Actress Nikita Dutta Reveals Bike Thieves Snatched Her Phone In Mumbai - Sakshi
Sakshi News home page

కబీర్‌ సింగ్‌ నటికి చేదు అనుభవం..

Published Tue, Nov 30 2021 5:53 PM | Last Updated on Tue, Nov 30 2021 7:50 PM

Actress Nikita Dutta Reveals Bike Thieves Snatched Her Phone In Mumbai - Sakshi

Actress Nikita Dutta Phone Got Snatched in Mumbai: బాలీవుడ్‌ నటి నికితా దత్తాకు చేదు అనుభవం ఎదురయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మీద దాడి చేసి.. సెలఫోన్‌ లాక్కెళ్లారు. ఈ  ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. కాగా, గత ఆదివారం సాయంత్రం నికితా దత్తా తన స్నేహితులతో కలిసి ముంబైలోని బాంద్రాలోని రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్నట్లు తెలిపారు. కాగా, సాయంత్రం 7.30 ప్రాంతంలో..  తన ఎదురుగుండా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. తనపై దాడిచేశారని తెలిపారు.

ఆ తర్వాత.. తన చేతిలోని ఫోన్‌ను బలవంతంగా లాక్కొని.. అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ఆ సమయంలో తనకు.. ఏంజరుగుతుందో కూడా అర్థం కానీ పరిస్థితుల్లో ఉండిపోయానని తెలిపారు. కొంతమంది స్థానికులు ఆ బైక్‌దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు.. అక్కడి నుంచి తప్పించుకోని వెళ్లిపోయారని వాపోయారు. ఆ తర్వాత.. తేరుకుని బాంద్రాలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నికితా దత్తా తెలిపారు.

నికితా దత్తా.. డైబుక్‌, ఏక్‌డుజ్‌కే వాస్తే, దిబిగ్‌బుల్‌,కబీర్‌ సింగ్‌ వంటి పలు సినిమాల్లో నటించారు. నికితాదత్తా.. 2012 లో జరిగిన ఫెమినా మిస్‌ ఇండియా ఫైనల్‌లో వరకు చేరారు. ఆ తర్వాత.. ‘లేకర్ హమ్ దీవానా దిల్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆమె చివరగా ఇమ్రాన్ హష్మీ డైబ్బక్‌ సినిమాలో నటించారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన అభిషేక్‌ బచ్చన్‌.. జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్‌స్టాలో కామెంట్‌ చేశారు.

చదవండి: Kangana Ranaut: ట్విటర్‌ కొత్త సీఈఓ నియామకంపై కంగనా ఆసక్తికర కామెంట్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement