‘కబీర్‌సింగ్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. చాలా కాలానికి షాహిద్ కపూర్‌కు మంచి హిట్‌నిచ్చింది ఈ సినిమా. ఎన్నో విమర్శలను ఎదుర్కొని షాహిద్ కపూర్‌కు మంచి ఓపెనింగ్స్‌ను తెచ్చిపెట్టింది. గడిచిన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.70 కోట్లు వసూలు చేయగా మరో రెండు రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోవటం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పద్మావత్ చిత్రం తర్వాత షాహిద్ కపూర్‌కు సోలోగా మంచి హిట్‌నిచ్చింది ‘కబీర్ సింగ్’. ఈ చిత్రం విడుదలైన రోజే రూ. 20 కోట్లు వసూళ్లు చేయగా, రెండో రోజు 22 కోట్లు, మూడో రోజు రూ.27 కోట్లతో వంద కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతొ సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ నెలకొల్పిన రికార్డును ఆదివారం అధిగమించినట్టైంది. సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ‘కబీర్‌సింగ్’పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒకవైపు క్రికెట్ మ్యాచ్‌లు మరోవైపు చిత్రంపై అధికస్థాయిలో విమర్శలు ఉన్నప్పటికీ సినిమా వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు . ప్రస్తుతం అంతటా కబీర్ సింగ్ వేవ్ నడుస్తోందన్నారు.
రికార్డులను బ్రేక్ చేస్తున్న కబీర్ సింగ్
సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూడో రోజు రూ.27 కోట్లు వసూళ్లు చేయగా.. ‘కబీర్‌సింగ్’ కూడా 27కోట్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. 2019 ర్యాంకింగ్స్ ప్రకారం తొలి మూడు రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కబీర్ సింగ్ స్థానం సంపాదించుకుంది. అక్షయ్‌కుమార్ నటించిన కేసరి రూ.78 కోట్లు, రణవీర్‌నటించిన గల్లీభాయ్ రూ.72 కోట్ల కలెక్షన్లతో ముందు వరుసలో ఉండగా రూ. 70 కోట్ల కలెక్షన్లతో కబీర్‌సింగ్ తర్వాతి స్థానంలో నిలిచింది. రూ. 62 కోట్లతో కళంక్ తర్వాతి స్థానానికి పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment