బాలీవుడ్ సినిమా ‘కబీర్ సింగ్’ ఊహలకు అందని విధంగా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే ఇండియాలో 270 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయగా, ఆస్ట్రేలియాలో కూడా భారీ కలెక్షన్‌లను తెచ్చిపెడుతోంది. బాలీవుడ్ సినిమా ఆస్ట్రేలియాలో ఈ తరహాలో కలెక్షన‍్లు సాధించడం ఇదే మొదటిసారి. కాగా ఇప్పటి వరకు షాహిద్ సినిమాలన్నింటిలో ఏ సినిమా కూడా 200 కోట్లు మించి వసూలు చేయలేదు. తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ 16 సంవత్సరాలు పూర్తి అయినా అన్ని కోట్లు వసూలు చేయడం షాహిద్‌కు ఇదే మొదటిసారి. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో అత్యధిక వసూళ్లను సాధించిన ‘సర్జికల్ స్ట్రైక్’ సినిమాను వెనక్కి నెట్టి కబీర్ సింగ్ మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా షాహిద్.. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు. తన కెరీర్లో అన్ని సినిమాలకంటే ఈ సినిమా విషయంలో ఎక్కువ ఆనందంగా ఉన్నట్లు తెలిపారు.
తన కెరీర్ ప్రారంభంలో ‘మీరు డ్యాన్సర్‌గానే, చాకెలెట్ బాయ్‌గానే సినిమాలు చేయాలి’ అని ప్రజలు అడిగేవారని అయితే ఆ మాటటు కాస్తా నిరాశ పరిచేవని తెలిపారు. తనను తాను అన్ని పాత్రలలో నిరూపించుకోవాలని ఉండేదని, ఈ సినిమాతో ఆ ఆశ తీరిందన్నారు. ఈ సినిమాలో తన కష్టాన్ని ప్రజలు అర్ధం చేసుకొని అభిమానించారన్నారు. కబీర్ సింగ్ ఇంత విజయాన్ని అందించింనందుకు సంతోషంగా ఉందని, కలలో కూడా ఇంత విజయాన్ని సాధిస్తుందని అనుకోలేదన్నారు. ఈ సినిమా విషయంలో తలెత్తిన వివాదాలపై కూడా స్పందించారు. సినిమాలో అతిగా పురుషాధిక్యతను చూపించారని విమర్శకులు ఎత్తి చూపారని అన్నారు. అయితే నిజ జీవితంలో మనం ఎలా ఉన్నమనేదే ముఖ్యమని, మన పిల్లలతో, కుటుంబంతో మంచిగా ఉంటున్నామా.. లేదా... అనేది మనకు ముఖ్యమన్నారు. హీరోలు రోల్ మోడల్‌గా ఉండాల్సిన అవసరం లేదన్న షాహిద్, తన పాత్రకు ఎంత వరకు న్యాయం చేశామన్నదే ముఖ్యమని తెలిపారు. కబీర్ సింగ్ విషయంలో తన పాత్రకు తాను పూర్తి న్యాయం చేశాననే భావిస్తున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment