‘ఆర్’ అక్షరంతో దీపికా పదుకోన్‌కి ఏదైనా ప్రత్యేకమైన అనుబంధం ఉండి ఉంటుందా? అందుకే ముందు ‘రణబీర్ కపూర్’తో ప్రేమలో పడ్డారు. అతన్నుంచి విడిపోయాక ‘రణవీర్‌సింగ్’తో ప్రేమలో పడ్డారని బాలీవుడ్‌లో జోకులు వేసుకుంటారు. ఈసారైనా ‘ఆర్’తో ‘డీ’కి కుదురుతుందా? ఏడడుగులు వేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అసలు రణవీర్–దీపికా ఏడడుగులు వేస్తే ఏంటి? వెయ్యకపోతే ఏంటి? ఎందుకీ ఉత్సాహం? అంటే.. సెలబ్రిటీల జీవితాల్లో ఏర్పడే మలుపులు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా. అలాంటి ఔత్సాహికరాయుళ్లకు ఓ జవాబు దొరికింది. దీపిక మెడలో రణవీర్ మూడు ముళ్లు వేయడం ఖాయమని ఆమె ఇచ్చిన సమాధానాలు చెబుతున్నాయి. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణవీర్‌తో బాండింగ్, పెళ్లి తదితర విషయాలు చెప్పారు దీపిక. ఆ విశేషాలు..
► మేమిద్దరం (రణవీర్–దీపిక) ఉన్నప్పుడు మాకెవరూ అవసరంలేదు. ఏదీ అవసరంలేదు. మా ప్రెజెన్స్ మా ఇద్దరికీ ఎంతో హాయిగా ఉంటుంది. ఒక్కోసారి మేం మేధావుల్లా మాట్లాడుకుంటాం. ఒక్కోసారి సైలెంట్‌గా ఉండిపోతాం. కొన్నిసార్లు చిన్నపిల్లల్లా అమాయకంగా మాట్లాడుకుంటాం. ఏది మాట్లాడినా ఒకర్నొకరు డామినేట్ చేయాలనుకోం.
► నాకు ‘హోమ్ మేకర్’ (పెళ్లి చేసుకోవాలని) అవ్వాలని ఉంది. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక ఒక ఫ్యామిలీ సెట్ చేసుకుని, లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయాలనే కోరిక ఉంది. అయితే అది ఫలానా సంవత్సరంలో అని టైమ్ చెప్పలేను. అలా టైమ్ చెప్పి నేనేదీ చేయలేను. మా బాండింగ్ గురించి చెప్పాలంటే... ఏ బంధం అయినా ఏదో ఒక పాయింట్‌లో విస్తరిస్తుంది. మా బంధం కూడా దానంతట అది వేరే దిశలోకి విస్తరిస్తుందనుకుంటున్నా.
► గతంలో ఓ బంధం నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. డిప్రెషన్‌లో పడేసింది. అందులోంచి బయటపడటానికి చాలా టైమ్ పట్టింది. ఆ టైమ్‌లో నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ ఒత్తిడిని అధిగమించగలిగాను. అయితే నా సక్సెస్, ఫెయిల్యూర్స్‌కి నేనే బాధ్యత. వాటిని మాత్రం నా నుంచి ఎవరూ లాగేసుకోలేరు. ఎందుకంటే నా మొత్తం ఎనర్జీని వర్క్ మీద పెడుతున్నా. నా వర్క్ నా ‘బేబీ’. అది పూర్తిగా నా సొంతం.
నేనెవరికీ భయపడను
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్ నటించిన ‘పద్మావతి’ చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. రాణి పద్మావతి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్‌లు ఆందోళన జరుపుతున్నారు. భన్సాలీ, దీపిక తలలు నరికి, తెచ్చినవారికి భారీ ఎత్తున నగదు బహుమతి ఇస్తామని ఆందోళనకారులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి.. ఈ వివాదాలు దీపికాను భయపెడుతున్నాయా? అంటే.. ‘ఒక ఆర్టిస్టుగా నాకు కోపంగా ఉంది. ఈ వివాదాలు నాకు వినోదంలా అనిపిస్తున్నాయి. నేనస్సలు భయపడను’’ అని పేర్కొన్నారామె.
‘ఆర్’తో ‘డీ’.. ఈసారి ఏడడుగులు ఖాయం!
Published Fri, Nov 24 2017 12:12 AM | Last Updated on Fri, Nov 24 2017 12:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment