ఒంటి నిండా మోయలేనన్ని ఆభరణాలు. వీటికి తోడు బరువైన కాస్ట్యూమ్స్. ఈ సినిమా కోసం దీపికా ధరించిన లెహంగా బరువెంతో తెలుసా? 20 కేజీలు. ఇవి చాలవంటూ చేతిలో రెండు దీపాలు. అంతేకాదు చేతిలో దీపాలు కింద పడకుండా, ఫేస్‌లో ఆ టెన్షన్ కనిపించనివ్వకుండా, సాంగ్ పాడుతూ ట్రెడిషనల్ డ్యాన్స్ చేయాలి. ‘అమ్మో... నా వల్ల కాదు’ అనకుండా, ‘ఐ విల్ డూ’ అని నవ్వేశారు దీపికా పదుకొనె. ఆ పాటకు సంబంధించిన వీడియోను చూసి, ‘భేష్’ అనని వాళ్లు లేరు.
సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పద్మావతి’. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమాలోని ‘ఘూమర్...’ పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలో దీపిక స్టెప్పులు అదిరిపోయాయి. ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తోంది. 13వ శతాబ్దానికి చెందిన రాజ్‌పుత్‌ల సంప్రదాయం ఉట్టిపడేలా డ్యాన్స్ చేయడానికి ఎవరికైనా చాలా టైమ్ పడుతుంది. కానీ, దీపిక మాత్రం తక్కువ టైమ్‌లో నేర్చుకుని, చేశారట.
ఈ సాంగ్ షూట్‌టైమ్‌లో ఫర్‌ఫెక్షన్ కోసం దీపిక 66సార్లు గింగిరాలు తిరిగారట. ‘‘ఈ సాంగ్ షూట్‌తో సినిమా స్టారై్టంది. ఫస్ట్‌డే షూటింగును నేనింకా మర్చిపోలేను. పాట చేస్తున్నప్పుడు నా ఒళ్లు జలదరించింది. ‘పద్మావతి ఆత్మ నాలో ప్రవేశించిందా?’ అన్న భావన కలిగింది. ఆ భావన ఇప్పటికీ ఉంది. మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ ఇది. చాలా కష్టపడ్డాను’’ అని పాట గురించి పలు విశేషాలు తెలిపారు దీపిక. ‘కష్టే ఫలి’ అంటారు. అందుకే దీపిక కష్టం ఊరికే పోలేదు. ఈ సాంగును సోషల్ మీడియాలో శనివారం సాయంత్రం వరకు 20మిలియన్స్... అంటే రెండు కోట్లమంది వీక్షించారు. ‘‘20 మిలియన్స్ వ్యూస్ అండ్ కౌంటింగ్. ప్రేక్షకుల అభిమానికి థ్యాంక్స్’’ అన్నారు దీపిక.
Comments
Please login to add a commentAdd a comment