shahidh kapoor
-
టైటిల్‌తో సహా కాపీ, పేస్ట్.. ఆ రెండు చిత్రాలపై బోనీ కపూర్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీలో రీమేక్‌గా వచ్చిన విక్రమ్ వేద, జెర్సీ సినిమాలు సక్సెస్ కాకపోవడంపై మాట్లాడారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమాలు ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలను వివరించారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న సౌత్ డబ్బింగ్ చిత్రాలు కొన్ని మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయన్న విషయంపై ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. బోనీ కపూర్ మాట్లాడుతూ..'కొన్ని దక్షిణాది చిత్రాల హిందీ రీమేక్ సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణం కాపీ-పేస్ట్ చేయడం. విక్రమ్ వేద, జెర్సీ మూవీలకు కనీసం టైటిల్స్ కూడా మార్చలేదు. అలాగే సౌత్ సినిమాలను రీమేక్ చేసేటప్పుడు హిందీ ప్రేక్షకులకు తగ్గట్లుగా నార్త్ ఇండియన్ సంస్కృతిని జోడించాలి. అప్పుడు పాన్ ఇండియా అంగీకరించే సినిమా తీయాలి.' అని అన్నారు. విక్రమ్ వేద భారతీయ జానపద కథ విక్రమ్ ఔర్ బేతాల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా అదే పేరుతో తమిళంలో విడుదలైంది. ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. జెర్సీ మూవీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఇది టాలీవుడ్లో నాని హీరోగా నటించిన చిత్రానికి రీమేక్. షాహిద్ కపూర్ తన కొడుకు కోరిక కోసం ఆటలోకి తిరిగి వచ్చే మాజీ క్రికెటర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం బోనీ కపూర్ మలయాళ చిత్రం హెలెన్‌కి బాలీవుడ్ రీమేక్‌తో వస్తున్నాడు. ఈ చిత్రానికి మిలీ అని పేరు పెట్టారు. అతని కుమార్తె జాన్వీ కపూర్ ఈ మూవీలో టైటిల్ రోల్లో నటించింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ నవంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ తెలుగు మూవీ రీమేక్ కోసం పోటీ పడుతున్న బాలీవుడ్ అగ్ర హీరోలు
నేచురల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రిభినయనం చేసి విజయం సాధించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. గతేడాది క్మిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి టాక్ సంపాదించుకుంది. థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీలో సైతం రికార్డు వ్యూస్‌ను రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Prabhas-Pooja Hegde: ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా? అయితే ఈ రీమేక్ ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్స్ అందుకుంటున్న హీరో షాహిద్ కపూర్ రీమేక్ హక్కును తీసుకునే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అగ్ర హీరో అజయ్ దేవగన్ సైతం శ్యామ్ సింగరాయ్ రీమేక్‌కు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఒకే దర్శకుడిని రీమేక్ కోసం వీరిద్దరు సంప్రదించినట్లు బి-టౌన్లో వినికిడి. మరి ఇందులో ఎవరి ప్రయత్నాలు ఫలించి శ్యామ్ సింగరాయ్ హక్కులను పొందుతారో చూడాలి. -
జెర్సీ ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
Shahid Kapoor Jersey Movie Makers Clarity On OTT Release: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం ‘జెర్సీ’.నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో షాహిద్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన ఈ చిత్రం విడుదల తేదీని డిసెంబర్ 31, 2021కి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక మూవీ విడుదల మరోసారి వాయిదా పడుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. జెర్సీని దిల్ రాజు నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు తెలిసింది. డిసెంబర్ 31 నుంచి కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లో విడుదల చేయడం కంటే ఓటీటీ రిలీజ్ చేయడం బెటర్ ఆయన అభిప్రాయడుతున్నాడని, ఇందుకోసం ఇప్పటికే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో దిల్ రాజు చర్చలు జరపగా మంచి ఫ్యాన్సీ రేటుకు ఒప్పందం కూడా కుదిరినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు షాహిద్ నిరాకరించాడని, కావాలంటే తన పారితోషికంలో 31 కోట్ల రూపాయలను తగ్గించుకుంటానని నిర్మాత దిల్ రాజుకు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో షాహిద్, దిల్ రాజు మధ్య విభేదాలు కూడా తలెత్తినట్లు ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై మేకర్స్ స్పందించారు. జెర్సీ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. తాజా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో మూవీని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అంతేగాక మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్తో పాటు విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, అప్పటి వరకు అందరూ సేఫ్‌గా ఉండాలంటూ మేకర్స్ ప్రకటన ఇచ్చారు. -
నా దృష్టిలో కబీర్ సింగ్ సినిమా కాదు: షాహిద్
ముంబై: అర్జున్ రెడ్డి హిందీ రిమేక్ కబీర్ సింగ్ చిత్రం విడుదలై ఆదివారం నాటికి ఏడాది గడిచింది. హిట్ అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు ఈ సందర్భంగా హీరో షాహిద్ కపూర్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాలో షూటింగ్ సమయంలో సెట్స్‌లోని పలు సన్నివేశాల ఫొటోలు సోమవారం తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేశాడు. అంతేగాక అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. (అల.. బాలీవుడ్ తెరపైకి!) ‘వివాదాస్పదమైన నా పాత్రను ప్రేమించిన వారందరికీ హృదయపూర్వ ధన్వవాదాలు. ‘కబీర్ సింగ్’ అనేది నా దృష్టిలో కేవలం సినిమా కాదు. ఇది నిర్భయం.. నిజాయితీ.. బేర్.. నిజమైన భావోద్వేగం. విరిగిన హృదయంతో ఆగ్రహంతో ఉండే ప్రేమికుడి మనసును అర్థం చేసుకున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా చిత్రం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న సమయంలో సరైన తీర్పు కావాల్సిన సమయం అది. ప్రేక్షకులు ఘనవిజయాన్ని ఇచ్చి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు. ఇందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ‘కబీర్ సింగ్’ అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు. నిజంగా ఇది ప్రత్యేకమైనది’ అంటూ తన సహ నటి కియరా అద్వానీ, దర్శకుడు సందీప్ వంగాలను ట్యాగ్ చేసి షేర్ చేశాడు. (‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’) View this post on Instagram To all those who gave so much overwhelming love to such a complex, conflicted character. Thank you. #kabirsingh was never just a film to me.. it was an emotional arc that was raw.. bare.. unabashed .. honest .. fearless .. REAL!! In a time where people are quick to judge (others not themselves ) you understood him. You understood our interpretation of the angst of a broken heart. This one will always be special. So so special. And it would just not have been possible without @kiaraaliaadvani , @sandeepreddy.vanga , @muradkhetani and @ashwinvarde @bhushankumar @santha_dop , Payal and so so many others. Thank you all once again. And remember. Keep it real and make it count. Be kind. Be good. Spread positivity. And always believe. 🙌💕👊 A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Jun 21, 2020 at 9:32am PDT అదే విధంగా హీరోయిన్ కియారా అద్వానీ కూడా కబీర్ సింగ్ సినిమలో పలు సన్నివేశ ఫొటోలను షేర్ చేశారు. డియర్ కబీర్ సింగ్.. హ్యాపీ యానివర్సరీ’’ అంటూ సినిమాలోని తన పాత్ర పేరు ప్రీతి అని సంతకం చేశారు. కాగా తెలుగు అర్జున్ రెడ్డి దర్శకుడైన సందీప్ వంగా హిందీ కబీర్ సింగ్‌కు కూడా దర్శకుడిగా వ్వవహరించాడు. కబీర్ సింగ్ విడుదల సమయంలో వివాదంలో చిక్కుకున్నప్పటికీ బీ-టౌన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం షాహిద్ క్రిడా నేపథ్యంలో సాగే మరో తెలుగు రిమేక్ ‘జెర్సీ’లో నటిస్తున్నాడు. -
అదే నాకు బిగ్ కాంప్లిమెంట్ : షాహిద్
ముంబై : నిజ జీవితానికి పూర్తి భిన్నంగా ఉండే పాత్ర చేయడం ఒకలాంటి ఉత్సాహాన్నిస్తుందని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అన్నాడు. అతడు నటించిన తాజా చిత్రం ‘కబీర్ సింగ్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అర్జున్‌రెడ్డి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు చేసి..షాహిద్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే మహిళలపై హింసను ప్రేరేపించేదిగా ఉందంటూ ఈ సినిమా ఆది నుంచీ విమర్శలపాలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షాహిద్ కపూర్ స్పందిస్తూ.. ‘కబీర్ సింగ్‌గా నటించడం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిజ జీవితంలో అతడిలా ఉండటం అస్సలు కుదరదు. అయితే అదొక చాలెంజింగ్ రోల్. ఒక వ్యక్తి భావోద్వేగాలను కచ్చితంగా తెరకెక్కించడం కష్టంతో కూడుకున్న పని. కానీ తెలుగు అర్జున్ రెడ్డిలో ఇది సాధ్యమైంది. అందుకే హిందీ రీమెక్‌లో కూడా సహజత్వం ఉండాలని డైరెక్టర్‌కి చెప్పాను’ అని పేర్కొన్నాడు. ఇక తన గత సినిమాల గురించి షాహిద్ మాట్లాడుతూ... ప్రేక్షకులు ఇష్టపడని పాత్రలు చేయడానికి తానెప్పుడు భయపడలేదని చెప్పాడు.‘ ఉడ్తా పంజాబ్‌లో మత్తుకు బానిసైన టామీ సింగ్ అనే కుర్రాడి పాత్రలో నటించినపుడు క్యారెక్టర్ కాకుండా నటనను మెచ్చుకుంటూ థియేటర్ బయటికి వెళ్లాలని భావించాను. ఒక నటుడిగా సాహసమైన పాత్రలను ఎంచుకోవడం ముఖ్యం. అప్పుడే ప్రేక్షకుల మన్నన పొందామా లేదా అన్న విషయం తెలుస్తుంది. ప్రేక్షకులు తెరపైన పాత్రను చూసి అశ్చర్యపోవాలి.. ఏంటి ఇంతలా జీవించేశాడు అనుకునేలా క్యారెక్టర్ ఉండాలి. నిజానికి కబీర్ సింగ్‌ను ప్రేక్షకులు ఇష్టపడటం లేదంటే అదే నాకు పెద్ద ప్రశంస’ అని చెప్పుకొచ్చాడు. -
బాక్సాఫీస్ వసూళ్లలో కబీర్ సింగ్ దూకుడు
ముంబై : అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తోంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన ఈ మూవీ రెండో వారంలో ఇప్పటివరకూ రూ 163.73 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. కేసరి, టోటల్ ఢమాల్ల లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించి ఈ ఏడాది టాప్ 5 హయ్యస్ట్ గ్రాసర్స్‌లో మూడో స్ధానంలో నిలిచింది. రూ 150 కోట్ల మార్క్‌ను దాటిన కబీర్ సింగ్ ఆదివారం రూ 175 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించి రెండో వారంలో పద్మావత్ కంటే మెరుగైన వసూళ్లు రాబడుతోందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కబీర్ సింగ్ త్వరలో భారత్, ఉరి మూవీల లైఫ్‌టైమ్ బిజినెస్‌ను దాటుతుందని తరణ్ ఆదర్శ్ అంచనా వేశారు. కబీర్ సింగ్ తొలుత మిశ్రమ టాక్‌తో విడుదలైనా వసూళ్లపరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. -
కబీర్‌సింగ్ డేట్ ఫిక్స్
విజయ్ దేవరకొండ, షాలినీపాండే జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమాని ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’కి దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగానే ‘కబీర్ సింగ్’ ని తెరకెక్కించడం విశేషం. భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, క్రిషణ్ కుమార్, అశ్విన్ వర్డే నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘అర్జున్‌రెడ్డి’లోని అనుభూతిని ఎక్కడా మిస్ కాకుండా ‘కబీర్‌సింగ్’ తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. జూన్ 21న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం బాలీవుడ్లో ఎంతటి సెన్సేషన్ సృష్టిస్తుందే వేచి చూడాలి. -
‘కబీర్ సింగ్’గా ‘అర్జున్ రెడ్డి’
విజయ్ దేవరకొండ హీరో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ సినిమా అర్జున్ రెడ్డి. ఈ ఒక్క సక్సెస్‌తో విజయ్ స్టార్‌గా మారిపోయాడు. అంతేకాదు దర్శకుడు సందీప్ రెడ్డికి కూడా అర్జున్ రెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. అర్జున్ రెడ్డి ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాలో తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న తమిళ వర్షన్ టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. హిందీ వర్షన్ షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఒరిజినల్ వర్షన్ దర్శకుడు సందీప్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కబీర్ సింగ్ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. -
షాహిద్ కా బేటా జైన్
రెండు రోజులుగా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌కు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అవి కంగ్రాట్స్ కాల్స్. షాహిద్ కపూర్ రెండో సారి తండ్రి అయినందుకు సన్నిహితులు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు. మీరా రాజ్పు త్ను మూడేళ్ల క్రితం షాహిద్ కపూర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఆల్రెడీ మిషా కపూర్ అనే కుమార్తె ఉంది. ఇప్పుడు తాజాగా మీరా రాజ్‌పుత్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ బాబుకి జైన్ కపూర్ అని పేరు పెట్టినట్లు షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘‘మా బేబీ బాయ్‌కి జైన్ కపూర్ అని పేరు పెట్టాం. ఇద్దరు పిల్లలు చాలు అనుకుంటున్నాం. మాకు విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు షాహిద్. -
ఈ ఏడాది సెక్సియెస్ట్ మ్యాన్ షాహిద్
త్వరలో పద్మావతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ ఈ ఏటి సెక్సియెస్ట్ మ్యాన్ గా ఎంపికయ్యాడు. ఈస్టర్న్ ఐ సంస్థ ప్రతీ ఏటా చేసే సర్వేలో ఆసియాలో టాప్ 50 సెక్సియెస్ట్ మ్యాన్ లను ప్రకటిస్తారు. ఈ ఏడు ఈ లిస్ట్ లో షాహిద్ టాప్ లో నిలిచాడు. గత సంవత్సరం నెంబర్ వన్ గా నిలిచిన పాప్ స్టార్ జేన్ మాలిక్ ను మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రెండో స్థానంలో బాలీవుడ్ మ్యాన్లీ హీరో హృతిక్ రోషన్ నిలువగా, బుల్లితెర నటుడు వివియన్ డీసేన, ఆశిష్ శర్మలు వరుసగా నాలుగు, ఐదు స్థానాలు సాధించారు. పూర్తి లిస్ట్ ను డిసెంబర్ 15న ప్రకటించనున్నట్టు ఈస్టర్న్ ఐ ప్రకటించింది. ఈ ఎంపిక పై స్పందించిన షాహిద్.. అభిమానుల ప్రేమాభిమానల వల్లే ఇది సాధ్యమైందని ట్వీట్ చేశారు. తనకు మద్ధతు తెలిపిన వారికి తనను ఎంపిక చేసిన ఈస్టర్న్ ఐ సంస్థకు కృతజ్ఞతలు తెలిపాడు. The Eastern Eye 50 Sexiest Asian Men 2017 TOP SIX. Thanks to all those who voted. Full list out in newspaper on Friday December 15. 1. Shahid Kapoor 2. Hrithik Roshan 3. Zayn Malik 4. Vivian Dsena 5. Ashish Sharma 6. Fawad Khan#EasternEye #ShahidKapoor @shahidkapoor — Eastern Eye (@EasternEye) 13 December 2017 Sexiest Man Alive, 2017!!! WOW!! Thank you guys!! It’s all made possible because of your love & support. Love you all!! Thanks @EasternEye & @AsjadNazir #AsjadNazirSexyList2017 https://t.co/cvftzRoma2 — Shahid Kapoor (@shahidkapoor) 13 December 2017 -
ఆత్మ ప్రవేశించిందా?
ఒంటి నిండా మోయలేనన్ని ఆభరణాలు. వీటికి తోడు బరువైన కాస్ట్యూమ్స్. ఈ సినిమా కోసం దీపికా ధరించిన లెహంగా బరువెంతో తెలుసా? 20 కేజీలు. ఇవి చాలవంటూ చేతిలో రెండు దీపాలు. అంతేకాదు చేతిలో దీపాలు కింద పడకుండా, ఫేస్‌లో ఆ టెన్షన్ కనిపించనివ్వకుండా, సాంగ్ పాడుతూ ట్రెడిషనల్ డ్యాన్స్ చేయాలి. ‘అమ్మో... నా వల్ల కాదు’ అనకుండా, ‘ఐ విల్ డూ’ అని నవ్వేశారు దీపికా పదుకొనె. ఆ పాటకు సంబంధించిన వీడియోను చూసి, ‘భేష్’ అనని వాళ్లు లేరు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పద్మావతి’. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమాలోని ‘ఘూమర్...’ పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలో దీపిక స్టెప్పులు అదిరిపోయాయి. ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తోంది. 13వ శతాబ్దానికి చెందిన రాజ్‌పుత్‌ల సంప్రదాయం ఉట్టిపడేలా డ్యాన్స్ చేయడానికి ఎవరికైనా చాలా టైమ్ పడుతుంది. కానీ, దీపిక మాత్రం తక్కువ టైమ్‌లో నేర్చుకుని, చేశారట. ఈ సాంగ్ షూట్టైమ్లో ఫర్ఫెక్షన్ కోసం దీపిక 66సార్లు గింగిరాలు తిరిగారట. ‘‘ఈ సాంగ్ షూట్‌తో సినిమా స్టారై్టంది. ఫస్ట్‌డే షూటింగును నేనింకా మర్చిపోలేను. పాట చేస్తున్నప్పుడు నా ఒళ్లు జలదరించింది. ‘పద్మావతి ఆత్మ నాలో ప్రవేశించిందా?’ అన్న భావన కలిగింది. ఆ భావన ఇప్పటికీ ఉంది. మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ ఇది. చాలా కష్టపడ్డాను’’ అని పాట గురించి పలు విశేషాలు తెలిపారు దీపిక. ‘కష్టే ఫలి’ అంటారు. అందుకే దీపిక కష్టం ఊరికే పోలేదు. ఈ సాంగును సోషల్ మీడియాలో శనివారం సాయంత్రం వరకు 20మిలియన్స్... అంటే రెండు కోట్లమంది వీక్షించారు. ‘‘20 మిలియన్స్ వ్యూస్ అండ్ కౌంటింగ్. ప్రేక్షకుల అభిమానికి థ్యాంక్స్’’ అన్నారు దీపిక. -
ప్యారిస్‌లో పద్మావతి!
-
ప్యారిస్‌లో పద్మావతి!
అక్టోబర్ 9. సమయం... మధ్యాహ్నం ఒంటి గంటా మూడు నిమిషాలు. జస్ట్ ఓ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అంతే.. యూట్యూబ్‌లో లక్షల మంది చూశారు. ఒక్కసారి చూసి, వన్స్‌మోర్ అనకుండా ఉండలేమనీ, పాత రికార్డులన్నీ చెరిగిపోతాయనీ అన్నారు. ‘పద్మావతి’ సినిమా ట్రైలర్‌కు అంత రెస్పాన్స్ వచ్చింది. దీపికా పదుకొనె, షాహిద్‌కపూర్, రణ్‌వీర్‌సింగ్ ముఖ్య తారలుగా సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంతో రూపొందుతోన్న చిత్రమిది. రాణీ పద్మావతి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్యారిస్‌లో కూడా భారీగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అంతేకాదు ఫ్రెంచ్‌లో సబ్ టైటిల్స్ కూడా వేస్తారట. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలోనే 2002లో వచ్చిన ‘దేవదాస్’ చిత్రాన్ని ప్యారిస్‌లో పెద్ద ఎత్తున విడుదల చేయగా... మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘పద్మావతి’పైన అంచనాలున్నాయి. మరి.. ఇటు ఇండియాలో అటు విదేశాల్లో ‘పద్మావతి’ అంచనాలను చేరుకుంటుందా? వెయిట్ అండ్ సీ. -
మరోసారి గాయపడ్డ హీరో : షూటింగ్ కు బ్రేక్
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పద్మావతి సినిమాను ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంది. షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే హీరో షాహిద్ కపూర్ గాయపడటంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. తరువాత రాజస్థాన్ లో షూటింగ్ జరుగుతుండగా కొంతమంది సినిమా కథ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యూనిట్ సభ్యులపై దాడికి దిగటంతో ఆ లోకెషన్ లో షూటింగ్ అర్థాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది. తాజాగా మరోసారి పద్మావతి సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా షాహిద్ కపూర్ మరోసారి గాయపడ్డాడు. కాలిగాయం తీవ్రంగా ఉండటంతో పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి డాక్టర్లు సూచించారట. దీంతో షూటింగ్ బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. భారీ యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాధాలు తప్పటంలేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పద్మావతిగా హాట్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. షాహిద్ కపూర్ తో పాటు మరో హీరో రణవీర్ సింగ్ మరో కీలక పాత్రలోనటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు బన్నాలీ. -
అలాంటి కోడలినే నేను ఎప్పుడూ కోరుకున్నా
ముంబయి: తన కుమారుడు షాహిద్ కపూర్‌కు మీరా రాజ్‌పుత్ భార్యగా రావడం గొప్ప సంతోషాన్నిచ్చిందని షాహిద్ తల్లి నీలిమ అజీం అన్నారు. అలాంటి అమ్మాయే తనకుమారుడికి కావాలని ఎప్పుడూ కోరుకున్నానని చెప్పారు. ఇటీవల పెళ్లి చేసుకున్న షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌ల రిసెప్షన్ ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, సోనమ్ కపూర్, కంగనా రనౌత్, అర్జున్ కపూర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షాహిద్ తల్లి నీలిమ మాట్లాడుతూ మీరాను షాహిద్ తన భార్యగా ఎంచుకోవడం గొప్ప నిర్ణయమని అన్నారు. అలాంటి కోడలినే తాను ఎప్పుడూ కోరుకునేదాన్నని చెప్పారు. ఆమె మంచి సహృదయశీలి అని చెప్పారు. ప్రేమాప్యాయతలు నిండుగా ఉన్న గొప్ప కుటుంబం నుంచి మీరా వచ్చిందని, అలాంటి అమ్మాయిని కూతురుగా పొందడం కూడా అదృష్టమేనని చెప్పారు.