over turn
-
కారు బోల్తా: ఒకరు మృతి
మహబూబ్‌నగర్: భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మహ్మద్ లతీఫ్, అతని కుటుంబీకులు, బంధువులతో కలిసి కారులో వెళ్తుండగా జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మహ్మద్ లతీఫ్ అక్కడికక్కడే మృతిచెందారు. అతని భార్య, ఇద్దరు కుమారులతోపాటూ మరో ముగ్గురు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు కేరళ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆటో బోల్తా–13 మందికి గాయాలు
ఏలూరు అర్బ¯ŒS : వంట పనికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా, జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గుడివాడ మండలం నూదెళ్ల, తిమిరిస పల్లెకు చెందిన కొందరు వంట చేసే మహిళా కూలీలు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పెదవేగి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నసమారాధన వంటకాలు చేసేందుకు ఆదివారం రాత్రి వచ్చారు. వంటల తయారీ అనంతరం సోమవారం కృష్ణాజిల్లా బొమ్ములూరుకు చెందిన ఇరువ తిరుమలరావు ఆటోలో గుడివాడ బయలుదేరారు. పెదవేగి మండలం దుగ్గిరాల వద్ద జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వస్తున్న ఆటో తిరగబడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 13 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. వీరిలో బి.బేబి, షేక్ మస్తా¯ŒSబీ, ఎం. శిరీష తీవ్రంగా గాయపడ్డారు. దాసరి సులోచన, దోనె మరియమ్మ, చేబ్రోలు రాణి, దోనె బేబి, కనకరత్నం, నక్కా మరియమ్మ, ఆంథోనమ్మ, ఎ¯ŒS సరోజిని, కనకరత్నంతోపాటు ఆటో డ్రైవర్ తిరుమలరావు స్పల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది క్షతగాత్రులను ఏలూరు తరలించారు. వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షి సరిగే రంగారావు చెప్పాడు. దీనికితోడు ఆటో కిక్కిరిసి ఉండడంతో ఎక్కువ మందికి గాయాలయ్యాయని పేర్కొన్నాడు. మరో నలుగురికి.. ఏలూరు అర్బ¯ŒS : ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు బైక్‌లు ఢీకొని దంపతులు గాయపడ్డారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. చొదిమళ్ళకు చెందిన లారీ డ్రైవర్ బోట్ల నాగమోహనరావు భార్య సత్యవాణి, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై సోమవారం ద్వారకాతిరుమల వెళ్లారు. అనంతరం అదే బైక్‌పై తిరుగు పయనమయ్యారు. పెదవేగి మండలం వేగివాడ వద్దకు రాగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ వారిని ఢీకొంది. దీంతో రోడ్డుపై పడిపోయిన నాగమోహనరావుకు తలకు గాయాలు కాగా.. భార్యాపిల్లలు స్పల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
దెందులూరు: ఆటో బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. దెందులూరు గ్రామానికి చెందిన సేనాపతి నాగరాజు (32) ప్యాసింజర్ ఆటోలో బుధవారం ఏలూరు నుంచి దెందులూరు వస్తుండగా రైల్వే స్టేçÙన్ సమీపంలో రోడ్డుపై ఆటో బోల్తా పడింది. దీంతో నాగరాజు ఛాతీ నొక్కుకుపోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన నాగరాజును దెందులూరులో అతని నివాసానికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కారు బోల్తా : 15 మందికి గాయాలు
వరంగల్ (ఏటూరు నాగారం) : రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం వరంగల్ జిల్లా మంగపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కమాలాపురం వద్ద బాధితులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. దీంతో 15 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు పర్వతిగిరి, రాయపర్తి మండలాలకు చెందిన వారిగా సమాచారం. బాధితులు ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గోవులతో వెళ్తున్న టాటా ఏస్ బోల్తా
హైదరాబాద్ : గోవులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం సోమవారం సాయంత్రం బోల్తా కొట్టింది. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 13 గోవులకు తీవ్రగాయాలయ్యాయి. గోవులను వెటర్నరీ ఆసుపత్రికి, డ్రైవర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మోతాదుకు మించి గోవులను ఎక్కించుకోవడం వల్ల మూగజీవాలకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
తిర్యాణి : ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పందిరిమాగడ ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. శనివారం సాయంత్రం ట్రాక్టర్ పందిరిగూడ నుంచి రాఘవాపూర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా ఇంజిన్ పైకి లేచి బోల్తా పడటంతో డ్రైవర్ భీమ్రావు దాని కింద చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. మృతుడు సాలెగూడ గ్రామవాసి. -
ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి
గుంటూరు : ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి నుజ్జునుజ్జయింది. దీంతో క్యాబిన్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఈపూర్ మండలం కొండ్రముట్ల గ్రామ సమీపంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా ఈపూర్ నుంచి ప్రకాశం జిల్లా వాదంపల్లి గ్రామానికి ఎరువుల లోడుతో వెళ్తున్న లారీ.. వినుకొండ నుంచి వడ్డెంగుంట వైపు వెళ్తున్న బైక్‌ను తప్పించబోయి కొండ్రముట్ల మలుపు వద్దరోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. దీంతో లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. క్యాబిన్లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలొదలగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మువ్వా మంగమ్మ(47) కూడా తీవ్రంగా గాయపడింది. ఆమెను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వినుకొండ, గుంటూరు ఆస్పత్రులకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా: ఇద్దరి మృతి
అనంతపురం : అతి వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గుంతకల్ నుంచి గుత్తి వెళ్తున్న ప్రయాణికుల ఆటో రజాపురం వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో అనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ ఆంజనేయులు (20) తో పాటు మరో మహిళ (56) అక్కడికక్కడే మృతిచెందగా, ఆటోలో ఉన్న మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
విశాఖపట్నం (మాడుగుల) : విశాఖ జిల్లా దేవరపల్లి మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ పక్కనే ఉన్న కాలువలో పడటంతో డ్రైవర్ కురందాసు తాతాలు(36) అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
వ్యాన్ బోల్తా పడి పదిమందికి గాయాలు
మారేడుమిల్లి (తూర్పుగోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న వ్యాన్ బోల్తా పడి పదిమంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి మండలం భీమవరం గ్రామం సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీ కంటెయినర్ బోల్తా : ఇద్దరు మృతి
భీమడోలు (పశ్చిమగోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న భారీ కంటెయినర్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం జాతీయరహదారిపై పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండల కేంద్రంలోని రైల్వేగేట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో.. లారీ దూసుకెళ్లి రోడ్డుపై ఉన్న వికలాంగుడిని ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ రోడ్డుపై ఉన్న చిన్న దేవాలయాన్ని ఢీకొట్టి సమీపాన ఉన్న బస్టాండ్ షెల్టర్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో లారీలో ఇద్దరు వ్యక్తులు ఉండగా, ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి లారీలో చిక్కుకొని ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
స్కూల్ ఆటో బోల్తా : విద్యార్థి మృతి
కర్నూలు (కోడుమూరు) : విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోడుమూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆటోలో ఇంటికి తిరిగి వెళుతుండగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిని విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
స్కూల్ బస్సు బోల్తా : ఐదుగురికి గాయాలు
వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం జయరామ్ గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. వేములవాడలోని హంసిని పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను వారిళ్ల వద్ద దింపి తిరిగి వెళుతుండగా జయరామ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఐదుగురికి గాయాలయ్యాయి. విద్యార్థులు లేకపోవడంతో డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకున్నట్టు తెలుస్తోంది. -
ఆటో బోల్తా : ఒకరి మృతి
వీణవంక : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం మూలమలుపు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కొండపాక గ్రామ వాసి రాజయ్య(65) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో జమ్మికుంట నుంచి కొండపాకకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్‌కు గాయాలు
వైఎస్సార్‌జిల్లా : ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన వైఎస్సార్‌జిల్లా చిన్నమండెం మండలంలోని మందిపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఇసుక లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి
ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం పోతురాజుగడ్డలో సోమవారం ప్రమాదవశాత్తూ ఇసుక లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్లీనర్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా : ఐదుగురికి గాయాలు
నిజామాబాద్ (ఎడపల్లి) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బషీర్‌ఫాం వద్ద శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ ఓ ఆటో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా బోధన్ మండలం రాకాసిపేటకు చెందినవారు. -
ఆటో బోల్తా : వృద్ధుడు మృతి
కనేకల్ (అనంతపురం) : రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బ్రహ్మసముద్రం గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న ఆటో మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వండ్రప్ప(65) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
నార్మెట్ (వరంగల్ జిల్లా) : ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నార్మెట్ మండలం యల్దండ గ్రామం వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. యల్దండకు చెందిన రావుల రాజు(21) అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. దీనిపై నార్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మట్టి ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి
బెల్లంకొండ : గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం సమీపంలో మట్టి ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో గంగిరెడ్డిపాలేనికి చెందిన మోహన్(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బోలెరో బోల్తా: ఆరుగురికి గాయాలు
విశాఖపట్నం : శుక్రవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి శిలానగర్ వైపు వెళ్తున్న బోలెరో వాహనం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. టైరు పంక్చర్ కావడమే వాహనం బోల్తా పడటానికి కారణమని తెలుస్తోంది. బోలెరోలో వరుణ్ జేసీబీ కంపెనీకి చెందిన ఐదుగురు మహిళలు, మరో వ్యక్తి ఉన్నారు. ఈ ప్రమాదంలో వీరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. -
ఆటో బోల్తా : పది మందికి గాయాలు
నిజామాబాద్ : వేగంగా ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మెదక్ జిల్లా గరేడ్‌గాం నుంచి 14 మంది ప్రయాణికులతో పిట్లం వస్తున్న ఆటో.. తిమ్మానగర్ వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ అతివేగంతో నడపడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. -
ఆటో బోల్తా; ఏడుగురికి గాయాలు
విజయనగరం : విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండంలోని గుత్తివలస గ్రామ సమీపంలో సోమవారం ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొల్లా త్రినాథ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా గాయపడిన వారంతా శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కోదుల గుమ్మడ గ్రామస్తులే. ఉద్ధవోలు గ్రామానికి చెందిన వీరి బంధువు చనిపోయారని తెలిసి వారింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.