తాజాగా రిలీజైన కబీర్ సింగ్ మూవీ తోలి రోజే 20 కోట్లకు పైగా సంపాదించి, భారీ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. షాహిద్ ఇంతకుముందు నటించిన మల్టీస్టారర్ మూవీ ‘పద్మావతి’ కలెక‌్షన్స్‌ను పక్కకునెడుతూ తన కెరీర్‌లోనే అత్యధిక కలెక‌్షన్స్ రాబట్టిన సినిమాగా ప్రస్తుతం కబీర్ సింగ్ నిలిచింది.
కబీర్ సింగ్ తెలుగులో సూపర్ హిట్టయిన సినిమా 'అర్జున్ రెడ్డి'కి రీమేక్. తన గర్ల్‌ఫ్రెండ్ మరోవ్యక్తిని పెళ్లి చేసుకున్న కారణంగా ఓ మెడికల్ స్టూడెంట్ ఎలా స్వీయ విధ్వంసానికి పాల్పడతాడనేది మూవీ సారంశం.
బాక్సాఫీస్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, అడ్వాన్స్ బుకింగ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన భారత్, ఎవెంజర్స్ తర్వాత కబీర్ సింగ్ 3వ స్థానంలో నిలిచింది. యువత, మాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈ మూవీ విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment