్నవాడైన ఒక అబ్బాయితో ఫోన్లో చాటింగ్ చేస్తూ సంతృప్తి పడుతుంటుంది– ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునేంతలో ఆ అబ్బాయి తనకు అంగ స్తంభన సమస్య ఉన్నట్టుగా తెలుసుకుని ఆ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు ‘శుభ మంగల్ సావధాన్’ సినిమాలో. చదువు పెద్దగా లేని ఒక గృహిణి గౌరవప్రదమైన ఉద్యోగం చేసి తానేమిటో నిరూపించుకోవాలనుకుంటుంది ‘తుమ్హారి సులూ’లో విద్యాబాలన్ రూపంలో. భర్తను కోల్పోయిన ఒక యువ వయస్కురాలు ఒంటరితనం భరించలేక డేటింగ్ సైట్లో ఒక పురుషుని తోడు వెతుక్కుంటుంది ‘కరీబ్ కరీబ్ సింగిల్’ ప్రయాణంలో. దేశంలో ఎంత భ్రష్టత్వం ఉన్నా ఆ భ్రష్టత్వంతో తాను భాగం కాకుండా తన డ్యూటీ తాను కచ్చితంగా చేసుకోవడంలో ఎంతో సంతృప్తి పడతాడు ఒక కథానాయకుడు ‘న్యూటన్’లో. కాశీలో కొన ఊపిరి వదలాలని ఉందని ఒక ముసలి తండ్రి తన కుమారుణ్ణి కోరితే ఆయనతో కలిసి కాశీకి వెళ్లి తనను తాను ఏం తెలసుకున్నాడో ఆ కొడుకు అని చెప్పే కథ ‘ముక్తి భవన్’. పర్యావరణ విధ్వంసం చేసి ప్రకృతిని అంధురాలిగా చేస్తున్న మనిషి అత్యాసను ఒక అంధుడు ఎత్తి చూపే కథ ‘కడ్వీ హవా’. ముప్పై అంతస్తుల భవనంలో ఒక కుర్రవాడు తన ఫ్లాట్‌లో బందీ అయ్యి రోజుల తరబడి తిండీ తిప్పలు లేకుండా మనుగడ కోసం ఎలాంటి పోరాటం చేశాడో చెప్పే కథ ‘ట్రాప్డ్’. బిహార్‌లో బూతు పాటలు పాడుతూ వేదికల మీద అశ్లీల నృత్యాలు చేసే ఒక కళాకారిణి జీవన వేదన ‘అనార్కలీ ఆఫ్ ఆరా’ సినిమా. బాలీవుడ్ మారిపోయింది. బాలీవుడ్ చాలా మారిపోయింది అనడానికి 2017 ఒక ఉదాహరణ. పెద్ద పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్, మసాలా పాటలు, విదేశాల లొకేషన్స్... ఇవన్నీ ఒకవైపు ఉన్నా కంటెంట్‌ను నమ్ముకుని ఈ సంవత్సరం అక్కడి దర్శక నిర్మాతలు చిన్న సినిమాలు తీశారు. వాటిని విజయవంతం చేసి ప్రేక్షకులు తమకు టేస్ట్ ఉందని నిరూపించుకున్నారు. నిజంగా 2017 సంవత్సరం బాలీవుడ్ భిన్నత్వాన్ని ఉలిక్కిపడేలా నిరూపించిన సంవత్సరం. కొత్త కథలు, గుర్తుండిపోయేలా చేసే పాత్ర పోషణలు. ఆలోచన రేకెత్తించే క్లయిమాక్స్‌లు ఇవన్నీ ఈ సంవత్సరంలోని సినిమాలు చూపించాయి. పెద్ద సినిమాల పై పైచేయి సాధించిన చిన్న సినిమాలు ఇవి. 2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత సంవత్సరాలతో పోల్చితే జయపజయాలు ఎలా ఉన్నా మొత్తం ఆదాయాన్ని చూస్తే 5 నుంచి 10 శాతం తగ్గినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఈ తగ్గుదల 2 నుంచి 3 శాతమే ఉంటుంది. ఈ సంవత్సరం ముగ్గురు ఖాన్లు మరీ గొప్పగా మెరిసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. షారుక్ ఖాన్ ‘రయీస్’ పెద్ద కలెక్షన్లు రాబట్టింది కానీ సినిమాగా పెద్దగా ఎవరూ చెప్పుకోలేదు. షారూఖ్ నటించిన మరో సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సీజెల్’ విదేశాల్లో కలెక్షన్లు సాధించినా భారతదేశంలో ప్రేక్షకులను పారిపోయేలా చేసింది. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. అతని మరో భారీ సినిమా ‘టైగర్ జిందాహై’ సంవత్సరాంతానికి విడుదలయ్యి తన భవిష్యత్తును తేల్చుకోవాల్సి ఉంది. ‘దంగల్’ హిట్‌తో రిలాక్స్ అయిన ఆమిర్ ఖాన్ ఈ సంవత్సరం ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో ఒక చిన్నపాత్రతో సరిపెట్టుకున్నాడు. మరి హిట్స్ ఎవరు తమ బ్యాగ్‌లో వేసుకున్నట్టు? దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ రెండు మంచి హిట్స్ కొట్టాడు. ఒకటి ‘బదరీనాథ్ కి దుల్హనియా’. రెండు ‘జుడ్వా 2’. ఈ ‘జుడ్వా’ సిరీస్‌కు మూలం మన ‘హలో బ్రదర్’ సినిమా అన్నది విదితమే. అక్షయ్ కుమార్ కూడా రెండు హిట్లు కొట్టాడు. ఒకటి ‘జాలీ ఎల్ఎల్బి 2’, రెండు ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’. దేశంలో స్వచ్ఛభారత్ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక భర్త తన కొత్త పెళ్లికూతురికి ఇంట్లో టాయిలెట్ కట్టి ఇవ్వడానికి ఊరితో, వ్యవస్థతో ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందో చెప్పే ఈ కథను ప్రేక్షకులు ముక్కు మూసుకోకుండా యాక్సెప్ట్ చేసి కలెక్షన్ల చప్పట్లు కొట్టారు. చాలా రోజులుగా టైమ్ బాగాలేని హృతిక్ రోషన్‌కి ఈ సంవత్సరం ‘కాబిల్’ సినిమా వచ్చి ప్రాణం లేచి వచ్చింది. అంధుడుగా నటించిన హృతిక్ తన భార్యను చంపిన విలన్స్‌పై తెలివిగా ఎలా పగ తీర్చుకున్నాడో ఈ సినిమా ఆసక్తికరంగా చెప్పడమే కారణం. ఇక ఊహించని హిట్ అంటే ‘గోల్మాల్ అగైన్’ అనే చెప్పుకోవాలి. షారుక్‌తో ‘దిల్వాలే’ తీసి కొంచెం వెనుకంజ వేసిన రోహిత్ షెట్టి తన పాత టీమ్‌తో పాత ఫార్ములాతో ‘గోల్మాల్ ఎగైన్’ తీసి ఏకంగా 300 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు. తెలుగులో దుమ్ము రేపుతున్న హారర్ ఫార్ములాను మొదటిసారి అతడు ఈ సిరీస్‌లో ఉపయోగించి సక్సెస్ కొట్టాడు. ఈ హిట్ అజేయ్ దేవగన్ అకౌంట్లో పడింది. ప్యారలల్ హీరోలుగా పెద్ద హీరోలతో సమానంగా సినిమాలు ఇస్తున్న నవాజుద్దీన్ సిద్దిఖీ, ఇర్ఫాన్ ఖాన్ సోలో హీరోలుగా చెరి రెండు సినిమాలు చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ‘హరామ్ ఖోర్’, ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్’ చేస్తే రెండూ యావరేజ్‌గా నడిచాయి. కానీ ఇర్ఫాన్ ఖాన్ చేసిన రెండు సినిమాలు ‘హిందీ మీడియమ్’, ‘కరీబ్ కరీబ్ సింగిల్’ మంచి కలెక్షన్లు తెచ్చి హిట్స్‌గా నిలిచాయి. అయితే ఇర్ఫాన్ కంటే నవాజుద్దీన్ ఎక్కువ రోల్స్ చేస్తున్నాడని చెప్పాలి. 2017లో స్త్రీ ప్రధాన సినిమాలు కూడా చాలా వచ్చాయి. వీటిలో తాప్సీ ‘నామ్ షబానా’, విద్యా బాలన్ ‘బేగం జాన్’, ‘తుమ్హారీ సులూ’, శ్రీదేవి ‘మామ్’, శ్రద్ధా కపూర్ ‘హసీనా పార్కర్’, కంగనా రనౌత్ ‘సిమ్రన్’లు ఉన్నాయి. వీటిలో ‘మామ్’, ‘తుమ్హారీ సులూ’ మంచి కలెక్షన్లు సంపాదించాయి. హిమాలయాలను చిన్న వయసులో అధిరోహించిన మన తెలుగమ్మాయి పూర్ణ జీవితం ఆధారంగా ‘పూర్ణ’ రాహుల్ బోస్ దర్శకత్వంలో వచ్చింది. అంచనాలు పెంచి నిరాశ పరిచిన సినిమాలు కూడా 2017లో ఉన్నాయి. విశాల్ భరద్వాజ్ ‘రంగూన్’, రామ్ గోపాల్ వర్మ ‘సర్కార్ 3’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా చేసిన ‘రాబ్తా’, రణ్‌బీర్ కపూర్ ‘జగ్గా జాసూస్’ ముఖ్యమైనవి. సచిన్ టెండూల్కర్ బయోపిక్‌ను కూడా జనం పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఇక కాంట్రవర్సీస్ విషయానికి వస్తే ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. కంగనా రనౌత్, హృతిక్ రోషన్ తమ ఆంతరంగిక వ్యవహారం వల్ల కోర్టు కేసుల దాకా వెళ్లారు. సోను నిగమ్ అజాన్ విషయంలో కామెంట్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ‘ఇందు సర్కార్’ విడుదల ఏకంగా సెన్సార్ బోర్డ్ చైర్మన్ పెహ్లాజ్ నిహలానీ సీటుకే ఎసరు తెచ్చింది. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ రోజుల మీద వచ్చిన ఆ సినిమాను యధాతథంగా విడుదల చేయాలని బిజెపి ప్రభుత్వం భావిస్తే దానికి కట్స్ ఇవ్వడం వల్ల పెహ్లాజ్ ప్రభు ద్రోహిగా మారి పదవి పోగొట్టుకున్నాడని కథనం. ఏమైనా బాలీవుడ్లో ‘బాహుబలి 2’ కలెక్షన్లకు మించి వేరే పెద్ద సినిమాల న్యూస్ లేదు. ఉన్న న్యూస్ అంతా కంటెంట్ ఆధారంగా వచ్చిన చిన్న సినిమాలదే. రాబోయే సంవత్సరం పెద్ద సినిమాలు, భిన్నమైన చిన్న సినిమాలు హిందీలో మనల్ని అలరిస్తాయని భావిద్దాం. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. స్ట్రయిట్ సినిమాలతో సమానంగా ‘బాహుబలి 2’ హిందీ డబ్బింగ్ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం ఈ సంవత్సరం చూసిన మరో విశేషం. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. -
పద్మావతి వివాదం : అలియా భట్ షాక్
సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిపై కొనసాగుతున్న వివాదం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. చిత్ర విడుదలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై నటి అలీయాభట్ స్పందించారు. బహిరంగంగా చేస్తున్న బెదిరింపులపై ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ఆమె గట్టిగా ప్రశ్నించారు. '' శిక్షలు లేకుండా బహిరంగంగా బెదిరింపులు చేయడానికి అనుమతి ఇస్తే, ఇలాంటి ఘటనలే జరుగుతాయి. అసలేం జరుగుతుంది? నిజంగా షాక్!'' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పద్మావతి వివాదంపై కొనసాగుతున్న ఆందోళనలపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని అలియా ప్రశ్నించారు. నహర్‌గఢ్ కోట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి చేతన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కోట గోడలపై, దగ్గరల్లోని రాళ్ల మీద చిత్ర బృందాన్ని హెచ్చరించిన రాతలు కనిపించాయి. దీంతో ఈ మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టు మార్టం నివేదిక తర్వాతే స్పందిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే రాజ్‌పుత్ కర్ణి సేన నుంచి చిత్ర విడుదలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న సమయంలో ఈ ఘటన మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ చిత్ర విడుదలను నిషేధించాయి. ఈ ఘటన సర్వత్రా విస్మయానికి గురిచేసింది. సినిమా తొలి పోస్టర్ విడుదలైనప్పటి నుంచి చాలా మత గ్రూపులు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. రోజురోజుకు ఆందోళనకారులు తమ నిరసనలను తీవ్రతరం చేస్తున్నారు. పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకునే, భన్సాలీ తలలకు రూ.10 కోట్లు ఇస్తామంటూ కొందరు బహిరంగంగానే కామెంట్లు చేశారు. -
‘పద్మావతి’ని విదేశాల్లో అడ్డుకోండి
న్యూఢిల్లీ/ముంబై/లండన్: పద్మావతి సినిమా వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. ఆ సినిమాను విదేశాల్లో విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ తాజాగా దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 28న విచారించేందుకు సుప్రీంకోర్టు ఒప్పుకుంది. పద్మావతి పాటలు, ప్రోమో విడుదల విషయంలో సెన్సార్ బోర్డు ఆమోదం తెలపడంపై ఆ సినిమా నిర్మాతలు కోర్టుకు తప్పుడు సమాచారం అందించారంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించేందుకు సమ్మతించింది. భారత్‌కు వెలుపల పద్మావతిని విడుదల చేస్తే సామాజిక సామరస్యానికి దారుణమైన నష్టం వాటిల్లుతుందని శర్మ ఆరోపించారు. ఈ సినిమాలో అభ్యంతరకరంగా ఉన్నాయని భావిస్తున్న కొన్ని సీన్లను తొలగించాల్సిందిగా కోరుతూ గతంలో శర్మ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అనుమతులివ్వలేదని, అలాంటప్పుడు చట్టబద్ధమైన సంస్థ తన పని తాను చేసే విషయంలో ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడం కుదరదని చెప్పింది. ‘పద్మావతి’కి బ్రిటన్‌లో క్లియరెన్స్ పద్మావతి సినిమా విడుదలకు బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (బీబీఎఫ్‌సీ) ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా, ఏ సీన్‌ను కూడా కట్ చేయకుండా అన్ని అనుమతులిచ్చింది. బీబీఎఫ్‌సీ పద్మావతికి 12ఏ రేటింగ్ ఇచ్చింది. అంటే 12 ఏళ్ల లోపు పిల్లలు పెద్దలతో కలిసే చూడాలని అర్థం. అయితే భారత్‌లోని సెన్సార్ బోర్డు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని, ఆ అనుమతులు వచ్చే వరకు ప్రపంచంలో ఎక్కడా విడుదల చేయలేమని ఆ సినిమా వర్గాలు చెప్పాయి. దాదాపు 50 దేశాల్లో ఈ సినిమా విడుదలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందన్నాయి. -
‘ఆర్’తో ‘డీ’.. ఈసారి ఏడడుగులు ఖాయం!
‘ఆర్’ అక్షరంతో దీపికా పదుకోన్‌కి ఏదైనా ప్రత్యేకమైన అనుబంధం ఉండి ఉంటుందా? అందుకే ముందు ‘రణబీర్ కపూర్’తో ప్రేమలో పడ్డారు. అతన్నుంచి విడిపోయాక ‘రణవీర్‌సింగ్’తో ప్రేమలో పడ్డారని బాలీవుడ్లో జోకులు వేసుకుంటారు. ఈసారైనా ‘ఆర్’తో ‘డీ’కి కుదురుతుందా? ఏడడుగులు వేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అసలు రణవీర్–దీపికా ఏడడుగులు వేస్తే ఏంటి? వెయ్యకపోతే ఏంటి? ఎందుకీ ఉత్సాహం? అంటే.. సెలబ్రిటీల జీవితాల్లో ఏర్పడే మలుపులు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా. అలాంటి ఔత్సాహికరాయుళ్లకు ఓ జవాబు దొరికింది. దీపిక మెడలో రణవీర్ మూడు ముళ్లు వేయడం ఖాయమని ఆమె ఇచ్చిన సమాధానాలు చెబుతున్నాయి. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణవీర్‌తో బాండింగ్, పెళ్లి తదితర విషయాలు చెప్పారు దీపిక. ఆ విశేషాలు.. ► మేమిద్దరం (రణవీర్–దీపిక) ఉన్నప్పుడు మాకెవరూ అవసరంలేదు. ఏదీ అవసరంలేదు. మా ప్రెజెన్స్ మా ఇద్దరికీ ఎంతో హాయిగా ఉంటుంది. ఒక్కోసారి మేం మేధావుల్లా మాట్లాడుకుంటాం. ఒక్కోసారి సైలెంట్‌గా ఉండిపోతాం. కొన్నిసార్లు చిన్నపిల్లల్లా అమాయకంగా మాట్లాడుకుంటాం. ఏది మాట్లాడినా ఒకర్నొకరు డామినేట్ చేయాలనుకోం. ► నాకు ‘హోమ్ మేకర్’ (పెళ్లి చేసుకోవాలని) అవ్వాలని ఉంది. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక ఒక ఫ్యామిలీ సెట్ చేసుకుని, లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయాలనే కోరిక ఉంది. అయితే అది ఫలానా సంవత్సరంలో అని టైమ్ చెప్పలేను. అలా టైమ్ చెప్పి నేనేదీ చేయలేను. మా బాండింగ్ గురించి చెప్పాలంటే... ఏ బంధం అయినా ఏదో ఒక పాయింట్లో విస్తరిస్తుంది. మా బంధం కూడా దానంతట అది వేరే దిశలోకి విస్తరిస్తుందనుకుంటున్నా. ► గతంలో ఓ బంధం నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. డిప్రెషన్లో పడేసింది. అందులోంచి బయటపడటానికి చాలా టైమ్ పట్టింది. ఆ టైమ్‌లో నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ ఒత్తిడిని అధిగమించగలిగాను. అయితే నా సక్సెస్, ఫెయిల్యూర్స్‌కి నేనే బాధ్యత. వాటిని మాత్రం నా నుంచి ఎవరూ లాగేసుకోలేరు. ఎందుకంటే నా మొత్తం ఎనర్జీని వర్క్ మీద పెడుతున్నా. నా వర్క్ నా ‘బేబీ’. అది పూర్తిగా నా సొంతం. నేనెవరికీ భయపడను సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్ నటించిన ‘పద్మావతి’ చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. రాణి పద్మావతి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్‌లు ఆందోళన జరుపుతున్నారు. భన్సాలీ, దీపిక తలలు నరికి, తెచ్చినవారికి భారీ ఎత్తున నగదు బహుమతి ఇస్తామని ఆందోళనకారులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి.. ఈ వివాదాలు దీపికాను భయపెడుతున్నాయా? అంటే.. ‘ఒక ఆర్టిస్టుగా నాకు కోపంగా ఉంది. ఈ వివాదాలు నాకు వినోదంలా అనిపిస్తున్నాయి. నేనస్సలు భయపడను’’ అని పేర్కొన్నారామె. -
నేడు 'పద్మావతి' నాడు ఎన్నో....
సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్‌లీలా బన్సాలీ తీసిన బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' విడుదలను నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, దానికి వ్యతిరేకంగా దేశంలో ఏదో చోట గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ సినిమాకు వ్యతిరేకంగా ఇలా గొడవలు జరగడం దేశంలో ఇదే మొదటి సారి కాదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా తమ మనోభాలకు విరుద్ధంగా ఉందంటూ ఏదో సినిమాకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఆందోళనలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఓసారి హిందూ కమ్యూనిటీ వారు గొడవలు చేస్తే మరోసారి ముస్లిం కమ్యూనిటీ వారు, మరోసారి మరో కమ్యూనిటీ వారు గొడవలు చేయడం మామూలయింది. భావ ప్రకటనా స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన చలనచిత్ర సర్టిఫికేట్ బోర్డు కలిగి ఉన్నా, సినిమాలపై గొడవలు చేయడం కొన్ని వర్గాలకు రివాజుగా మారిపోయింది. ఇప్పుడు పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్న రాజస్థాన్‌లోని రాజ్‌పుత్ కర్ణిసేన ఇంతకుముందు 2008లో అశుతోష్ గోవారీకర్ తీసిన బాలీవుడ్ చిత్రం జోధా అక్బర్ చిత్రాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సినిమాలో హృతిక్ రోషన్ ముఘల్ చక్రవర్తి అక్బర్గాను, ఐశ్వర్యరాయ్ ఆయన భార్య జోధాగాను నటించారు. తమ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ వారు గొడవ చేయడంతో అప్పడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్‌లో సినిమా విడుదలను నిషేధించింది. అప్పుడు బహుజన సమాజ్‌వాది అధికారంలో ఉన్న యూపీలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హర్యానాలో, బీజీపీ ఆధీనంలోని ఉత్తరాఖండ్‌లో కూడా ఈ సినిమా విడుదలను నిషేధించారు. 1975లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంపై అమృత్ నహతా నిర్మించిన వ్యంగ్య చిత్రం 'కిస్సా కుర్సీ కా' పై కాంగ్రెస్ యువజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి కాంగ్రెస్ యువజన నాయకుడు సంజయ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ సినిమా ప్రింట్లనే కాకుండా ఒరిజనల్ నెగెటివ్ ప్రింట్‌ను కూడా దగ్ధం చేశారు. ఆ తర్వాత 1978లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నహతా ఆ సినిమాను పునర్మించి విడుదల చేశారు. గొడవ, రాజకీయ జోక్యం వల్ల మణిరత్నం తీసిన 'బాంబే' సినిమా కూడా ఆలస్యంగా విడుదలయింది. అందులో హిందూ హీరోకు ముస్లిం భార్యకు మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించడాన్ని ముస్లిం వర్గాలు వ్యతిరేకించాయి. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం చెలరేగిన ముంబై అల్లర్ల నేపథ్యంలో సినిమా తీయడం, అప్పటి శివసేన చీఫ్ బాల్‌ఠాక్రేను పోలిన పాత్రలో టూ ఆనంద్‌ను చూపించడం వివాదాస్పదమైంది. ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాకనే ఆ సినిమా విడుదలను హిందూ సంఘాలు అనుమతించాయి. దాంతో 1995, మార్చి 10వ తేదీన ఆ సినిమా విడుదలయింది. ఆ సినిమా అప్పుడు సూపర్ హిట్టయింది. 1998లో విడుదలయిన దీపా మెహతా తీసిన చిత్రం 'ఫైర్' కూడా ప్రకంపనలు సృష్టించింది. ఇద్దరు మహిళల మధ్య స్వలింగ సంపర్కాన్ని చూపించడం పట్ల కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అది మన సంస్కృతి కానందున ఆ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశాయి. ఆ సినిమాకు వ్యతిరేకంగా ముంబై, ఢిల్లీ, సూరత్, పుణెలలో శివసేన, భజరంగ్ దళ్లు ఆందోళన చేశాయి. సినిమా థియేటర్లను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాను పునస్సమీక్షకు సెన్సార్ బోర్డుకు ప్రభుత్వం మళ్లీ పంపించిగా, రెండోసారి కూడా ఎలాంటి కత్తిరింపులు లేకుండా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతించింది. అయినప్పటికీ వారు దీపా మెహతను మరచిపోలేదు. ఆమె షబానా ఆజ్మీ, నందితా దాస్, అక్షయ్ కుమార్‌తో కలసి తన 'వాటర్' చిత్ర నిర్మాణం కోసం 2000 సంవత్సరంలో వారణాసికి వెళ్లారు. అక్కడ ఆమె సిట్టింగ్‌లనూ హిందూ మూకలు దగ్ధం చేయడమే కాకుండా ఆమె దిష్టిబొమ్మలను తగులబెట్టి నదిలో పడేశారు. అక్కడ ఒక్క షాట్‌ను మాత్రమే తీయగలిగినా దీపా మెహతా తన పూర్తి చిత్రాన్ని ఇతర నటీ నటులతో శ్రీలంకలో పూర్తి చేశారు. ఇక అనిల్ శర్మ తీసిన 'గదర్-ఏక్ ప్రేమ్ కహాని' కమల్‌హాసన్ నటించిన 'విశ్వరూపం' బన్సాలీ తీసిన 'బాజీరావ్ మస్తానీ' సినిమాలన్నీ వివాదాస్పదమయ్యాయి. వాటన్నింటికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనలన్నీ కూడా సినిమాలు బాగా ఆడేందుకే ఉపయోగపడ్డాయి. -
‘పద్మావతి’ విడుదల వాయిదా
-
రాణి పద్మావతి ఎవరు?
అసలు పద్మావతి ఉందా? 1540లో ఉత్తరప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతానికి చెందిన సూఫీ కవి మాలిక్ మహ్మద్ జాయసీ ‘పద్మావత్’ పేరుతో రాసిన కవితలో ఈ రాణి ప్రస్తావనుంది. మాలిక్ కథ ప్రకారం.. పద్మావతి సింహళ దేశ రాజకుమారి. అందాల రాశి. 13, 14 శతాబ్దాల మధ్య జన్మించింది. ఈమెను రాజస్తాన్‌లోని చితోడ్‌గఢ్ రాజు రతన్‌సేన్ పెళ్లాడతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీతో సంబంధం ఏమిటి? నాటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతుంటాడు. పద్మావతి సౌందర్యం గురించి విని చితోడ్‌గఢ్‌పై దండెత్తుతాడు. ఆ క్రమంలో జరిగిన యుద్ధంలో రతన్‌సేన్ మరణిస్తాడు. ఖిల్జీకి దక్కకుండా పద్మావతి ఆత్మార్పణ చేసుకుంటుంది. చరిత్ర ఏం చెబుతోంది? జాయసీ కథ నిజమా కాదా అన్న విషయంలో అనేక వాదనలున్నాయి. చాలామంది చరిత్రకారులు, ప్రొఫెసర్లు దీన్ని కొట్టిపడేస్తున్నారు. చరిత్ర ప్రకారం ఖిల్జీ చితోడ్‌గఢ్‌పై దండెత్తి రతన్ సేన్‌ను 1303లో ఓడించాడు. 1316లో చనిపోయాడు. ఆ కాలంలో పద్మావతి పేరుతో రాణి ఎవరూ లేరన్నది వారి వాదన. అల్లావుద్దీన్ మరణించిన 224 ఏళ్ల తర్వాత జాయసీ కవితలో పద్మావతి గురించి రాశాడు. మరి దేన్ని నమ్మాలి..? దీనిపై చరిత్రకారులు, మేధావుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు పద్మావతిపై మనసు పడింది అల్లావుద్దీన్ ఖిల్జీ కాదని, మాల్వాకు చెందిన జియాసుద్దీన్ ఖిల్జీ అని కొందరు చెబుతారు. 14వ శతాబ్దానికి చెందిన హమిరా మహాదేవ చరిత్రపై నయన్చంద్ర సూరి అనే కవి రాసిన కథే.. జాయసీ ‘పద్మావతి కథ’కు ప్రేరణ అని చెబుతారు. ఈకథ నిజమా? కల్పితమా? ఇలాంటి కథే లేదని, అంతా కల్పితమనేవారూ ఉన్నారు. కానీ రాజ్‌పుత్‌లు మాత్రం నిజమని నమ్ముతారు. ముస్లిం చక్రవర్తికి లొంగకుండా ప్రాణార్పణ చేసుకున్న గొప్ప రాణిగా చిత్రీకరించేందుకే పద్మావతి పాత్రను తెరపైకి తెచ్చారని, మతాల రంగు అద్దారని ఇంకొందరి వాదన. ఇది కల్పనా? నిజమా? అన్నది అంతుచిక్కనిది. జాయసీ చెప్పిన కథేంటి? ఉత్తరప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతానికి చెందిన సూఫీ సంత్ మాలిక్ మహ్మద్ జాయసీ 1540లో ‘పద్మావత్’ పేరుతో కథ రాశారు. ఆ స్టోరీ ప్రకారం.. పద్మావతి సింహళ రాకుమారి. ఆమెకు హీరామన్ అనే మాట్లాడే చిలుక ఉండేది. ఆమె ఎప్పుడూ ఆ చిలుకతోనే ఉండటం పద్మావతి తండ్రికి నచ్చదు. ఆ చిలుకను చంపాలని ఆదేశిస్తాడు. కానీ అది తప్పించుకుపోతుంది. చివరికి అది చితోడ్‌గఢ్ రాజు రతన్‌సేన్ చేతిలో పడుతుంది. అక్కడ ఆ చిలుక పద్మావతి అందం గురించి చెబుతుంటుంది. ఓ రోజు రతన్ భార్య రాణి నాగమతి ‘ మా ఇద్దరిలో (నాగమతి, పద్మావతి) ఎవరు మంచి అందగత్తో చెప్పు..’ అని అడగుతుంది. పద్మావతేనని చిలుక చెప్పగా.. ఆమెను పెళ్లాడాలనే కోరిక రతన్సేన్లో కలుగుతుంది. పద్మావతి కోసం సింహళదేశానికి వెళ్తాడు. ఎన్నో కష్టాలు పడి చివరికి ఆమెను పెళ్లాడతాడు. తన రాజ్యానికి తెస్తాడు. తర్వాత కొద్దికాలానికి ఓ మోసానికి సంబంధించి రాఘవ్ చేతన్ అనే బ్రాహ్మణ పండితుడిని రతన్‌సేన్ రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. రాజుపై కక్షతో అతడు దిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీని కలిసి.. పద్మావతి సౌందర్యం గురించి చెబుతాడు. తర్వాత అల్లావుద్దీన్ చితోడ్ను ముట్టడించి.. పద్మావతిని అప్పగించాలని కోరతాడు. అందుకు రతన్‌సేన్ నిరాకరిస్తాడు. ఫలితంగా జరిగిన పోరులో రతన్ మరణిస్తాడు. ఈ విషయం తెలిసి నాగమతి, పద్మావతి ఆత్మార్పణం చేసుకున్నారు. సమరంలో గెలిచిన అల్లావుద్దీన్ ఖిల్జీ... కోటలోకి ప్రవేశించగా పద్మావతి చితాభస్మం కనిపిస్తుంది. భన్సాలీ, దీపికా తల నరికితే 10 కోట్లు న్యూఢిల్లీ/భరేలీ: పద్మావతి సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నటి దీపికా పదుకునేల తల నరికిన వారికి రూ. 10 కోట్ల బహుమతి ఇస్తానని హరియాణా బీజేపీ చీఫ్ మీడియా కో–ఆర్డినేటర్ సూరజ్‌పాల్ అమూ వ్యాఖ్యానించారు. రణ్‌వీర్‌సింగ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే కాళ్లు విరగ్గొడతానన్నారు. సినిమాపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు. పద్మావతి సినిమాపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు పెరిగాయి. ఉత్తర ప్రదేశ్‌లోని భరేలీలో అఖిల భారతీయ క్షత్రియ మహాసభ(ఏబీకేఎం) కార్యకర్తలు.. దీపికా పదుకునే, భన్సాలీల 100కు పైగా దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. సినిమా విడుదలను నిషేధించాలని జిలా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. దీపికను çసజీవంగా తగులబెట్టిన వారికి రూ. కోటి బహుమతి ఇస్తామని ఏబీకేఎం యూత్ నాయకుడు భువనేశ్వర్ సింగ్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ‘సజీవంగా దహనమైతే ఎలా ఉంటుందో దీపికా తెలుసుకోవాలి. రాణి చేసిన త్యాగం దీపిక ఎన్నటికీ తెలుసుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. ప్రారంభం నుంచే గొడవలు ఈ ఏడాది ప్రారంభంలో దర్శకుడు భన్సాలీ పద్మావతి సినిమా నిర్మాణాన్ని ప్రారంభించినప్పటి నుంచీ వివాదం కొనసాగుతోంది. జైపూర్‌లో సినిమా చిత్రీకరణ సమయంలో రాజ్‌పూత్ కర్ణి సేన భన్సాలీపై దాడి చేయడంతో పాటు సినిమా సెట్‌ను ధ్వంసం చేసింది. కొల్హాపూర్లోను సినిమా యూనిట్‌పై కర్ణి సేన దాడిచేసింది. భన్సాలీ,∙దీపికకు బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్‌లో సినిమా మొదటి పోస్టర్ విడుదల కాగానే రాజపూత్ గ్రూపులతో పాటు, మరికొన్ని వర్గాలు.. చరిత్రను భన్సాలీ వక్రీకరించారని ఆరోపిస్తూ మళ్లీ ఆందోళనలు మొదలుపెట్టారు. గతవారం రాజస్తాన్ కోటాలో సినిమా టీజర్‌ను ప్రదర్శించిన థియేటర్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. కాగా సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా పూర్తికాకముందే ఈ సినిమా చూసేందుకు వివిధ మీడియా చానల్స్‌ను అనుమతించడాన్ని సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి శనివారం తప్పుపట్టిన సంగతి తెలిసిందే. యూపీ సర్కారు షాక్ పద్మావతి సినిమాలోని వివాదాస్పద సన్నివేశాల్ని తొలగిస్తే తప్ప ఉత్తరప్రదేశ్‌లో సినిమాను విడుదల కానివ్వమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వినోదపు పన్ను శాఖ మంత్రి కేశవ్ ప్రసాద మౌర్య మాట్లాడుతూ.. ‘ఇస్లామిక్ చొరబాటుదారులు దేశంలో ఎంతో విధ్వంసం సృష్టించారు. తన అభిమానాన్ని కాపాడుకునేందుకు ఒక రాణి తనను తాను సజీవంగా దహనం చేసుకుంది’ అని అన్నారు. -
పద్మావతిపై పరదా... తీసేది ఎప్పుడు?
నెగ్గిందెవరు? ఓడిందెవరు? అనేది ఇంపార్టెంట్ కాదిక్కడ! కానీ, ప్రతి ఒక్కరూ ఊహించినట్టే జరిగింది. ‘పద్మావతి’ విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించినట్టు డిసెంబర్ 1న చిత్రాన్ని విడుదల చేయడం లేదు. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన ఈ చారిత్రక గాథ... చిత్రీకరణ దశ నుంచి పలు వివాదాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందు అవన్నీ ముదిరి పాకాన పడడంతో రచ్చ రచ్చ జరుగుతోంది. దాంతో చిత్రబృందమే ‘పద్మావతి’పై పరదా వేసింది. మరి, ప్రేక్షకులకు చిత్రాన్ని ఎప్పుడు చూపిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. చిత్రనిర్మాణ సంస్థలలో ఒకటైన వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ ‘పద్మావతి’ విడుదలను వాయిదా వేస్తున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించింది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రాణీ పద్మిని కథ ఆధారంగా దీపికా పదుకొనె, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ ముఖ్య తారలుగా సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా ఆన్ సెట్స్‌లో ఉన్నప్పుడే చరిత్రను వక్రీకరించారంటూ రాజ్‌పుత్ కర్ణి సేనలు ఆరోపణలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అటువంటిది ఏమీ లేదని దర్శకుడు చెబుతున్నారు. మరి, విడుదల ఎందుకు వాయిదా వేశారో? బీటౌన్‌లో ఏం జరుగుతుందో? వెయిట్ అండ్ సీ!! -
'పద్మావతి’పై నిరసనలు తీవ్రతరం
జైపూర్: బాలీవుడ్ చిత్రం పద్మావతిపై నిరసనలు రాజస్తాన్‌లో ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి. రాజ్‌సమంద్ జిల్లాలో రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళనలు తీవ్రతరం చేస్తూ శనివారం చారిత్రక కుంభల్గఢ్ కోటలోకి ప్రవేశాన్ని అడ్డగించారు. కోటలో జరిగిన ప్రదర్శన కార్యక్రమాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దిష్టి బొమ్మను ఉరితీశారు. సెన్సార్ సర్టిఫికేట్ పొందకుండానే ఈ చిత్రాన్ని కొందరు పాత్రికేయుల ముందు ప్రదర్శించడాన్ని సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి తప్పుపట్టారు. ‘ ఇలాంటి చర్యలు సీబీఎఫ్సీ పాత్రను బలహీనపరిచేలా ఉన్నాయి. తమ సౌకర్యం కోసం సర్టిఫికేషన్ ప్రక్రియను ఇలా హ్రస్వ దృష్టితో చూడటం సరికాదు’ అని జోషి వ్యాఖ్యానించారు. సీబీఎఫ్సీ సర్టిఫికేట్ కోసం నిర్మాతలు చేసుకున్న దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నందునే దాన్ని వెనక్కి పంపామని వెల్లడించారు. ఈ చిత్రం కల్పితమా లేక చరిత్ర ఆధారితమా అన్న విషయాన్ని డిస్‌క్లేమర్‌లో చెప్పకుండా ఖాళీగా వదిలేశారని తెలిపారు. సర్టిఫికెట్ ఇవ్వకుండానే దరఖాస్తును సీబీఎఫ్సీ వెనక్కి పంపడం ఓ రాజకీయ స్టంట్ అని, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నాటకం ఆడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఈ చిత్రంలోని ప్రధాన పాత్రదారు దీపికా పదుకొనేకు హాలీవుడ్ నటి రూబీ రోజ్ బాసటగా నిలిచారు. తనకు తెలిసిన ధైర్యవంత మహిళల్లో దీపికా ఒకరని ట్వీట్ చేశారు. దీపికకు వచ్చిన బెదిరింపులకు నిరసనగా గోవాలో జరనగనున్న ఇఫ్ఫి వేడుకలను సినీ పరిశ్రమ బహిష్కరించాలని ప్రముఖ నటి షబానా అజ్మీ అన్నారు. -
పద్మావతి హీరోయిన్‌కు కర్ణిసేన హెచ్చరిక
-
దీపిక ముక్కు కోస్తాం!
కోట/జైపూర్/లక్నో: సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి సినిమా వివాదం కొత్తరూపు తీసుకుంది. ఈ చిత్రంలో రాణి పద్మినిగా నటించిన దీపికా పదుకొనే ముక్కు కోస్తామని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన పరోక్షంగా హెచ్చరించింది. దీపిక రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోకపోతే రామాయణంలో లక్ష్మణుడి చేతిలో శూర్పణకకు పట్టిన గతే ఆమెకు పడుతుందని చెప్పింది. పద్మావతి చిత్రం విడుదలను ఎవ్వరూ అడ్డుకోలేరనీ, ఒకదేశంగా భారత్ తిరోగమిస్తోందని ఇంతకుముందు దీపిక వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కర్ణిసేనకు చెందిన నేత మహిపాల్‌సింగ్ మక్రానా మీడియాతో మాట్లాడుతూ.. ‘క్షత్రియులు మహిళల్ని అమితంగా గౌరవిస్తారు. ఒకవేళ ఈ చిత్రాన్ని విడుదల చేసినా, దీపిక మా మనోభావాలు దెబ్బతినేలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోకపోయినా రామాయణంలో లక్ష్మణుడిలా ప్రవర్తించేందుకు రాజపుత్రులు ఎంతమాత్రం వెనుకాడరు’ అని హెచ్చరించారు. అసలు డెన్మార్క్ పౌరసత్వం ఉన్న దీపిక రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా చేస్తారని సింగ్ ప్రశ్నించారు. క్షత్రియుల శౌర్యపరాక్రమాలను చూపిస్తూ బాహుబలి లాంటి సినిమాలు కోట్లు అర్జిస్తుంటే.. వక్రీకరణలతో ఇలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో దీపికకు భద్రతను పెంచినట్లు మహారాష్ట్ర హోంశాఖ సహాయమంత్రి రంజిత్ పాటిల్ తెలిపారు. ఈ సినిమా దర్శకుడు భన్సాలీకి ఇప్పటికే భద్రత కల్పించినట్లు వెల్లడించారు. ఈచిత్రంలో రాణి పద్మినిగా దీపిక, రాజా రతన్‌సింగ్‌గా షాహీద్ కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్ నటించారు. ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకోండి: పద్మావతి చిత్రం డిసెంబర్ 1న విడుదలైతే రాష్ట్రంలో తీవ్రమైన శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. డిసెంబర్ 2న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న వనరులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. సినిమా విడుదలకు ముందు ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా యూపీ ప్రభుత్వం సెన్సార్ బోర్డును కోరింది. ఈ సినిమాకు సర్టి ఫికెషన్ ఇచ్చేది తాను కాదనీ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కల్పించే ప్రతి చర్యను అడ్డుకుని తీరుతామని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ లేఖలో వెల్లడించారు. మరోవైపు పద్మావతి చిత్రం విడుదలయ్యే థియేటర్లకు రక్షణ కల్పిస్తామని మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ప్రకటించాయి. పద్మావతి విడుదలకు వ్యతిరేకంగా 10వేలమంది రక్తంతో కూడిన సంతకాల సేకరణ చేపడతామని, దీన్ని సెన్సార్ బోర్డుకు పంపిస్తామని ‘సర్వ బ్రాహ్మణ మహాసభ’ తెలిపింది. భన్సాలీ, దీపిక తలలు నరికి తెచ్చినవారికి రూ.5 కోట్ల బహుమానం ఇస్తానని మీరట్‌కు చెందిన ఠాకూర్ అభిషేక్ సోమ్ ప్రకటించారు. -
‘పద్మావతి’తో శాంతిభద్రతలకు విఘాతం
లక్నో : పద్మావతి చలనచిత్ర విడుదలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు గురువారం లేఖ రాసింది. ప్రజలు వ్యతిరేకిస్తున్న చిత్రానికి ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించాలని కోరింది. పద్మావతి చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సెన్సార్ బోర్డు పరిశీలించాలకే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. చిత్ర విడుదలకు ముందే దిష్టి బొమ్మల దహనం, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని.. విడుదలైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఉత్తరప్రదేశ్ హోం శాఖ అధికారి అరవింద్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. చిత్రాన్ని ప్రదర్శించొద్దంటూ సినిమా థియేటర్ యజమానులకు బెదిరింపు లేఖలు కూడా వస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో వైపు నవంబర్ 22, 26, 29 తేదీల్లో యూపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వీటికి డిసెంబరు 1న కౌంటింగ్‌ను నిర్వహించనున్నారు. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉందని అరవింద్‌కుమార్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి చిత్రాన్ని రాజ్‌పుత్ వర్గీయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. -
అదరహో అంటున్న..‘ఏక్ దిల్.. ఏక్జాన్’
సాక్షి, ముంబై: సినిమా ప్రపంచంలో హాట్ టాపిక్ గా నిలిచిన ‘పద్మావతి’ చిత్రం సుప్రీం భారీ ఊరట అందించడంతో శరవేగంగా కదులుతోంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్రంలోని రెండవ పాటను రిలీజ్ చేసింది. రిలీజ్‌కుముందే ఈ సినిమాను చుట్టుముట్టిన పలు వివాదాలు భారీ హైప్ ను క్రియేట్ చేయగా.. చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన మొదటిపాటకు మంచి ఆదరణ లభించింది. అంతేకాదు సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా బాలీవుడ్ అవార్డు హీరోయిన్ దీపాకా పడుకోన్ అత్యద్భుతంగా రొమాన్స్ పండిస్తున్న ఈ రెండవ పాటతో ఈ సినిమాపై మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. కెమెరా వర్క్ తో పాటు ఆర్ట్ డైరెక్షన్ కూడా అదరహో అని సినీ విమర్శకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పద్మావతి మూవీని అడ్డుకుంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీమ్ కోర్టు తోసిపుచ్చడంతో జోష్‌గా ఉన్న చిత్రం తాజా ‘ఏక్ దిల్.. ఏక్జాన్’ పాటలను విడుదల చేసింది. అటు ఈ చిత్ర కథానాయిక దీపికా పదుకోన్ ట్విట్టర్లో చారిత్రక ప్రేమ గానమంటూ ట్విట్టర్లో ఈ పాటను షేర్ చేశారు. కాగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన పద్మావతి చిత్రం డిసెంబర్ 1న థియేటర్లను పలకరించనుంది. An epic love ballad...❤️ #EkDilEkJaan @FilmPadmavati https://t.co/hEHhcVXyu8 — Deepika Padukone (@deepikapadukone) November 11, 2017 -
సెలబ్రిటీల కూతుళ్లతో స్టార్ డైరెక్టర్.. వైరల్
న్యూఢిల్లీ : బాలీవుడ్ సెలబ్రిటీల కూతుళ్లతో స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ తీసుకున్న సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల బాలీవుడ్ మూవీ పద్మావతి ట్రైలర్ విడుదల కాగా, సక్సెస్ ను దీపికా పదుకొనేతో కలిసి ఇండస్ట్రీకి సంబంధించిన సన్నిహితులు శనివారం రాత్రి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో దర్శకనిర్మాత కరణ్ జోహర్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి ఫోజులిస్తూ చాలా సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఓ సెల్ఫీని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కరణ్ పోస్ట్ చేయగా భారీ లైక్స్, కామెంట్లతో దూసుకుపోతుంది. పద్మావతి హీరో రణవీర్ సింగ్, జాన్వీ, సారాలతో కలిసి దిగిన మరో ఫొటోలను షేర్ చేయగా అది కూడా వైరల్ అయింది. సైరత్ రీమేక్ లో శ్రీదేవి కూతురు జాన్విని కరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు. సైఫ్-అమృతాసింగ్ ల ముద్దుల తనయ సారా 'కేదార్నాథ్' తో తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. కానీ ఫస్ట్ సినిమాకు ముందు ఫ్యాషన్ తో పాటు పార్టీలు, ఇతరత్రా కారణాలతో ఈ బ్యూటీ క్వీన్స్ పాపులర్ అయిపోతున్నారు. సారా అలీ ఖాన్(బ్లాక్ టాప్), జాన్వీ కపూర్(పర్పుల్), రణవీర్ సింగ్‌లతో స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్(చివర్లో) -
ఆత్మ ప్రవేశించిందా?
ఒంటి నిండా మోయలేనన్ని ఆభరణాలు. వీటికి తోడు బరువైన కాస్ట్యూమ్స్. ఈ సినిమా కోసం దీపికా ధరించిన లెహంగా బరువెంతో తెలుసా? 20 కేజీలు. ఇవి చాలవంటూ చేతిలో రెండు దీపాలు. అంతేకాదు చేతిలో దీపాలు కింద పడకుండా, ఫేస్‌లో ఆ టెన్షన్ కనిపించనివ్వకుండా, సాంగ్ పాడుతూ ట్రెడిషనల్ డ్యాన్స్ చేయాలి. ‘అమ్మో... నా వల్ల కాదు’ అనకుండా, ‘ఐ విల్ డూ’ అని నవ్వేశారు దీపికా పదుకొనె. ఆ పాటకు సంబంధించిన వీడియోను చూసి, ‘భేష్’ అనని వాళ్లు లేరు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పద్మావతి’. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమాలోని ‘ఘూమర్...’ పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలో దీపిక స్టెప్పులు అదిరిపోయాయి. ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తోంది. 13వ శతాబ్దానికి చెందిన రాజ్‌పుత్‌ల సంప్రదాయం ఉట్టిపడేలా డ్యాన్స్ చేయడానికి ఎవరికైనా చాలా టైమ్ పడుతుంది. కానీ, దీపిక మాత్రం తక్కువ టైమ్‌లో నేర్చుకుని, చేశారట. ఈ సాంగ్ షూట్టైమ్లో ఫర్ఫెక్షన్ కోసం దీపిక 66సార్లు గింగిరాలు తిరిగారట. ‘‘ఈ సాంగ్ షూట్‌తో సినిమా స్టారై్టంది. ఫస్ట్‌డే షూటింగును నేనింకా మర్చిపోలేను. పాట చేస్తున్నప్పుడు నా ఒళ్లు జలదరించింది. ‘పద్మావతి ఆత్మ నాలో ప్రవేశించిందా?’ అన్న భావన కలిగింది. ఆ భావన ఇప్పటికీ ఉంది. మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ ఇది. చాలా కష్టపడ్డాను’’ అని పాట గురించి పలు విశేషాలు తెలిపారు దీపిక. ‘కష్టే ఫలి’ అంటారు. అందుకే దీపిక కష్టం ఊరికే పోలేదు. ఈ సాంగును సోషల్ మీడియాలో శనివారం సాయంత్రం వరకు 20మిలియన్స్... అంటే రెండు కోట్లమంది వీక్షించారు. ‘‘20 మిలియన్స్ వ్యూస్ అండ్ కౌంటింగ్. ప్రేక్షకుల అభిమానికి థ్యాంక్స్’’ అన్నారు దీపిక. -
ప్యారిస్‌లో పద్మావతి!
-
ప్యారిస్‌లో పద్మావతి!
అక్టోబర్ 9. సమయం... మధ్యాహ్నం ఒంటి గంటా మూడు నిమిషాలు. జస్ట్ ఓ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అంతే.. యూట్యూబ్‌లో లక్షల మంది చూశారు. ఒక్కసారి చూసి, వన్స్‌మోర్ అనకుండా ఉండలేమనీ, పాత రికార్డులన్నీ చెరిగిపోతాయనీ అన్నారు. ‘పద్మావతి’ సినిమా ట్రైలర్‌కు అంత రెస్పాన్స్ వచ్చింది. దీపికా పదుకొనె, షాహిద్‌కపూర్, రణ్‌వీర్‌సింగ్ ముఖ్య తారలుగా సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంతో రూపొందుతోన్న చిత్రమిది. రాణీ పద్మావతి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్యారిస్‌లో కూడా భారీగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అంతేకాదు ఫ్రెంచ్‌లో సబ్ టైటిల్స్ కూడా వేస్తారట. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలోనే 2002లో వచ్చిన ‘దేవదాస్’ చిత్రాన్ని ప్యారిస్‌లో పెద్ద ఎత్తున విడుదల చేయగా... మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘పద్మావతి’పైన అంచనాలున్నాయి. మరి.. ఇటు ఇండియాలో అటు విదేశాల్లో ‘పద్మావతి’ అంచనాలను చేరుకుంటుందా? వెయిట్ అండ్ సీ. -
చూడగానే నా గుండె పగిలింది : నటి
సాక్షి, ముంబయి : ఆర్టిస్ట్ కరణ్‌పై దాడి జరగడాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె జీర్ణించుకోలేపోతున్నారు. కరణ్‌ను అడ్డుకుని, ఆయనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని కోరారు. ఈ మేరకు ట్వీట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు దీపిక. అసలు వివాదం ఏంటంటే.. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావతి మూవీలో దీపికా పదుకొనె ప్రధాన పాత్ర పోషించారు. అయితే మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఏదో ఓ వివాదం ‘పద్మావతి’ని యూనిట్‌ను చుట్టుముడుతోంది. ఓ సందర్భంలోనైతే ఏకంగా చిత్ర యూనిట్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. దాంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. తాజాగా ఈ మూవీలో పద్మావతిగా కనిపించే దీపికా పదుకొనె లుక్‌ను ఆర్టిస్ట్ కరణ్ కొన్ని రంగులతో చిత్రీకరిస్తుండగా కొందరు దుండగులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ‘ఆ దాడి దృశ్యాలు చూడగానే నా గుండె పగిలింది. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి సమస్యలు, ఆగడాలను భరించాలి. దీనికి బాధ్యులు ఎవరు?. వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరించడమే ఆ దాడి ఉద్దేశం. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని స్మృతీ ఇరానీకి విజ్ఞప్తి చేస్తూ’ నటి దీపికా వరుస ట్వీట్లు చేశారు. పలు వివాదాల నడుమ ఈ చారిత్రక దృశ్య కావ్యం డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. absolutely heart breaking to see the recent attack on artist Karan and his artwork!disgusting and appalling to say the least! pic.twitter.com/Ot2Aki0MiA — Deepika Padukone (@deepikapadukone) 18 October 2017 Who are these people?Who is responsible for their actions?For how long are we going to let this go on? pic.twitter.com/2WFN0jcdua — Deepika Padukone (@deepikapadukone) 18 October 2017 this has to stop NOW & action must be taken!@smritiirani pic.twitter.com/fRnpFEkZIw — Deepika Padukone (@deepikapadukone) 18 October 2017 -
’పద్మావతి’ ట్రైలర్ వచ్చేసింది
-
పద్మావతి బాగుందా?
రాణీ పద్మిని గొప్ప అందగత్తె. ఆమె మనోహరమైన రూపం పలు దేశాల రాజులను ఆకట్టుకుంటుంది. పద్మినిని దక్కించుకోవాలనే కాంక్షతో ఆమె రాజ్యంపై దండెత్తుతారు. ఇంతకీ పద్మిని పెళ్లి కాని అమ్మాయా? అంటే కాదు. ఆల్రెడీ పెళ్లయిపోతుంది. అయినా ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటారు. యుద్ధంలో పద్మిని భర్త చనిపోతాడు. ఆ తర్వాత శత్రుదేశాల రాజుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి పద్మిని ఏం చేసింది? కాపాడుకోలేని పరిస్థితుల్లో ఎలా ప్రాణత్యాగం చేసిందన్నది రాణీ పద్మిని చరిత్ర. 13–14వ శతాబ్దానికి చెందిన ఈ భారతీయ రాణి జీవిత కథ నేపథ్యంలో ‘పద్మావతి’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. రాణి పాత్రను దీపికా పదుకొనె పోషిస్తున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకుడు. ఇందులో రాణి భర్త రావల్ రతన్ సింగ్ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తుండగా, శత్రుదేశం రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను రణవీర్ సింగ్ చేస్తున్నారు. ఇంకా పలువురు ప్రముఖ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈలోపు దీపిక లుక్‌ని విడుదల చేశారు. ‘‘నవరాత్రుల సందర్భంగా ఛిత్తోడ్ మహారాణి పద్మావతిని చూడండి’’ అని తన లుక్‌ని విడుదల చేశారు దీపిక. రాణి బాగుంది కదూ! -
డెంగ్యూతో వివాహిత మృతి
పెందుర్తి : వారం రోజులు గా డెంగ్యూతో బాధపడుతూ ఓ వివాహిత మృ తిచెందింది. పెందుర్తి మండలం చినముషిడివాడలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. చినముషిడివాడ రిజి స్ట్రార్ కార్యాలయం సమీపంలోని బీసీ కాలనీలో తీగల అప్పలరాజు, పద్మావతి(21) దంపతులు నివాసం ఉంటున్నారు. పద్మావతికి వారం రోజుల నుంచి జ్వరం, వాంతులు, విరేచనాలు కావడంతో బుధవారం గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగ్యూ వ్యాధిగా నిర్థారించారు. అక్కడే చికిత్స పొందుతూ పద్మావతి గురువారం వేకువజామున మరణించింది. ఆమెకు 8 నెలల కుమార్తె ఉంది. స్థానికంగా అపారిశుధ్యం కారణంగానే జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చినముషిడివాడ ప్రాంతంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని చెబుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. -
పన్నెండు కోట్లయితేనే!
దీపికా పదుకొనెను హీరోయిన్గా తీసుకునేందుకు నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నారట. ఎందుకంటే పారితోషికం 12 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తా! అని కండీషన్ పెడుతున్నారట. దీపిక ఇంత డిమాండ్ చేయడానికి కారణం సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్లో చేస్తోన్న ‘పద్మావతి’ అని టాక్. ఈ సినిమా కోసం ఏకంగా 200కిపైగా డేట్స్ ఇచ్చారట. అందుకుగాను 12 కోట్లు పుచ్చుకున్నారని భోగట్టా. అయితే, కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందట. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే తదుపరి చేయనున్న సినిమాలకు కూడా 12 కోట్లు తీసుకోవాల్సిందేనని ఫిక్స్ అయ్యారట. కానీ, నిర్మాతలు మాత్రం దీపికాకు అంత ఇవ్వడానికి ఫిక్స్ అవ్వడంలేదని సమాచారం. దాంతో బ్యూటీ మునగచెట్టు దిగక తప్పదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. -
నగలు... కష్టాలు!
రాణి పద్మిని జీవితం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పద్మావతి’. ఈ చిత్రం షూటింగ్‌కి ఇప్పటికే పలు ఆటంకాలు ఎదురయ్యాయి. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సినిమాని ఆపివేయాలని కొందరు వివాదం రేపారు. ఆ తర్వాత ఈ చిత్రం లొకేషన్లో ఓ ప్రమాదం జరిగింది. ఇప్పుడు టైటిల్ రోల్ చేస్తోన్న దీపికా పదుకొనె కారణంగా షూటింగ్‌కి ఆటంకం ఏర్పడింది. మహరాణి పాత్ర కాబట్టి బరువైన ఆభరణాలు ధరిస్తున్నారు దీపిక. సుకుమారి శరీరం ఈ నగలను మోయలేకపోతోందట. నగలు మాత్రమే కాదు.. ఈ చిత్రం కోసం ఆమె ధరిస్తున్న కాస్ట్యూమ్స్ బరువు కూడా ఎక్కువేనట. ఈ భారం మోయలేక దీపిక నానా అవస్థలు పడుతున్నారని సమాచారం. దీపిక మెడ దగ్గర నొప్పి మొదలైందని వినికిడి. భరించలేనంత నొప్పి కావడంతో షూటింగ్లో పాల్గొనలేకపోయారట. దాంతో సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అనుమతి తీసుకుని, రెస్ట్ తీసుకుంటున్నారని బాలీవుడ్ టాక్. -
మద్యరహిత ఆంధ్రాగా తీర్చిదిద్దాలి
అనంతపురం అర్బన్ : మద్యపానాన్ని అరికట్టి 2017లోనైనా మద్య రహిత ఆంధ్రాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ధాలని ఏపీ మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.పద్మావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. పాఠశాలలు, దేవాలయాల పక్కన మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను ప్రొత్సహిస్తున్నారని మండిపడ్డారు. కూలీలు తమ సంపాదనంతా మద్యానికి ఖర్చుపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మద్యం మహమ్మారిని పెంచి పోషిస్తూ, మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలకు కారణమవుతోందన్నారు. సహాయ కార్యదర్శులు అరుణ, పవిత్ర, ఉపాధ్యక్షురాలు పార్వతిప్రసాద్, కార్పొరేటర్ పద్మావతి, నగర అధ్యక్షురాల ఖుర్షీదా పాల్గొన్నారు. -
బంగారంపై నిబంధనలు విధిస్తే ఉద్యమం
అనంతపురం రూరల్ : మహిళల బంగారు ఆభరణాలపై నిబంధనలు విధిస్తే కేంద్ర ప్రభుత్వంపై ప్రతక్ష్య పోరాటం చేస్తామని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెద్ద నోట్లను రద్దు చేసి పేద,సామాన్య ప్రజలను ప్రధాన మంత్రి మోదీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రోజుకోక నిబంధనతో ప్రజలను ఎన్డీఏ పాలకులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని మండిపడ్డారు. నల్లధన కుబేరుల నుంచి ఒక్కపైసా కుడా బయటకు తీసుకురాలేకపోగా ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చారన్నారు. వెంటనే బంగారంపై నిబంధనలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి అరుణ, కార్పొరేటర్ పద్మావతి, నగర అధ్యక్షురాలు ఖుర్షిదా, పార్వతి, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయం వద్ద రెండో రోజు ఉద్యోగుల నిరసనలు
హైదరాబాద్: స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ సచివాలయంలో రెండో రోజు ఆర్థిక శాఖ ఉద్యోగులు బుధవారం తమ నిరసనలు తెలిపారు. ఉన్నతాధికారుల వద్ద పీఎస్లుగా పని చేస్తున్నవారిని తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును టీ. ఉద్యోగుల సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్ పీఎస్ పద్మావతిపై వారు ఫిర్యాదు చేశారు. అనంతరం పద్మావతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పద్మావతి చైర్‌ను ఉద్యోగులు బయటపెట్టారు. ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని నినదించారు. -
పద్మావతికి జోడి దొరకట్లేదు
బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం పద్మావతి. ఇప్పటికే ఈ సినిమాలో టైటిల్ రోల్‌కు బాలీవుడ్ బ్యూటి దీపిక పదుకొనేను తీసుకోవాలని నిర్ణయించారు. అయితే దీపికకు జోడిగా ఎవరు నటిస్తారన్న విషయం మాత్రం ఇంత వరకు తేలటం లేదు. గతంలో సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో దీపికతో కలిసి నటించిన రణవీర్ సింగ్‌ను మరోసారి హీరోగా తీసుకోవాలని భావించినా., విభేదాల కారణంగా రణవీర్ ఎంపిక కుదరలేదు. తరువాత బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌తో పద్మావతి సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర చేయించాలని భావించాడు.షా రూఖ్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఇంట్రస్ట్ చూపించినా.. 200 రోజుల పాటు డేట్స్ ఇవ్వటం సాధ్యం కాదన్న ఉద్దేశంతో పద్మావతికి నో చెప్పేశాడు. ఇద్దరు స్టార్ హీరోలు కాదనటంతో ఇప్పుడు బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్‌ను సంప్రదించే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ. మరి హృతిక్ అయినా పద్మావతితో జత కట్టడానికి అంగీకరిస్తాడో లేదో చూడాలి. -
నేడు అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
– సాయంత్రం స్వర్ణర థోత్సవం తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకోసం ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రత మండపాన్ని ఆలయ, ఇంజినీరింగ్ అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం, ఆస్థానమండపాన్ని పచ్చని తోరణాలు, వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది. సాయంత్రం 6గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా శుక్రవారం అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలను రద్దు చేశారు. టికెట్లకు పోటెత్తిన భక్తులు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కౌంటర్లో గురువారం వరలక్ష్మీ వ్రతం టికెట్లు భక్తులకు విక్రయించారు. వ్రతం టికెట్లు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు ఇవ్వనున్నట్లు ముందస్తుగా ప్రకటించారు. 200 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, సిఫార్సులతో సంబంధం లేకుండా ముందు వచ్చిన వారికే టికెట్లు ఇస్తామని చెప్పడంతో భక్తులు ఉదయం 5 గంటల నుంచి బారులు తీరారు. గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తరువాతనే భక్తులకు టికెట్లు జారీ చేశారు. గంటల సమయంలో క్యూలో వేచి ఉండి టికెట్లు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రవి, బాలాజీ, పవన్, ఆర్జితం ఇన్స్పెక్టర్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. -
సినిమాకు 12 కోట్లు అడుగుతుందట..!
ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు దీపికా పదుకొనే. బాలీవుడ్లో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటి, హాలీవుడ్లో సైతం సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ట్రిపులెక్స్ సీరీస్‌తో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది దీపిక. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మరో బాలీవుడ్ మూవీలోనూ నటిస్తోంది. హాలీవుడ్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటి.. ఇప్పుడు బాలీవుడ్లో సినిమా అంగీకరించాలంటే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. ఇన్నాళ్లు పది కోట్ల లోపు రెమ్యూనరేషన్ అందుకున్న దీపిక ఇప్పుడు ఏకంగా 12 కోట్లు అడుగుతుందట. ముఖ్యంగా తన సినిమాలకు ఓవర్ సీస్లో కూడా మంచి మార్కెట్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇంత భారీగా డిమాండ్ చేస్తుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటికే అంగీకరించిన పద్మావతి సినిమాకు సైతం అదే రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఈ బ్యూటి. దీపిక డిమాండ్ చేస్తున్న మొత్తం బాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు అందుకుంటున్న దాని కంటే కూడా చాలా ఎక్కువని భావిస్తున్న దర్శక నిర్మాతలు, దీపికకు బదులుగా వేరే హీరోయిన్స్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. -
ముద్రగడ దీక్ష విరమిస్తానన్నారు: వైద్యులు
రాజమహేంద్రవరం: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విరమిస్తానని తమతో చెప్పినట్టు వైద్యులు తెలిపారు. ఈ సాయంత్రం ఆయనను కిర్లంపూడికి తరలిస్తామని, అక్కడే దీక్ష విరమిస్తారని డాక్టర్లు వెల్లడించారు. ముద్రగడ సతీమణి పద్మావతి ఆస్పత్రిలోనే దీక్ష విరమిస్తారని చెప్పారు. దీక్ష విరమణపై ముద్రగడ తరపు నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ముద్రగడ డిమాండ్ ప్రకారం తుని ఘటనలో అరెస్ట్ చేసిన 13 మందికి బెయిల్ రావడంతో ఆయన దీక్ష విరమిస్తారని అంటున్నారు. అయితే వారంతా జైలు నుంచి విడుదలైన తర్వాతే దీక్ష విరమిస్తానని ముద్రగడ సోమవారం స్పష్టం చేశారు. 13 రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడ దంపతుల ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో వారి ఆరోగ్య పరిస్థితిపై కాపు నేతలు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం విషయంలో టీడీపీ సర్కారు మొదటి నుంచీ పూర్తిగా నిర్లక్ష్యం పదర్శిస్తోందని కాపులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ వచ్చిన వారి విడుదలకు కూడా సహకరించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. -
గొలుసు కోసం వృద్ధురాలి హత్య
వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న పద్మావతి(70) అనే వృద్ధురాలిని రెండున్నర తులాల బంగారు గొలుసు కోసం ఆగంతకులు గొంతు నులిమి చంపేశారు. ఒంటరిగా నివసిస్తున్న పద్మావతిని ఆగంతకులు మొదటగా ఇటుక రాయితో తలపై మోదారు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశారు. చనిపోయిందనుకుని భ్రమపడిన ఆగంతకులు ఆమె మెడలోని గోలుసు తీసుకుని పరారయ్యారు. ఆదివారం ఉదయం ఆమె గొంతులో ప్రాణం ఉండటం గమనించిన స్థానికులు ... మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కాద్దిసేపటకే మరణించింది. -
