Cinema Collection
-
అది వేసుకుని వచ్చాడని సినిమా టికెట్ ఇవ్వనన్న మల్టీప్లెక్స్ థియేటర్...ఐతే
ఇటీవల చిన్న పెద్ద అంతా బయటకు వస్తే కచ్చితం ఫ్యాంట్ షర్టు లేదా షార్ట్స్ వంటి ఇతర ఫ్యాషెన్ డ్రెస్‌లను ధరంచడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ట్రెండ్ కూడా అదే. ఐతే ఎవరైన సంప్రదాయబద్ధమైన డ్రస్‌లు వేసుకుంటే నోరెళ్లబెట్టడమే కాకుండా రావద్దంటూ నిరాకరిస్తున్నారు. ఏదో చేయరాని నేరం చేసినట్లు చూడటం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక బంగ్లాదేశ్ వ్యక్తి సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చినందుకు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత క్షమాపణలు చెప్పించుకుని తగిన గౌరవాన్ని పొందాడు బంగ్లాదేశ్‌లోని సమాన్ అలీ సర్కార్ అనే వృద్ధుడు మల్టీప్లెక్స్ థియేటర్‌కి లుంగీతో వచ్చాడు. అతను బంగ్లదేశ్ రాజధాని సోనీ స్క్వేర్ బ్రాంచ్‌లో ఉన్న మల్టీపెక్స్ థియేటర్లో 'పురాణ్' అనే ప్రముఖ సినిమాను వీక్షించేందుకు వచ్చాడు. ఐతే థియోటర్ వాళ్లు అతని వేషధారణ చూసి సినిమా టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ విషయం కాస్త సోషల్ మాధ్యమంలో పెద్ద దూమారం రేపింది. దురదృష్టవశాత్తు సదరు మల్టీప్లెక్స్ పై వ్యతిరేక భావన ఏర్పడటమే గాకుండా నెటజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు మల్టీప్లెక్స్ థియేటర్ వెంటనే అప్రమత్తమై సరిచేసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం జరిగిన దానికి వివరణ ఇస్తూ...సదరు వ్యక్తి సమాన్ అలీని, అతని కుటుంబాన్ని సినిమా చూసేందుకు థియోటర్‌కి ఆహ్వానించడమే కాకుండా వారితో తీసుకన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ మల్టీప్లెక్స్ థియేటర్‌కి వచ్చి సినిమా చూడొచ్చు అని, థియేటర్‌కి ఇలానే రావాలనే పాలసీ ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు రెడీ అయ్యి రావచ్చు అని సదరు థియేటర్ యజమాన్యం వివరణ ఇచ్చుకుంది. (చదవండి: తప్పులు సరిదిద్దుకోండి!... కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా) -
చట్టం ఉంది... కమిటీలేవి?
కేరళ హైకోర్టు ఈ నెల 17వ తేదీన ఓ కేసులో తీర్పునిస్తూ సినిమా రంగానికి ఒక ఆదేశం జారీ చేసింది. ఆ ఆదేశం ప్రకారం ప్రతి మూవీ ప్రొడక్షన్ హౌస్‌లోనూ తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ ఉండి తీరాలి. అక్కడి సినిమారంగంలో ఉన్న మహిళల సమాఖ్య ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ చేసిన న్యాయపోరాటంలో భాగంగా ఈ ఆదేశాన్ని జారీ చేసింది హైకోర్టు. మహిళా చైతన్యం మెండుగా ఉన్న కేరళ రాష్ట్రంలో మహిళలు న్యాయపోరాటంతో సాధించుకున్న విజయం అనే చెప్పాలి. సాధికారత సాధనలో పరుగులు తీస్తున్న మహిళలు ఇంకా జెండర్ వివక్ష నుంచి తప్పించుకోవడానికి పెనుగులాడాల్సిన పరిస్థితి. లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది. కానీ చట్టం అమలుకు ఇంకా ఎన్నాళ్లు? ఓ మూడున్నర దశాబ్దాల వెనక్కి, ఈ చట్టం లేని రోజుల్లోకి వెళ్తే... ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ల కేసు గుర్తుకు వచ్చి తీరుతుంది. ∙∙ రూపన్ డియోల్ బజాజ్, ఐఏఎస్ ఆఫీసర్. ఒక మహిళ ఎంత పెద్ద ఆఫీసర్ అయినప్పటికీ పితృస్వామ్య సమాజంలో కేవలం మహిళ మాత్రమేనా! అని సమాజం నివ్వెర పోయిన సంఘటన ఆమె జీవితంలో ఎదురైంది. ఐపీఎస్ ఆఫీసర్ కేపీఎస్ గిల్ నుంచి లైంగికవేధింపును ఎదుర్కోవాల్సి వచ్చిందామె. లైంగిక వేధింపుకు గురయ్యానంటూ న్యాయం చేయమంటూ మనదేశంలో చట్టాన్ని ఆశ్రయించిన తొలి మహిళాధికారి ఆమె. అత్యున్నత స్థాయి అధికారి కావడం వల్లనే ఆమె కనీసం చట్టాన్ని ఆశ్రయించడం అనే సాహసమైనా చేయగలిగారు. అంతకు ముందు ఎంతో మంది చిన్న ఉద్యోగినులు సాటి పురుష ఉద్యోగుల నుంచి వేధింపులు ఎదుర్కొంటూ కూడా నోరు మెదపడానికి ధైర్యం లేని స్థితిలో నలిగిపోయారు. నోరు విప్పిన వాళ్లకు కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి 2013లో ‘సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్, 2013’ వచ్చింది. ఈ చట్టం ప్రకారం పదిమంది ఉద్యోగులు పని చేస్తున్న పని ప్రదేశంలో వారిలో కనీసం ఒక్క మహిళ ఉన్నా సరే... ఈ చట్టం ప్రకారం ఒక కమిటీ ఉండాలి. సంఘటిత రంగాల్లోనే కాక అసంఘటిత రంగాల్లో కూడా ఇలాంటి కమిటీల ఏర్పాటుకు చట్టాలు ఉన్నాయని, సినిమా రంగం గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇందులో తప్పనిసరి... చెబుతున్నారు ప్రముఖ న్యాయవాది పార్వతి. ∙∙∙ ఇదే విషయం మీద ప్రముఖ నటి, గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తించిన జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘మీటూ ఉద్యమ సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక కమిటీ వేసింది. పోలీసు ఉన్నతాధికారులు, యాక్టివిస్టులు, సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమందితో రూపొందిన కమిటీ అది. ఈ కమిటీ విస్తృతి చాలా పెద్దది. లైంగిక వేధింపుల నివారణ మాత్రమే కాదు. ఆడవాళ్లు పని చేసే చోట వాళ్లకు అనువైన వాతావరణం ఉండేటట్లు చూడడం కూడా కమిటీ బాధ్యతే. పెద్ద ఆర్టిస్టులకు సొంత కారవాన్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులకు అలాంటివేవీ ఉండవు. వాళ్లు షూటింగ్ సెట్లో దుస్తులు మార్చుకోవడానికి గదులు, టాయిలెట్ వసతుల వంటివి ఉండేటట్లు చూడాలి. ఆడిషన్ జరిగేటప్పుడు కెమెరా ఉండి తీరాలి. ఈ చట్టం చెప్పిన నియమాలను ఒక చార్ట్ మీద రాసి ప్రొడక్షన్ హౌస్‌లో తగిలించాలి. మొత్తానికి ఉమెన్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కల్పించడం ఈ చట్టం ఉద్దేశం. అయితే మీటూ సమయంలో పెద్ద కదలిక వచ్చింది. కానీ ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌లు జరగకపోవడం వంటి అనేక కారణాలతో ఈ నియమావళి ప్రాధాన్యం కొంత తగ్గిందనే చెప్పాలి. అయితే ‘మా’ నుంచి నేను ఒక మహిళగా నా దృష్టికి వచ్చిన అనేక కేసులను పరిష్కరించాను. అలాగే ఫిలిమ్ చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తమ దృష్టికి వచ్చిన వాటిని పరిష్కరిస్తుంటాయి’’ అన్నారు. సమాజం అభివృద్ధి చెందుతోంది. ఆలోచన స్థాయులు ఆకాశాన్ని అంటుతున్నాయి. మహిళ విషయంలో... మహిళ అయిన కారణంగా ఆమె ఎదుర్కొంటున్న వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి చట్టాలు రూపొందుతున్నాయి. అయితే మనిషి ఆలోచనలను మార్చడంలో వీటి పాత్ర పరిమితంగానే ఉంటోంది. నిజంగా మారాల్సింది మనిషి ఆలోచన. చట్టం వచ్చి దశాబ్దకాలమవుతోంది. ఇంకా కమిటీల నిర్మాణమే పూర్తిస్థాయిలో జరగలేదు. ‘అణచివేత’ అనే దురాలోచనను రూపుమాపగలిగిన సమాజం రావాలి. అది వివేచనతోనే సాధ్యం. కమిటీ ఉంటే కెమెరా ఉన్నట్లే! సర్వేలియన్స్ కెమెరా నిఘాలో ఉన్నామని తెలిస్తే మనిషి ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడో... పని ప్రదేశంలో ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తాడు. ప్రొడక్షన్ హౌస్‌లో ఈ కమిటీ ఉంటే... అది మహిళలకు భరోసానిస్తుంది. కమిటీ ఉందనే ధైర్యం మహిళలకు ఉంటుంది, కమిటీ ఉందనే భయం మగవాళ్లలో ఉంటుంది. – జీవిత రాజశేఖర్, సీనియర్ నటి ఇంకా విస్తరించాలి! పని ప్రదేశంలో మహిళల భద్రత కోసం రూపొందిన ఈ చట్టం ఇంకా విస్తరించాల్సి ఉంది. ఆఫీసుల్లో కొంతవరకు ఉన్నాయి. సినిమా రంగం కూడా దీని అవసరాన్ని గుర్తించింది. అలాగే ఇళ్లలో పని చేసే డొమెస్టిక్ వర్కర్లు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. వాళ్లు ‘లోకల్ కంప్లయింట్స్ కమిటీ’లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులుండాలి. ఇవి ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. అలాగే చట్టసభల మహిళాసభ్యులు ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు. వాళ్లు ఐపీసీననుసరించి పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేయాల్సిందే. ఈ చట్టాన్ని వాళ్లకు కూడా వర్తింప చేస్తూ అసెంబ్లీలో ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – ఇ. పార్వతి, సీనియర్ న్యాయవాది – వాకా మంజులారెడ్డి -
శివరాత్రికి కానుకగా ‘పైసా పరమాత్మ’
కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం 'పైసా పరమాత్మ' . సాంకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ కిరణ్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.. కాగా ఈ చిత్రం మహా శివరాత్రి సందర్బంగా మార్చి 12 భారీగా విడుదల కానుంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాత కిరణ్ కుమార్ తిరుమల, హీరోలు సాకేత్, సుధీర్, నటులు కృష్ణ తేజ, ముక్కు అవినాష్, రమణ, హీరోయిన్స్ ఆరోహి నాయుడు, భనిష, సంగీత దర్శకుడు కనిష్క, కోడైరెక్టర్ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. దర్శక, నిర్మాత కిరణ్ కుమార్ తిరుమల మాట్లాడుతూ.. ' మానవ నిత్య జీవితంలో అందరూ నమ్మేది, నమ్మించేది పైసా.. దానిని బేస్ చేసుకొని 8 క్యారెక్టర్స్ చుట్టూ కథ జరుగుతోంది.. ప్రధానంగా సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం. రెగ్యులర్ సినిమాలా కాకుండా కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా కనిష్క ఇచ్చిన మ్యూజిక్, అర్ అర్ సినిమాకి మెయిన్ హైలెట్. ఆర్ ఆర్ సాంగ్స్ రింగ్ టోన్స్ పెట్టుకుంటారు. అంత అద్భుతంగా కనిష్క్ చేసాడు. అలాగే బాబు ఇచ్చిన విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. సస్పెన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో యాక్షన్ డ్రామా థ్రిల్లర్ చిత్రం ఇది. మార్చి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదు.. అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క మాట్లాడుతూ.. ' డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందిన పైసా పరమాత్మ చిత్రం అందరికీ నచ్చుతుంది. నటీ నటులు అందరూ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ చిత్రంలో రెండు సాంగ్స్ ఒక రిమిక్ సాంగ్ ఉంటుంది.. సినిమా చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. హీరో సాకేత్ మాట్లాడుతూ.. ' ఈ చిత్రంలో హీరోగా నటించే ఛాన్స్ ఇచ్చిన కిరణ్ గారికి ఋణపడి ఉంటాను. అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం.. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందిన ఈ చిత్రం అనేక ట్విస్ట్ లతో సాగుతుంది.. అన్నారు. మరో హీరో సుధీర్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. మా పైసా పరమాత్మ కూడా కొత్త కంటెంట్ తో వస్తోంది. ఆడియెన్స్ అందరూ మా చిత్రాన్ని ఆదరించాలి అన్నారు. నటుడు కృష్ణ తేజ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో నటించాను. నా 14ఏళ్ళు సినీ కేరియర్ లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన చిత్రం ఇది. మెస్మరైజింగ్ చేస్తుంది. ప్రతీ ఒక్కరూ నా క్యారెక్టర్ ని ఓన్ చేసుకుంటారు. అంత అద్భుతంగా కిరణ్ డిజైన్ చేసాడు.. ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా కూడా ఇంకా బాగుంటుంది.. అన్నారు. హీరోయిన్ ఆరోహి నాయుడు మాట్లాడుతూ.. కంప్లీట్ టీం వర్క్ ఇది. డైరెక్టర్ కిరణ్ గారు ప్రతి క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేశాడు. మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను.. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన కిరణ్ గారికి నా థాంక్స్.. అన్నారు. నటి బనిష మాట్లాడుతూ.. ' నేను, అవినాష్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. టీమ్ అందరం చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ముఖ్యంగా కిరణ్ గారు వన్ మాన్ షోలా ఈ చిత్రాన్ని చేశారు. ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది.. అన్నారు. కమిడియన్ ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. కెమెరామెన్ జియల్ బాబు కాల్ చేసి ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఉంది చేయాలి అన్నారు.. కిరణ్ చెప్పిన సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది.. అందరికీ నచ్చుతుంది.. అన్నారు. నటుడు రమణ మాట్లాడుతూ.. కథని నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. ఒక ముఖ్యపాత్రలో నటించాను. సినిమా చూశాను.. చాలా బాగుంది.. అందరికీ నచ్చుతుంది.. అన్నారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ' కిరణ్ గారు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సినిమా బాగా వచ్చింది.. మార్చి 12న విడులవుతుంది.. సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.. అన్నారు. -
చిన్న సినిమాలతో థియేటర్ల సందడి
-
6వ తేది ఆరు సినిమాలు!
సెప్టెంబర్ 6 వతేదీన చిన్న సినిమాలతో థియేటర్లలు సందడి చేస్తున్నాయి. ఆరవ తేదీన ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఏఏ సినిమాలు శుక్రవారం నాడు విడుదలయ్యాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. -
'కబీర్ సింగ్' కలెక్షన్స్ అదుర్స్!
తాజాగా రిలీజైన కబీర్ సింగ్ మూవీ తోలి రోజే 20 కోట్లకు పైగా సంపాదించి, భారీ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. షాహిద్ ఇంతకుముందు నటించిన మల్టీస్టారర్ మూవీ ‘పద్మావతి’ కలెక్షన్స్‌ను పక్కకునెడుతూ తన కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ప్రస్తుతం కబీర్ సింగ్ నిలిచింది. కబీర్ సింగ్ తెలుగులో సూపర్ హిట్టయిన సినిమా 'అర్జున్ రెడ్డి'కి రీమేక్. తన గర్ల్‌ఫ్రెండ్ మరోవ్యక్తిని పెళ్లి చేసుకున్న కారణంగా ఓ మెడికల్ స్టూడెంట్ ఎలా స్వీయ విధ్వంసానికి పాల్పడతాడనేది మూవీ సారంశం. బాక్సాఫీస్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, అడ్వాన్స్ బుకింగ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన భారత్, ఎవెంజర్స్ తర్వాత కబీర్ సింగ్ 3వ స్థానంలో నిలిచింది. యువత, మాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈ మూవీ విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
అన్నా చెల్లెలు
తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ డ్రామాగా పేరున్న ఒక సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. అన్నా చెల్లెల బంధం గురించి చెప్పినప్పుడల్లా ముందు ఈ సినిమాయే గుర్తొస్తుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... ఆ అన్నా చెల్లెలిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఈ ఇద్దరిది మాత్రమే ఒక ప్రపంచం. చెల్లెలికి అమ్మా నాన్న అన్నీ తానై చూసుకుంటాడు అన్న. కష్టపడి ఒక చిన్న మిల్లులో పనిచేయడం దగ్గర్నుంచి మొదలైన అన్న ప్రయాణం, అదే మిల్లుకు ఓనర్‌గా ఎదిగే వరకూ ఏ ఆటూపోటూ లేకుండా సాగింది. అన్న పేరు రాజు. పేరుకు తగ్గట్టే రాజులా ఉంటాడు. చెల్లి రాధకు కొత్తగా వచ్చిన ఈ ఐశ్వర్యమంతా కొత్తగా ఉంది. రాజు ఇప్పుడు ఓనర్‌గా ఉన్న మిల్లులో వర్కర్‌గా పనిచేస్తున్నప్పట్నుంచీ ఉన్న ఒకే ఒక్క మంచి మిత్రుడు ఆనంద్. ఆనంద్‌కు రాధ అంటే ఇష్టం. ఆమెను ప్రేమిస్తున్నాడు కూడా. రాధకూ అతనంటే అంతే ఇష్టం. వీళ్లిద్దరి విషయం మాత్రం రాజుకు తెలియదు. ‘‘ఏం రాజూ! పెళ్లెప్పుడు చేసుకుంటున్నావు?’’ అని ఎవరైనా రాజును అడిగితే, నవ్వి, ‘‘ముందు చెల్లి పెళ్లి చేయాలి కదా’’ అంటుంటాడు. రాధకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే, రాధ పుట్టినరోజును ఘనంగా జరుపుతున్న రోజు, చెల్లి ప్రేమకథ రాజు కంట్లో పడింది. ఆనంద్ మీద చెయ్యి చేసుకొని, అతణ్ని కొట్టి ఇంట్లోంచి తరిమేశాడు రాజు. కోపాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా ఓ ధనవంతుడితో రాధ పెళ్లిని ఖరారు చేశాడు రాజు. ఈ విషయం రాధకు చెప్పాలని అస్సలు ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. ఆ సమయానికి రాధ ఆనంద్‌తో మాట్లాడుతోంది. తోటలో వాళ్లిద్దర్ని కలిపి చూసిన రాజుకు కోపం మరింత పెరిగిపోయింది. తన గదిలోకి పరిగెత్తుకెళ్లి తుపాకీ తీసుకొనివచ్చాడు. ‘‘నాతో వచ్చెయ్ రాధా! మనం ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం.’’ అన్నాడు ఆనంద్, చాలాసేపు రాధ తన మాటలను కేవలం వింటూ ఉండటం చూసి. ‘‘అన్నయ్యకు చెప్పకుండా మనం పారిపోవడమా? అన్నయ్య లేకుండా మన పెళ్లా? క్షమించండి. నేను రాలేను. నా వల్ల కాదు.’’ అంది రాధ భయపడిపోతూ, బాధగా. ఆనంద్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ రాధకు అన్నయ్యను వదిలిపోయేంత ధైర్యం లేదు. నిజానికి ఆ ధైర్యం ఏ చెల్లెలికీ రావొద్దని కోరుకునేంత ఇష్టం ఆమెకు అన్నయ్యంటే. ‘‘మా అన్నయ్యే మన పెళ్లి చేస్తారు. ఆ రోజు వస్తుంది చూడండి. అప్పుడు మీరే బావా బావా అని పిలుచుకుంటారు’’ అంది రాధ. ఆనంద్‌కు కోపమొచ్చింది. ‘‘వాడా నా బావ? నా చేతికి బేడీలు వేస్తానన్నవాడు.. వాడు నా బావా? వాడొచ్చి నా కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగితే తప్ప దగ్గరకు రానివ్వను’’ అంటూ ఊగిపోయాడు. ఆనంద్‌ను చంపాలని తుపాకీతో వచ్చిన రాజు, రాధకు తన మీద ఉన్న గౌరవాన్ని చూసి ఆగిపోయాడు. రాజుకు తన మీద తనకే అసహ్యం కలిగింది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆనంద్‌కు రాజు మీద కోపం తగ్గట్లేదు. దౌర్భాగ్యుడు, మిత్రద్రోహి, నీచుడు అని నోటికి వచ్చినట్లు రాజును తిడుతున్నాడు. రాధ గట్టిగా అరిచింది – ‘‘ఆపండి! మా అన్నయ్యను మీరలా తిట్టడం నేను సహించలేను. ఎవరనుకుంటున్నారు మా అన్న? నాకు తల్లి, తండ్రి, గురువు, నా పాలిట దైవం.. అన్నీ ఆయనే!’’. ‘‘అయితే ఇంక నేనెందుకు నన్ను మర్చిపో రాధా!’’ అన్నాడు ఆనంద్. అతనింకా అదే కోపంలో ఉన్నాడు. ‘‘ఎంత తేలిగ్గా అనేశారు ఆ మాట! నన్నింకా హింస పెట్టకండి. మా అన్నయ్య మీద పగ సాధించడమే మన పెళ్లికి లక్ష్యమైతే నాకు ఈ పెళ్లి వద్దు, ఆ ప్రేమా వద్దు. సెలవు’’ అని చెప్పి గట్టిగా ఏడుస్తూ అక్కణ్నుంచి ఇంట్లోకి పరిగెత్తింది రాధ. ఆనంద్ బాధగా అక్కణ్నుంచి బయటికి కదిలాడు. చెల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయిన రాజు అదే తోటలో, ఒక చెట్టు పక్కన నిల్చొని ఏడుస్తున్నాడు. రాజు ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు. ఏం చేసైనా రాధకు తను ప్రేమించిన ఆనంద్‌నే ఇచ్చి పెళ్లి చేయాలని. ఆ తరువాతి రోజే వాళ్లిద్దరి పెళ్లి చేసేశాడు. రాజు, ఆనంద్ ఇప్పుడు స్నేహితులే కాదు, బంధువులు కూడా! ఆనంద్ తనను పెంచి పెద్ద చేసిన అత్తతో పాటు రాజు ఇంటికే తన నివాసాన్ని మార్చేసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. రాజు కూడా తను ప్రేమించిన అమ్మాయి మాలతిని పెళ్లి చేసుకున్నాడు. రాజు – మాలతి, ఆనంద్ – రాధ జంటలతో ఆ ఇల్లు కళకళలాడిపోతోంది. వీళ్లంతా సంతోషంగా ఉండటం ఆనంద్ అత్తకు మాత్రం నచ్చడం లేదు. ఆ పెద్ద ఇంటి పెత్తనమంతా తన చేతుల్లోకి తీసుకుందామని చూస్తోన్న ఆమెకు, వీళ్లంతా కలిసి ఉంటే చూడటం కష్టమైన పనే. ముందు మాలతికి, రాధకు గొడవలు తీసుకొచ్చి పెట్టింది. ఆ గొడవల్ని రాజు, ఆనంద్లకూ చేరేలా చేసింది. సంతోషంగా ఉన్న ఆ ఇల్లు మెల్లిగా ఒక రకమైన అశాంతికి, పూర్తి విచ్ఛిన్నానికి దారులు వెతుక్కుంది. కాలం పరుగుల్లో మాలతి జబ్బుతో చనిపోయింది. ఆనంద్, రాధ బాగుండాలని కోరుకున్న రాజు, ఆస్తినంతా వాళ్లకు రాసేసి ఊరు వదిలేసి వెళ్లిపోయాడు. చాలాకాలం లెక్కలేనన్ని ఊర్లు తిరిగాడు రాజు. అతనికెప్పుడూ చెల్లి గుర్తొస్తూనే ఉన్నా, ఇంటికైతే తిరిగి రావాలనుకోలేదు. తిరిగొచ్చిన తర్వాత మాత్రం రాజు ఎక్కువ రోజులు బతకలేదు. -
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'ఆగడు'
చెన్నై: ప్రిన్ మహేష్‌బాబు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. 'ఆగడు'తో ముందుకు వచ్చిన ఈ సూపర్ స్టార్ భారీ ఓపెనింగ్స్ రాబట్టాడు. ఆగడు సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.18.02 కోట్లు వసూలు చేసింది. మహేష్ కెరీర్ లోనే ఈ కలెక్షన్ భారీ ఓపెనింగ్స్ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో వసూళ్లపరంగా ఈ సినిమా కచ్చితంగా కొత్త రికార్డు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే 'ఆగడు'పై మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ మహేష్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు కలెక్షన్లు తగ్గాయి. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఒక మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సోనూ సూద్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు.