అతి వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది.
అనంతపురం : అతి వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గుంతకల్ నుంచి గుత్తి వెళ్తున్న ప్రయాణికుల ఆటో రజాపురం వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది.
దీంతో అనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ ఆంజనేయులు (20) తో పాటు మరో మహిళ (56) అక్కడికక్కడే మృతిచెందగా, ఆటోలో ఉన్న మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.