phone snatching
-
చోరీలకు చెక్.. మొబైల్ రికవరీలో తెలంగాణ పోలీసులు టాప్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ల దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దొంగలు రద్దీగా ఉన్న ప్రదేశాలను టార్గెట్ చేసుకుని మొబైల్ ఫోన్లను ఈజీగా కొట్టేస్తుంటారు. అయితే, దొంగతనం చేసిన ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు టాప్ ప్లేస్ నిలిచి రికార్డు క్రియేట్ చేశారు. 189 రోజుల్లో కోల్పోయిన 10,018 మొబైల్ ఫోన్లను సీఐడీ పోలీసులు రికవరీ చేశారు. వివరాల ప్రకారం.. పోగొట్టుకున్న ఫోన్లలో 39 శాతం రికవరీతో దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ సీఐడీ పోలీసులు టాప్ ప్లేస్‌లో నిలిచారు. టెలికాం డిపార్ట్ మెంట్ సీఈఐఆర్ అప్లికేషన్‌ను ఉపయోగించి 189 రోజుల్లో కోల్పోయిన 10,018 మొబైల్ ఫోన్స్ రికవరీ పోలీసులు రికవరీ చేశారు. ఈ ఫోన్లను యజమానులకు అధికారులు తిరిగి ఇచ్చారు. దీంతో, హిస్టరీ క్రియేట్ చేశారు తెలంగాణ పోలీసులు. అయితే, చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్) పోర్టల్ విధానం సత్ఫలితాలిస్తోంది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నూతన పోర్టల్ విధానాన్ని డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. 60 మంది ట్రైనర్లకు తొలుత ఈ పోర్టల్ వాడకంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏప్రిల్ 20 నుంచి ఈ సీఈఐఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ పోర్టల్ విధానంతో చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేస్తున్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 16,011 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ విధానంలో బ్లాక్ చేసినట్టు పోలీసులు చెప్పారు. రాష్ట్ర పౌరులెవరైనా తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే దగ్గరలోని మీసేవా లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీఈఐఆర్ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. ఇది కూడా చదవండి: పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్‌ఫోన్స్ ఆధారంగా.. -
ఐఫోన్ చోరీయత్నం.. కాపాడుకునే ప్రయత్నంలో గాయపడిన టీచర్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆటోలో వెళ్తున్న యువతి వద్ద నుంచి ఐఫోన్ చోరీ చేసేందుకు ఇద్దరు కేడీలు ప్రయత్నించారు. ఈ క్రమంలో తన ఫోన్‌ను కాపాడుకునే క్రమంలో ఆటోలో నుంచి కొందపడి ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన యోవికా చౌదరి తన ఐఫోన్ కోసం ప్రాణాలకు తెగించింది. దొంగలనుంచి ఫోన్‌ను రక్షించుకోవటానికి తీవ్ర యుద్దమే చేసింది. ఈ క్రమంలో గాయాలపాలైంది. అయితే, యోవికా చౌదరి ఢిల్లీలో సాకేత్ గ్యాన్ భారతీ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. గత శుక్రవారం ఆమె ఆటోలో స్కూలుకు వెళ్తోంది. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఆమె ఫోన్‌ను గట్టిగా పట్టుకోవటంతో.. ఆటోలోంచి కిందపడింది. ఇదే సమయంలో దొంగలు కూడా ఆ ఫోన్‌ను వదలక పోవటంతో ఫోన్‌తో సహా ఆమెను కూడా లాక్కెళ్లారు. దాదాపు కొన్ని మీటర్ల వరకు ఆమెను అలాగే రోడ్డుపై పడిపోయి దొర్లుకుంటూ వెళ్లింది. ఆమె చేయి జారవిడవడంతో ఫోన్‌ను ఆ దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలో యోవికా తీవ్రంగా గాయపడింది. దీంతో, స్థానికులు, ఇతర వాహనదారులు ఆమెను మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖానికి తీవ్రగాయమైనట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. A woman teacher was left with a fractured nose and injuries to other parts of her body after she fell from an auto-rickshaw while allegedly trying to save her mobile phone from motorcycle-borne snatchers in south Delhi’s Saket on Friday.#delhipolice #friday #delhicrime pic.twitter.com/NarXHUs4DP — NewsNowNation (@NewsNowNation) August 14, 2023 ఇది కూడా చదవండి: విలువైన ప్రాణాలకై.. 'ఈ ఒక్క క్షణం మీకోసం'.. -
33 రోజుల్లో.. 1000 మొబైల్ ఫోన్లు
సాక్షి, హైదరాబాద్ః చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్) పోర్టల్ విధానం సత్ఫలితాలిస్తోంది. గత నెల ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నూతన పోర్టల్ విధానాన్ని డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. 60 మంది ట్రైనర్లకు తొలుత ఈ పోర్టల్ వాడకంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏప్రిల్ 20 నుంచి ఈ సీఈఐఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ పోర్టల్ విధానంతో సోమవారం వరకు అంటే 33 రోజుల్లో వెయ్యి మొబైల్ ఫోన్ల జాడను గుర్తించడంతోపాటు వాటిని తిరిగి ఫోన్ల యజమానులకు అందించారు. వీటిలో అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో 149, వరంగల్ కమిషనరేట్ పరిధిలో 91, కామారెడ్డి జిల్లా పరిధిలో 79 మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టినట్టు సీఈఐఆర్ నోడల్ అధికారి, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 16,011 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ విధానంలో బ్లాక్ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర పౌరులెవరైనా తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే దగ్గరలోని మీసేవా లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీఈఐఆర్ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని మహేశ్ భగవత్ సూచించారు. ఇది కూడా చదవండి: GO 111: మాస్టర్‌ప్లాన్ ఇప్పట్లో లేనట్టే! -
నటిపై దాడి.. చేతిలోని ఫోన్‌ను బలవంతంగా..
Actress Nikita Dutta Phone Got Snatched in Mumbai: బాలీవుడ్ నటి నికితా దత్తాకు చేదు అనుభవం ఎదురయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మీద దాడి చేసి.. సెలఫోన్ లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా, గత ఆదివారం సాయంత్రం నికితా దత్తా తన స్నేహితులతో కలిసి ముంబైలోని బాంద్రాలోని రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్నట్లు తెలిపారు. కాగా, సాయంత్రం 7.30 ప్రాంతంలో.. తన ఎదురుగుండా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. తనపై దాడిచేశారని తెలిపారు. ఆ తర్వాత.. తన చేతిలోని ఫోన్‌ను బలవంతంగా లాక్కొని.. అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. ఆ సమయంలో తనకు.. ఏంజరుగుతుందో కూడా అర్థం కానీ పరిస్థితుల్లో ఉండిపోయానని తెలిపారు. కొంతమంది స్థానికులు ఆ బైక్‌దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే వారు.. అక్కడి నుంచి తప్పించుకోని వెళ్లిపోయారని వాపోయారు. ఆ తర్వాత.. తేరుకుని బాంద్రాలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నికితా దత్తా తెలిపారు. నికితా దత్తా.. డైబుక్, ఏక్‌డుజ్‌కే వాస్తే, దిబిగ్‌బుల్,కబీర్ సింగ్ వంటి పలు సినిమాల్లో నటించారు. నికితాదత్తా.. 2012 లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఫైనల్లో వరకు చేరారు. ఆ తర్వాత.. ‘లేకర్ హమ్ దీవానా దిల్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆమె చివరగా ఇమ్రాన్ హష్మీ డైబ్బక్ సినిమాలో నటించారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన అభిషేక్ బచ్చన్.. జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్‌స్టాలో కామెంట్ చేశారు. చదవండి: Kangana Ranaut: ట్విటర్ కొత్త సీఈఓ నియామకంపై కంగనా ఆసక్తికర కామెంట్.. View this post on Instagram A post shared by Nikita Dutta 🦄 (@nikifying) -
మైనర్ డ్రైవింగ్... మేజర్ స్నాచింగ్!
సాక్షి, సిటీబ్యూరో: మైనర్‌తో కలిసి ముఠా కట్టిన ఓ పాత నేరగాడు సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. బాలుడు వాహనాన్ని నడుపుతుండగా... మేజర్ ఈ నేరం చేశాడు. వీరిద్దరినీ శుక్రవారం పట్టుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారని డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బాలాజీనగర్‌కు చెందిన వేముల బాలరాజ్ తొమ్మిదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పి లేథ్ మిషన్ వర్కర్‌గా మారాడు. వ్యవసనాలకు బానిసకావడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించాడు. గత ఏడాది తన స్నేహితుడితో కలిసి ముఠా కట్టి కొన్ని నేరాలు చేశాడు. కుషాయిగూడ పోలీసులు ఈ ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన బాలరాజ్ తన ప్రాంతానికే చెందిన ఓ మైనర్‌తో కలిసి రంగంలోకి దిగాడు. సెల్‌ఫోన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్న ఇద్దరూ నాంపల్లి పరిధిలో ఓ నేరం చేశారు. మైనర్ వాహనం నడుపుతుండగా వెనుక కూర్చున్న బాలరాజ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి నుంచి సెల్‌ఫోన్ లాక్కుపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరి కదలికలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్ నేతృత్వంలో ఎస్ఐలు మహ్మద్ షానవాజ్ షఫీ, కె.శ్రీనివాసులు వలపన్ని శుక్రవారం పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఇద్దరినీ నాంపల్లి పోలీసులకు అప్పగించారు. -
చోరీ అక్కడ... విక్రయం ఇక్కడ!
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు నగరంలోని వివిధ రూట్లలో తిరిగే రద్దీ బస్సుల్లో సంచరిస్తూ సెల్ఫోన్లు తస్కరించి, ఫ్లాష్ చేయడం ద్వారా హైదరాబాద్ సహా అనేక నగరాల్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును అక్కడి కోడిగహెల్లీ పోలీసులు రట్టు చేశారు. గత వారం ఓ నిందితుడిని పట్టున్న అధికారులు పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. పోలీసులకు చిక్కిన నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా సోమవారం సిటీకి వచ్చిన ప్రత్యేక బృందం 50 సెల్ఫోన్లను రికవరీ చేసుకువెళ్ళింది. దాదాపు ఐదేళ్ళుగా వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్న ఈ ముఠా ఇప్పటి వరకు బెంగళూరులోని వివిధ ప్రాంతాల నుంచి వేయి సెల్ఫోన్లు తస్కరించినట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ తస్కరించిన ఫోన్లలో అత్యధికం హైదరాబాద్‌లోని సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోనే విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులోని కోడిగహెల్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని హెబ్బల ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని గత వారం అదుపులోకి తీసుకున్నారు. ఇతడి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో 45 సెల్ఫోన్లు కనిపించడంతో పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ వ్యక్తి బెంగళూరులోని ఆజాద్‌నగర్‌కు చెందిన ఇమ్రాన్ ఇలియాస్ ఖాన్‌గా గుర్తించారు. ఇతగాడు అక్కడి గుడ్డడహెల్లీ ప్రాంతానికి చెందిన నయాజ్‌తో కలిసి ముఠా కట్టాడని, కొన్నేళ్ళుగా బీఎంటీసీ బస్సుల్లో సంచరిస్తూ ప్రయాణికుల నుంచి సెల్ఫోన్ల తస్కరిస్తున్నారని తేలింది. ఈ గ్యాంగ్ చోరీ చేసిన ఫోన్లను తొలినాళ్ళల్లో బెంగళూరులోని సండే బజార్, బర్మా బజార్‌ల్లో విక్రయించేవాళ్ళు. అయితే అక్కడే నేరుగా అమ్మేస్తుండటంతో గతంలో పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. దీంతో తమ పంథా మార్చాలని నిర్ణయించుకున్న ఈ ద్వయం రాష్ట్రం బయటకు తరలించి విక్రయించడానికి ప్రయత్నాలు చేశారు. దీనికి ముందు తాము చోరీ చేసిన ఫోన్లను కొన్ని రకాలైన సాఫ్ట్వేర్స్ వినియోగించి ‘ఫ్లాష్’ చేసేవారు. ఇలా చేయడంతో పాటు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నెంబర్‌ను క్లోన్ అయ్యేది. ఆపై కొత్త ఐఎంఈఐ నెంబర్‌తో సిద్ధమైన ఫోన్‌కు తక్కువ ధరకు విక్రంయిచే వారు. వీటిలో హైఎండ్ ఫోన్లను హైదరాబాద్, ముంబై, చెన్నైల్లో ఉన్న వ్యాపారుల ద్వారా అమ్మించే వాళ్ళు. కొన్నాళ్ళుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ వ్యవహారంపై అక్కడి పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. అనుమానాస్పదంగా దొరికిన ఇలియాస్ ఖాన్ విచారణలో వెలుగులోకి రావడంతో నయాజ్ కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని బెంగళూరు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సాంకేతికంగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. సోమవారంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వెళ్ళింది. -
అక్కడ చోరీ ...ఇక్కడ విక్రయం!
స్నాచర్... రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న, ద్విచక్ర వాహనం డ్రైవ్ చేస్తున్న వారిలో సెల్‌ఫోన్ మాట్లాడే వారిని టార్గెట్ చేసి దాన్ని లాక్కెళతాడు. కలెక్టర్... ఓ ప్రాంతంలో నేరం చేసిన తర్వాత మరో చోటుకు వెళ్లేప్పుడు మధ్యలో పోలీసుల సోదాలు జరిగితే చిక్కకుండా చోరుడి నుంచి ఫోన్లు కలెక్ట్ చేసుకుంటాడు. కొరియర్... ఓ రోజు/ఓ దఫా చోరీ చేసిన ఫోన్లను తీసుకుని ఎవరి కంటా పడకుండా, తనిఖీల్లో చిక్కకుండా హైదరాబాద్‌కు తరలిస్తాడు. రిసీవర్... బెంగళూరు నుంచి వచ్చే ఈ ఫోన్లను తీసుకుని, ‘ఫ్లాష్’ చేయడం ద్వారా దాని ఐఎంఈఐ నంబర్ మార్చేసి మార్కెట్లో అమ్మేస్తుంటాడు. సాక్షి, హైదరాబాద్: ఈ పంథాలో వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ఘరానా అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ నెల మొదటి వారంలో బెంగళూరు సెంట్రల్ డివిజన్ పోలీసులు అరెస్టు చేసిన పది మందిలో హైదరాబాద్‌కు చెందిన సెకండ్ హ్యాండ్ ఫోన్ల వ్యాపారి అమీర్‌ఖాన్ సైతం ఉన్నాడు. బెంగళూరుతో పాటు నగరంలోనూ జరిగిన ఈ అరెస్టుల పర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడేళ్లుగా వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్న ఈ ముఠా ఇప్పటి వరకు బెంగళూరులోని వివిధ ప్రాంతాల నుంచి పది వేల సెల్ఫోన్లు తస్కరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ తస్కరించిన ఫోన్లలో అత్యధికం హైదరాబాద్‌లోని సెకండ్ హ్యాండ్ మార్కెట్లలోనే విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రికవరీ చేసిన వాటిలోనూ ఎక్కువ హైదరాబాద్‌లో స్వాధీనం చేసుకున్నవే కావడం గమనార్హం. తొలినాళ్లలో అక్కడే అమ్మినా... బెంగళూరులోని జేజే నగర్‌కు చెందిన జేడీ(ఎస్) నాయకుడు ఆరిఫ్ ఖాన్ ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతడి నేతృత్వంలో బెంగళూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఖిజర్ పాషా, అస్లం, ఆసిఫ్ ఖాన్, సయ్యద్ అక్బర్, నవాజ్ షరీఫ్, ఇతడి సోదరుడు అఫ్జల్ షరీఫ్, ఖలీమ్, సల్మాన్, జమీర్గా సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్యాంగ్ చోరీ చేసిన ఫోన్లను తొలినాళ్ళల్లో ఆరిఫ్ ఖాన్ బెంగళూరులోని సండే బజార్, బర్మా బజార్ ప్రాంతాల్లో విక్రయించేవాడు. దీనిని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీంతో తమ పంథా మార్చాలని నిర్ణయించుకున్న ఆరిఫ్ ఖాన్ రాష్ట్రం బయటకు తరలించి విక్రయించడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి అమీర్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. సుదీర్ఘ ఆపరేషన్..... విచారణలో నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు ఫోన్లను తరలించే బాధ్యతల్ని సూత్రధారి ఆరిఫ్ ఖాన్ పర్యవేక్షిస్తున్నాడు. దీంతో ఇతడిని పట్టుకున్న తర్వాత అమీర్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి కొన్ని సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంది. విచారణ నేపథ్యంలో మిగిలిన ఇద్దరి వ్యాపారుల పేర్లు చెప్పాడు. వారిని విచారిచగా సదరు హ్యాండ్సెట్లు చోరీకి సంబంధించినవి అనే విషయం వీరికి తెలియదని వెల్లడైంది. దీంతో వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న బృందం అమీర్‌ను బెంగళూరు తరలించింది. ఈ గ్యాంగ్‌కు చెందిన పది మంది నుంచి 12 యాపిల్, 81 శామ్సంగ్, 82 ఎంఐతో పాటు 563 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.3 కోట్ల విలువైన వీటిలో అత్యధికం హైఎండ్ ఫోన్లే కావడం గమనార్హం. ఈ అంతర్రాష్ట్ర ముఠా కొన్ని ఫోన్లను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోనూ విక్రయించినట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ‘ఫ్లాష్’ చేసి మార్కెట్లో విక్రయిస్తూ... నగరంలో సెకండ్ హ్యాండ్ ఫోన్ల వ్యాపారం చేస్తున్న అమీర్ ఖాన్ మరో ఇద్దరు వ్యాపారులకు హోల్‌సేల్‌గా సరఫరా చేస్తుండేవాడు. అయితే వారితో తాను వీటిని మార్కెట్ నుంచే ఖరీదు చేశానని చెప్పేవాడు. బెంగళూరు నుంచి కొరియర్ ద్వారా అందుకున్న వాటిని ముందు కొన్ని రకాలైన సాఫ్ట్వేర్స్ వినియోగించి ‘ఫ్లాష్’ చేసేవాడు. ఇలా చేయడంతో పాటు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నంబర్‌ను క్లోన్ చేసేవాడు. ఆపై కొత్త ఐఎంఈఐ నెంబర్‌తో సిద్ధమైన ఫోన్‌కు తక్కువ ధరకు విక్రయించేవాడు. కొన్ని హైఎండ్ ఫోన్లను మిగిలిన ఇద్దరు వ్యాపారులకు ఇచ్చి అమ్మించేవాడు. కొన్నాళ్ళుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని బెంగళూరు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సాంకేతికంగా దర్యాప్తు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలోనూ నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా రెండు నెలల క్రితం ఖిజర్ పాషా, అస్లం వారికి చిక్కారు. -
ఓలా డ్రైవర్‌ను పట్టించిన మహిళ ఫోన్
మంచి మాటలు చెబుతూ మహిళను కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారయత్నం చేసినందుకు ఓలా క్యాబ్ డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి లాక్కున్న ఫోనే అతడిని పోలీసులకు పట్టించింది. షాదాబ్ మహ్మద్ ఇబ్రహీం షేక్ అనే నిందితుడు ఘట్కోపర్ ప్రాంతానికి చెందినవాడు. బాధితురాలు గృహిణి. తన ఏడేళ్ల కొడుకును స్కూలు నుంచి తీసుకొచ్చేందుకు ఆమె వెళ్తుండగా.. షేక్ ఆమెను పిలిచి తన క్యాబ్ ఎక్కించుకున్నాడని పోలీసులు తెలిపారు. తాను బేబీ సిట్టర్ కోసం చూస్తున్నానని చెప్పడంతో ఆమె క్యాబ్ ఎక్కేందుకు అంగీకరించారన్నారు. ముందుసీట్లో ఆమె కూర్చోగానే కారు డోర్లన్నీ లాక్ చేయడంతో పాటు అద్దాలు కూడా పైకి ఎత్తేశాడు. తనతో స్నేహంగా ఉండాలని, మొబైల్ నెంబరు ఇవ్వాలని ఆమెను బలవంతపెట్టాడు. చివరకు ఆమె ఫోన్ కూడా లాగేసుకున్నాడు. అతడితో స్నేహం చేయడానికి ఆమె నిరాకరించడంతో అతడు కారు స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఆమె గట్టిగా అరిచినా, అద్దాలు వేసి ఉండటంతో ఎవరికీ వినిపించలేదు. కారు స్టీరింగ్ పట్టుకుని పక్కకు తిప్పేందుకు ఆమె ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎలాగోలా కారు తలుపును ఆమె తెరవగలిగారు. బయటకు దూకేందుకు ప్రయత్నించడంతో భయపడిన షేక్.. కారు ఆపాడు. వెంటనే ఆమె కిందకు దిగి, తన ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగారు. అతడు నిరాకరించగా.. అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫోనే క్యాబ్ డ్రైవర్‌ను పట్టించింది. షేక్ ఆ ఫోనును తన భార్యకు ఇవ్వగా.. కొడుకు వైద్య ఖర్చుల కోసం ఆమె ఆ ఫోనును రూ. 500కు అమ్మేసింది. కొన్న వ్యక్తి ఆ ఫోన్ స్విచాన్ చేయగానే పోలీసులు దాన్ని ట్రాక్ చేసి.. అక్కడకు వెళ్లారు. ఫోను కొన్న వ్యక్తి షేక్ ఇల్లు చూపించడంతో పోలీసుల పని సులభమైంది. ఓలా క్యాబ్ డ్రైవర్ షేక్‌పై పోలీసులు ఐపీసీ 354, 365, 392, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.