ఐఫోన్‌ చోరీయత్నం.. కాపాడుకునే ప్రయత్నంలో గాయపడిన టీచర్‌ | Delhi Teacher Falls Out Of Auto For IPhone Snatching Bid | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ చోరీయత్నం.. కాపాడుకునే ప్రయత్నంలో గాయపడిన టీచర్‌

Published Mon, Aug 14 2023 12:20 PM | Last Updated on Mon, Aug 14 2023 12:20 PM

Delhi Teacher Falls Out Of Auto For IPhone Snatching Bid - Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆటోలో వెళ్తున్న యువతి వద్ద నుంచి ఐఫోన్‌ చోరీ చేసేందుకు ఇద్దరు కేడీలు ప్రయత్నించారు. ఈ క్రమంలో తన ఫోన్‌ను కాపాడుకునే క్రమంలో ఆటోలో నుంచి కొందపడి ఆమె తీవ్రంగా గాయపడింది. 

వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన యోవికా చౌదరి తన ఐఫోన్‌ కోసం ప్రాణాలకు తెగించింది. దొంగలనుంచి ఫోన్‌ను రక్షించుకోవటానికి తీవ్ర యుద్దమే చేసింది. ఈ క్రమంలో గాయాలపాలైంది. అయితే, యోవికా చౌదరి ఢిల్లీలో సాకేత్‌ గ్యాన్‌ భారతీ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. గత శుక్రవారం ఆమె ఆటోలో స్కూలుకు వెళ్తోంది. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఆమె ఫోన్‌ను గట్టిగా పట్టుకోవటంతో.. ఆటోలోంచి కిందపడింది. 

ఇదే సమయంలో దొంగలు కూడా ఆ ఫోన్‌ను వదలక పోవటంతో ఫోన్‌తో సహా ఆమెను కూడా లాక్కెళ్లారు. దాదాపు కొన్ని మీటర్ల వరకు ఆమెను అలాగే రోడ్డుపై పడిపోయి దొర్లుకుంటూ వెళ్లింది. ఆమె చేయి జారవిడవడంతో ఫోన్‌ను ఆ దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలో యోవికా తీవ్రంగా గాయపడింది. దీంతో, స్థానికులు, ఇతర వాహనదారులు ఆమెను మ్యాక్స్‌ సాకేత్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖానికి తీవ్రగాయమైనట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: విలువైన ప్రాణాలకై.. 'ఈ ఒక్క క్షణం మీకోసం'..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement