Kabir Singh
-
ఛా.. నిన్ను తీసుకుని తప్పు చేశా.. నటుడిపై సెటైర్లు
కబీర్ సింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ఇందులో కాలేజీ డీన్‌గా నటించిన అదిల్ హుస్సేన్‌కు కూడా సినిమా నచ్చలేదట! తన సినీ కెరీర్లో ఎందుకు నటించాన్రా దేవుడా.. అని ఫీలైన సినిమా ఏదైనా ఉందంటే.. అదే కబీర్ సింగ్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 'అందులో యాక్ట్ చేయనని చెప్తే కేవలం ఒక్క రోజే రమ్మని అడిగారు. భారీ పారితోషికం డిమాండ్ చేస్తే వాళ్లే సైలెంట్‌గా ఉంటారనుకున్నాను. డబ్బులెక్కువ డిమాండ్ చేశా కానీ నేను డిమాండ్ చేసిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో తప్పనిపరిస్థితిలో నేను సినిమా చేశాను. నేను నటించిన సన్నివేశం బాగానే ఉంది. సినిమా అంతా కూడా అలాగే ఉంటుందనుకున్నాను. మూవీ రిలీజైన తర్వాత చూస్తే.. ఇలాంటి సినిమా చేశానా? అని సిగ్గుతో చచ్చిపోయాను. నా భార్యను కూడా సినిమా చూడమని అడగలేదు. తను చూసుంటే ఇలాంటి మూవీలో యాక్ట్ చేశావా? అని నాపై కోప్పడేది' అని చెప్పుకొచ్చాడు. ఒక్క బ్లాక్‌బస్టర్‌తో గుర్తింపు ఇది చూసిన కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో సదరు నటుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. 'మీరు గొప్పగా భావించి యాక్ట్ చేసిన 30 సినిమాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని బాధపడుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్ చిత్రంతోనే వచ్చింది. మిమ్మల్ని సినిమాలోకి తీసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. మీకు నటనపై అభిరుచి కంటే దురాశే ఎక్కువుందని అర్థమవుతోంది. మీరు బాధపడక్కర్లేదు మీరు సిగ్గుతో తలదించుకోకండి.. మీ ముఖాన్ని ఏఐ సాయంతో రీప్లేస్ చేస్తాను.. అప్పుడు మనసారా నవ్వుకోండి' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై అదిల్ హుస్సేన్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. కబీర్ సింగ్ సినిమా చూసి నేను షాకైన మాట వాస్తవం. ఇప్పటికీ ఆ మూవీలో నటించినందుకు రిగ్రెట్‌గా ఫీలవుతున్నాను. అభిప్రాయాన్ని మార్చుకునే ఉద్దేశ్యం నాకు లేదు అని చెప్పుకొచ్చాడు. Ur 'belief' in 30 art films didn't get as much fame to u as ur 'regret' of 1 BLOCKBUSTER film did 👏https://t.co/BiJIV3UeyO I regret casting u,knwing that ur greed is bigger than ur passion. NOW I'll save U from the shame by replacing Ur face with AI help👍 Now smile properly 🙂 — Sandeep Reddy Vanga (@imvangasandeep) April 18, 2024 చదవండి: డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం -
'ముందు వెళ్లి మీ భర్తను అడగండి'.. స్టార్ హీరో భార్యకు స్ట్రాంగ్ కౌంటర్!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం యానిమల్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది ప్రముఖులు సైతం మండిపడ్డారు. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి-2, కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. అయితే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే చురకలంటించారు. ఒకసారి అమిర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చాడు. సందీప్ మాట్లాడుతూ.. 'నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్‌కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టించాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి అతనితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు' అని యానిమల్ దర్శకుడు తెలిపారు. కాగా..ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. -
యానిమల్‌లో ఆ సీన్‌ను తప్పుబట్టిన ప్రముఖ రచయిత
రణబీర్ కపూర్ నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ వంటి సినిమాల విజయంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను జావేద్ నిందించారు. భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్ చేశారు. ఔరంగాబాద్‌లో జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన ప్రసంగంలో ప్రస్తుత చిత్రాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన యానిమల్ చిత్రం గురించి నేరుగా ప్రస్తావించకుండానే ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు. తాజాగా వచ్చిన ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆధరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యమనది కాదని ఆయన చెప్పారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరం అని ఆయన ఆందోళన చెందారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరోక సీన్లో హీరోయిన్‌పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్‌రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్‌రెడ్డి వంగా. పరోక్షంగా సందీప్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా జావేద్ ఇలాంటే వ్యాఖ్యలే చేశారు. ఆనంద్ బక్షి రాసిన సాహిత్యంపై కూడా వివాదస్పద వ్యాఖ్యలే చేశారు. 90ల నాటి చిత్రం ఖల్ నాయక్ నుంచి 'చోలీ కే పీచే' పాట భారీ విజయాన్ని అందుకుంది. ఆ పాట లిరిక్స్‌తో పాటు అందులో మగవారి వస్త్రధారణ కూడా మహిళల మాదిరి ఉండటం ఆయన తప్పుబట్టారు. కానీ ప్రేక్షకుల అఖండ మద్దతుతో ఇలాంటివి మరిన్నీ వస్తున్నాయిని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూడాలి అనే విషయంలో కూడా బాధ్యత వహించాలి.. ఇలాంటి వాటిని మెచ్చుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఇలాంటి చిత్రాలే ఎక్కువ వస్తాయి. ఇప్పటికైనా ఇటువంటి చిత్రాలకు దూరంగా ఉండాలని జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
పెళ్లికి రెడీ అయిన కబీర్ సింగ్ పనిమనిషి, ఫోటోలు వైరల్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్లో ఎంతటి సంచలన విజయం నమోదు చేసిందో అందరికీ తెలిసిందే! సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీపై బాలీవుడ్ మనసు పడటంతో కబీర్ సింగ్ పేరుతో హిందీ రీమేక్ తీశాడు. అక్కడ కూడా సందీప్ రెడ్డియే డైరెక్టర్. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.370 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు లభించింది. పనిమనిషిగా నటించిన వనిత ఖరత్ తన నటనతో అందరినీ నవ్వించింది. తాజాగా వనిత పెళ్లి పీటలెక్కబోతోంది. సుమిత్ అశోక్ అనే వ్యక్తితో ఏడడుగులు నడవనుంది. ఇప్పటికే వీరి పెళ్లి పనులు కూడా షురూ అయ్యాయి. ఈ క్రమంలో మెహందీ, హల్దీ ఫంక్షన్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాబోయే నూతన వధూవరులిద్దరూ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Vanita Kharat (@vanitakharat19) View this post on Instagram A post shared by Pineapple_studios10 (@pineapple_studios10) View this post on Instagram A post shared by Majja (@its.majja) చదవండి: అలా అనడంతో నాన్న పొలానికి వెళ్లి పురుగుల మందు తాగారు: పోసాని అత్యధిక వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోన్న పఠాన్.. -
నటిపై దాడి.. చేతిలోని ఫోన్‌ను బలవంతంగా..
Actress Nikita Dutta Phone Got Snatched in Mumbai: బాలీవుడ్ నటి నికితా దత్తాకు చేదు అనుభవం ఎదురయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మీద దాడి చేసి.. సెలఫోన్ లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా, గత ఆదివారం సాయంత్రం నికితా దత్తా తన స్నేహితులతో కలిసి ముంబైలోని బాంద్రాలోని రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్నట్లు తెలిపారు. కాగా, సాయంత్రం 7.30 ప్రాంతంలో.. తన ఎదురుగుండా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. తనపై దాడిచేశారని తెలిపారు. ఆ తర్వాత.. తన చేతిలోని ఫోన్‌ను బలవంతంగా లాక్కొని.. అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ఆ సమయంలో తనకు.. ఏంజరుగుతుందో కూడా అర్థం కానీ పరిస్థితుల్లో ఉండిపోయానని తెలిపారు. కొంతమంది స్థానికులు ఆ బైక్‌దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు.. అక్కడి నుంచి తప్పించుకోని వెళ్లిపోయారని వాపోయారు. ఆ తర్వాత.. తేరుకుని బాంద్రాలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నికితా దత్తా తెలిపారు. నికితా దత్తా.. డైబుక్, ఏక్‌డుజ్‌కే వాస్తే, దిబిగ్‌బుల్,కబీర్ సింగ్ వంటి పలు సినిమాల్లో నటించారు. నికితాదత్తా.. 2012 లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఫైనల్లో వరకు చేరారు. ఆ తర్వాత.. ‘లేకర్ హమ్ దీవానా దిల్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆమె చివరగా ఇమ్రాన్ హష్మీ డైబ్బక్ సినిమాలో నటించారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన అభిషేక్ బచ్చన్.. జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్‌స్టాలో కామెంట్ చేశారు. చదవండి: Kangana Ranaut: ట్విటర్ కొత్త సీఈఓ నియామకంపై కంగనా ఆసక్తికర కామెంట్.. View this post on Instagram A post shared by Nikita Dutta 🦄 (@nikifying) -
నటి న్యూడ్ ఫోటో.. నెటిజనుల ప్రశంసలు
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. షాహీద్ కపూర్, కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో ఇంట్లో పని మనిషి పాత్ర చేసిన నటి గుర్తుందా. ఆమె పేరు వనితా ఖరత్. సినిమాలో కూడా ఇదే పేరుతో నటించిన ఈ నటి తాజాగా అభిమానులకు షాక్ ఇచ్చారు. న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసినప్పటికి ఆమె ఉద్దేశం మంచిది కావడంతో అభిమానులు ప్రశంసిస్తున్నారు. బాడీ పాజిటివిటీ పేరుతో వనితా ఖరత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటోని పోస్ట్ చేశారు. ఇక ఆమె ముందు భాగంలో నీలి రంగు గాలి పటం మాత్రమే ఉంది. (‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’) ఇక వనితా ఖరత్ ‘నా ప్రతిభ పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను.. నా పాషన్, నా నమ్మకం, నా శరీరం పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఎందుకంటే నేనంటే నేనే గనుక’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులను అలరిస్తుంది. ‘మన పట్ల మనకు నమ్మకం, ప్రేమ ఉండటం ఎంత ముఖ్యమో చాలా బాగా చెప్పారు’.. ‘ఫోటో అసభ్యతకు తావు లేకుండా అందంగా ఉంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇక వనితా ఖారత్ బాలీవుడ్లోనే కాక పలు మరాఠీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by @vanitakharat19 -
నా దృష్టిలో కబీర్ సింగ్ సినిమా కాదు: షాహిద్
ముంబై: అర్జున్ రెడ్డి హిందీ రిమేక్ కబీర్ సింగ్ చిత్రం విడుదలై ఆదివారం నాటికి ఏడాది గడిచింది. హిట్ అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు ఈ సందర్భంగా హీరో షాహిద్ కపూర్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాలో షూటింగ్ సమయంలో సెట్స్‌లోని పలు సన్నివేశాల ఫొటోలు సోమవారం తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేశాడు. అంతేగాక అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. (అల.. బాలీవుడ్ తెరపైకి!) ‘వివాదాస్పదమైన నా పాత్రను ప్రేమించిన వారందరికీ హృదయపూర్వ ధన్వవాదాలు. ‘కబీర్ సింగ్’ అనేది నా దృష్టిలో కేవలం సినిమా కాదు. ఇది నిర్భయం.. నిజాయితీ.. బేర్.. నిజమైన భావోద్వేగం. విరిగిన హృదయంతో ఆగ్రహంతో ఉండే ప్రేమికుడి మనసును అర్థం చేసుకున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా చిత్రం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న సమయంలో సరైన తీర్పు కావాల్సిన సమయం అది. ప్రేక్షకులు ఘనవిజయాన్ని ఇచ్చి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారు. ఇందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ‘కబీర్ సింగ్’ అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు. నిజంగా ఇది ప్రత్యేకమైనది’ అంటూ తన సహ నటి కియరా అద్వానీ, దర్శకుడు సందీప్ వంగాలను ట్యాగ్ చేసి షేర్ చేశాడు. (‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’) View this post on Instagram To all those who gave so much overwhelming love to such a complex, conflicted character. Thank you. #kabirsingh was never just a film to me.. it was an emotional arc that was raw.. bare.. unabashed .. honest .. fearless .. REAL!! In a time where people are quick to judge (others not themselves ) you understood him. You understood our interpretation of the angst of a broken heart. This one will always be special. So so special. And it would just not have been possible without @kiaraaliaadvani , @sandeepreddy.vanga , @muradkhetani and @ashwinvarde @bhushankumar @santha_dop , Payal and so so many others. Thank you all once again. And remember. Keep it real and make it count. Be kind. Be good. Spread positivity. And always believe. 🙌💕👊 A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Jun 21, 2020 at 9:32am PDT అదే విధంగా హీరోయిన్ కియారా అద్వానీ కూడా కబీర్ సింగ్ సినిమలో పలు సన్నివేశ ఫొటోలను షేర్ చేశారు. డియర్ కబీర్ సింగ్.. హ్యాపీ యానివర్సరీ’’ అంటూ సినిమాలోని తన పాత్ర పేరు ప్రీతి అని సంతకం చేశారు. కాగా తెలుగు అర్జున్ రెడ్డి దర్శకుడైన సందీప్ వంగా హిందీ కబీర్ సింగ్‌కు కూడా దర్శకుడిగా వ్వవహరించాడు. కబీర్ సింగ్ విడుదల సమయంలో వివాదంలో చిక్కుకున్నప్పటికీ బీ-టౌన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం షాహిద్ క్రిడా నేపథ్యంలో సాగే మరో తెలుగు రిమేక్ ‘జెర్సీ’లో నటిస్తున్నాడు. -
‘కబీర్ సింగ్’ చూసి.. అమ్మాయిలకు ఎర!
న్యూఢిల్లీ : బాలీవుడ్ సినిమా కబీర్ సింగ్( అర్జున్ రెడ్డి రీమేక్) చూసి స్ఫూర్తి పొంది, తానో డాక్టర్‌నని చెప్పుకుంటూ ఓ వ్యక్తి అమాయక యువతులను మోసం చేశాడు. అతడి చేతిలో మోసపోయిన ఓ డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో గుట్టురట్టై జైలు పాలయ్యాడు. ఈ సంఘటన న్యూఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన ఆనంద్ కుమార్ అనే వ్యక్తి కబీర్ సింగ్ సినిమాలోని ఆర్థోపెడిక్ సర్జన్ షాహిద్ కపూర్ పాత్రతో స్ఫూర్తి పొందాడు. తానో ఆర్థోపెడిక్ సర్జన్‌నని చెప్పుకుంటూ.. డా. రోహిత్ గుజరాల్ అనే మారుపేరుతో టిండర్ డేటింగ్ యాప్ ద్వారా అమాయక యువతులకు ఎర వేయసాగాడు. ఈ నేపథ్యంలో ఓ డాక్టర్ అతడి వలలో చిక్కింది. ( అనుమానాస్పద మృతి.. కొంతకాలంగా ఫోన్లో) ఇద్దరి మధ్యా చాటింగ్ మొదలైంది. కుమార్ ఆమెను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అతడ్ని పూర్తిగా నమ్మిన సదరు యువతి దాదాపు 30వేల రూపాయలు అతడి అకౌంట్‌కు బదిలీ చేసింది. కొద్దిరోజుల తర్వాత ఆ యువతి ఆనంద్‌పై అనుమానం వ్యక్తం చేయగా.. ఆమెకు చెందిన ప్రైవేట్ చిత్రాలు, వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి, అతడిపై పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్‌తో పాటు అతడికి సహకరిస్తున్న మరో యువకుడ్ని అరెస్ట్ చేశారు. ( ఏసీ ప్రమాదం: బీజేడీ నేతతో సహా ముగ్గురి మృతి) -
‘థప్పడ్’ను కబీర్ సింగ్‌కు సమాధానంగా తీశారా?!
నటి తాప్సీ పన్ను తాజాగా నటిస్తున్న చిత్రం ‘థప్పడ్(చెంప దెబ్బ అని అర్థం)’. ఈ సినిమా ట్రైలర్ గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ట్రైలర్లో అందరి ముందు భర్త చేత చెంపదెబ్బ తిన్న మహిళా.. ఆ తర్వాత భర్తతో క్షమాపణ చెప్పించడానికి చేసే న్యాయపోరాటం చూస్తే ఆత్మ గౌరవం ఉన్న మహిళాగా ఈ సినిమాలో తాప్సీ కనిపించనున్నారని అర్థంమైపోతుంది. దీంతో దర్శకుడు అనుభవ్ సిన్హా ‘థప్పడ్’ను ఇటీవలె విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన షాహీద్ కపూర్ ‘కబీర్ సింగ్’కు సమాధానంగా రూపొందిచారంటూ బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్యూలో తాప్పీని ఇదే విషయం అడగ్గా.. కబీర్ సింగ్‌కు సమాధానంగా ‘థప్పడ్’ రూపొందించ లేదని స్పష్టం చేశారు. ‘కబీర్ సింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా రూపొందించామనడంలో ఏ మాత్రం వాస్తవం లేదు. ఒక సినిమాకు సమాధానంగా మేము సినిమా తీశామని అందరూ అనుకుంటున్నారని తెలియగానే బాధగా అనిపించింది. ‘థప్పడ్’ను దర్శకుడు అనుభవ్ సింగ్ ‘కబీర్ సింగ్’ విడుదలకు ముందే రచించారు. నేను ‘థప్పడ్’ను ఒక ట్రిగ్గర్గానే భావిస్తున్నాను’ అంటూ సమాధానం ఇచ్చారు. కాగా భార్యభర్తల మధ్య ఉండే అనుబంధం, వారి మధ్య చోటు చేసుకునే సంఘటనలను గురించిన మరెన్నో విషయాలను ‘థప్పడ్’లోచూపించబోతున్నట్లు ఆమె చెప్పారు ఇక ‘కబీర్ సింగ్’లో హీరోయిన్, హీరో చేతిలో పలుమార్లు చెంపదెబ్బ తిన్నా కూడా సర్థుకుపొయినట్లుగా చూపించారు. దీనిపై తాప్సీ మట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇదేం కొత్త విషయం కాదు. ‘కబీర్ సింగ్’ ఇప్పుడు తాజాగా వచ్చింది కాబట్టి అందరూ ‘థప్పడ్’ను దానికి సమాధానంగా భావిస్తున్నారు’ అని అన్నారు. అదేవిధంగా ‘నేను ఎప్పటికీ ‘కబీర్ సింగ్’ అలాంటి సినిమాల్లో నటించను. ఈ సినిమా విడుదలై తీవ్ర విమర్శల్లో సైతం కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హీట్ సాధించింది.. ఇందుకు చిత్ర నిర్మాతలకు, బృందానికి నా శుభకాంక్షలు’ అని అన్నారు. అయితే ‘కబీర్ సింగ్’లో నటించడానికి ఒకవేళ తనని సంప్రదించి ఉంటే నటించడానికి ఒప్పుకునే దానిని కాదని తాప్సీ చెప్పుకొచ్చారు. -
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్
కియరా అద్వానీ ‘లస్ట్ స్టోరీస్’లో కోరికలున్న టీచర్‌గా చేసింది. ‘స్పెర్మ్’ తారుమారు కాగా మరొకరి బిడ్డను గర్భాన మోసే తల్లిగా ‘గుడ్ న్యూస్’లో నటించింది. కబీర్ సింగ్‌లో పెళ్లికి ముందే బోయ్ ఫ్రెండ్‌తో సామీప్యానికి వెరవని ప్రియురాలిగా నటించింది. అదే కియరా అద్వానీ ‘భరత్ అనే నేను’లో తెలుగువారికి నచ్చినట్టుగా ఎంతో అందంగా కనిపించింది. ఆమెకు అందం ఉంది. ఆమెలో పాత్ర కోసం చేయదగ్గ సాహసం ఉంది. కియరా ఇప్పుడు బాలీవుడ్‌ను తన చుట్టూ తిప్పుకుంటోంది. 2018 కియారా అద్వానీ కెరీర్లో ముఖ్యమైన సంవత్సరం. ఆ సంవత్సరంలోనే ఆమె రెండు సినిమాలు రిలీజయ్యాయి. థియేటర్లలో ‘భరత్ అనే నేను’. నెట్‌ఫ్లిక్స్‌లో ‘లస్ట్ స్టోరీస్’. భరత్ అనే నేనులో కియరా ముఖ్యమంత్రి అయిన మహేశ్‌బాబుకు గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపిస్తుంది. చక్కటి ఆహార్యంలో ముగ్ధ రూపంలో మహేశ్‌ను ఆమె ఆకట్టుకుంటుంది. కాని ‘లస్ట్ సోరీస్’లో ఆమె కథ వేరు. ఆమెకు ఆ సినిమాలో భర్త ఉంటాడు. అతనితో సాన్నిహిత్యానికి వంక ఉండదు. కాని అది ఆమెకు సరిపోదు. అలా సరిపోక పోవడం మన సంస్కృతిలో నిషిద్ధ చర్చాంశం. దాని గురించి ఎవరూ మాట్లాడరు. అలాంటిది అసలు ఉన్నట్టుగా తెలియనట్టే నటిస్తుంటారు. ఆ సినిమాలో కియరా పాత్ర తనకు కోరిక ఉన్నట్టు గ్రహిస్తుంది. భర్త ఉన్నా భర్త ఇవ్వదగినది ఇస్తూ ఉన్నా చాలనంత కోరిక ఉన్నట్టు గ్రహిస్తుంది. కోరిక ఉన్నట్టు గ్రహించడం ఏం తప్పు. అడ్డదారులు తొక్కకుండా దానిని ఆమె వ్యక్తపరచడమే ఆ సినిమాలో తప్పు అవుతుంది. అత్తగారు ఆమెను అనాదరిస్తుంది. భర్త దూరమవుతాడు. కాని భర్త ఆమెను పూర్తిగా అర్థం చేసుకొని చివరకు చేరువ అవుతాడు. కియరా అద్వానీ ఆ పాత్రను నిర్వహించిన తీరును అందరూ మెచ్చుకున్నారు. ఒకవైపు భరత్ అనే నేను పెద్ద హిట్ అయ్యింది. లస్ట్ స్టోరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ అయ్యింది. కియరా అద్వానీ తిరుగులేని స్టార్‌గా అవతరించింది. కియరా అద్వానీ డబ్బున్న కుటుంబంలో (1992) జన్మించింది. ఆమె తండ్రి సింధి. తల్లిది ముస్లిం–ఐరిష్ జాతీయతలు ఉన్న కుటుంబ నేపథ్యం. తల్లికి యాడ్స్ చేయడం సరదాగా ఉండేది. కియరా చిన్నప్పుడే తల్లితో కలిసి విప్రో బేబీ ప్రాడక్ట్స్ యాడ్‌లో నటించింది. ఇంకో ఇద్దరు తమ్ముళ్లు ఉండే ఇంటికి పెద్ద కూతురుగా పుట్టిన కియరాను తండ్రి ఏ మాత్రం గ్లామర్ ఫీల్డ్‌లో రాకూడదని కోరుకున్నాడు. కాని కియరాకు సినిమాల్లో నటించాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. ఇది ఎంత తండ్రికి చెప్పినా వినేవాడు కాదు. కాని చిత్రంగా ఆయన మనసు మారింది. దానికి కారణం రాజు హిర్వాణి తీసిన ‘త్రీ ఇడియట్స్’ సినిమా. పిల్లలను వారికి ఏది నచ్చితే అది చేయనివ్వాలి, దేనిలో వారు రాణిస్తారో ఆ రంగంలో ప్రవేశపెట్టాలి అని ఆ సినిమా చెబుతుంది. అది చూసిన కియరా తండ్రి ఆమెకు సినిమాల్లో వెళ్లమని పర్మిషన్ ఇచ్చాడు. అయితే నిర్ణయాలు తీసుకోవడంతో పని అయిపోదు. దానికి పని చేయాల్సి ఉంటుంది. సినిమాల్లో అంటే ఇంకా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. కియరా అద్వానీ తల్లి జెనివైవ్ జాఫ్రీ సల్మాన్ ఖాన్‌కు స్కూల్ ఫ్రెండ్. కియరా చిన్నప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌కు తెలుసు. కియరా సినిమాల్లోకి వద్దామని నిశ్చయించుకున్నాక ఆమెను పేరు మార్చుకోమని సల్మాన్ ఖానే సలహా ఇచ్చాడు. ఎందుకంటే కియరా అసలు పేరు ఆలియా అద్వానీ. ఆలియా భట్ అప్పటికే సినిమాల్లో ప్రశేశిస్తూ ఉండటంతో కియరాను కొత్తపేరు పెట్టుకోమని చెప్పాడు. ఒక సినిమాలో ప్రియాంక చోప్రా పాత్రకు కియరా అనే పేరు ఉంటుంది. కియరా కూడా అదే పేరు పెట్టుకుని కియరా అద్వానీ అయ్యింది. సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ పరిచయం అవకాశాలు కల్పించగలవుగానీ సక్సెస్‌ను గ్యారంటీ చేయలేవు. కియరా అద్వానీ ‘ఫగ్లీ’ (2014) అనే కామెడీ సినిమాతో ఆరంగేట్రమ్ చేసింది. ఇంతటితో తాను సినిమాల్లో దూసుకెళతానని కలలు కంది కాని ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. సినిమా రంగంలో ఫ్లాప్ అనేది అన్నీ దారులను మూసివేసే తాళం కప్పలాంటిది. కియరా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అవార్డు ఫంక్షన్స్‌కు వెళితే చివర కూచోబెట్టేవారు. అవకాశాలు కోరితే ముఖం తిప్పుకునేవారు. తల్లిదండ్రులు ఆమెను చూచోబెట్టి ఒక్కమాట చెప్పారు. ‘అసలు నీ సినిమా రిలీజయ్యిందని మర్చిపో. తిరిగి మొదటి నుంచి మొదలెట్టు’ అని. ‘ఇందులో కొనసాగాలంటే మళ్లీ ప్రయత్నించాల్సిందే’ అన్నారు. కియరా ప్రయత్నించింది. ‘ఎం.ఎస్.ధోని’ సినిమాలో కియరాకు ధోని భార్య పాత్ర లభించింది. అయితే అది చిన్నది. ఆ తర్వాత ‘మెషీన్’ అనే సినిమాలో సోలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. సరిగ్గా అప్పుడు కరణ్ జొహర్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది కియారాకు. ఆ సినిమాయే ‘లస్ట్ స్టోరీస్’. స్త్రీల లైంగికతను చర్చించే ఈ సినిమాలో కియారాది ఒక స్కూల్ టీచర్ పాత్ర. అందులో ఆమె ఒక సన్నివేశంలో వైబ్రేటర్ వాడినట్టుగా కనిపించాల్సి ఉంటుంది. అయినా కియరా ఆ పాత్ర చేసింది. కుటుంబం, నేపథ్యం, ఇన్హిబిషన్స్ ఇవన్నీ పక్కనపెట్టి కియరా నటించడం పాత్రను పాత్రలా చూడటం అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో తెలుగు నుంచి ‘భరత్ అనే నేను’ భారీ హిట్ కావడంతో కియరా ఇరుభుజాలకు రెక్కలు మొలుచుకొచ్చాయి. ఆమె ఎగరడం మొదలుపెట్టింది. తెలుగులో భారీ హిట్ అయిన అర్జున్ రెడ్డి హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ అవుతున్నప్పుడు హీరోయిన్ పాత్రకు కియరాను దర్శకుడు సందీప్ రెడ్డి ఎంచుకోవడం సరైన నిర్ణయమే అని రిలీజ్ అయ్యాక తేలింది. అందులో షాహిద్ కపూర్ వంటి సీనియర్ నటుడికి సరిజోడుగా కియరా నటించగలిగింది. కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో కియరా టాప్ క్లాస్ హీరోయిన్గా అవతరించింది. ఆమె తాజా సినిమా ‘గుడ్ న్యూస్’ నూరు కోట్ల కలెక్షన్‌ను దాటింది. కియారా ఇప్పుడు అక్షయ్ కుమార్ పక్కన, యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ పక్కన రెండు వేరు వేరు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ఒకదానికి ‘కాంచన’ సిరీస్ ఆధారం. దర్శకుడు లారెన్స్. తెలుగు సినిమా వల్ల కూడా ఎదిగిన కియరా ఇప్పుడు తెలుగుకు అందనంత ఎత్తుకు చేరుకుంది. ఆమె తిరిగి తెలుగులో నటించాలనంటే అంత అందమైన పాత్ర, అంత బోల్డ్ కేరెక్టర్ ఆఫర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సినిమా వస్తుందనే ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
2019: బుక్‌మై షోలో రికార్డు సృష్టించిన సినిమాలు
భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. బయోపిక్ ట్రెండ్లను దాటి ఇప్పుడు మరో ముందడుగు వేసింది. దేశంలో చోటు చేసుకుంటున్న ప్రధాన సంఘటనలను కూడా తెరకెక్కించవచ్చని ఉరి: ద సర్జికల్ స్ట్రైక్, మిషన్ మంగళ్ నిరూపించాయి. కొత్తదనాన్ని కోరుకుంటున్న జనం చిన్న సినిమాలను ఆదరిస్తున్నారని ప్రాంతీయ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. సినిమా విజయం సాధించింది అని చెప్పడానికి కావాల్సిన కొలమానాలు మారిపోయాయి. కేవలం కలెక్షన్లు వచ్చిన సినిమాలే కాకుండా ప్రేక్షకులు అక్కున చేర్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ పరీక్షలో పాస్ అయినట్టు లెక్క. ఇది కొత్తసంవత్సరంలోనూ కొనసాగనుంది. ఇక ఈ ఏడాది భారత చిత్రపరిశ్రమలో సాహసాలు చేసిన సినిమాలు కొన్ని అంచనాలకు మించి సక్సెస్ అవుతే మరికొన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. సినిమా బాగుందంటే చాలు.. ప్రాంతీయ, జాతీయ బేధాలను లెక్క చేయకుండా ఆ సినిమాలను నెత్తిన పెట్టుకుని ఆదరించడమే భారతీయ చిత్ర పరిశ్రమ లక్షణం. ఈ క్రమంలో 2019కు గానూ జాతీయ అంతర్జాతీయ సినిమాలు ఏవి టాప్‌లో నిలిచాయో రౌండేద్దాం.. బుక్‌మైషోలో రికార్డు ఒకప్పటిలా సినిమా చూడాలంటే పొద్దునే లేచి బారెడంత క్యూలో నిలబడాల్సిన పని లేదు. సినిమా విడుదల కాక ముందే ఫోన్లో ఉన్న యాప్‌తో టికెట్ కొనేసి రెడీగా ఉండచ్చు. ఇలాంటి యాప్‌లు ఈ మధ్య కాలంలో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అయితే సినిమా టికెట్లతో పాటు, పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలకు సైతం టికెట్లు బుక్ చేసుకునే ‘బుక్ మై షో’ ఓ ముఖ్య విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం ఈ ఏడాది బుక్‌మైషోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా ‘అవెంజర్స్: ది ఎండ్‌గేమ్’ అనే హాలీవుడ్ మూవీ రికార్డు సృష్టించింది. 5.7 మిలియన్ల టికెట్ల అమ్మకాలతో భారతీయ చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ రెండో స్థానంలో చోటు దక్కించుకుంది. విమ టాప్ టెన్ ఇండియన్ సినిమాలు ► అవెంజర్స్: ఎండ్‌గేమ్ ► ఉరి: ద సర్జికల్ స్టైక్ ► కబీర్ సింగ్ ► సాహో ► వార్ ► ద లయన్ కింగ్ ► మిషన్ మంగళ్ ► సింబా ► గల్లీబాయ్ ► చిచోరే భారత్‌లో హవా కనబర్చిన అంతర్జాతీయ సినిమాలు జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్ వండర్ వెధరింగ్ విత్ యు పాడింగ్టన్ 2 బ్లూ ప్లానెట్ 2 హస్ట్లర్స్ విలేజ్ రాక్‌స్టార్స్ మైల్ 22 హరే కృష్ణ ఎ ప్రైవేట్ వార్ టాప్ 5 తెలుగు సినిమాలు ⇔ సైరా సరసింహ రెడ్డి ⇔ సాహో ⇔ మహర్షి ⇔ ఎఫ్2 ⇔ మజిలీ టాప్ 5 బెంగాలీ సినిమాలు ♦ దుర్గేష్గోరర్ గుప్తోధోన్ ♦ గుమ్నామీ ♦ కొంఠో ♦ మిటిన్ మషి ♦ గోట్రో టాప్ 5 తమిళ సినిమాలు ⇒ బిగిల్ ⇒ పేట ⇒ విశ్వాసం ⇒ నెర్కొండ పార్వై ⇒ ఖైదీ టాప్ 5 మరాఠీ సినిమాలు • ముంబై పుణె ముంబై 3 • ఠాక్రే • హిర్కానీ • ఆనంది గోపాల్ • భాయ్- వ్యక్తి కి వల్లి -
గూగుల్ ట్రెండింగ్.. ‘కబీర్‌సింగ్’ ఈజ్ కింగ్
సాక్షి, హైదరాబాద్: 2019లో ఇండియన్ నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన వాటిలో నగరవాసి, టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి రూపొందించిన కబీర్‌సింగ్ చిత్రం దుమ్మురేపింది. హీరో విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా మార్చిన అర్జున్‌రెడ్డి సినిమా బాలీవుడ్లో కబీర్‌సింగ్‌గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో విజయ్ పోషించిన పాత్రను హిందీలో షాహిద్‌కపూర్, అతడికి జంటగా కియారా అద్వానీ నటించిన ఈ చిత్రానికి కూడా సందీప్రెడ్డియే దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా.. తాజాగా దేశంలోనే గూగుల్‌లో ట్రెండింగ్ అయిన వాటిల్లో ఓవరాల్‌గా టాప్–5లో నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్ టాప్‌లో క్రికెట్ కప్.. అత్యధికంగా నెటిజన్లు గూగుల్ సెర్చ్ చేసిన వాటిలో క్రికెట్ వరల్డ్ కప్ తొలి ప్లేస్‌లో నిలిచింది. దేశంలో జరిగిన లోక్ సభ ఎన్నికలు రెండో స్థానంలో, చంద్రయాన్–2 అంతరిక్ష ప్రయోగం 3వ స్థానం దక్కించుకోగా కబీర్ సింగ్ సినిమా 4వ స్థానాన్ని, ఎవెంజర్స్ ది ఎండ్‌గేమ్ 5వ స్థానాన్ని అందుకున్నాయి. నృత్యం, అందం కోసం అన్వేషణ.. నగరాల్లో డ్యాన్స్ క్లాసెస్‌పై పెరుగుతున్న ఆసక్తికి గూగుల్ ట్రెండింగ్ జాబితా అద్దం పట్టింది. ఈ ఏడాది తమకు దగ్గర్లో ఉన్న వాటి గురించి నెటిజన్లు జరిపిన అన్వేషణలో నృత్య శిక్షణ తరగతులు మొదటి స్థానంలో ఉన్నాయి. అందాన్ని తీర్చిదిద్దే సెలూన్ల వెదుకులాట రెండో స్థానాన్ని ఆక్రమించగా.. ఆహార్యాన్ని మెరిపించే కాస్ట్యూమ్స్ (దుస్తులు) మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ జాబితాలో మొబైల్ ఫోన్లు 4వ స్థానంలో, చీరల షాపులు 5వ స్థానంలో నిలిచాయి. సినిమాల్లో కబీర్‌సింగ్ టాప్.. నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన చిత్రాల్లో తెలుగు దర్శకుడు రూపొందించిన కబీర్‌సింగ్ చిత్రం ఈ ఏటి మేటి సెర్చ్‌గా ప్రథమస్థానం అందుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా హాలీవుడ్ చిత్రాలు అవెంజర్స్ ఎండ్‌గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్, సూపర్ 30 నిలిచాయి. పాటల్లో.. లే ఫొటో లే.. నెటిజన్లు ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన పాటల్లో రాజు రావల్, మహీందర్ చౌదరిలు పాడిన ఆల్బమ్ సాంగ్ ‘లే ఫొటో లే’తొలిస్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా హిమేశ్ రేష్మియా పాడిన తెరీ మేరీ కహానీ, మోస్ట్ వాంటెడ్ ఆల్బమ్ కోసం బిందా అజులా, బాబీ లాయల్లు పాడిన తేరీ ప్యారీ ప్యారీ దో అఖియా, ధ్వని భన్సాలి, నిఖిల్ డిసౌజాలు పాడిన వాస్తే ఆల్బమ్‌లోని వాస్తే టైటిల్ సాంగ్, లూకా చుప్పి సినిమాలోని టోని కక్కర్ పాడిన కోకోకోలా తూ.. ఉన్నాయి. క్రికెట్‌కే కిరీటం.. సహజంగానే క్రీడా పోటీలకు సంబంధించిన అన్వేషణలో క్రికెట్ వరల్డ్ కప్ నంబర్ వన్ పొజిషన్ దక్కించుకుంది. ఇక ప్రో కబడ్డీ లీగ్, వింబుల్డన్, కోపా అమెరికా, ఆస్ట్రేలియన్ ఓపెన్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఫలితాల వార్తలకే ప్రథమ తాంబూలం.. తాము తెలుసుకోవాలనుకున్న వార్తలకు సంబంధించి నెటిజన్లు అత్యధికంగా అన్వేషించిన వాటిలో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వార్తలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో.. చంద్రయాన్ 2, ఆర్టికల్ 370, ప్రధానమంత్రి కిసాన్ యోజన, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. అభినందన్‌కి అగ్రస్థానం.. వ్యక్తుల గురిం చి నెటిజన్ల అన్వేషణలో పాక్ ముష్కరుల చేతికి చిక్కి క్షేమంగా విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ప్రముఖ సినీగాయని లతా మంగేష్కర్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, సూపర్ 30 కోచింగ్ సెంటర్ ద్వారా విద్యార్థులకు ఉచిత బోధన చేస్తూ, హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 బయోపిక్కు నేపథ్య కథానాయకుడిగా మారిన ఆనంద్‌కుమార్ 4వ స్థానంలో ఉండగా, బాలీవుడ్ సంచలన యువ నటుడు విక్కీ కౌశల్ (యురి సినిమా ఫేమ్) 5వ స్థానం దక్కించుకున్నాడు. ఆర్టికల్ 370 ఏమిటి? కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆర్టికల్ 370 అంటే ఏమిటి? అనేది తెలుసుకోవాలని నెటిజన్లు బాగా ఆసక్తి చూపించారు. ఈ ఏడాది వాట్ ఈజ్... అంటూ నెటిజన్లు సెర్చ్ చేసిన వాటిల్లో ఆర్టికల్ 370 టాప్ ప్లేస్‌లో ఉంది. ఎన్నికల్లో పోలింగ్ అయిన వెంటనే వచ్చే ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటో తెలుసుకోవాలనే అంశం రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బ్లాక్‌హోల్, హౌడీ మోడీ, ఈ–సిగరెట్లు ఉన్నాయి. ఎలా ఓటు వేయాలి..? తెలియని పనులు ఎలా చేయాలో తెలుసుకోవడం గురించి గూగుల్‌లో సెర్చ్ చేసిన నెటిజన్లలో అత్యధికులు ‘హౌ టు ఓట్’అంటూ అన్వేషించారు. ఆ తర్వాత క్రమంలో వరుసగా ఆధార్‌ను పాన్‌కార్డ్‌కి ఎలా లింక్ చేయాలి? ఓటర్ జాబితాలో నా పేరు ఎలా చెక్ చేసుకోవాలి? నీట్ పరీక్ష ఫలితం ఎలా తెలుసుకోవాలి? ట్రాయ్ ప్రకారం చానల్స్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? వంటివి ఉన్నాయి. -
ఈ ఏడాది చాలా స్పెషల్
‘2019 నాకు స్పెషల్‌గా నిలిచింది. నటిగా నేను గుర్తుంచుకోదగ్గ సంవత్సరం ఇది’ అంటున్నారు కియారా అద్వానీ. బాలీవుడ్లో కియారాకు ఈ ఏడాది అద్భుతంగా సాగింది. ఈ విషయం గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ – ‘‘ఈ ఏడాది నేను నటించిన ‘కబీర్ సింగ్’ ఘన విజయాన్ని అందుకుంది. 300 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ప్రేక్షకులు అందించిన ప్రేమ మాటల్లో చెప్పలేను. తొలిసారి లేడీ ఓరియంటెడ్ మూవీ (‘ఇందూ కీ జవానీ’) చేస్తున్నాను. ‘కళంక్’లో చేసిన స్పెషల్ సాంగ్ మంచి పేరు తెచ్చిపెట్టింది. అలానే ఈ ఏడాదిని ‘గుడ్‌న్యూస్’ సినిమాతో ముగించబోతున్నాను. ఇందులో అక్షయ్ కుమార్, కరీనాకపూర్‌లతో యాక్ట్ చేసే ఛాన్స్ లభించింది. వచ్చే ఏడాది కూడా ఇలానే కొనసాగాలనుకుంటున్నాను’’ అన్నారామె. -
జాన్వీ డౌట్
చదువు, ఆటల్లో తప్ప ఒక మనిషికి ఉండే సున్నితత్వం, మర్యాద, మన్నన వగైరా ఏదీ లేని వ్యక్తిని హీరోగా, హృదయ బద్ధలైన ప్రేమికుడిగా చూపించి హిట్టయి.. అంతే సంచలనం రేపిన తెలుగు, హిందీ సినిమాలు.. అర్జున్‌రెడ్డి, కబీర్ సింగ్! ‘తోచినట్టు’ ఉండడం.. ‘నచ్చింది’ చేయడం.. హీరోయిజంగా తెరమీద చూపిస్తే ఎంత ప్రమాదమో.. ఎంత అనర్థమో చెప్పడానికి ఇటీవల ‘టిక్‌టాక్’ స్టార్ అశ్వని కుమార్ అలియాస్ ‘జానీ దాదా’ చేసిన హత్యే ఉదాహరణ. తాను ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే విషయం తెలిసి ఆగ్రహావేశాలతో ఆ అమ్మాయిని చంపి.. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు జానీ. సదరు టిక్‌టాక్ ‘జానీ దాదా’ కబీర్ సింగ్ సినిమా చూసి తీవ్ర ప్రభావం చెందినట్టు పోలీసులు చెప్పడాన్ని బట్టి తెలుస్తోంది. పాపం.. ఈ లేటెస్ట్ న్యూస్ తెలీకో ఏమో మరి జాన్వీ కపూర్ ‘‘మగవాళ్లు ఎలా ఉన్నా హీరోలా చూపిస్తారు.. మరి ఆడవాళ్ల నెత్తినెందుకు మర్యాద, సంప్రదాయం, ఆచారం అంటూ తట్టెడు బరువును నెడతారు? లేడీస్‌ను కూడా లేడీ అర్జున్‌రెడ్డి, లేడీ కబీర్ సింగ్లా ఎందుకు చిత్రీకరించరు?’’ అంటూ ప్రశ్నించింది.. ‘జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ’ వేదిక మీద. ‘‘బాందిని సినిమాలో నూతన్ పోషించిన పాత్రే అన్నిటి కన్నా బెస్ట్ ఫిమేల్ రోల్’ అని కూడా అంది ఈ యువనటి. -
కబీర్‌సింగ్ ఎఫెక్ట్.. యువతిని చంపిన టిక్‌టాక్ స్టార్
‘కబీర్ సింగ్’ సినిమాపై ఇప్పటికీ ఎన్నో విమర్శలు తలెత్తాయి. తెలుగు సినిమా ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో లో మహిళలను తక్కువ చేసి చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్ లేని వ్యక్తిగా చూపించారని చాలా మంది విమర్శించారు. ఈ సినిమా గురించి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అటు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, ఇటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తలపట్టుకుంటున్నారు. అయితే విమర్శలను కాదని కలెక్షన్లలో ఈ సినిమా దూసుకుపోయిది. సినిమా విడుదలై దాదాపు 4 నెలలు దాటినా.. కబీర్ సింగ్ టీమ్‌కు విమర్శలు తప్పడం లేదు. తాజాగా ఈ చిత్ర యూనిట్‌కు మరో సమస్య వచ్చి పడింది. ‘కబీర్ సింగ్’ చిత్రం ప్రభావంతో ఓ యువకుడు తాను ప్రేమించిన యువతికి పెళ్లికుదిరిన సంగతి తెలిసి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెను చంపి... పోలీసులు పట్టుకుంటారన్న భయంతో తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశ్వని కుమార్ అలియాస్ జానీ దాదా అలియాస్ టిక్‌టాక్ విలన్ ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు తెలిపారు. ‘కబీర్ సింగ్’సినిమా చూసిన అశ్వనికుమార్ ఆ చిత్రంలోని షాహిద్ కపూర్ పాత్రలో ఫిదా అయిపోయాడు. ఆ పాత్రలో తనను తాను ఊహించుకోని.. హీరో లాగే చెడు అలవాట్లకు బానిసయ్యాడు. డ్రగ్స్ తీసుకొని ఆ ఫోటోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసేవాడు. తానే విలన్నంటూ చేతిలో తుపాకితో వీడియోలు చేస్తూ ‘టిక్‌టాక్ విలన్’గా హల్చల్ చేసేవాడు. మరోవైపు ఆశ్వని బిజ్నోర్కు చెందిన నికిత శర్మ(27) అనే యువతిని ప్రేమించాడు. ఆమె అతడి ప్రేమను అంగీకరించలేదు. అయినప్పటీకి ఆమెను అతను విడిచిపెట్టలేదు. ఆ సమయంలోనే నికిత చదువు పూర్తి చేసుకుని దుబాయ్‌కు వెళ్లి అక్కడ ఫ్లైట్ అటెండెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఆమెకు పెళ్లి కుదిరింది. డిసెంబర్లో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న జానీ ఆమెపై పగ పెంచుకున్నాడు. తనకు దక్కని అమ్మాయి మరే అబ్బాయి సొంతం కాకూడదని భావించి ఆమెను చంపేందుకు కుట్రపన్నాడు. డ్రగ్స్‌కు అలవాటు పడి ఉన్మాదిగా మారిన అతను ఆమె ఇంటికి వెళ్లి తుపాకితో కాల్చి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. వారం రోజుల తర్వాత ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఓ బస్సులో ప్రయాణిస్తున్న అశ్వనిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బస్సులో ఉన్న అతను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసును విచారించిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. జానీపై గతంలో మూడు హత్య కేసులు నమోదై ఉన్నాయట. అంతేకాదు అతని టిక్ టాక్ వీడియోల్లో అన్నీ కబీర్ సింగ్‌కి సంబంధించిన వీడియోలే ఉన్నాయి. కాగా, నికిత శర్మ హత్య ఘటనపై ‘కబీర్ సింగ్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించాడు. ఈ ఘటన దురదృష్టకరమని.. ఆ యువతి కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు. ఎవరినీ చంపమని తన సినిమా చెప్పలేదని, ‘కబీర్ సింగ్’ గానీ, ‘అర్జున్ రెడ్డి’ గానీ హత్యలను ప్రోత్సహించేలా తెరకెక్కించలేదని సందీప్ రెడ్డి చెప్పాడు. -
షాహిద్‌కు అవార్డు ఇవ్వకపోవచ్చు!
బాలీవుడ్ హిట్ చిత్రం కబీర్‌సింగ్.. అందులోని కథానాయకుడు షాహిద్‌కపూర్‌కు ఎలాంటి అవార్డులు రాకపోవచ్చని ప్రముఖ దర్శక నిర్మాత ఫరా ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కబీర్‌సింగ్’ నిలిచింది. షాహిద్ కపూర్ కెరీర్లోనే అతిపెద్ద సోలో హిట్‌గా రికార్డులు సృష్టించింది. సందీప్ వంగా దర్శకత్వంలో తెలుగు సినిమా అర్జున్ రెడ్డికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలైనప్పుడు హీరో క్యారెక్టర్, బిహేవియర్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫరా ఖాన్ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. కబీర్‌సింగ్ ఎంత ఘన విజయం సాధించినా, షాహిద్ నటన ఎంత బాగున్నా ఈ సినిమాకు ఎలాంటి అవార్డు రాకపోవచ్చు. ఎందుకంటే సినిమాకు వసూళ్లతో పాటు విమర్శలు కూడా భారీగానే వచ్చాయి. ఎవరైనా అవార్డు ఇవ్వాలనుకునే వాళ్లు ఈ విమర్శల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కబీర్‌సింగ్ చిత్రం విజయం సాధించిన తర్వాత షాహిద్‌కపూర్ స్పందిస్తూ ప్రజల ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చిందనే విషయం స్పష్టమైందన్నారు. ఈ పరిణామం ఇండస్ట్రీకి మరింత ప్రోత్సాహకంగా ఉంటుందని ఆయన తెలిపారు. -
అదే నాకు బిగ్ కాంప్లిమెంట్ : షాహిద్
ముంబై : నిజ జీవితానికి పూర్తి భిన్నంగా ఉండే పాత్ర చేయడం ఒకలాంటి ఉత్సాహాన్నిస్తుందని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అన్నాడు. అతడు నటించిన తాజా చిత్రం ‘కబీర్ సింగ్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అర్జున్‌రెడ్డి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు చేసి..షాహిద్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే మహిళలపై హింసను ప్రేరేపించేదిగా ఉందంటూ ఈ సినిమా ఆది నుంచీ విమర్శలపాలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షాహిద్ కపూర్ స్పందిస్తూ.. ‘కబీర్ సింగ్‌గా నటించడం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిజ జీవితంలో అతడిలా ఉండటం అస్సలు కుదరదు. అయితే అదొక చాలెంజింగ్ రోల్. ఒక వ్యక్తి భావోద్వేగాలను కచ్చితంగా తెరకెక్కించడం కష్టంతో కూడుకున్న పని. కానీ తెలుగు అర్జున్ రెడ్డిలో ఇది సాధ్యమైంది. అందుకే హిందీ రీమెక్‌లో కూడా సహజత్వం ఉండాలని డైరెక్టర్‌కి చెప్పాను’ అని పేర్కొన్నాడు. ఇక తన గత సినిమాల గురించి షాహిద్ మాట్లాడుతూ... ప్రేక్షకులు ఇష్టపడని పాత్రలు చేయడానికి తానెప్పుడు భయపడలేదని చెప్పాడు.‘ ఉడ్తా పంజాబ్‌లో మత్తుకు బానిసైన టామీ సింగ్ అనే కుర్రాడి పాత్రలో నటించినపుడు క్యారెక్టర్ కాకుండా నటనను మెచ్చుకుంటూ థియేటర్ బయటికి వెళ్లాలని భావించాను. ఒక నటుడిగా సాహసమైన పాత్రలను ఎంచుకోవడం ముఖ్యం. అప్పుడే ప్రేక్షకుల మన్నన పొందామా లేదా అన్న విషయం తెలుస్తుంది. ప్రేక్షకులు తెరపైన పాత్రను చూసి అశ్చర్యపోవాలి.. ఏంటి ఇంతలా జీవించేశాడు అనుకునేలా క్యారెక్టర్ ఉండాలి. నిజానికి కబీర్ సింగ్‌ను ప్రేక్షకులు ఇష్టపడటం లేదంటే అదే నాకు పెద్ద ప్రశంస’ అని చెప్పుకొచ్చాడు. -
కలలో కూడా అనుకోలేదు: షాహిద్
బాలీవుడ్ సినిమా ‘కబీర్ సింగ్’ ఊహలకు అందని విధంగా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే ఇండియాలో 270 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయగా, ఆస్ట్రేలియాలో కూడా భారీ కలెక్షన్లను తెచ్చిపెడుతోంది. బాలీవుడ్ సినిమా ఆస్ట్రేలియాలో ఈ తరహాలో కలెక్షన్లు సాధించడం ఇదే మొదటిసారి. కాగా ఇప్పటి వరకు షాహిద్ సినిమాలన్నింటిలో ఏ సినిమా కూడా 200 కోట్లు మించి వసూలు చేయలేదు. తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ 16 సంవత్సరాలు పూర్తి అయినా అన్ని కోట్లు వసూలు చేయడం షాహిద్‌కు ఇదే మొదటిసారి. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో అత్యధిక వసూళ్లను సాధించిన ‘సర్జికల్ స్ట్రైక్’ సినిమాను వెనక్కి నెట్టి కబీర్ సింగ్ మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా షాహిద్.. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు. తన కెరీర్లో అన్ని సినిమాలకంటే ఈ సినిమా విషయంలో ఎక్కువ ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. తన కెరీర్ ప్రారంభంలో ‘మీరు డ్యాన్సర్‌గానే, చాకెలెట్ బాయ్‌గానే సినిమాలు చేయాలి’ అని ప్రజలు అడిగేవారని అయితే ఆ మాటటు కాస్తా నిరాశ పరిచేవని తెలిపారు. తనను తాను అన్ని పాత్రలలో నిరూపించుకోవాలని ఉండేదని, ఈ సినిమాతో ఆ ఆశ తీరిందన్నారు. ఈ సినిమాలో తన కష్టాన్ని ప్రజలు అర్ధం చేసుకొని అభిమానించారన్నారు. కబీర్ సింగ్ ఇంత విజయాన్ని అందించింనందుకు సంతోషంగా ఉందని, కలలో కూడా ఇంత విజయాన్ని సాధిస్తుందని అనుకోలేదన్నారు. ఈ సినిమా విషయంలో తలెత్తిన వివాదాలపై కూడా స్పందించారు. సినిమాలో అతిగా పురుషాధిక్యతను చూపించారని విమర్శకులు ఎత్తి చూపారని అన్నారు. అయితే నిజ జీవితంలో మనం ఎలా ఉన్నమనేదే ముఖ్యమని, మన పిల్లలతో, కుటుంబంతో మంచిగా ఉంటున్నామా.. లేదా... అనేది మనకు ముఖ్యమన్నారు. హీరోలు రోల్ మోడల్‌గా ఉండాల్సిన అవసరం లేదన్న షాహిద్, తన పాత్రకు ఎంత వరకు న్యాయం చేశామన్నదే ముఖ్యమని తెలిపారు. కబీర్ సింగ్ విషయంలో తన పాత్రకు తాను పూర్తి న్యాయం చేశాననే భావిస్తున్నానన్నారు. -
మేబీ అది ప్రేమేనేమో!
మన ఉద్దేశం ఏదైనా అది అవతలి వాళ్లకు ఎలా అర్థమయిందో అదే మన అసలు ఉద్దేశం అవుతుంది! హృదయం అచ్చుయంత్రమై అందులోంచి మన ఉద్దేశాన్ని ప్రింట్ అవుట్ తీసి ఇచ్చినా కూడా ఎవరికి వాళ్లు అర్థం చేసుకున్నదే అచ్చులో ఉన్నది అవుతుంది తప్ప, అచ్చులో ఉన్నది అందరికీ ఒకేలా అర్థమవదు.-మాధవ్ శింగరాజు ‘కబీర్‌సింగ్’ దర్శకుడు సందీప్రెడ్డిఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మిస్‌ఫైర్ అయినట్లే.. నాగపూర్‌లో ఓ యువతి హత్యపై ట్విట్టర్లో తాప్సీ పెట్టిన కామెంటు బ్యాక్‌ఫైర్ అయింది. ‘మేబీ అది కూడా ప్రేమేనేమో’ అని తాప్సీ సందీప్‌రెడ్డిపై సర్కాస్టిక్‌గా చేసిన ట్వీట్ ఏ కొద్దిమందికో అర్థమైనట్లుగా కనిపిస్తోంది. యావద్దేశ ప్రజలందరి ఐక్యూ లెవల్స్ ఒకలా ఉండనట్లే, వాళ్ల ఎత్తిపొడుపు లెవల్సన్నీ ఒకేలా ఉండవు. ఐక్యూ కన్నా ఎత్తిపొడుపు మోర్ కాంప్లికేటెడ్. పైన ఉండే వాళ్ల ఐక్యూను ఒకనాటికి కాకున్నా ఒకనాటికి కింద ఉండేవాళ్లు అందుకోగలుగుతారు. ఐక్యూ కన్నా ఇంకా ఎత్తున ఎత్తిపొడుపు ఉంటుంది కనుక అది ఏనాటికీ సామాన్యుల చేతికి అందదు. ఎంత ఐక్యూ ఉన్నా, ఎత్తిపొడుపును అర్థం చేసుకోలేకపోయారంటే వాళ్లూ సామాన్యుల కిందే లెక్క. ‘సర్కాజం’ అంటారు ఎత్తిపొడుపును ఇంగ్లిష్‌లో. నటి తాప్సీ ట్విట్టర్లో సర్కాస్టిక్‌గా చేసిన ఒక కామెంట్‌పై ఇప్పుడు నెట్లో ఆగ్రహావేశాలు రగులుకుంటున్నాయి. అర్థం కాకపోవడం వల్ల జరిగిన అనర్థం అది. అంత పీక్‌లో ఉంది మరి తాప్సీ సర్కాజం. నాగపూర్‌లో ఒక యువకుడు తన ప్రియురాలి క్యారెక్టర్ని శంకించి, ఆమె తలను మోది చంపేశాడు. దారుణమైన ఘటన. ఇద్దరూ ఫ్రెండ్స్. అతడి పేరు అష్రాఫ్ షేక్. ఆ అమ్మాయి ఖుషీ పరిహార్. ఆమె ఉండటం నాగపూర్‌లో. మోడలింగ్ అంటే ఇష్టం. లోకల్‌గా ఫ్యాషన్ షోలు చేస్తుంటుంది. అలా అష్రాఫ్ పరిచయం. అలాగే మరికొందరు పరిచయం. వాళ్లతో మాట్లాడొద్దంటాడు ఖుషీని. గత శనివారం పంధుర్న–నాగపూర్ హై వే మీద పోలీసులకు ఓ యువతి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. సోషల్ మీడియాలో శోధించి ఆమెను, ఆమె ఫ్రెండ్ అష్రాఫ్నీ గుర్తించారు పోలీసులు. చంపింది తనేనని ఒప్పుకున్నాడు అష్రాఫ్. ఎందుకు చంపావు అంటే.. ‘వేరే మగాళ్లతో కూడా మాట్లాడుతోంది. తన క్యారెక్టర్ మంచిది కాదనిపించి చంపేశాను’ అన్నాడు. చంపడమే ఘాతుకం అనుకుంటే, క్యారెక్టర్ మంచిది కాదని చంపేయడం ఇంకా ఘాతుకం. ఈ ఘాతుకంపైనే తాప్సీ సర్కాస్టిక్‌గా చేసిన కామెంట్ బ్యాక్ ఫైర్ అయింది. ‘మేబీ అతడు ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నాడేమో! మేబీ ఆ పిచ్చి ప్రేమతోనే అతడు ఆమెను చంపేశాడేమో!’ అని తాప్సీ ట్వీట్ చేశారు. ‘కబీర్ సింగ్’ డైరెక్టర్ సందీప్ రెడ్డిని ఎత్తిపొడవడం ఇది. అయితే ట్వీట్లో సందీప్ పేరు లేకపోవడంతో ఈ ఎత్తిపొడుపు ఎవరికీ అర్థమైనట్లు లేదు. అర్థంకాకపోవడం అర్థం చేసుకోలేనివాళ్ల తప్పైతే కాదు. ఈ ఒక్కచోట ఎత్తిపొడుపులో తన ఐక్యూ లెవల్స్‌ని తాప్సీ తగ్గించుకోవలసింది. సున్నితమైన సంగతి కదా. ఆమె సర్కాజం అర్థమైనవాళ్లకు కూడా తాప్సీ ఎవరికో భలే పంచ్ ఇచ్చారని మాత్రమే అనిపిస్తుంది. ఏ కొద్దిమందికో ఆమె సందీప్‌ని అంటున్నారని తెలుస్తుంది.. ఆయన ఇంటర్వ్యూపై జరుగుతున్న రగడను ఫాలో అవుతున్నవారికి. మిగతావాళ్లంతా నిజంగానే తాప్సీ.. ఆ చంపిన యువకుడిని సమర్థిస్తోందనే అనుకున్నారు. ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘కబీర్‌సింగ్’లో హీరో హీరోయిన్ని చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంది. ఇలా స్త్రీ చెంపపై పురుషుడు చెయ్యి చేసుకునే సీన్లు సినిమాలు పుట్టినప్పటి నుంచీ ఉన్నాయి కానీ ఇది కొంచెం వేరుగా ఉంది. ఆ కొట్టడంలో ‘టాక్సిక్ మాస్క్యులినిటీ’ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా చూస్తున్న మగపిల్లల కండల్లోకి విషపూరిత పురుషత్వాన్ని ఇంజెక్ట్ చేసేశాడు డైరెక్టర్.. ప్రియుడి చేత ప్రియురాలిని ఫిజికల్‌గా అసాల్ట్ చేయించి! పైగా అలా కొట్టడాన్ని ప్రేమ అన్నాడు సందీప్‌రెడ్డి అనుపమా చోప్రాతో. ఆమె ఫిల్మ్ క్రిటిక్. ‘‘స్త్రీని తక్కువ చెయ్యడం కదా అది’’ అని అనుపమ అన్నప్పుడు.. ‘‘గాఢమైన ప్రేమలో ఇలాగే జరుగుతుంది. ఇలా జరగలేదంటే అక్కడేం లేనట్లు’’ అని సందీప్ అన్నాడు! ఆయన ఇలా అనడం చెంపదెబ్బ సీన్ కన్నా పెద్ద సీన్ అయింది! ఆయన చెప్పదలచుకున్నది ఏదో ఉంది. దాన్నే డెప్త్కి వెళ్లి మాట్లాడాడు. అంతే డెప్త్కి వెళ్లి తాప్సీ ఆయన్ని ఎత్తిపొడిచారు. ఇంటర్వ్యూలో ఆయన కామెంట్స్ మిస్‌ఫైర్ అయినట్లే, ట్విట్టర్లో తాప్సీ కామెంటు బ్యాక్‌ఫైర్ అయింది. దానిపై మళ్లొక ట్వీట్ పెట్టారు తాప్సీ. ‘‘ఎత్తిపొడుపును అర్థం చేసుకోలేనివాళ్లు దయచేసి నా ట్వీట్‌ను పట్టించుకోకండి. థ్యాంక్యూ, మీరెవరో నాకు తెలియకపోవడం మంచిదైంది’’ అని కామెంట్ పెట్టారు. సందీప్‌రెడ్డి అంతకుముందే తన మాటలపై వివరణ ఇచ్చారు. అది కొంచెం బెటర్ వెర్షన్లో ఉంది. అంటే.. అర్థం చేయించే భాషలో. ‘‘మీరు నా మాటల్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు. కబీర్‌సింగ్ తన ప్రియురాలిని కొట్టడం కొట్టినట్లు కాదు. ఒకరు లేకుండా ఒకరు ఉండలేనంతగా దగ్గరైనప్పుడు కోపాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛను తీసుకోకుండా ఉండలేకపోవడం అది. అమ్మాౖయెనా అంతే, అబ్బాౖయెనా అంతే’’ అని అన్నాడు. ఈ మాట ఎంతమందికి ఎంత మేరకు అర్థమైయిందో మరి. తాప్సీని, సందీప్నీ వదిలేద్దాం. అంతగా డెప్త్ లేని, అంతగా సర్కాజం లేని మనం కూడా నెత్తీనోరూ మొత్తుకుంటూనే ఉంటాం.. ‘నా ఉద్దేశం అది కాదు’ అని చెప్పడానికి. ముఖ్యంగా భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, బాగా దగ్గరి ఫ్రెండ్స్! ఉద్దేశాన్ని వేరేలా అర్థం చేసుకున్నారంటే.. ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారనో, అపార్థం చేసుకున్నారనో కాదు. మన ఉద్దేశం వేరేలా కూడా అర్థమయ్యేలా ఉందని. -
కండలవీరుడికి కబీర్ సింగ్ షాక్
ముంబై : ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ భారత్ మూవీ ఫుల్‌రన్‌లో కనీసం రూ 200 కోట్ల వసూళ్లను అధిగమించలేకపోయింది. రూ 100 కోట్ల క్లబ్‌ను అందుకోలేని అజయ్ దేవ్గన్, రకుల్ ప్రీత్ సింగ్‌ల దీదీప్యార్దే తరహాలో భారత్ ప్రతిష్టాత్మక రూ 200 కోట్ల క్లబ్‌కు కేవలం రూ 3 కోట్ల దూరంలో నిలిచింది. ఫుల్‌రన్‌లో కండలవీరుడి భారత్ మూవీ రూ 197 కోట్లు రాబట్టిందని బాక్సాఫీస్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టే చిత్రంగా భారత్‌పై భారీ అంచనాలుండగా ఈ మూవీ కేవలం కనీసం రూ 200 కోట్ల మార్క్‌ను అధిగమించలేకపోవడం ఆశ్చర్యమేనని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ వంటి స్టార్లతో పాటు మంచి టాక్‌ను అందుకున్నప్పటికీ భారత్ వసూళ్ల సునామీని షాహిద్ కపూర్-కియారా అద్వానీల కబీర్ సింగ్ నిలువరించింది. తెలుగు మూవీ అర్జున్ రెడ్డికి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్ సింగ్ బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
నెక్ట్స్ సూపర్ స్టార్‌తోనే!
తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్, ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాను బాలీవుడ్లో కబీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బిగ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో కబీర్ సింగ్ ఫీవర్ నడుస్తోంది. ఇక సందీప్ తదుపరి ప్రాజెక్ట్‌పై చర్చ జరుగుతోంది. వరుసగా రెండు సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన సందీప్ తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మహేష్‌కు కథ వినిపించిన సందీప్ ఫైనల్ నేరేషన్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని సందీప్ ధృవీకరించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. -
కబీర్ సింగ్ ఎఫెక్ట్.. రూ. 35 కోట్లా?
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని సామెత. మిగతా చోట్ల ఏమో గానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ సామెతను చక్కగా పాటిస్తారు. చేతిలో ఓ హిట్టు పడగానే పారితోషికం భారీగా పెంచేస్తారు నటీనటులు. తాజాగా ఈ సామెతను నిజం చేసే పనిలో పడ్డారట బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. తెలుగులో భారీ విజయం సాధించిన అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. షాహిద్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కబీర్ సింగ్ నిలిచింది. ఈ సినిమా విజయంతో షాహిద్ కపూర్ తన పారితోషికాన్ని భారీగా పెంచారనే వార్తలు వినిపిస్తున్నాయి. తరువాతి చిత్రం కోసం షాహిద్ ఏకంగా రూ. 35 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లువార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల సరసన షాహిద్ కూడా చేరతారు. కబీర్ సింగ్ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకూ రూ. 240 కోట్లు వసూలు చేసింది. -
‘యురి’ని వెనక్కునెట్టిన ‘కబీర్‌సింగ్’
ముంబై: కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచిన కబీర్ సింగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై మూడువారాలు గడిచినప్పటికీ, కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. షాహిద్ కపూర్ కెరీర్లోనే అతి భారీ విజయాన్నిఅందించిన ఈ చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల్లో కబీర్‌సింగ్ చోటు దక్కించుకుంది. యురి-ద సర్జికల్ స్ట్రైక్‌ను 11వ స్థానానికి నెట్టి పదవ స్థానాన్ని కబీర్ సింగ్ కైవసం చేసుకుంది. బాహుబలి 2, దంగల్, సంజు చిత్రాలు ముందు వరుసలో ఉన్నాయి. మిశ్రమ టాక్‌తో ప్రారంభమైన కబీర్ సింగ్ ఎన్నో మైలురాళ్లను తన ఖాతాలో వేసుకుంటూ పోతోంది. కలెక్షన్లతో విమర్శకుల నోళ్లు మూయించిన కబీర్ సింగ్ 2019లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ యేడాది భారీ వసూళ్లను రాబట్టిన సల్మాన్ ఖాన్ ‘భారత్’, విక్కీ కౌశల్ ‘యురి-ద సర్జికల్ స్ట్రైక్’ను వెనక్కు నెట్టి రూ.243 కోట్లతో దూసుకుపోతూ కబీర్ సింగ్ సంచలనాలు సృష్టిస్తోంది. బుధవారం ప్రతిష్టాత్మక భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఉన్నప్పటికీ కబీర్‌సింగ్ కలెక్షన్లపై ప్రభావం పడదని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. జూన్ 21న విడుదలైన కబీర్ సింగ్ హింసాత్మకంగా, అభ్యంతరకరంగా ఉందంటూ విమర్శల దుమారం రేగినప్పటికీ రికార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. -
‘ఎవ్వరినీ తక్కువ చేయ్యలేదు’
తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సందీప్ రెడ్డి వంగా, అర్జున్ రెడ్డి రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ బాలీవుడ్‌లోనూ సంచలనాలు నమోదు చేస్తుంది. అయితే ఈ సినిమాలో షాహిద్ కపూర్.. కియారా అద్వాణీని ముద్దుపెట్టుకునే సన్నివేశాల గురించి సందీప్ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు. సందీప్ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదంగా మారాయి. ఈ మాటల పట్ల నటి సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, జ్వాలా గుత్తా తదితరులు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. దాంతో సందీప్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను అన్న మాటలను మీడియా తప్పుగా అర్థంచేసుకుందని అన్నారు. ‘నన్ను మీడియా తప్పుగా అర్థంచేసుకుంది. ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండదని అన్నాను. అంటే దానర్థం యువకుడు రోజూ తాగి వచ్చి యువతిపై చేయి చేసుకోవాలని కాదు. నేను ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడాను. కానీ దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు’ అన్నారు సందీప్ రెడ్డి. -
క్రిటిక్స్‌పై అర్జున్ రెడ్డి దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయం అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సందీప్, అర్జున్ రెడ్డి రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ బాలీవుడ్‌లోనూ సంచలనాలు నమోదు చేస్తుంది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ సినీ విమర్శకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో మహిళలను తక్కువగా చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్ లేని వ్యక్తిగా చూపించారని విమర్శించారు. కానీ రివ్యూలతో సంబంధం లేకుండా కబీర్ సింగ్ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఫిలిం కంపానియన్ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా క్రిటిక్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాను విమర్శించే వారంతా సూడో స్త్రీవాదులంటూ విమర్శించాడు. వీళ్లంతా ఇండస్ట్రీకి పట్టిన చీడపురుగుంటూ ఘాటుగా స్పందించాడు. సినిమాలోని టెక్నికల్ అంశాలను చర్చించకుండా కొన్ని సీన్స్‌ను మాత్రమే విమర్శిస్తున్నారని ఓ ప్రముఖ ఎనలిస్ట్ పేరును కూడా ప్రస్తావించాడు సందీప్ రెడ్డి వంగా. అంతేకాదు కబీర్ సింగ్‌ను వైలెంట్ సినిమా అంటున్నారు, నా నెక్ట్స్ సినిమాతో వైలెంట్ సినిమా అంటే ఏంటో చూపిస్తా, ఆ సినిమా చూసాక ఈ క్రిటిక్స్ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందన్నారు. తొలి సినిమాతోనే బాలీవుడ్ ఎనలిస్ట్‌లపై విమర్శలు చేసిన సందీప్‌పై మీడియా ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి. సందీప్ ఇంటర్య్వూపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ‘ సందీప్ రెడ్డి వంగా అమాయకత్వంతో కూడిన నిజాయితీ, నిజమైన ధైర్యం కలిగిన వ్యక్తి. కబీర్ సింగ్‌పై ఆయన తాజా ఇంటర్వ్యూ ఓ సంచలనం’ అంటూ ట్వీట్ చేశారు. I think @imvangasandeep is the most perfect mix of innocent honesty and truthful courage ..This interview of his,is as pathbreaking as his #KabirSingh https://t.co/ai1zb0P3iy pic.twitter.com/cqzYCpy91b — Ram Gopal Varma (@RGVzoomin) 7 July 2019