ఈ ఏడాది చాలా స్పెషల్‌ | 2019 Is Very Special Says Kiara Advani | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది చాలా స్పెషల్‌

Published Fri, Dec 13 2019 12:43 AM | Last Updated on Fri, Dec 13 2019 6:17 PM

2019 Is Very Special Says Kiara Advani - Sakshi

కియారా అద్వానీ

‘2019  నాకు స్పెషల్‌గా నిలిచింది. నటిగా నేను గుర్తుంచుకోదగ్గ సంవత్సరం ఇది’ అంటున్నారు కియారా అద్వానీ. బాలీవుడ్‌లో కియారాకు ఈ ఏడాది అద్భుతంగా సాగింది. ఈ విషయం గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ – ‘‘ఈ ఏడాది నేను నటించిన ‘కబీర్‌ సింగ్‌’ ఘన విజయాన్ని అందుకుంది. 300 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ప్రేక్షకులు అందించిన ప్రేమ మాటల్లో చెప్పలేను. తొలిసారి లేడీ ఓరియంటెడ్‌ మూవీ (‘ఇందూ కీ జవానీ’) చేస్తున్నాను. ‘కళంక్‌’లో చేసిన స్పెషల్‌ సాంగ్‌ మంచి పేరు తెచ్చిపెట్టింది. అలానే ఈ ఏడాదిని ‘గుడ్‌న్యూస్‌’ సినిమాతో ముగించబోతున్నాను. ఇందులో అక్షయ్‌ కుమార్, కరీనాకపూర్‌లతో యాక్ట్‌ చేసే ఛాన్స్‌ లభించింది. వచ్చే ఏడాది కూడా ఇలానే కొనసాగాలనుకుంటున్నాను’’ అన్నారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement