
కబీర్ సింగ్ దూకుడు
ముంబై : అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తోంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన ఈ మూవీ రెండో వారంలో ఇప్పటివరకూ రూ 163.73 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
కేసరి, టోటల్ ఢమాల్‌ల లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించి ఈ ఏడాది టాప్ 5 హయ్యస్ట్ గ్రాసర్స్‌లో మూడో స్ధానంలో నిలిచింది. రూ 150 కోట్ల మార్క్‌ను దాటిన కబీర్ సింగ్ ఆదివారం రూ 175 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించి రెండో వారంలో పద్మావత్ కంటే మెరుగైన వసూళ్లు రాబడుతోందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కబీర్ సింగ్ త్వరలో భారత్, ఉరి మూవీల లైఫ్‌టైమ్ బిజినెస్‌ను దాటుతుందని తరణ్ ఆదర్శ్ అంచనా వేశారు. కబీర్ సింగ్ తొలుత మిశ్రమ టాక్‌తో విడుదలైనా వసూళ్లపరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.