బాక్సాఫీస్‌ వద్ద ‘కబీర్‌ సింగ్‌’కు భారీ వసూళ్లు | Kabir Singh box office collection day 2 | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ వద్ద ‘కబీర్‌ సింగ్‌’కు భారీ వసూళ్లు

Published Sun, Jun 23 2019 3:23 PM | Last Updated on Sun, Jun 23 2019 7:47 PM

Kabir Singh box office collection day 2 - Sakshi

సాక్షి, ముంబై: షాహిద్‌ కపూర్‌ తాజా సినిమా ‘కబీర్‌ సింగ్‌’  బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. షాహిద్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ ఇచ్చిన  ఈ సినిమాపై అటు విమర్శల నుంచి ప్రశంసల వర్షం కురస్తుండగా.. ఇటు ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజు 20.21 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు ఏకంగా రూ. 22.71 కోట్ల వసూళ్లు సాధించింది. మొత్తానికి రెండు రోజుల్లో బాక్సాఫీస్‌ వద్ద 42.92 కోట్లు సొంతం చేసుకుంది. షాహిద్‌ కెరీర్‌లో సోలో హీరోగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘ఆర్‌.. రాజ్‌కుమార్‌’.. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మొత్తంగా రూ. 66.10 కోట్లు సాధించింది. ఆ రికార్డులను సైతం అధిగమించి తొలి వీకెండ్‌లోనే ‘కబీర్‌ సింగ్‌’ సినిమా రూ. 70 కోట్ల మార్క్‌ను దాటే అవకాశముందని సినీ పరిశీలకులు భావిస్తున్నారు.

షాహిద్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లక్‌బస్టర్‌గా ఈ సినిమా నిలిచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు షాహిద్‌ నటించిన ‘పద్మావతి’  చిత్రం భారీ కలెక్షన్లు సాధించినప్పటికీ.. అది మల్టీస్టారర్‌ మూవీ కావడం.. ఆ సినిమాలో ప్రధాన పాత్ర అయిన రణ్‌బీర్‌ సింగ్‌కు ఎక్కువ క్రెడిట్‌ దక్కడం తెల్సిందే. కబీర్‌ సింగ్‌ తెలుగులో సూపర్‌ హిట్టయిన సినిమా 'అర్జున్‌ రెడ్డి'కి రీమేక్‌. తన ప్రేమికురాలు మరోవ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో  ఓ వైద్య విద్యార్థి స్వీయ విధ్వంసానికి పాల్పడతూ.. ఎలా మారిపోయాడు? అతని ప్రేమకథ ఎలా కొలిక్కి వచ్చిందనేది? ఈ మూవీ సారాంశం. అడ్వాన్స్‌ బుకింగ్‌లో సల్మాన్‌ ఖాన్‌ నటించిన భారత్, ఎవెంజర్స్‌ తర్వాత కబీర్‌ సింగ్‌ 3వ స్థానంలో నిలిచింది. యువత, మాస్‌ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement