కర్నూలు (కోడుమూరు) : విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోడుమూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆటోలో ఇంటికి తిరిగి వెళుతుండగా అదుపు తప్పి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిని విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్కూల్ ఆటో బోల్తా : విద్యార్థి మృతి
Published Mon, Jun 29 2015 5:41 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement