
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్‌లో ఎంతటి సంచలన విజయం నమోదు చేసిందో అందరికీ తెలిసిందే! సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీపై బాలీవుడ్ మనసు పడటంతో కబీర్ సింగ్ పేరుతో హిందీ రీమేక్ తీశాడు. అక్కడ కూడా సందీప్ రెడ్డియే డైరెక్టర్. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.370 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు లభించింది. పనిమనిషిగా నటించిన వనిత ఖరత్ తన నటనతో అందరినీ నవ్వించింది. తాజాగా వనిత పెళ్లి పీటలెక్కబోతోంది.
సుమిత్ అశోక్ అనే వ్యక్తితో ఏడడుగులు నడవనుంది. ఇప్పటికే వీరి పెళ్లి పనులు కూడా షురూ అయ్యాయి. ఈ క్రమంలో మెహందీ, హల్దీ ఫంక్షన్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాబోయే నూతన వధూవరులిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: అలా అనడంతో నాన్న పొలానికి వెళ్లి పురుగుల మందు తాగారు: పోసాని
అత్యధిక వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోన్న పఠాన్..
Comments
Please login to add a commentAdd a comment