ఆటో బోల్తా–13 మందికి గాయాలు
Published Tue, Dec 6 2016 2:26 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
ఏలూరు అర్బ¯ŒS : వంట పనికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా, జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గుడివాడ మండలం నూదెళ్ల, తిమిరిస పల్లెకు చెందిన కొందరు వంట చేసే మహిళా కూలీలు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పెదవేగి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నసమారాధన వంటకాలు చేసేందుకు ఆదివారం రాత్రి వచ్చారు. వంటల తయారీ అనంతరం సోమవారం కృష్ణాజిల్లా బొమ్ములూరుకు చెందిన ఇరువ తిరుమలరావు ఆటోలో గుడివాడ బయలుదేరారు. పెదవేగి మండలం దుగ్గిరాల వద్ద జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వస్తున్న ఆటో తిరగబడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 13 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. వీరిలో బి.బేబి, షేక్ మస్తా¯ŒSబీ, ఎం. శిరీష తీవ్రంగా గాయపడ్డారు. దాసరి సులోచన, దోనె మరియమ్మ, చేబ్రోలు రాణి, దోనె బేబి, కనకరత్నం, నక్కా మరియమ్మ, ఆంథోనమ్మ, ఎ¯ŒS సరోజిని, కనకరత్నంతోపాటు ఆటో డ్రైవర్ తిరుమలరావు స్పల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది క్షతగాత్రులను ఏలూరు తరలించారు. వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షి సరిగే రంగారావు చెప్పాడు. దీనికితోడు ఆటో కిక్కిరిసి ఉండడంతో ఎక్కువ మందికి గాయాలయ్యాయని పేర్కొన్నాడు.
మరో నలుగురికి..
ఏలూరు అర్బ¯ŒS : ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు బైక్‌లు ఢీకొని దంపతులు గాయపడ్డారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. చొదిమళ్ళకు చెందిన లారీ డ్రైవర్ బోట్ల నాగమోహనరావు భార్య సత్యవాణి, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై సోమవారం ద్వారకాతిరుమల వెళ్లారు. అనంతరం అదే బైక్‌పై తిరుగు పయనమయ్యారు. పెదవేగి మండలం వేగివాడ వద్దకు రాగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ వారిని ఢీకొంది. దీంతో రోడ్డుపై పడిపోయిన నాగమోహనరావుకు తలకు గాయాలు కాగా.. భార్యాపిల్లలు స్పల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Advertisement