చదువు, ఆటల్లో తప్ప ఒక మనిషికి ఉండే సున్నితత్వం, మర్యాద, మన్నన వగైరా ఏదీ లేని వ్యక్తిని హీరోగా, హృదయ బద్ధలైన ప్రేమికుడిగా చూపించి హిట్టయి.. అంతే సంచలనం రేపిన తెలుగు, హిందీ సినిమాలు.. అర్జున్‌రెడ్డి, కబీర్ సింగ్! ‘తోచినట్టు’ ఉండడం.. ‘నచ్చింది’ చేయడం.. హీరోయిజంగా తెరమీద చూపిస్తే ఎంత ప్రమాదమో.. ఎంత అనర్థమో చెప్పడానికి ఇటీవల ‘టిక్‌టాక్’ స్టార్ అశ్వని కుమార్ అలియాస్ ‘జానీ దాదా’ చేసిన హత్యే ఉదాహరణ. తాను ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే విషయం తెలిసి ఆగ్రహావేశాలతో ఆ అమ్మాయిని చంపి.. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు జానీ.
సదరు టిక్‌టాక్ ‘జానీ దాదా’ కబీర్ సింగ్ సినిమా చూసి తీవ్ర ప్రభావం చెందినట్టు పోలీసులు చెప్పడాన్ని బట్టి తెలుస్తోంది. పాపం.. ఈ లేటెస్ట్ న్యూస్ తెలీకో ఏమో మరి జాన్వీ కపూర్ ‘‘మగవాళ్లు ఎలా ఉన్నా హీరోలా చూపిస్తారు.. మరి ఆడవాళ్ల నెత్తినెందుకు మర్యాద, సంప్రదాయం, ఆచారం అంటూ తట్టెడు బరువును నెడతారు? లేడీస్‌ను కూడా లేడీ అర్జున్‌రెడ్డి, లేడీ కబీర్ సింగ్‌లా ఎందుకు చిత్రీకరించరు?’’ అంటూ ప్రశ్నించింది.. ‘జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ’ వేదిక మీద. ‘‘బాందిని సినిమాలో నూతన్ పోషించిన పాత్రే అన్నిటి కన్నా బెస్ట్ ఫిమేల్ రోల్’ అని కూడా అంది ఈ యువనటి.
Comments
Please login to add a commentAdd a comment