నష్ట పరిహారంపై ఆర్డీవో నిలదీత
విశాఖపట్నం: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తంతడి గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న బాబా ఆటమిక్ రీసెర్చి సెంటర్(బార్క్)కు సేకరించిన స్థలానికి పరిహారం చెల్లించే విషయమై వివాదానికి దారి తీసింది. ఆర్డీవో పద్మావతి గ్రామస్తులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థల పరిహారం జాబితాలో అనర్హుల పేర్లను చేర్చారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం నిర్ణయించడంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆర్డీవోను గ్రామస్థులు నిలదీశారు. స్పందించిన ఆర్డీవో...దీనిపై విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. -
పద్మావతి అమ్మవారి పూజలు రద్దు
తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు రద్దయ్యాయి. స్థానిక సమాజం వీధిలో నివాసముంటున్న రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కే.రాజాగాంధీ(85) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతిచెందారు. మాడవీధుల్లో ఎవరైనా మృతి చెందితే ఆలయ నిబంధనల ప్రకారం మృతదేహానికి దహన సంస్కారమయ్యే వరకు అమ్మవారి దర్శనం మినహా నైవేద్యం, పూజలు, ఆర్జిత సేవలు, హారతి, తీర్థం, శఠారీ ఇవ్వకూడదు. ఈ నేపథ్యంలో దహనసంస్కారాల అనంతరం సాయంత్రం 4.25 గంటలకు ఆలయం, మాఢ వీధుల్లో పుణ్యాహవచనం నిర్వహించి సుప్రభాతం, నిత్య కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం యథావిధిగా పూజలను కొనసాగించారు. -
భర్త వేధింపులతో భార్య మృతి
లక్కిరెడ్డిపల్లె: అనంతపురం గ్రామం ఈడిగపల్లెకు చెందిన బద్రయ్య, ఈశ్వరమ్మ కుమార్తె అయిన రాచమ్మ అలియాస్ (పద్మావతి)(38) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను భర్తే కడతేర్చారని మృతురాలి తల్లిదండ్రులు, గ్రామస్తులు రాత్రి మృతదేహాన్ని ఊరి బయట ఉంచి ఆందోళనకు దిగారు. లక్కిరెడ్డిపల్లె, రామాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతిరాలి భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈడిగపల్లెకు చెందిన ఓబయ్య, రాచమ్మకు 22 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక పాప, బాబు కలిగారు. ఓబయ్య చిత్తూరు జిల్లా కార్వేటినగర్‌లో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తూ తిరుపతి విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. వీరు ఏడాది నుంచి తరచూ గొడవలు పడుతూ వుండేవారని మృతురాలు బంధువులు తెలిపారు. రాచమ్మకు ఆరోగ్యం సరిగాలేదని, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని భర్త గురువారం ఆసుపత్రికి తేసుకెళ్లి చికిత్స చేయించారు. ఎలుకలు మందు సేవించిందని వైద్యులు నిర్ధారించినట్లు ఓబయ్య సమాధానమిచ్చారని మృతురాలి బంధువులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు వేలూరు ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే తను చనిపోయిందని తెలుసుకున్న వారు తమ స్వగ్రామానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. శవాన్ని సోమవారం రాత్రి ఈడిగపల్లెకు తీసుకురాగా రీపోస్టుమార్టం చేసి పూడ్చాలని, లేదంటే ఇక్కడే వుంచాలంటూ గ్రామస్తులు పట్టుపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి న్యాయం చేస్తాం అంటూ రామాపురం ఎస్ఐ చలపతి సర్దిచెప్పారు. చివరకు రాత్రి 10 గంటలకు పూడ్చారు. ఈ సంఘటనపై తిరుపతి ఎంఆర్‌పల్లె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు ఎస్ఐ చలపతి తెలిపారు. -
ఉత్తమ(మ్), సతీమణి విజయం
నల్గొండ : తెలంగాణ పిసిసి వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి విజయం సాధించారు. హుజుర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందగా, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉత్తమ్ సతీమణి పద్మావతి గెలుపొందారు. ఇక మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. -
సైకిల్ ఎదురీత..!
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీకి ఎదురు గాలి వీస్తోంది. అష్టకష్టాలు పడి టికెట్ దక్కించుకున్న ఆ పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్‌కు అధిపత్యపోరు, కులసమీకరణలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారుు. వీటన్నింటికీ తోడు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ సహకరించపోవడం, దివంగత నేత చలసాని పండు సతీమణి పద్మావతి, ఆమె మద్దతుదారులు గడపదాటక పోవడంతో బోడే విజయూవకాశాలు పూర్తిగా సన్నగిల్లారుు. ఓటమి అంచున సైకిల్‌పై సవారీ చేస్తున్న బోడే మాత్రం ఎన్నికల ప్రచారంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతా మాయ...! బోడే ప్రసాద్ రాజకీయూల్లోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ టికెట్ దక్కించుకునే వరకు ఆయన వ్యవహారశైలి అంతా మాయగానే ఉంది. ఆయనకు కూడా తమ పార్టీ అధినేత చంద్రబాబు మాదిరిగానే ‘హైటెక్ బోడే’ అనే పేరుంది. చేసేది గోరంతైనా ప్రచారం మాత్రం కొండంత చేసుకోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఉచిత వైద్య శిబిరాలు, పంట కాలువల పూడికతీత పనుల పేరుతో రోజులతరబడి పత్రికలు, మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అంతా తానే సొంతగా చేసినట్లు ప్రచారం చేసుకుని మసిపూసి మారేడుకాయ చేశారు. పంట కాలువల పూడిక తీత పనులకు సంబంధించి పొక్లెయిన్ మాత్రమే బోడే సమకూర్చితే, దాని నిర్వహణ ఖర్చు మొత్తం ఆ కాలువ పరిసరాలకు చెందిన రైతులే భరించారు. శ్మశాన వాటికల అభివృద్ధి తీరులోనూ ఇదే పరిస్థితి. ఇదంతా వెలుగులోకి రాకుండా అంతా తానే చేసినట్లుగా మాయ చేసి కొన్నిపత్రికల్లో(సాక్షి కాదు) కథనాల రారుుంచుకున్న ఘనత ఆయనకే సొంతం. కూలిచ్చి ప్రచారం..! బోడే ప్రచారానికి ప్రజా స్పందన కరువైంది. నేతలు కలసిరాకపోవడంతో ప్రతి గ్రామంలోనూ ఎక్కడికక్కడే కిరాయి కూలీలతో ప్రచారాన్ని పూర్తి చేసుకుని మమ.. అనిపిస్తున్నారు. డబ్బు, మద్యం పంచుతూ కూలీలను తన వెంట తిప్పుకుంటున్నారు. ప్రచారంలో ఆయన ఇచ్చే హామీలు ప్రజలకు విసుగుపుట్టిస్తున్నారుు. నియోజకవర్గంలోని సమస్యలపై అవగాహన లేకుండానే హామీలు గుప్పించటంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఆరోగ్య కేంద్రం అభివృద్ధి, మౌలిక వసతులపై నోరుమెదపని బోడే... సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తానని చెప్పడంపై తెలుగు తమ్ముళ్లే విమర్శలు గుప్పిస్తున్నారు. ఒప్పందాలకు తిలోదకాల వల్లే.. నియోజకవర్గంలో టీడీపీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో చలసాని పండు సతీమణి పద్మావతి, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కనిపించకపోవటంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఇరువురు నేతలతోపాటు వారి అనుచరులు కూడా అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. బోడే ప్రసాద్‌కు సీటు కేటాయించటం, ఆయన రాజకీయ, ఆర్థిక ఒప్పందాలకు తిలోదకాలు ఇవ్వడమే ఇందుకు కారణాలని తెలుస్తోంది. ఉయ్యూరు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున ఈ ముగ్గురు నేతలూ తమతమ స్థాయిలో ఖర్చు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి సీటు కేటాయించినా, మిగిలిన ఇద్దరికి వారు చేసిన ఖర్చును చెల్లించాలనేది ఒప్పందం. బోడే ప్రసాద్ ఈ ఒప్పందానికి తిలోదకాలు ఇచ్చినట్లు సమాచారం. నామినేషన్, ప్రచార కార్యక్రమాల సమయంలో కూడా పద్మావతి, వైవీబీలతో సంప్రదించకపోవడంతో వారు ఆగ్రహానికి గురైనట్లు తెలిసింది. ఈ పరిణామాలను తెలుసుకున్న చంద్రబాబు హిందూపురం ఎన్నికల పరిశీలకుడిగా వైవీబీని పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోడే ప్రసాద్ గెలుపు అసాధ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
పద్మావతిపై ప్రత్యేక ప్రేమ
ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే. కొంతమంది మాత్రం కొంచెం ఎక్కువ సమానం. ఈ మాట కాంగ్రెస్ పార్టీకి అక్షరాలా వర్తిస్తుంది. 'సింగిల్ టికెట్' నిబంధనను హస్తం పార్టీ కొందరి విషయంలో పక్కన పెట్టింది. ఒక కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నా ఒక్కరికి మాత్రమే సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ బజాయించింది. దీన్ని నూరు శాతం అమలు చేయడంలో మాత్రం విఫలమైంది. తెలంగాణలో ప్రకటించిన జాబితాలో ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విషయంలో మాత్రం మాట నిలబెట్టుకోలేకపోయింది. 'ఏక స్థానం' విధానంలో భాగంగా సబితా ఇంద్రారెడ్డి లాంటి సీనియర్ నేతలను కూడా హైకమాండ్ పక్కన పెట్టింది. ఆశ్చర్యకరంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతికి కేటాయించి కాంగ్రెస్ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించింది. జానారెడ్డి, షబ్బీర్ అలీ, డి శ్రీనివాస్ లాంటి ఉద్దండులు తమ వారసుల కోసం పైరవీలు చేసినా పట్టించుకోని అధిష్టానమ్మ పద్మావతిని మాత్రం అనూహ్యంగా కటాక్షించింది. సీపీఐ ఇచ్చిన కోదాడ సీటుకు వెనక్కి లాగేసుకుని పద్మావతి చేతుల్లో పెట్టారు. హైకమాండ్ చూపించిన ప్రేమతో చివరి నిమిషంలో నామినేషన్ వేసి కోదాడ అసెంబ్లీ బరిలో నిలిచారు పద్మావతి. దీంతో తమ వారి కోసం టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చూసి బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఉత్తమ్ ఏ మంత్రం వేసి అధిష్టానాన్ని బుట్టలో పడేశాడని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి తెలిసిన వాళ్లను ఈ పరిణామంతో పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. హస్తం పార్టీలో ఎవరెప్పుడు ఎందుకు అందలం ఎక్కుతారో చెప్పడం కష్టమని నిట్టూరుస్తున్నారు.